పెరియ తిరుమొழி-1వపత్తు (9)

శ్రీః

9 .తాయేతన్దై 

( కోయిల్ తిరుమొழி )

తిరుమంగై ఆళ్వార్ తమ మనోభావములకు అనుగుణముగ నున్న  మనస్సుతోకూడి తిరు వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న సర్వస్వామియు, సర్వవిధబంధువైన శ్రీ శ్రీనివాసుని దివ్యచరణారవిందములందు మిక్కిలి అపేక్షతో కైంకర్యమును పొందుటకు తిరుమల ప్రవేశించి, తమ మనోవ్యధను వెలిబుచ్చుచున్నారు.

** తాయే తన్దై యెన్ఱుమ్, తారమే కిళై మక్కళెన్ఱుమ్ ,

నోయే పట్టొழிన్దేన్, ఉన్నై క్కాణ్బదోర్ ఆశైయినాల్,

వేయ్ ఏయ్ పూమ్పొழிల్ శూழ், విరైయార్ తిరువేఙ్గడవా ,

నాయేన్ వన్దడైన్దేన్, నల్ గియాళ్ ఎన్నై క్కొణ్డరుళే ll 1028

వేయ్ ఏయ్=దట్టముగ వెదురుచెట్లతో నున్నదియు;పూమ్ పొழிల్ శూழ்=పుష్పములతో  నిండిన తోటలతో చుట్టబడి; విరైయార్ = పరిమళము వెదజల్లుచున్న; తిరువేఙ్గడవా = తిరుమలలో కృపతో వేంచేసియున్న సర్వేశ్వరా!; తాయే తన్దై యెన్ఱుమ్ = తల్లి, తండ్రి అనియు; తారమే కిళై మక్కళ్ ఎన్ఱుమ్ = భార్య,బంధువులు,పిల్లలు అనియు,నోయే పట్టు ఒழிన్దేన్ = అనేకవిధములైన బాధలనే అనుభవించుచు నశించినవాడను; నాయేన్ = శునకమువలె పరమ నీచుడనైన నేను; ఉన్నై క్కాణ్బదు ఓర్ ఆశైయినాల్ = నిన్ను  సేవించుకొనవలెనని మిక్కిలి ఆశతో; వన్దు అడైన్దేన్ = తిరుమలలో నీయొక్క దివ్యచరణములచెంత చేరి శరణుజొచ్చుచున్నాను; ఎన్నై = శరణాగతుడైన నాకు; నల్ గి = కృపతో, ఆళ్ కొణ్డు అరుళే = నీ కైంకర్య సేవను ప్రసాదించుమా!

దట్టముగ వెదురుచెట్లతో నున్నదియు,పుష్పములతో నిండిన తోటలతో చుట్టబడి పరిమళము వెదజల్లు చుండబడు తిరుమలలో కృపతో వేంచేసియున్న సర్వేశ్వరా!, తల్లి, తండ్రి,భార్య, బంధువులు, పిల్లలు అని తలచుకొని అనేకవిధములైన బాధలనే అనుభవించుచు, నశించినవాడను, శునకమువలె పరమ నీచుడనైన నేను, నిన్ను  సేవించుకొనవలెనని మిక్కిలి ఆశతో, తిరుమలలో, నీయొక్క దివ్యచరణముల చెంత చేరి శరణుజొచ్చుచున్నాను. శరణాగతుడైన నాకు కృపతో నీ కైంకర్యసేవను ప్రసాదించుమా!

మానేయ్ కణ్ మడవార్, మయక్కిల్ పట్టు మానిలత్తు ,

నానే నానావిద, నరకమ్ పుగుమ్ పావమ్ శెయ్ దేన్,

తేనేయ్ పూమ్బొழிల్ శూழ், తిరువేఙ్గడమామలై, ఎన్

ఆనాయ్ వన్దడైన్దేన్, అడియేనై ఆట్కొణ్డరుళే ll 1029

తేన్ ఏయ్ పూమ్ పొழிల్ శూழ் = తుమ్మెదలచే నిండిన పుష్పములగల తోటలతో చుట్టుకొనియున్న; తిరువేఙ్గడ మా మలై = దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న; ఎన్ ఆనాయ్ = నాయొక్క(మిక్కిలి సహనముగల) ఏనుగువంటి సర్వేశ్వరుడా !;మా నిలత్తు=ఈ పెద్ద భూమండలమందు గల; మాన్ ఏయ్ కణ్ మడవార్ మయక్కిల్ పట్టు = లేడి కన్నులవలె సౌందర్యము కలిగిన స్త్రీల చూపులయందు ఆకర్షింపబడి; నానావిద, నరకమ్ పుగుమ్ పావమ్ = పలువిధములైన నరకములలో ప్రవేశించుటకు కారణమగు పాపములను; నానే శెయ్ దేన్ = నేనొక్కడినే చేసితిని; (అయినను మిక్కిలి అనుతాపము కలుగుటచే ఇప్పుడు) వన్దు అడైన్దేన్ = తిరుమలలో నీయొక్క దివ్యమైన చరణముల చెంతచేరి శరణుజొచ్చితిని;అడియేనై = శరణాగతుడైన ఈ దాసునకు; ఆళ్ కొణ్డు అరుళే = నీ  కైంకర్యసేవను ప్రసాదించుమా!

      తుమ్మెదలచే నిండిన పుష్పములగల తోటలతో చుట్టుకొనియున్న దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న నాయొక్క (మిక్కిలి సహనముగల) ఏనుగువంటి సర్వేశ్వరుడా! ఈ పెద్ద భూమండలమందుగల,  లేడి కన్నులవలె సౌందర్యము కలిగిన స్త్రీల చూపులయందు ఆకర్షింపబడి పలువిధములైన నరకములలో ప్రవేశించుటకు కారణమగు పాపములను నేనొక్కడినే చేసితిని. అయినను మిక్కిలి అనుతాపము కలుగుటచే ఇప్పుడు, తిరుమలలో నీయొక్క దివ్యమైన చరణముల చెంతచేరి శరణుజొచ్చితిని. శరణాగతుడైన ఈ దాసునకు నీ కైంకర్యసేవను ప్రసాదించుమా!

కొన్ఱేన్ పల్లుయిరై, కుఱిక్కోళ్ ఒన్ఱిలామైయినాల్,

ఎన్ఱేనుమ్ ఇరన్దార్కు, ఇనిదాగ ఉఱైత్తు అఱియేన్,

కున్ఱేయ్ మేగమ్ అదిర్, కుళిర్ మామలై వేఙ్గడవా,

అన్ఱే  వన్దు అడైన్దేన్, అడియేనై ఆట్కొణ్డరుళే ll 1030

కున్ఱు ఏయ్ మేగమ్ అదిర్ కుళిర్ మామలై వేఙ్గడవా=పర్వతమందంతటను వ్యాపించి పెద్ద పెద్ద మేఘములు గర్జించుచుండు చల్లని గొప్ప దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్నవాడా!; కుఱి క్కోళ్ ఒన్ఱు ఇలామైయినాల్ = వివేకఙ్ఞానము కొంచెమైనను లేకపోవుటచే; పల్ ఉయిరై కొన్ఱేన్=అనేక జీవులను చంపితిని;ఇరన్దార్కు= యాచించువారి ఎడల;ఎన్ఱేనుమ్=ఏ ఒక్క దినముననైనను; ఇనిదాగ ఉఱైత్తు అఱియేన్= సంతోషజనకముగ మాటలాడి ఎఱుగను; అన్ఱే = అట్టి సమయమందే; వన్దు అడైన్దేన్ = తిరుమలలో నీయొక్క దివ్యమైన చరణముల చెంత చేరి శరణుజొచ్చితిని;అడియేనై = శరణాగతుడైన ఈ దాసునకు; ఆళ్ కొణ్డు అరుళే = నీ  కైంకర్యసేవను ప్రసాదించుమా!

పర్వతమందంతటను వ్యాపించి పెద్ద పెద్ద మేఘములు గర్జించుచుండు, చల్లని గొప్ప దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్నవాడా!,వివేకఙ్ఞానము కొంచెమైనను లేకపోవుటచే అనేక జీవులను చంపితిని,యాచించువారి ఎడల ఏ ఒక్క దినముననైనను సంతోషజనకముగ మాటలాడి ఎఱుగను.అట్టి సమయమందే తిరుమలలో నీయొక్క దివ్యమైన చరణముల చెంత చేరి శరణుజొచ్చితిని. శరణాగతుడైన ఈ దాసునకు నీ కైంకర్యసేవను ప్రసాదించుమా!

కులన్దాన్ ఎత్తనైయుమ్, పిఱన్దే ఇఱన్దు ఎయ్ త్తొழிన్దేన్,

నలన్దాన్ ఒన్ఱుమిలేన్, నల్లదు ఓర్ అఱమ్ శెయ్ తుమిలేన్,

నిలన్దోయ్ నీళ్ ముగిల్ శేర్, నెఱియార్ తిరువేఙ్గడవా, 

అలన్దేన్ వన్దడైన్దేన్, అడియేనై ఆట్కొణ్డరుళే ll 1031

నిలమ్ తోయ్ నీళ్ ముగిల్ శేర్ నెఱి ఆర్ తిరువేఙ్గడవా = భూమిపై నుండి  పెద్ద మేఘములు సంచరించెడి మార్గములుగల  దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్నవాడా!; ఎత్తనై కులముమ్ పిఱన్దు ఇఱన్దు ఎయ్ త్తు ఒழிన్దేన్ = ఎన్నోకులములలో పుట్టి, మరణించి,మిక్కిలి కృశించిపోయినవాడను; నలమ్ ఒన్ఱుమ్ ఇలేన్=మంచితనము ఏమియు లేనివాడను;  నల్లదు ఓర్ అఱమ్ శెయ్ దుమ్ ఇలేన్ = మంచిదైన ఏఒక్క ధర్మకార్యము చేయనివాడను; అలన్దేన్ = అనేక కష్టములు అనుభవించిన నేను; వన్దు అడైన్దేన్ = తిరుమలలో నీయొక్క దివ్యమైన చరణములచెంత చేరి శరణుజొచ్చితిని;అడియేనై = శరణాగతుడైన ఈ దాసునకు; ఆళ్ కొణ్డు అరుళే = నీ  కైంకర్యసేవను ప్రసాదించుమా!

భూమిపై నుండి  పెద్ద మేఘములు సంచరించెడి మార్గములుగల  దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న స్వామీ!; అనేక కులములలో పుట్టి, మరణించి, మిక్కిలి కృశించి పోయినవాడను, మంచితనము ఏమియు లేనివాడను, మంచిదైన ఏ ఒక్క ధర్మకార్యము చేయనివాడను, అనేక కష్టములు అనుభవించిన నేను, తిరుమలలో నీయొక్క దివ్యమైన చరణములచెంత చేరి శరణుజొచ్చితిని. శరణాగతుడైన ఈ దాసునకు నీ కైంకర్యసేవను ప్రసాదించుమా!

ఎప్పావుమ్ పలవుమ్, ఇవై యే శెయ్ దు ఇళైత్తొழிన్దేన్,

తుప్పా నిన్నడియే, తొడర్ న్దు ఏత్తవుమ్ కిఱ్కిన్ఱిలేన్,

శెప్పార్ తిణ్ వరై శూழ், తిరువేఙ్గడమామలై, ఎన్

అప్పా వన్దడైన్దేన్, అడియేనై ఆట్కొణ్డరుళే ll 1032

శెప్పు ఆర్ తిణ్ వరై శూழ் = రాగి కవచము వలె దృఢమైన కొండల సమూహముతో చుట్టబడియున్న; తిరువేఙ్గడమ్ మా మలై = దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న; ఎన్ అప్పా = నాయొక్క తండ్రీ!; తుప్పా = మిక్కిలి శక్తివంతమైనవాడా!;ఎప్పావుమ్ పలవుమ్ ఇవై యే=ఈ అనేక రకములైన పాపములను;శెయ్ దు = చేసి; ఇళైత్తు ఒழிన్దేన్ = (కలగబోవు బాధలను తెలుసుకొని)  కృశించి చితికిపోతిని; నిన్ అడియే తొడర్ న్దు ఏత్తవుమ్ కిఱ్కిన్ఱిలేన్ = నీయొక్క దివ్యచరణములను ఆశ్రయించి   భక్తితో స్తుతించెడి శక్తిలేనివాడను; వన్దు అడైన్దేన్ = తిరుమలలో నీయొక్క దివ్యమైన చరణములచెంత చేరి శరణుజొచ్చితిని;అడియేనై = శరణాగతుడైన ఈ దాసునకు; ఆళ్ కొణ్డు అరుళే = నీ  కైంకర్యసేవను ప్రసాదించుమా!

రాగి కవచము వలె దృఢమైన కొండల సమూహముతో చుట్టబడియున్నదివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న నాయొక్క తండ్రీ!,మిక్కిలి శక్తివంతమైనవాడా!, అనేక రకములైన పాపములను చేసి కలగబోవు బాధలను తెలుసుకొని  కృశించి చితికిపోతిని.నీయొక్క దివ్యచరణములను ఆశ్రయించి భక్తితో స్తుతించెడి శక్తిలేనివాడను. అట్టినేను తిరుమలలో నీయొక్క దివ్యమైన చరణములచెంత చేరి శరణుజొచ్చితిని. శరణాగతుడైన ఈ దాసునకు నీ కైంకర్యసేవను ప్రసాదించుమా!

మణ్ణాయ్ నీర్ ఎరి కాల్, మఞ్జు ఉలావుమ్ ఆకాశముమాయ్,

పుణ్ణార్ ఆక్కైతన్నుళ్, పులమ్బితళర్ న్దు ఎయ్ త్తొழிన్దేన్,

విణ్ణార్ నీళ్ శిగర, విరైయార్ తిరువేఙ్గడవా, 

అణ్ణా వన్దడైన్దేన్, అడియేనై ఆట్కొణ్డరుళే ll 1033

విణ్ణ్ ఆర్ నీళ్ శిగర=ఆకాశమును తాకునట్లు ఉన్నతమైన శిఖరములుగలదియు; విరైయార్= పరిమళ భరితమైనదియు; తిరువేఙ్గడవా = దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్నవాడా!; అణ్ణా = నా అన్నా!; మణ్ణాయ్ నీర్ ఎరి కాల్ మఞ్జు ఉలావుమ్ ఆకాశముము ఆయ్ = భూమి,జలము,అగ్ని, వాయువు, మేఘములు సంచరించెడి ఆకాశము మొదలగు పంచభూతములచే ఒప్పుచు; పుణ్ణు ఆర్ ఆక్కై తన్నుళ్ = వ్రణము మొదలగు వివిధ వ్యాధులతో నిండిన శరీరములో బంధింపబడి;  పులమ్బి తళర్ న్దు ఎయ్ త్తు ఒழிన్దేన్ = అరుచుచు బలహీనతను పొంది చితికిన నేను; వన్దు అడైన్దేన్ = తిరుమలలో నీయొక్క దివ్యమైన చరణములచెంత చేరి శరణుజొచ్చితిని;అడియేనై = శరణాగతుడైన ఈ దాసునకు; ఆళ్ కొణ్డు అరుళే = నీ  కైంకర్యసేవను ప్రసాదించుమా!

                    ఆకాశమును తాకునట్లు ఉన్నతమైన శిఖరములుగలదియు,  పరిమళభరితమైనదియు అయిన దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న  నా అన్నా!, భూమి,జలము,అగ్ని, వాయువు, మేఘములు సంచరించెడి ఆకాశము, మొదలగు పంచభూతములచే ఒప్పుచు, వ్రణము మొదలగు వివిధ వ్యాధులతో నిండిన శరీరములో బంధింపబడి,  అరుచుచు బలహీనతను పొంది చితికిపోయిన నేను తిరుమలలో నీయొక్క దివ్యమైన చరణములచెంత చేరి శరణుజొచ్చితిని. శరణాగతుడైన ఈ దాసునకు నీ కైంకర్యసేవను ప్రసాదించుమా!

తెరియేన్ పాలగనాయ్, ప్పలతీమైగళ్ శెయ్ దుమిట్టేన్,

పెరియేనాయినపిన్, పిఱర్కే ఉழைత్తు ఏழைయానేన్,

కరిశేర్ పూమ్బొழிల్ శూழ், కనమామలై వేఙ్గడవా, 

అరియే వన్దడైన్దేన్, అడియేనై ఆట్కొణ్డరుళే ll 1034

కరి శేర్ = ఏనుగులు మిక్కుటముగ కలిగినదియు; పూమ్ పొழிల్ శూழ் = సుందరమైన తోటలతో చుట్టబడినదియు; కన మా మలై  వేఙ్గడవా = దృఢమైన పెద్ద దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్నవాడా!; అరియే = శ్రీ హరీ!; పాలగనాయ్= నాయొక్క చిన్నతనమునందు; తెరియేన్ = అఙ్ఞానముచే; పల తీమైగళ్ శెయ్ దుమ్ ఇట్టేన్ = అనేక పాపములు చేసియుంటిని;పెరియేన్ ఆయిన పిన్=యౌవన వయస్కుడైన పిదప; పిఱర్కే ఉழைత్తు = విషయాంతరపరుడనై శ్రమచెంది; ఏழை ఆనేన్ = మతిచెడినవాడయినాను; (అట్టి నేను),వన్దు అడైన్దేన్ = తిరుమలలో నీయొక్క దివ్యమైన చరణములచెంత చేరి శరణుజొచ్చితిని;అడియేనై = శరణాగతుడైన ఈ దాసునకు; ఆళ్ కొణ్డు అరుళే = నీ  కైంకర్యసేవను ప్రసాదించుమా!

ఏనుగులు మిక్కుటముగ కలిగినదియు,సుందరమైన తోటలతో చుట్టబడినదియు, దృఢమైన పెద్ద దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్నవాడా!, శ్రీహరీ! నాయొక్క చిన్నతనమునందు అఙ్ఞానముచే అనేక పాపములు చేసియుంటిని, యౌవన వయస్కుడైన పిదప విషయాంతరపరుడనై శ్రమచెంది మతిచెడినవాడయినాను. అట్టి నేను తిరుమలలో నీయొక్క దివ్యమైన చరణములచెంత చేరి శరణుజొచ్చితిని. శరణాగతుడైన ఈ దాసునకు నీ కైంకర్యసేవను ప్రసాదించుమా!

నోర్ట్రేన్ పల్ పిఱవి, యున్నై క్కాణ్బదోర్ ఆశైయినాల్, 

ఏర్ట్రేన్ ఇప్పిఱప్పే, ఇడరుర్ట్రనన్ ఎమ్బెరుమాన్, 

కోల్ త్తేన్ పాయ్ న్దు ఒழுగుమ్, కుళిర్ శోలై వేఙ్గడవా,

ఆర్ట్రేన్ వన్దడైన్దేన్, అడియేనై ఆట్కొణ్డరుళే ll 1035

కోల్ తేన్ పాయ్ న్దు ఒழுగుమ్ కుళిర్ శోలై వేఙ్గడవా = స్తంబములపైనుండి తేనెలు వెల్లువుగ కారుచుండెడి చల్లని తోటలచే చుట్టుకొనియున్న దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్నవాడా!; ఎమ్బెరుమాన్ = నాయొక్క స్వామీ!; పల్ పిఱవి నోర్ట్రేన్=నాకు అనేక జన్మములు కలుగునట్లు కర్మములను చేసితిని; ఉన్నై క్కాణ్బదు ఓర్ ఆశైయినాల్ = నిన్ను  సేవించుకొనవలెనని ఒక ఆశ కలుగుటచే; ఇప్పిఱప్పే ఏర్ట్రేన్ = ఈ జన్మలోనే నిన్ను స్తుతించగలిగితిని; ఇడర్ ఉర్ట్రనన్ = (కలుగబోవు జన్మములను తలచుకొని) మిక్కిలి దుఃఖము కలుగుచున్నది;ఆర్ట్రేన్=సహింపలేని నేను; వన్దు అడైన్దేన్ = తిరుమలలో నీయొక్క దివ్యమైన చరణములచెంత చేరి శరణుజొచ్చితిని;అడియేనై = శరణాగతుడైన ఈ దాసునకు; ఆళ్ కొణ్డు అరుళే = నీ  కైంకర్యసేవను ప్రసాదించుమా!

నాటియున్న స్తంబములపైనుండి తేనెలు వెల్లువుగ కారుచుండెడి చల్లని తోటలచే చుట్టుకొనియున్న దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్నవాడా!, నాయొక్క స్వామీ !, నాకు అనేక జన్మములు కలుగునట్లు కర్మములను చేసితిని. యాదృచ్ఛికముగ నిన్ను  సేవించుకొనవలెనని ఒక ఆశ కలుగుటచే ఈ జన్మలోనే నిన్ను స్తుతించగలిగితిని. కలుగబోవు జన్మములను తలచుకొని సహింపలేని వ్యధకలిగిన నేను తిరుమలలో నీయొక్క దివ్యమైన చరణములచెంత చేరి శరణుజొచ్చితిని. శరణాగతుడైన ఈ దాసునకు నీ కైంకర్యసేవను ప్రసాదించుమా!

పర్ట్రేల్ ఒన్ఱుమిలేన్, పావమేశెయ్ దు పావియానేన్,

మర్ట్రేల్ ఒన్ఱఱియేన్, మాయనే ఎఙ్గళ్ మాదవనే,

కల్ తేన్ పాయ్ న్దు ఒழுగుమ్, కమలచ్చునై వేఙ్గడవా,

అర్ట్రేన్ వన్దడైన్దేన్, అడియేనై ఆట్కొణ్డరుళే ll 1036

మాయనే = ఆశ్చర్యకరమైన గుణములుగలవాడా!; ఎఙ్గళ్ మాదవనే = మాయొక్క సర్వ పాపములను క్షమింపజేయు శ్రీ దేవికి వల్లభుడా!; కల్ తేన్ పాయ్ న్దు ఒழுగుమ్ కమల శునై వేఙ్గడవా = పర్వత గుహలనుండి తేనులు వెల్లువగ కారుచుండెడిదియు, తామర పుష్పములతోనిండిన వాగులుగలదియు అయిన దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్నవాడా!; పర్ట్రు ఒన్ఱుమ్ ఇలేన్ = ఏవిధమైన ఆధారము లేనివాడను; పావమేశెయ్ దు పావి ఆనేన్ = పాపములనే చేయుచు పాపిష్టుడునైతిని; మర్ట్రు ఒన్ఱు అఱియేన్ =  ఏ ఒక ఉపాయము తెలియని వాడను; అర్ట్రేన్ = అల్పుడైన నేను; వన్దు అడైన్దేన్ = తిరుమలలో నీయొక్క దివ్యమైన చరణములచెంత చేరి శరణుజొచ్చితిని; అడియేనై = శరణాగతుడైన ఈ దాసునకు; ఆళ్ కొణ్డు అరుళే = నీ  కైంకర్యసేవను ప్రసాదించుమా!

    ఆశ్చర్యకరమైన గుణములుగలవాడా!,మాయొక్క సర్వ పాపములను క్షమింపజేయు శ్రీ దేవికి వల్లభుడా!; పర్వత గుహలనుండి తేనులు వెల్లువగ కారుచుండెడిదియు,తామర పుష్పములతోనిండిన వాగులుగలదియు అయిన దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్నవాడా!, ఏవిధమైన ఆధారములేనివాడను, పాపములనే చేయుచు పాపిష్టుడనెతిని. ఏ ఒక ఉపాయము తెలియని వాడను, మిక్కిలి అల్పుడైననేను తిరుమలలో నీయొక్క దివ్యమైన చరణములచెంత చేరి శరణుజొచ్చితిని. శరణాగతుడైన ఈ దాసునకు నీ కైంకర్యసేవను ప్రసాదించుమా!

** కణ్ణాయ్ ఏழுలగుక్కు, ఉయిరాయ ఎఙ్గార్ వణ్ణనై,

విణ్ణోర్ తామ్ పరవుమ్, పొழிల్ వేఙ్గడవేదియనై,

తిణ్ణార్ మాడఙ్గళ్ శూழ், తిరుమంగైయర్ కోన్ కలియన్,

పణ్ణార్ పాడల్ పత్తుమ్, పయిల్ వార్ క్కిల్లై పావఙ్గళే ll 1037

ఏழுలగుక్కు =సప్తలోకములకు; కణ్ణాయ్ = నేత్రమువంటివాడును;ఉయిర్ ఆయ = ప్రాణము వంటివాడును; ఎమ్ కార్ వణ్ణనై = మనయొక్క మేఘమువంటి వర్ణముగలిగిన తిరుమేని గలవాడును; విణ్ణోర్ తామ్ పరవుమ్=నిత్యశూరులు స్తుతించుచున్న;పొழிల్ = తోటలతో చుట్టుకొనియున్న;వేఙ్గడమ్ = తిరుమలలో; వేదియనై=వేదములచే ప్రతిపాదింపబడువాడైన సర్వేశ్వరుని విషయమై; తిణ్ణార్ మాడఙ్గళ్ శూழ் తిరుమంగైయర్ కోన్ కలియన్ = దృఢమైన మేడలచే చుట్టబడియున్న తిరుమంగై దేశవాసులకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన; పణ్ ఆర్ పాడల్ పత్తుమ్ = రాగభరితమైన ఈ పాశురములు పదియును; పయిల్ వార్ క్కు=అభ్యసించి అనుసంధించు వారికి; పావఙ్గళ్ ఇల్లై = ప్రతిబంధకములన్నియు తొలగిపోవును.

సప్తలోకములకు నేత్రమువంటివాడును, ప్రాణము వంటివాడును,మనయొక్క, మేఘమువంటి వర్ణము గలిగిన తిరుమేనిగలవాడును, నిత్యశూరులు స్తుతించుచున్న, తోటలతో చుట్టుకొనియున్న తిరుమలలో, వేదములచే ప్రతిపాదింపబడువాడైన సర్వేశ్వరుని విషయమై, దృఢమైన మేడలచే చుట్టబడియున్న తిరుమంగై దేశవాసులకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన రాగభరితమైన ఈ పాశురములు పదియును అభ్యసించి అనుసంధించు వారికి ప్రతిబంధకములన్నియు తొలగిపోవును.

**********************

వ్యాఖ్యానించండి