శ్రీః
3.పేరణిన్దు
అవతారిక :
నాఙ్గూర్ ప్రాంతములో నున్న దివ్య దేశములన్నింటకి మిక్కిలి మధ్య నున్న తిరు శెమ్బొన్ శెయ్ కోయిల్ యందు కృపతో వేంచేసిన దయాసముద్రుడైన పేరరుళాలన్ పెరుమాళ్ ను ఉద్దేశించి తిరుమంగై ఆళ్వారులు ఈ పది పాశురములతో మంగళాశాసనము చేసినారు.
** పేరణిన్దు ఉలగత్తవర్ తొழுదేత్తుమ్ , పేరరుళాళ నెమ్బిరానై ,
వారణి ములైయాళ్ మలర్ మగళోడు , మణ్ మగళుముడనిఱ్ప ,
శీరణిమాడ నాంగైనన్నడువుళ్ , శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే ,
కారణిమేగమ్ నిన్ఱ దొప్పానై , కణ్డుకొణ్డు ఉయ్ న్దొழிన్దేనే . 1268
ఉలగత్తవర్ = లోకములో నున్న జనులందరు; పేర్ అణిన్దు = నామసంకీర్తనము చేసి; తొழுదు = సేవించి; ఏత్తుమ్ = స్తుతించుచున్న; పేర్ అరుళాళన్ = మిక్కిలి దయామయుడును; ఎమ్బిరానై = నాకు స్వామియును; కారణిమేగమ్ నిన్ఱదు ఒప్పానై = వానాకాలమందు ఉండెడి అందమైన మేఘములవలె ఒప్పుచున్న సర్వేశ్వరుడు;శీరార్ మణి మాడమ్ = సౌందర్యముతొ ప్రకాశించు మేడలు కలిగిన; నాంగై నల్ నడువుళ్ = నాఙ్గూర్ లో మిక్కిలి నడు మధ్యలో నున్న; శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే = శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో; వార్ అణి = వస్త్రాలంకారముచే కూడిన; ములై యాళ్ = స్తనములుగల; మలర్ మగళోడు = కమలవాసినితోపాటు; మణ్ మగళుమ్ = భూదేవియును; ఉడన్ నిఱ్ప = కూడి వేంచేయగ; కణ్డుకొణ్డు = కనులార సేవించి; ఉయ్ న్దొழிన్దేనే = ఉజ్జీవింపకలిగితిని.
లోకములో నున్న జనులందరు స్తుతించుచున్న , మిక్కిలి దయామయుడును , నాకు స్వామియును , నీలమేఘశ్యాముడైన సర్వేశ్వరుడు , కమలవాసినితోను, భూదేవితోను కలిసి, పెద్ద భవనములతో ఒప్పుచున్న, నాఙ్గూర్ ప్రాంతములో నున్న ,శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో కృపతో వేంచేయగ కనులార సేవించి ఉజ్జీవింపకలిగితిని.
పిఱప్పొడు మూప్పొన్ఱిల్లవన్ఱన్నై , పేదియా ఇన్బవెళ్ళత్తై ,
ఇఱప్పు ఎదిర్ కాలక్కழிవుమానానై , ఏழிశైయిన్ శువైతన్నై ,
శిఱప్పుడై మఱైయోర్ నాంగైనన్నడువుళ్, శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే ,
మఱైపెరుమ్ పొరుళై వానవర్ కోనై , కణ్డునాన్ వాழ்న్దొழிన్దేనే . 1269
పిఱప్పొడు మూప్పు ఒన్ఱు=పుట్టుక, వార్ధక్యము మొదలగునవి ఏవియును; ఇల్లవన్ తన్నై= లేనివాడును; పేదియా = హెచ్చు,తగ్గులులేని; ఇన్బవెళ్ళత్తై = ఆనంద సముద్రుడును; ఇఱప్పు ఎదిర్ కాల క్కழிవుమ్ ఆనానై = వర్తమాన భవిష్య భూత కాలములందు ఉండు వాడును ; ఏழிశైయిన్ = సప్తస్వరముల; శువైతన్నై = రసమాధుర్యమువలె భోగ్యుడును; మఱైపెరుమ్ పొరుళై = వేదములయందున్న శ్లాఘ్యమైన శబ్ధార్ధములుగ ఉండు వాడును;వానవర్ కోనై=నిత్యశూరులకు నాధుడును;శిఱప్పు ఉడై= ఖ్యాతి పొందిన; మఱైయోర్ = వేదబ్రాహ్మణోత్తములు నివసించు; నాంగై నల్ నడువుళ్ = నాఙ్గూర్ లో మిక్కిలి నడు మధ్యలోనున్న; శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే = శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో; కణ్డు నాన్ = కనులార సేవించి నేను; వాழ்న్దొழிన్దేన్ = సుఖముగజీవింపగలిగితిని.
పుట్టుక, ముసలితనము మొదలగు ఎట్టి వికారములు లేనివాడును , ఆనందసముద్రుడును , మూడు కాలములందు ఎప్పుడును ఉండు వాడును , సప్తస్వరముల రసమాధుర్యమువలె భోగ్యుడును , వేద ప్రతిపాద్యుడును , నిత్యశూరులకు నాధుడును అయిన సర్వేశ్వరుని , ఖ్యాతి పొందిన వేదబ్రాహ్మణోత్తములు నివసించు నాఙ్గూర్ ప్రాంతములో నున్న శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో కనులార సేవించి నేను సుఖముగజీవింపగలిగతిని .
తిడవిశుమ్బు ఎరినీర్ తిఙ్గళుమ్ శుడరుమ్ , శెழுనిలత్తు ఉయిర్ గళుమ్ మర్ట్రుమ్ ,
పడర్ పొరుళ్ గళుమాయ్ నిన్ఱవన్తన్నై , పఙ్గయత్తు అయన్ అవననైయ ,
తిడమొழி మఱైయోర్ నాంగైనన్నడువుళ్ , శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే ,
కడల్ నిఱవణ్ణన్తన్నై నాన్ అడియేన్, కణ్డుకొణ్డు ఉయ్ న్దొழிన్దేనే. 1270
తిడమ్ = స్థిరమైన; విశుమ్బు = ఆకాశమును; ఎరి = అగ్నియును; నీర్ = జలమును;తిఙ్గళుమ్ = చంద్రుడును; శుడరుమ్ = సూర్యుడును; శెழுనిలత్తు=మిక్కిలి సమృద్ధిగల భూమియందున్న; ఉయిర్ గళుమ్ = ప్రాణులును; మర్ట్రుమ్ = మరియు; పడర్ = వ్యాపించియున్న; పొరుళ్ గళుమ్ = పలురకములైన వస్తువులును; ఆయ్ నిన్ఱ అవన్ తన్నై = ఇవన్నిటియందు అంతర్యామిగ వ్యాపించియున్నవాడును; కడల్ నిఱవణ్ణన్ తన్నై = సముద్ర వర్ణము పోలిన తిరుమేని కలవాడును అయిన సర్వేశ్వరుని; పఙ్గయత్తు = తామరపుష్పమందు పుట్టిన; అయన్ అవన్ అనైయ = బ్రహ్మ పోలినవారు అనునట్లు;తిడమ్ మొழி=సమర్ధమైన వాక్కులుగల;మఱైయోర్=వేదబ్రాహ్మణోత్తములు నివసించు; నాంగై నల్ నడువుళ్ =నాఙ్గూర్ లో మిక్కిలి నడు మధ్యలో నున్న; శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే = శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో; నాన్ అడియేన్ = దాసుడైన నేను; కణ్డుకొణ్డు = కనులార సేవించి; ఉయ్ న్దొழிన్దేన్ = ఉజ్జీవింపగలిగితిని.
ఆకాశము , అగ్ని , వాయువు, జలము ,భూమియందున్న సకల జీవరాశులు మరియు ఇతర వస్తువులు , చంద్రుడు, సూర్యుడు మొదలగు వీటినన్నింటియందు అంతర్యామిగ వ్యాపించి యున్నవాడును , సముద్ర వర్ణము పోలిన తిరుమేని కలవాడును అయిన సర్వేశ్వరుని , బ్రహ్మదేవుని స్పురింపజేయు సమర్ధమైన వాక్కులుగల వేదబ్రాహ్మణోత్తములు నివసించు నాఙ్గూర్ ప్రాంతములో నున్న శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో , దాసుడైన నేను కనులార సేవించి ఉజ్జీవింపగలిగితిని.
వశైయఱు కుఱళాయ్ మావలి వేళ్వియిల్ , మణ్ణళవిట్టవన్తన్నై ,
అశైవఱుమ్ అమరర్ అడియిణైవణఙ్గ , అలైకడల్ తుయిన్ఱ అమ్మానై ,
తిశైముగననైయోర్ నాంగై నన్నడువుళ్ ,శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే ,
ఉయర్ మణి మకుడమ్ శూడినిన్ఱానై , కణ్డుకొణ్డు ఉయ్ న్దొழிన్దేనే. 1271
వశైయఱు = నిర్మలమైన; కుఱళాయ్ = వామన రూపమునుదాల్చి;మావలి = మహాబలి యొక్క; వేళ్వియిల్ = యాగభూమియందు; మణ్ అళవిట్టవన్ తన్నై = లోకములను కొలిచిన వాడును; అశైవు అఱుమ్ = నిశ్చలమైన; అమరర్ = నిత్యశూరులచే; అడియిణై = శ్రీ పాద ద్వందములను; వణఙ్గ = సేవింపబడునట్లు;అలైకడల్=కెరటములతొ నిండిన పాలసముద్రమందు;తుయిన్ఱ=పవళించియున్న; అమ్మానై = మహోపకారుడును; ఉయర్ మణి = ఉన్నతమైన మణులతోప్రకాశించు; మకుడమ్ = మకుటమును; శూడినిన్ఱానై = ధరించియున్నవానిని; తిశైముగన్ = చతుర్ముఖ బ్రహ్మను; అనైయోర్ = పోలిన బ్రాహ్మణోత్తములు నివసించు; నాంగై నల్ నడువుళ్ =నాఙ్గూర్ లో మిక్కిలి నడు మధ్యలో నున్న; శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే = శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో; కణ్డుకొణ్డు= కనులార సేవించి; ఉయ్ న్దొழிన్దేన్=ఉజ్జీవింపగలిగితిని.
వామనరూపమునుదాల్చి మహాబలి యొక్క యాగభూమియందు లోకములన్నింటిని కొలిచిన వాడును , నిత్యశూరులచే శ్రీపాదద్వందములను సేవింపబడునట్లు పాలసముద్రమందు పవళించియున్న మహోపకారుడును , ఉన్నతమైన మణులతోప్రకాశించు మకుటమును ధరించియున్న సర్వేశ్వరుని , చతుర్ముఖ బ్రహ్మను పోలిన భ్రాహ్మణోత్తములు నివసించు నాఙ్గూర్ ప్రాంతములో నున్న శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో కనులార సేవించి ఉజ్జీవింపగలిగితిని.
తీమనత్తరక్కర్ తిఱలழிత్తవనేయెన్ఱు , శెన్ఱడైన్దవర్ తమక్కు ,
తాయ్ మనత్తు ఇరంగియరుళినైక్కొడుక్కుమ్ , తయరదన్ మదలైయై చ్చయమే ,
తే మలర్ పొழிల్ శూழ் నాంగై నన్నడువుళ్ , శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే ,
కామనైప్పయన్దాన్ తన్నై నాన్ అడియేన్ , కణ్డుకొణ్డు ఉయ్ న్దొழிన్దేనే. 1272
తీమనత్తు = క్రూరుహృదయులైన; అరక్కర్ = రాక్షసులయొక్క; తిఱల్ = బలమును; అழிత్తవనే = నశింపజేసినవాడా!; ఎన్ఱు = అని పలుకుచు; శెన్ఱు = వెడలి; అడైన్దవర్ తమక్కు = శరణని ఆశ్రయించిన వారికి; తాయ్ మనత్తు =మాతృహృదయము వలె; ఇరంగి = ద్రవించి; అరుళినై క్కొడుక్కుమ్ = కృపజేయువాడును; తయరదన్ మదలైయై = దశరధుని పుత్రుడును; కామనై = మన్మధుని; పయన్దాన్ తన్నై = పుట్టించిన వాడును అయిన సర్వేశ్వరుని; శయమ్ మే = విజయములతొ కూడియున్నదియు; తేన్ మలర్ = తేనెలతోనిండిన పుష్పములుగల; పొழிల్ శూழ் = తోటలతో చుట్టబడిన; నాంగై నల్ నడువుళ్ = నాఙ్గూర్ లో మిక్కిలి మధ్యలో నున్న; శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే = శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో; నాన్ అడియేన్ = దాసుడైన నేను; కణ్డుకొణ్డు = కనులార సేవించి; ఉయ్ న్దొழிన్దేన్ = ఉజ్జీవింపగలిగితిని.
క్రూరుహృదయులైన రాక్షసులబారినుండి తప్పించమని శరణుజొచ్చియున్నవారి కోరికపై ఆరాక్షసులను తుదముట్టించినవాడును , దశరధుని పుత్రుడును , మన్మధుని తండ్రియును , అయిన సర్వేశ్వరుని , విజయములతొ కూడియున్నదియు , తేనెలతో నిండిన పుష్పములుగల తోటలతో చుట్టబడిన నాఙ్గూర్ ప్రాంతములో నున్న శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో దాసుడైన నేను కనులార సేవించి ఉజ్జీవింపగలిగితిని.
మల్లైమామున్నీర్ అదర్ పడ , మలైయాల్ అణై శెయ్ దు మగిழ்న్దవన్ తన్నై ,
కల్లిన్మీదు ఇయన్ఱ కడిమదిళ్ ఇలంగై కలంగ , ఓర్ వాళి తొట్టానై ,
శెల్వనాన్మఱైయోర్ నాంగై నన్నడువుళ్ , శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే ,
అల్లిమామలరాళ్ తన్నొడుమ్ అడియేన్ , కణ్డుకొణ్డు అల్లల్ తీర్ న్దేనే . 1273
మల్లై మా మున్నీర్ =మిక్కిలి సంపదలుగల మహాసముద్రమందు; అదర్ పడ = దారి కలుగువిధముగ; మలైయాల్ = పర్వతములను తెచ్చి; అణై శెయ్ దు = సేతువును కట్టి;మగిழ்న్దవన్ తన్నై = సంతోషించినవాడును; కల్లిన్ మీదు = (త్రికూటమను) పర్వతముపై; ఇయన్ఱ = కట్టబడిన; కడిమదిళ్ = రక్షణకలిగించు ప్రాకారములతొ నున్న; ఇలంగై = లంకాపురిని; కలంగ = ఛిన్నభిన్నమగునట్లు; ఓర్ వాళి = ఒక బాణమును; తొట్టానై = ప్రయోగించిన సర్వేశ్వరుని; శెల్వమ్ నాల్ = చతుర్వేదములను పెద్ద సంపద కలిగిన; మఱైయోర్ = వేదోత్తములు నివసించు; నాంగై నల్ నడువుళ్ =నాఙ్గూర్ లో మిక్కిలి మధ్యలో నున్న; శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే=శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో; అల్లిమామలరాళ్ తన్నొడుమ్ =కమలవాసినితొ కూడ; అడియేన్ = దాసుడైన నేను; కణ్డుకొణ్డు = కనులార సేవించి;అల్లల్ తీర్ న్దేన్ = దుఃఖములను పోగొట్టుకొంటిని.
పెద్ద పెద్ద అలలతో ఒప్పు మహాసముద్రమందు దారి కలుగువిధముగ పర్వతములను తెచ్చి సేతువును కట్టి సంతోషించినవాడును త్రికూటమను పర్వతముపై ప్రాకారములతొ నున్న లంకాపురిని ఛిన్నభిన్నమగునట్లు ఒక బాణమును ప్రయోగించిన సర్వేశ్వరుని , చతుర్వేదములను పెద్ద సంపద కలిగిన వేదోత్తములు నివసించు నాఙ్గూర్ ప్రాంతములో నున్న శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో కమలవాసినితొకూడ దాసుడైన నేను కనులార సేవించి దుఃఖములను పోగొట్టుకొంటిని .
వెఞ్జిన క్కళిఱుమ్ విల్లోడు మల్లుమ్ , వెగుణ్డు ఇఱుత్తు అడర్తవన్దన్నై ,
కఞ్జనైక్కాయ్ న్ద కాళైయమ్మానై , క్కరుముగిల్ తిరునిఱత్తవనై ,
శెఞ్జొల్ నాన్మఱైయోర్ నాంగై నన్నడువుళ్ , శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే ,
అఞ్జనక్కున్ఱమ్ నిన్ఱదొప్పానై , కణ్డుకొణ్డు అల్లల్ తీర్ న్దేనే . 1274
వెమ్ శినమ్ = క్రూరమైన కోపముగల; కళిఱు = (కువలయాపీడమను) ఏనుగును; వెగుణ్డుమ్ = కోపించి అంతమొందించియు; విల్ = (కంసుని పూజలొనుండు)విల్లును; ఇఱుత్తు = విరిచియు; మల్లుమ్ = మల్లవీరులను; అడర్తవన్ తన్నై = తుదముట్టించిన వాడును; కఞ్జనై = కంసునుని; కాయ్ న్ద = కోపించి వధించిన; కాళై = యౌవనుడైన; అమ్మానై = స్వామియును; కరు ముగిల్ = నల్లని మేఘమువంటి; తిరునిఱత్తవనై = తిరుమేని కలవాడును; అఞ్జనక్కున్ఱమ్ = ఒక కాటుక పర్వతమువలె; నిన్ఱదు ఒప్పానై = ఒప్పుచుండు సర్వేశ్వరుని; శెమ్ శొల్ = సౌందర్యమైన వాక్కులుగల; నాల్ మఱైయోర్ = నాలుగు వేదములు స్తుతించు వేదోత్తములు నివసించు; నాంగై నల్ నడువుళ్ = నాఙ్గూర్ లో మిక్కిలి మధ్యలో నున్న; శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే =శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో; కణ్డుకొణ్డు = కనులార సేవించి;అల్లల్ తీర్ న్దేన్ = దుఃఖములను పోగొట్టుకొంటిని.
కువలయాపీడమను ఏనుగును అంతమొందించినవాడును, కంసునిచే పూజింపబడు విల్లును విరిచినవాడును, మల్లవీరులను తుదముట్టించినవాడును , కంసునుని వధించినయౌవనుడును , నల్లని మేఘమువంటి తిరుమేని కలవాడును , ఒక కాటుక పర్వతమువలె ఒప్పుచుండు సర్వేశ్వరుని,నాఙ్గూర్ ప్రాంతములో నున్న శెమ్పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో కనులార సేవించి దుఃఖములను పోగొట్టుకొంటిని .
** అన్ఱియ వాణన్ ఆయురన్దోళుమ్ తుణియ , అన్ఱు ఆழி తొట్టానై ,
మిన్ తిగழ் కుడుమి వేఙ్గడమలై మేల్ , మేవియ వేదనల్ విళక్కై ,
తెన్ తిశై తిలదమనైయవర్ నాంగై , శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే ,
మన్ఱదుపొలియ మగిழ் న్దు నిన్ఱానై , వణఙ్గినాన్ వాழ்న్దొழிన్దేనే . 1275
అన్ఱియ వాణన్ = కోపముతొ ఎదరించిన భాణాసురునియొక్క; ఆయురమ్ తోళుమ్ = వెయ్యి భుజములను; తుణియ = తెగి క్రిందపడునట్లు; అన్ఱు = ఆకాలములో; ఆழி తొట్టానై = చక్రాయుధమును ప్రయోగించినవాడును; మిన్ తిగழ் = మెరుపువలె ప్రకాశించుచున్న; కుడుమి = శిఖరములుగల; వేఙ్గడమలై మేల్ మేవియ =వేంకటాద్రిపై కృపతో వేంచేసిన; వేదనల్ విళక్కై = వేదములచే ప్రతిపాదింపబడు పరమజ్యోతి స్వరూపుడును; తెన్ తిశై = దక్షిణదిక్కునకు; తిలదమ్ = తిలకమనబడు;అనైయవర్ = మహనీయులు నివసించుచున్న; నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే = శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో; మన్ఱు అదు పొలియ = శ్రీ వైష్ణవగోష్ఠి ప్రకాశించగ; మగిழ் న్దు నిన్ఱానై = సంతోషముతో వేంచేసియున్న సర్వేశ్వరుని; వణఙ్గినాన్ = సేవించుకొని నేను; వాழ்న్దొழிన్దేన్ = సుఖముగజీవింపగలిగితిని
పూర్వము ఒకప్పుడు భాణాసురునియొక్క వెయ్యి భుజములను తెగి క్రిందపడునట్లు చక్రాయుధమును ప్రయోగించినవాడును , వేంకటాద్రిపై కృపతో వేంచేసిన వేదములచే ప్రతిపాదింపబడు పరమజ్యోతి స్వరూపుడును , దక్షిణదిక్కునకు తిలకమనబడు మహనీయులు నివసించుచున్న నాఙ్గూర్ ప్రాంతములో నున్న శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో శ్రీ వైష్ణవగోష్ఠి ప్రకాశించగ సంతోషముతో వేంచేసియున్న సర్వేశ్వరుని సేవించుకొని నేను సుఖముగజీవింపగలిగితిని .
కళఙ్గనివణ్ణా కణ్ణనే యెన్దన్ , కార్ ముగిలేయెన నినైన్దిట్టు ,
ఉళమ్ కనిన్దిరుక్కుమ్ అడియవర్ తఙ్గళ్ , ఉళ్ళత్తుళూఱియతేనై ,
తెళిన్ద నాన్మఱైయోర్ నాంగై నన్నడువుళ్, శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే,
వళఙ్గొళ్ పేరిన్బమ్ మన్నినిన్ఱానై , వణఙ్గినాన్ వాழ்న్దొழிన్దేనే . 1276
కళమ్ కని వణ్ణా =వాక్కాయపండువంటి తిరుమేని కలవాడా!; కణ్ణనే = శ్రీకృష్ణుడా!; ఎన్ తన్ = నాయొక్క; కార్ ముగిలే = కాళమేఘమా!; ఎన నినైన్దిట్టు = అని ధ్యానించి; ఉళమ్ = హృదయము; కనిన్దు ఇరుక్కుమ్ = భక్తితొ పరిపక్వమై ఉండెడి; అడియవర్ తఙ్గళ్ = దాసులయొక్క; ఉళ్ళత్తుళ్ = హృదయములో; ఊఱియతేనై = ఊఱుచుండెడి తేనెవంటివాడును; తెళిన్ద = నిర్మలమైన ఙ్ఞానముగల; నాన్మఱైయోర్ = వేదోత్తములు నివసించు; నాంగై నల్ నడువుళ్ =నాఙ్గూర్ లో మిక్కిలి మధ్యలో నున్న; శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే=శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో;వళమ్ కొళ్ = ప్రకాశించు; పేరిన్బమ్ మన్ని నిన్ఱానై =పరమానందస్వరూపుడై కృపతో వేంచేసిన సర్వేశ్వరుని; వణఙ్గినాన్ = సేవంచుకొని నేను; వాழ்న్దొழிన్దేన్ = సుఖముగజీవింపగలిగితిని.
నామసంకీర్తనముచే భక్తితొ పరిపక్వమైన దాసులయొక్క హృదయములో ఊఱుచుండెడి తేనెవంటివాడును , నిర్మలమైన ఙ్ఞానముగల వేదోత్తములు నివసించు నాఙ్గూర్ప్రాంతములో నున్న శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో అమితానంద స్వరూపుడై కృపతో వేంచేసిన సర్వేశ్వరుని సేవించుకొని నేను సుఖముగజీవింపగలిగితిని.
** తేనమర్ శోలై నాంగై నన్నడువుళ్, శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే ,
వానవర్ కోనై క్కణ్డమై శొల్లుమ్ , మంగైయార్ వాళ్ కలికన్ఱి ,
ఊనమిల్ పాడలొన్బదోడొన్ఱుమ్ , ఒழிవిన్ఱి కర్ట్రువల్లార్ గళ్,
మాన వెణ్ క్కుడైక్కీழ் వైయగమాణ్డు , వానవరాగువర్ మగిழ் న్దే . 1277
తేనమర్ శోలై = తేనెటీగలతొ నిండిన తోటలతో చుట్టబడిన;నాంగై నల్ నడువుళ్ = నాఙ్గూర్ లో మిక్కిలి మధ్యలో నున్న; శెమ్బొన్ శెయ్ కోయిలినుళ్ళే = శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో; వానవర్ కోనై = దేవాదిదేవుని; క్కణ్డమై = తాను సేవించిన విధమును; మంగైయార్ = తిరుమంగైదేశవాసులకు ప్రభువును; వాళ్ = ఖడ్గము ఆయుధముగ కలవారును; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వారులు; శొల్లుమ్ = చెప్పిన; ఊనమిల్ = ఎటువంటి దోషములేని; పాడల్ = ఈ పాశురములను; ఒన్బదోడొన్ఱుమ్ = పదియును; ఒழிవిన్ఱి = ఏఒక్కటిని విడువక; కర్ట్రువల్లార్ గళ్ = అభ్యసించువారు; మానమ్ = విశాలమైన; వెణ్ క్కుడైక్కీழ் = తెల్లని ఛత్రముక్రింద; వైయగమ్ ఆణ్డు = ఈ భూమండలమును పరిపాలించి; (పిదప) మగిழ் న్దు = సంతోషముతో; వానవర్ ఆగువర్ =నిత్యశూరులగుదురు.
పూతోటలతో చుట్టబడిన నాఙ్గూర్ ప్రాంతములో నున్న శెమ్ పొన్ శెయ్ కోయిల్ అను దివ్య దేశములో కృపతో వేంచేసిన సర్వేశ్వరుని తాను సేవంచుకొనినవిధమును , తిరుమంగై ఆళ్వారులచే చెప్పబడిన ఈ పాశురములను ఏఒక్కటిని విడువక అభ్యసించువారు ఈ భూమండలమును ఏక ఛత్రాధిపతులై పరిపాలించిన పిదప పరమపదమందు నిత్యశూరులతో కూడియుందురు.
********