పెరియ తిరుమొழி-2వపత్తు (8)

శ్రీః 

8 . తిరిపురమ్ 

శ్రీమన్నారాయణుని చరణారవిందములందు పరమభక్తిలో లీనమై తిరుమంగై ఆళ్వార్  తన నిజస్థితిని కోల్పోయి పరకాలనాయకి అవస్థలో మనోవ్యధ పొందుచుండగ,  హృదయాంతరాళమందు ప్రత్యక్షమైన దివ్య మంగళమూర్తిని గాంచి; సంభ్రమాశ్చర్యముతో   “తమరెవరని ప్రశ్నింప”ఆ స్వామియొక్క దివ్యమైన వాక్కులను, తన దివ్యదర్శనమును, పరకాలనాయకి,తమ తల్లికి, సఖులకు తెలియజేయుచున్నారు. 

** తిరిపురమూన్ఱెరిత్తానుమ్, మర్ట్రై మలర్ మిశై మేలయనుమ్ వియప్ప ,

మురి తిరై మాకడల్ పోల్ ముழఙ్గి, మూవులగమ్ ముఱైయాల్ వణఙ్గ,

ఎరియనకేశర వాళ్ ఎయిర్ట్రోడు, ఇరణియనాగమ్ ఇరణ్డు కూఱా ,

అరియురువామ్ ఇవర్ ఆర్ కొల్ ఎన్న, అట్టపుయకరత్తేన్ ఎన్ఱారే ll 1118

తిరి పురమ్ మూన్ఱు ఎరిత్తానుమ్ = త్రిపురములను దహింపజేసిన శివుడును; మర్ట్రై మలర్ మిశై మేల్ అయనుమ్ = మరియు తామర పుష్పమందు పుట్టిన ఖ్యాతికలిగిన చతుర్ముఖ బ్రహ్మయు; వియప్ప = ఆశ్చర్యపడునట్లు; మురి తిరై మాకడల్ పోల్ ముழఙ్గి = అలలుకొట్టుచున్న మహాసముద్రమువలె (స్తోత్రములతో) ఘోషించుచు;మూవులగమ్ ముఱైయాల్ వణఙ్గ = మూడులోకములు తమతమ అధికారమునకు తగినట్లుగ క్రమములో సేవించుచుండగ; ఇరణియన్ ఆగమ్ ఇరణ్డు కూఱా =  హిరణ్యాసురునియొక్క శరీరమును రెండు బాగములగ చీల్చుటకు; ఎరి అన కేశరమ్ = నిప్పువలెనున్న జూలుతోడను; వాళ్ ఎయిర్ట్రోడు = కత్తివలెవాడియైన కోరలతో కూడియున్న; అరి ఉరు ఆమ్ ఇవర్ = నరసింహ రూపములో నున్నఈ మహాపురుషుని; ఆర్ కొల్ ఎన్న= తాము ఎవరని నేను అడుగగ;(దానికి బదులుగ వారు) అట్టపుయకరత్తేన్ = తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువని; ఎన్ఱారే = కృపతో సెలవిచ్చినారు.

త్రిపురములను దహింపజేసిన శివుడును,మరియు తామర పుష్పమందు పుట్టిన ఖ్యాతికలిగిన చతుర్ముఖ బ్రహ్మయు ఆశ్చర్యపడునట్లు, అలలుకొట్టుచున్న మహాసముద్రమువలె (స్తోత్రములతో ) ఘోషించుచు మూడులోకములు తమతమ అధికారమునకు తగినట్లుగ క్రమములో సేవించుచుండగ, హిరణ్యాసురునియొక్క శరీరమును రెండు బాగములగ చీల్చుటకు నిప్పువలెనున్న జూలుతోడను, కత్తివలె వాడియైన కోరలతో కూడియున్న, నరసింహ రూపములో నున్న ఈ మహాపురుషుని ” తాము ఎవరని నేను అడుగగ (దానికి బదులుగ వారు),” తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువునని కృపతో సెలవిచ్చినారు.

వెన్దిఱల్ వీరరిల్ వీరరొప్పార్, వేదముఱైత్తు ఇమైయోర్ వణఙ్గుమ్,

శెన్దమిழ் పాడువార్ తామ్ వణఙ్గుమ్,  తేవరివర్కొల్ తెరిక్కమాట్టేన్ ,

వన్దుకుఱళురువాయ్ నిమిర్ న్దు, మావలి వేళ్వియిల్ మణ్ణళన్ద ,

అన్దణర్ పోన్ఱ ఇవరార్ కొలెన్న, అట్టపుయకరత్తేన్ ఎన్ఱారే ll 1119

ఇమైయోర్ = బ్రహ్మాదిదేవతలు; వేదమ్ ఉఱైత్తు = వేదములు పఠించుచు; వణఙ్గుమ్= సేవించుచుండెడి; వెమ్ తిఱల్ వీరరిల్ వీరర్ ఒప్పార్ ఇవర్ = మిక్కిలి బలశాలులైన వీరులలో మహావీరుడు శ్రీ రామునివలె ఒప్పుచున్న ఈ మహాపురుషుని; శెమ్ తమి் పాడువార్ తామ్ వణఙ్గుమ్ తేవర్ ఇవర్ కొల్ = అందమైన తమిళ భాషలో పాశురములను పాడిన మొదటి ముగ్గురు ఆళ్వారులు సేవించుకొన్న శ్రీవేంకటేశ్వర స్వామియో వీరుయని; తెరిక్కమాట్టేన్ = తెలుసుకొనశఖ్యముకాదు; మావలి వేళ్వియిల్=మహాబలి యాగభూమి వద్దకు;కుఱళ్ ఉరువాయ్ వన్దు=వామన రూపముతో వచ్చి;నిమిర్ న్దు = ( ఆ మహాబలినుండి దానజలమును స్వీకరించిన వెంటనే ) త్రివిక్రముడుగ పెరిగి;మణ్ణళన్ద= భూమండలమును కొలిచిన; అన్దణర్ పోన్ఱ ఇవర్=బ్రహ్మచారి వలెనున్నఈ మహాపురుషుని; ఆర్ కొల్ ఎన్న= తాము ఎవరని నేను అడుగగ;(దానికి బదులుగ వారు) అట్టపుయకరత్తేన్ = తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువని; ఎన్ఱారే = కృపతో  సెలవిచ్చినారు.

బ్రహ్మాదిదేవతలు వేదములు పఠించుచు సేవించుచుండెడి మిక్కిలి బలశాలులైన వీరులలో మహావీరుడు శ్రీ రామునివలె ఒప్పుచున్న ఈ మహాపురుషుని, “అందమైన తమిళ భాషలో పాశురములను పాడిన మొదటి ముగ్గురు ఆళ్వారులు సేవించుకొన్న శ్రీవేంకటేశ్వర స్వామియో వీరు” అని తెలుసుకొనశఖ్యముకాదు,మహాబలి యాగభూమివద్దకు వామన రూపముతో వచ్చి, ఆ మహాబలినుండి దానజలమును స్వీకరించిన వెంటనే  త్రివిక్రముడుగ పెరిగి భూమండలమును కొలిచిన బ్రహ్మచారి వలెనున్న ఈ మహాపురుషుని ” తాము ఎవరని నేను అడుగగ” (దానికి బదులుగ వారు) తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువునని కృపతో సెలవిచ్చినారు.

శెమ్బొనిలఙ్గు వలఙ్గైవాళి, తిణ్ శిలై తణ్డొడు శఙ్గమ్ ఒళ్ వాళ్ ,

ఉమ్బర్ ఇరుశుడర్ ఆழிయోడు, కేడగమ్ ఒణ్ మలర్ పర్ట్రియెర్టే ,

వెమ్బు శినత్తడల్ వేழమ్ వీழ, వెణ్ మరుప్పొన్ఱు పఱిత్తు, ఇరుణ్డ

అమ్బుదమ్బోన్ఱు ఇవరార్ కొలెన్న, అట్టపుయకరత్తేన్ ఎన్ఱారే ll 1120

వలమ్ కై = తన దివ్యమైన కుడిచేతిలో; ఇలఙ్గు = ప్రకాశించు; శెమ్ పొన్ = మేలిమి బంగారముతో చేయబడిన; వాళి = బాణములు; తిణ్ శిలై = దృఢమైన శార్ఙ్గమను విల్లును; తణ్డొడు=కౌమోదికియను గదతొకూడ; శఙ్గమ్ = శ్రీ పాంచజన్యమను శంఖమును; ఒళ్ వాళ్ = ప్రకాశవంతమైన నందకమను కత్తియును; ఉమ్బర్= వీటికన్నింటికిని మించి; ఇరు శుడర్ = మిక్కిలి తేజస్సుకలిగిన; ఆழிయోడు= చక్రాయుధముతొ కూడ; కేడగమ్ = డాలును; ఒణ్ మలర్ = సుందరమైన పుష్పమును; పర్ట్రి = ధరించి; వెమ్బు శినత్తు అడల్ వేழమ్ వీழ = మిక్కిలి కోపముతోనున్న శక్తివంతమైన కువలయాపీడమను ఏనుగు హతమగునట్లు; వెణ్ మరుప్పు ఒన్ఱు పఱిత్తు = దాని తెల్లని దంతమును పెరికిన వాడును ; ఇరుణ్డ అమ్బుదమ్ పోన్ఱు ఇవర్ = కాలమేఘవర్ణమువలె తిరుమేనిగల ఈ మహాపురుషుని;ఆర్ కొల్ ఎన్న= తాము ఎవరని నేను అడుగగ; (దానికి బదులుగ వారు) అట్టపుయకరత్తేన్ = తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువని; ఎన్ఱారే = కృపతో సెలవిచ్చినారు.

  తన దివ్యమైన కుడిచేతిలో ప్రకాశించు మేలిమి బంగారముతో చేయబడిన బాణములు,దృఢమైన శార్ఙ్గమనువిల్లును, కౌమోదికియను గదతొకూడ శ్రీ పాంచజన్యమను శంఖమును, ప్రకాశవంతమైన నందకమను కత్తియును, వీటికన్నింటికిని మించి మిక్కిలి తేజస్సుకలిగిన చక్రాయుధముతొ కూడ డాలును, సుందరమైన పుష్పమును ధరించినవాడును,  మిక్కిలి కోపముతోనున్న శక్తివంతమైన కువలయాపీడమను ఏనుగు హతమగునట్లు దాని తెల్లని దంతమును పెరికిన కాలమేఘ వర్ణమువలె తిరుమేనిగల ఈ మహాపురుషుని  ” తాము ఎవరని నేను అడుగగ” (దానికి బదులుగ వారు) తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువునని కృపతో సెలవిచ్చినారు.

మఞ్జుయర్ మామణిక్కున్ఱమేన్ది, మామழைకాత్తు ఒరుమాయవానై

అఞ్జ, అదన్ మరుప్పన్ఱు వాఙ్గుమ్, ఆయర్ కొల్ మాయమఱియమాట్టేన్ ,

వెఞ్జుడరాழிయుమ్ శఙ్గుమేన్ది, వేదమున్ ఓదువర్ నీతి వానత్తు ,

అఞ్జుడర్ పోన్ఱ ఇవరార్ కొలెన్న, అట్టపుయకరత్తేన్ ఎన్ఱారే ll 1121

మఞ్జు ఉయర్ = మేఘమండలము వరకు ఎదిగియున్న; మా మణి క్కున్ఱమ్ ఏన్ది= శ్లాఘ్యమైన రత్నములతొకూడిన గోవర్ధనపర్వతమును (గొడుగు వలె) పైకెత్తి పట్టుకొని;మా మழை కాత్తు=పెద్ద వర్షధారలను అడ్డగించియు;అన్ఱు=కంసుని కోటలో ప్రవేశంచెడి సమయమున; ఒరు మాయమ్ ఆనై=సాటిలేని ఆశ్చర్యకరమైన కంసునిచే ప్రేరేరింపబడిన కువలయాపీడమను ఏనుగు; అఞ్జ = భయపడునట్లు; అదన్ మరుప్పు వాఙ్గుమ్ = దాని దంతమును విరిచిన; ఆయర్ కొల్ = శ్రీ గోపాలకృష్ణుడో?; మాయమ్ అఱియమాట్టేన్= వాని ఆశ్చర్యచేష్టితములు తెలుసుకొనలేను; వెమ్ శుడర్ ఆழிయుమ్ శఙ్గుమ్ ఏన్ది = తీక్షణమైన ప్రకాశముగల సుదర్శనచక్రమును, శ్రీ పాంచజన్యమను శంఖమును ధరించి;   మున్ వేదమ్ ఓదువర్ = తన ముంగిట వేదములు పఠింపబడుచు; నీది వానత్తు అమ్ శుడర్ పోన్ఱ ఇవర్=సక్రమమైన పరమపదమునందు వేంచేసియున్న పరంజ్యోతి స్వరూపునివలె నున్న ఈ మహాపురుషుని;ఆర్ కొల్ ఎన్న= తాము ఎవరని నేను అడుగగ; (దానికి బదులుగ వారు) అట్టపుయకరత్తేన్ = తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువని; ఎన్ఱారే = కృపతో సెలవిచ్చినారు.

మేఘమండలము వరకు ఎదిగియున్న శ్లాఘ్యమైన రత్నములతొకూడిన గోవర్ధనపర్వతమును (గొడుగు వలె) పైకెత్తి పట్టుకొని పెద్ద వర్షధారలను అడ్డగించియు, కంసుని కోటలో ప్రవేశంచెడి సమయమున సాటిలేని ఆశ్చర్యకరమైన కంసునిచే ప్రేరేరింపబడిన కువలయాపీడమను ఏనుగు భయపడునట్లు దాని దంతమును విరిచిన శ్రీ గోపాలకృష్ణుడో?, వాని ఆశ్చర్యచేష్టితములు తెలుసుకొనలేను, తీక్షణమైన ప్రకాశముగల సుదర్శనచక్రమును, శ్రీ పాంచజన్యమను శంఖమును ధరించి తన ముంగిట వేదములు పఠింపబడుచు, పరమపదమునందు వేంచేసియున్న పరంజ్యోతి స్వరూపునివలెనున్న ఈ మహాపురుషుని ” తాము ఎవరని నేను అడుగగ” (దానికి బదులుగ వారు) తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువునని కృపతో సెలవిచ్చినారు.

** కలైకళుమ్ వేదముమ్ నీదినూలుమ్, కఱ్పముమ్ శొల్ పొరుళ్ తానుమ్, మర్ట్రై

నిలైగళుమ్ వానవర్కుమ్ పిఱర్కుమ్, నీర్మైనాల్ అరుళ్ శెయ్ దు, నీణ్డ

మలైగళుమ్ మామణియుమ్, మలర్మేల్ మఙ్గైయుమ్ శఙ్గముమ్ తఙ్గుగిన్ఱ,

అలైకడల్ పోన్ఱ ఇవరార్ కొలెన్న, అట్టపుయకరత్తేన్ ఎన్ఱారే ll 1122

కలైగళుమ్=వేదాంతములును; వేదముమ్=వేదములును; నీదినూలుమ్ = ఇతిహాసములును; కఱ్పముమ్ = కల్ప సూత్రములను;శొల్=వ్యాకరణ శాస్త్రములును; పొరుళ్ తానుమ్ = మీమాంస శాస్త్రములును; మర్ట్రై = మరియు; నిలైగళుమ్ = (ఈ శాస్త్రములు అనసరించువారికి) ఉచితమగు స్థానములను;వానవర్కుమ్ పిఱర్కుమ్= దేవతలకును,మనుష్యులకును; నీర్మైనాల్ అరుళ్ శెయ్ దు = కృపతో ఒసగుచుండు; నీణ్డ మలైగళుమ్ మా మణియుమ్ మలర్మేల్ మఙ్గైయుమ్ శఙ్గముమ్ తఙ్గుగిన్ఱ అలైకడల్ పోన్ఱ ఇవర్=పెద్ద పర్వతమువలె భుజములు,శ్లాఘ్యమైన కౌస్తుభమణియు, కమలవాసిని శ్రీదేవియు,శ్రీపాంచజన్యమును,ఎల్లప్పుడును చేరియున్న అలలు కొట్టుచున్న సముద్రము పోలిన ఈ మహాపురుషుని;ఆర్ కొల్ ఎన్న= తాము ఎవరని నేను అడుగగ; (దానికి బదులుగ వారు) అట్టపుయకరత్తేన్ = తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువని; ఎన్ఱారే = కృపతో సెలవిచ్చినారు.

  వేదాంతములును,వేదములను,ఇతిహాసములును,కల్ప సూత్రములను, వ్యాకరణ శాస్త్రములును, మీమాంస శాస్త్రములును మరియు ఈ శాస్త్రములు అనసరించువారికి ఉచితమగు స్థానములను, దేవతలకు,మనుష్యులకు కృపతో ఒసగుచుండు పెద్ద పర్వతమువలె భుజములు,శ్లాఘ్యమైన కౌస్తుభమణియు, కమలవాసిని శ్రీదేవియు,శ్రీపాంచజన్యమును,ఎల్లప్పుడును చేరియున్న అలలు కొట్టుచున్న సముద్రము పోలిన ఈ మహాపురుషుని ” తాము ఎవరని నేను అడుగగ” (దానికి బదులుగ వారు) తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువునని కృపతో సెలవిచ్చినారు.

ఎఙ్గనుమ్ నామివర్ వణ్ణమెణ్ణిల్, ఏదుమఱికిలమ్ ఏన్దిழைయార్ ,

శఙ్గుమ్ మనముమ్ నిఱైవుమెల్లామ్, తమ్మనవాగప్పుగున్దు, తాముమ్

పొఙ్గు కరుఙ్గడల్ పూవైకాయా, ప్పోదవిழ் నీలమ్ పునైన్దమేగమ్ ,

అఙ్గనమ్ పోన్ఱ ఇవరార్ కొలెన్న, అట్టపుయకరత్తేన్ ఎన్ఱారే ll 1123

నామ్ ఇవర్ వణ్ణమ్=మనము వీరియొక్క గుణములు, విధానములు;ఎఙ్గనుమ్ ఎణ్ణిల్= ఏ విధముగనైన తెలుసుకొనుటకు చూచినను; ఏదుమ్ అఱికిలమ్ = కొంచమైనను  తెలుసుకొనలేము; ఏన్దు ఇழைయార్ = ఆభరణములు ధరించియున్న స్త్రీలయొక్క; శఙ్గుమ్ = కంకణములు; మనముమ్ = హృదయము; నిఱైవుమ్ ఎల్లామ్ = వినయము  మొదలగు వన్నియు; తమ్మన ఆగ = తనదిగనే తలచి; పుగున్దు = ఇచటకు వచ్చి చేరిన; పొఙ్గు కరుమ్ కడల్=అలలుకొట్టుచున్న నల్లని సముద్రమువలె;పూవై = అతసీ పుష్పము వలె; కాయా = ‘కాయా’ పుష్పమువలె; పోదు అవిழ் నీలమ్=సార్వత్రికముగ  వికసించిన నల్లని కలువవలె; పునైన్ద మేగమ్ = అందమైన మేఘమువలె; అఙ్గనమ్ పోన్ఱ ఇవర్ తామ్ = వీటి వలె పోలిన  ఈ మహాపురుషుని; ఆర్ కొల్ ఎన్న= తాము ఎవరని నేను అడుగగ; (దానికి బదులుగ వారు) అట్టపుయకరత్తేన్ = తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువని; ఎన్ఱారే = కృపతో సెలవిచ్చినారు.

మనము వీరియొక్క గుణములు, విధానములు,ఏ విధముగనైన తెలుసుకొనుటకు చూచినను, కొంచమైనను తెలుసుకొనలేము. ఆభరణములు ధరించియున్న స్త్రీలయొక్క కంకణములు, హృదయము, వినయము మొదలగు వన్నియు తనదిగనే తలచి, ఇచటకు వచ్చి చేరిన, అలలుకొట్టుచున్న నల్లని సముద్రమువలె,అతసీ పుష్పము వలె, ‘ కాయా ‘ పుష్పమువలె, వికసించిన నల్లని కలువవలె,అందమైన మేఘమువలె,మొదలగు వీటి వలె పోలిన  ఈ మహాపురుషుని ” తాము ఎవరని నేను అడుగగ” (దానికి బదులుగ వారు) తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువునని కృపతో సెలవిచ్చినారు.

ముழுశి వణ్డాడియ తణ్డుழாయిన్, మొయ్ మ్మలర్ కణ్ణియుమ్ మేని,యమ్ శాన్ది

ఇழுశియ కోలమిరున్దవాఱుమ్, ఎఙ్గనమ్ శొల్లుగేన్ ఓవినల్లార్  ,

ఎழுదియ తామరైయన్న కణ్ణుమ్, ఏన్దెழிల్ ఆకముమ్ తోళుమ్ వాయుమ్,

అழగియదామివరార్ కొలెన్న, అట్టపుయకరత్తేన్ ఎన్ఱారే ll 1124

వణ్డు ముழுశి ఆడియ = తుమ్మెదలు తేనెలో మునిగి మిక్కిలి సంతోషముతో నృత్యము చేయుచున్న;  తణ్ తుழாయిన్ = చల్లని తులసీదళములచే; మొయ్ = దట్టముగ కట్టబడిన; మలర్ కణ్ణియుమ్ ఇరున్ద ఆఱుమ్=పూమాలతో అలంకృతమైన విధమును; మేని=తిరుమేనిపై;అమ్ శాన్దు ఇழுశియ కోలమ్ ఇరున్ద ఆఱు=అందమైన చందనముతో  పూయబడిన అలంకారమున్న విధమును;ఎఙ్గనమ్ శొల్లుగేన్ = ఎటుల సంపూర్ణముగ వర్ణించగలను; ఓవినల్లార్ = చిత్రముగీయగల సమర్ధులు; ఎழுదియ = గీసిన; తామరై అన్న కణ్ణుమ్ = తామర పూదళముల వలె దివ్యమైన నేత్రములును; ఏన్దు ఎழிల్ ఆగముమ్ = మిక్కిలి సుందరమైన వక్షస్థలమును; తోళుమ్=దివ్యమైన భుజములును; వాయుమ్ = దివ్యమైన అధరములును; అழగియదు ఆమ్ ఇవర్ = ఆ సౌందర్యమే కలిగిన ఈ మహాపురుషుని; ఆర్ కొల్ ఎన్న= తాము ఎవరని నేను అడుగగ; (దానికి బదులుగ వారు) అట్టపుయకరత్తేన్ = తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువని; ఎన్ఱారే = కృపతో సెలవిచ్చినారు.

        తుమ్మెదలు తేనెలో మునిగి మిక్కిలి సంతోషముతో నృత్యము చేయుచున్న చల్లని తులసీదళములచే దట్టముగ కట్టబడిన పూమాలతో అలంకృతమైన విధమును, తిరుమేనిపై అందమైన చందనముతో పూయబడిన అలంకారమున్న విధమును,ఎటుల సంపూర్ణముగ వర్ణించగలను. చిత్రము గీయగల సమర్ధులు గీసిన,తామర పూదళముల వలె దివ్యమైన నేత్రములును,మిక్కిలి సుందరమైన వక్షస్థలమును,దివ్యమైన భుజములును,దివ్యమైన అధరములును,ఆ సౌందర్యమే కలిగిన ఈ మహాపురుషుని  “తాము ఎవరని నేను అడుగగ” (దానికి బదులుగ వారు) తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువునని కృపతో సెలవిచ్చినారు.

మేవియెప్పాలుమ్ విణ్ణోర్ వణఙ్గ, వేదమురైప్పర్ మున్నీర్ మడన్దై

తేవి, అప్పాల్ అదిర్ శఙ్గమ్ ఇప్పాల్ శక్కరమ్, మర్ట్రివర్ వణ్ణమెణ్ణిల్ ,

కావియొప్పార్ కడలేయుమొప్పార్, కణ్ణుం వడివుం నెడియరాయ్, ఎన్

ఆవియొప్పార్ ఇవరార్ కొలెన్న, అట్టపుయకరత్తేన్ ఎన్ఱారే ll 1125

విణ్ణోర్ = నిత్యశూరులు; ఎప్పాలుమ్ మేవి = అన్ని వైపుల చుట్టుకొని ; వణఙ్గ = సేవించుచుండగ;వేదమ్ ఉరైప్పర్= వేదములను నుడువుచున్నారు; మున్నీర్ మడన్దై=సముద్రమున ఉద్భవించిన కమలవాసిని; దేవి = పట్టమహిషి సమీపమందే ప్రకాశించు చున్నారు; అదిర్ శఙ్గముమ్ అప్పాల్ = ఘోషించెడి శ్రీపాంచజన్యము ఎడమవైపును; శక్కరమ్ ఇప్పాల్ = సుదర్శనచక్రము కుడివైపును ఉన్నది; మర్ట్రు = ఇదియునుగాక; ఇవర్ వణ్ణమ్ ఎణ్ణిల్=వీరియొక్క తిరుమేని సౌందర్యమును పరిశీలించి చెప్పుట మొదలిడిన; కావి ఒప్పార్ = నల్ల కలువతో సమముగ ఉండును; కడలమ్ ఒప్పార్ =సముద్ర వర్ణముతో సమముగ ఉండును; కణ్ణుం వడివుం నెడియర్ ఆయ్ = నేత్ర సౌందర్యమందును, స్వరూప సౌందర్యమందును తనకు సాటిలేనివారును; ఎన్ ఆవి ఒప్పార్ ఇవర్ = నా ప్రాణ సమానమైన ఈ మహాపురుషుని; ఆర్ కొల్ ఎన్న= తాము ఎవరని నేను అడుగగ; (దానికి బదులుగ వారు) అట్టపుయకరత్తేన్ = తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువని; ఎన్ఱారే = కృపతో సెలవిచ్చినారు.

              నిత్యశూరులు అన్ని వైపుల చుట్టుకొని సేవించుచుండగ, ఈ మహాపురుషుడు వేదములను నుడువుచున్నారు,సముద్రమున ఉద్భవించిన కమలవాసిని, పట్టమహిషి సమీపమందే ప్రకాశించు చున్నారు, ఘోషించెడి శ్రీపాంచజన్యము ఎడమవైపును, సుదర్శనచక్రము కుడివైపును ఉన్నది, ఇదియునుగాక  వీరియొక్క తిరుమేని సౌందర్యమును పరిశీలించి చెప్పుట మొదలిడిన,నల్ల కలువతో సమముగ ఉండును, సముద్ర వర్ణముతో సమముగ ఉండును,నేత్రసౌందర్యమందును, స్వరూప సౌందర్యమందును తనకు సాటిలేనివారును, నా ప్రాణ సమానమైన ఈ మహాపురుషుని “తాము ఎవరని నేను అడుగగ” (దానికి బదులుగ వారు) తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువునని కృపతో సెలవిచ్చినారు.

తఞ్జమివర్కు ఎన్ వళైయుం నిల్లా, నెఞ్జముం తమ్మదే శిన్దిత్తేఱ్కు ,

వఞ్జి మరుఙ్గుల్ నెరుఙ్గనోక్కి, వాయ్ తిఱన్దు ఒన్ఱు పణిత్తదుణ్డు ,

నఞ్జముడైత్తు ఇవర్ నోక్కుమ్ నోక్కమ్, నానివర్ తమ్మై అఱియమాట్టేన్ ,

అఞ్జువన్ మర్ట్రివరార్ కొలెన్న, అట్టపుయకరత్తేన్ ఎన్ఱారే ll 1126

తఞ్జమ్ = నిశ్చయముగ; ఎన్ వళైయుం = నాయొక్క చేతి కంకణములు;ఇవర్కు నిల్లా=  ఈ మహాపురుషుని గాంచిన కారణమున నాచేతియందు నిలువటలేదు;శిన్దిత్తేఱ్కు=నేను పరిశీలించి చూచిన;నెఞ్జముం తమ్మదే=నా హృదయము వారికే అంకితమై యున్నది; వఞ్జి మరుఙ్గుల్ = నాయొక్క తీగవలెనున్న నడుము;నెరుఙ్గ నోక్కి =బలహీనమగునట్లు  చూచి; వాయ్ తిఱన్దు=తన నోరు తెరిచి; ఒన్ఱు పణిత్తదు ఉణ్డు=ఏవో మాటలు చెప్పినది ఉన్నది; ఇవర్ నోక్కుమ్ నోక్కమ్ = వీరు చూచెడి చూపులు; నఞ్జమ్ ఉడైత్తు = విషము కలసియున్నట్లు తీక్షణముగనున్నది;నాన్ ఇవర్ తమ్మై అఱియమాట్టేన్= నేను వీరియొక్క స్వభావము తెలుసుకొనలేకున్నాను;మర్ట్రు=మరియు;ఇవర్ = ఈ మహాపురుషుని; ఆర్ కొల్ ఎన్న= తాము ఎవరని అడుగుటకు;అఞ్జువన్=భయపడుచున్ననాతో;(స్వయముగ వారే) అట్టపుయకరత్తేన్ = తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువని; ఎన్ఱారే = కృపతో సెలవిచ్చినారు.

నిశ్చయముగ నాయొక్క చేతి కంకణములు ఈ మహాపురుషుని గాంచిన కారణమున నాచేతియందు నిలువటలేదు,నా హృదయము వారికే అంకితమై యున్నది.నాయొక్క తీగవలెనున్న నడుము బలహీనమగునట్లు చూచి, మైమరచి వినలేని స్థితిలో నున్న నాతో ఏవో మాటలు చెప్పినారు. వీరు చూచెడి చూపులు విషము కలసియున్నట్లు తీక్షణముగ నున్నది. నేను వీరియొక్క స్వభావము తెలుసుకొనలేకున్నాను. మరియు ఈ మహాపురుషుని, తాము ఎవరని అడుగటకు  భయపడుచున్న నాతో స్వయముగ వారే (భయమువలదని) తిరుఅట్టపుయకర క్షేత్రమునకు ప్రభువునని కృపతో సెలవిచ్చినారు.

** మన్నవర్ తొణ్డైయర్ కోన్ వణఙ్గుమ్, నీణ్ముడిమాలై వయిరమేగన్ ,

తన్ వలి తన్ పుగழ் శూழ் న్ద కచ్చి, అట్టపుయకరత్తాది తన్నై ,

కన్నినన్ మామదిళ్ మంగైయర్ వేన్దన్, కామరుశీర్ క్కలికన్ఱి, కున్ఱా

ఇన్నిశైయాల్ శొన్న శెఞ్జొల్ మాలై, ఏత్త వల్లార్కిడమ్ వైగున్దమే ll 1127

తొణ్డైయర్ కోన్ = తొణ్డైమండల వాసులకు ప్రభువైన; మన్నవన్ = మహారాజుచే; వణఙ్గుమ్ = సేవింపబడుచుండెడి; నీళ్ ముడి మాలై = పొడుగైన కిరీటముగల సర్వేశ్వరుడును; వయిరమేగన్ తన్ వలి తన్ పుగழ் శూழ் న్ద కచ్చి = వయిరమేగన్ మహారాజుయొక్క పరాక్రమము, అతని కీర్తియు అమితముగనున్న కాంచీపురములో; అట్టపుయకరత్తు ఆది తన్నై = తిరుఅట్టపుయకర దివ్యదేశమున కృపతో వేంచేసియున్నసమస్తమునకు కారణభూతుడైన సర్వేశ్వరుని విషయమై; కన్ని నల్ మా మదిళ్ మంగైయర్ వేన్దన్ = నాశనము చేయలేని మంచి పెద్ద ప్రాకారములుగల తిరుమంగై దేశమునకు ప్రభువును; కామరు శీర్ = అందరు ప్రేమించెడి కల్యాణగుణములు కలిగిన; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్; కున్ఱా ఇన్ ఇశైయాల్ శొన్న = ఎటువంటి దోషములేని  ఇంపైన రాగబద్ధముతో అనుగ్రహించిన; శెమ్ శొల్ మాలై = అందమైన పదములతో నిండియున్న ఈ పాశురములమాలను; ఏత్త వల్లార్కు = అనుసంధించు భక్తులకు; ఇడమ్ వైగున్దమే = కలుగు నిత్యవాసము పరమపదమే సుమా!.

  తొణ్డైమండల వాసులకు ప్రభువైన మహారాజుచే సేవింపబడుచుండెడి పొడుగైన కిరీటముగల సర్వేశ్వరుడును, వయిరమేగన్ మహారాజుయొక్క పరాక్రమము, అతని కీర్తియు అమితముగనున్న కాంచీపురములో, తిరుఅట్టపుయకర దివ్యదేశమున కృపతో వేంచేసియున్న, సమస్తమునకు కారణభూతుడైన సర్వేశ్వరుని విషయమై, దృఢమైన మంచి పెద్ద ప్రాకారములుగల తిరుమంగై దేశమునకు ప్రభువును, అందరు ప్రేమించెడి కల్యాణగుణములు కలిగిన తిరుమంగై ఆళ్వార్ ఎటువంటి దోషములేని ఇంపైన రాగబద్ధముతో అనుగ్రహించిన అందమైన పదములతో నిండియున్నఈ పాశురములమాలను అనుసంధించు భక్తులకు కలుగు నిత్యవాసము పరమపదమే సుమా!. 

***********

వ్యాఖ్యానించండి