శ్రీః
5 . తూమ్బుడై
అవతారిక :-
నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరు మణిక్కూడమ్ (వరదరాజ పెరుమాళ్) దివ్య దేశములో , కృపతో శ్రీదేవి, భూదేవి సమేతుడై, వేంచేసిన మణికూడనాయకన్ పెరుమాళును (కాంచీపుర వరదరాజన్ వలె భక్తులను అనుగ్రహించు పెరుమాళును), తిరుమంగై ఆళ్వారులు ఈ పది పాశురములతో మంగళాశాసనము చేయుచున్నారు.
** తూమ్బుడై ప్పనై క్కైవేழమ్ , తుయర్ కెడుత్తరుళి , మన్ను
కామ్బుడై క్కున్ఱమేన్ది , క్కడుమழை కాత్త ఎన్దై ,
పూమ్బునల్ పొన్ని ముర్ట్రుమ్ , పుగున్దు పొన్ వరణ్డ , ఎఙ్గుమ్
తేమ్బొழிల్ కమழு నాఙ్గూర్ , తిరుమణిక్కూడత్తానే 1288
తూమ్బు ఉడై = రంద్రముతొకూడి; పనై = తాటిచెట్టువలె; క్కై = తొండముగల; వేழమ్ = గజేంద్రుని యొక్క; తుయర్ = దుఃఖమును; కెడుత్తు అరుళి = పోగొట్టి కరుణించినవాడును; మన్నుకామ్బు ఉడై = దృఢముగ నాటుకొని వెదురుచెట్లతో నున్న; క్కున్ఱమ్ = గోవర్ధనపర్వతమును; ఏన్ది = (గొడుగు వలె) పైకెత్తి; కడు మழை = భయంకరమైన వర్షమును; కాత్త = అడ్డగించి గోకులమంతను కాపాడినవాడును; (అట్టి) ఎన్దై = సర్వేశ్వరుడు (ఎచట కలడన్న); పూ = అందమైన; పునల్ = జలములుగల; పొన్ని = కావేరి నది; ముర్ట్రమ్ = అన్ని చోట్లయందు; పుగున్దు = ప్రవహించి; పొన్ = బంగారు రాసులను; వరణ్డ = కొట్టుకొనివచ్చి చేర్చు చున్నదియు; ఎఙ్గుమ్ = కంటికి కనబడు ప్రదేశమంతటను, తేమ్ పొழிల్ = తేనెలతోనిండిన పుష్పములుగల తోటలచే; కమழுమ్ = పరిమళము వ్యాపింపబడునదియు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుమణిక్కూడత్తానే = తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ!
క్రూరమైన మొసలి నోటికోరలలో చిక్కి శక్తినశించిన గజేంద్రుని సంరక్షించిన వాడును , దేవేంద్రునిచే కురిపింపబడిన భయంకరమైన వర్షమును , తన చిటికిన వేలికొనతో గోవర్ధనపర్వతమును గొడుగు వలె పైకెత్తి పట్టుకొని గోకులమంతను కాపాడినవాడును , అయిన సర్వేశ్వరుడు (ఎచట కలడన్న) , అందమైన కావేరినది జలప్రవాహములో బంగారు రాసులు కొట్టుకొనివచ్చి అన్ని చోట్లయందు చేరబడుచుండునదియు , తేనెలతోనిండిన పుష్పములుగల తోటలచే పరిమళము వ్యాపింపబడునదియు ,నాఙ్గూర్ ప్రాంతములో నున్నదియు , అయిన తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ !.
కవ్వై వాళ్ ఎయిర్ట్రు వన్ పేయ్ , క్కదిర్ ములై శువైత్తు , ఇలఙ్గై
వవ్వియ ఇడుంబైతీర , క్కడుఙ్గణై తురన్ద ఎన్దై ,
కొవ్వైవాయ్ మగళిర్ కొఙ్గై , క్కుంకుమమ్ కழுవిప్పోన్ద ,
తెయ్ వనీర్ కమழு నాఙ్గూర్ , తిరుమణిక్కూడత్తానే . 1289
కవ్వై = బిగ్గరగ అరుచు; వాళ్ = కత్తివలె వాడియైన; ఎయిర్ట్రు = పళ్ళు గల; వన్ పేయ్ = క్రూరమైన రక్కసి పూతనయొక్క; కదిర్=విషముచే ప్రకాశించు; ములై = స్తనములను; శువైత్తు = కుడుచినవాడును; ఇలఙ్గై = లంకాపురికి; వవ్వియ =( క్రూరలైన రాక్షసుల సంబంధమువలన) పట్టుకొన్న; ఇడుంబై = బాధలు; తీర = తొలిగిపోవునటుల; కడుమ్ కణై = క్రూరమైన బాణములను; తురన్ద = ( ఆ లంకాపురిపై ) ప్రయోగించిన వాడును; (అట్టి), ఎన్దై = సర్వేశ్వరుడు ( ఎచట కలడన్న );కొవ్వై వాయ్=ఎఱ్ఱని దొండపండువలె నోరుగల; మగళిర్ =వనితల; కొఙ్గై = తమ వక్షస్థలములనుండి; కుంకుమమ్ = రాసుకొనిన కుంకుమలు; కழுవిపోన్ద = కడిగి ప్రవహించిన; తెయ్ వమ్ నీర్ = దివ్యమైన కావేరి నది నీటిచే; కమழுమ్ = పరిమళము వ్యాపింపబడు ;నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుమణిక్కూడత్తానే = తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ!
భయంకరమైన కోరలుగల క్రూరమైన రక్కసి పూతనయొక్క విషస్తన్యములను కుడుచినవాడును , లంకాపురియొక్క రాక్షసుల సంబంధమువలన కలిగిన బాధ తొలిగిపోవునటుల క్రూరమైన బాణములను ఆ లంకాపురిపై ప్రయోగించిన వాడును , అట్టి సర్వేశ్వరుడు ,ఎచట కలడనగ , సౌందర్యమైన స్త్రీల తమ వక్షస్థలములయందు రాసుకొనిన కుంకుమలు కావేరినది జలప్రవాహములచే కడగబడి , ఆ దివ్యమైన నీటిచే పరిమళము వ్యాపింపబడు నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ !
మా త్తొழிల్ మడఙ్గచ్చెర్ట్రు , మరుదు ఇఱ నడన్దు , వన్ తాళ్
శే త్తొழிల్ శిదైత్తు , పిన్నై శెవ్విత్తోళ్ పుణర్ న్ద ఎన్దై ,
నా త్తొழிల్ మఱైవల్లార్ గళ్ , నయన్దు అఱమ్ పయన్ద , వణ్ కై
తీ త్తొழிల్ పయిలు నాఙ్గూర్ , తిరుమణిక్కూడత్తానే . 1290
మా = అశ్వరూపములో వచ్చిన కేశియను అశురునియొక్క; త్తొழிల్ = క్రూర కృత్యములు; మడఙ్గ = అణుగునట్లు; శెర్ట్రు = వధించినవాడును; మరుదు = మద్ది వృక్షములు రెండు; ఇఱ = విరిగి క్రిందపడునట్లు; నడన్దు = వాటి మధ్య పాకినవాడును; వల్ తాళ్ = బలమైన కాళ్ళుగల; శే = (ఏడు)వృషభముల యొక్క; త్తొழிల్ = ఉరికి మీదపడి చంపు కృత్యమును; శిదైత్తు = భంగపరిచి(వాటిని వధించి); పిన్నై = నప్పిన్నైపిరాట్టియొక్క; శెవ్వి తోళ్ = అందమైన భుజములతొ; పుణర్ న్ద = సంశ్లేషించినవాడును; (అట్టి) ఎన్దై = సర్వేశ్వరుడు ( ఎచట కలడన్న ); నా = వాచకమైన; త్తొழிల్ = కైంకర్యముతో; మఱైవల్లార్ గళ్ = వేదములును అనుసంధించు వైష్ణవోత్తములు; నయన్దు = మిక్కిలి ఆశతో; అఱమ్ = ధర్మములును; పయన్ద = చేయు; వణ్ = ఉదారమైన; కై = హస్తములతో;తీ త్తొழிల్ = అగ్నిహోత్ర కార్యములు; పయిలుమ్=ఎడతెగక చేయబడుచుండు; నాఙ్గూర్=నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుమణిక్కూడత్తానే = తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ !
క్రూరడైన కంసునిచే ప్రేరేరింపబడి అశ్వరూపములో వచ్చిన కేశియను అశురునియొక్క దుష్కుత్యములు అణుగునట్లు వధించినవాడును , రెండు మద్ది వృక్షములు విరిగి క్రిందపడునట్లు వాటి మధ్య పాకినవాడును , దృఢమైన నేలను ధూళి రేగునట్లు దువ్వు బలమైన కాళ్ళుగల ఏడువృషభములను వధించి నప్పిన్నైపిరాట్టయొక్క అందమైన భుజములతొ సంశ్లేషించినవాడును (అట్టి)సర్వేశ్వరుడు ( ఎచట కలడన్న ) వాచిక కైంకర్యముతో వేదములును అనుసంధించు వైష్ణవోత్తములు మిక్కిలి ఆశతో ధర్మములును చేయు హస్తములతో అగ్నిహోత్ర కార్యములు ఎడతెగక చేయబడుచుండు నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ !
తాఙ్గరుమ్ శినత్తు వన్ తాళ్ , తడక్కై మామరుప్పువాఙ్గి ,
పూఙ్గురున్దు ఒశిత్తు ప్పుళ్ వాయ్ పిళన్దు , ఎరుదు అడర్త ఎన్దై ,
మాఙ్గని నుగర్ న్ద మన్ది , వన్దు వణ్డు ఇరియ , వాழை
తీఙ్గని నుగరు నాఙ్గూర్ , తిరుమణిక్కూడత్తానే . 1291
తాఙ్గ అరుమ్ = ఒకరిచేతను ఎదిరింప శఖ్యముకాని; శినత్తు = కోపముగల; వన్ తాళ్ = బలమైన కాళ్ళుగలదియు; తడక్కై = పెద్ద తొండముగల (కువలయాపీడము యొక్క) మా = పెద్ద; మరుప్పు = దంతములను; వాఙ్గి = పెరికివేసిన వాడును; పూఙ్గరున్దు = పూలతో నిండిన బండిగురుగింజ చెట్టును; ఒశిత్తు = విరిచినవాడును; ప్పుళ్ వాయ్ = బకాసురునియొక్క నోటిని; పిళన్దు = చీల్చినవాడును; ఎరుదు = ఏడు వృషభములను; అడర్త = వధించినవాడును; (అట్టి) ఎన్దై = సర్వేశ్వరుడు; ( ఎచట కలడన్న ) మా కని = మామిడిపండ్లను; నుగర్ న్ద = తినిన; మన్ది = కోతులు; వన్దు =(ఆ మామిడి చెట్లనుండి అరటిచెట్లపైన) వచ్చి; వణ్డు ఇరియ = (అక్కడున్న)తుమ్మెదలను చెదరకొట్టి; తీమ్ వాழைకని = మధురమైన అరటిపండ్లను; నుగరుమ్ = తినుచుండునట్టి; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుమణిక్కూడత్తానే = తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ !
క్రూరడైన కంసునిచే ప్రేరేరింపబడి వచ్చిన కువలయాపీడము యొక్క దంతములను విరిచి చంపినవాడును , అశురుడు ఆవేశించిన పూలతో నిండిన బండిగురుగింజచెట్టును విరిచినవాడును , బకాసురునియొక్క నోటిని చీల్చినవాడును , నప్పిన్నైపిరాట్టికొఱకు ఏడు వృషభములను వధించిన వాడును (అట్టి) సర్వేశ్వరుడు ( ఎచట కలడన్న ) , మామిడిపండ్లను తినిన కోతులు అరటిచెట్లపైవచ్చి అక్కడున్న తుమ్మెదలను చెదరకొట్టి మధురమైన అరటిపండ్లను తినుచుండునట్టి నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ !
కరుమగళ్ ఇలఙ్గై యాట్టి , పిలఙ్గొల్ వాయ్ తిఱన్దు , తన్మేల్
వరుమవళ్ శెవియుమ్ మూక్కుమ్ , వాళినాల్ తడిన్ద ఎన్దై ,
పెరుమగళ్ పేదై మంగై , తన్నొడుమ్ పిరివిలాద ,
తిరుమగళ్ మరువు నాఙ్గూర్ , తిరుమణిక్కూడత్తానే . 1292
కరుమగళ్ = చండాలస్త్రీవలె నీచమైన; ఇలఙ్గై యాట్టి = లంకాపురి అధికారిణి; పిలఙ్గోల్ = భిలము వలె నున్న; వాయ్ తిఱన్దు = నోటిని తెరుచుకుని; తన్మేల్ = తన మీదకు; వరుమ్ = వచ్చిన; అవళ్ = శూర్పణఖయొక్క; శెవియుమ్ = చెవియును; మూక్కుమ్ = ముక్కును; వాళినాల్ = కత్తిచే; తడిన్ద = కోసిన; (అట్టి) ఎన్దై = సర్వేశ్వరుడు; ( ఎచట కలడన్న ),పెరుమగళ్ = (ఓర్పుచే)ఖ్యాతిగల స్త్రీయును; పేదై = భక్తుల తప్పులను చూడనిదియును అయిన; మఙ్గై = భూదేవియును; తన్నొడుమ్ = ఆమెతో కూడి; పిరివు ఇలాద = ఒకక్షణమైనను ఎడబాయకనుండు; తిరుమగళ్ = శ్రీ మహాలక్ష్మితో; మరువుమ్= చేరియుండు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుమణిక్కూడత్తానే = తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ!
పూర్వమొకప్పుడు దండకారణ్యములో సీతాదేవితోకూడి తానుండగ, లంకాపురి అధికారిణియైన శూర్పణఖ తన కోరిక తీరనందన గుహవలెనుండు నోటిని తెరుచుకుని మీదుకురాగా,ఆమెయొక్క ముక్కుచెవులను కోసిన సర్వేశ్వరుడు ( ఎచట కలడన్న ) , తనకు సాటిలేని సహనముగల భూదేవితోను, ఒకక్షణమైనను ఎడబాయక వక్షస్థలమందు నివసించు శ్రీదేవితోను కూడియుండు నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ !
కెణ్డైయుమ్ కుఱళుమ్ పుళ్ళుమ్ , కేழలుమ్ అరియు మావుమ్ ,
అణ్డముమ్ శుడరుమ్ అల్లా , ఆర్ట్రలుమాయ ఎన్దై ,
ఒణ్డిఱల్ తెన్నన్ ఓడ , వడ అరశు ఓట్టమ్ కణ్డ ,
తిణ్డిఱలాళర్ నాఙ్గూర్ , తిరుమణిక్కూడత్తానే . 1293
కెణ్డైయుమ్ = మత్స్యముగను; కుఱళుమ్ = వామనుడుగను; పుళ్ళుమ్ = హంసపక్షిగను; కేழలుమ్ = వరాహముగను; అరియుమ్ = నరసింహునిగను; మావుమ్ = హయగ్రీవునిగను;(మొదలగు అవతారములను కలవాడై) అణ్డముమ్ = బ్రహ్మాండమును; శుడరుమ్ = సూర్యచంద్రులను; అల్లా = మిగిలినవన్ని; ఆర్ట్రలుమ్ = శ్రేష్టమైన వస్తువులును; ఆయ = తానే అయిన; ఎన్దై = సర్వేశ్వరుడు; ( ఎచట కలడన్న ) ఒణ్ తిఱల్ = మిక్కిలి బలవంతుడైన; తెన్నన్ = పాండ్యదేశపు రాజు; ఓడ = యుద్దములో ఓడునట్లును; వడ అరశు = పాండ్యదేశమునకు ఉత్తరదిక్కునగల చోళదేశపురాజు; ఓట్టమ్ కణ్డ = యుద్దమందు ఓడి పారిపోవునటులచేసిన; తిణ్ తిఱలార్ = మహాబలశాలులు నివసించుచున్న; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుమణిక్కూడత్తానే = తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ !
మత్స్యముగను , వామనుడుగను , హంసపక్షిగను , వరాహముగను నరసింహునిగను , హయగ్రీవునిగను మొదలగు అవతారములను దాల్చినవాడును , బ్రహ్మాండము , సూర్యచంద్రులు నక్షత్రములు మొదలగు శ్రేష్టమైన వస్తువులన్నియు తానే అయినవాడగు సర్వేశ్వరుడు ( ఎచట కలడన్న ) పాండ్యదేశపు రాజు , చోళదేశపు రాజులను యుద్దమందు ఓడించిన మిక్కిలి పరాక్రమవంతులు నివసించుచున్న నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ !
కున్ఱముమ్ వానుమ్ మణ్ణుమ్ , కుళిర్ పునల్ తిఙ్గళోడు ,
నిన్ఱ వెఞ్జుడరుమ్ అల్లా , నిలైగళుమాయ ఎన్దై ,
మన్ఱముమ్ వయలుమ్ కావుమ్ , మాడముమ్ మణఙ్గొణ్డు , ఎఙ్గుమ్
తెన్ఱల్ వన్దులవు నాఙ్గూర్ , తిరుమణిక్కూడత్తానే . 1294
కున్ఱముమ్ = పర్వతములును; వానుమ్ = ఆకాశమును; మణ్ణుమ్ = భూమియును; కుళిర్ పునల్ = చల్లని స్వభావముగు నీరును; తిఙ్గళోడు = చంద్రుడును; నిన్ఱ =నిత్యముగనుండు;వెఞ్జుడరుమ్=సూర్యుడును; అల్లా నిలైగళుమ్ = మిగిలిన నక్షత్రాది స్థితులును; ఆయ = ఇవన్నియు తానే అయిన; ఎన్దై = సర్వేశ్వరుడు; ( ఎచట కలడన్న ) మన్ఱముమ్ = పెద్ద వీదులును; వయలుమ్ = పొలములును; కావుమ్ = తోటలును; మాడముమ్ = మేడలును; ఎఙ్గుమ్ = మొదలగు అన్ని స్థలములందు; తెన్ఱల్ =దక్షినపుగాలి; మణమ్ కొణ్డు = పరిమళమును తీసికొని; వన్దు ఉలవుమ్ = వచ్చి వీచుచుండు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుమణిక్కూడత్తానే = తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ !
పర్వతములు , ఆకాశము , భూమి , నీరు , సూర్యచంద్రులు , నక్షత్రాది స్థితులన్నియును తానేఅయిన సర్వేశ్వరుడు ( ఎచట కలడన్న ) ,పెద్ద వీదులు , పొలములు ,తోటలు , మేడలు, అన్ని స్థలములందు దక్షినపుగాలిచే పరిమళము వీచబడుచుండు నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ !
శంగైయుమ్ తుణివుమ్ పొయ్యిమ్ , మెయ్యుమ్ ఇత్తరణియోమ్బుమ్ ,
పొంగియ ముగిలుమ్ అల్లా , ప్పొరుళ్ గళ్ మాయ ఎన్దై ,
పంగయమ్ ఉగుత్త తేఱల్ , పరుగియ వాళై పాయ ,
శెమ్ కయలుగళుమ్ నాఙ్గూర్ , తిరుమణిక్కూడత్తానే . 1295
శంగైయుమ్ = సందేహమును; తుణివుమ్ = నిశ్చయమును; పొయ్యిమ్ = అసత్యమును; మెయ్యుమ్ = సత్యమును; ఇత్తరణి = ఈభూమండలమును; ఓమ్బుమ్ = రక్షించువాడును; పొంగియ = వ్యాపించిన; ముగిలుమ్ = మేఘములును; అల్లా ప్పొరుళ్ గళ్ మ్ =ఇంకను మిగిలిన వస్తువులును; ఆయ = తానే అయిన; ఎన్దై = సర్వేశ్వరుడు; ( ఎచట కలడన్న ) పంగయమ్ = తామరపుష్పములు; ఉగుత్త = వెలిబుచ్చిన; తేఱల్ = మకరందమును; పరుగియ = పానముజేసిన; వాళై = వాళై మత్స్యములు; పాయ = ఎగురుచు ఈదచూ పోవుచుండ; శెమ్ కయల్ = ఎఱ్ఱని కయల్ చేపలు; ఉగళుమ్ = (బయపడి) త్రుళ్ళుచూ పారిపోవుచుండు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుమణిక్కూడత్తానే = తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ
సందేహము , నిశ్చయము , అసత్యము , సత్యము , ఈభూమండలమునకు రక్షకుడును , మేఘములు , ఇంకను మిగిలిన తదితర వస్తువులును తానే అయిన సర్వేశ్వరుడు ( ఎచట కలడన్న ) , తామరపుష్పములు వెలిబుచ్చిన మకరందమును పానముజేసిన వాళై మత్స్యములు ఎగురుచు ఈదచూ పోవుచుండ , వాటికి బయపడి ఎఱ్ఱని కయల్ చేపలు త్రుళ్ళుచూ పారిపోవుచుండు నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ !
పావముమ్ అఱముమ్ వీడుమ్ , ఇన్బముమ్ తున్బన్దానుమ్ ,
కోవముమ్ అరుళుమ్ అల్లా , క్కుణఙ్గళుమాయ ఎన్దై ,
మూవరిల్ ఎఙ్గళ్ మూర్తి , ఇవనెన మునివరోడు ,
దేవర్ వన్దు ఇఱైఞ్జుమ్ నాఙ్గూర్ , తిరుమణిక్కూడత్తానే . 1296
పావముమ్ = పాపమును; అఱముమ్ = పుణ్యమును; వీడుమ్ = మోక్షమును; ఇన్బముమ్ = సుఖమును; తున్బమ్ తానుమ్ = దుఃఖమును; కోవముమ్ = కోపమును;అరుళుమ్ = అనుగ్రహమును; అల్లా = ఇంకను మిగిలిన; క్కుణఙ్గళుమ్ = గుణములు అన్నింటికిని; ఆయ = నిర్వాహకుడైన; ఎన్దై = సర్వేశ్వరుడు; (ఎచట కలడన్న) మూవరిల్ = బ్రహ్మ , విష్ణు, శివుడు అనబడు ముగ్గురు మూర్తులలోను; ఎఙ్గళ్ మూర్తి = మేమాశ్రయించ తగిన మూర్తి; ఇవన్ ఎన = ఈ విష్ణువే యని; మునివరోడు = మహర్షులతో కూడ; దేవర్ = సమస్త దేవతలు; వన్దు = వచ్చి; ఇఱైఞ్జుమ్ = సేవించు కొనుచుండు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుమణిక్కూడత్తానే = తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ !
పుణ్యపాపములు , సుఖదుఃఖములు , కోపతాపములు , మోక్షము , అనుగ్రహము మొదలగు సమస్తగుణములకు నిర్వాహకుడైన సర్వేశ్వరుడు ( ఎచట కలడన్న) , బ్రహ్మ , విష్ణు, శివుడు అనబడు త్రిమూర్తులలో మేమాశ్రయించతగిన మూర్తి , ఈ శ్రీమహావిష్ణుమూర్తియే , అని శుకసనకాది మహర్షులు , బ్రహ్మ,ఇంద్రాదిదేవతులు వచ్చి సేవించుకొనుచుండు నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుమణిక్కూడం అను దివ్యదేశములోనే సుమీ !
** తిఙ్గళ్ తోయ్ మాడ నాఙ్గూర్ , తిరుమణిక్కూడత్తానై ,
మంగైయర్ తలైవన్ వణ్ తార్ , కలియన్ వాయొలిగళ్ వల్లార్ ,
పొంగునీర్ ఉలగుమాణ్డు , పొన్నులగాణ్డు , పిన్నుమ్
వెంగదిర్ ప్పరిదివట్టత్తు , ఊడుపోయ్ విళఙ్గువారే . 1297
తిఙ్గళ్ తోయ్ = చంద్రమండలమును అంటుకొనియున్నట్లున్న; మాడ = భవనములుగల; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుమణిక్కూడత్తానై = తిరుమణిక్కూడం అను దివ్యదేశములో కృపతో వేంచేసిన సర్వేశ్వరుని విషయమై; మంగైయర్ = తిరుమంగై దేశవాసులకు; తలైవన్ = ప్రభువైన; వణ్ తార్ = అందమైన పూ మాలచే ఒప్పు; కలియన్ = తిరుమంగై ఆళ్వారులు; వాయ్ = వాచిక కైంకర్యమైన; ఒలిగళ్ = ఈపది పాశురములను; వల్లార్ = అనుసంధించువారు ; పొంగునీర్ = సముద్రముచే చుట్టబడిన ; ఉలగమ్ = ఈలోకమును; ఆణ్డు = పరిపాలించిన పిదప; పొన్ ఉలగు = స్వర్గలోకమును; ఆణ్డు = అనుభవించి; పిన్నుమ్ = మరియు; వెమ్ కదిర్ = కిరణములుగల; పరిదివట్టత్తు ఊడుపోయ్= సూర్యమండల మార్గము ద్వారా పయనించి; విళఙ్గువారే = పరమపదమందు సుఖముగ నివసింతురు.
ఉన్నతమైన మేడలు గల నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుమణిక్కూడం అను దివ్యదేశములో కృపతో వేంచేసిన సర్వేశ్వరుని విషయమై తిరుమంగైదేశవాసులకు నిర్వాహుకులైన తిరుమంగై ఆళ్వారులు వారు సాధించిన ఈపది పాశురములను అనుసంధించువారు ఈలోకమును పరిపాలించిన పిదప స్వర్గలోకమును అనుభవించి, తదుపరి తీక్షణమైన కిరణములుగల సూర్యమండల మార్గముద్వారా పయనించి పరమపదమందు నిత్యశూరులతో చేరి ప్రకాశించుదురు.
*******