పెరియ తిరుమొழி-3వపత్తు (4)

శ్రీః

4. ఒరుకుఱళాయ్ 

        శ్రీరామవిణ్ణగరం (శీర్గాழி) దివ్యదేశమునందు కృపతో నిత్యవాసము చేయుచున్న త్రివిక్రమన్ పెరుమాళ్ ను తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు. 

** ఒరుకుఱళాయిరు నిలమ్మూవడిమణ్ వేణ్డి,

ఉలగనైత్తుమీరడియాలొడుక్కి, ఒన్ఱుమ్

తరుగ వెనా మావలియై చ్చిఱైయిల్ వైత్త,

తాడాళన్తాళణై వీర్, తక్క కీర్తి;

అఱుమఱైయిన్ తిరళ్ నాన్గుమ్ వేళ్వియైన్దుమ్,

అఙ్గఙ్గళవై ఆఱుం ఇశైగళ్ ఏழுమ్, 

తెరువిల్ మలి విழாవళముమ్ శిఱక్కుమ్, కాழி

చ్చీరామవిణ్ణగరే శేర్మిన్ నీరే  ll 1178

ఒరు కుఱళ్ ఆయ్=విలక్షణమైన వామనరూపము దాల్చి(మహబలి యాగభూమివద్దకు  వెడలి) ఇరు నిలమ్ = విశాలమైన ఈ భూమండలమందు; మూవడి మణ్ వేణ్డి = మూడడుగుల స్థలమును యాచించి; ( దానజలమును స్వీకరించిన వెంటనే ) ఉలగు అనైత్తుమ్ = సర్వలోకములను; ఈరడియాల్ ఒడుక్కి = రెండడుగులతో ఆక్రమించి; ఒన్ఱుమ్ తరుగ ఎనా = ” మూడవ అడుగునకు తగిన స్థలము ఇవ్వు ” అని చెప్పగ; (దానికి  ఆ మహబలి తన శిరస్సు చూపగ)మా వలియై శిఱైయిల్ వైత్త=తన పాదముతొ మహాబలిని పాతాళలోకమునకు అణచి చెరలో ఉంచిన;తాడాళన్ = ఆ త్రివిక్రమన్ యొక్క; తాళ్ అణై వీర్ = దివ్యమైన పాదపద్మములను పొందగోరువారు; తక్క కీర్తి అఱు మఱైయిన్ తిరళ్ నాన్గుమ్ = తగిన కీర్తిగల గ్రహించుటకు కష్ఠతరమైన వేదముల నాలుగు భాగములతోను; వేళ్వి ఐన్దుమ్ = పంచ మహాయఙ్ఞములతోను; అఙ్గఙ్గళ్ అవై ఆఱుం = వ్యాకరణము మొదలగు ఆరు వేదాంగములతోను; ఇశైగళ్ ఏழுమ్ = సప్త స్వరములతోను; తెరువిల్ మలి విழாవళముమ్=వీదులలో బహు ఉత్సవ వైభవములతోను నిండిన;శిఱక్కుమ్= సొగసులు గల అద్భుతమైన;కాழி శ్రీరామవిణ్ణగరే = కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు;నీర్ శేర్మిన్=మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

విలక్షణమైన వామనరూపము దాల్చి మహబలి యాగభూమివద్దకు  వెడలి, మూడడుగుల స్థలమును యాచించి,( దానజలమును స్వీకరించిన వెంటనే ) సర్వలోకములను రెండడుగులతో ఆక్రమించి, మూడవ అడుగునకు తగిన స్థలము ఇవ్వమని చెప్పగ,(దానికి  ఆ మహబలి తన శిరస్సు చూపగ) తన పాదముతొ మహాబలిని పాతాళలోకమునకు అణచి చెరలో ఉంచిన ఆ త్రివిక్రమన్ యొక్క దివ్యమైన పాదపద్మములను పొందగోరువారు, నాలుగు వేదముల ఘోషలతోను, పంచ మహాయఙ్ఞములతోను, వ్యాకరణము మొదలగు ఆరు వేదాంగముల పఠనముతోను, సప్త స్వరములతోను, వీదులలో బహు ఉత్సవ వైభవములతోను నిండిన, సొగసైన కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు, మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

నాన్ముగ నాళ్ మిగై తరుక్కై యిరుక్కవాయ్ మై,

నలమిగుశీరురోమశనాల్ నవిర్ట్రి, నక్కన్

ఊన్ముగమార్ తలై యోట్టూణొழிత్త ఎన్దై,

ఒళిమలర్ చ్చేవడియణైవీర్, ఉழுశేయోడ

శూన్ముగమార్ వళై అళై వాయుగత్తముత్తై,

త్తొల్కురుకు శినై యెన శూழ் న్దియఙ్గ, ఎఙ్గుమ్ 

తేన్ముగమార్కమలవయల్ శేల్ పాయ్, కాழி

చ్చీరామవిణ్ణగరే శేర్మిన్ నీరే  ll 1179

నాల్ ముగన్ = చతుర్ముఖ బ్రహ్మకు; నాళ్ మిగై తరుక్కై = ఆయువు అధికముగ నుండుటచేత కలిగిన గర్వమును; ఇరుక్క వాయ్ మై నలమ్ మిగు శీర్ ఉరోమశనాల్ నవిర్ట్రి = వేదాధ్యన నిష్ఠగలవాడును, సద్గుణసంపన్నుడును అయిన రోమశ మహాఋషి వలన పోగొట్టివాడును; నక్కన్ = దిగంబరుడైన రుద్రునియొక్క; ఊన్ ఆర్ ముగమ్ తలై యోట్టు ఊణ్ ఒழிత్త = మాంసభరితమైన బ్రహ్మయొక్క కపాలముతో బిక్షాటనమును పోగొట్టిన వాడును; ఎన్దై = సర్వేశ్వరునియొక్క; ఒళి మలర్ శేవడి = అతి సుందరమైన పాదపద్మములను; అణైవీర్ = చేరగోరువారు; ఉழு శే ఓడ = పొలములలో దున్నెడి ఎద్దులు పరుగెత్తుచుండుటచే; శూల్ ముగమ్ ఆర్ వళై అళైవాయ్ ఉగత్తు ముత్తై = ప్రసవించెడి స్థితిలోనున్న శంఖములు, రంద్రములందు జనింపజేయు ముత్యములను; తొల్ కురుగు=పెద్ద కొంగలు; శినై ఎన శూழ் న్దు ఇయఙ్గ=తమయొక్క గుడ్డులని(భ్రమించి)ఆ ముత్యముల చుట్టును సంచరించు చుండెడిదియు;ఎఙ్గుమ్=అన్ని ప్రదేశములందును; తేన్ ముగమ్ ఆర్ కమలమ్ = తేనెలొలుకుచున్న వికసించిన తామరపుష్పములు కలదియు;శేల్ పాయ్=మీనములు ఈదుచు గెంతులువేయు; వయల్= పొలములు గల; కాழி శ్రీరామవిణ్ణగరే = కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు;నీర్ శేర్మిన్=మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

చతుర్ముఖ బ్రహ్మకు ఆయువు అధికముగ నుండుటచేత కలిగిన గర్వమును వేదాధ్యన నిష్ఠగలవాడును, సద్గుణసంపన్నుడును అయిన రోమశ మహాఋషి వలన పోగొట్టిన వాడును, దిగంబరుడైన రుద్రునియొక్క మాంసభరితమైన బ్రహ్మయొక్క కపాలముతో బిక్షాటనమును పోగొట్టినవాడును, సర్వేశ్వరునియొక్క అతి సుందరమైన పాదపద్మములను చేరగోరువారు, పొలములలో దున్నెడి ఎద్దులు పరుగెత్తుచుండుటచే ప్రసవించెడి స్థితిలోనున్న శంఖములు, రంద్రములందు జనింపజేయు ముత్యములను,పెద్ద కొంగలు తమయొక్క గుడ్డులని (భ్రమించి) ఆ ముత్యముల చుట్టును సంచరించుచుండెడిదియు, అన్ని ప్రదేశములందును తేనెలొలుకుచున్న వికసించిన తామర పుష్పములు కలదియు, మీనములు ఈదుచు గెంతులువేయు పొలములు గల కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు, మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

వైయణైన్దనుదిక్కోట్టు వరాక మొన్ఱాయ్ ,

మణ్ణెల్లా మిడన్దెడుత్తు మదఙ్గళ్ శెయ్ దు,

నెయ్యణైన్ద తిగిరియినాల్ వాణన్ తిణ్డోళ్,

నేర్ న్దవన్దాళణై గిఱ్పీర్, నెయ్ దలోడు

మైయణైన్దకువళైగళ్ తమ్ కణ్గళెన్ఱుమ్,

మలర్కుముదంవాయెన్ఱుం కడైశి మార్గళ్,

శెయ్యణైన్దు కళై కళైయాదు ఏఱుం, కాழி

చ్చీరామవిణ్ణగరే శేర్మిన్ నీరే  ll 1180

వై అణైన్ద నుది=వాడియైన పదునుగల;కోడు=కోరలు కలిగిన;వరాగమ్ ఒన్ఱు ఆయ్= విలక్షణమైన వరాహ రూపముదాల్చి;మణ్ ఎల్లామ్=భూమండలమంతయును;ఇడన్దు= అండభిత్తినుండి కోరలతో పొడిచి;ఎడుత్తు = పైకత్తి; మదఙ్గళ్ శెయ్ దు = మిక్కిలి గర్వకారణమైన పనులు చేసినవాడును; వాణన్ తిణ్ తోళ్ = భాణాసురునియొక్క దృఢమైన భుజములను; నెయ్ అణైన్ద తిగిరియినాల్ నేర్ న్దవన్ = వాడియైన దివ్యమైన  చక్రాయుధముతో ఖండించిన సర్వేశ్వరునియొక్క;తాళ్అణై గిఱ్పీర్= దివ్యచరణములను చేరగోరువారు; కడైశి మార్గళ్ = పల్లవవంశపు స్రీలు;శెయ్ అణైన్దు = (కలుపు తీయుటకై) పొలములలో చేరి; నెయ్ దలోడు = నెయ్ దల్ పుష్పములవలెను మరియు;మై అణైన్ద కువళైగళ్ = నల్లని వర్ణముకలిగిన కలువలవలెను;తమ్ కణ్ గళ్ ఎన్ఱుమ్ = తమయొక్క కన్నులుండుననియు;మలర్ కుముదం వాయ్ ఎన్ఱుమ్=ఎర్రని కలువ పుష్పములువలె తమయొక్క అధరములునుండుననియు తలచుకొని; కళై కళైయాదు ఏఱుం = కలపు తీయకనే పొలముగట్టు ఎక్కుచుండెడి; కాழி శ్రీరామవిణ్ణగరే = కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు;నీర్ శేర్మిన్ = మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

    వాడియైన పదునుగల కోరలు కలిగిన విలక్షణమైన వరాహ రూపముదాల్చి భూమండలమంతయును అండభిత్తినుండి కోరలతో పొడిచి పైకెత్తి మిక్కిలి గర్వ కారణమైన పనులు చేసినవాడును, భాణాసురునియొక్క దృఢమైన భుజములను వాడియైన దివ్యమైన చక్రాయుధముతో ఖండించిన సర్వేశ్వరునియొక్క దివ్యచరణములను చేరగోరువారు,పల్లవవంశపు స్రీలు (కలుపు తీయుటకై) పొలములలో చేరి నెయ్ దల్ పుష్పములవలెను మరియు నల్లని వర్ణముకలిగిన కలువలవలెను తమయొక్క కన్నులుండుననియు,ఎర్రని కలువ పుష్పములువలె తమయొక్క అధరములు నుండుననియు తలచుకొని కలుపు తీయకనే పొలముగట్టు ఎక్కుచుండెడి కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు, మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

పఞ్జియమెల్లడిపిన్నై తిఱత్తు, మున్నాళ్పాయ్ విడై

గళేழడర్తు ప్పొన్నన్ పైమ్బూణ్,

నెఞ్జిడన్దు కురుదియుక వుగిర్ వేలాణ్డ,

నిన్మలన్ తాళణైగిఱ్పీర్, నీలమాలై

తఞ్జుడైయ ఇరుళ్ తழைప్ప త్తరళ మాఙ్గే,

తణ్మదియిన్ నిలాకాట్ట ప్పవళన్దన్నాల్,

శెఞ్జుడర్ వెయిల్ విరిక్కుమ్ అழకార్, కాழி

చ్చీరామవిణ్ణగరే శేర్మిన్ నీరే  ll 1181

మున్ నాళ్ = పూర్వమొకకాలమున; పఞ్జియ మెల్ అడి పిన్నై తిఱత్తు = దూదివలె మృదువైన పాదములుగల నప్పిన్నైపిరాట్టి కొరకు;పాయ్ విడై గళ్ ఏழ் అడర్తు=పైనబడి కుమ్మెడి స్వభావముగల వృషభములనేడింటిని వధించినవాడును; పొన్నన్ = హిరణ్యాసురునియొక్క;పైమ్ పూణ్ నెఞ్జు= అందమైన ఆభరణములతో అలంకృతమైన వక్షస్థలమును; ఇడన్దు = చీల్చి; కురుది ఉగ = రక్తము చిమ్మునట్లు; ఉగిర్ వేల్ ఆణ్డ = నఖములనే శూలాయుధముగ ఉపయోగించిన; నిన్ మలన్ = పరిశుద్దాత్ముడైన సర్వేశ్వరునియొక్క; తాళ్ అణై గిఱ్పీర్ = దివ్యమైన పాదపద్మములను చేరగోరువారు; నీలమ్ = ( భవనములందు పొదగబడిన )నీలమణులు; మాలై తఞ్జు ఉడైయ ఇరుళ్ తழைప్ప = సాయంకాలసమయమునగల మసక చీకటిని ఇనుమడించుచుండగ; ఆఙ్గే తరళమ్ = అచ్చటనే వాటిమధ్యగల ముత్యములు; తణ్ మదియిన్ నిలా కాట్ట = చల్లని చంద్రుని వెన్నెలను స్పురింపజేయుచున్నదియు; పవళమ్ తన్నాల్ =(మధ్య మధ్యనగల) పగడములు వలన; శుడర్ శెమ్ వెయిల్ విరిక్కుమ్ = (ఉదయమున) సూర్యునియొక్క ఎర్రనికాంతి ప్రసరింపబడుచున్నదియు; అழగు ఆర్ = మిక్కిలి సుందరమైన; కాழி శ్రీరామవిణ్ణగరే = కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు;నీర్ శేర్మిన్ = మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

        పూర్వమొకకాలమున దూదివలె మృదువైన పాదములుగల నప్పిన్నైపిరాట్టి కొరకు, పైనబడి కుమ్మెడి స్వభావముగల వృషభములనేడింటిని వధించినవాడును, హిరణ్యాసురునియొక్క అందమైన ఆభరణములతో అలంకృతమైన వక్షస్థలమును చీల్చి  రక్తము చిమ్మునట్లు నఖములనే శూలాయుధముగ ఉపయోగించిన పరిశుద్దాత్ముడైన సర్వేశ్వరునియొక్క దివ్యమైన పాదపద్మములను చేరగోరువారు, ( భవనములందు పొదగబడిన )నీలమణులు, సాయంకాల సమయమునగల మసక  చీకటిని ఇనుమడించుచుండగ,అచ్చటనే వాటిమధ్యగల ముత్యములు చల్లని చంద్రుని వెన్నెలను స్పురింపజేయుచున్నదియు,అదియునుగాక  మధ్య మధ్యనగల పగడములు వలన (ఉదయమున) సూర్యునియొక్క ఎర్రనికాంతి ప్రసరింపబడుచున్నదియు, మిక్కిలి సుందరమైన కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు, మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

తెవ్వాయమఱమన్నర్ కురుదికొణ్డు,

తిరుక్కులత్తిలిఱన్దోర్కు త్తిరుత్తి శెయ్ దు,

వెవ్వాయ మాకీణ్డు వేழమ్ అట్ట,

విణ్ణవర్కోన్ తాళ్ అణైవీర్, వికిర్ ద మాదర్

అవ్వాయ వాళ్ నెడుఙ్గణ్ కువళైకాట్ట,

అరవిన్దం ముగమ్ కాట్ట అరుగే ఆమ్బల్,

శెవ్వాయిన్ తిరల్ కాట్టుమ్ వయల్ శూழ்,  కాழி

చ్చీరామవిణ్ణగరే శేర్మిన్ నీరే  ll 1182

తెవ్ ఆయ్ మఱమ్ మన్నర్ = శత్రువులైన పలు మహారాజులయొక్క; కురుది కొణ్డు= రక్తముతొ; తిరు కులత్తిల్ ఇఱన్దోర్కు తిరుత్తి శెయ్ దు = తన వంశమందు మరణించిన వారికి తర్పణముచేసి తృప్తికలిగించిన, పరశురామునిగ అవతరించిన వాడును;వెమ్ వాయ మా కీణ్డు = క్రూరమైన నోరుగల అశ్వరూపములో వచ్చిన కేశియను అశురునియొక్క నోటిని  చీల్చిన వాడును; వేழమ్ అట్ట = కువలయాపీడమను ఏనుగును వధించినవాడును, విణ్ణవర్ కోన్ తాళ్ అణైవీర్ = నిత్యశూరులకు ప్రభువైన సర్వేశ్వరుని పాదపద్మములను చేరగోరువారు; కువళై=నల్లని కలువలు; వికిర్ దమ్ మాదర్=విలక్షణమైన స్రీలయొక్క; అవ్వాయ్ వాళ్ నెడుఙ్గణ్ కాట్ట =  ప్రకాశించు విశాలమైన ఆ నేత్రములను స్పురింప జేయుచున్నదియు; అరవిన్దం ముగమ్ కాట్ట = వికసించిన తామరపుష్పములు ఆ స్త్రీల ముఖమును స్పురింప జేయునదియు;అరుగే=సమీపమునగల,ఆమ్బల్=ఎర్రనికలువలు; శెవ్వాయిన్ తిరల్ కాట్టుమ్ = వారి నోటియొక్క అదరములను స్పురింపజేయునదియు;  వయల్ శూழ் =పొలములతో చుట్టుకొనియున్న; కాழி శ్రీరామవిణ్ణగరే = కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు;నీర్ శేర్మిన్ = మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

శత్రువులైన పలు మహారాజులయొక్క రక్తముతొ తన వంశమందు మరణించిన వారికి తర్పణముచేసి తృప్తికలిగించిన,పరశురామునిగ అవతరించినవాడును,క్రూరమైన నోరుగల అశ్వరూపములో వచ్చిన కేశియను అశురునియొక్క నోటిని  చీల్చినవాడును, కువలయాపీడమను ఏనుగును వధించినవాడును, నిత్యశూరులకు ప్రభువైన సర్వేశ్వరునియొక్క పాదపద్మములను చేరగోరువారు, నల్లని కలువలు, విలక్షణమైన స్రీలయొక్క ప్రకాశించు విశాలమైన ఆ నేత్రములను స్పురింపజేయునదియు,వికసించిన తామరపుష్పములు ఆ స్త్రీల ముఖమును స్పురింపజేయునదియు, సమీపమునగల ఎర్రనికలువలు వారి నోటియొక్క అదరములను స్పురింపజేయునదియు, పొలములతో చుట్టుకొనియున్న కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు, మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

పైఙ్గణ్ విఱల్ శెమ్ముకత్తు వాలిమాళ,

పడర్ వనత్తు క్కవన్దనొడుమ్ పడైయార్ తిణ్ కై,

వెఙ్గణ్ విఱల్ విరాదనుక విల్ కునిత్త,

విణ్ణవర్కోన్ తాళణైవీర్, వెఱ్పు ప్పోలుమ్

తుఙ్గముగ మాళిగై మేలాయఙ్గూఱుమ్,

తుడిఇడైయార్ ముకక్కమలచ్చోది తన్నాల్,

తిఙ్గళ్ ముకమ్ పనిపడైక్కుమ్ అழకార్, కాழி

చ్చీరామవిణ్ణగరే శేర్మిన్ నీరే  ll 1183

పైమ్ కణ్=పచ్చని కన్నులును;శెమ్ ముగత్తు విఱల్ వాలి మాళ=ఎర్రని ముఖముగల మహాబలశాలియైన వాలి మరణించునట్లును;పడర్ వనత్తు కవన్దనొడుమ్= విశాలమైన  అడవియందు గల కబందునితో బాటు; తిణ్ పడై ఆర్ కై = దృఢమైన ఆయుధములతో  నిండిన చేతులుగల;వెమ్ కణ్ విఱల్ విరాదన్ ఉగ=ఉగ్రమైన కన్నులుగల బలశాలియైన విరాదనుడను రాక్షసుడు మరణించునట్లు; విల్ కునిత్త = ధనస్సును వంచి బాణమును ప్రయోగించిన; విణ్ణవర్ కోన్ తాళ్ అణైవీర్ = నిత్యశూరులకు ప్రభువైన సర్వేశ్వరుని పాదపద్మములను చేరగోరువారు; వెఱ్పు పోలుమ్ తుఙ్గమ్ ముగమ్ = పర్వతమువలె ఎత్తైన ముఖస్వరూపముగల; మాళిగై మేల్=భవనములపై; ఆయమ్ కూఱుమ్= స్నేహపూర్వకముగ మాటలాడుచున్న; తుడి ఇడైయార్ కమల ముక శోది తన్నాల్ డమరు వాద్యమువలె సూక్ష్మమైన తనుమధ్యముగల స్త్రీలయొక్క తామర పుష్పమువంటి ముఖవర్ఛస్సు వలన; తిఙ్గళ్ ముకమ్ పని పడైక్కుమ్=చంద్రునియొక్క ముఖమునుండి బాధతో కన్నీటిదారలు కురియునట్టి; అழగు ఆర్=మిక్కిలి సుందరమైన; కాழி శ్రీరామవిణ్ణగరే = కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు; నీర్ శేర్మిన్ = మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

పచ్చని కన్నులును, (కోపముచే) ఎర్రని ముఖముగల మహాబలశాలియైన వాలి మరణించునట్లును, విశాలమైన అడవియందుగల కబందునితో బాటు దృఢమైన ఆయుధములతో నిండిన చేతులుగల ఉగ్రమైన కన్నులుగల బలశాలియైన విరాదనుడను రాక్షసుడు మరణించునట్లు ధనస్సును వంచి బాణమును ప్రయోగించిన నిత్యశూరులకు ప్రభువైన సర్వేశ్వరుని పాదపద్మములను చేరగోరువారు, పర్వతమువలె ఎత్తైన ముఖస్వరూపముగల భవనములపై,స్నేహపూర్వకముగ మాటలాడుచున్న డమరు వాద్యమువలె సూక్ష్మమైన తనుమధ్యముగల స్త్రీలయొక్క తామర పుష్పము వంటి ముఖవర్ఛస్సు వలన,చంద్రునియొక్కముఖమునుండి బాధతో కన్నీటిదారలు కురియునట్టి మిక్కిలి సుందరమైన కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు, మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

పొరువిల్ వలమ్బురియరక్కన్ముడిగళ్ పత్తుమ్,

పుత్తుమఱిన్దన పోల ప్పువిమేల్ శిన్ద,

శెరువిల్ వలమ్బురి శిలైక్కై మలై త్తోళ్ వేన్దన్, 

తిరువడి శేర్ న్దు ఉయ్ గిఱ్పీర్, తిరై నీత్తు ఎళ్ గి

మరువి వలమ్బురి కైతై క్కழிయూడాడి,

వయల్ నణ్ణి మழை తరునీర్ త్తవழ் కాల్ మన్ని,

తెరువిల్ వలమ్బురి తరళమ్ ఈనుమ్, కాழி

చ్చీరామవిణ్ణగరే శేర్మిన్ నీరే  ll 1184

పొరువు ఇల్=సాటిలేని;వలమ్ పురి=బలము కలిగిన;అరక్కన్ =రావణాసురునియొక్క;  ముడిగళ్ పత్తుమ్ = పది తలలను; పుర్ట్రు మఱిన్దన పోల పువిమేల్ శిన్ద = చీమలపుట్ట నేలమట్టమగునటుల (బహు తేలికగ) భూమిపై పడునట్లు; శెరువిల్ = యుద్దములో  వలమ్ పురి = శక్తిని ప్రదర్శించిన; శిలై = విల్లును; కై = దివ్యమైన హస్తమునగల; మలై తోళ్ వేన్దన్ = పర్వతము పోలిన భుజములుగల చక్రవర్తి కుమారుని;తిరువడి శేర్ న్దు ఉయ్ గిఱ్పీర్ = దివ్యమైన పాదపద్మములను చేరి ఉజ్జీవింప తలచుచున్న భక్తులారా!; వలమ్బురి = శంఖములు;తిరై నీత్తు ఎళ్ గి=సముద్రమందలి నీటిని విడిచిపెట్టి; మరువి= (శీర్గాழிలో) వచ్చి చేరి; కైతై కழிయూడు ఆడి = మొగలిపూల పొదలుగల ఉప్పు కాలువయందు సంచరించుచు; వయల్ నణ్ణి = పొలములను సమీపించి; మழை తరు నీర్ త్తవழ் కాల్ = వర్షపునీటి వరదలవలన కాలువలద్వారా; తెరువిల్ మన్ని = వీదులలో వచ్చి చేరి; వలమ్బురి తరళమ్ ఈనుమ్ = శంఖములు ముత్యములను ప్రసవించుచుండెడి; కాழி శ్రీరామవిణ్ణగరే = కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు; నీర్ శేర్మిన్ = మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

సాటిలేని బలము కలిగిన రావణాసురునియొక్క పదితలలను చీమలపుట్ట నేలమట్ట మగునటుల (బహు తేలికగ) భూమిపై పడునట్లు యుద్దములో శక్తిని ప్రదర్శించిన విల్లును దివ్యమైన హస్తమునగల పర్వతము పోలిన భుజములుగల చక్రవర్తి కుమారుని దివ్యమైన పాదపద్మములను చేరి ఉజ్జీవింప తలచుచున్న భక్తులారా, శంఖములు, సముద్రమందలి నీటిని విడిచిపెట్టి (శీర్గాழிలో) వచ్చి చేరి, మొగలిపూల పొదలుగల ఉప్పు కాలువయందు సంచరించుచు,పొలములను సమీపించి,వర్షపునీటి వరదలవలన కాలువలద్వారా వీదులలో వచ్చి చేరి, శంఖములు ముత్యములను ప్రసవించుచుండెడి కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు, మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

పట్టు అరవు ఏర్ అగల్ అల్ గుల్ పవళచ్చెవ్వాయ్,

ప్పణై నెడున్దోళ్ పిణై నెడుఙ్గణ్ పాలామ్ ఇన్ శొల్,

మట్టు అవిழுమ్ కుழలిక్కా వానోర్ కావిల్,

మరమ్ కొణర్ న్దాన్ అడి అణైవీర్, అణిల్ గళ్ తావ

నెట్టిలైయ గరుఙ్గముగిన్ శెఙ్గాయ్ వీழ,

నీళ్ పలవిన్ తాழ் శినైయిల్ నెరుఙ్గు, పీన

త్తెట్టపழమ్ శిదైన్దు మదుచ్చొరియుమ్, కాழி

చ్చీరామవిణ్ణగరే శేర్మిన్ నీరే  ll 1185

పట్టు అరవు ఏర్ అగల్ అల్ గుల్=పట్టు వస్త్రము కట్టుకునియున్నదియు,పాముయొక్క  పడగవలె అందమైన విశాల కటిప్రదేశముగలదియు; పవళ శెవ్వాయ్ = పగడమువంటి ఎర్రని అదరములు కలదియు; పణై నెడు తోళ్ = వెదురువలె పొడగైన భుజములును; పిణై నెడు కణ్=లేడి కన్నులవలె విశాలమైన కన్నులును;పాల్ ఆమ్ ఇన్ శొల్= అమృతము వంటి మధురమైన వాక్కులునుగల; మట్టు అవిழுమ్ కుழలిక్కా= (కొప్పునగల వికసించిన పుష్పములవలన)తేనెలొలుకు కుంతలములుగల సత్యభామాపిరాట్టి కొరకు;వానోర్ కావిల్ = దేవలోకమందుగల నందనవనమునుండి; మరమ్ కొణర్ న్దాన్ అడి అణైవీర్=పారిజాత వృక్షమును పెకలించి తీసుకొనివచ్చిన ఆ శ్రీకృష్ణభగవానుని పాదపద్మములను చేరగోరువారు; అణిల్ గళ్ తావ = ఉడుతలు కొమ్మలలో దూకుచుండుటచే;నెడు ఇలైయ కరు కముగిన్ శెఙ్గాయ్ వీழ = పొడుగైన ఆకులుగల నల్లని పోకచెట్లయొక్క ఎర్రనికాయలు క్రిందపడగ; నీళ్ పలవిన్ = పెరిగియున్న పనస చెట్లయొక్క; తాழ் శినైయిల్ = (కాయలయొక్క బరువుచే) క్రిందకు వ్రేలాడుచున్న కొమ్మలలో; నెరుఙ్గు= సమీపమున నున్న; పీన = ఉబ్బిన; తెట్ట పழమ్ శిదైన్దు = పక్వమునకు వచ్చిన పండ్లు చిదిగి; మదు శొరియుమ్ = తేనెలు కురియుచున్నట్టి; కాழி శ్రీరామవిణ్ణగరే = కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు; నీర్ శేర్మిన్ = మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

పట్టు వస్త్రము కట్టుకునియున్నదియు,పాముయొక్క  పడగవలె అందమైన విశాల కటిప్రదేశము గలదియు,పగడమువంటి ఎర్రని అదరములు కలదియు,  వెదురువలె పొడగైన భుజములును, లేడి కన్నులవలె విశాలమైన కన్నులును, అమృతమువంటి మధురమైన వాక్కులునుగల, (కొప్పునగల వికసించిన పుష్పములవలన) తేనెలొలుకు కుంతలములుగల సత్యభామాపిరాట్టి కొరకు, దేవలోకమందుగల నందనవనమునుండి పారిజాతవృక్షమును పెకలించి తీసుకొనివచ్చిన ఆ శ్రీకృష్ణభగవానుని పాదపద్మములను  చేరగోరువారు, ఉడుతలు కొమ్మలలో దూకుచుండుటచే పొడుగైన ఆకులుగల నల్లని పోకచెట్లయొక్క ఎర్రనికాయలు క్రిందపడగ,పెరిగియున్న పనస చెట్లయొక్క కాయలయొక్క బరువుచే క్రిందకు వ్రేలాడుచున్న కొమ్మలలో సమీపముననున్న ఉబ్బిన పక్వమునకు వచ్చిన పండ్లు చిదిగి తేనెలు కురియుచున్నట్టి, కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు, మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

పిఱైతఙ్గుశడైయానై వలత్తే వైత్తు,

ప్పిరమనై త్తన్నున్దియిలే తోర్ట్రువిత్తు,

కఱైతఙ్గు వేల్ తడఙ్గణ్తిరువై మార్బిల్,

కలన్దవన్ తాళణైగిఱ్పీర్, కழுనీర్ కూడి

తుఱై తఙ్గుకమలత్తు త్తుయిన్ఱు, కైతై

త్తోడారుమ్ పోది శోర్ట్రు చ్చుణ్ణమ్ నణ్ణి,

శిఱై వణ్డు కళిపాడుమ్ వయల్ శూழ், కాழி

చ్చీరామవిణ్ణగరే శేర్మిన్ నీరే  ll 1186

పిఱై తఙ్గు శడైయానై  వలత్తే వైత్తు = చంద్రవంక జటయందుగల శివుని తన కుడివైపున చేర్చుకొన్న వాడును; పిరమనై తన్ ఉన్దియిలే తోర్ట్రువిత్తు = చతుర్ముఖ బ్రహ్మను తన నాభి కమలమందు ఉద్భవింపజేసినవాడును; కఱై తఙ్గు వేల్ తడ కణ్ తిరువై మార్బిల్ కలన్దవన్=(శత్రువుల) రక్తమాంసముల మరకలు కలిగిన శూలమువలె విశాలమైన  నేత్రములుగల శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలమందు ఉంచుకొనిన సర్వేశ్వరునియొక్క; తాళ్ అణైగిఱ్పీర్=దివ్యమైన పాదపద్మములను చేరగోరువారు;శిఱై వణ్డు=రెక్కలుగల  తుమ్మెదలు;కழுనీర్ కూడి=ఎర్రకలువలయందు(తమ ఆడ తుమ్మెదలతో)చేరి సుఖించి; తుఱై తఙ్గు కమలత్తు తుయిన్ఱు=నీటిప్రదేశములందు గల తామరపుష్పములలో (తేనెనుగ్రోలి) అచటనే నిదురించి;(పిదప) కైతై తోడు ఆరుమ్ = మొగలి పూ దళములందు నిండియున్న; పోది శోర్ట్రు శుణ్ణమ్ నణ్ణి = పుప్పొడి రేణువులలో చేరి దొర్లుకొని; కళి పాడుమ్ వయల్ శూழ் = సంతసముతో ఇంపుగ పాడుచుండెడి పొలములతో చుట్టుకొనియున్న; కాழி శ్రీరామవిణ్ణగరే = కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు; నీర్ శేర్మిన్ = మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

చంద్రవంక జటయందుగల శివుని తన కుడివైపున చేర్చుకొన్నవాడును, చతుర్ముఖ బ్రహ్మను తన నాభి కమలమందు ఉద్భవింపజేసినవాడును, (శత్రువుల) రక్తమాంసముల మరకలు కలిగిన శూలమువలె విశాలమైన నేత్రములుగల శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలమందు ఉంచుకొనిన సర్వేశ్వరునియొక్క దివ్యమైన పాదపద్మములను చేరగోరువారు,రెక్కలుగల తుమ్మెదలు ఎర్రకలువలయందు(తమ ఆడ తుమ్మెదలతో) చేరి సుఖించి,నీటిప్రదేశములందు గల తామరపుష్పములలో(తేనెనుగ్రోలి) అచటనే నిదురించి,(పిదప) మొగలి పూ దళములందు నిండియున్న పుప్పొడి రేణువులలో చేరి దొర్లుకొని, సంతసముతో, ఇంపుగ పాడుచుండెడి పొలములతో చుట్టుకొనియున్న కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమునకు, మీరు వెడలి ఆ త్రివిక్రమన్ పెరుమాళ్ దివ్య పాదములను సేవించుకొనుడు.

** శెఙ్గమలత్తు అయననైయ మఱైయోర్, కాழி

చ్చీరామవిణ్ణగరిన్  శెఙ్గణ్ మాలై,

అఙ్గమల త్తడవయల్ శూழ் ఆలినాడన్,

అరుళ్ మారి యరట్టముక్కి అడైయార్ శీయమ్,

కొఙ్గుమలర్ కుழలియర్ వేళ్ మంగై వేన్దన్, 

కొర్ట్ర వేల్ పరకాలన్ కలియన్ శొన్న, 

శఙ్గముగ త్తమిழ் మాలై పత్తుం వల్లార్, 

తడఙ్గడల్ శూழ் ఉలగుక్కు త్తలైవర్ తామే ll 1187

శెఙ్గమలత్తు అయన్ అనైయ మఱైయోర్=సుందరమైన నాభి కమలమందు ఉద్భవించిన చతుర్ముఖ బ్రహ్మను పోలిన బ్రాహ్మణోత్తములు నివసించుచున్న;కాழி చ్చీరామవిణ్ణగరిన్  శెమ్ కణ్ మాలై = కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమందు వేంచేసియున్న ఎర్ర తామర పుష్పమువంటి నేత్రములుగల సర్వేశ్వరుని విషయమై; అమ్ కమల తడమ్ వయల్ శూழ் ఆలినాడన్ = అందమైన తామరపుష్పములతో నిండిన తటాకములుగల పొలములచే చుట్టుకొనియున్న తిరువాలి దేశమునకు ప్రభువును; అరుళ్ మారి = (భక్తులయందు) కృపను వర్షించు మేఘమువంటివారును; అరట్టు అముక్కి= పాపము చేయువారిని తల ఎత్తనీయక అణచువారును; అడైయార్ శీయమ్ = శత్రువులకు సింహము వంటివారును; కొఙ్గు మలర్ కుழలియర్ వేళ్ = తేనెలొలుకు పుష్పములతో అలంకరించు కొనిన కుంతలములుగల స్త్రీలచే ఆశింపబడువారును; మంగై వేన్దన్ =తిరుమంగై దేశమునకు నిర్వాహకులును, పరకాలన్ = ఎదిరించినవారికి యముడువంటి వారును; కొర్ట్ర వేల్=విజయము చేకూర్చెడి శూలాయుధముగల; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; శొన్న = అనుగ్రహించిన; శఙ్గమ్ ముగమ్ తమిழ் మాలై పత్తుం వల్లార్ తామ్ = కవుల సమూహములు గుమిగూడి కొండాడతగిన తమిళ భాషలో మాలగనున్న ఈ పది పాశురములను అనుసంధించువారు; తడ కడల్ శూழ் ఉలగుక్కు= విశాలమైన సముద్రముచే చుట్టుకొనియున్న భూమండలమునకు;తలైవర్ = నాయకులగుదురు.

  సుందరమైన నాభి కమలమందు ఉద్భవించిన చతుర్ముఖ బ్రహ్మను పోలిన బ్రాహ్మణోత్తములు నివసించుచున్న కాழி క్షేత్రమందుగల శ్రీరామవిణ్ణగరం దివ్యదేశమందు వేంచేసియున్న ఎర్ర తామర పుష్పమువంటి నేత్రములుగల సర్వేశ్వరుని విషయమై,అందమైన తామరపుష్పములతో నిండిన తటాకములుగల పొలములచే చుట్టుకొనియున్న తిరువాలి దేశమునకు ప్రభువును,(భక్తులయందు) కృపను వర్షించు మేఘమువంటివారును,పాపము చేయువారిని తల ఎత్తనీయక అణచువారును, శత్రువులకు సింహమువంటివారును,తేనెలొలుకు పుష్పములతో అలంకరించుకొనిన కుంతలములు గల స్త్రీలచే ఆశింపబడువారును,తిరుమంగై దేశమునకు నాయకులును, ఎదిరించినవారికి యముడు వంటి వారును,విజయము చేకూర్చెడి శూలాయుధముగల తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన, కవుల సమూహములు గుమిగూడి కొండాడతగిన తమిళ భాషలో మాలగనున్న ఈ పది పాసురములను అనుసంధించువారు,విశాలమైన సముద్రముచే చుట్టుకొనియున్న భూమండలమునకు నాయకులగుదురు.

*********

వ్యాఖ్యానించండి