పెరియ తిరుమొழி-3వపత్తు (7)

శ్రీః

7. కళ్వన్గొల్

                        పరకాలనాయకి అవస్థను దూతలనుండి గ్రహించిన తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న సర్వేశ్వరుడు, ఎదుట దర్శనమొసగిన సమయమున పరకాలనాయకి  తనతో  పలికిన పలుకులు విని, సర్వేశ్వరుడు ” ఇక ఈమెను ఇట్టి స్థితలోనుంచుట భావ్యము కాదని ” తన చెంత కొనిపోగ, పరకాలనాయకి యొక్క తల్లి ఆవేదనను తిరుమంగై ఆళ్వార్ వెలిబుచ్చుచున్నారు. 

** కళ్వన్గొల్ యానఱియేన్, కరియాన్ ఒరు కాళైవన్దు,

వళ్ళి మరుఙ్గులెన్ఱన్, మడమానినై ప్పోదవెన్ఱు,

వెళ్ళివళైక్కై పర్ట్ర, పెర్ట్ర తాయరై యిట్టగన్ఱు,

అళ్ళల్ అమ్బూఙ్గழని, అణి యాలి పుకువర్ కొలొ ll 1208

కళ్వన్ కొల్ యాన్ అఱియేన్ = ( వచ్చి తీసుకొనిపోయిన వ్యక్తి ) చోరుడో లేక యజమానుడో నాకు తెలియదు; కరియాన్ ఒరు కాళైవన్దు = నల్లని ఒక యౌవన పురుషుడు వచ్చి; వళ్ళి మరుఙ్గుల్ = తీగవలె సూక్ష్మమైన నడుముగల; ఎన్ తన్ మడమ్ మానినై = నాయొక్క,అందమైన చిన్నలేడివలెనున్న కుమార్తెను;పోద ఎన్ఱు=రమ్ము రమ్మని; వెళ్ళి వళై కై పర్ట్ర = వెండి కంకణములుగల చేతిని పట్టుకొనగ; (వెంటనే నాకుమార్తె ), పెర్ట్ర తాయరై యిట్టు అగన్ఱు = కని పెంచిన తల్లియైన నన్ను ఉపేక్షించి విడిచిపెట్టెను గదా!; (వారిద్దరు కలసి) అళ్ళల్ అమ్ పూమ్ కழని అణి = బురద ప్రదేశములందు అందమైన పుష్పములతో నిండియున్న పొలములతో అలంకృతమైన; ఆలి = తిరవాలి దివ్య దేశమునకు; పుకువర్ కొలొ = పోయి చేరుకొనియుందురో!

చోరుడో లేక యజమానుడో, ఒక నల్లని యౌవన పురుషుడు వచ్చి తీగవలె సూక్ష్మమైన నడుముగల నాయొక్క అందమైన చిన్నలేడివలెనున్న కుమార్తెను,” రమ్ము రమ్మని ” వెండి కంకణములుగల చేతిని పట్టుకొనగ వెంటనేనాకుమార్తె కని పెంచిన తల్లియైన నన్ను ఉపేక్షించి విడిచిపెట్టెనుగదా!,వారిద్దరు కలసి బురద ప్రదేశములందు అందమైన పుష్పములతో నిండియున్న పొలములతో అలంకృతమైన తిరవాలి దివ్య దేశమునకు పోయి చేరుకొనియుందురో!

పణ్డు ఇవన్ ఆయన్ నఙ్గాయ్, పడిఱన్ పుగున్దు, ఎన్ మగళ్ తన్

తొణ్డై అమ్ శెమ్ కనివాయ్, నుగర్ న్దానై యుగన్దు, అవన్ పిన్

కెణ్డై యొణ్ కణ్ మిళిర, క్కిళిపోల్ మిழర్ట్రినడన్దు,

వణ్డమర్ కానల్ మల్ గుమ్, వయలాలి పుగువర్ కొలో ll 1209

నఙ్గాయ్ = (సమీపమునగల యువతిని ఉద్దేశించి) అమ్మా!; ఇవన్ = నా కుమార్తెను వెంటకొనిపోయిన ఇతను; పణ్డు = మునుపు; పడిఱన్ = (పడుచు యువతులను అపహరించుట మొదలగు) నిందింపబడు కృత్యములు చేసెడు; ఆయన్ = గొల్లవాడు; (అటువంటివాడు ఇప్పుడు) పుగున్దు=ఇచటకు వచ్చి నాయింట దూరి;ఎన్ మగళ్ తన్ = నా కుమార్తె యొక్క; అమ్ శెమ్ కనివాయ్ = అందమైన ఎర్రని దొండ పండువలె నున్న అధరములను; నుగర్ న్దానై = ఆస్వాదించిన ఇతనిని; ఉగన్దు = నా కుమార్తె ఆశించి; కెణ్డై ఒణ్ కణ్ మిళిర= కెణ్డై మీనము వలె అందమైన కన్నులు సంతోషముతో మెరియగ; కిళిపోల్ మిழర్ట్రి = చిలుకవలె  ముద్దుమద్దుగ పలుకుచు; అవన్ పిన్ నడన్దు = అతని వెనుకనే నడచుకొని పోయి; (ఐక్యమైన వారిద్దరు) వణ్డ అమర్ = తుమ్మెదలతో నిండిన; కానల్ మల్ గుమ్ = సముద్రతీరమందు గల తోటలతో చుట్టబడియున్న; వయల్ = పొలములుగల;ఆలి=తిరవాలి దివ్య దేశమునకు; పుకువర్ కొలొ= చేరుకొనియుందురో!

            (సమీపమునగల యువతిని ఉద్దేశించి )అమ్మా! నా కుమార్తెను వెంటకొనిపోయిన ఇతను మునుపు పడుచు గోపికలను అపహరించుట మొదలగు  నిందింపబడు కృత్యములు చేసెడు గొల్లవాడే సుమా! అటువంటివాడు ఇప్పుడు ఇచటకు వచ్చి నాయింట దూరి నా కుమార్తె యొక్క అందమైన ఎర్రని దొండ పండువలె నున్నఅధరములను ఆస్వాదించిన ఇతనిని నా కుమార్తె ఆశించి,కెణ్డై మీనము వలె అందమైన కన్నులు సంతోషముతో మెరియగ,చిలుకవలె  ముద్దుమద్దుగ పలుకుచు అతని వెనుకనే నడచుకొని పోయిన, ఐక్యమైన వారిద్దరు తుమ్మెదలతో నిండిన సముద్రతీరమందు గల తోటలతో చుట్టబడియున్న పొలములుగల తిరవాలి దివ్య దేశమునకు చేరుకొనియుందురో!

అఞ్జువన్ వెఞ్జొల్ నఙ్గాయ్, అరక్కర్ కులప్పావై తన్నై,

వెఞ్జిన మూక్కరిన్ద, విఱలోన్ తిఱమ్ కేట్కిల్, మెయ్యే

పఞ్జియ మెల్ అడి, ఎమ్ పణైత్తోళి పరక్కழிన్దు,

వఞ్జి యన్దణ్ పణై శూழ், వయలాలి పుగువర్ కొలో ll 1210

వెమ్ శొల్ నఙ్గాయ్ = ( దుఃఖసమయములందు ఓదార్చుటకు తగు) తీక్ష్ణమైన వాక్కులుగల (ప్రక్క గహమందుగల యువతిని) అమ్మా!; అరక్కర్ కుల పావై తన్నై = రాక్షసకులమున గణనీయమైన రాక్షసస్త్రీ శూర్పణఖ యొక్క; మూక్కు=నాసికను; వెమ్ శినమ్= మిక్కిలి కోపముతో; అరిన్ద = తెగత్రుంచిన; విఱలోన్ = బలమైన ఆయౌవన పురుషుని;తిఱమ్=విధానము; కేట్కిల్= వినినయెడల;మెయ్యే అఞ్జువన్=యధార్ధముగ భయపడుచున్నాను;పఞ్జియ మెల్ అడి=దూదివలె మృదువైన పాదములుగల; ఎమ్ పణై తోళి = నాయొక్క వెదురువలె పొడగైన భుజములుగల కుమార్తె; పర కழிన్దు = నమ్రతవీడి నిందకుస్థానమై; (అతనితో చేరి వారిద్దరు) వఞ్జి అమ్ తణ్ పణై శూழ் = పాకుచున్న తీగలతో అందమైన చల్లని జలాశయములతో చుట్టుకొనియున్న;వయల్ = పొలములుగల;ఆలి=తిరవాలి దివ్య దేశమునకు; పుకువర్ కొలొ= చేరుకొనియుందురో?.

( దుఃఖసమయములందు ఓదార్చుటకు తగు) తీక్ష్ణమైన మనోహరమైన వాక్కులుగల (ప్రక్క గహమందుగల యువతిని ఉద్దేశించి ) అమ్మా! రాక్షసకులమున గణనీయమైన రాక్షసస్త్రీ శూర్పణఖ యొక్క నాసికను మిక్కిలి కోపముతో తెగత్రుంచిన బలమైన ఆయౌవన పురుషుని విధానము వినినయెడల యధార్ధముగ భయపడుచున్నాను. దూదివలె మృదువైన పాదములుగల నాయొక్క వెదురువలె పొడగైన భుజములుగల కుమార్తె నమ్రతవీడి నిందకుస్థానమై, అతనితో చేరి వారిద్దరు పాకుచున్న తీగలతో అందమైన చల్లని జలాశయములతో చుట్టుకొనియున్న పొలములుగల తిరవాలి దివ్య దేశమునకు చేరుకొనియుందురో!

ఏదు అవన్ తొల్ పిఱప్పు, ఇళై యవన్ వళైయూది, మన్నర్

తూదువనాయవనూర్, శొల్లువీర్ ! శొల్లీర్ అఱియేన్,

మాతవన్ తన్ తుణైయా నడన్దాళ్, తడమ్ శూழ் పుఱవిల్, 

పోతు వణ్డాడు శెమ్మల్, పునలాలి పుగువర్ కొలో ll 1211

అవన్ = నాయొక్క కుమార్తెను తీసుకునిపోయిన వానియొక్క; తొల్ పిఱప్పు = పూర్వ జన్మము; ఏదు = ఏమైయుండునో?; అఱియేన్=తెలియదు; ఇళై యవన్ = యౌవనుడు; వళైయూది = శంఖమును పూరించి; మన్నర్ తూదువనాయవన్=పాండవులకు దూతగ వెడలినవానియొక్క; ఊర్ అఱియేన్ = వసించు దేశము తెలియదు; శొల్లువీర్ గళ్ శొల్లీర్ = చెప్పగలిగినవారైన మీరు చెప్పుడు; మాతవన్ తన్ తుణైయా నడన్దాళ్ = (నాకుమార్తె) మాధవుని తనకు సహాయముగ పొంది అతనితో వెడలిపోయినది; తడమ్  శూழ் పుఱవిల్ = తటాకములతో చుట్టుకొనియున్న తోటలుకలదియు; పోద వణ్డు ఆడు శెమ్మల్=పుష్పములందు తుమ్మెదలు సంతోషముతో నృత్యముచేయు గొప్పతనముగల; పునల్ = తీర్థస్థానములు కలిగియున్న;ఆలి పుగువర్ కొలో=తిరవాలి దివ్య దేశమునకు చేరుకొనియుందురో?.

            (తన సమీపమున గలవారిని ఉద్దేశించి) నాయొక్క కుమార్తెను తీసుకునిపోయిన వానియొక్క పూర్వ జన్మము ఏమైయుండునో? తెలియదు. ఆ యౌవనుడు శంఖమును పూరించి పాండవులకు దూతగ వెడలినవానియొక్క వసించు దేశము తెలియదు. చెప్పగలిగినవారైన మీరు చెప్పుడు. నాకుమార్తె మాధవుని తనకు సహాయముగ పొంది అతనితో వెడలిపోయినది. వారిద్దరు, తటాకములతో చుట్టుకొనియున్న తోటలు కలదియు, పుష్పములందు తుమ్మెదలు సంతోషముతో నృత్యముచేయు గొప్పతనముగల, తీర్థస్థానములు కలిగియున్న తిరవాలి దివ్య దేశమునకు చేరుకొనియుందురో?.

తాయెనైయెన్ఱు ఇరఙ్గాళ్, తడన్దోళి తనక్కమైన్ద,

మాయనై మాతవనై, మదిత్తెన్నై యగన్ఱ ఇవళ్,

వేయన తోళ్ విశిరి, ప్పెడై యన్న మెననడన్దు,

పోయిన పూఙ్గొడియాళ్, పునలాలి పుగువర్ కొలో ll 1212

తాయెనై ఎన్ఱు ఇరఙ్గాళ్ = కని పెంచిన తల్లినని జాలిలేక; తడమ్ తోళి = పెద్ద భుజములుగల నాయొక్క కుమార్తె; తనక్కు అమైన్ద = తనకు తగిన; మాయనై మాతవనై = ఆశ్చర్యకరమైన మాధవుని; మదిత్తు = కొనియాడుచు;ఎన్నై యగన్ఱ = నన్ను విడిచిపెట్టిన; ఇవళ్ = ఈ నాయొక్క కుమార్తె; వేయన తోళ్ విశిరి = వెదురవంటి భుజములను కదుపుచు; పెడై అన్నమ్ ఎన నడన్దు పోయిన = ఆడ హంసవలె నడుచుకొనుచు వెడలిన; పూమ్ కొడియాళ్ = అందమైన తీగవలెనున్న నాయొక్క కుమార్తెయు(ఆ మాధవుడును) పునల్ = తీర్థస్థానములు కలిగియున్న; ఆలి పుగువర్ కొలో = తిరవాలి దివ్య దేశమునకు చేరుకొనియుందురో?.

కని పెంచిన తల్లినని జాలిలేక పెద్ద భుజములుగల నాయొక్క కుమార్తె తనకు తగిన ఆశ్చర్యకరమైన మాధవుని కొనియాడుచు నన్ను విడిచిపెట్టిన ఈ నాయొక్క కుమార్తె వెదురవంటి భుజములను కదుపుచు ఆడ హంసవలె నడుచుకొనుచు వెడలిన అందమైన తీగవలెనున్న నాయొక్క కుమార్తెయు ఆ మాధవుడును తీర్థస్థానములు కలిగియున్న తిరవాలి దివ్య దేశమునకు చేరుకొనియుందురో?.

**       ఎన్ తుణైయెన్ఱు ఎడుత్తేఱ్కు, ఇఱైయేనుమ్ ఇరఙ్గిర్ట్రిలళ్,

తన్ తుణైయాయ ఎన్ఱన్, తనిమైక్కుమ్ ఇరఙ్గిర్ట్రిలళ్, 

వన్ తుణై వానవర్కాయ్, వరఞ్జెర్ట్రు అరఙ్గత్తుఱైయుమ్,

ఇన్ తుణైవనొడుమ్ పోయ్, ఎழிలాలి పుగువర్ కొలో ll 1213

ఎన్ తుణైయెన్ఱు ఎడుత్తేఱ్కు = “ఈమె నాకు సహాయముగ నుండునని” తలచియున్నకనిపెంచిన నావిషయమున; ఇఱైయేనుమ్ = కొంచెమైనను; ఇరఙ్గిర్ట్రిలళ్ = కనికరము కలిగియుండలేదు; తన్ తుణైయాయ ఎన్ తన్=(ఇదివరకు) తనకు సహాయురాలిగ ఉండిన నేను ;తనిమైక్కుమ్ = నాకు కలిగెడు ఒంటరితనమును తలచి; ఇరఙ్గిర్ట్రిలళ్= జాలి కలిగియుండలేదు; వానవర్కు= దేవతలకు;వణ్ తుణై ఆయ్= శ్లాఘ్యమైన సహాయభూతుడై; వరమ్ శెర్ట్రు=(రావణాది రాక్షసుల యొక్క)వరబలమును  నశింపజేసి; అరఙ్గత్తు ఉఱైయుమ్ = (శ్రీరంగం) కోవెలలో శయనించియున్న;ఇన్ తుణైవనొడుమ్ పోయ్ = మంచి సహాయభూతుడైన శ్రియఃపతితో పోయి; ఎழிల్ = సుందరమైన; ఆలి పుగువర్ కొలో = తిరవాలి దివ్య దేశమునకు చేరుకొనియుందురో?.

“ఈమె నాకు సహాయముగ నుండునని” తలచియున్న, కనిపెంచిన నావిషయమున కొంచెమైనను కనికరము కలిగియుండలేదు.( ఇదివరకు) తనకు సహాయురాలిగ ఉండిన నేను, నాకు కలిగెడు ఒంటరితనమును తలచి జాలి కలిగియుండలేదు. దేవతలకు శ్లాఘ్యమైన సహాయభూతుడై రావణాది రాక్షసుల యొక్క వరబలమును నశింపజేసి శ్రీరంగం కోవెలలో శయనించియున్న మంచి సహాయభూతుడైన శ్రియఃపతితో పోయి  వారిద్దరును సుందరమైన తిరవాలి దివ్య దేశమునకు చేరుకొనియుందురో?.

అన్నైయుమ్ అత్తనుమెన్ఱు, అడియోముక్కు ఇరఙ్గిర్ట్రిలళ్, 

పిన్నైత్తన్ కాదలన్ తన్, పెరున్దోళ్ నలమ్ పేణినళాల్,

మిన్నైయుమ్ వఞ్జియైయుమ్, వెన్ఱు ఇలఙ్గుమ్ ఇడైయాళ్ నడన్దు,

పున్నైయుమ్ అన్నముమ్ శూழ், పునలాలి పుగువర్ కొలో ll 1214

మిన్నైయుమ్ = మెరుపును మరియు; వఞ్జియైయుమ్ = పాకెడి సన్నని తీగెను; వెన్ఱు ఇలఙ్గుమ్ = జయించిన మిక్కిలి సూక్ష్మమైన ప్రకాశించు; ఇడైయాళ్ = నడుముగల నాయొక్క కుమార్తె; అన్నైయుమ్ అత్తనుమ్ ఎన్ఱు = తల్లి,తండ్రి యని;అడియోముక్కు=మాయొక్క విషయమున;ఇరఙ్గిర్ట్రు ఇలళ్=విచారించి యుండలేదు;పిన్నై తన్ కాదలన్  తన్=నప్పిన్నైపిరాట్టియొక్క ప్రియమైన స్వామియొక్క; పెరుమ్ తోళ్ నలమ్ పేణినళాల్=గొప్పదైన భుజముల కౌగిలియందుగల మహదానందమును ఆశించినదై; నడన్దు = (అతనితోకూడ) నడచుకొని; పున్నైయుమ్ = పున్నై తోటలతోను; అన్నముమ్ శూழ் = హంసలతోను చుట్టుకొనియున్న; పునల్ = తీర్థస్థానములు కలిగియున్న; ఆలి పుగువర్ కొలో = తిరవాలి దివ్య దేశమునకు చేరుకొనియుందురో?.

                     మెరుపును మరియు పాకెడి సన్నని తీగెను జయించిన మిక్కిలి సూక్ష్మమైన, ప్రకాశించు,నడుముగల నాయొక్క కుమార్తె ” తల్లి,తండ్రి ” అని మాయొక్క విషయమున విచారించి యుండలేదు. నప్పిన్నైపిరాట్టియొక్క ప్రియమైన స్వామియొక్కగొప్పదైన భుజముల కౌగిలియందుగల మహదానందమును ఆశించినదై అతనితోకూడ నడచుకొని, పున్నై తోటలతోను,హంసలతోను చుట్టుకొనియున్న తీర్థస్థానములు కలిగియున్న తిరవాలి దివ్య దేశమునకు చేరుకొనియుందురో?.

ముర్ట్రిలుమ్ పైఙ్గిళియుమ్, పన్దుమ్ ఊశలుమ్ పేశుగిన్ఱ,

శెర్ట్రిల్ మెన్ పూవైయుమ్, విట్టు అగన్ఱ శెழுమ్ కోదైతన్నై,

పెర్ట్రిలేన్ ముర్ట్రిழைయై, ప్పిఱప్పిలి పిన్నే నడన్దు,

మర్ట్రెల్లామ్ కైతొழ ప్పోయ్, వయలాలి పుగువర్ కొలో ll 1215

ముర్ట్రిలుమ్ = ఆటలాడుకొనెడు చిన్న చేటయు; పైమ్ కిళియుమ్ = ఆకుపచ్చని చిలుకయు; పన్దుమ్ = బంతియు; ఊశలుమ్ = ఊయలను; శెర్ట్రిల్ పేశుగిన్ఱ = చిన్నగూటిలోనుండి పలికెడు;మెన్ పూవైయుమ్ = సున్నితమైన మైనా పక్షియు;విట్టు అగన్ఱ= విడిచిపెట్టి వెడలిన;శెழுమ్ కోదైతన్నై = అందమైన పుష్పమాలవలె నున్న; ముర్ట్రు ఇழைయై = నిండుగ ఆభరణములచే అలంకృతమైన నాయొక్క కుమార్తె; పెర్ట్రిలేన్ = నేను కన్నులతో కానకున్నాను; మర్ట్రు ఎల్లామ్ కైతొழ = మిగిలినవారందరు చూచి సేవించుచుండగ; పిఱప్పు  ఇలి పిన్నే నడన్దు = నిత్యుడైన సర్వేశ్వరుని వెనుకనే నడచుకొని పోయి;(వారిద్దరు) వయల్ = పొలములుగల; ఆలి = తిరవాలి  దివ్య దేశమునకు; పుకువర్ కొలొ= చేరుకొనియుందురో?.

ఆటలాడుకొనెడు చిన్న చేటయు,ఆకుపచ్చని చిలుకయు,బంతియు, ఊయలను,చిన్న గూటిలోనుండి పలికెడు సున్నితమైన మైనా పక్షియు విడిచిపెట్టి వెడలిన అందమైన పుష్పమాలవలె నున్న, నిండుగ ఆభరణములచే అలంకృతమైన నాయొక్క కుమార్తె నేను కన్నులతో కానకున్నాను. మిగిలినవారందరు చూచి సేవించుచుండగ నిత్యుడైన సర్వేశ్వరుని వెనుకనే నడచుకొని పోయి, వారిద్దరు, పొలములుగల తిరవాలి దివ్య దేశమునకు చేరుకొనియుందురో!

కావి అమ్ కణ్ణి యెణ్ణిల్, కడి మా మలర్ ప్పావై యొప్పాళ్,

పావియేన్ పెర్ట్రమైయాల్, పణైత్తోళి పరక్కழிన్దు, 

తూవిశేర్ అన్నమన్ననడైయాళ్, నెడుమాలొడుమ్ పోయ్,

వావి యన్దణ్ పణై శూழ், వయలాలి పుగువర్ కొలో ll 1216

కావి అమ్ కణ్ణి = నీలోత్పములు వంటి అందమైన నేత్రములు గలదియు; ఎణ్ణిల్ కడి మా మలర్ ప్పావై ఒప్పాళ్=నిజముగ తలచినయెడల పెద్ద కమలవాసిని శ్రీమహాలక్ష్మికి సరితూగునట్లు ఒప్పునదియు; తూవిశేర్ అన్నమన్న నడైయాళ్ = అందమైన రెక్కలుగల హంసవలె గమనము కలదియు;పణై తోళి=వెదురువలె పొడగైన భుజములు కలదియు; పావియేన్ పెర్ట్రమైయాల్ = పాపియైన నాకడుపున పుట్టుటచే; పర కழிన్దు = పెద్ద నిందకుగురియై; నెడుమాలొడుమ్ పోయ్ = సర్వేశ్వరునితో కూడ పోయి;(వారిద్దరును) వావి అమ్ తణ్ పణై శూழ் = చెరువులు, అందమైన చల్లని జలాశయములతో చుట్టుకొనియున్న; వయల్ = పొలములుగల; ఆలి = తిరవాలి దివ్య దేశమునకు; పుకువర్ కొలొ= చేరుకొనియుందురో?.

నీలోత్పములు వంటి అందమైన నేత్రములు గలదియు, నిజముగ తలచినయెడల పెద్ద కమలవాసిని శ్రీమహాలక్ష్మికి సరితూగునట్లు ఒప్పునదియు, అందమైన రెక్కలుగల హంసవలె గమనము కలదియు,వెదురువలె పొడగైన భుజములు కలదియు,పాపియైన నాకడుపున పుట్టుటచే పెద్ద నిందకుగురియై సర్వేశ్వరునితో కూడ పోయి,వారిద్దరును,చెరువులు, అందమైన చల్లని జలాశయములతో చుట్టుకొనియున్న పొలములుగల తిరవాలి దివ్య దేశమునకు చేరుకొనియుందురో!

** తాయ్ మనమ్ నిన్ఱిరఙ్గ, తనియే నెడుమాల్  తుణైయా, 

పోయిన పూఙ్గొడియాళ్, పునలాలి పుగువరెన్ఱు,

కాయ్ శిన వేఱ్కలియన్, ఒలి శెయ్ తమిழ் మాలై పత్తుమ్,

మేవియ నెఞ్జుడైయార్,  తఞ్జమావదు విణ్ణులగే ll 1217

తాయ్ = తల్లి; మనమ్ నిన్ఱు ఇరఙ్గ = మనసు కలతచెందునట్లు;తనియే=ఒంటరిగనే;  నెడుమాల్ తుణైయా = మిక్కిలి ఆశ్రిత వ్యామోహముగల సర్వేశ్వరుని సహాయముగ; పోయిన = వెడలిపోయిన; పూమ్ కొడియాళ్ = అందమైన తీగవలెనున్న ఆమెయొక్క కుమార్తె; ( వారిరువురును ) పునల్ ఆలి పుగువల్ ఎన్ఱు = తీర్థస్థానములు కలిగియున్న తిరవాలి దివ్య దేశమునకు చేరుకొనియుందురని చింతనచేసి; కాయ్ శిన వేల్ కలియన్= శత్రువులను తపింపజేయు కోపముగల శూలాయుధము ధరించిన తిరుమంగై ఆళ్వార్;  ఒలి శెయ్ = అనుగ్రహించిన; తమిழ் మాలై పత్తుమ్ = తమిళ భాషలోనున్న ఈ పది పాశురములు; మేవియ నెఞ్జు ఉడైయార్ = అమరియున్న మనస్సు గలవారికి; విణ్ ఉలగే = పరమపదమే; తఞ్జమ్ ఆవదు = ఆశ్రమమగును.

    తల్లి మనసు కలతచెందునట్లు ఒంటరిగనే మిక్కిలి ఆశ్రిత వ్యామోహముగల సర్వేశ్వరుని సహాయముగ వెడలిపోయిన అందమైన తీగవలెనున్న ఆమెయొక్క కుమార్తె, వారిరువురును, తీర్థస్థానములు కలిగియున్న తిరవాలి దివ్య దేశమునకు చేరుకొనియుందురని చింతనచేసి, శత్రువులను తపింపజేయు కోపముగల శూలాయుధము ధరించిన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన తమిళ భాషలోనున్న ఈ పది పాసురములు అమరియున్న మనస్సు గలవారికి పరమపదమే ఆశ్రమమగును.

**********

వ్యాఖ్యానించండి