శ్రీః
10 . మఞ్జాడు
పంచ కృష్ణక్షేత్రములలో ప్రసిద్ధిగాంచిన తిరుక్కోవలూర్ దివ్యదేశములో కృపతో వేంచేసియున్న త్రివిక్రమన్ పెరుమాళ్ ను తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు.
** మఞ్జాడు వరైయేழுమ్ కడల్ గళ్ ఏழுమ్, వానగమ్ మణ్ణగముమ్ మర్ట్రుమెల్లాం ,
ఎఞ్జామల్ వయిర్ట్రడక్కి ఆలిన్మేలోర్, ఇళన్దళిరిల్ కణ్ వళర్ న్ద ఈశన్ తన్నై ,
తుఞ్జానీర్ వళం శురక్కుం పెణ్ణై తెన్బాల్, తూయనాన్మఱైయాళర్ శోముచ్చెయ్య ,
శెఞ్జాలి విళైవయలుళ్ తిగழ் న్దు తోన్ఱుమ్, తిరుక్కోవలూరదనుళ్ కణ్డేన్ నానే ll 1138
మఞ్జు ఆడు వరై ఏழுమ్=మేఘములు సంచరించుచుండెడి కులపర్వతములు ఏడును; కడల్ గళ్ ఏழுమ్ = సప్తసముద్రములును; వానగమ్ = స్వర్గము మొదలగు పైలోకములును; మణ్ణగముమ్ = భూలోకమును;మర్ట్రుమ్ ఎల్లామ్ = మరియు మిగిలినవన్నింటిని; ఎఞ్జామల్ = ఎటువంటి హానియు చెందకుండ; వయిఱు అడక్కి= తన దివ్యమైన ఉదరమందు ఉంచుకొని; ఓర్ ఆలిన్ ఇళమ్ తళిరిన్ మేల్ = సాటిలేని వటవృక్షముయొక్క లేత దళముపై;కణ్ వళర్ న్ద=యోగనిద్రలో పవళించియున్న; ఈశన్ తన్నై = సర్వేశ్వరుని; తుఞ్జా=ఒకప్పుడును తక్కువగాకుండ;వళమ్ నీర్=ముత్యములు, మణులు మొదలగువానితొ నిండిన నీరు; శురక్కుం = ప్రవహించుచున్న; పెణ్ణై తెన్బాల్= పెన్నానది దక్షిణ ఒడ్డునగల; తూయ నాల్ మఱైయాళర్=అనన్యప్రయోజకులైన నాలుగు వేదములయందు పారంగతులైన వేదోత్తములు; శోము శెయ్య = సోమ యాగము చేయుటచే; శెమ్ శాలి = ఎర్ర ధాన్యములు; విళై వయలుళ్ = పండెడి పొలములలో; తిగழ் న్దు తోన్ఱుమ్= మిక్కిలి అభివృద్ధి కలిగి ప్రకాశించు; తిరుక్కోవలూర్ అదనుళ్ కణ్డేన్ నానే = తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని
మేఘములు సంచరించుచుండెడి కులపర్వతములు ఏడును, సప్త సముద్రములును, స్వర్గము మొదలగు పైలోకములును,భూలోకమును మరియు మిగిలినవన్నింటిని, ఎటువంటి హానియు చెందకుండ,తన దివ్యమైన ఉదరమందు ఉంచుకొని వటవృక్షముయొక్క లేత దళముపై యోగనిద్రలో పవళించియున్న సర్వేశ్వరుని, ఒకప్పుడును తక్కువగాకుండ ముత్యములు మణులు మొదలగువానితొ నిండిన నీరు ప్రవహించుచున్న పెన్నానది దక్షిణ ఒడ్డునగల, అనన్యప్రయోజకులైన నాలుగు వేదములయందు పారంగతులైన వేదోత్తములు సోమ యాగము చేయుటచే, ఎర్ర ధాన్యములు, పండెడి పొలములలో మిక్కిలి అభివృద్ధి కలిగి ప్రకాశించు తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని.
కొన్దలర్ న్ద నఱున్దుయాழ் శాన్దమ్ తూపం, తీపఙ్గొణ్డమరర్ తొழ పణఙ్గొళ్ పామ్బిల్,
శన్దణిమెన్ ములై మలరాళ్ తరణిమఙ్గై, తామిరువర్ అడివరుడుం తన్మైయానై ,
వన్దనైశెయ్ దు ఇశైయేழ் ఆఱఙ్గం, ఐన్దువళర్ వేళ్వి నాన్మఱైగళ్ మూన్ఱుతీయుం ,
శిన్దనైశెయ్ దు ఇరుపొழுదుమ్ ఒన్ఱుం, శెల్వత్తిరుక్కోవలూరదనుళ్ కణ్డేన్ నానే ll 1139
అమరర్=బ్రహ్మాదిదేవతలు;కొన్దు అలర్ న్ద నఱు తుయాழ்=గుత్తుగుత్తులుగ వికసించిన పరిమళ భరితమైన తులసీమాలలను; శాన్దమ్ =చందనమును; తూపం = ధూపమును, తీపమ్ = దీపమును; కొణ్డు = స్వహస్తములతో తెచ్చి; తొழ = ఆశ్రయించగ; పణమ్ కొళ్ పామ్బిల్ = పడగలతోఒప్పు శేషునియొక్క తల్పమున; శన్దు అణి మెన్ ములై మలరాళ్= చందనముతో అలంకృతమైన మృదువైన వక్షోజములుగల కమలవాసినియు; తరణి మఙ్గై=శ్రీ భూదేవియు ; తామ్ ఇరువర్ = వారిద్దరును; అడి వరుడుం తన్మైయానై=తన దివ్యచరణములను ఒత్తుచుండగ పవళించియున్న సర్వేశ్వరుని; ఏழ் ఇశై = సప్త స్వరములును; ఆఱు అఙ్గమ్ = ఆరు వేదాంగములును; ఐన్దు వళర్ వేళ్వి = పంచ మహా యఙ్ఞములును; మూన్ఱు తీయుమ్ = మూడు అగ్నులును సమర్పించి; వన్దనై శెయ్ దు=సర్వేశ్వరుని సేవించి;నాల్ మఱైగళ్=నాలుగు వేదములు;ఇరు పొழுదుమ్ = రాత్రిపగళ్ళు; శిన్దనై శెయ్ దు = ధ్యానించుచుండు;ఒన్ఱుమ్=(వైదికోత్తములు నివసించు) ప్రదేశమైన; శెల్వమ్ = సంపదలతో నిండిన; తిరుక్కోవలూర్ అదనుళ్ కణ్డేన్ నానే = తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని.
బ్రహ్మాదిదేవతలు, గుత్తుగుత్తులుగ వికసించిన పరిమళభరితమైన తులసీమాలలను, చందనమును,ధూపమును,దీపమును,స్వహస్తములతో తెచ్చి, ఆశ్రయించగ, పడగలతోఒప్పు శేషునియొక్క తల్పమున,చందనముతో అలంకృతమైన మృదువైన వక్షోజములుగల కమలవాసినియు, శ్రీ భూదేవియు, వారిద్దరును తన దివ్యచరణములను ఒత్తుచుండగ పవళించియున్న సర్వేశ్వరుని, సప్తస్వరములును, ఆరు వేదాంగములును, పంచ మహాయఙ్ఞములును,మూడు అగ్నులును సమర్పించి, సర్వేశ్వరుని సేవించి,నాలుగు వేదములు రాత్రిపగళ్ళు ధ్యానించుచుండు వైదికోత్తములు నివసించు ప్రదేశమైన, సంపదలతో నిండిన తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని.
కొழுన్దలరుం మలర్చోలైక్కుழாఙ్గొళ్ పొయ్ గై, క్కోళ్ముదలై వాళెయిర్ట్రు క్కొణ్డఱ్కెళిగి,
అழுన్దియ మాకళిర్ట్రినుక్కు అన్ఱాழிయేన్ది, అన్దరమేవర త్తోన్ఱి యరుళ్ శెయ్ దానై,
ఎழுన్దమలర్కరునీలమిరున్దిల్ కాట్ట, ఇరు పున్నై ముత్తరుమ్బి చ్చెమ్బొన్ కాట్ట ,
శెழுమ్ తడనీర్ క్కమలమ్ తీవిగైప్పోల్కాట్టుమ్, తిరుక్కోవలూరదనుళ్ కణ్డేన్ నానే 1140
అన్ఱు = పూర్వమొకకాలమున; కొழுన్దు = చిగుళ్ళతోను; అలరుం మలర్ = వికసించిన పుష్పములతోను గల; శోలై కుழாమ్ కొళ్ పొయ్ గై = తోటలతో చుట్టుకొనియున్న తటాకములో; కోళ్ ముదలై = బలిష్ఠమైన మొసలి; వాళ్ ఎయిఱు = కత్తివలె నున్న కోరలతో; కొణ్డఱ్కు=కాలును పట్టుకొన్నందులకు; ఎళిగి=మిక్కిలి బలహీనమై; అழுన్దియ= దుఃఖించుచున్న; మా కళిర్ట్రినుక్కు = గజేంద్రాళ్వార్ కొరకు; ఆழி ఏన్ది= చక్రాయుధమును ధరించి; అన్దరమ్ మేవర త్తోన్ఱి = ఆకాశమున నిండుగ ప్రత్యక్షమై; అరుళ్ శెయ్ దానై = ఆ గజేంద్రునిపై కృపజూపిన సర్వేశ్వరుని;ఎழுన్ద మలర్ కరునీలమ్ ఇరున్దిల్ కాట్ట= నీటినుండి పైకివచ్చిన వికసించిన నల్లకలువలు బొగ్గును స్పురింపజేయునదియు;ఇరు పున్నై = పెద్ద పున్నై చెట్టు తమ మొగ్గలుద్వారా; ముత్తు కాట్ట = ముత్యములను స్పురింపజేయునదియు; అరుమ్బి = వికసించిన పుష్పములు; శెమ్ పొన్ కాట్ట = మేలిమి బంగారమును స్పురింపజేయునదియు; శెழுమ్ నీర్ తడమ్ కమలమ్ తీ విగై పోల్ కాట్టుమ్ = పుష్కలముగ జలరాసులతో ఒప్పు తటాకమందుగల తామర పుష్పములు దీపమును స్పురింపజేయునదియు;(అయిన),తిరుక్కోవలూర్ అదనుళ్ కణ్డేన్ నానే = తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని.
పూర్వమొకకాలమున చిగుళ్ళతోను,వికసించిన పుష్పములతోనుగల తోటలతో చుట్టుకొనియున్న తటాకములో బలిష్ఠమైన మొసలి, కత్తివలె నున్న కోరలతో తన కాలును పట్టుకొన్నందులకు మిక్కిలి బలహీనమై దుఃఖించుచున్న గజేంద్రాళ్వార్ కొరకు చక్రాయుధమును ధరించి ఆకాశమున నిండుగ ప్రత్యక్షమై,ఆ గజేంద్రునిపై కృపజూపిన సర్వేశ్వరుని, నీటినుండి పైకివచ్చిన వికసించిన నల్లకలువలు బొగ్గును స్పురింప జేయునదియు,పెద్ద పున్నై చెట్టు, తమ మొగ్గలుద్వారా ముత్యములను స్పురింప జేయునదియు, తమ వికసించిన పుష్పముల ద్వారా బంగారమును స్పురింప జేయునదియు, పుష్కలముగ జలరాసులతో ఒప్పు తటాకమందుగల తామర పుష్పములు దీపమును స్పురింపజేయునదియు,(అయిన) తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని.
తాఙ్గరుమ్ పోర్మాలిప్పడ ప్పఱవైయూర్ న్దు, తరాతలత్తోర్కుఱైముడిత్త తన్మైయానై,
ఆఙ్గరుమ్బికణ్ణీర్ శోర్ న్దన్బుకూరుం, అడియవర్ గట్కార్ అముతమానాన్ఱన్నై ,
కొఙ్గరుమ్బు శురపున్నై కురవార్ శోలై, క్కుழாవరివణ్డిశైపాడుం పాడల్ కేట్టు ,
తీఙ్గరుమ్బు కణ్ వళరుమ్ కழని శూழ் న్ద, తిరుక్కోవలూరదనుళ్ కణ్డేన్ నానే ll 1141
తాఙ్గ అరుమ్ పోర్= ఏ ఒక్కరిచేతను సహింపజాలని(భయంకరమైన)యుద్ధముచేయు సమర్ధతగల; మాలి = మాలియను రాక్షసుడు; పడ = మరణించునట్లు;పఱవై ఊర్ న్దు= గరుడాళ్వార్ ను నడిపించి; తరాతలత్తు ఓర్ కుఱై ముడిత్త = ఈ భూమిపైగల ఒక కొరతను తీర్చిన; తన్మైయానై = గొప్ప స్వభావము గలవాడును; కణ్ నీర్ అరుమ్బి శోర్ న్దు = కన్నీళ్లు దారదారలుగ పెరుగుచు(ఆనంద బాష్పములతొ); అన్బు కూరుమ్= మిక్కిలి ప్రీతికలిగిన; అడియవర్ గట్కు= భక్తులకు; ఆఙ్గు = వారి హృదయమందు; ఆర్ అముతమ్ ఆనాన్ తన్నై = దివ్యమైన అమృతమువలె పరమభోగ్యునిగ నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని; కొఙ్గు అరుమ్బు = కొంగు పుష్పములతోను; శురపున్నై = శురపున్నై చెట్లతోను;కురవు= కురవు చెట్లతోను;ఆర్ = దట్టముగనున్న, శోలై = తోటలలో;కుழாమ్ వరివణ్డు=గుంపులుగుంపులుగ కూడి అందమైన తుమ్మెదలు; ఇశైపాడుం పాడల్ కేట్టు=(మధుపానముచేసి సంతోషముతో) రాగభరితముగ ఝంకారముచేయుచున్న పాటలను విని; తీమ్ కరుమ్బు కణ్ వళరుమ్=తీయని చెరకు మొక్కలు ఒక కణుపు అధికముగ పెరుగుచుండెడి; కయని శూழ் న్ద = పొలములతో చుట్టుకొనియున్న; తిరుక్కోవలూర్ అదనుళ్ కణ్డేన్ నానే = తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని.
ఏ ఒక్కరిచేతను సహింపజాలని(భయంకరమైన)యుద్ధముచేయు సమర్ధతగల మాలియను రాక్షసుడు మరణించునట్లు గరుడాళ్వార్ ను వాహనముగ చేసుకొని పోరుసలిపి ఈ భూమిపై భారమును తీర్చిన గొప్ప స్వభావము గలవాడును, తన సౌశీల్యము, సౌలభ్యము మొదలగు కళ్యాణగుణములను తలచుకొని ఆనంద బాష్పములతొ మిక్కిలి ప్రీతికలిగిన భక్తులకు,వారి హృదయమందు దివ్యమైన అమృతమువలె పరమభోగ్యునిగ నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని,కొంగు పుష్పములతోను, శురపున్నై,కురవు చెట్లతోను దట్టముగనున్న తోటలలో, గుంపులు గుంపులుగకూడి అందమైన తుమ్మెదలు మధుపానముచేసి సంతోషముతో రాగభరితమైన ఝంకారములచే తీయని చెరుకు మొక్కలు అధికముగ పెరుగుచుండెడి పొలములతో చుట్టుకొనియున్న తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని.
కఱైవళర్ వేల్కరన్ ముదలా క్కవన్దన్ వాలి, కణైయొన్ఱినాల్మడియ విలఙ్గై తన్నుళ్ ,
పిఱై యెయిర్ట్రువాళరక్కర్ శేనైయెల్లాం, పెరున్దగైయోడుడన్తుణిత్త పెమ్మాన్ఱన్నై ,
మఱైవళర ప్పుగழ் వళరమాడన్దోఱుం, మణ్డపం ఒణ్ దొళియనైత్తుం వారమోద ,
శిఱైయణైన్ద పొழிలణైన్ద తెన్ఱల్ వీశుం, తిరుక్కోవలూరదనుళ్ కణ్డేన్ నానే ll 1142
కఱై వళర్=రక్తపు మరకలు మిక్కుటముగ కలిగియున్న;వేల్=శూలాయుధముగల; కరన్ ముదలా=’కరన్ మొదలైన;కవన్దన్ వాలి=కబందుడు,వాలి మొదలగుప్రతిఒక్కరిని; కణై ఒన్ఱినాల్ మడియ = ఒక బాణముచే కడతేర్చియు;(పిదప)ఇలఙ్గై తన్నుళ్=లంకాపురిలో; పిఱై ఎయిఱు వాళ్ అరక్కర్ శేనై ఎల్లాం = చంద్రవంక వలె కోరలును, ఖడ్గములుగల రాక్షసుల సేననంతయును; పెరుమ్ తగైయోడు ఉడన్ = వారియొక్క ప్రభువైన రావణాసురునితో కూడ; తుణిత్త పెమ్మాన్ తన్నై = సమూలముగ అంతమొందించిన సర్వేశ్వరుని; మాడమ్ దోఱుమ్ = ప్రతి భవనములయందు; మఱై వళర = వేదములు ఘోషలతో; పుగழ் వళర=ఖ్యాతి పెరిగియున్నదియు;ఒణ్ దొళి=అందమైన వీధులలోగల మణ్డపం ఆనైత్తుమ్=అన్ని మండపములలో;వారమ్ ఓద=అభ్యాసముల ధ్వనులు కలిగియున్నదియు; శిఱై అణైన్ద పొழிల్ అణైన్ద తెన్ఱల్ వీశుం = లోతైన నీటి గుంటలు కలిగిన తోటలనుండి పరిమళభరితమైన దక్షిణగాలి వీచబడుచుండెడిదియు; తిరుక్కోవలూర్ అదనుళ్ కణ్డేన్ నానే = తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని.
రక్తపు మరకలు మిక్కుటముగ కలిగియున్న శూలాయుధముగల ‘కరన్’ మరియు కబందుడు, వాలి మొదలగు ప్రతిఒక్కరిని, ఒక బాణముచే కడతేర్చియు, పిదప లంకాపురిలో చంద్రవంక వలె కోరలును,ఖడ్గములుగల రాక్షసుల సేననంతయును వారియొక్క ప్రభువైన రావణాసురునితో కూడ సమూలముగ అంతమొందించిన సర్వేశ్వరుని, ప్రతి భవనములయందు వేదములు ఘోషలతో ఖ్యాతి పెరిగియున్నదియు, అందమైన వీధులలోగల అన్ని మండపములలో అభ్యాసముల ధ్వనులు కలిగియున్నదియు, లోతైన నీటి గుంటలుకలిగిన తోటలనుండి పరిమళభరితమైన దక్షిణగాలి వీచబడుచుండెడిదియు, తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని.
ఉఱియార్ న్ద నఱువెణ్ణైయొళియాల్ శెన్ఱు, అఙ్గుణ్డానై క్కణ్డాయ్ చ్చి యురలోడార్క,
తఱియార్ న్ద కరుఙ్గళిఱే పోలనిన్ఱు, తడమ్ కణ్గళ్ పనిమల్గుమ్ తన్మైయానై ,
వెఱియార్ న్ద మలర్మగళ్ నామంగై యోడు, వియన్ కలై ఎణ్ తోళినాల్విళఙ్గు, శెల్వ
చ్చెఱియార్ న్ద మణిమాడన్దిగழన్దు తోన్ఱుం, తిరుక్కోవలూరదనుళ్ కణ్డేన్ నానే ll 1143
ఒళియాల్ శెన్ఱు = తన చిరునవ్వుల దంతకాంతిచే చీకటిలో నడుచుకొని వెడలి;అఙ్గు= ఆయా ప్రదేశములందు; ఉఱి ఆర్ న్ద = ఉట్లలో భద్రముగ దాచిపెట్టిన; నఱు వెణ్ణై = మిక్కిలి సువాసనకలిగిన వెణ్ణను; ఉణ్డానై ఆయ్ చ్చి కణ్డు = దొంగతనముగ ఆరగించుచున్న వానిని యశోదాదేవి చూచి (కోపముతో ); ఉరలోడు ఆర్క = రోలుకు కట్టగ; తఱి ఆర్ న్ద కరుమ్ కళిఱు పోల నిన్ఱు = స్తంబమునకు కట్టబడిన నల్లని ఏనగువలె బంధింపబడియుండి; తడమ్ కణ్గళ్ పని మల్గుమ్ తన్మైయానై=విశాలమైన కన్నులునుండి కన్నీరు కార్చుచున్న అతి సుందరమైన స్వభావముగల సర్వేశ్వరుని;వెఱి ఆర్ న్ద మలర్ మగళ్= పరిమళ భరితమైన తామర పుష్పమందు ఉద్భవించిన శ్రీదేవితోడను; నామంగై యోడు = సరస్వతి తోడను;వియన్ కలై ఎణ్ తోళినాల్ = అందమైన లేడివాహనముగ గల అష్టభుజములు కలిగిన దుర్గతోడను; విలఙ్గు శెల్వమ్=ప్రకాశించు సంపదలతోడను;శెరి ఆర్ న్ద= ఒకటితోమరొకటి దగ్గరగ చేరియున్న; మణి మాడమ్ = రత్నమయమయిన భవనములతో; తిగழ் న్దు తోన్ఱుమ్ = మిక్కిలి ప్రకాశించుచున్నట్టి; తిరుక్కోవలూర్ అదనుళ్ కణ్డేన్ నానే = తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని.
తన చిరునవ్వుల దంతకాంతిచే చీకటిలో నడుచుకొని వెడలి ఆయాప్రదేశములందు ఉట్లలో భద్రముగ దాచిపెట్టిన సువాసనకలిగిన వెణ్ణను దొంగతనముగ ఆరగించుచున్నవానిని యశోదాదేవి చూచి కోపగించి రోలుకు కట్టగ, స్తంబమునకు కట్టబడిన నల్లని ఏనగువలె బంధింపబడియుండి, విశాలమైన కన్నులునుండి కన్నీరు కార్చుచున్న అతి సుందరమైన స్వభావముగల సర్వేశ్వరుని, పరిమళభరితమైన తామర పుష్పమందు ఉద్భవించిన శ్రీదేవితోడను,సరస్వతితోడను,అందమైన లేడివాహనముగ గల అష్టభుజములు కలిగిన దుర్గతోడను,ప్రకాశించు సంపదలతోడను,ఒకటితోమరొకటి దగ్గరగ చేరియున్న రత్నమయమయిన భవనములతో మిక్కిలి ప్రకాశించుచున్నట్టి, తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని.
ఇరుంకైమ్మా కరిమునిన్దు పరియైక్కీఱి, యినవిడైగళ్ ఏழడర్తు మరుదంశాయ్ త్తు ,
వరుమ్ శగడమ్ ఇఱవుదైత్తు మల్లైయట్టు, వఞ్జమ్ శెయ్ కఞ్జనుక్కు నఞ్జానానై ,
కరుంకముగు పశుమ్ పాళై వెణ్ ముత్తీన్ఱు, కాయెల్లాం మరగతమాయ్ ప్పవళంకాట్ట,
శెరున్ది మిగ మొట్టలర్తుమ్ తేన్ కొళ్ శోలై, త్తిరుక్కోవలూరదనుళ్ కణ్డేన్ నానే ll 1144
ఇరు కై మా కరి మునిన్దు = పొడుగైన తొండముగల పెద్ద కువలయాపీడమను ఏనుగుపై కోపగించి అంతమొందించి; పరియై కీఱి = అశ్వరూపములో వచ్చిన కేశియను అశురునియొక్క నోటిని చీల్చి; ఇన విడైగళ్ ఏழ் అడర్తు = ఒకటినిమించినమరియొకటి బలిష్ఠమైన ఏడు వృషభములను వధించి; మరుదం శాయ్ త్తు=రెండు మద్ది వృక్షములు విరిచి క్రిందపడవైచి; వరుమ్ శగడమ్ ఇఱ ఉదైత్తు=తనపై దొర్లుకొని వచ్చిన శకటమును ఛిన్నభిన్నమగునట్లు దివ్యమైన కాలుతో తన్ని; మల్లై అట్టు=మల్లవీరులను చంపి;వఞ్జమ్ శెయ్ కఞ్జనుక్కు నఞ్జు ఆనానై=వంచనచే చంపదలచిన కంసునికి విషమై సంహరించిన సర్వేశ్వరుని; కరుమ్ కముగు = నల్లని పోకచెట్లయొక్క;పశుమ్ పాళై = లేత పూబాళలు; వెణ్ ముత్తు ఈన్ఱు=తెల్లని ముత్యములు యొసగుచు;కాయెల్లాం మరగతమాయ్ = వాటి కాయలంతయు మరకతములవలె ప్రకాశించుచు; (వాటి పండ్లు) పవళం కాట్ట = పగడములను స్పురింపజేయు చుండునదియు;శెరున్ది మొట్టు మిగ అలర్తుమ్ = శురపున్నై మొగ్గలు మిక్కిలి వికసించియుండునదియు;తేన్ కొళ్ శోలై = తేనెలతోనిండిన తోటలుగల;తిరుక్కోవలూర్ అదనుళ్ కణ్డేన్ నానే = తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని.
పొడుగైన తొండముగల పెద్ద కువలయాపీడమను ఏనుగుపై కోపగించి అంతమొందించి, అశ్వరూపములో వచ్చిన కేశియను అశురునియొక్క నోటిని చీల్చి, ఒకటినిమించిన మరియొకటి బలిష్ఠమైన ఏడు వృషభములను వధించి, రెండు మద్ది వృక్షములు నడుమ పాకి వాటిని విరిచి క్రిందపడవైచి, తనపై దొర్లుకొని వచ్చిన శకటమును ఛిన్నభిన్నమగునట్లు దివ్యమైన కాలుతో తన్ని, మల్లవీరులను చంపి, వంచనచే చంపదలచిన కంసునికి విషమై సంహరించిన సర్వేశ్వరుని, నల్లని పోక చెట్లయొక్క లేత పూబాళలు తెల్లని ముత్యములు యొసగుచు,వాటి కాయలంతయు మరకతములవలె ప్రకాశించుచు, వాటి పండ్లు పగడములను స్పురింపజేయు చుండునదియు, శురపున్నై మొగ్గలు మిక్కిలి వికసించియుండునదియు, తేనెలతోనిండిన తోటలుగల తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని.
** పార్ ఏఱు పెరుం బారంతీర, ప్పణ్డుపారతత్తు త్తూదియఙ్గి, పార్తన్ శెల్వ
త్తేరేఱు శారదియాయెదిర్ న్దార్ శేనై, శెరుకళత్తు త్తిఱలழிయ చ్చెర్ట్రాన్దన్నై ,
పోరేఱొన్ఱుడైయానుం అళగై క్కోనుం, పురన్దరనుం నాన్ముగనుం పొరున్దుమూర్పోల్,
శీరేఱు మఱైయాళర్ నిఱైన్ద, శెల్వ తిరుక్కోవలూరదనుళ్ కణ్డేన్ నానే ll 1145
పార్ ఏఱు పెరుం బారం తీర = భూమిపై పెరుగుచున్న భారము పోవునట్లు; పణ్డు = మునుపు ఒక కాలమున; పారతత్తు = మహాభారతయుద్దమునకు ముందు; త్తూదు ఇయఙ్గి=దూతగ రాయబారము చేసినవాడును;పార్తన్ శెల్వ తేర్ ఏఱు శారది ఆయ్=అర్జునుని యొక్క అందమైన రథముపై శ్రేష్ఠమైన సారధియై;ఎదిర్ న్దార్ శేనై=ఎదిరించిన శత్రువుల సేనను; శెరు కళత్తు =యుద్ధభూమిలో; త్తిఱల్ అழிయ = వారి బలము క్షీణించునట్లు;శెర్ట్రాన్ తన్నై = సంపూర్ణముగ పతనముచేసిన సర్వేశ్వరుని;పోర్ ఏఱు ఒన్ఱు ఉడైయానుం = యుద్ధమునకు సంసిద్ధమైయుండు ఒక వృషభమును వాహనముగ గల శివుడును;అళగై కోనుమ్= కుబేరుడును;పురన్దరనుమ్=ఇంద్రుడును;నాన్ముగనుమ్=చతుర్ముఖ బ్రహ్మయు; పొరున్దుమ్ ఊర్ పోల్=నిత్యవాసము చేయుచున్న పైలోకమందలి ప్రదేశముల వలె నున్నదియు;శీర్ ఏఱు మఱైయాళర్ నిఱైన్ద=సద్గుణములు కలిగిన బ్రాహ్మణోత్తములతో నిండిన; శెల్వ తిరుక్కోవలూరదనుళ్ కణ్డేన్ నానే = సిరిసంపదలతో తులతూగుచున్న తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని.
భూమిపై పెరుగుచున్న భారము పోవునట్లు మునుపు ఒక కాలమున మహాభారతయుద్దమునకు ముందు దూతగ రాయబారము చేసినవాడును, అర్జునుని యొక్క అందమైన రథముపై శ్రేష్ఠమైన సారధియై ఎదిరించిన శత్రువుల సేనను యుద్ధ భూమిలో వారి బలము క్షీణించునట్లు సంపూర్ణముగ పతనముచేసిన సర్వేశ్వరుని, యుద్ధమునకు సంసిద్ధమైయుండు ఒక వృషభమును వాహనముగగల శివుడును, కుబేరుడును,ఇంద్రుడును, చతుర్ముఖ బ్రహ్మయు,నిత్యవాసము చేయుచున్న పైలోకమందలి ప్రదేశముల వలె నున్నదియు, సద్గుణములు కలిగిన బ్రాహ్మణోత్తములతో నిండిన, సిరిసంపదలతో తులతూగుచున్న తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని.
తూవడివిల్ పార్ మగళ్ పూమంగై యోడు, శుడరాழி శఙ్గిరుపాల్ పొలిన్దుతోన్ఱ,
కావడివిల్ కఱ్పగమే పోలనిన్ఱు, కలన్దవర్ గట్కు అరుళ్ పురియుమ్ కరుత్తినానై ,
శేవడి కై తిరువాయ్ కణ్ శివన్ద వాడై, శెమ్బొన్ శెయ్ తిరువురువమానాన్తన్నై ,
తీవడివిల్ శివన్ అయనే పోల్వార్ మన్ను, తిరుక్కోవలూరదనుళ్ కణ్డేన్ నానే ll 1146
తూ వడివిల్=సుందరమైన రూపముగల; పార్ మగళ్ పూమంగై యోడు=శ్రీ భూదేవి, కమలవాసినితో కూడ; శుడర్ ఆழி శఙ్గు ఇరుపాల్ పొలిన్దు తోన్ఱ = తేజోవంతమైన సుదర్శనచక్రము, శంఖము తన ఇరుప్రక్కల ప్రకాశించుచుండగ; కా వడివిల్ కఱ్పగమ్ పోల నిన్ఱు = తోటలవలె పెరిగిన కల్పవృక్షమువలె నిలిచి; కలన్దవర్ గట్కు అరుళ్ పురియుమ్ కరుత్తినానై = తనను ఆశ్రయించిన వారికందరికి కృపజేయుచుండు దివ్యమైన హృదయము గలవాడును; శేవడి కై తిరువాయ్ కణ్ శివన్ద ఆడై= ఎర్రని దివ్య పాదములు, దివ్య హస్తములు, దివ్య అదరములు,దివ్య నేత్రములు;దివ్య పీతాంబరము వీటితొకూడ; శెమ్ పొన్ శెయ్ తిరువురువమ్ ఆనాన్ తన్నై=బంగారము వలె ప్రకాశించు తిరుమేనిగల సర్వేశ్వరుని; తీ వడివిల్ శివన్ అయనే పోల్వార్ మన్ను = అగ్నివలె రూపముగల శివుడు,బ్రహ్మ వలె లయము,సృష్ఠి చేయగల సమర్ధమైన మహానుభావులు నిత్యవాసము చేయుచున్న ; తిరుక్కోవలూర్ అదనుళ్ కణ్డేన్ నానే = తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని.
సుందరమైన రూపముగల శ్రీ భూదేవి, కమలవాసినితో కూడ తేజోవంతమైన సుదర్శనచక్రము, శంఖము తన ఇరుప్రక్కల ప్రకాశించుచుండగ, తోటలవలె పెరిగిన కల్పవృక్షమువలె నిలిచి తనను ఆశ్రయించిన వారికందరికి కృప జేయుచుండు దివ్యమైన హృదయము గలవాడును,ఎర్రని దివ్యపాదములు, దివ్య హస్తములు, దివ్య అదరములు,దివ్య నేత్రములు;దివ్య పీతాంబరము వీటితొకూడ, బంగారము వలె ప్రకాశించు తిరుమేనిగల సర్వేశ్వరుని,అగ్నివలె రూపముగల శివుడు, బ్రహ్మ వలె, లయము,సృష్ఠి చేయగల సమర్ధమైన మహానుభావులు నిత్యవాసము చేయుచున్న తిరుక్కోవలూర్ దివ్యదేశములో నేను సేవించుకొంటిని.
** వారణమ్ కొళ్ ఇడర్ కడిన్దమాలై, నీలమరగదత్తై మழை ముగలే పోల్వాన్ తన్నై ,
శీర్ అణఙ్గు మఱైయాళర్ నిఱైన్ద, శెల్వ త్తిరుక్కోవలూరదనుళ్ కణ్డేనెన్ఱు ,
వారణఙ్గుములై మడవార్ మంగైవేన్దన్, వాళ్ కలయనొలి యైన్దుమైన్దుమ్ వల్లార్,
కారణఙ్గళాల్ ఉలగమ్ కలన్దుఅఙ్గేత్త, కరన్దు ఎఙ్గుమ్ పరన్దానై కాణ్బర్ తామే ll 1147
వారణమ్ కొళ్ ఇడర్ కడిన్ద మాలై = గజేంద్రాళ్వార్ యొక్క దుఃఖమును పోగొట్టిన ఆశ్రిత వ్యామోహము గల స్వామియు; నీలమ్ మరగదత్తై మழைముగలే పోల్వాన్ తన్నై = నల్ల కలువవలెను,మరకతము వలెను,చల్లని మేఘమువలెను సుందరమైన, శ్రీ కృష్ణుని; శీర్ = తమ సద్గుణములతో; అణఙ్గు = అందరిచే కోరబడెడి; మఱైయాళర్ నిఱైన్ద = వైదికోత్తముల సమృద్ధికలిగి;శెల్వమ్=సిరిసంపదలతో తులతూగుచున్న;తిరుక్కోవలూర్ అదనుళ్ కణ్డేన్ ఎన్ఱు=తిరుక్కోవలూర్ దివ్యదేశములో సేవించుకొంటినని; వార్ అణఙ్గు ములై మడవార్ మంగై వేన్దన్ = వస్త్రముతో అందముగ కట్టుకొనిన వక్షోజములుగల స్త్రీలు వసించుచున్న తిరుమంగై దేశమునకు ప్రభువైన; వాళ్ కలయన్ = కత్తి ఆయధముగగల తిరుమంగై ఆళ్వార్;ఒలి=అనుగ్రహించిన;ఐన్దుమ్ ఐన్దుమ్ వల్లార్ తామ్ = ఈ పది పాసురములు అనుసంధించువారు; ఉలగమ్ = లోకమందలి పలురకములైన అధికారులు; కారణఙ్గళాల్ = తమతమ ఇష్టమైన ఫలములు పొందు కారణముగ; కలన్దుఅఙ్గు ఏత్త = గుంపులుగుంపులుగ వచ్చి స్తుతించుచుండెడి; కరన్దు ఎఙ్గుమ్ పరన్దానై = ఏ ఒక్కరిచేతను కనబడని విధముగ అన్ని ప్రదేశము లందును వ్యాపించియుండు సర్వేశ్వరుని, కాణ్బర్ = దర్శించుదురు.
గజేంద్రాళ్వార్ యొక్క దుఃఖమును పోగొట్టిన ఆశ్రిత వ్యామోహముగల స్వామియు, నల్ల కలువవలెను,మరకతము వలెను,చల్లని మేఘమువలెను సుందరమైన, శ్రీ కృష్ణుని, తమ సద్గుణములతో అందరిచే కోరబడెడి వైదికోత్తముల సమృద్ధికలిగి, సిరిసంపదలతో తులతూగుచున్న తిరుక్కోవలూర్ దివ్యదేశములో సేవించుకొంటినని, వస్త్రముతో అందముగ కట్టుకొనిన వక్షోజములుగల స్త్రీలు వసించుచున్న తిరుమంగై దేశమునకు ప్రభువైన కత్తి ఆయధముగగల తిరుమంగై ఆళ్వార్, అనుగ్రహించిన ఈ పది పాసురములు అనుసంధించువారు,లోకమందలి పలురకములైన అధికారులు తమతమ ఇష్టమైన ఫలములు పొందు కారణముగ గుంపులుగుంపులుగ వచ్చి స్తుతించుచుండెడి, ఏ ఒక్కరిచేతను కనబడని విధముగ అన్నిప్రదేశములందును వ్యాపించియుండు సర్వేశ్వరుని, దర్శించుదురు.
*******
తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం
⭐⭐⭐