పెరియతిరుమొழி-4 వపత్తు (6)

 శ్రీః

6 . తావళన్దు

అవతారిక :

నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో కృపతో వేంచేసిన శ్రీగోపాలకృష్ణ పెరుమాళును ( ద్వారకాధీశుని)  తిరుమంగై ఆళ్వారులు ఈ పది పాశురములతో మంగళాశాసనము చేసినారు. 

** తావళన్దు ఉలగముర్ట్రుమ్ , తడమలర్ ప్పొయ్ గై పుక్కు ,

నావళ నవిన్ఱు అఙ్గేత్త ,  నాగత్తిన్ నడుక్కమ్ తీర్తాయ్ ,

మావళమ్ పెరుగిమన్ను , మఱైయవర్ వాழுమ్,   నాంగై 

కావళమ్పాడిమేయ , కణ్ణనే కళైకణ్ నీయే . 1298        

ఉలగముర్ట్రుమ్ =  ప్రపంచమందంతటను;తావళన్దు = పేరుపేరునవెదకి; తడమ్ = పెద్దదైన; మలర్ = పుష్పములుగల; ప్పొయ్ గై = ఒక సరస్సులో; పుక్కు = ప్రవేశించి; అఙ్గు = అచట (మొసలి నోటికోరలలో చిక్కి); నావళమ్ =  నాలుకకు అలంకారమైన దివ్య నామములు; నవిన్ఱు = వచించుచు; ఏత్త = స్తుతించిన; నాగత్తిన్ = గజేంద్రుని; నడుక్కమ్ = భయమును; తీర్తాయ్ = పోగొట్టినవాడా!; మావళమ్ = గొప్ప సంపదలు; పెరుగి = వృద్ధిపొంది; మన్ను = ఒప్పుచున్న;మఱైయవర్ = వేదోత్తములు; వాழுమ్ = నివసించుచున్న; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న;  కావళమ్ పాడి మేయ =తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో  కృపతో నిత్యవాసము చేయుచున్న; కణ్ణనే = శ్రీకృష్ణా!; నీయేకళై కణ్ =నీవే నాకు రక్షకుడవు.       

ఒకానొకప్పుడు , అంతటను వెదకి మంచి పుష్పములుగల సరస్సులో ప్రవేశించి బలిష్టమైన మొసలి నోటికోరలలో చిక్కి శక్తినశించిన గజేంద్రుడు ఎలుగెత్తి శ్రీమన్నారాయణుని స్తుతించి శరణుకోరగ ఆ గజేంద్రుని సంరక్షించినవాడా ! , మిక్కిలి సిరిసంపదలుగల వేదోత్తములు నివసించుచున్న నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరు కావళమ్ పాడి అను దివ్యదేశములో కృపతో నిత్యవాసము చేయుచున్న శ్రీకృష్ణా! నీవే నాకు రక్షకుడవు.

మణ్ణిడన్దు ఏనమాగి , మావలి వలి తొలైప్పాన్ ,

విణ్ణవర్ వేణ్డచ్చెన్ఱు , వేళ్వియిల్ కుఱై ఇరన్దాయ్ ,

తుణ్ణెన మార్ట్రార్ తమ్మై ,  త్తొలైత్తవర్ నాంగైమేయ ,

కణ్ణనే కావళన్దణ్ పాడియాయ్ , కళైకణ్ నీయే . 1299

ఏనమ్ ఆగి = ఆదివరాహ రూపముదాల్చి; మణ్ = (అణ్డభిత్తిలోమునిగిన)భూమిని; ఇడన్దు = పైకెత్తి (మరియు); మావలి = మహాబలి యొక్క; వలి = బలమును; తొలైప్పాన్ = తొలుగుటకొఱకు; విణ్ణవర్ = దేవతలందరు; వేణ్డ = ప్రార్ధింప (దానికి కనికరించి);   వేళ్వియిల్ = (ఆ మహాబలి యొక్క)    యాగభూమి వద్దకు వేంచేసి; కుఱై ఇరన్దాయ్= ( తనకు ) కావలసినది యాచించినవాడా!; మార్ట్రార్ తమ్మై = శత్రువులను; తుణ్ణెన = శీఘ్రముగా; త్తొలైత్తవర్ = యుద్ధమందు పారద్రోలు  వీరులు నివసించు; నాంగైమేయ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; కావళమ్ తణ్ పాడియాయ్ =తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో కృపతోవేంచేసిన నాస్వామీ!; కణ్ణనే = శ్రీకృష్ణా! నీయే కళై కణ్ = నీవే నాకు రక్షకుడవు.

ఒకానొకప్పుడు అణ్డభిత్తిలో మునిగినభూమిని ఆదివరాహరూపముదాల్చి  పైకెత్తియు మరియు , మహాబలి యొక్క బలమును తొలుగుటకొఱకు దేవతలందరు ప్రార్ధింపగ  దానికి కనికరించి  ఆ మహాబలి యొక్క యాగభూమివద్దకు వామనమూర్తియై వేంచేసి కావలసినది యాచించినవాడా! , శత్రువులను శీఘ్రముగా యుద్ధమందు పారద్రోలు వీరులు నివసించు నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో కృపతో వేంచేసిన నాస్వామీ! శ్రీకృష్ణా! నీవే నాకు రక్షకుడవు.

ఉరుత్తెழு వాలిమార్విల్ , ఒరుకణై ఉరువవోట్టి ,

కరుత్తుడై త్తమ్బిక్కు , ఇన్బక్కదిర్ ముడి అరశళిత్తాయ్ ,

పరుత్తెழ పలవుమ్ మావుమ్ , పழమ్ విழுన్దు ఒழுగుమ్ నాంగై ,

కరుత్తనే  కావళన్దణ్ పాడియాయ్ , కళైకణ్ నీయే .       1300

ఉరుత్తుఎழு = మిక్కిలి క్రోధుడై వచ్చిన; వాలి = వాలియొక్క; మార్విల్ = వక్షస్థలములో; ఉరువ = దృఢముగ నాటుకొనునట్లు; ఒరుకణై = ఒక బాణమును; ఓట్టి = ప్రయోగించి (చంపి); కరుత్తు ఉడై = తన మనస్సులో అభిమానించిన; త్తమ్బిక్కు = వాలి తమ్ముడైన సుగ్రీవునకు; ఇన్బమ్ = ఆనందదాయకమైన; క్కదిర్ ముడి = ప్రకాశించు కిరీటమును; అరశు = రాజ్యాధిపత్యమును;అళిత్తాయ్ = అనుగ్రహించిన స్వామీ!; పరుత్తు ఎழ = మిక్కిలి పక్వమునకు వచ్చి;  పలవుమ్ = పనసచెట్లనుండియు; మావుమ్ = మామిడిచెట్లనుండియు; పழమ్ = (వాటి) పండ్లు; విழுమ్ = క్రిందపడి; ఒழுగుమ్ = తేనెవంటి రసములు కారుచుండెడి; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; కావళమ్ తణ్ పాడియాయ్ = తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో కృపతో వేంచేసిన నాస్వామీ!; కరుత్తనే = సర్వమునకు కర్తయైన శ్రీకృష్ణా!; నీయే కళై కణ్ = నీవే నాకు రక్షకుడవు.

మిక్కిలి క్రోధుడై వచ్చిన వాలిని ఒకే బాణమును ప్రయోగించి వధించి , నీవే రక్షకుడని తలచిన  వాలి తమ్ముడైన సుగ్రీవునకు కిష్కిందారాజ్యమును అనుగ్రహించిన స్వామీ! , మిక్కిలి పక్వమునకు వచ్చిన పనసపండ్లు ,మామిడిపండ్లు చెట్లనుండి క్రిందపడి తేనెవంటి రసములు కారుచుండెడి నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో కృపతో వేంచేసిన నాస్వామీ! సర్వమునకు కర్తయైన శ్రీకృష్ణా! , నీవే నాకు రక్షకుడవు.

మునైముగత్తు అరక్కన్ మాళ , ముడిగళ్ పత్తు అరుత్తు వీழ்త్తు ,ఆఙ్గు

అనైయవఱ్కిళైయవఱ్కే , అరశు అళిత్తరుళినానే ,

శునైగళిల్  కయల్ గళ్ పాయ , చ్చురుమ్బుతేన్ నుకరునాంగై ,

కనైకழల్ కావళన్దణ్ పాడియాయ్ , కళైకణ్ నీయే .            1301

మునైముగత్తు = యుద్ధరంగములో; అరక్కన్ =  రావణుడు; మాళ = నశించునట్లు; ముడిగళ్ పత్తు = అతని పది తలలను; అరుత్తు =  తెగి; వీழ்త్తు =  క్రింద పడునట్లుచేసి; ఆఙ్గు = ఆ లంకాపురిలో; అనైయవఱ్కు = రావణాసురుని యొక్క; ఇళైయవఱ్కే =  తమ్ముడైన విభీషణునకే; అరశు = రాజ్యాధిపత్యమును;అళిత్తు=ఒసగి;అరుళినానే=అనుగ్రహించిన స్వామీ!;శునైగళిల్= జలప్రదేశములలో; కయల్ గళ్ = కయల్ మత్స్యములు;పాయ = బయపడి త్రుళ్ళుచూ  పారిపోవునటుల; శురుమ్బు = తుమ్మెదలు;  తేన్ నుగరుమ్ = (ఝంకారముచేయుచు) తేనెను గ్రోలుచుండెడిదైన; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; కావళమ్ తణ్ పాడియాయ్=తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో కృపతో వేంచేసిన  నా స్వామీ!; కనైకழల్ = శబ్దించు వీరకంకణములగల పాదములతో అలరారు;నీయే కళై కణ్ = నీవే నాకు రక్షకుడవు.    

యుద్ధరంగములో రావణాసురునియొక్క పదితలలను తనయొక్క ప్రఖ్యాతమైన కోదండవిల్లును ఎక్కుపెట్టి నిప్పులుగ్రక్కు అద్వితీయమైన బాణములచే త్రుంచి వధించిన పిదప తనను రక్షకుడని ఆశ్రయించిన రావణుని తమ్ముడైన విభీషణునకే లంకకు రాజ్యాధిపత్యమును అనుగ్రహించిన స్వామీ! , జలప్రదేశములలో కయల్ మత్స్యములు బయపడి  త్రుళ్ళుచూ  పారిపోవునటుల  తుమ్మెదలు  ఝంకారము చేయుచు తేనెను గ్రోలుచుండెడిదైన నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో, కృపతో వేంచేసిన నాస్వామీ! , శబ్దించు వీరకంకణములగల పాదములతో అలరారు నీవే నాకు రక్షకుడవు.

పడ అరవు ఉచ్చితన్ మేల్ ,  పాయ్ న్దు  పన్నడఙ్గళ్ శెయ్ దు ,

మడవరల్ మంగైతన్నై , మార్వగత్తిరుత్తినానే ,

తడవరై తఙ్గుమాడ , త్తగుపుగழ் నాంగైమేయ  ,

కడవుళే  కావళన్దణ్ పాడియాయ్ , కళైకణ్ నీయే .   1302

పడమ్ = పడగలు విప్పియున్న; అరవు = కాళీయుని యొక్క; ఉచ్చితన్ మేల్ = తలలపై; పాయ్ న్దు = దుముకి; పల్ నడఙ్గళ్ = అనేక విధములైన నృత్యములు; శెయ్ దు=చేసినవాడును;మడవరల్ = దయార్ద్ర హృదయురాలైన;మంగైతన్నై=శ్రీదేవిని; మార్వగత్తు=తన వక్షస్థలమందు;ఇరుత్తినానే = నిత్యముగ ఉంచుకొనిన స్వామీ!; తడ వరై = పెద్ద పర్వతములవలె; మాడమ్ =  భవనములు; తఙ్గు = కూడియున్న; తగు పుగழ் = తగినట్లు కీర్తిగలిగిన; నాంగైమేయ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; కావళమ్ తణ్ పాడియాయ్=తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో కృపతో వేంచేసిన నాస్వామీ!; కడవుళే = సర్వాధికుడా!; నీయే కళై కణ్ = నీవే నాకు రక్షకుడవు.

యమునా నది యొక్క మడుగులో  అచటనుండు ప్రాణులకు కంటకమైన కాళీయుని యొక్క విశాలమైన పడగలపై దుమికి , అనేక విధములైన నృత్యములు చేసి బలహీనపరచి ఆ మడుగును వీడునటులచేసి అన్ని జీవరాశులును రక్షించినవాడా !  దయార్ద్రహృదయురాలైన శ్రీదేవిని వక్షస్థలమందు నిత్యముగ ఉంచుకొనిన స్వామీ! , పెద్ద పర్వతములవలె భవనములతో  ఒప్పుచున్న నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో కృపతో వేంచేసిన నాస్వామీ! , సర్వాధికుడా! నీవే నాకు రక్షకుడవు.

మల్లరై యట్టుమాళ , కఞ్జనై మలైన్దు కొన్ఱు ,

పల్లరశు అవిన్దువీழ , ప్పారదప్పోర్ ముడిత్తాయ్ ,

నల్లరణ్ కావిన్ నీழల్ , నఱై కమழ் నాంగైమేయ  ,

కల్లరణ్  కావళన్దణ్ పాడియాయ్ , కళైకణ్ నీయే .       1303

మల్లరై=మల్లవీరులను;మాళ అట్టు = చచ్చునట్లు పోరాడి; కఞ్జనై = కంసునితో; మలైన్దు = పోరుసలిపి; కొన్ఱు = చంపి; పల్ అరశు = అనేకమంది రాజులు; అవిన్దువీழ = నాశనమగునట్లు;ప్పారదప్పోర్=భారత యుద్ధమును; ముడిత్తాయ్ = పూర్తిచేసినవాడా! నల్ అరణ్ = అందముగ అంతటను వ్యాపించియున్న; కావిన్ నీழల్ = తోటల యొక్క నీడలలో;  నఱై కమழ் = పరిమళము వెదజల్లుబడుచుండు; నాంగైమేయ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; కల్ అరణ్ = రాతి ప్రాకారములుగల ; కావళమ్ తణ్ పాడియాయ్ = తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో కృపతో వేంచేసిన నాస్వామీ!; నీయే కళై కణ్ = నీవే నాకు రక్షకుడవు.

                     క్రూరుడైన కంసునిచే ప్రేరేరింపబడి తలబడిన చాణూరముష్టికులనబడు మల్లులనిద్దరిని చంపి , పిదప కంసునితో పోరుసలిపి అతనిని వధించి సజ్జనులకు రక్షణ కల్పించినవాడా !అనేకమంది రాజులు నాశనమగునట్లు భారతయుద్ధమును పూర్తిచేసినవాడా ! , అందముగ అంతటను వ్యాపించియున్న తోటల యొక్క నీడలలో పరిమళము వెదజల్లుబడుచుండు నాఙ్గూర్ ప్రాంతములో నున్న రాతి ప్రాకారములుగల తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో కృపతో వేంచేసిన నాస్వామీ! నీవే నాకు రక్షకుడవు.

మూత్తవఱ్కు అరశువేణ్డి ,  మున్బు  తూదెழுన్దరుళి ,

మాత్తమర్ పాగన్ వీழ , మదకరి మరుప్పొశిత్తాయ్ ,

పూత్తమర్ శోలై ఓఙ్గి ,ప్పునల్ పరన్దొழுగు నాంగై  ,

కాత్తనే కావళన్దణ్ పాడియాయ్ , కళైకణ్ నీయే . 1304

మున్బు=పూర్వము ఒకప్పుడు;మూత్తవఱ్కు=ధర్మపుత్రునకై; అరశు=రాజ్యాధి పత్యమును;వేణ్డి=కోరి; తూదు ఎழுన్దు అరుళి=దూతగ కృపతో వేంచేసినవాడును; మాత్తు=మస్తకముపై;అమర్= కూర్చుని యున్న; పాగన్ = మావటివాడు; వీழ = క్రిందపడి చచ్చునట్లు; మదకరి = (కువలయాపీడమను) మధించిన ఏనుగుయొక్క; మరుప్పు = దంతములను; ఒశిత్తాయ్ = విరిచి ఆ ఏనుగును వధించిన స్వామీ!; పూత్తు = పుష్పించు; అమర్ = వరుసగాకూడియున్న; శోలై = తోటలు;ఓఙ్గి = ఉన్నతముగ ఎదుగుచుండునట్లు; పునల్ = జలములు; పరన్దు = వ్యాపించి; ఒழுగుమ్ = (ఆ తోటలందు) ప్రవహింప బడుచున్న; నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో నున్న;  కావళమ్ తణ్ పాడియాయ్ = తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో కృపతో వేంచేసిన నాస్వామీ! కాత్తనే = ఓ జగద్రక్షకుడా!;నీయే కళై కణ్ = నీవే నాకు రక్షకుడవు. 

    దుర్యోదనాదుల వంచనచే రాజ్యభ్రష్టులైన పాండవులకై రాజ్యాధిపత్యమును కల్పించుటకై దూతగ కృపతో ధృతరాష్ట్రుని వద్దకు వేంచేసినవాడా! , క్రూరడైన కంసునిచే ప్రేరేరింపబడివచ్చిన మధించిన కువలయాపీడము యొక్క దంతములను విరిచి ఆఏనుగుతోపాటు మావటినికూడ వధించినవాడా! పుష్కలముగ జలములు ప్రవహింబడుచున్న పుష్పించు తోటలతో చుట్టబడిన నాఙ్గూర్ ప్రాంతములో నున్నతిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో కృపతో వేంచేసిన నాస్వామీ!   ఓ జగద్రక్షకుడా ! నీవే నాకు రక్షకుడవు.

ఏవు ఇళఙ్గన్నిక్కాగి , ఇమైయవర్ కోనై చ్చెర్ట్రు ,

కావళమ్ కడిదు ఇఱత్తు , క్కఱ్పగమ్ కొణ్డు పోన్దాయ్ ,

పూవళమ్ పొழிల్ గళ్ శూழ் న్ద,  పురన్దరన్ శెయ్ ద నాంగై  ,

కావళమ్పాడిమేయ, కణ్ణనే కళైకణ్ నీయే. 1305

ఇళమ్ = యౌవనవతియైన; కన్నిక్కు ఆగి = సత్యభామాదేవికై; ఏవు = యుద్దమందు; ఇమైయవర్ కోనై = దేవేంద్రుని; శెర్ట్రు = ఓడించి; కడిదు = శీఘ్రముగా; కావళమ్ = నందవనముయొక్క శోభను; ఇఱత్తు = నశింపజేసి; క్కఱ్పగమ్ = కల్పవృక్షమును; కొణ్డు పోన్దాయ్ =(ద్వారకకు)తీసుకొని వచ్చినవాడా!; పూ వళమ్ = పుష్కలమైన పుష్పములుగల;పొழிల్=తోటలతో; శూழ் న్ద=చుట్టబడిన; పురన్దరన్ = ఇంద్రునిచే; శెయ్ ద = ఏర్పరచబడిన; నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో నున్న ; కావళమ్పాడిమేయ = తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో కృపతో వేంచేసిన; కణ్ణనే = శ్రీకృష్ణా! నీయే కళై కణ్ = నీవే నాకు రక్షకుడవు.      

యౌవనవతియైన సత్యభామాదేవియొక్క కోరికపై యుద్దమందు దేవేంద్రుని ఓడించి నందవనమునుండి కల్పవృక్షమును ద్వారకకు తీసుకొనివచ్చినవాడా! , అనేక పుష్పములుగల తోటలతో చుట్టబడిన , ఇంద్రునిచే ఏర్పరచబడిన నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో కృపతో వేంచేసిన శ్రీకృష్ణా! నీవే నాకు రక్షకుడవు.

శన్దమాయ్ చ్చమయమాగి , చ్చమయ ఐమ్బూతమాగి ,

అన్దమాయ్ ఆదియాగి , అరుమఱైయవైయుమ్ ఆనాయ్ ,

మన్దమ్ ఆర్ పొழிల్ గళ్ తోఱుమ్ , మడమయిల్ ఆలునాంగై ,

కన్దమ్ ఆర్ కావళమ్ తణ్ పాడియాయ్ , కళైకణ్ నీయే .. 1306

శన్దమాయ్ = ఛందస్సులకు నియామకుడై;శమయమాగి = వాటి వ్యవస్థకు నియామకుడై; శమయమ్ = క్రమవ్యవస్థ కలిగిన; ఐమ్ భూతమాగి = పంచ భూతములకు నియామకుడై; అన్దమ్ ఆయ్ = సృష్టిలయమునకు కారణభూతుడై; ఆది ఆగి = సృష్టికి కారణభూతుడై; అరు మఱైయవైయుమ్ = గ్రహింప శక్యము కాని వేదములన్నింటికిని; ఆనాయ్ =  నిర్వహకుడుగ నుండు సర్వేశ్వరుడా!;మన్దమ్ ఆర్ = పారిజాతవృక్షములతో నిండిన;   పొழிల్ గళ్  తోఱుమ్ = తోటలందంతటను; మడమ్ = సుందరమైన; మయిల్ = నెమళ్లచే;ఆలుమ్ = నృత్యములు చేయబడుచుండు;  నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; కన్దమ్ ఆర్ = పరిమళ భరితమైన; కావళమ్ తణ్ పాడియాయ్ =తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో కృపతో వేంచేసిన శ్రీకృష్ణా !; నీయే కళై కణ్ = నీవే నాకు రక్షకుడవు.

ఛందస్సులకు ,వాటి వ్యవస్థకు, క్రమవ్యవస్థ కలిగిన పంచభూతములకు మొదలగువన్నింటికిని నియామకుడై , సృష్టికి కారణభూతుడై , సృష్టిలయమునకు కారణభూతుడై , గ్రహింప శక్యము కాని వేదములన్నింటికిని నిర్వహకుడుగనుండు సర్వేశ్వరుడా !, పారిజాత వృక్షములతో నిండినతోటలందంతటను సుందరమైన నెమళ్లచే నృత్యములుచేయబడుచుండు నాఙ్గూర్ ప్రాంతములో నున్న పరిమళ భరితమైన తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో కృపతో వేంచేసిన శ్రీకృష్ణా ! నీవే నాకు రక్షకుడవు.

** మావళమ్ పెరుగి మన్ను , మఱైయవర్ వాழுమ్,  నాంగై

కావళమ్పాడిమేయ , క్కణ్ణనై కలియన్ శొన్న  ,

పావళమ్ పత్తుమ్ వల్లార్  ,  పార్ మిశై అరశరాగి ,

కో ఇళమన్నర్ తాழ , క్కుడైనిழల్ పొలివర్ తామే . 1307

మా వళమ్=గొప్ప సంపదలు; పెరుగి = వృద్ధిపొంది; మన్ను = ఒప్పుచున్న; మఱైయవర్ = వేదోత్తములు; వాழுమ్ = నివసించుచున్న; నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; కావళమ్పాడిమేయ = తిరు కావళమ్ తణ్ పాడి అను దివ్యదేశములో కృపతో నిత్యవాసము చేయుచున్న;   క్కణ్ణనై = శ్రీకృష్ణుని విషయమై; కలియన్ = తిరుమంగై ఆళ్వారులు; శొన్న = ప్రసాదించిన; వళమ్ = అందమైన; పా పత్తుమ్ = ఈ పది పాసురములను; వల్లవర్ తామ్ = అనుసంధించువారు;పార్ మిశై = ఈ భూమియందు; అరశర్ ఆగి = ప్రభువులై; కో = ఇతర రాజులును; ఇళ మన్నర్ = చిన్న రాజ్యాధి పతులును; తాழ = సేవించునట్లు;   కుడై నిழల్ = ఛత్ర ఛాయలో పోలివర్ = ప్రకాశింతురు.

సిరిసంపదలతో తులతూగుచున్న వేదోత్తములు నివసించు నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరు కావళమ్ తణ్ పాడి అను  దివ్యదేశములో కృపతో నిత్యవాసము చేయుచున్న శ్రీకృష్ణుని విషయమై తిరుమంగై ఆళ్వారులు ప్రసాదించిన ఈ పది పాసురములను  అనుసంధించువారు ఈ భూమియందు ప్రభువులై ,తదితర రాజ్యాధిపతులందరు సేవించునట్లు ఛత్ర ఛాయలో  ప్రకాశింతురు .

********

వ్యాఖ్యానించండి