శ్రీః
8 . కొఙ్గలర్ న్ద
నిత్యశూరులు,సకలదేవతలు,భూలోక వాసులు మొదలగు వారందరిచే అతి సులభముగ సేవించి తరించుటకై సర్వేశ్వరుడు శ్రీనివాసుడు కృపతో వేంచేసియున్న తిరు వేంకటాచలమను దివ్యదేశమును తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు.
** కొఙ్గు అలర్ న్ద మలర్ కురున్దమ్ ఒశిత్త, కోవలన్ ఎమ్బిరాన్ ,
శఙ్గు తఙ్గు తడఙ్డడల్, తుయిల్ కొణ్డ తామరైకణ్ణినన్ ,
పొఙ్గు పుళ్ళినై వాయ్ పిళిన్ద, పురాణర్ తమ్ ఇడమ్, పొఙ్గు నీర్
శెఙ్గయల్ తిళైక్కుమ్ శునై, తిరువేఙ్గడమ్ అడై నెఞ్జమే ll 1018
కొఙ్గు అలర్ న్ద మలర్ కురున్దమ్ ఒశిత్త = పరిమళము వెదజల్లు పుష్పములచే నిండిన (కంసునిచే ప్రేరేరింపబడి అసురుడు ప్రేవేశించిన) అడవి నారింజ చెట్టును (కురున్దమ్ చెట్టును) విరిచి ఆ అసురుని తుదముట్టించిన; కోవలన్ = శ్రీ గోపాలకృష్ణుడును; ఎమ్బిరాన్ =నాయొక్క స్వామియును; శఙ్గు తఙ్గు తడమ్ కడల్ = శంఖములు చేరియుండెడి పెద్ద పాలసముద్రమందు; తుయిల్ కొణ్డ = యోగనిద్రలో పవళించియున్న; తామరైకణ్ణినన్=పుండరీకాక్షుడును; పొఙ్గు పుళ్ళినై వాయ్ పిళిన్ద=మిక్కిలి బలముగల బకాసురునియొక్క నోటిని చీల్చి వధించినవాడును; పురాణర్ తమ్ ఇడమ్ = పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడు కృపతో వేంచేసిన దివ్యదేశమును; పొఙ్గు నీర్ = జలసమృద్దికలిగి;శెమ్ కయల్ తిళైక్కుమ్ శునై=ఎర్రని మీనములు సంతోషముతో నుండెడి వాగులతో ఒప్పుచుండెడి; తిరువేఙ్గడమ్ = దివ్యమైన వేంకటాచలమును; నెఞ్జమే = ఓ! నామనసా!;అడై = నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా!
పరిమళము వెదజల్లు పుష్పములచే నిండిన (కంసునిచే ప్రేరేరింపబడి అసురుడు ప్రేవేశించిన) అడవి నారింజ చెట్టును(కురున్దమ్ చెట్టును) విరిచి ఆ అసురుని తుదముట్టించిన శ్రీ గోపాలకృష్ణుడును, నాయొక్క ఉపకారకుడును, శంఖములు చేరియుండెడి పెద్ద పాలసముద్రమందు, యోగనిద్రలో పవళించియున్న పుండరీకాక్షుడును, పురాణపురుషుడైన శ్రీమన్నారాయణుడు కృపతో వేంచేసిన దివ్యదేశమును,జలసమృద్దికలిగి ఎర్రని మీనములు సంతోషముతో నుండెడి వాగులతో ఒప్పుచుండెడి దివ్యమైన వేంకటాచలమును ఓ! నామనసా! నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా!
** పళ్ళియావదు పార్కడల్ అరఙ్గమ్, ఇరఙ్గ వన్ పేయ్ ములై ,
పిళ్ళైయాయ్ ఉయిరుణ్డ ఎందై, పిరానవన్ పెరుగుమిడమ్ ,
వెళ్ళియాన్ కరియాన్, మణి నిఱ వణ్ణన్ ఎన్ఱెణ్ణి, నాడొఱుమ్
తెళ్ళియార్ వణఙ్గుమ్ మలై, తిరువేఙ్గడమ్ అడై నెఞ్జమే ll 1019
వన్ పేయ్ = మిక్కిలి కఠిన మనస్కురాలైన రక్కసి పూతన; ఇరఙ్గ = దుఃఖించునట్లు; ములై = ఆమెయొక్క స్తన్యములను; పిళ్ళై ఆయ్=చిన్న బాలడుగ ఉండినను;ఉయిర్=ఆమెయొక్క ప్రాణమును; ఉణ్డ = పీల్చి ఆరగించిన; ఎందై పిరాన్ = నాయొక్క స్వామి శ్రీకృష్ణభగవానుడు;పళ్ళి ఆవదు= శయనించు చుండునది;పాల్ కడల్=క్షీరాబ్ధియు; అరఙ్గమ్ = శ్రీ రంగము ; అవన్ = ఆ సర్వేశ్వరుడు; పెరుగుమ్ ఇడమ్ = పెరిగెడి ప్రదేశము (నిలిచియుండు తిరుక్కోలము); తెళ్ళియార్ =ఆత్మస్వరూపము గల ఙ్ఞాన పరిపూర్ణులు; వెళ్ళియాన్ కరియాన్ మణి నిఱ వణ్ణన్ ఎన్ఱు ఎణ్ణి = (కృతయుగములో శంఖమువలె) తెల్లనివర్ణము కలిగినవాడనియు, (కలియుగములో) నల్లని వర్ణముకలిగినవాడనియు,(ద్వాపరయుగములో) నీలమణివంటి వర్ణముకలిగినవాడనియు ధ్యానించుచు; నాడొఱుమ్ = ప్రతిదినము; వణఙ్గుమ్ మలై = సేవించుకొనుచుండెడి పర్వతమైన; తిరువేఙ్గడమ్ = ఆ దివ్యమైన వేంకటాచలమును; నెఞ్జమే = ఓ! నామనసా!;అడై = నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా!
కంసునిచే ప్రేరేరింపబడి వచ్చిన మిక్కిలి కఠిన మనస్కురాలైన రక్కసి పూతన, ఊయలలో శయనించుచుండు చిన్న శిశువుగా నున్న శ్రీకృష్ణునకు తన విషపూరితమైన స్తన్యములను ఇవ్వగ, ఆమెయొక్క ప్రాణమును పీల్చి ఆరగించిన నాయొక్క స్వామి ఆ శ్రీకృష్ణభగవానుడు (ఆ తిరుక్కోలములో) శయనించుచుండునది క్షీరాబ్ధియు మరియు శ్రీ రంగము, ఆ సర్వేశ్వరుడు నిలిచియుండునది, ఆత్మస్వరూపము గల ఙ్ఞాన పరిపూర్ణులు (కృతయుగములో) శంఖమువలె తెల్లని వర్ణము కలిగినవాడనియు, (కలియుగములో) నల్లని వర్ణముకలిగినవాడనియు, (ద్వాపరయుగములో) నీలమణివంటి వర్ణముకలిగినవాడనియు ధ్యానించుచు ప్రతిదినము సేవించుకొనుచుండెడి పర్వతము, అట్టి దివ్యమైన వేంకటాచలమును ఓ! నామనసా! నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా!
నిన్ఱ మామరుదు ఇర్ట్రువీழ, నడన్ద నిన్మలన్ నేమియాన్ ,
ఎన్ఱుమ్ వానవర్ కైతొழுమ్, ఇణై తామరైయడి యెమ్బిరాన్ ,
కన్ఱి మారి పొழிన్దిడ, క్కడిదు ఆనిరైక్కు ఇడర్ నీక్కువాన్ ,
శెన్ఱు కున్ఱ మెడుత్తవన్, తిరువేఙ్గడమ్ అడై నెఞ్జమే ll 1020
నిన్ఱ = దృఢముగ నిలిచియున్న; మామరుదు = పెద్ద రెండు మద్ది వృక్షములు;ఇర్ట్రువీழ=విరిగి క్రింద పడునట్లు; నడన్ద = వాటి మధ్య పాకినవాడును; నిన్మలన్ = నిర్మలమైన హృదయముగలవాడును; నేమియాన్ =దివ్య చక్రాయుధము హస్తమందు కలవాడును; ఎన్ఱుమ్=ఎల్లప్పుడును, వానవర్ = నిత్యశూరులు; కైతొழுమ్ = సేవించుచుండెడి; తామరై అడి ఇణై ఎమ్బిరాన్ = తామర పుష్పమువంటి పాదద్వందములుగల సర్వేశ్వరుడును;కన్ఱి=(ఇంద్రుడు) కోపముతో; మారి పొழிన్దిడ =(భయంకరమైన) వర్షమును కురిపించిన సమయమున;కడిదు = వెంటనే;ఆనిరైక్కు ఇడర్ నీక్కువాన్=గో సమూహముల యొక్క దుఃఖములను తొలగించుటకు; శెన్ఱు కున్ఱమ్ ఎడుత్తవన్ = గోవర్ధన పర్వతమును సమీపించి దానిని గొడుగు వలె పైకెత్తిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన;తిరువేఙ్గడమ్ = దివ్యమైన వేంకటాచలమును; నెఞ్జమే = ఓ! నామనసా!; అడై = నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా!
దృఢముగ నిలిచియున్న పెద్ద రెండు మద్ది వృక్షములు విరిగి కింద పడునట్లు వాటి మధ్య పాకినవాడును, నిర్మలమైన హృదయముగలవాడును, దివ్య చక్రాయుధము హస్తమందు కలవాడును, తామర పుష్పమువంటి పాదద్వందములుగల సర్వేశ్వరుడును,ఇంద్రుడు కోపముతో భయంకరమైన వర్షమును కురిపించిన సమయమున గో సమూహముల యొక్క దుఃఖములను తొలగించుటకు,వెంటనే గోవర్ధన పర్వతమును సమీపించి దానిని గొడుగు వలె పైకెత్తిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్యమైన వేంకటాచలమును ఓ! నామనసా! నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా!
** పార్తఱ్కాయ్ అన్ఱు పారతమ్ కైశెయ్ దిట్టు, వెన్ఱ పరఞ్జుడర్ ,
కోత్తు అఙ్గు ఆయర్ తమ్ పాడియిల్, కురవై పిణైన్ద ఎఙ్గోవలన్ ,
ఏత్తువార్ తమ్ మనత్తుళ్ళాన్, ఇడవెన్దై మేవియ ఎమ్బిరాన్ ,
తీర్త నీర్ తడమ్ శోలై శూழ், తిరువేఙ్గడమ్ అడై నెఞ్జమే ll 1021
అన్ఱు = పూర్వకాలమున; పార్తఱ్కు ఆయ్ = పార్ధుని కొరకు;పారతమ్ = మహాభారత యుద్దమందు; కైశెయ్ దిట్టు=స్వయముగ సేనను వ్యూహాత్మకముగ నడిపింపజేసి;వెన్ఱ = జయించిన;పరమ్ శుడర్=పరంజ్యోతి స్వరూపుడును;అఙ్గు ఆయర్ తమ్ పాడియిల్=అచట గోకులములో; కురవై కోత్తు పిణైన్ద = గోపస్త్రీలతో చేతులు జోడించి రాసక్రీడ సలిపిన; ఎమ్ కోవలన్ = మనయొక్క గోపాలకృష్ణుడును; ఏత్తువార్ తమ్ మనత్తు ఉళ్ళాన్ = తనను స్తుతించువారు యొక్క హృదయమందు వసించువాడును;ఇడవెన్దై మేవియ ఎమ్బిరాన్ = తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న నాయొక్క స్వామియును;(అయిన ఆ సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న);తీర్త నీర్ తడమ్ శోలై శూழ் = పుణ్యతీర్థములతోను, పెద్ద తోటలతోను చుట్టబడియున్న, తిరువేఙ్గడమ్ = దివ్యమైన వేంకటాచలమును; నెఞ్జమే = ఓ! నామనసా!; అడై = నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా!
పూర్వకాలమున అర్జునునికొరకు మహాభారత యుద్దమందు స్వయముగ సేనను వ్యూహాత్మకముగ నడిపింపజేసి దుర్యోదనాదులపై విజయము సాధింపజేసిన పరంజ్యోతి స్వరూపుడును, అచట గోకులములో గోపస్త్రీలతో చేతులు జోడించి రాసక్రీడ సలిపిన మనయొక్కగోపాలకృష్ణుడును, తనను స్తుతించువారు యొక్క హృదయమందు వసించువాడును, తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న నాయొక్క స్వామియును,అయిన ఆ సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న, పుణ్య తీర్థములతోను, పెద్ద తోటలతోను చుట్టబడియున్నట్టి దివ్యమైన వేంకటాచలమును ఓ! నామనసా! నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా!
వణ్ కైయాన్ అవుణర్కు నాయకన్, వేళ్వియిల్ శెన్ఱు మాణియాయ్,
మణ్ కైయాల్ ఇరన్దాన్, మరామరమ్ ఏழுమ్ ఎయ్ ద వలత్తినాన్,
ఎణ్ కైయాన్ ఇమయత్తుళ్ళాన్, ఇరుఞ్జోలై మేవియ ఎమ్బిరాన్ ,
తిణ్ కై మా తుయర్ తీర్తవన్, తిరువేఙ్గడమ్ అడై నెఞ్జమే ll 1022
వణ్ కైయాన్=మిక్కిలి ఉదారముగ దానముచేయు హస్తముగల; అవుణర్కు నాయకన్= అసురులకు నాయకుడైన మహాబలియొక్క; వేళ్వియిల్=యాగభూమివద్దకు; మాణి ఆయ్ శెన్ఱు = బ్రహ్మచారి రూపమునుదాల్చి వేంచేసి; కైయాల్ = తన దివ్యమైన హస్తములతో; మణ్ ఇరన్దాన్ = భూమిని యాచించినవాడును; మరామరమ్ ఏழுమ్ ఎయ్ ద = ఏడు సాలవృక్షములను కూలగొట్టిన; వలత్తినాన్ = మహా బలవంతుడును; ఎణ్ కైయాన్ = అష్ట భుజములుగలవాడును; ఇమయత్తు ఉళ్ళాన్ = హిమాలయ పర్వతమందుగల తిరుప్పిరిది దివ్యదేశములో వేంచేసియున్నవాడును; ఇరుమ్ శోలై మేవియ ఎమ్బిరాన్ = తిరుమాలిరుఞ్జోలై దివ్య దేశమున కృపతో వేంచేసియున్న స్వామియును, తిణ్ కై మా తుయర్ తీర్తవన్ = దృఢమైన తొండముగల గజేంద్రుని యొక్క దుఃఖమును పోగొట్టిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న; తిరువేఙ్గడమ్ = దివ్యమైన వేంకటాచలమును; నెఞ్జమే = ఓ! నామనసా!; అడై = నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా!
అడిగినవారికి ఉదారముగ దానముచేయు హస్తముగల, అసురులకు నాయకుడైన మహాబలియొక్క యాగభూమి వద్దకు బ్రహ్మచారి రూపమునుదాల్చి వేంచేసి తన దివ్యమైన హస్తములతో భూమిని యాచించిన వాడును, శ్రీరామావతారమందు ఏడు సాలవృక్షములను కూలగొట్టిన మహా బలవంతుడును, అష్ట భుజములుగలవాడును, హిమాలయ పర్వతమందుగల తిరుప్పిరిది దివ్యదేశములో వేంచేసియున్నవాడును, తిరుమాలిరుఞ్జోలై దివ్య దేశమున కృపతో వేంచేసియున్న స్వామియును,దృఢమైన తొండముగల గజేంద్రుని యొక్క దుఃఖమును పోగొట్టినట్టి సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న దివ్యమైన వేంకటాచలమును ఓ! నామనసా! నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా!
ఎణ్ తిశైగళుమ్ ఏழுలగుమ్ వాఙ్గి, ప్పొన్ వయిర్ట్రుల్ పెయ్ దు,
పణ్డు ఓరాలిలై ప్పళ్ళి కొణ్డవన్, పాన్మదిక్కు ఇడర్ తీర్తవన్,
ఒణ్ తిఱల్ అవుణన్ ఉరత్తు ఉకిర్ వైత్తవన్, ఒళ్ ఎయిర్ట్రోడు,
తిణ్ తిఱల్ అరియాయవన్, తిరువేఙ్గడమ్ అడై నెఞ్జమే ll 1023
పణ్డు = పూర్వమొక కాలమున;ఎణ్ తిశైగళుమ్ =ఎనిమిది దిక్కులును,ఏழுలగుమ్=సప్తలోకములను; వాఙ్గి = (ప్రళయకాలమున) తీసుకుని; పొన్ వయిర్ట్రుల్ = తనయొక్క అందమైన ఉదరములో; పెయ్ దు = ఉంచుకొని; ఓర్ ఆల్ ఇలై = ఒక వట పత్రమందు; పళ్ళి కొణ్డవన్ = పవళించినవాడును; పాల్ మదిక్కు=పాలువలె తెల్లని చంద్రునియొక్క; ఇడర్ = క్షయయనెడి దుఃఖమును; తీర్తవన్ = పోగొట్టినవాడును; ఒళ్ ఎయిర్ట్రోడు = ప్రకాశించెడి కోరలతోకూడి; తిణ్ తిఱల్ అరియాయవన్=మిక్కిలి బలముగల నరసింహ రూపముతో అవతరించి; ఒణ్ తిఱల్ అవుణన్ = మహా బలశాలియైన హిరణ్యాసురునియొక్క; ఉరత్తు = వక్షస్థలమందు; ఉకిర్ =నఖములను; వైత్తవన్ = చొచ్చి సంహరించిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న; తిరువేఙ్గడమ్ = దివ్యమైన వేంకటాచలమును; నెఞ్జమే = ఓ! నామనసా!; అడై = నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా!
పూర్వమొక కాలమున ఎనిమిది దిక్కులును,సప్తలోకములను తనయొక్క అందమైన ఉదరములో ఉంచుకొని ఒక చిన్న వటపత్రముపై పవళించినవాడును,తెల్లని చంద్రునియొక్క క్షయరోగమును పోగొట్టినవాడును, ప్రకాశించెడి కోరలతోకూడి మిక్కిలి బలముగల నరసింహ రూపముతో అవతరించి మహాబలశాలియైన హిరణ్యాసురుని యొక్క వక్షస్థలమును తన నఖములచే చీల్చి సంహరించినట్టి సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న దివ్యమైన వేంకటాచలమును ఓ! నామనసా! నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా!
పారునీరెరి కార్ట్రినోడు, ఆకాశముమివై యాయినాన్,
పేరుమ్ ఆయిరమ్ పేశనిన్ఱ, పిఱప్పిలి పెరుగుమిడమ్,
కారుమ్ వార్ పని నీళ్ విశుమ్బిడై, శోరుమాముగిల్ తోయ్ తర,
శేరుమ్ వార్ పొழிల్ శూழ், తిరువేఙ్గడమ్ అడై నెఞ్జమే ll 1024
పారుమ్ నీర్ ఎరి కార్ట్రినోడు ఆకాశముమ్ ఇవై ఆయినాన్ = భూమి,జలము,అగ్ని, వాయువు, ఆకాశము అనబడు పంచభూత స్వరూపమైనవాడును; పేరుమ్ ఆయిరమ్ పేశ నిన్ఱ= సహస్రనామములు ప్రతిపాదించునట్లు మూర్తీభవించినవాడును;పిఱప్పుఇలి=(కర్మవశముకాని) జన్మము లేని సర్వేశ్వరుడు; పెరుగుమ్ ఇడమ్ = (ఆ ఔనత్యము) స్పురింపజేయు ప్రదేశమైన;నీళ్ విశుమ్బిడై = పెద్ద ఆకాశమునుండి, కారుమ్ వార్ పని = వర్షము,మిక్కిలి మంచును; శోరుమ్ మాముగిల్ తోయ్ దర = కురియజేయు కాళ మేఘముల సమూహములు వచ్చి తగులునట్లు; శేరుమ్ వార్ పొழிల్ శూழ் = తగినట్లుగ మిక్కిలి ఉన్నతముగ పెరిగినతోటలచే చుట్టబడియున్నట్టి, తిరువేఙ్గడమ్ = దివ్యమైన వేంకటాచలమును; నెఞ్జమే = ఓ! నామనసా!; అడై = నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా!
భూమి,జలము,అగ్ని,వాయువు,ఆకాశము అనబడు పంచభూత స్వరూపమైన వాడును, సహస్రనామములు ప్రతిపాదించునట్లు మూర్తీభవించినవాడును, కర్మవశముకాని జన్మము లేని సర్వేశ్వరుడు (ఆ ఔనత్యము)స్పురింపజేయు ప్రదేశమైన, ఆకాశమునుండి వర్షము,మంచు కురియజేయు కాళమేఘముల సమూహములు వచ్చి తగులునట్లు ఉన్నతముగ పెరిగిన తోటలచే చుట్టబడియున్నట్టి దివ్యమైన వేంకటాచలమును ఓ! నామనసా! నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా! .
అమ్బరమ్ అనల్ కాల్ నిలమ్, శలమ్ ఆగినిన్ఱ అమరర్ కోన్,
వమ్బుఉలామ్ మలర్ మేల్, మలిమడ మఙ్గైతన్ కొழுననవన్,
కొమ్బినన్న ఇడై మడక్కుఱమాదర్, నీళ్ ఇతణన్దొఱుమ్,
శెమ్బునమవై కావల్ కొళ్, తిరువేఙ్గడమ్ అడై నెఞ్జమే ll 1025
అమ్బరమ్ అనల్ కాల్ నిలమ్ శలమ్ ఆగినిన్ఱ = ఆకాశము,అగ్ని, వాయువు, భూమి, జలము అయిన పంచభూత స్వరూపమైనవాడును; అమరర్ కోన్ = నిత్యశూరులకు ప్రభువును; వమ్బుఉలామ్ మలర్ మేల్ మలి మడ మఙ్గైతన్ = పరిమళము వెదజల్లు తామర పుష్పముపై వసించు కరుణామయి శ్రీదేవియొక్క;కొழுనన్ అవన్=నాయకుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న దివ్యదేశమును; కొమ్బిన్ అన్న ఇడై = సన్నని తీగవలె పోలిన నడుముగల; మడ = మిక్కిలి విధేయులైన; క్కుఱమాదర్ = కొండ ప్రాంతములందు వసించు స్త్రీలు; నీళ్ ఇదణమ్ తొఱుమ్=ఎత్తైన మంచెలపైనుండి;శెమ్ పునమ్ అవై కావల్ కొళ్=ఎర్రని పొలములను కాపాడుచు కైంకర్యముచేయుచుండునట్టి; తిరువేఙ్గడమ్ = దివ్యమైన వేంకటాచలమును; నెఞ్జమే = ఓ! నామనసా!; అడై = నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా! .
ఆకాశము,అగ్ని, వాయువు, భూమి,జలము అనబడు పంచభూత స్వరూపమైనవాడును, నిత్యశూరులకు ప్రభువును, పరిమళమువెదజల్లు తామర పుష్పముపై వసించు కరుణామయి శ్రీదేవియొక్క నాయకుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న దివ్యదేశమును,సన్నని తీగవలె పోలిన నడుముగల మిక్కిలి విధేయులైన కొండప్రాంతములందు వసించు స్త్రీలు ఎత్తైన మంచెలపైనుండి ఎర్రని పొలములను కాపాడుచు కైంకర్యము చేయుచుండునట్టి దివ్యమైన వేంకటాచలమును ఓ! నామనసా! నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా! ..
** పేశుమ్ ఇన్ తిరునామ మెట్టెழுత్తుమ్, శొల్లి నిన్ఱు పిన్నరుమ్,
పేశువార్ తమ్మై ఉయ్యవాఙ్గి, పిఱప్పఱుక్కుమ్ పిరానిడమ్,
వాశమామలర్ నాఱు వార్, పొழிల్ శూழ்తరుమ్ ఉలగుక్కెల్లామ్,
తేశమాయ్ త్తిగழுమ్ మలై, తిరువేఙ్గడమ్ అడై నెఞ్జమే ll 1026
పేశుమ్ = అందరిచేత అనుసంధింప తగిన; ఇన్ = మిక్కిలి మధురమైన; తిరునామమ్ ఎట్టు ఎழுత్తుమ్ = దివ్యమైన ఎనిమిది అక్షరములతోకూడిన మహామంత్రమును; శొల్లి నిన్ఱు=ఒకసారి అనుసంధించి; పిన్నరుమ్ = పిదప; పేశువార్ తమ్మై =(ఆ మంత్రమును) అనుసంధించువారిని; ఉయ్యవాఙ్గి = ఉజ్జీవింపజేసి; పిఱప్పు అఱుక్కుమ్ పిరానిడమ్= వారియొక్క సంసారబంధమును పోగొట్టు సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న దివ్యదేశమును; వాశమ్ మా మలర్ నాఱుమ్ = సువాసన ఎక్కువగాగల శ్లాఘ్యమైన పుష్పములు పరిమళించుచున్న; వార్ పొழிల్ శూழ்తరుమ్ = విశాలమైన తోటలతో చుట్టబడినదియు; ఉలగుక్కు ఎల్లామ్ = లోకములన్నింటికిని; తేశమాయ్ త్తిగழுమ్ = తిలకమనబడునట్లు ప్రకాశించుచున్నట్టి; తిరువేఙ్గడమ్ మలై = దివ్యమైన వేంకటాచలమును; నెఞ్జమే=ఓ! నామనసా!; అడై = నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా!
అందరిచేత అనుసంధింప తగిన మిక్కిలి మధురమైన దివ్యమైన ఎనిమిది అక్షరములతోకూడిన మహామంత్రమును (అష్టాక్షరీ మహామంత్రమును) ఒకసారి అనుసంధించి తృప్తిచెందక,ఆ మంత్రమునే తదేక ధ్యానముచే అనుసంధించువారిని ఉజ్జీవింపజేసి, వారియొక్క సంసారబంధమును పోగొట్టు సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న దివ్యదేశమును, సువాసన ఎక్కువగాగల శ్లాఘ్యమైన పుష్పములు పరిమళించుచున్న విశాలమైన తోటలతో చుట్టబడినదియు,లోకములన్నింటికిని తిలకమనబడునట్లు ప్రకాశించుచున్నట్టి దివ్యమైన వేంకటాచలమును ఓ! నామనసా! నీవు ఆశ్రయించి ఉజ్జీవించుమా! .
** శెఙ్గయల్ తిళైక్కుమ్ శునై, తిరువేఙ్గడత్తు ఉరై శెల్వనై,
మఙ్గైయర్ తలైవన్ కలికన్ఱి, వణ్ తమిழ் శెఞ్జొల్ మాలైగళ్,
శంగైయిన్ఱి త్తరిత్తు ఉరైక్కవల్లార్ గళ్, తఞ్జమతాకవే,
వఙ్గమాకడల్ వైయమ్ కావలరాగి, వానులగు ఆళ్వరే ll 1027
శెమ్ కయల్ తిళైక్కుమ్ శునై = ఎర్రని మీనములు సంతోషముతో గెంతులువేయుచు ఈదుచుండెడి జలాశయములచే చుట్టుకొనియున్న, తిరువేఙ్గడత్తు ఉరై శెల్వనై =దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న శ్రియఃపతి విషయమై; మఙ్గైయర్ తలైవన్ = తిరుమంగై దేశవాసులకు ప్రభువైన; కలికన్ఱి = కలిదోషములను నశింపజేయువారైన తిరుమంగై ఆళ్వార్(అనుగ్రహించిన);వణ్ తమిழ் శెఞ్జొల్ మాలైగళ్= సుందరమైన తమిళ భాషయందు శ్లాఘ్యమైన పదములతో కూడిన పాశురములను, శంగైయిన్ఱి = ఎటువంటి సంశయములేక; దరిత్తు = హృదయమందు స్వీకరించి; ఉరైక్కవల్లార్ గళ్ = అనుసంధించు భక్తులు; తఞ్జమదాగవే = నిశ్చయముగ; వఙ్గమ్ మాకడల్ వైయమ్ కావలరాగి = ఓడలతో నిండిన మహాసముద్రముచే చుట్టుకొనియున్న భూమండలవాసులకు రక్షకులగ నుండి; (పిదప) వానులగు ఆళ్వర్ = పరమపదమును పరిపాలించుదురు.
ఎర్రని మీనములు సంతోషముతో గెంతులువేయుచు ఈదుచుండెడి జలాశయములచే చుట్టుకొనియున్న దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న శ్రియఃపతి విషయమై తిరుమంగై దేశవాసులకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన సుందరమైన తమిళ భాషయందు శ్లాఘ్యమైన పదములతో కూడిన పాశురములను ఎటువంటి సంశయములేక హృదయమందు స్వీకరించి అనుసంధించు భక్తులు, నిశ్చయముగ , ఓడలతో నిండిన మహాసముద్రముచే చుట్టుకొనియున్న భూమండలవాసులకు రక్షకులగ నుండి పిదప పరమపదమును పరిపాలించుదురు.
*****************