శ్రీః
9 . శొల్లువన్ శొఱ్పొరుళ్
తిరుకచ్చియందు( కాంచీపురములో) నున్న ప్రసిద్ధమైన పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమందు కృపతో వేంచేసియున్న శ్రీ వైకుంఠ పెరుమాళ్ ను; తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు.
** శొల్లు వన్ శొల్ పొరుళ్ తానవైయాయ్, చ్చువైయూఱొలి నార్ట్రముమ్ తోర్ట్రముమాయ్,
నల్ అరన్ నారణన్ నాన్ముకనుక్కు, ఇడన్దాన్ తడమ్ శూழ் న్దழగాయకచ్చి ,
పల్లవన్ విల్లవనెన్ఱు ఉలగిల్, పలరాయ్ ప్పలవేన్దర్ వణఙ్గు కழల్
పల్లవన్, మల్లైయర్ కోన్ పణిన్ద, పరమేచ్చుర విణ్ణగరమదువే ll 1128
శొల్లు వన్ శొల్ పొరుళ్ అవై తాన్ ఆయ్ = సామాన్యశబ్ధములు, నిత్యమైన వేదములు వీటిఅర్ధములకు తానే నిర్వాకుడును; శువై ఊఱు ఒలి నార్ట్రముమ్ తోర్ట్రముమ్ ఆయ్=రసము,స్పర్శము,శబ్ధము, గంధము, రూపము మొదలగు ఐదు తత్వములకును తానే నిర్వాహకుడును; నల్ అరన్ నారణన్ నాన్ముకనుక్కు = లోకకల్యాణార్ధమై శివునకు అంతర్యామియై సంహారమును,తానే నారాయణునిగ రక్షకుడుగను, బ్రహ్మకు అంతర్యామియై సృష్ఠించుటను,సలుపుచున్న సర్వేశ్వరునియొక్క; ఇడమ్ = నివాస స్దానము; తడమ్ శూழ் న్ద అழగాయ కచ్చి=తటాకములతో చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో; ఉలగిల్ = ఈ లోకములో; పల్లవన్ విల్లవన్ ఎన్ఱు పలర్ ఆయ్ పల వేన్దర్ = పల్లవులు,విల్లవులు చెప్పబడు అనేక పేర్లతోనున్న పలు మహారాజులు; వణఙ్గు కழల్ = సేవించుచుండెడి చరణారవిందములు గలవాడును; మల్లైయర్ కోన్ పల్లవన్ = మల్లాపురియని చెప్పబడు తిరుకడల్ మల్లై దేశవాసులకు ప్రభువైన పల్లవరాజు; పణిన్ద= కైంకర్యముచేసుకొన్న; పరమేచ్చుర విణ్ణగరమదువే = పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా!
సామాన్యశబ్ధములు, నిత్యమైన వేదములు,వీటిఅర్ధములకు తానే నిర్వాకుడును,రసము,స్పర్శము,శబ్ధము,గంధము, రూపము మొదలగు ఐదు తత్వములకును తానే నిర్వాహకుడును, లోకకల్యాణార్ధమై శివునకు అంతర్యామియై సంహారమును,తానే నారాయణునిగ రక్షకుడుగను, బ్రహ్మకు అంతర్యామియై సృష్ఠించుటను, సలుపుచున్న సర్వేశ్వరునియొక్క నివాసస్దానము ( ఏదనగ ), తటాకములతో చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో, పల్లవులు, విల్లవులు చెప్పబడు అనేక పేర్లతోనున్న పలు మహారాజులు సేవించుచుండెడి చరణారవిందములు గలవాడును, మల్లాపురియని చెప్పబడు తిరుకడల్ మల్లై దేశవాసులకు ప్రభువైన పల్లవరాజు కైంకర్యముచేసుకొన్న, పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా!
కార్ మన్ను నీళ్ విశుమ్బుమ్, కడలుమ్ శుడరుమ్ నిలనుమ్ మలైయుమ్, తన్నున్ది
తార్ మన్ను తామరైక్కణ్ణనిడమ్, తడమామదిళ్ శూழ் న్దழగాయకచ్చి ,
తేర్ మన్ను తెన్నవనై మునైయిల్ శెరువిల్, తిఱల్ వాట్టియ తిణ్ శిలైయోన్ ,
పార్ మన్ను పల్లవర్ కోన్ పణిన్ద, పరమేచ్చుర విణ్ణగరమదువే ll 1129
కార్ మన్ను నీళ్ విశుమ్బుమ్ = మేఘములచే ఆవరింపబడియున్న విశాలమైన ఆకాశమును; కడలుమ్ = మహాసముద్రములును; శుడరుమ్ = తేజస్సుగల సూర్యచంద్రులు,నక్షత్రములును; నిలనుమ్= భూమియు, మలైయుమ్=పర్వతములును; తన్ ఉన్ది తార్ మన్ను = తనయొక్క దివ్యమైన నాభి కమలమందు కలిగియున్న;తామరై కణ్ణన్ ఇడమ్ = పుండరీకాక్షుని నివాసస్దానము; తడమ్ మామదిళ్ శూழ் న్ద అழగాయ కచ్చి = తటాకములతోను, పెద్ద ప్రాకారములతోను చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో;మునైయిల్=యుద్ధరంగములో; తేర్ మన్ను తెన్నవనై = మహారధుడైన పాండ్యరాజుయొక్క; శెరువిల్ తిఱల్ వాట్టియ = శక్తిని యుద్ధమందు నశింపజేసిన; తిణ్ శిలైయోన్ = దృఢమైన విల్లుగల; పార్ మన్ను పల్లవర్ కోన్ = ఈ భూమియందు చాలకాలము పాలించిన పల్లవరాజు; పణిన్ద= కైంకర్యముచేసుకొన్న; పరమేచ్చుర విణ్ణగరమదువే = పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా!
మేఘములచే ఆవరింపబడియున్న విశాలమైన ఆకాశమును, మహాసముద్రములును తేజస్సుగల సూర్యచంద్రులు,నక్షత్రములును,భూమియు, పర్వతములును,తనయొక్క దివ్యమైన నాభి కమలమందు కలిగియున్న పుండరీకాక్షుని నివాసస్దానము ( ఏదనగ ) తటాకములతోను,పెద్ద ప్రాకారములతోను చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో, యుద్ధరంగములో మహారధుడైన పాండ్యరాజుయొక్క శక్తిని యుద్ధమందు నశింపజేసిన దృఢమైన విల్లుగల ఈ భూమియందు చాలకాలము పాలించిన పల్లవరాజు కైంకర్యము చేసుకొన్న, పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా!
ఉరన్దరు మెల్లణై ప్పళ్ళికొణ్డాన్, ఒరుకాల్ మున్నం మావురువాయ్ క్కడలుళ్ ,
వరన్దరుమ్ మామణివణ్ణనిడమ్, మణిమాడఙ్గళ్ శూழ் న్దழగాయకచ్చి ,
నిరన్దవర్ మణ్ణైయిల్ పుణ్ణుకర్ వేల్, నెడు వాయిల్ ఉక చ్చెరువిల్ ముననాళ్ ,
పరన్దవన్ పల్లవర్ కోన్ పణిన్ద, పరమేచ్చుర విణ్ణగరమదువే ll 1130
మున్నమ్ ఒరుకాల్=పూర్వమొకకాలమున; మా ఉరు ఆయ్=విలక్షణమైన రూపముధరించి; కడలుళ్ = పాలసముద్రమున; ఉరమ్ తరు మెల్ అణై = మిక్కిలి శక్తివంతమైన,మృదువైన శేషతల్పముపై; పళ్ళికొణ్డాన్=పవళించియున్నవాడును;వరుమ్ తరుమ్ = “వరదుడు”యను దివ్యనామము కలవాడును; మా మణివణ్ణన్ ఇడమ్ = శ్లాఘ్యమైన నీలమణివంటి వర్ణముకలిగిన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము; ( ఏదనగ ) మణిమాడఙ్గళ్ శూழ் న్ద అழగాయ కచ్చి = రత్నమయమయిన భవనములతో చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో; ముననాళ్ = పూర్వము ఒకప్పుడు; మణ్ణైయిల్ నిరన్దనర్ = మణ్ణై ప్రధాననగరమందుగల శత్రువులను; పుణ్ నుకర్ వేల్ నెడు వాయిల్ ఉగ = మాంసమును భక్షించు శూలాయుధము యొక్క పెద్ద నోటిలో పడి నశించునట్లు;శెరువిల్=యుద్దములో; పరన్దవన్= స్వైరవిహారము చేసిన, పల్లవర్ కోన్ = పల్లవరాజు; పణిన్ద= కైంకర్యముచేసుకొన్న; పరమేచ్చుర విణ్ణగరమదువే = పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా!
పూర్వమొకకాలమున విలక్షణమైన రూపము ధరించి పాలసముద్రమున మిక్కిలి శక్తివంతమైన,మృదువైన శేషతల్పముపై పవళించియున్నవాడును, “వరదుడు”యను దివ్యనామము కలవాడును, శ్లాఘ్యమైన నీలమణివంటి వర్ణము కలిగిన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము;( ఏదనగ ) రత్నమయమయిన భవనములతో చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో,పూర్వము ఒకప్పుడు మణ్ణై ప్రధాననగరమందుగల శత్రువులను,మాంసమును భక్షించు శూలాయుధము యొక్క పెద్ద నోటిలో పడి నశించునట్లు యుద్దములో స్వైరవిహారము చేసిన పల్లవరాజు కైంకర్యము చేసుకొన్న, పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా!
అణ్డముమ్ ఎణ్డిశైయుమ్ నిలనుమ్, అలైనీరొడు వాన్ ఎరి కాల్ ముదలా
ఉణ్డవన్, ఎందై పిరానదు ఇడమ్, ఒళిమాడఙ్గళ్ శూழ் న్దழగాయకచ్చి ,
విణ్డవరిణ్డై క్కుழாముడనే, విరైన్దార్ ఇరియ చ్చెరువిల్ మునిన్దు ,
పణ్డొరుకాల్ వళైత్తాన్ పణిన్ద, పరమేచ్చుర విణ్ణగరమదువే ll 1131
అణ్డముమ్ = అండములను; ఎణ్ దిశైయుమ్ = ఎనిమిది దిక్కులును; నిలనుమ్ = భూమండలమును; అలై నీరొడు = సముద్రములతోకూడి; వాన్ ఎరి కాల్ మదలా = ఆకాశము, అగ్ని, వాయువు మొదలగు వన్నింటిని; ఉణ్డవన్ = (ప్రళయకాలమున) తన ఉదరములో నుంచుకొని కాపాడిన; ఎందై పిరానదు ఇడమ్ = నాయొక్క తండ్రి సర్వేశ్వరునియొక్క నివాసస్దానము;(ఏదనగ) ఒళి మాడఙ్గళ్ శూழ் న్ద అழగాయకచ్చి= ప్రకాశించు భవనములతో చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో;పణ్డొరుకాల్= పూర్వము ఒకప్పుడు; శెరువిల్ = యుద్దములో; విరైన్దార్=పోరుసలుపు ఇచ్ఛతో వచ్చిన; విణ్డవర్ ఇణ్డై క్కుழாముడనే = విరోధుల కూటములతోసహా; ఇరియ = ఛిన్నభిన్నమై పోవునట్లు; మునిన్దు = కోపగించి; వళైత్తాన్ = విల్లును వంచిన పల్లవరాజు; పణిన్ద= కైంకర్యముచేసుకొన్న; పరమేచ్చుర విణ్ణగరమదువే = పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా!
అండములను,ఎనిమిది దిక్కులును,భూమండలమును,సముద్రములతోకూడి ఆకాశము, అగ్ని, వాయువు మొదలగువన్నింటిని ప్రళయకాలమున తన ఉదరములో నుంచుకొని కాపాడిన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము(ఏదనగ) ప్రకాశించు భవనములతో చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో,పూర్వము ఒకప్పుడు యుద్దములో, పోరుసలుపు ఇచ్ఛతో వచ్చిన విరోధుల కూటములతోసహా ఛిన్నభిన్నమై పోవునట్లు కోపగించి,విల్లును వంచిన పల్లవరాజు కైంకర్యము చేసుకొన్న, పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా!
తూమ్బుడై తిణ్ కై వన్ తాళ్ కళిర్ట్రిన్, తుయర్ తీర్తు అరవమ్ వెరువ ముననాళ్,
పూమ్బునల్ పొழ்గై పుక్కానవనుక్కు, ఇడన్దాన్ తడమ్ శూழ் న్దழగాయకచ్చి ,
తేమ్బొழிల్ కున్ఱెయిల్ తెన్నవనై, తిశైప్ప చ్చెరుమేల్ వియన్దు అన్ఱుశెన్ఱ ,
పామ్బుడై ప్పల్లవర్ కోన్ పణిన్ద, పరమేచ్చుర విణ్ణగరమదువే ll 1132
ముననాళ్ = పూర్వమొకకాలమున; తూమ్బుడై తిణ్ కై వన్ తాళ్ కళిర్ట్రిన్ = బలమైన తొండము, బలమైన కాళ్ళుగల గజేంద్రాళ్వార్ యొక్క; తుయర్ తీర్తు = దుఃఖమును పోగొట్టినవాడును; పూమ్ పునల్ పొழ்గై = అందమైన నీటితోఒప్పు తటాకమందుగల; అరవమ్ వెరువ = కాళీయసర్పము బయపడునట్లు; పుక్కాన్ అవనుక్కు ఇడన్దాన్ = ఆ తటాకమున ప్రవేశించిన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము;(ఏదనగ) తడమ్ శూழ்న్ద అழగాయ కచ్చి = తటాకములతో చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో; తేమ్ పొழிల్ కున్ఱు ఎయిల్ తెన్నవనై = తేనెలతోనిండిన తోటలును, పర్వతములవలెనున్న ప్రాకారములుగల పాండ్యదేశపు మహారాజు; తిశైప్ప=దిగ్భ్రాంతి చెందునట్లు; అన్ఱు= పూర్వమున;శెరు మేల్=యుద్దములో; వియన్దు శెన్ఱ=మిక్కిలి కోరికతో చేరిన; పామ్బు ఉడై ప్పల్లవర్ కోన్ = సర్పము ధ్వజముగగల పల్లవరాజు; పణిన్ద= కైంకర్యము చేసుకొన్న; పరమేచ్చుర విణ్ణగరమదువే = పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా!
పూర్వమొకకాలమున బలమైన తొండము, బలమైన కాళ్ళుగల గజేంద్రాళ్వార్ యొక్క దుఃఖమును పోగొట్టినవాడును, అందమైన నీటితో ఒప్పు తటాకమందుగల కాళీయసర్పము బయపడునట్లు, ఆ తటాకమున ప్రవేశించిన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము ( ఏదనగ ), తటాకములతో చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో తేనెలతోనిండిన తోటలును, పర్వతములవలెనున్న ప్రాకారములుగల పాండ్యదేశపు మహారాజు దిగ్భ్రాంతి చెందునట్లు,పూర్వమున యుద్ధములో మిక్కిలి కోరికతో చేరిన సర్పము ధ్వజముగగల పల్లవరాజు కైంకర్యము చేసుకొన్న, పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా!
తిణ్ పడై కోళరియినురువాయ్, తిఱలోన్ అకలమ్ శెరువిల్ ముననాళ్ ,
పుణ్ పడ ప్పోழ்న్ద పిరానదిడమ్, ప్పొరు మాడఙ్గళ్ శూழ் న్దழగాయకచ్చి ,
వెణ్ కుడై నీழల్ శెఙ్గోల్ నడప్ప, విడ వెల్ కొడి వేల్ పడై మున్ ఉయర్త ,
పణ్బుడై పల్లవర్ కోన్ పణిన్ద, పరమేచ్చుర విణ్ణగరమదువే ll 1133
ముననాళ్ = పూర్వమొకకాలమున; తిణ్ పడై = వాడియైన(నఖములే)ఆయుధముగ కలిగిన;కోళ్ అరియిన్ ఉరు ఆయ్=మిక్కిలి శక్తివంతమైన నరసింహమూర్తిగ అవతరించి; శెరువిల్=యుద్దములో; తిఱలోన్ అగలమ్=మహాబలశాలియైన హిరణ్యాసురునియొక్క వక్షస్థలము; పుణ్ పడ పోழ்న్ద పిరాన్ ఇడమ్ = గాయపడునట్లు చీల్చి వధించిన ఉపకారకుడైన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము; ( ఏదనగ ); పొరు మాడఙ్గళ్ శూழ் న్ద అழగాయ కచ్చి = ఒకటితోమరొకటి చేరియున్న భవనములతో చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో; వెణ్ కుడై నీழల్ = తెల్లని ఛత్ర ఛాయలో; శెఙ్గోల్ నడప్ప = తనయొక్క ఆఙ్ఞలు నడుచునట్లు; విడమ్ వెల్ కొడి = సర్పము చిహ్నముగగల విజయ ధ్వజమును; వేల్ పడై = శూలాయుధమును; మున్ ఉయర్త = తన సైన్యము ఎదుట పైకెత్తిన; పణ్బు ఉడై పల్లవర్ కోన్ = మిక్కిలి సుహృదుయుడైన పల్లవరాజు; పణిన్ద = కైంకర్యము చేసుకొన్న; పరమేచ్చుర విణ్ణగరమదువే = పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా!
పూర్వమొకకాలమున వాడియైన నఖములే ఆయుధముగ కలిగి మిక్కిలి శక్తివంతమైన నరసింహమూర్తిగ అవతరించి,యుద్ధములో మహాబలశాలియైన హిరణ్యాసురునియొక్క వక్షస్థలము గాయపడునట్లు చీల్చి వధించిన ఉపకారకుడైన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము( ఏదనగ), ఒకటితోమరొకటి చేరియున్న భవనములతో చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో,తెల్లని ఛత్ర ఛాయలో తనయొక్క ఆఙ్ఞలు నడుచునట్లు సర్పము చిహ్నముగగల విజయ ధ్వజమును, శూలాయుధమును,తన సైన్యము ఎదుట పైకెత్తిన,మిక్కిలి సుహృదుయుడైన పల్లవరాజు కైంకర్యము చేసుకొన్న, పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా! .
ఇలకియ నీళ్ ముడి మావలితన్ పెరువేళ్వియిల్, మాణురువాయ్ ముననాళ్ ,
శలమొడు మానిలఙ్గొణ్డవనక్కు, ఇడన్దాన్ తడమ్ శూழ் న్దழగాయకచ్చి ,
ఉలగుడై మన్నవన్ తెన్నవనై, క్కన్నిమామదిళ్ శూழ் కరువూర్ వెరువ ,
ప్పలపడై శాయ వెన్ఱాన్ పణిన్ద, పరమేచ్చుర విణ్ణగరమదువే ll 1134
ముననాళ్ = పూర్వమొకకాలమున; ఇలకియ నీళ్ ముడి = ప్రకాశించు పొడుగైన కిరీటముగల; మావలితన్=మహాబలియొక్క;పెరు వేళ్వియిల్ = పెద్ద యాగభూమివద్దకు; మాణ్ ఉరు ఆయ్ = వామన రూపముతో వెడలి; శలమొడు = దానజలముతోబాటు; మా నిలమ్ కొణ్డ అవనక్కు ఇడన్దాన్ = విశాలమైన భూలోకమును కొలిచి స్వీకరించిన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము;( ఏదనగ ); తడమ్ శూழ்న్ద అழగాయ కచ్చి = తటాకములతో చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో; కన్ని మా మదిళ్ శూழ் కరువూర్ వెరువ = నాశములేని పెద్ద ప్రాకారములతో చుట్టుకొనియున్న కరువూరు నగరము బయపడునట్లు; పల పడై శాయ = చతురంగ సేనను తుదముట్టించి; ఉలగు ఉడై మన్నవన్ తెన్నవనై వెన్ఱాన్ = లోకమంతయును అధీనముగాగల పాండ్యరాజుని జయించిన పల్లవరాజు; పణిన్ద = కైంకర్యము చేసుకొన్న; పరమేచ్చుర విణ్ణగరమదువే = పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా!
పూర్వమొకకాలమున ప్రకాశించు పొడుగైన కిరీటముగల మహాబలియొక్క పెద్ద యాగభూమి వద్దకు వామన రూపముతో వెడలి దానజలముతోబాటు విశాలమైన భూలోకమును కొలిచి స్వీకరించిన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము;(ఏదనగ), తటాకములతో చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో, నాశములేని పెద్ద ప్రాకారములతో చుట్టుకొనియున్న కరువూరు నగరము బయపడునట్లు, చతురంగ సేనను తుదముట్టించి, లోకమంతయును అధీనముగాగల పాండ్యరాజుని జయించిన పల్లవరాజు కైంకర్యము చేసుకొన్న పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా!
కుడైత్తిఱల్ మన్నవనాయొరుకాల్, కురంగై ప్పడైయా, మలైయాల్ కడలై
అడైత్తవనెందై పిరానదిడమ్, మణిమాడఙ్గళ్ శూழ் న్దழగాయకచ్చి ,
విడైత్తిఱల్ విల్లవన్ నెన్మెలియిల్, వెరువ చ్చెరువేల్ వలంఙ్గై ప్పిడిత్త ,
పడైత్తిఱల్ పల్లవర్ కోన్ పణిన్ద, పరమేచ్చుర విణ్ణగరమదువే ll 1135
ఒరుకాల్ = పూర్వమొకకాలమున; కుడై తిఱల్ మన్నవన్ ఆయ్ = తెల్లని ఛత్రముక్రింద ఒప్పుచున్న మిక్కిలి బలశాలియైన చక్రవర్తి ధశరధునియొక్క కుమారునిగ అవతరించి; కురంగై పడైయా = వానర వీరుల సేనగ; మలైయాల్=పర్వతములచే;కడలై అడైత్తవన్= మహాసముద్రములో సేతువునుకట్టి అడ్డగించినవాడును; ఎందై పిరాన్ ఇడమ్ = నాయొక్క మహోపకారకుడైన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము;(ఏదనగ), మణి మాడఙ్గళ్ శూழ் న్ద అழగాయ కచ్చి = రత్నమయమయిన భవనములతో చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో; నెన్ మెలియిల్ = నెన్ మెలియిల్ నగరమందుగల; విడై తిఱల్= వృషభమువంటి మహాబలశాలియైన;విల్లవన్ = మహారాజు; వెరువ=భయపడునట్లు;శెరు వేల్=యుద్దముచేయుటకై శూలాయుధమును; వలమ్ కై పిడిత్త = తన కుడిచేతిలో పట్టుకొన్నవాడును; పడై తిఱల్ పల్లవర్ కోన్ = ఆయుధములను బహు సామర్ధ్యముతో నిర్వహించు పల్లవరాజు; పణిన్ద = కైంకర్యము చేసుకొన్న; పరమేచ్చుర విణ్ణగరమదువే = పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా!
పూర్వమొకకాలమున తెల్లని ఛత్రముక్రింద ఒప్పుచున్న మిక్కిలి బలశాలియైన చక్రవర్తి ధశరధునియొక్క కుమారునిగ అవతరించి,వానర వీరుల సేనగ పర్వతములచే మహాసముద్రములో సేతువునుకట్టి అడ్డగించినవాడును,నాయొక్క మహోపకారకుడైన సర్వేశ్వరునియొక్కనివాసస్దానము;(ఏదనగ),రత్నమయమయిన భవనములతో చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో, నెన్ మెలియిల్ అను నగరమందుగల వృషభమువంటి మహాబలశాలియైన విల్లవన్ మహారాజు భయపడునట్లు, యుద్దముచేయుటకై శూలాయుధమును తన కుడిచేతిలో పట్టుకొన్నవాడును, ఆయుధములను బహు సామర్ధ్యముతో నిర్వహించు పల్లవరాజు కైంకర్యము చేసుకొన్న పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా!
పిఱైయుడై వాణుదల్ పిన్నై తిఱత్తు, మున్నే యొరుకాల్ శెరువిల్ ఉరుమిన్ ,
మఱైయుడై మాల్ విడై యేழ்డర్తార్కు, ఇడన్దాన్ తడమ్ శూழ் న్దழగాయకచ్చి ,
కఱైయుడై వాళ్ మఱమన్నర్కెడ, క్కడల్ పోల్ ముழఙ్గుమ్ కురల్ కడువాయ్ ,
పఱైయుడై పల్లవర్ కోన్ పణిన్ద, పరమేచ్చుర విణ్ణగరమదువే ll 1136
మున్నే ఒరుకాల్=పూర్వమొకకాలమున; పిఱై వాళ్ ఉడై నుదల్ పిన్నై తిఱత్తు=చంద్రకళ వలె ప్రకాశించు ముఖమండలముగల నప్పిన్నైపిరాట్టి కొరకు; ఉరుమిన్ = ఉరుములవలె గర్జించుచు; మఱై ఉడై = విద్వేషము కలిగియున్న; మాల్ విడై ఏழ் శెరువిల్ అడర్తార్కు ఇడన్దాన్ = పెద్ద వృషభములు ఏడింటిని యుద్ధములో వధించిన సర్వేశ్వరుని యొక్క నివాసస్దానము; (ఏదనగ ); తడమ్ శూழ்న్ద అழగాయ కచ్చి = తటాకములతో చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో; కఱై ఉడై వాళ్ = రక్తపు మరకలు కలిగియున్న ఖడ్గములతోను; మఱ మన్నర్ కెడ = శత్రుత్వముతోను యున్న రాజులు నశించునట్లు; కడల్ పోల్ ముழఙ్గుమ్ కురల్ = సముద్రమువలె ఘోషించెడి ధ్వనితో; కడు వాయ్ పఱై ఉడై=భయంకరముగ శబ్దించు పఱై యను వాద్యములు కలిగిన; పల్లవర్ కోన్ = పల్లవరాజు; పణిన్ద=కైంకర్యము చేసుకొన్న; పరమేచ్చుర విణ్ణగరమదువే = పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా!
పూర్వమొకకాలమున చంద్రకళ వలె ప్రకాశించు ముఖమండలముగల నప్పిన్నైపిరాట్టి కొరకు, ఉరుములవలె గర్జించుచు విద్వేషము కలిగియున్న పెద్ద వృషభములు ఏడింటిని యుద్ధములో వధించిన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము (ఏదనగ),తటాకములతో చుట్టుకొనియున్న అందమైన కాంచీపురములో, ఎండిపోని రక్తపు మరకలు కలిగియున్న ఖడ్గములతోను, శత్రుత్వముతోను యున్న రాజులు నశించునట్లు, సముద్రమువలె ఘోషించెడి ధ్వనితో, భయంకరముగ శబ్దించు పఱై యను వాద్యములు కలిగిన పల్లవరాజు కైంకర్యము చేసుకొన్న పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశమే సుమా!
** పార్ మన్ను తొల్ పుగழ் పల్లవర్ కోన్ పణిన్ద, పరమేచ్చుర విణ్ణగర్ మేల్ ,
కార్ మన్ను నీళ్ వయల్ మంగైయర్ తమ్ తలైవన్, కలికన్ఱి కున్ఱాదు ఉరైత్త ,
శీర్ మన్ను శెమ్ తమిழ் మాలై వల్లార్, తిరుమామగళ్ తన్ అరుళాళ్, ఉలగిల్
తేర్ మన్నరాయ్ ఒలిమాకడల్ శూழ், శెழுనీర్ ఉలగాణ్డు తిగழ் వర్ గళే ll 1137
పార్ మన్ను తొల్ పుగழ் = అనాదినుండి ఈ భూమండలమందు శాశ్వతమైన కీర్తిగల; పల్లవర్ కోన్ = పల్లవరాజు; పణిన్ద పరమేచ్చుర విణ్ణగర్ మేల్ = కైంకర్యము చేసుకొన్న పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశ విషయమై; కార్ మన్ను నీళ్ వయల్ మంగైయర్ తమ్ తలైవన్ = ఎల్లప్పుడును మేఘములు ఆవరించుటచే చీకటికమ్మియుండు విశాలమైన పొలములుగల తిరుమంగై దేశవాసులకు ప్రభువైన; కలికన్ఱి=తిరుమంగై ఆళ్వార్;కున్ఱాదు ఉరైత్త = కవితా సౌందర్యము ఏవిధముగను తక్కువకాకుండ అనుగ్రహించిన; శీర్ మన్ను శెమ్ తమిழ் మాలై = భగవద్గుణములతో పూర్ణమైన అందమైన తమిళ భాషలోనున్న ఈ పాశురములమాలను; వల్లార్ = అనుసంధించువారు;తిరుమామగళ్ తన్ అరుళాళ్= శ్రీ దేవి కృపాకటాక్షముతో; ఉలగిల్ = ఈ లోకమందు; తేర్ మన్నర్ ఆయ్ = రథమును నడిపించెడి సామర్ధ్యముగల మహారాజులై; ఒలి మా కడల్ శూழ் = ఘోషించెడి మహాసముద్రముచే చుట్టుకొనియున్న; శెழு నీర్ ఉలగు = అందమైన నీటితోఒప్పు ఈ లోకమును; ఆణ్డు తిగழ் వర్ గళే = పరిపాలించి ప్రకాశించగలరు.
అనాదినుండి ఈ భూమండలమందు శాశ్వతమైన కీర్తిగల పల్లవరాజు కైంకర్యము చేసుకొన్న పరమేశ్వరవిణ్ణగరం దివ్యదేశ విషయమై, ఎల్లప్పుడును మేఘములావరించుటచే చీకటికమ్మియుండు విశాలమైన పొలములుగల తిరుమంగై దేశవాసులకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్, కవితా సౌందర్యము ఏవిధముగను తక్కువకాకుండ అనుగ్రహించిన భగవద్గుణములతో పూర్ణమైన అందమైన తమిళ భాషలోనున్న ఈ పాశురములమాలను అనుసంధించువారు, శ్రీ దేవి కృపాకటాక్షముతో ఈలోకమందు రథమును నడిపించెడి సామర్ధ్యముగల మహారాజులై, ఘోషించెడి మహాసముద్రముచే చుట్టుకొని యున్న అందమైన నీటితోఒప్పు ఈ లోకమును పరిపాలించి ప్రకాశించగలరు.
************