పెరియ తిరుమొழி-3వపత్తు (3)

శ్రీః

3. వాడమరుదిడై

తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమునకు వేంచేసి తిరుమంగై ఆళ్వార్  తాననుభవించిన సర్వేశ్వరుని కల్యాణగుణములను వర్ణించుచున్నారు.

** వాడ మరుదిడై పోగి, మల్లరైక్కొన్ఱు ఒక్కలిత్తిట్టు,

ఆడల్ నన్ మా వుడైత్తు, ఆయర్ ఆనిరైక్కు అన్ఱు ఇడర్ తీర్పాన్ ,

కూడియ మామழை కాత్త, కూత్తనెన వరుకిన్ఱాన్,

శేడుయిర్ పూమ్బొழிల్ తిల్లై , చ్చిత్తిర కూడత్తుళ్ళానే  ll 1168

మరుదు ఇడై వాడ పోగి = రెండు మద్ది వృక్షములనడుమ అవి క్రిందపడి వాడునట్లు పాకుచు పోయినవాడును; మల్లరై కొన్ఱు = చాణూరముష్టికులనబడు మల్లులను చంపినవాడును; ఒక్కలిత్తిట్టు ఆడల్ నల్ మా వుడైత్తు = నడకయందు కళ చూపుచు ఆడుచు వచ్చిన అందమైన అశ్వరూపములో వచ్చిన కేశియను అశురుని చంపిన వాడును;అన్ఱు= ఇంద్రుడు భయంకరమైన వర్షము కురుపించినపుడు; ఆయర్ ఆ నిరైక్కు ఇడర్ తీర్పాన్ = గోకులవాసులకు, గోసమూహములకు కలిగిన దుఃఖమును   తీర్చుటకై; కూడియ మా మழை కాత్త = వడగండ్లతో కూడిన పెద్ద వర్షమును గోవర్ధన పర్వతమును గొడుగువలె  పైకెత్తి కాపాడిన; కూత్తన్ ఎన = నృత్యము చేయువాడుయని పిలువగ; వరుకిన్ఱాన్=వచ్చెడి ఆ గోపాలకృష్ణుడు;శేడు ఉయిర్ పూమ్ పొழிల్= లేతనైన ఎత్తుగా పెరిగిన పూల తోటలుగల; తిల్లై చ్చిత్తిర కూడత్తు = తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు; ఉళ్ళానే  = కృపతో వేంచేసియున్నాడు సుమా! ..

రెండు మద్ది వృక్షములనడుమ అవి క్రిందపడి వాడునట్లు పాకుచు పోయినవాడును, చాణూర ముష్టికులనబడు మల్లులను చంపినవాడును,సుందరమైన నడకతో ఆడుచు వచ్చిన అందమైన అశ్వరూపములోవచ్చిన కేశియను అశురుని చంపినవాడును, ఇంద్రుడు భయంకరమైన వర్షము కురుపించినపుడు గోకులవాసులకు, గోసమూహములకు కలిగిన దుఃఖమును తీర్చుటకై వడగండ్లతో కూడిన పెద్ద వర్షమును గోవర్ధన పర్వతమును గొడుగువలె  పైకెత్తి కాపాడిన, “నృత్యము చేయువాడు” యని పిలువగ  గోకులములో వచ్చెడి ఆ గోపాలకృష్ణుడు, లేతనైన ఎత్తుగా పెరిగిన పూల తోటలుగల తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్నాడు సుమా! . 

పేయ్ మగళ్ కొఙ్గై నఞ్జుణ్డ, పిళ్ళై పరిశితు ఎన్ఱాల్ ,

మానిల మామగళ్ , మాదర్ కేళ్వనివనెన్ఱుమ్, వణ్డు ఉణ్

పూమగళ్ నాయగనెన్ఱుమ్, పులన్ కెழு కోవియర్ పాడి ,

తే మలర్ తూవ వరువాన్, శిత్తిర కూడత్తుళ్ళానే  ll 1169

పేయ్ మగళ్ కొఙ్గై నఞ్జు = రక్కసి పూతనయొక్క స్తనములందు రాసుకొనిన విషమును; ఉణ్డ ఇదు= అమృతమువలె ఆరగించిన ఈ చేష్ఠితము;పిళ్ళై పరిశు ఎన్ఱాల్=చిన్న బాలుని విధానమని చెప్పినచొ; ఇవన్ = ఈతడు; మా నిలమామగళ్ మాదర్ కేళ్వన్ ఎన్ఱుమ్ = విశాలమైన భూమికి అధిష్టానదేవతయైన శ్రీ భూదేవి వల్లభుడనియు;  వణ్డు ఉణ్ పూమగళ్ నాయగన్ ఎన్ఱుమ్ = తుమ్మెదలు మధువును గ్రోలుచుండెడి తామర పుష్పమందు ఉద్భవించిన శ్రీమహాలక్ష్మికి నాయకుడనియు; పులన్ కెழு కోవియర్ =  ఇంద్రియములను ఆకర్షించెడి అందమైన గోపస్త్రీలు; పాడి తే మలర్ తూవ వరువాన్ =పాడుచు సుందరమైన అప్పుడే వికసించిన పుష్పములను సమర్పించుటకు వీలుగా గోకులములో వచ్చెడి ఆ గోపాలకృష్ణుడు; శిత్తిర కూడత్తుళ్ళానే = తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్నాడు సుమా! .

    రక్కసి పూతనయొక్క స్తనములందు రాసుకొనిన విషమును అమృతమువలె ఆరగించిన ఈ చేష్ఠితము చిన్న బాలుని విధానమని చెప్పినచొ, ఈతడు విశాలమైన భూమికి అధిష్టానదేవతయైన శ్రీ భూదేవి వల్లభుడనియు,తుమ్మెదలు మధువును గ్రోలుచుండెడి తామర పుష్పమందు ఉద్భవించిన శ్రీమహాలక్ష్మికి నాయకుడనియు, ఇంద్రియములను ఆకర్షించెడి అందమైన గోపస్త్రీలు పాడుచు సుందరమైన అప్పుడే వికసించిన పుష్పములను సమర్పించుటకు వీలుగా గోకులములో  వచ్చెడి  ఆ గోపాలకృష్ణుడు తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్నాడు సుమా! . 

పణ్డివన్ వెణ్ణెయుణ్డానెన్ఱు, ఆయ్ చ్చియర్ కూడి యిழிప్ప ,

ఎణ్డిశై యోరుమ్ వణఙ్గ, ఇణైమరుదూడు నడన్దిట్టు ,

అణ్డరుమ్ వానత్తవరుమ్, ఆయిరనామఙ్గలోడు ,

తిణ్డిఱల్ పాడ వరువాన్, శిత్తిర కూడత్తుళ్ళానే  ll 1170

పణ్డు=పూర్వమొక కాలమున;ఇవన్=ఈ చిన్నకృష్ణుడు; వెణ్ణెయ్ ఉణ్డాన్ ఎన్ఱు = వెన్నను దొంగిలించి ఆరగించినాడని; ఆయ్ చ్చియర్ కూడి యిழிప్ప=గోపస్త్రీలు గుమిగూడి నిందించిరి (అని చెప్పినచొ); ఎణ్ దిశైయోరుమ్ వణఙ్గ=ఎనిమిది దిక్కులయందున్న  వారందరు సేవించునట్లు; ఇణై మరుదూడు నడన్దిట్టు = చేరియున్న రెండు మద్ది వృక్షములనడుమ పాకినవాడును; అణ్డరుమ్ వానత్తవరుమ్ = నిత్యశూరులు, బ్రహ్మాదిదేవతలు; ఆయిరమ్  నామఙ్గలోడు = సహస్రనామములతొ; తిణ్ తిఱల్ పాడ వరువాన్=దృఢనిశ్చయముతో శక్తికొలది స్తుతించగ వచ్చెడి ఆ శ్రీకృష్ణుడు; శిత్తిర కూడత్తుళ్ళానే = తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్నాడు సుమా!

          పూర్వమొక కాలమున ఈ చిన్నకృష్ణుడు వెన్నను దొంగిలించి ఆరగించినాడని గోపస్త్రీలు గుమిగూడి నిందించిరని అనినచొ, ఎనిమిది దిక్కులయందున్న వారందరు సేవించునట్లు, చేరియున్న రెండు మద్ది వృక్షములనడుమ పాకినవాడును, నిత్యశూరులు, బ్రహ్మాదిదేవతలు సహస్రనామములతొ దృఢ నిశ్చయముతో శక్తికొలది స్తుతించగ వచ్చెడి ఆ శ్రీకృష్ణుడు తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్నాడు సుమా! . 

వళై క్కై నెడుఙ్గణ్  మడవార్,  ఆయ్ చ్చియర్ అఞ్జియழைప్ప ,

తళై త్తవిழ் తామరై ప్పొయ్ గై,  త్తణ్ తడమ్ పుక్కు అణ్డర్ కాణ ,

ముళైత్త ఎయిర్ట్రు అழల్ నాగత్తు, ఉచ్చియిల్ నిన్ఱు అదువాడ ,

తిళైత్తు అమర్ శెయ్ దు వరువాన్, శిత్తిర కూడత్తుళ్ళానే  ll 1171

వళై కై నెడుమ్ కణ్ మడవార్ ఆయ్ చ్చియర్ = కంకణములతొ అలంకృతమైన  చేతులు, విశాలమైన నేత్రములు, నమ్రతగల  గోపస్త్రీలు; అఞ్జి అழைప్ప= కాళీయుని వలన  చిన్నకృష్ణునికి ఏమి కీడు జరగునోయని బయపడి పిలువగ; అణ్డర్ = గొల్లవాండ్రు; తళైత్తు  అవిழ் తామరై ప్పొయ్ గై  తణ్ తడమ్ పుక్కు= వికసించిన తామరపుష్పములుగల మడుగుయొక్క చల్లని ఒడ్డుకు చేరి;కాణ=చూడగ; ముళైత్త ఎయిర్ట్రు అழల్ నాగత్తు  ఉచ్చియిల్ = పెరిగియున్న కోరలుగల, విషవాయువు గ్రక్కుచున్న కాళీయసర్పము పడగలపై; నిన్ఱు = నిలబడి; అదు వాడ తిళైత్తు =  ఆ కాళీయసర్పము కృశించిపోవునట్లు నృత్యముచేసి; అమర్ శెయ్ దు వరువాన్ =  ఆ కాళీయునితొ యుద్ధముచేసి విజయముపొంది చిరునవ్వుతో గోకులములో వచ్చెడి ఆ గోపాలకృష్ణుడు; శిత్తిర కూడత్తుళ్ళానే = తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్నాడు సుమా! .

      కంకణములతొ అలంకృతమైన చేతులు, విశాలమైన నేత్రములు, నమ్రతగల  గోపస్త్రీలు కాళీయుని వలన  చిన్నకృష్ణునికి ఏమి కీడు జరగునోయని బయపడి పిలువగ, గొల్లవాండ్రు,వికసించిన తామర పుష్పములుగల మడుగుయొక్క చల్లని ఒడ్డుకు చేరి చూడగ, పెరిగియున్న కోరలుగల, విషవాయువు గ్రక్కుచున్న కాళీయసర్పము పడగలపై నిలబడి,ఆ కాళీయసర్పము కృశించిపోవునట్లు నృత్యముచేసి, ఆ కాళీయునితొ యుద్ధముచేసి విజయముపొంది చిరునవ్వుతో గోకులములో వచ్చెడి ఆ గోపాలకృష్ణుడు తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్నాడు సుమా! .

పరువ క్కరు ముగిలొత్తు, ముత్తుడై మా కడలొత్తు, 

అరువి త్తిరల్ తిగழ் గిన్ఱ,  ఆయిరమ్ పొన్ మలై యొత్తు ,

ఉరువ క్కరుఙ్గుழల్ ఆయ్ చ్చి తిఱత్తు, ఇనమాల్ విడై శెర్ట్రు  ,

తెరువిల్  తిళైత్తు వరువాన్, శిత్తిర కూడత్తుళ్ళానే  ll 1172

పరువ కరు ముగిలొత్తు= వర్షాకాలమందున్న కాళమేఘవర్ణమువంటి వాడును; ముత్తుడై మా కడలొత్తు = ముత్యములుగల మహా సముద్రము పోలిన వాడును; అరువి తిరల్ తిగழ் గిన్ఱ = కొండవాగుల సమూహములతో ప్రకాశించుచున్న; ఆయిరమ్ పొన్ మలై యొత్తు =  అనేక బంగారు కొండలవలె ప్రకాశించువాడును; ఉరువమ్ కరు కుழల్ ఆయ్ చ్చి తిఱత్తు = అందమైన నల్లని కుంతలములుగల గోపస్త్రీ నప్పిన్నైపిరాట్టి కొరకు;మాల్ ఇన విడై శెర్ట్రు=పెద్ద వృషభముల గుంపును వధించినవాడును; తెరువిల్  తిళైత్తు వరువాన్=”గోకులము” వీధులలో నృత్యముచేయుచు వచ్చెడి ఆ గోపాలకృష్ణుడు; శిత్తిర కూడత్తు ఉళ్ళానే=తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్నాడు సుమా!   

వర్షాకాలమందున్న కాళమేఘవర్ణమువంటి వాడును,ముత్యములుగల మహా సముద్రము పోలిన వాడును, కొండవాగుల సమూహములతో ప్రకాశించుచున్న అనేక బంగారు కొండలవలె ప్రకాశించు వాడును, అందమైన నల్లని కుంతలములుగల గోపస్త్రీ నప్పిన్నైపిరాట్టి కొరకు పెద్ద వృషభముల గుంపును వధించినవాడును,”గోకులము” వీధులలో నృత్యముచేయుచు వచ్చెడి ఆ గోపాలకృష్ణుడు తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్నాడు సుమా! .

** ఎయ్య చ్చిదైన్దదు ఇలఙ్గై మలఙ్గ, వరు మழை కాప్పాన్ ,

ఉయ్య ప్పరువరై తాఙ్గి, ఆనిరై కాత్తానెన్ఱేత్తి ,

వైయత్తు ఎవరుమ్ వణఙ్గ, అణఙ్గెழு మామలైపోలే ,

తెయ్ వ ప్పుళ్ళేఱి వరువాన్, శిత్తిర కూడత్తుళ్ళానే  ll 1173

ఎయ్య ఇలఙ్గై శిదైన్దదు = ఒక బాణము ఎక్కుపెట్టి విడిచినంతమాత్రములోనే లంకాపురి  ఛిన్నాభిన్నమైనది; ఆనిరై మలఙ్గ=గోసమూహములు పీడింపబడునట్లు;వరుమ్ మழை కాప్పాన్ = ఏడు దినములు ఎడతెగక కురియుచువచ్చిన వర్షమునుండి కాపాడుటకై; ఉయ్య పరు వరై తాఙ్గి=ఆ గోసమూహములు సుఖముగనుండుటకు పెద్ద గోవర్ధన పర్వతమును గొడుగు వలె పైకెత్తి; కాత్తాన్ ఎన్ఱు = రక్షించెనని; వైయత్తు ఎవరుమ్ ఏత్తి వణఙ్గ = భూలోకమున సమస్తజనులు స్తుతించి సేవించునట్లు; అణఙ్గు ఎழு మా మలై పోలే = దేవతావేశము పొందిన పెద్ద పర్వతమువలె నున్న;తెయ్ వ ప్పుళ్ళేఱి వరువాన్=దివ్యమైన గరుడాళ్వార్ ను అధిష్ఠించి వచ్చెడి ఆ సర్వేశ్వరుడు;శిత్తిర కూడత్తు ఉళ్ళానే= తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్నాడు సుమా! 

            ఒక బాణము ఎక్కుపెట్టి విడిచినంతమాత్రములోనే లంకాపురి ఛిన్నాభిన్నమైనది, అదియునుగాక గోసమూహములు పీడింపబడునట్లు ఏడు దినములు ఎడతెగక కురియుచువచ్చిన వర్షమునుండి కాపాడుటకై, ఆ గోసమూహములు సుఖముగనుండుటకు పెద్ద గోవర్ధన పర్వతమును గొడుగు వలె పైకెత్తి రక్షించెనని, భూలోకమున సమస్తజనులు స్తుతించి సేవించునట్లు,దేవతావేశము పొందిన పెద్ద పర్వతమువలె నున్న దివ్యమైన గరుడాళ్వార్ ను అధిష్ఠించి వచ్చెడి ఆ సర్వేశ్వరుడు తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్నాడు సుమా!

ఆవర్ ఇవై శెయ్ దఱివార్, అఞ్జనమామలై పోలే ,

మేవు శినత్తడల్ వేழுమ్, వీழ మునిన్దు, అழగాయ

కావి మలర్ నెడుఙ్గణ్ణార్, కైతొழ వీది వరువాన్ ,

తేవర్ వణఙ్గు తణ్ తిల్లై, చ్చిత్తిర కూడత్తుళ్ళానే  ll 1174

మా అఞ్జన మలై పోలే=పెద్ద నల్లని కొండవలెనున్న;మేవు శినమ్ అడల్ వేழுమ్=మిక్కిలి కోపముకలగిన శక్తివంతమైన కువలయాపీడమను ఏనుగు; వీழ = క్రిందపడి మరణించునట్లు; మునిన్దు ఇవై శెయ్ దఱివార్ ఆవర్ = కోపగించుట మొదలగు ఇటువంటి దుర్లభమైన పనులు చేయగల సామర్ధ్యము (శ్రీకృష్ణునికి తప్ప) వేరెవ్వరికి లేదు;(మరియు)అழగాయ కావి మలర్ నెడు కణ్ణార్ కైతొழ=అందమైన నల్లకలువలవలె   విశాలమైన నేత్రములుగల స్త్రీలు  చేతులుమోడ్చి సేవించుటకు వీలుగ; వీది వరువాన్ = మధురానగర వీధులలో వచ్చెడి ఆ గోపాలకృష్ణుడు; తేవర్ వణఙ్గు తణ్ తిల్లై శిత్తిర కూడత్తు ఉళ్ళానే = నిత్యశూరులు సేవించుచుండెడి అందమైన తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్నాడు సుమా!

          పెద్ద నల్లని కొండవలెనున్న మిక్కిలి కోపముకలగిన శక్తివంతమైన కువలయాపీడమను ఏనుగు క్రిందపడి మరణించునట్లు కోపగించుట మొదలగు ఇటువంటి దుర్లభమైన పనులు చేయగల సామర్ధ్యము (శ్రీకృష్ణునికి తప్ప) వేరెవ్వరికి లేదు మరియు అందమైన నల్లకలువలవలె  విశాలమైన నేత్రములుగల స్త్రీలు  చేతులుమోడ్చి సేవించుటకు వీలుగ మధురానగర వీధులలో వచ్చెడి ఆ గోపాలకృష్ణుడు,నిత్యశూరులు సేవించుచుండెడి అందమైన తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్నాడు సుమా!

పొఙ్గి యమరిల్ ఒరుకాల్,  పొన్ పెయరోనై వెరువ ,

అఙ్గు అవనాగమ్ అళైన్దిట్టు, ఆయిరన్దోళ్ ఎழுన్దాడ ,

పైమ్ కణ్ ఇరణ్డు ఎరికాన్ఱ, నీణ్డ ఎయిర్టొడు పేழ்వాయ్ ,

శిఙ్గవురువిల్ వరువాన్, శిత్తిర కూడత్తుళ్ళానే  ll 1175

ఒరుకాల్ = పూర్వమొకకాలమున; అమరిల్ = యుద్దములో;పొన్ పెయరోనై వెరువ = హిరణ్యాసురుడు బయపడునట్లు; పొఙ్గి = పెరిగి; అఙ్గు = ఆ ప్రదేశమందు; అవన్ ఆగమ్ = ఆ హిరణ్యాసురునియొక్క వక్షస్థలములో; అళైన్దిట్టు=చేతులను జొనిపి చీల్చి;ఆయిరమ్ తోళ్ ఎழுన్దు ఆడ = తన సహస్ర భుజములను పైకత్తి కదలించుచు;ఎరి కాన్ఱ పైమ్ కణ్ ఇరణ్డు = నిప్పులు గ్రక్కెడు పచ్చని  రెండు నేత్రములతోను; నీణ్డ ఎయిర్టొడు పేழ்వాయ్ = పొడుగైన కోరలతో పెద్ద నోరుగల; శిఙ్గ ఉరువిల్ వరువాన్ = నరసింహ రూపములో వచ్చెడి ఆ సర్వేశ్వరుడు; శిత్తిర కూడత్తు ఉళ్ళానే= తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్నాడు సుమా! 

          పూర్వమొకకాలమున యుద్దములో హిరణ్యాసురుడు బయపడునట్లు,పెరిగి ఆ ప్రదేశమందు ఆ హిరణ్యాసురునియొక్క వక్షస్థలములో చేతులను జొనిపి చీల్చి,తన సహస్రభుజములను పైకత్తి కదలించుచు, నిప్పులు గ్రక్కెడు పచ్చని  రెండు నేత్రములతోను పొడుగైన కోరలతో పెద్ద నోరుగల నరసింహరూపములో వచ్చెడి ఆ సర్వేశ్వరుడు తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్నాడు సుమా! 

కరుముగిల్  పోల్వదోర్ మేని, కైయన ఆழிయుమ్ శఙ్గుమ్ ,

పెరువిఱల్ వానవర్ శూழ, ఏழுలగుమ్ తొழுదేత్త ,

ఒరుమగళ్ ఆయర్ మడందై, ఒరుత్తి నిలమగళ్, మర్ట్రై

తిరుమగళోడుమ్ వరువాన్, శిత్తిర కూడత్తుళ్ళానే  ll 1176

కరు ముగిల్  పోల్వదోర్ ఓర్ మేని = కాళమేఘవర్ణమువంటి విలక్షణమైన తిరుమేనియు;  కైయన ఆழிయుమ్ శఙ్గుమ్=చక్రాయుధము,శంఖము గల హస్తములతోను;పెరు విఱల్ వానవర్ శూழ = మిక్కిలి శక్తివంతులైన దేవతలు తనను చుట్టుకొనియుండగ; ఏழு ఉలగుమ్ తొழுదు ఏత్త = సప్త లోకములందున్న వారందరు సేవించి స్తుతించుచుండగ; ఒరు మగళ్ ఆయర్ మడందై = విలక్షణమైన గోపస్త్రీ నప్పిన్నైపిరాట్టియు; ఒరుత్తి నిలమగళ్ = సాటిలేని  శ్రీ భూదేవియు; మర్ట్రై తిరుమగళోడుమ్ వరువాన్ = మరియు శ్రీమహాలక్ష్మితోను కూడి పరమపదమందు వేంచేసెడి సర్వేశ్వరుడు; శిత్తిర కూడత్తు ఉళ్ళానే= తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్నాడు సుమా! 

                          కాళమేఘవర్ణమువంటి విలక్షణమైన తిరుమేనియు, చక్రాయుధము, శంఖము గల హస్తములతోను,మిక్కిలి శక్తివంతులైన దేవతలు తనను చుట్టుకొనియుండగ,సప్త లోకములందున్న వారందరు సేవించి స్తుతించుచుండగ, విలక్షణమైన గోపస్త్రీ నప్పిన్నైపిరాట్టియు, సాటిలేని   శ్రీ భూదేవియు, మరియు శ్రీమహాలక్ష్మితోను కూడి పరమపదమందు వేంచేసెడి ఆ సర్వేశ్వరుడు తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్నాడు సుమా!

** తేనమర్ పూమ్బొழிల్ తిల్లై, చ్చిత్తరకూడమమర్ న్ద ,

వానవర్ తఙ్గళ్ పిరానై, మఙ్గైయర్ కోన్ మరువార్ ,

ఊన్ అమర్ వేల్ కలికన్ఱి, ఒణ్ తమిழ் ఒన్బదోడొన్ఱుమ్, 

తానివై కర్ట్రువల్లార్ మేల్, శారా తీవినై తానే ll 1177

తేన్ అమర్ పూమ్ పొழிల్ = తుమ్మెదలతో నిండిన అందమైన తోటలుగల; తిల్లై, చ్చిత్తరకూడమ్ అమర్ న్ద = తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు నిత్యవాసము  చేయుచున్న; వానవర్ తఙ్గళ్ పిరానై = దేవాదిదేవుని విషయమై; మఙ్గైయర్ కోన్ = తిరుమంగైదేశవాసులకు ప్రభువును;మరువార్ ఊన్ అమర్ వేల్=శత్రువుల శరీరమందు ప్రవేశించి హతమార్చు శూలముగల; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్; ఒణ్ తమిழ் = అందమైన తమిళ భాషలోనున్న; ఒన్బదోడు ఒన్ఱుమ్ తాన్ ఇవై =  ఈ పది పాసురములు మాత్రమే; కర్ట్రు వల్లార్ మేల్ =  అభ్యసించి అనుసంధించు వారియందు; తీ వినై తానే శారా = పాపములు ఏవియు సమీపించలేవు సుమా!.

తుమ్మెదలతో నిండిన అందమైన తోటలుగల తిల్లై తిరుచ్చిత్తిర కూడమ్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న, దేవాదిదేవుని విషయమై, తిరుమంగై దేశవాసులకు ప్రభువును, శత్రువుల శరీరమందు ప్రవేశించి హతమార్చు శూలముగల తిరుమంగై ఆళ్వార్ అందమైన తమిళ భాషలోనున్న ఈ పది పాసురములు మాత్రమే అభ్యసించి అనుసంధించు వారియందు పాపములు ఏవియు సమీపించలేవు సుమా!

********

వ్యాఖ్యానించండి