శ్రీః
8 . కవళయానై
అవతారిక :
తిరు పార్తన్ పళ్ళి దర్శించిన తిరుమంగై ఆళ్వారులు తన నిజస్వరూపము కోల్పోయి పరకాలనాయకి అవస్థను పొంది ఆ దివ్యదేశమందలి కలిగిన అమితమైన ప్రీతిని పలువిదములగ పాడుచుండుటను ఆమెయొక్క తల్లిగ ఈపది పాశురముల ద్వారా వెలిబుచ్చుచున్నారు. ఈ పాశురములు , ఆళ్వారులయొక్క మానసికసౌందర్యమును ప్రస్ఫుటముగ తెలియజేయును .
** కవళయానై కొమ్బొశిత్త , కణ్ణనెన్ఱుమ్ కామరుశీర్ ,
క్కువళై మేగమన్న మేని , కొణ్డకోన్ ఎన్నానై యెన్ఱుమ్ ,
తవళ మాడ నీడు నాంగై , తామరైయాళ్ కేళ్వనెన్ఱుమ్ ,
పవళవాయాళ్ ఎన్ మడందై , పార్తన్ పళ్ళి పాడువాళే . 1318
పవళ = పగడము పోలిన ఎఱ్ఱని; వాయాళ్ = అదరములు గల; ఎన్ మడందై = నా కుమార్తె; కవళయానై = ఆహారముచే బలిసిన ఏనుగుయొక్క (కువలయాపీడము యొక్క); కొమ్బు = దంతములను; ఒశిత్త = విరిచిన; కణ్ణన్ ఎన్ఱుమ్ = కణ్ణనే! అని చెప్పుచును; కామరుశీర్ = ఆశపడతగిన అందముగల; కువళై = నల్లకలువులవలెను; మేఘమ్ = కాళమేఘమువలెను; అన్న = వీటితో ఒప్పు; మేనికొణ్డ = తిరుమేనిగల; కోన్=స్వామీ! అని చెప్పుచును; ఎన్ ఆనై ఎన్ఱుమ్ = నాయొక్క ఏనుగు వంటి వాడా అనియు; తవళ మాడ = తెల్లని మేడలు; నీడు = ఉన్నతముగనుండు; నాంగై = నాఙ్గూర్ ప్రాంతములోనున్న; తామరైయాళ్ = కమలవాసిని నాధుడా!; ఎన్ఱుమ్ = అనియు; పార్తన్ పళ్ళి = పార్తన్ పళ్ళి దివ్యదేశమునే; పాడువాళ్ = పాడుచూనుండును.
పగడము పోలిన ఎఱ్ఱని అదరములు గల నా కుమార్తె , క్రూరడైన కంసునిచే ప్రేరేరింపబడి వచ్చిన కువలయాపీడము అను మదగజముయొక్క దంతములను విరిచిన కణ్ణనే! అని చెప్పుచును, నల్లకలువుల వలెను, కాళమేఘమువలెను వీటితో ఒప్పు దివ్య మంగళస్వరూపుడైన స్వామీ! అని చెప్పుచును , ఉన్నతమైన తెల్లని మేడలుగల నాఙ్గూర్ ప్రాంతములో నున్న కమలవాసిని నాధుడా! అనియు , పార్తన్ పళ్ళి దివ్య దేశమునే పాడుచూనుండును.
కఞ్జన్ విట్ట వెఞ్జినత్త , కళిర్ అడర్త కాళై యెన్ఱుమ్ ,
వఞ్జమేవి వన్ద పేయిన్ , ఉయిరై యుణ్డ మాయనెన్ఱుమ్ ,
శెఞ్జొలాళర్ నీడు నాంగై , త్తేవదేవనెన్నెన్ఱు ఓది ,
పఞ్జియన్న మెల్లడియాళ్ , పార్తన్బళ్ళి పాడువాళే . 1319
పఞ్జియన్న = దూదివలె; మెల్ల = మృదువైన; అడియాళ్ = పాదములుగల నా కుమార్తె;కఞ్జన్ విట్ట = కంసునిచే విడువబడిన; వెమ్ = కఠోరమైన; శినత్తు = కోపముగల; కళిర్ = (కువలయాపీడమను) గజమును; అడర్త = అంతమొందించిన; కాళై = యౌవనుడా!;ఎన్ఱుమ్ = అని చెప్పుచును; వఞ్జమేవి వన్ద = వంచనచే వచ్చిన; పేయిన్ = రక్కసి పూతన యొక్క; ఉయిరై = ప్రాణమును; ఉణ్డ = హరించిన; మాయన్ = ఆశ్చర్య చేష్టితములనుగలవాడా!; ఎన్ఱుమ్ = అని చెప్పుచును; శెమ్ శొల్ ఆళర్ = దివ్యమైన వాక్కులుగల బ్రాహ్మణోత్తములు;నీడు = నిత్యవాసము చేయుచున్న; నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; దేవాదిదేవన్ = దేవాదిదేవుడా!, ఎన్నెన్ఱు = అని పలుమార్లు; ఓది = స్తుతించుచు; పార్తన్ పళ్ళి = పార్తన్ పళ్ళి దివ్య దేశమునే; పాడువాళ్ = పాడుచూనుండును .
దూదివలె మృదువైన పాదములుగల నా కుమార్తె ,కంసునిచే విడువబడిన మిక్కిలి కోపముగల కువలయాపీడమను గజమును అంతమొందించిన యౌవనుడా! అని చెప్పుచును , యశోదాదేవి రూపమునుదాల్చి వంచనచే వచ్చిన రక్కసి పూతన యొక్క ప్రాణమును హరించిన ఆశ్చర్యచేష్టితములనుగలవాడా! అని చెప్పుచును , దివ్యమైన వాక్కులుగల బ్రాహ్మణోత్తములు నిత్యవాసము చేయుచున్న నాఙ్గూర్ ప్రాంతములో నున్న దేవాదిదేవుడా! అని పలుమార్లు స్తుతించుచు పార్తన్ పళ్ళి దివ్య దేశమునే పాడుచూనుండును .
అణ్డర్ కోన్ ఎన్ ఆనైయెన్ఱుమ్ , ఆయర్ మాతర్ కొంగైపుల్గు
శెణ్డనెన్ఱుమ్ , నాన్మఱైగళ్ తేడియోడుమ్ శెల్వనెన్ఱుమ్ ,
వణ్డు ఉలవు పొழிల్ కొళ్ నాంగై , మన్ను మాయన్ ఎన్ఱెన్ఱోది ,
పణ్డు పోలన్ఱు ఎన్ మడందై , పార్తన్ పళ్ళి పాడువాళే . 1320
ఎన్ మడందై = నాయొక్క కుమార్తె; పణ్డు పోల అన్ఱు = మునపటివలెగాక ఎల్లప్పుడును; అణ్డర్ కోన్ = బ్రహ్మాండమందుగల సర్వులకు నాధుడా! అనియు; ఎన్ ఆనై = నాకు ఏనుగువంటి వాడా!; ఎన్ఱుమ్ = అని చెప్పుచును; ఆయర్ మాతర్ = గోపస్త్రీలయొక్క; కొంగైపుల్గు = వక్షోజములతో సంశ్లేషించు; శెణ్డన్ ఎన్ఱుమ్ = స్వభావముగలవాడా అని చెప్పుచును; నాన్మఱైగళ్ = నాలుగు వేదములును; తేడియోడుమ్ = గాలించి ఆశ్రయింపబడు; శెల్వన్ ఎన్ఱుమ్ = శ్రీమంతుడా! అని చెప్పుచును;వణ్డు ఉలావు = తుమ్మెదలు సంచరించు; పొழிల్ కొళ్ = తోటలతో కూడిన; నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో; మన్ను = నిత్యవాసము చేయుచున్న; మాయన్ = ఆశ్చర్యభూతుడా !;ఎన్నెన్ఱు = అని పలుమార్లు;ఓది = స్తుతించుచు;పార్తన్ పళ్ళి = పార్తన్ పళ్ళి దివ్య దేశమునే; పాడువాళ్ = పాడుచూనుండును.
నాయొక్క కుమార్తె మునపటివలెగాక ఎల్లప్పుడును బ్రహ్మాండమందుగల సర్వులకు నాధుడా! అనియు , నాకు ఏనుగువంటి వాడా ! అని చెప్పుచును , గోపస్త్రీలయొక్క వక్షోజములతో సంశ్లేషించు స్వభావముగలవాడా! అని చెప్పుచును , నాలుగు వేదములును గాలించి ఆశ్రయింపబడు శ్రీమంతుడా! అని చెప్పుచును , తుమ్మెదలు సంచరించు తోటలతో కూడిన నాఙ్గూర్ ప్రాంతములో నిత్యవాసము చేయుచున్న ఆశ్చర్యభూతుడా ! అని పలుమార్లు స్తుతించుచు పార్తన్ పళ్ళి దివ్య దేశమునే పాడుచూనుండును .
కొల్లైయానాళ్ పరిశழிన్దాళ్ , కోల్ వళైయార్ తమ్ముగప్పే ,
మల్లై మున్నీర్ తట్టుఇలఙ్గై , కట్టழிత్త మాయనెన్ఱుమ్ ,
శెల్వమ్మల్ గు మఱైయోర్ నాంగై , త్తేవదేవనెన్ఱు ఓది ,
పల్వళైయాళ్ ఎన్ మడందై , పార్తన్ పళ్ళి పాడువాళే . 1321
పల్ వళైయాళ్ = పలుగాజులతో ఒప్పుచున్న; ఎన్ మడందై = నాయొక్కకుమార్తె; కోల్ వళైయార్ తమ్ = అందమైన గాజులు అలంకరించు కొనియున్న స్త్రీలయొక్క; ముగప్పే = ఎదుటనే; కొల్లైయానాళ్ = పరిమితి దాటినదియును;పరిశు అழிన్దాళ్ = స్త్రీలకు తగిన మర్యాదను విడిచిపెట్టినదియును; మల్లై మున్నీర్ = సంపదలతోకూడిన అగాధమైన సముద్రములో; తట్టు = సేతువును కట్టి;ఇలఙ్గై = లంకాపురిని; కట్టழிత్త = ధ్వంసముచేసిన;మాయన్ = ఆశ్చర్యచేష్టితుడా!;ఎన్ఱుమ్ = అని చెప్పుచు; శెల్వమ్ మల్ గు = సంపదలు కలిగిన; మఱైయోర్ = వేదోత్తములు నివసించు; నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; దేవాదిదేవన్ = దేవాదిదేవుడా!ఎన్నెన్ఱు = అని పలుమార్లు;ఓది = స్తుతించుచు; పార్తన్ పళ్ళి =పార్తన్ పళ్ళి దివ్య దేశమునే; పాడువాళ్ = పాడుచూనుండును.
పలుగాజులతో ఒప్పుచున్న నాయొక్కకుమార్తె అందమైన గాజులు అలంకరించుకొనియున్న స్త్రీలయొక్క ముంగిటనే హద్దులు దాటి, స్త్రీలకు తగిన మర్యాదను విడిచి వ్యవహరించుచు, అగాధమైన మహాసముద్రములో సేతువును కట్టి లంకాపురిని ధ్వంసముచేసిన ఆశ్చర్యచేష్టితుడా !అని చెప్పుచు, సిరిసంపదలతో తులతూగుచున్న వేదోత్తములు నివసించు నాఙ్గూర్ ప్రాంతములో నున్న దేవాదిదేవుడా! అని పలుమార్లు స్తుతించుచు పార్తన్ పళ్ళి దివ్య దేశమునే పాడుచూనుండును.
అరక్కర్ ఆవిమాళ అన్ఱు , ఆழ் కడల్ శూழி ఇలఙ్గై శెర్ట్ర ,
కురక్కరశనెన్ఱుమ్ , కోలవిల్లి యెన్ఱుమ్ , మామదియై
నెరుక్క మాడ నీడు నాంగై , నిన్మల నెన్ఱెన్ఱోది ,
పరక్కழிన్దాల్ ఎన్ మడందై , పార్తన్ పళ్ళి పాడువాళే . 1322
ఎన్ మడందై = నాయొక్క కుమార్తె; అన్ఱు=పూర్వకాలమున; అరక్కర్ = రాక్షసులయొక్క; ఆవి మాళ = ప్రాణములు పోవునటుల; ఆழ் కడల్ = అగాధమైన సముద్రముచే; శూழ் = చుట్టబడిన; ఇలఙ్గై = లంకాపురిని; శెర్ట్ర=భస్మీపటలముచేసిన; కురక్కు = వానర వీరులకు; అరశన్ = స్వామీ!; ఎన్ఱుమ్ = అని చెప్పుచును; కోలమ్ విల్లి = అందమైన విల్లుగలవాడా!; ఎన్ఱుమ్ = అని చెప్పుచును;మామదియై = అందమైన చంద్రునుని; నెరుక్కుమ్ = సంచరింపనీయక అడ్డగించునట్లు;మాడమ్ = మేడలు; నీడు = ఉన్నతముగనుండు; నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; నిన్ మలన్ = పరిశుద్దస్వభావుడా! యని; ఓది = స్తుతించుచు; పరక్కழிన్దాల్ = కడు నిందింపబడునట్లు; పార్తన్ పళ్ళి = పార్తన్ పళ్ళి దివ్య దేశమునే; పాడువాళ్ = పాడుచూనుండును.
రావణాసురుడు ,సీతాదేవిని అపహరించి , లంకలో బంధించగ ఆరావణునితోబాటు రాక్షసులందరియొక్క ప్రాణములు పోవునటుల అగాధమైన సముద్రముచే చుట్టబడిన లంకాపురిని భస్మీపటలము చేసిన వానర వీరులకుస్వామీ! అని చెప్పుచును , అందమైన కోదండమను విల్లునుగలవాడా! అని చెప్పుచును , చంద్రమండలమును స్పృశించునట్లు ఉన్నతమైన మేడలు గల నాఙ్గూర్ ప్రాంతములో నున్న పరిశుద్దస్వభావుడా! అని పలుమార్లు స్తుతించుచు , కడు నిందింపబడునట్లు నా కుమార్తె పార్తన్ పళ్ళి దివ్య దేశమునే పాడుచూనుండును.
ఞాలముర్ట్రు ముణ్డుమిழ்న్ద , నాదనెన్ఱుమ్ నానిలమ్ శూழ் ,
వేలైయన్న కోలమేని , వణ్ణనెన్ఱుమ్ మేలెழுన్దు ,
శేల్ ఉగళుమ్ వయల్ కొళ్ నాంగై , త్తేవదేవనెన్ఱెన్ఱు ఓది ,
పాలిన్ నల్ల మెన్ మొழிయాళ్ , పార్తన్ పళ్ళి పాడువాళే . 1323
పాలిన్ = పాలు కంటెను; నల్ల = మధురమైన; మెన్ = మృదువైన; మొழிయాళ్ = వాక్కులుగల నా కుమార్తె; ఞాలమ్ ముర్ట్రుమ్ = ఈజగత్తునంతయును; ఉణ్డు = (ప్రళయకాలమున) తన ఉదరమున నుంచుకొని; ఉమిழ்న్ద = (సృష్ట్టికాలమున) బయటకు వెడలించిన; నాదన్ = జగన్నాధుడా !; ఎన్ఱుమ్ = అని చెప్పుచును; నానిలమ్ శూழ் = ఈ భూమండల మంతయును చుట్టుకొనియున్న; వేలైయన్న = సముద్రమువలె; కోలమ్ = సుందరమైన; మేని వణ్ణన్ = తిరుమేనిగలవాడా!;ఎన్ఱుమ్ = అని చెప్పుచును; శేల్ = శేల్ మత్స్యములు; మేల్ ఎழுన్దు = పైకి లేచి;ఉగళుమ్ = త్రుళ్ళి పడుచుండు; వయల్ కొళ్ = పొలములుగల; నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో నున్న;దేవాదిదేవన్ = దేవాదిదేవుడా!; ఎన్నెన్ఱు = అని పలుమార్లు; ఓది = స్తుతించుచు; పార్తన్ పళ్ళి = పార్తన్ పళ్ళి దివ్య దేశమునే; పాడువాళ్ = పాడుచూనుండును .
పాలు కంటెను మధురమైన , మృదువైన , వాక్కులుగల నా కుమార్తె ఈజగత్తునంతయును ప్రళయకాలమున తన ఉదరముననుంచుకొని రక్షించి , సృష్టిగావించు కాలమున బయటకు వెడలించిన జగన్నాధుడా ! అని చెప్పుచును , ఈ భూమండలమంతయును చుట్టుకొనియున్న సముద్రమువలె సుందరమైన తిరుమేనిగలవాడా ! అని చెప్పుచును , శేల్ మత్స్యములు త్రుళ్ళి పడుచుండు పొలములుగల నాఙ్గూర్ ప్రాంతములో నున్న దేవాదిదేవుడా! అని పలుమార్లు స్తుతించుచు పార్తన్ పళ్ళి దివ్య దేశమునే పాడుచూనుండును .
నాడి యెన్ఱన్ ఉళ్ళఙ్గొన్డ , నాదనెన్ఱుమ్ నాన్మఱైగళ్ ,
తేడి యెన్ఱుమ్ కాణమాట్టా , చ్చెల్వనెన్ఱుమ్ శిఱైకొళ్ వణ్డు ,
శేడు ఉలవు పొழிల్ కొళ్ నాంగై , త్తేవదేవనెన్ఱెన్ఱు ఓది ,
పాడకమ్ శేర్ మెల్లడియాళ్ , పార్తన్బళ్ళి పాడువాళే . 1324
పాడకమ్ శేర్ = పాదకంకణములతొ అమరియున్న; మెల్ అడియాళ్ = మృదువైన పాదములుగల నా కుమార్తె; నాడి =వెదుకుచు వచ్చి;ఎన్ తన్=నాయొక్క ఉళ్ళమ్ కొణ్డ = హృదయమును నివాసస్థానముగ ఎంచుకొన్న; నాదన్ = స్వామీ!; ఎన్ఱుమ్ = అని చెప్పుచును; నాల్ మఱైగళ్=నాలుగు వేదములును;తేడి = మిక్కిలి పరిశీలించినను; ఎన్ఱుమ్=ఎన్నడును; కాణమాట్టా=కనుగొనలేని;శెల్వన్ ఎన్ఱుమ్ = శ్రీమంతుడా! అని చెప్పుచును; శిఱైకొళ్ = రెక్కలుగల; వణ్డు = తుమ్మెదలు;శేడు = గుంపు గుంపులుగ; ఉలవు = సంచరింపబడుచున్న;నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; దేవాదిదేవన్ = దేవాదిదేవుడా!; ఎన్నెన్ఱు = అని పలుమార్లు; ఓది = స్తుతించుచు; పార్తన్ పళ్ళి = పార్తన్ పళ్ళి దివ్య దేశమునే; పాడువాళ్ = పాడుచూనుండును .
అందమైన పాదకంకణములతొ అమరియున్న మృదువైన పాదములుగల నా కుమార్తె , ” నాయొక్క హృదయమును నివాసస్థానముగ ఎంచుకొన్న నాధుడా ! ” అని చెప్పుచును, నాలుగు వేదములచేతను కనుగొనలేని శ్రీమంతుడా! అని చెప్పుచును, అందమైన రెక్కలుగల తుమ్మెదలు గుంపు గుంపులుగ సంచరింపబడుచున్న నాఙ్గూర్ ప్రాంతములో నున్న దేవాదిదేవుడా ! అని పలుమార్లు స్తుతించుచు పార్తన్ పళ్ళి దివ్య దేశమునే పాడుచూనుండును .
ఉలగమేత్తుమ్ ఒరువనెన్ఱుమ్ , ఒణ్ శుడరోడు ఉమ్బర్ ఎయ్ దా ,
నిలవుమ్ ఆழிప్పడైయనెన్ఱుమ్ నేశనెన్ఱుమ్ , తెన్ దిశైక్కు
తిలదమన్న మఱైయోర్ నాంగై , త్తేవదేవనెన్ఱెన్ఱు ఓది ,
పలరుమ్ ఏశ ఎన్ మడందై , పార్తన్ పళ్ళి పాడువాళే. 1325
ఎన్ మడందై = నాయొక్క కుమార్తె; ఉలగమ్ ఏత్తుమ్ = లోకమంతయు కొనియాడతగిన; ఒరువన్ = అద్వితీయుడా!; ఎన్ఱుమ్ = అని చెప్పుచును; ఒణ్ శుడరోడు = ప్రకాశించు సూర్యచంద్రులును; ఉమ్బర్ = మరియు ఇతర దేవతలును; ఎయ్ దా=సమీపించలేని; నిలవుమ్=మిక్కిలి జ్వలించు; ఆழி పడైయన్ = సుదర్శన చక్రాయుధుడా!; ఎన్ఱుమ్ = అని చెప్పుచును; నేశన్ = (భక్తులపై) మిక్కిలి ప్రీతిగలవాడా!; ఎన్ఱుమ్ = అని చెప్పుచును; తెన్ దిశైక్కు = దక్షిణదిక్కునకు; తిలదమ్ అన్న = తిలకమనబడు; మఱైయోర్ = వేదోత్తములు నివసించుచున్న; నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; దేవాదిదేవన్ = దేవాదిదేవుడా!; ఎన్నెన్ఱు = అని పలుమార్లు; ఓది = స్తుతించుచు; పలరుమ్ ఏశ = అందరు నిందించునటుల; పార్తన్ పళ్ళి = తిరు పార్తన్ పళ్ళిదివ్య దేశమునే; పాడువాళ్ = .పాడుచూనుండును
నాయొక్క కుమార్తె లోకమంతయు కొనియాడతగిన అద్వితీయుడా! అని చెప్పుచును , సూర్యచంద్రులు,తక్కిన ఇతర దేవతలు సమీపించలేని ,మిక్కిలి జ్వలించు సుదర్శన చక్రాయుధుడా ! అని చెప్పుచును , (భక్తులపై) మిక్కిలి ప్రీతిగలవాడా! అని చెప్పుచును , దక్షిణదిక్కునకు తిలకమనబడు వేదోత్తములు నివసించుచున్న నాఙ్గూర్ ప్రాంతములో నున్న దేవాదిదేవుడా! అని పలుమార్లు స్తుతించుచు అందరు నిందించునటుల పార్తన్ పళ్ళి దివ్య దేశమునే పాడుచూనుండును .
కణ్ణనెన్ఱుమ్ వానవర్ గళ్ , కాదలిత్తు మలర్ గళ్ తూవుమ్ ,
ఎణ్ణనెన్ఱుమ్ ఇన్బనెన్ఱుమ్ , ఏழுలగుక్కాదియెన్ఱుమ్ ,
తిణ్ణమాడ నీడు నాంగై, త్తేవదేవనెన్నెన్ఱు ఓది ,
పణ్ణినన్న మెన్ మొழிయాళ్, పార్తన్ పళ్ళి పాడువాళే. 1326
పణ్ణిన్ అన్న = రాగభరితమైన గానమువలె; మెన్ = మిక్కిలి ఇంపైన; మొழிయాళ్ = వాక్కులుగల నా కుమార్తె; కణ్ణన్ = శ్రీ కృష్ణా!; ఎన్ఱుమ్ = అని చెప్పుచును; వానవర్ గళ్= నిత్యశూరులు;కాదలిత్తు = మిక్కిలి భక్తితో; మలర్ గళ్ = పుష్పములను; తూవుమ్ = సమర్పించునట్లు; ఎణ్ణన్ = వారి హృదయములో వసించువాడా!; ఎన్ఱుమ్ = అని చెప్పుచును; ఇన్బన్ = ఆనందదాయకమైన వాడా!; ఎన్ఱుమ్ = అని చెప్పుచును ; ఏழ் ఉలగుక్కు = సప్త లోకములకును; ఆది = కారణభూతుడా!; ఎన్ఱుమ్ = అని చెప్పుచును; తిణ్ణమ్ = దృఢమైన; మాడ = మేడలు; నీడు = ఉన్నతముగనుండు; నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; దేవాదిదేవన్ = దేవాదిదేవుడా!; ఎన్నెన్ఱు = అని పలుమార్లు; ఓది = స్తుతించుచు; పార్తన్ పళ్ళి = పార్తన్ పళ్ళిదివ్య దేశమునే; పాడువాళ్ = పాడుచూనుండును.
సప్తస్వరములతోకూడిన గానము వలె మిక్కిలి ఇంపైన వాక్కులుగల నా కుమార్తె , శ్రీ కృష్ణా! అని చెప్పుచును , నిత్యశూరులు మిక్కిలి భక్తితో పుష్పములను సమర్పించునట్లు వారి హృదయములో వసించువాడా ! అని చెప్పుచును , సప్త లోకములకును కారణభూతుడా ! అని చెప్పుచును , ఉన్నతముగనుండు దృఢమైన మేడలుగల నాఙ్గూర్ ప్రాంతములో నున్న దేవాదిదేవుడా! అని పలుమార్లు స్తుతించుచు పార్తన్ పళ్ళి దివ్య దేశమునే పాడుచూనుండును.
** పారుళ్ నల్లమఱైయోర్ నాంగై , పార్తన్ పళ్ళి చ్చెఙ్గన్ మాలై ,
వార్ కొళ్ నల్ల ములై మడవాళ్ పాడలై , త్తాయ్ మొழிన్ద మార్ట్రమ్ ,
కూర్ కొళ్ నల్లవేల్ కలియన్ , కూఱు తమిழ் పత్తుమ్ వల్లార్ ,
ఏర్ కొళ్ నల్లవైకున్దత్తుళ్ , ఇన్బ నాళమ్ ఎయ్ దువారే . 1327
పారుళ్ = ఈభూమండలములో; నల్ల = విలక్షణమైన; మఱైయోర్ = వేదోత్తములు నివసించుచున్న; నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; పార్తన్ పళ్ళి = తిరు పార్తన్ పళ్ళి దివ్యదేశమున కృపతో వేంచేసిన; శెమ్ కణ్ = ఎఱ్ఱతామర పోలిన కన్నులుగల; మాలై = సర్వేశ్వరుని విషయమై; వార్ కొళ్ = వస్త్రముచే అలంకరింపబడిన; నల్ల ములై = అందమైన వక్షోజములతొ ఒప్పుచున్న(పరకాలనాయకి అను); మడవాళ్ = యువతి; పాడలై = పాడిన పాశురములను; తాయ్ = ఆమె తల్లి; మొழிన్ద = చెప్పగ; మార్ట్రమ్ = ఆ వాక్కులను; కూర్ కొళ్ = వాడిగానున్న; నల్ల వేల్ = మంచి ఈటెగల; కలియన్ = తిరుమంగై ఆళ్వారులు; కూఱు = ప్రసాదించిన; తమిழ் = తమిళ భాషలోనున్న; పత్తుమ్ = ఈ పది పాసురములను; వల్లవర్ = అభ్యసించువారు; ఏర్ కొళ్ నల్ల = మిక్కిలి శ్లాఘ్యమైన; వైకున్దత్తుళ్ = పరమపదమందు; నాళుమ్ ఇన్బమ్ = నిత్యానందమును; ఎయ్ దువర్ = పొందుదురు .
విలక్షణమైన వేదోత్తములు నివసించుచున్న నాఙ్గూర్ ప్రాంతములో నున్నతిరు పార్తన్ పళ్ళి దివ్య దేశమున కృపతో వేంచేసిన భక్తులపైగల అమిత ప్రీతిచే ఎఱ్ఱనైన కన్నులుగల సర్వేశ్వరుని విషయమై అందమైన పరకాలనాయకి అను యువతి పాడిన పాశురములను , ఆమె తల్లి చెప్పగ , ఆ వాక్కులను కృపతో తిరుమంగై ఆళ్వారులు ప్రసాదించిన తమిళ భాషలోనున్న ఈ పది పాసురములను అభ్యసించువారు పరమపదమందు నిత్యానందమును పొందుదురు .
******