

శ్రీః
శ్రీమతే రామనుజాయనమః
తనియన్లు
(తిరుకోట్టియూర్ నమ్బి ప్రసాదించినది)
కలయామి కలిధ్వంశం కవిం లోక దివాకరం
యస్య గోభిఃప్రకాశాభిః అవిద్యం నిహితం తమః
యస్య=ఏ ఆళ్వార్ యొక్క;ప్రకాశాభిః=ప్రకాశించు;గోభిః=కిరణములతో (శ్రీ సూక్తులతో); అవిద్యం= అఙ్ఞానమనెడి; తమః= అంధకారము; నిహితం= నిర్మూలమగుచున్నదో; (అట్టి) కలిధ్వంశం= కలిదోషములను నశింప జేయువారును;లోక దివాకరం=లోకమంతటికిని సూర్యునివంటివారైన ; కవిం= శ్రీ పరకాలకవిని; కలయామి=ధ్యానించుచున్నాను
కలికన్ఱి యను ప్రసిద్ధమైన నామధేయముతో విలసిల్లువారును,కవిశ్రేష్టులును; లోకమందుండెడి చీకటిని (బాహ్యాంధకారమును) తొలిగించు సూర్యునివలె అంతఃకరణమందలి అఙ్ఞానాంధకారము నిర్మూలింపజేసెడి శ్రీ సూక్తులను ప్రసాదించినవారును,అయిన తిరుమంగై ఆళ్వార్ ను ధ్యానించుచున్నాను.
(ఎమ్బెరుమానార్ ప్రసాదించినది)
వాழி పరకాలన్ వాழி కలికన్ఱి
వాழி కుఱైయలూర్ వాழ் వేన్దన్ వాழிయరో
మాయోనై వాళ్ వలియాల్ మన్దిరఙ్గొళ్ మఙ్గైయర్కోన్
తూయోన్ శుడర్ మానవేల్
పరకాలన్ = పర మతస్థులకు యమునివంటివారైన తిరుమంగై ఆళ్వార్; వాழி =వర్ధిల్లుగాక !;కలికన్ఱి= కలిదోషములను నశింపజేయువారైన తిరుమంగై ఆళ్వార్;వాழி =వర్ధిల్లుగాక !; కుఱైయలూర్ వాழ் = తిరుకుఱైయలూర్ లో నిత్యవాసము చేయుచున్న;వేన్దన్ = ప్రభువైన తిరుమంగై ఆళ్వార్; వాழி = వర్ధిల్లుగాక !; మాయోనై = ఆశ్చర్యకరమైన గుణచేష్ఠితములుగల సర్వేశ్వరునినుండి; వాళ్ వలియాల్ = తనయొక్క కత్తి బలమునుచూపి; మన్దిరమ్ కొళ్ = తిరుమంత్రమును ఉపదేశమును పొందిన;మంగైయర్ కోన్ = తిరుమంగైదేశవాసులకు నాయకులును; తూయోన్ = పరిశుద్ధాత్ములైన తిరుమంగై ఆళ్వార్ యొక్క; శుడర్ = ప్రకాశించు; మానవేల్ = గొప్పతనముకలిగిన శూలము; వాழி = వర్ధిల్లుగాక!
పర మతస్థులకు యమునివంటివారును, కలిదోషములను నశింపజేయువారును, తిరుకుఱైయలూర్ లో నిత్యవాసము చేయుచున్న ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ చిరకాలము వర్ధిల్లుగాక!. కత్తి బలమునుచూపి ఆశ్చర్యకరమైన గుణచేష్ఠితములుగల సర్వేశ్వరునినుండి , తిరుమంత్రము ఉపదేశము పొందిన తిరుమంగైదేశవాసులకు నాయకులును, పరిశుద్ధ స్వభావముతో అలరారు తిరుమంగై ఆళ్వార్ యొక్క గొప్పతనముతో ఒప్పు శూలాయుధము వర్ధిల్లుగాక! .
( శ్రీ కూరత్తాళ్వాన్ ప్రసాదించినది)
నెఞ్జుక్కు ఇరుళ్ కడి దీపమ్, అడఙ్గా నెడు పిఱవి
నఞ్జుక్కు నల్లవముదమ్ , తమిழ నన్నూల్ తుఱైగళ్
అఞ్జుక్కు ఇలక్కియమారణశసారమ్ పరశమయ
పఞ్జుక్కు అనలిన్ పొఱి , పరకాలన్ పనువల్ గళే ll
పరకాలన్ పనువల్ గళ్ = తిరుమంగై ఆళ్వార్ యొక్క శ్రీ సూక్తులు (ఎటువంటివి యనినచో); నెఞ్జుక్కు = హృదయమందలి ఆవరించియున్న, ఇరుళ్ కడి = అఙ్ఞానాంధకారము తొలగింపగల; దీపమ్ = దీపమువంటివియును; అడఙ్గా = దేనిచేతను లొంగని; నెడు పిఱవి = చిరకాలమునుండి కలిగెడి అనంతమైన జననములను; నఞ్జుక్కు = విషమునకు;నల్ల అముదమ్ = మంచి అమృతమువలె నుండునవియును; తమిழ నల్ నూల్ తుఱైగళ్ = ద్రావిడభాషలో గల శ్లాఘ్యమైన శాస్త్రరచనలకు నుండవలసిన;అఞ్జుక్క=ఐదు రకములైన లక్షణములకు; ఇలక్కియమ్=లక్ష్యముగనుండునవియు; ఆరణమ్ సారమ్ = వేదములయొక్క సారమును; పరశమయమ్ = ఇతర మతముల బోధనలనెడి, పఞ్జుక్కు = దూదికి;అనలన్ పొఱి = అగ్ని కణములవలె నుండును.
తిరుమంగై ఆళ్వార్ యొక్క శ్రీ సూక్తులను అనుసంధించువారి హృదయమందలి అఙ్ఞానాంధకారము తొలగుటయేగాక చిరకాలమునుండి అధీనములోలేని జననమరణములనుండి విముక్తియు పరమపదప్రాప్తియు కలుగజేయును. ఈ సూక్తులు ద్రావిడభాషలో గల శ్లాఘ్యమైన శాస్త్రరచనలకు నుండవలసిన ఐదు రకములైన లక్షణములకు (అక్షరములు,పదములు,అర్ధములు, పద్యములు, అలంకారములు) లక్ష్యముగ నుండును. వేదసారమైన తిరుమంగైఆళ్వార్ యొక్క సూక్తులు ఇతర మతముల బోధనలనెడి దూదికి అగ్ని కణములవలెనుండును.
(ఎమ్బార్ ప్రసాదించినది)
ఎఙ్గళ్ కదియే యిరామానుజ మునియే
శఙ్గై కెడుత్తాణ్డ తవరాశా పొఙ్గుపుగழ்
మఙ్గైయర్కోన్ ఈన్ద మఱైయాయిర మనైత్తుమ్
తఙ్గు మనమ్ నీ ఎనక్కు త్తా ll
ఎఙ్గళ్ కదియే = మాకు గతియైనవాడా!; యిరామానుజ మునియే = శ్రీ రామానుజ మునీశ్వరా!; శఙ్గై = శంశయములంతయును; కెడుత్తు ఆణ్డ = పోగొట్టి రక్షించిన; తవరాశా = యోగీశ్వరా!; పొఙ్గుపుగழ் = గొప్ప కీర్తిగల; మంగైయర్ కోన్ = తిరుమంగై దేశవాసులకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్; ఈన్ద = కృపతో అనుగ్రహించిన; మఱై ఆయిరమ్ = వేద రూపమైన వేయి పాశురములు కలిగిన పెరియతిరుమొழி అనుప్రబంధమును; అనైత్తుమ్ = తక్కిన ప్రబంధములును; తఙ్గుమ్ = అనుభవింపగల; మనమ్ = మనస్సును; నీ = మీరు; ఎనక్కు = దాసుడైన నాకు; తా = కృపతో ఒసగవలెను.
మాకందరికి గతియైనవాడా! శ్రీ రామానుజ మునీశ్వరా!; అనేక శంశయములను పోగొట్టి మమ్ము రక్షించినవాడా ! యోగీశ్వరా! జగత్తుయందుగొప్ప కీర్తిగల తిరుమంగై ఆళ్వార్ కృపతో అనుగ్రహించిన వేద రూపమైన వేయి పాశురములు కలిగిన పెరియతిరుమొழி అను ప్రబంధమును,తక్కిన ప్రబంధములును అనుభవింపగల మనస్సును తమరు దాసుడైన నాకు కృపతో ఒసగవలెను.
( కొన్ని దివ్య క్షేత్రములందు అనుసంధింపబడు తనియన్ )
మాలై త్తనియే వழிపఱిక్క వేణుమెన్ఱు
కోలి ప్పతివిరున్ద కొర్ట్రవనే! వేలై
అణైత్తరుళుమ్ కైయాల్ అడియేన్ వినైయై
త్తుణిత్తరుళ వేణుమ్ తుణిన్దు ll
మాలై = సర్వేశ్వరుని; తని వழிయే = ప్రత్యేకమైన ఒక మార్గమందు; పఱిక్క వేణుమ్ ఎన్ఱు=అతని సంపదలను దోచుకొనవలెనని;కోలి=ప్రయత్నముతో; ( ఒక దివ్యమైన మఱ్ఱిచెట్టు క్రింద ) పదివు ఇరున్ద = దాగియున్న; కొర్ట్రవనే = ఓ తిరుమంగై దేశమునకు ప్రభువా!;వేలై=శూలమును; అణైత్తు అరుళుమ్ = కలిగియుండి కరుణించు;కైయాల్ = దివ్య హస్తముతో; అడియేన్ = ఈ దాసునియొక్క; వినైయై = పాపములను; తుణిన్దు = ధైర్యముతో; తుణిత్తు అరుళ వేణుమ్ = దయతో నరికి కృపజేయవలెను.
సర్వేశ్వరుని సంపదలను దోచుకొనవలెనని ఒక ప్రత్యేకమైన మార్గమందు మఱ్ఱిచెట్టు క్రింద దాగియున్న ఓ ! తిరుమంగై దేశమునకు ప్రభువా! శూలాయుధము ధరించియున్న మీ దివ్య హస్తముతో ఈ దాసునియొక్క పాపములను దయతో నరికి కృపజేయవలెను.
వాழி తిరునామమమ్
కలన్ద తిరుక్కార్ త్తిగైయిల్ కార్ త్తిగై వన్దోన్ వాழிయే
కాశినియిల్ కుఱైయలూర్ క్కావలోన్ వాழிయే
నలన్దగழ் ఆయిరత్తెణ్బత్తు నాలురైత్తాన్ వాழிయే
నాలైన్దు మాఱైన్దుమ్ నమక్కురైత్తాన్ వాழிయే
ఇలఙ్గెழுకూర్ట్రిరుక్కై ఇరుమడలీన్దాన్ వాழிయే
ఇమ్మూన్ఱిల్ ఇరునూర్ట్రు ఇరుపత్తేழீన్దాన్ వాழிయే
వలన్దిగழுమ్ కుముదవల్లి మణవాళన్ వాழிయే
వాట్కలియన్ పరకాలన్ మఙ్గయర్కోన్ వాழிయే II
కార్తీకమాసముతో కలసి వచ్చిన కార్తీక నక్షత్రమున ఈ భువియందు అవతరించిన తిరుమంగై ఆళ్వార్ చిరకాలము వర్ధిల్లుగాక! ఈ భూలోకమున ప్రసిద్ధికెక్కిన “ తిరు కుఱైయలూరు “ నగరమునకు రక్షకులైన తిరుమంగై ఆళ్వార్ చిరకాలము వర్ధిల్లుగాక! సద్గుణములు ప్రకాశించుచున్న 1084 పాశురములు గల పెరియ తిరుమొழி ప్రబంధమును అనుగ్రహించిన తిరుమంగై ఆళ్వార్ చిరకాలము వర్ధిల్లుగాక! ఇరువది పాశురములు గల ” తిరుకుఱున్దాడకము”, ముప్పది పాశురములు గల “తిరునెడున్దాడకము” అను శ్లాఘ్యమైన రెండు ప్రబంధములను మనకు అనుగ్రహించిన తిరుమంగై ఆళ్వార్ చిరకాలము వర్ధిల్లుగాక! ప్రకాశవంతమైన “తిరువెழுకూర్ట్రిక్కై”, “శిఱియతిరుమడల్” , మరియు ”పెరియతిరుమడల్” అను మూడు ప్రబంధములను మనకు అనుగ్రహించిన తిరుమంగై ఆళ్వార్ చిరకాలము వర్ధిల్లుగాక! ఈ మూడు ప్రబంధములలో మనకు 227 పాశురములను అనుగ్రహించిన తిరుమంగై ఆళ్వార్ చిరకాలము వర్ధిల్లుగాక! కుడిప్రక్కన కుముదవల్లి తాయరు ప్రకాశించుచుండు ఆమె నాథుడు తిరుమంగై ఆళ్వార్ చిరకాలము వర్ధిల్లుగాక! శూలాయుధము ధరించినవారును, శత్రువులకు యముడు వంటివారును, తిరుమంగై దేశవాసులకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ చిరకాలము వర్ధిల్లుగాక!
తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం
***************************