పెరియతిరుమొழி-4 వపత్తు (4)

శ్రీః

4. మార్ట్రరశర్  

అవతారిక :      

నాఙ్గూర్ ప్రాంతములో నున్న  తిరుతెర్ట్రియంబలమ్ అను దివ్య దేశములో, భక్తులపైగల మిక్కిలి ప్రేమానురాగములతొ ఎరుపెక్కిన నేత్రములుగల , శేషునిపై శయనించియున్న శెఙ్గణ్ మాల్ పెరుమాళ్ ను తిరుమంగై  ఆళ్వారులు ఈ పది పాశురములతో మంగళాశాసనము చేయుచున్నారు. 

** మార్ట్రరశర్ మణిముడియమ్ తిఱలుమ్ తేశుమ్ ,

మర్ట్రవర్ తమ్ కాదలిమార్ కుழைయుమ్ , తన్దై

కాల్తళైయుమ్ ఉడన్ కழల వన్దు తోన్ఱి ,

క్కద నాకమ్ కాత్తళిత్త కణ్ణన్ కణ్డీర్ ,

నూర్ట్రిదழ்క్కొళ్ అరవిన్దమ్ నుழைన్ద పళ్ళత్తు  ,

ఇలఙ్గముగిన్ ముదుపాళై పగువాయ్ నణ్డిన్ ,

శేర్ట్రళైయిల్ వెణ్ ముత్తమ్ శిన్దు నాఙ్గూర్, 

తిరుత్తెర్ట్రియమ్బలత్తు ఎన్ శెఙ్గణ్ మాలే .     1278

పళ్ళత్తు =  నీటిగుంటలలొ మొలచిన;నూఱు ఇదయ్ కొళ్ = పలు దళములుగల; అరవిన్దమ్ =  తామర పూవులో; నుழைన్ద = ప్రవేశించిన; పగువాయ్ = పెద్ద నోరుగల; నణ్డిన్ =  పీతలయొక్క; శేఱు అళైయిల్ = బురద బొరియలలో; ఇళ కముగిన్ = ఎదుగుచున్న పోకమొక్కలయొక్క; ముదు పాళై = ముదిరిన భాళలచే; వెణ్ ముత్తమ్ = తెల్లని ముత్యములు; శిన్దు =  వెదజల్లుబడుచుండు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుత్తెర్ట్రియమ్బలత్తు = తిరుత్తెర్ట్రియమ్బలమ్ అను దివ్య దేశములో కృపతో వేంచేసిన; ఎన్ = నాకు స్వామియైన; శెమ్ కణ్ మాల్ = ఎఱ్ఱని  నేత్రములుగల  సర్వేశ్వరుడు (ఎవరన) ; మాఱు అరశర్ = శత్రువులైన రాజులయొక్క (దుర్యోదనాదులు మొదలగు) మణి ముడియమ్ = రత్నములతొకూడిన కిరీటములును తిఱలుమ్ = బలమును; తేశుమ్ = తేజస్సును; అవర్ తమ్ = వారియొక్క; కాదలిమార్ = పత్నుల; కుழைయుమ్ =  చెవిపోగులు, మంగళసూత్రములును; తన్దై = తన తండ్రియైన వసుదేవునియొక్క; కాల్ తళైయుమ్ = కాళ్ళ సంకెళ్ళను; ఉడన్ కழల = వెంటనే తొలగిపోవునటుల; వన్దు తోన్ఱి =  పరమపదమునుండి ఇచట అవతరించి; కదమ్ =  కోపముతొనున్న; నాగమ్ =  గజేంద్రుని; కాత్తు అళిత్త = కాపాడి కరుణించిన; కణ్ణర్ కణ్డీర్ = శ్రీకృష్ణుడేసుమండీ!

నీటిగుంటలలొ మొలచిన తామర పూవులోప్రవేశించిన పీతలయొక్క బురద కన్నములలో, అవి మూసుకొని పోవునటులు , పోకమొక్కలయొక్క ముదిరిన భాళలచె తెల్లని ముత్యములు వెదజల్లుచుండబడు నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుత్తెర్ట్రియమ్బలమ్ అను దివ్య దేశములో కృపతో వేంచేసిన నాకు స్వామియైన ఎఱ్ఱని  నేత్రములుగల సర్వేశ్వరుడు , (ఎవరన) భూభారమైన శత్రురాజులను తుదముట్టించినవాడును , తండ్రియైన సుదేవునియొక్క కాళ్ళ సంకెళ్ళను తొలగించినవాడును , మొసలి నోటికోరలలో చిక్కి శక్తినశించిన గజేంద్రుని సంరక్షించినవాడును , పరమపదమునుండి ఇచట అవతరించిన శ్రీకృష్ణుడేసుమండీ !

పొర్ట్రొడిత్తోళ్ మడమగళ్ తన్ వడివుకొణ్డ ,

పొల్లాద వన్ పేయ్ చ్చి కొంగై వాఙ్గి ,

పెర్ట్రెడుత్త తాయ్ పోల మడుప్ప , ఆరుమ్ 

పేణా నఞ్జుణ్డు ఉకన్ద పిళ్ళై కణ్డీర్ ,

నెల్ తొడుత్త మలర్ నీలమ్ నిఱైన్ద శూழల్ ,

ఇరుమ్ శిఱైయ వణ్డొళియుమ్ నెడుఙ్గణార్ తమ్ ,

శిర్ట్రడిమేల్ శిలమ్బొలియుమ్ మిழర్ట్రు నాఙ్గూర్  ,

తిరుత్తెర్ట్రియమ్బలత్తు ఎన్ శెఙ్గణ్ మాలే .        1279

నెల్ = ధాన్యపుపంటలను; తొడుత్త =  వరసలగ అంటుకొనియున్న; నీలమ్ మలర్ = నీలము పూలతో; నిఱైన్ద = నిండియున్న; శూழల్ = చుట్టుప్రక్కలయందు; ఇరు శిఱైయ = అందమైన రెక్కలగల; వణ్డు ఒలియుమ్ = తుమ్మెదల ఝంకారములును; నెడుమ్ = విశాలమైన; కణ్ణార్ తమ్ = నేత్రములుగల స్త్రీలయొక్క; శిఱు = చిన్న; అడిమేల్ = పాదములకు ధరించిన; శిలంబు =  అందెలుల; ఒలియుమ్ = ధ్వనులును; మిழర్ట్రు = కలసి సామరస్యముగ శబ్దింపబడు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుత్తెర్ట్రియమ్బలత్తు = తిరుత్తెర్ట్రియమ్బలమ్ అనుదివ్యదేశములో కృపతోవేంచేసిన; ఎన్ =  నాకు స్వామియైన; శెమ్ కణ్ మాల్ = ఎఱ్ఱని  నేత్రములుగల సర్వేశ్వరుడు ; (ఎవరన) మడమ్ = ఆత్మగుణములతొ పూర్ణురాలైన;  మగళ్ తన్ = యశోదాదేవి యొక్క; వడివుకొణ్డ = రూపమునుదాల్చి వచ్చిన;   పొల్లాద వన్ =  మిక్కిలి క్రూరమైన; పేయ్ చ్చి = రక్కసి పూతన; కొంగై = తన స్తనములను;వాఙ్గి = చేతులతొ ఎత్తి;  పెర్ట్రు ఎడుత్త =కనిపెంచిన; తాయ్ పోల = తల్లి వలె;  మడుప్ప = (శ్రీకృష్ణుని నోటిలొ) ఉంచగ; ఆరుమ్ పేణా = ఎవ్వరును ఆశించని;  నఞ్జు = విషమును;  ఉణ్డు = (పాలతోబాటు) త్రాగి; ఉగన్ద = సంతోషించిన; పిళ్ళై కణ్డీర్ = చిన్న బాలుడైన శ్రీ కృష్ణుడే సుమండీ!.         

           ధాన్యపుపంటలతొ చేరియున్న అందమైన నీలము పూల వరసల చుట్టుప్రక్కలయందు , తుమ్మెదల ఝంకారములును, విశాలమైన నేత్రములుగల స్త్రీలయొక్క పాదములకు ధరించిన అందెల సవ్వడిలును కలసి సామరస్యముగ శబ్దింపబడు నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుత్తెర్ట్రియమ్బలమ్ అను దివ్యదేశములో కృపతోవేంచేసిన నాకు స్వామియైన ఎఱ్ఱని  నేత్రములుగల సర్వేశ్వరుడు  (ఎవరన) , యశోదాదేవి యొక్క రూపమునుదాల్చిన రక్కసి పూతన తన విషస్తన్యములను చేతులతొ ఎత్తి కనిపెంచిన తల్లి వలె శ్రీకృష్ణుని నోటిలో ఉంచగ  ఆవిషమును పాలతోబాటు త్రాగి ,ఆరక్కసిని అంతమొందించిన చిన్న బాలుడైనశ్రీ కృష్ణుడే సుమండీ!.

పడల్ అడైత్త శిఱుకురంబై నుழைన్దుపుక్కు ,

పశువెణ్ణెయ్ పదమార ప్పణ్ణైముర్ట్రుమ్ ,

అడలడర్త వేల్ కణార్ తోక్కైపర్ట్రి ,

అలన్దలమైశెయ్ దు ఉழలుమైయన్  కణ్డీర్ ,

మడలెడుత్త నెడుమ్ తెఙ్గిన్ పழఙ్గల్ వీழ ,

మాఙ్గనిగళ్ తిరట్టు ఉరుట్టా వరునీర్ పొన్ని ,

తిడలెడుత్తు మలర్ శుమన్దు అఙ్గిழிయు నాఙ్గూర్ ,

తిరుత్తెర్ట్రియమ్బలత్తు ఎన్ శెఙ్గణ్ మాలే .   1280

మడల్ ఎడుత్త = మిక్కిలి కొమ్మలుగల; నెడుమ్ తెఙ్గిన్ =  ఎత్తైన కొబ్బరిచెట్లనుండి; పழఙ్గల్ = కొబ్బరికాయలు; వీழ =  (మామిడిచెట్లపై) పడగ; (అందువలన క్రిందపడిన) మాఙ్గనిగళ్ తిరట్టు =  మామిడిపండ్ల రాసులను; ఉరుట్టా =  తోసుకునివచ్చుచుండు; వరునీర్ పొన్ని = నీటివేగముగల కావేరినది;    తిడల్ ఎడుత్తు = మెట్టప్రదేశములను తొలగించుతూ; అఙ్గు = ఆ ప్రాంతమందలి; మలర్ శుమన్దు = పలురకములైన పుష్పములను తీసుకొనియు; ఇழிయుమ్ =  ప్రవహింబడుచున్న; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న;   తిరుత్తెర్ట్రియమ్బలత్తు = తిరుత్తెర్ట్రియమ్బలమ్ అను దివ్యదేశములో కృపతోవేంచేసిన; ఎన్ = నాకు స్వామియైన; శెమ్ కణ్ మాల్ = ఎఱ్ఱని  నేత్రములుగల సర్వేశ్వరుడు; (ఎవరన) పశువెణ్ణెయ్ = అప్పుడె చిలికిన వెణ్ణను; పదమ్ ఆర = దాని న్యూనత చెడకముందె ఆరగించుటకై;  పడల్ అడైత్త = మూసిన తలుపులుగల; శిఱుకురంబై = చిన్న గుడిసెలలో; నుழைన్దుపుక్కు = మెల్లగ లోనికి ప్రవేశించియు; అడల్ అడర్త = పోరుకు సిద్దమైన; వేల్ కణ్ణార్ =ఈటె పోలిన కన్నులుగల గోపస్త్రీలయొక్క; తోక్కైపర్ట్రి = చీర కొంగును పట్టుకొని(లాగి); అలన్దలమైశెయ్ దు =  వేధించుచు; పణ్ణైముర్ట్రుమ్ = గోకులమంతటను; ఉழలుమ్ = తిరుగుచుండెడి; ఐయన్ కణ్డీర్ = మహానుభావుడైన ఆ చిన్ని శ్రీకృష్ణుడేసుమండీ!

                     మంచి  నీటివేగముగల కావేరినది, ఎత్తునుండి కొబ్బరికాయలు మామిడిచెట్లపై పడగ అందువలన క్రిందపడిన మామిడిపండ్ల రాసులతోను , మెట్టప్రదేశములను తొలగించుతూ ఆ ప్రాంతమందలి పలురకములైన పుష్పములతోను, ప్రవహింబడుచున్న నాఙ్గూర్ ప్రాంతములో నున్న , తిరుత్తెర్ట్రియమ్బలమ్ అనుదివ్యదేశములో, కృపతోవేంచేసిన నాకు స్వామియైన ఎఱ్ఱని నేత్రములుగల సర్వేశ్వరుడు  (ఎవరన) ,చిలికిన వెణ్ణను ఆరగించుటకై మూసిన తలుపులుగల చిన్న గుడిసెలలో మెల్లగ లోనికి దూరియు , గోపస్త్రీలయొక్క చీర కొంగును పట్టుకొని లాగియు ,  (వారి మనసులో కోరుకొనునట్లు) వేధించుచు గోకులమంతటను తిరుగుచుండెడి మహానుభావుడైన ఆ చిన్ని శ్రీకృష్ణుడేసుమండీ!

వారారుమ్ ములై మడవాళ్  పిన్నైక్కాగి ,

వళై మరుప్పిల్ కడుమ్ శినత్తు వన్ తాళ్ ఆర్ న్ద ,

కారార్ తిణ్ విడై అడర్తు వదువైయాణ్డ ,

కరుముగిల్ పోల్ తిరునిఱత్తు ఎన్ కణ్ణన్ కణ్డీర్  ,

ఏరారుమ్ మలర్ పొழிల్ గళ్ తழுవి , ఎఙ్గుమ్ ,

ఎழிల్ మదియై క్కాల్ తొడర విళఙ్గుశోది ,

శీరారు మణిమాడమ్ తిగழு నాఙ్గూర్  ,

తిరుత్తెర్ట్రియమ్బలత్తు ఎన్ శెఙ్గణ్ మాలే .         1281

ఏర్ ఆరుమ్ =  మిక్కిలి సౌందర్యముతొ నున్న ;  మలర్ =  పుష్పములుగల; పొழிల్ గళ్ = తోటలు; ఎఙ్గుమ్ తழூవి = ఆకాశము పర్యంతము పెరుగి; ఎழிల్ మదియై = అందమైన చంద్రుని; కాల్ తొడర = (కదలనీయకుండ)కాళ్ళు కట్టబడుచుండునదియును; విళఙ్గుశోది = వ్యాపింపబడు ప్రకాశముతొ; శీర్ ఆరుమ్ =  మిక్కిలి అందమైన; మణిమాడమ్ = మణులతోనిండిన భవనములతో; తిగழுమ్ =  ప్రకాశింపబడుచున్న; నాఙ్గూర్=నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుత్తెర్ట్రియమ్బలత్తు = తిరుత్తెర్ట్రియమ్బలమ్ అను దివ్యదేశములో కృపతోవేంచేసిన; ఎన్=నాకు స్వామియైన;శెమ్ కణ్ మాల్ = ఎఱ్ఱని నేత్రములుగల సర్వేశ్వరుడు;  (ఎవరన) వార్ ఆరుమ్=వస్త్రముచే అలంకరింపబడిన;  ములై = స్తనములుగల; మడవాళ్ = ఆత్మగుణములుగల; పిన్నైక్కాగి =నప్పిన్నైపిరాట్టి లబ్ధికై; వళై మరుప్పిన్ = వంగియున్న కొమ్ములుగల; కడు శినత్తు = మిక్కిలి క్రోధముగల;  వన్ తాళ్ ఆర్ న్ద = బలమైన కాళ్ళుగల;   కార్ ఆర్ = నల్లనిరంగుగలిగిన; తిణ్ విడై = బలిష్టమైన వృషభములను;అడర్తు = వధించి; వదువై ఆణ్డ = (ఆమెను) పరిణయమాడిన; కరు ముగిల్ పోల్ = నల్లని మేఘమువంటి; తిరునిఱత్తు = సుందరమైన వర్ణముగల;  ఎన్ కణ్ణన్ కణ్డీర్ = నాయొక్క శ్రీకృష్ణుడేసుమండీ !

  చంద్రమండల పర్యంతము ఎదిగిన పూతోటలతోడను , మణిమయమైన సౌధములతోడను , ఒప్పుచున్న నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుత్తెర్ట్రియమ్బలమ్ అను దివ్యదేశములో కృపతో వేంచేసిన నాకు స్వామియైన ఎఱ్ఱని  నేత్రములుగల సర్వేశ్వరుడు  (ఎవరన), మిక్కిలి సౌందర్యవతియైన నప్పిన్నైపిరాట్టి లబ్ధికై బలిష్టమైన వృషభములను వధించి ఆమెను పరిణయమాడిన నీలమేఘశ్యాముడైన నాయొక్క శ్రీకృష్ణుడేసుమండీ !

కలై యిలఙ్గుమ్ అగలల్గుల్ కమలప్పావై ,

కదిర్ ముత్తవెణ్ణగైయాల్ కరుఙ్గణ్ ఆయ్ చ్చి ,

ములై యిలఙ్గుమ్ ఒళిమణిప్పూణ్ వడముమ్ తేయ్ ప్ప ,

మూవాద వరై నెడున్దోళ్ మూర్తి కణ్డీర్  ,

మలై యిలఙ్గు నిరైచ్చన్ది మాడవీది ,

ఆడవరై మడమొழிయార్ ముగత్తు , ఇరణ్డు

శిలై విలఙ్గి మనమ్ శిఱైకొణ్డిరుక్కుమ్ నాఙ్గూర్ ,

తిరుత్తెర్ట్రియమ్బలత్తు ఎన్ శెఙ్గణ్ మాలే .     1282

మలై ఇలఙ్గు = పర్వతమువలె ప్రకాశించు; నిరై = వరుసలగ; శన్ది = ఒకటితొచేరి మఱొకటి; మాడమ్ = మేడలు గల; వీది = వీదులలో; మడమ్ = అతిమధురమైన;మొழிయార్ = పలుకులుగల స్త్రీలయొక్క; ముగత్తు = ముఖమునందు గల; ఇరణ్డు శిలై = రెండు విల్లుల వలె కనుబొమలు; విలఙ్గి = వంగి; ఆడవరై = మగ పిల్లల యొక్క;మనమ్ =మనసులను; శిఱై కొణ్డు ఇరుక్కుమ్=స్వాధీనము చేసుకొనుబడుచుండెడి; నాఙ్గూర్ =నాఙ్గూర్ ప్రాంతములో నున్న;తిరుత్తెర్ట్రియమ్బలత్తు = తిరుత్తెర్ట్రియమ్బలమ్ అను దివ్యదేశములో కృపతో వేంచేసిన; ఎన్ = నాకు స్వామియైన;శెమ్ కణ్ మాల్ = ఎఱ్ఱని  నేత్రములుగల సర్వేశ్వరుడు; (ఎవరన )  కలై ఇలఙ్గుమ్ = వస్త్రములతో ప్రకాశించుచున్న; అగల్ అల్ గుల్ = విశాలమైన కటిప్రదేశము కలిగియు; కదిర్ ముత్త = కాంతులు ప్రసరించు ముత్యములువలె;  వెణ్ నగైయాళ్ = తెల్లని పళ్ళ వరుసలగల; కమలమ్ పావై = కమలవాసినియొక్కయు; కరు కణ్ = నల్లని నేత్రములుగల; ఆయ్ చ్చి = నప్పిన్నైపిరాట్టియొక్కయు; ములై = స్తనములపై; ఇలఙ్గుమ్ = ప్రకాశించు; ఒళి మణి = అందమైన మణులు కలిగిన; పూణ్ = ఆభరణమును; వడముమ్ = ముత్యముల హారమును; తేయప్ప = రాపిడిచేయగ ; మూవాద = న్యూనత చెదరని; వరై నెడున్దోళ్ = పర్వతమువలె ధీర్ఘమైన భుజములుగల; మూర్తి కణ్డీర్ = శ్రీకృష్ణుడేసుమండీ! .

          ఉన్నతమైన మేడలు గల వీదులలో , అచటనుండు అతిమధురమైన పలుకులుగల స్త్రీలయొక్క అందమైన కనుబొమలు మగ పిల్లల యొక్క మనసులను స్వాధీనము చేసుకొనుబడుచుండెడి నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుత్తెర్ట్రియమ్బలత్తు అను దివ్యదేశములో కృపతోవేంచేసిన నాకు స్వామియైన ఎఱ్ఱని  నేత్రములుగల సర్వేశ్వరుడు  (ఎవరన) , కమలవాసినియొక్కయు , నప్పిన్నైపిరాట్టియొక్కయు  వక్షస్థలమందున్న రత్నములతొకూడిన హారములు , ముత్యముల హారములు ఒరసినను న్యూనత చెదరని పర్వతమువలె ధీర్ఘమైన భుజములుగల శ్రీకృష్ణుడేసుమండీ!

తాన్బోలుమెన్ఱు ఎழுన్దాన్ తరణియాళన్ ,

అదుకణ్డు తరిత్తిరుప్పాన్ అరక్కర్ తఙ్గళ్  ,

కోన్బోలుమెన్ఱు ఎழுన్దాన్ కున్ఱమన్న ,

ఇరుపదు తోళుడన్ తుణిత్త వొరువన్ కణ్డీర్ ,

మాన్బోలుమెన్ నోక్కిల్ శెయ్యవాయార్ ,

మరగదమ్బోల్ మడక్కిళియై క్కైమేల్కొణ్డు ,

తేన్బోలుమెన్ మழలై పయిర్ట్రు నాఙ్గూర్  ,

తిరుత్తెర్ట్రియమ్బలత్తు ఎన్ శెఙ్గణ్ మాలే .       1283

మాన్బోలుమెన్ నోక్కిన్ = లేడి కన్నులవలె అందమైన కన్నులుగలవారును; శెయ్యవాయార్ = ఎఱ్ఱని అదరములు గల స్త్రీలు; మరదగమ్బోల్ = మరదగమణి వలె ఆకుపచ్చని; మడమ్ = అందమైన; కిళియై = చిలుకలను; కైమేల్ కొణ్డు = తమ చేతులలో ఉంచుకొని; తేన్ పోలుమ్ = తేనెవలెనున్న; మెల్ మழలై = మృదువైన పలుకులును; పయిర్ట్రుమ్ = నేర్పించుచున్న; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుత్తెర్ట్రియమ్బలత్తు =  తిరుత్తెర్ట్రియమ్బలమ్ అను దివ్యదేశములో కృపతోవేంచేసిన; ఎన్ = నాకు స్వామియైన; శెమ్ కణ్ మాల్ = ఎఱ్ఱని  నేత్రములుగల సర్వేశ్వరుడు(ఎవరన) తరణియాళన్ = భూమండలమంతను పరిపాలించు; తాన్ పోలుమ్ = ప్రభువువలె తాను; ఎన్ఱు ఎழுన్దాన్ = తలచివచ్చినాడని;  అదు కణ్డు = అతడు ఒక సామాన్యుడని; దరిత్తు = తలంపును;  ఇరుప్పాన్ = కలిగినవాడై; (ఆతనిని దండించవలెనని ) అరక్కర్ తఙ్గళ్ = రాక్షసులయొక్క; కోన్ పోలుమ్ =  మహారాజుగా (మిక్కిలి శ్రేష్టునిగ) ఎన్ఱు ఎழுన్దాన్ = తలచి ఎదిరించిన; కున్ఱమ్ అన్న = పర్వతమువలె నున్న రావణుని యొక్క; ఇరుబదుతోళ్ = ఇరవై భుజములను;  ఉడన్ తుణిత్త = వెంటనే త్రుంచిన; ఒరువన్ కణ్డీర్ = అద్వితీయుడైన శ్రీరామచంద్రుడే సుమండీ!

  లేడి కన్నులవలె అందమైన కన్నులుగలవారును ఎఱ్ఱని అదరములు గల స్త్రీలు ,చిలుకలకు  మృదువైన పలుకులును నేర్పించుచుండెడి నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుత్తెర్ట్రియమ్బలమ్ అనుదివ్యదేశములో కృపతోవేంచేసిన, నాకు స్వామియైన ఎఱ్ఱని  నేత్రములుగల సర్వేశ్వరుడు  (ఎవరన), రావణుడుఎదుటనున్న దశరధపుత్రుని ఒక సామాన్యుడనియు , తాను మిక్కిలి శ్రేష్టమైన రాక్షసులకు ప్రభువనియు , అని అహంకారముపూని ,  ఎదిరించి తలబడగ , పర్వతమువలె నున్న ఆ రావణుని యొక్క ఇరువది భుజములను వెంటనే త్రుంచిన అద్వితీయుడైన శ్రీరామచంద్రుడే సుమండీ! 

పొఙ్గు ఇలఙ్గు పురిసూలుమ్ తోలుమ్ తాழ ,

పొల్లాద కుఱళురువాయ్ పొరున్దా వాణన్ ,

మఙ్గలమ్ శేర్ మఱై వేళ్వియదనుల్ పుక్కు ,

మణ్ణగలమ్ కుఱైయిరన్ద మైన్దన్ కణ్డీర్  ,

కొఙ్గు అలర్ న్ద మలర్ క్కుழలార్ కొంగై తోయ్ న్ద  ,

కుఙ్గుమత్తిన్ కుழమ్బళైన్ద కోలన్దన్నాల్  ,

శెఙ్గలఙ్గళ్ వెణ్ మణల్ మేల్ తవழு నాఙ్గూర్  ,        

తిరుత్తెర్ట్రియమ్బలత్తు ఎన్ శెఙ్గణ్ మాలే .         1284

కొఙ్గు అలర్ న్ద = పరిమళము వెదజల్లు; మలర్ = పుష్పములను పెట్టుకొన్న; కుழలార్ = కొప్పులుగల స్త్రీలయొక్క; కొఙ్గై = స్తనములమీద; తోయ్ న్ద = కూడుకొన్న; కుఙ్గుమత్తిన్ కుழమ్బు = కుంకుముయొక్క ముద్దచే; అళైన్ద = రాసుకొనుటచేనుండు; కోలమ్ తన్నాల్ = అందమువలన; శెమ్ = ఎర్రతనము; కలఙ్గల్ = వరదలచే;వెణ్ మణల్ మేల్ = తెల్లని ఇసుక తిన్నెలపై; తవழுమ్ = మెల్లగ వ్యాపింపబడు; నాఙ్గూర్=నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుత్తెర్ట్రియమ్బలత్తు = తిరుత్తెర్ట్రియమ్బలమ్ అను దివ్యదేశములో కృపతో వేంచేసిన; ఎన్ = నాకు స్వామియైన;   శెమ్ కణ్ మాల్ = ఎఱ్ఱని  నేత్రములుగల సర్వేశ్వరుడు;(ఎవరన ) పొఙ్గు ఇలఙ్గు =మిక్కిలి ప్రకాశించు;పురిసూలుమ్=యజ్ఞోపవీతమును; తోలుమ్ = కృష్ణాజినము; తాழ = తొంగులాడుచున్న; పొల్లాద = అందమైన; కుఱళ్ ఉరువాయ్ = వామనమూర్తియై;  పొరున్దా వాణన్ = అసుర ప్రవృత్తిగల మహాబలి యొక్క; మఙ్గలమ్ శేర్ మఱై = మంగళకరమైన వేదముల ఘోషలతోనున్న; వేళ్వి అదనుల్ = యాగ భూమిలో; పుక్కు = ప్రవేశించి;కుఱై = తనకు కావలసిన; మణ్ అగలమ్ = భూమిని; ఇరన్ద = యాచించిన;   మైన్దన్ కణ్డీర్ = జగత్పభువైన వామనుడే సుమండీ! 

పరిమళము వెదజల్లు పుష్పములను పెట్టుకొన్న కొప్పులుగల స్త్రీలు కుంకుమ అలంకారముగల వక్షస్థలములతొ కావేరినదిలో స్నానముచేయగ ,  నీటి ప్రవాహముచే  తెల్లని ఇసుక తిన్నెలు  ఎఱ్ఱబడు  నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుత్తెర్ట్రియమ్బలమ్ అను దివ్యదేశములో కృపతోవేంచేసిన, నాకు స్వామియైన ఎఱ్ఱని  నేత్రములుగల సర్వేశ్వరుడు  (ఎవరన) , మిక్కిలి ప్రకాశించు యజ్ఞోపవీతమును , ఎడమభుజముపై   కృష్ణాజినమును గల వామనమూర్తియై , మహాబలి యొక్క యాగ భూమిలో ప్రవేశించి మూడడుగుల నేలను యాచించి విశ్వమంతను కొలిచిన జగత్పభువైన ఆవామనుడే సుమండీ! 

శిలమ్బినిడై చ్చిఱుపరల్ పోల్ పెరియమేరు ,

తిరుక్కుళమ్బిల్ కణకణప్ప త్తిరువాకారమ్

కులుఙ్గ ,  నిలమడందై తనై ఇడన్దు పుల్ గి ,

కోట్టిడై వైత్తరుళియ ఎన్ కోమాన్ కణ్డీర్ ,

ఇలఙ్గియ నాన్మఱైయనైత్తుమ్ అఙ్గమాఱుమ్ , 

ఏழிశైయుమ్  కేళ్విగళుమ్ ఎణ్దిక్కెఙ్గుమ్ ,

శిలమ్బియ నఱ్పెరుఞ్జెల్వమ్ తిగழு నాఙ్గూర్ ,

తిరుత్తెర్ట్రియమ్బలత్తు ఎన్ శెఙ్గణ్ మాలే .       1285

ఇలఙ్గియ = (ప్రమాణములలో ప్రశస్తముగ)ప్రకాశించుచున్న; నాల్ మఱై అనైత్తుమ్ = వేదములంతయును; అఙ్గమ్ ఆఱుమ్ = వ్యాకరణాది ఆరు అంగములును; ఏழ் ఇశైయుమ్ = సప్తస్వరములును; కేళ్విగళుమ్ = ఇతిహాస పురాణములు మొదలగునవంతయును; ఎణ్ దిక్కు ఎఙ్గుమ్ = ఎనిమిది దిక్కులలోను; శిలమ్బియ = ఘోషింపబడుచున్నదియు; నల్ పెరు శెల్వమ్ = ఉత్తమమైన మిక్కిలి సంపదలతో; తిగழுమ్ = ప్రకాశింపబడుచున్న; నాఙ్గూర్=నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుత్తెర్ట్రియమ్బలత్తు = తిరుత్తెర్ట్రియమ్బలమ్ దివ్యదేశములో కృపతోవేంచేసిన; ఎన్ = నాకు స్వామియైన; శెమ్ కణ్ మాల్ = ఎఱ్ఱని  నేత్రములుగల సర్వేశ్వరుడు;(ఎవరన ) శిలమ్బిన్ ఇడై = గజ్జెల యందుగల; శిఱుపరల్ పోల్ = చిన్న రాళ్ళువలె; పెరియమేరు =  పెద్ద మేరు పర్వతము; తిరుక్కుళమ్బిల్ = అందమైన పాదములందు; కణకణప్ప = గణగణమని మ్రోగుచుండగ; తిరు ఆకారమ్ = (వక్షస్థలమందు) శ్రీదేవియుండు నివాసస్థానము; కులుఙ్గ = ఇటుఅటు కదులచుండ;(భూమిని)ఇడన్దు = అండభిత్తినుండి పైకెత్తి; నిలమడందై తనై = ఆభూదేవతను;పుల్ గి = కౌగిలించికొని; కోట్టిడై = కోరలపై; వైత్తు అరుళియ = ధరించి కరుణించిన; ఎమ్  కోమానై = మనయొక్క ప్రభువైన; కణ్డీర్ = ఆ వరాహస్వామియే సుమండీ! .                                                                   

  నాల్గు వేదములును , వాటి ఆరు అంగములును , సప్తస్వరములును ,ఇతిహాస పురాణములు మొదలగునవంతయును , అన్ని దిసలయందును ఘోషింపబడుచున్నదియు , సిరిసంపదలతో   శోభిల్లుచున్నదియును , నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుత్తెర్ట్రియమ్బలమ్ అను దివ్యదేశములో కృపతోవేంచేసిన నాకు స్వామియైన ఎఱ్ఱని  నేత్రములుగల సర్వేశ్వరుడు  (ఎవరన) , తన పాదములందు గజ్జెలలో పెద్ద మేరు పర్వతము చిన్న రాళ్ళువలె  గణగణమని మ్రోగుచుండగ , వక్షస్థలమందు శ్రీదేవియుండు నివాసస్థానము ఇటుఅటు కదులచుండ ,  విశాలమైన భూమిని అండభిత్తినుండి పైకెత్తి , ఆ భూమాతను హత్తుకొని ,సమస్త భూమండలమును తన కోరలపై ధరించి కరుణించిన మనయొక్క ప్రభువైన ఆ వరాహస్వామియే సుమండీ! 

ఏழுలగుమ్ తాழ்వరైయుమ్ ఎఙ్గుమ్ మూడి ,

ఎణ్దశైయుమ్ మణ్డలముమ్ మణ్డి , అణ్డమ్

మోழை యెழுన్దాழி మిగుమూழி వెళ్ళమ్ ,

మున్ అగట్టిల్ ఒడుక్కియ ఎమ్మూర్తి కణ్డీర్ ,

ఊழிదొఱుమూழிదొఱుమ్ ఉయర్ న్ద శెల్వత్తు  ,

ఓఙ్గయ నాన్మఱైయనైత్తుమ్ తాఙ్గు నావర్ ,

శేழுయర్ న్ద  మణిమాడమ్ తిగழு నాఙ్గూర్ ,

తిరుత్తెర్ట్రియమ్బలత్తు ఎన్ శెఙ్గణ్ మాలే . 1286

ఊழிదొఱుమ్ ఊழிదొఱుమ్ = కాల క్రమేణ;ఉయర్ న్ద = వృద్ధిపొందుచున్న; శెల్వత్తు = సంపదలుగల; ఓఙ్గియ = శ్లాఘ్యమైన; నాన్మఱై అనైత్తుమ్ = వేదములంతయును; తాఙ్గు నావర్ = నాలుక యందుగల వేదోత్తములు నివసించుచుండునదియు; శేழ் ఉయర్ న్ద = మిక్కిలి ఎత్తైన; మణిమాడమ్ = మణులతోనిండిన భవనములతో; తిగழுమ్ = ప్రకాశించుచున్న; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుత్తెర్ట్రియమ్బలత్తు = తిరుత్తెర్ట్రియమ్బలమ్ అనుదివ్యదేశములో కృపతోవేంచేసిన; ఎన్ = నాకు స్వామియైన; శెమ్ కణ్ మాల్ = ఎఱ్ఱని  నేత్రములుగల సర్వేశ్వరుడు; (ఎవరన ) ఏழுలగుమ్ = సప్తద్వీపములను;తాళ్ వరైయుమ్ = ప్రక్కన చిన్న పర్వతములను కూడిన పెద్ద పర్వతములును; ఎఙ్గుమ్ = కలిగిన అన్ని ప్రదేశములును; మూడి = ఆక్రమించి; ఎణ్ తిశైయుమ్ = ఎనిమిది  దిక్కులలోనున్న;మణ్ తలముమ్ = అన్ని భూములలోను; అణ్డమ్ = బ్రహ్మాండములోను; మణ్డి = వ్యాపించి; మోழை ఎழுన్దు = ఉప్పొంగి; ఆழிమిగుమ్ = సముద్రము పెరుగుటచే కలిగిన; ఊழிవెళ్ళమ్ = మహాప్రళయము సంభవించినప్పుడు; మున్ = పూర్వకాలమున; (ఈ జగత్తును)అగట్టిల్ = తన ఉదరమున; ఒడుక్కియ= ఉంచుకొనిన; ఎమ్ = మనయొక్క; మూర్తి కణ్డీర్ = వటపత్రశాయియే సుమండీ!      

                                                    మిక్కిలి సిరిసంపదలుగల శ్లాఘ్యమైన వేదోత్తములు నివసించుచుండునదియు ,మిక్కిలి ఎత్తైన మణులతోనిండిన భవనములుగల , నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుత్తెర్ట్రియమ్బలమ్ అను దివ్యదేశములో కృపతోవేంచేసిన నాకు స్వామియైన ఎఱ్ఱని  నేత్రములుగల సర్వేశ్వరుడు  (ఎవరన) ,పూర్వకాలమున  మహాప్రళయము సంభవించినపుడు ఈ బ్రహ్మాండమంతయును  తన ఉదరములోనుంచుకొని చిన్న వటదళముపై పవళించిన ఆ వటపత్రశాయియే సుమండీ!

** శీరణిన్ద మణిమాడమ్ తిగழு నాఙ్గూర్  ,

తిరుత్తెర్ట్రియమ్బలత్తు ఎన్ శెఙ్గణ్ మాలై ,

కూరణిన్ద వేల్ వలవన్ ఆలినాడన్ ,

కొడిమాడ మంగైయర్ కోన్ కుఱైయలాళి ,

పారణిన్ద తొల్ పుగழாన్  కలియన్ శొన్న ,

పామాలై యివైయైన్దు మైన్దమ్ వల్లార్ ,

శీరణిన్ద వులగత్తు మన్న రాగి ,

శేణ్ విశుమ్బిల్ వానవరాయ్ త్తిగழ்వర్ తామే . 1287

శీర్ అణిన్ద = శ్లాఘ్యమైన; మణిమాడమ్ = మణులతోనిండిన మేడలతో; తిగழு = ప్రకాశించు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుత్తెర్ట్రియమ్బలత్తు = తిరుత్తెర్ట్రియమ్బలమ్ అనుదివ్యదేశములో కృపతోవేంచేసిన; ఎన్ = నాకు స్వామియైన; శెఙ్గణ్ మాలై = ఎఱ్ఱని నేత్రములుగల సర్వేశ్వరుని విషయమై; కూరణిన్ద = మిక్కిలి వాడియైన; వేల్ వలవన్ = ఈటెను ప్రయోగించు వారును; ఆలినాడన్ = తిరువాలి దేశమునకు ప్రభువును; కొడిమాడ = ధ్వజములతో కూడిన మేడలు కలిగిన; మంగైయర్ కోన్ = తిరుమంగై వాసులకు నాధుడును; కుఱైయల్ ఆళి = తిరుకుఱైయలూర్ పాలకుడును; పార్ అణిన్ద = భూమియందు అలంకారమైన; తొల్ పుగழாన్ = స్వభావసిద్దమైన కీర్తిగల; కలియన్ = తిరుమంగై ఆళ్వారులు; శొన్న = సాధించిన; పామాలై = పాశురములు; ఇవైయైన్దు మైన్దమ్ = ఈ పదియును; వల్లార్ తామ్ = అనుసంధించువారు;ఉలగత్తు = ఈలోకమందు; శీర్ అణిన్ద = శ్లాఘ్యమైన కీర్తిగల; మన్నర్ ఆగి = రాజులై సుఖముగనుండి;  (పిదప) శేణ్ విశుమ్బిల్ = ఉన్నతమైన పరమపదమందు; వానవర్ ఆయ్ = నిత్యశూరులతో చేరి; త్తిగழ்వర్ = ప్రకాశించుదురు.

శ్లాఘ్యమైన మణులతోనిండిన భవనములతో ప్రకాశించు నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుత్తెర్ట్రియమ్బలమ్ అను దివ్యదేశములో కృపతోవేంచేసిన  ఎఱ్ఱని నేత్రములుగల సర్వేశ్వరుని విషయమై తిరువాలి దేశమునకు ప్రభువును , తిరుమంగై వాసులకు నాధుడును , తిరుకుఱైయలూర్ పాలకుడును , అందరిచే మిక్కిలి కొనియాడబడు తిరుమంగై ఆళ్వారులు కృపతో నుడివిన ఈ పది పాసురములను అనుసంధిచువారు ఈలోకమందు శ్లాఘ్యమైన కీర్తిగల రాజులై సుఖముగనుండి పిదప ఉన్నతమైన పరమపదమందు నిత్యశూరులతో చేరి ప్రకాశించుదురు.

***********

వ్యాఖ్యానించండి