పెరియతిరుమొழி-5వపత్తు (10)

శ్రీః

10. తీదరునిలత్తొడు

తిరునన్థిపుర విణ్ణగరమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న జగన్నాథన్ పెరుమాళ్ ను సేవించుకొమ్మని తన మనస్సునకు తిరుమంగై ఆళ్వార్ ప్రబోధించుచున్నారు.

** తీదఱు నిలత్తొడు ఎరికాలినొడు, నీర్ కెழுవిశుమ్బుమవైయాయ్,

మాశు అఱుమనత్తినొడు ఉఱక్క మొడు ఇఱక్కై, అవైయాయ పెరుమాన్,

తాయ్ శెఱ ఉళైన్దు తయిరుణ్డు కుడమాడు, తడమార్వర్ తగైశేర్,

నాదనుఱైకిన్ఱనగర్, నన్దిపురవిణ్ణగరమ్ నణ్ణుమనమే  ll 1438

తీదు అఱు నిలత్తొడు = దోషములేని (శ్లాఘ్యమైన) భూమియు;ఎరి కాలినొడు = అగ్ని, వాయువును; నీర్ = జలము; కెழு విశుమ్బుమ్ అవైయాయ్ = శ్లాఘ్యమైన ఆకాశము మొదలగు పంచభూతములకు అంతర్యామియైనవాడును;మాశు అఱు = దోషములేని; మనత్తినొడు=మనస్సుకును; ఉఱక్క మొడు ఇఱక్కై అవై ఆయ= నిదురతోపాటు మరణము మొదలగు వానకి నిర్వాహకుడును; పెరుమాన్ = గొప్పతనము కలిగిన వాడును, తాయ్ = తల్లి యశోదాదేవి, శెఱ = కోపముతో తాడునుతీసుకొనగ; ఉళైన్దు = దానికి వణికియు; (మరియు సమయముజూచి) తయిర్ ఉణ్డు = పెరుగు ఆరగించియు; కుడమాడు = కుంభనృత్యము చేసిన; తడమ్ మార్వర్ = విశాలమైన వక్షస్థలముగల; తగై శేర్= కృపాసాగరుడైన; నాదన్=స్వామి;ఉఱైకిన్ఱ నగర్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; నన్దిపురవిణ్ణగరమ్ = నన్దిపురవిణ్ణగరమును; మనమే నణ్ణు = ఓ! నా మనసా!  చేరి సుఖించుము.

        దోషములేని (శ్లాఘ్యమైన) భూమియు,అగ్ని, వాయువు, జలము, శ్లాఘ్యమైన ఆకాశము మొదలగు పంచభూతములకు అంతర్యామియైనవాడును,దోషములేని మనస్సుకును, నిదురతోపాటు మరణము మొదలగు వానకి నిర్వాహకుడును,గొప్పతనము కలిగిన వాడును,తల్లి యశోదాదేవి కోపముతో తాడును తీసుకొనగ వణికియు, మరియు సమయము జూచి దొంగతనముగ పెరుగు ఆరగించియు, కుంభనృత్యము చేసిన విశాలమైన వక్షస్థలముగల కృపాసాగరుడైన స్వామి నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము,  నన్దిపురవిణ్ణగరమును  ఓ! నా మనసా! చేరి సుఖించుము.

ఉయ్యుమ్ వగైయుణ్డు శొనశెయ్యిల్, ఉలగేழுమ్ ఒழிయామై ముననాళ్,

మెయ్యిన్ అళవే అముదు శెయ్యవల, ఐయనవన్ మేవునగర్ తాన్,

మైయ వరివణ్డు  మతువుణ్డు కిళైయోడు, మలర్ కిణ్డి యదన్ మేల్,

నైవళమ్ నవిర్ట్రు పొழிల్, నన్దిపురవిణ్ణగరమ్ నణ్ణుమనమే  ll 1439

మనమే=ఓ! నామనసా!;శొన శెయ్యిల్=నేను చెప్పినట్లు చేసినచో;ఉయ్యుమ్ వగై ఉణ్డు = ఉజ్జీవించు విధముండును; (వినుము);;మున నాళ్ = మునుపొకకాలమున; ఉలగేழுమ్ ఒழிయామై = సప్తలోకములకు హానికలుగనీయక;మెయ్యిన్ అళవే=తన తిరుమేనియందు ఇముడునట్లు; అముదు శెయ్య వల = ఆరగింప సమర్ధతగల; ఐయన్ అవన్ తాన్ = సర్వేశ్వరుడు, ఆ స్వామియే; మేవుమ్ నగర్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశమును; మైయ వరి వణ్డు = నల్లని అందమైన భ్రమరములు; కిళైయోడు = తమ బంధువర్గములతో;మదు ఉణ్డు = తేనెను పానముచేసి; మలర్ కిణ్డి = పుష్పములను కెలికియు;అదన్ మేల్ = ఆ పైన;నైవళమ్ నవిర్ట్రు=మధురమైన పలు రాగములను ఆలాపన చేయుచుండు;పొழிల్ = తోటలుగల;నన్దిపురవిణ్ణగరమ్ నణ్ణు = నన్దిపురవిణ్ణగరమును చేరి సుఖించుము.

                  ఓ! నామనసా!నేను చెప్పినట్లు చేసినచో ఉజ్జీవించు విధముండును (వినుము) మునుపొకకాలమున సప్తలోకములకు హానికలుగనీయక తన తిరుమేనియందు ఇముడునట్లు ఆరగింప సమర్ధతగల సర్వేశ్వరుడు,ఆ స్వామియే,నిత్యవాసముచేయుచున్న దివ్యదేశమును, నల్లని అందమైన భ్రమరములు తమ బంధువర్గములతో తేనెను పానముచేసి,పుష్పములను కెలికియు,ఆపైన మధురమైన పలు రాగములను ఆలాపన చేయుచుండు తోటలుగల నన్దిపురవిణ్ణగరమును చేరి సుఖించుము.

ఉమ్బరులగేழு కడలేழு మలైయేழுమ్, ఒழிయామై ముననాళ్, 

తమ్బొన్ వయిఱారళవుమ్ ఉణ్డు అవై ఉమిழ்న్ద, తడమార్వర్ తగైశేర్,

వమ్బు మలర్ గిన్ఱ పొழிల్ పైమ్బొన్ వరు తుమ్బిమణి, కఙ్గుల్ వయల్ శూழ், 

నమ్బన్ ఉఱైగిన్ఱనగర్, నన్దిపురవిణ్ణగరమ్ నణ్ణుమనమే  ll 1440

ముననాళ్ = మునుపొకకాలమున; ఉమ్బర్ ఉలగు ఏழுమ్ = పై ఏడులోకములను;కడల్ ఏழுమ్ = సప్త సముద్రములను; మలై ఏழுమ్ = సప్త కులపర్వతములను; ఒழிయామై = ఒకటిని విడువక; తమ్ పొన్ వయిఱు ఆరళవుమ్ = తనయొక్క ఉదరము నిండు పర్యంతము;ఉణ్ణు = ఆరగించి;అవై ఉమిழ்న్ద = అవన్నింటిని (సృష్టికాలమున) వెలిబుచ్చిన; తడమార్వర్ = విశాలమైన వక్షస్థలముగలవాడును;తగై శేర్=గొప్పతనము కలిగినవాడును; నమ్బన్ = విశ్వసనీయుడైన సర్వేశ్వరుడు; ఉఱైగిన్ఱ నగర్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశమును;వమ్బు మలర్ గిన్ఱ పొழிల్=కొత్త కొత్తగ వికసించుచుండు (పుష్పములుగల) తోటలలో; పై పొన్ వరు తుమ్బి = మేలిమి బంగారము వర్ణముతో తిరుగుచుండెడి గండుతుమ్మెదలచే; మణి = అందముకలిగినదియు, కఙ్గుల్ వయల్ శూழ் =(పంటల కారణమున) నల్లని పొలములతో చుట్టుకొనియున్న; నన్దిపురవిణ్ణగరమ్ = నన్దిపురవిణ్ణగరమును; మనమే నణ్ణు = ఓ! నా మనసా! చేరి సుఖించుము.

మునుపొకకాలమున పై ఏడులోకములను,సప్త సముద్రములను,సప్త కులపర్వతములను ఒకటిని విడువక తనయొక్క ఉదరము నిండు పర్యంతము ఆరగించి,అవన్నింటిని (సృష్టికాలమున) వెలిబుచ్చిన విశాలమైన వక్షస్థలముగలవాడును,గొప్పతనము కలిగిన వాడును,విశ్వసనీయుడైన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశమును, కొత్త కొత్తగ వికసించుచుండు (పుష్పములుగల) తోటలలో మేలిమి బంగారము వర్ణముతో తిరుగుచుండెడి గండుతుమ్మెదలచే అందముకలిగినదియు, నల్లని పొలములతో చుట్టుకొనియున్న నన్దిపురవిణ్ణగరమును ఓ! నా మనసా!  చేరి సుఖించుము.

పిఱైయినొళి ఎయిఱు ఇలక ముఱుకి యెదిర్ పొరుదుమెన, వన్ద అశురర్,

ఇఱైకళవై నెఱునెఱెన ఎఱియ అవర్ వయిర్ అழల, నిన్ఱ పెరుమాన్,

శిఱైకొళ్ మయిల్ కుయిల్ పయిల మలర్ గళ్ ఉక అళిమురల, అడికొళ్ నెడుమా,

నఱై శెయ్ పొழிల్ మழை త్తవழுమ్, నన్దిపురవిణ్ణగరమ్ నణ్ణుమనమే  ll 1441

పిఱైయిన్ ఒళి ఎయిఱు = చంద్రకళ వలె ప్రకాశించెడి కోరలు; ఇలగ = మెరయ; ముఱుకి = పైనపడి; ఎదిర్ పొరుదుమ్ ఎన వన్ద = ఎదరించి యుద్దముచేయటకు వచ్చిన; అశురర్ = అసురుల యొక్క; ఇఱైకళ్ అవై=ఆయుధములు మొదలగునవి;నెఱు నెఱు ఎన ఎఱియ = నెఱు నెఱు యని శబ్దించుచు శిధిలమై; అవర్ వయిర్ అழల=వారి ఉదరము మండునట్లు; నిన్ఱ పెరుమాన్ = నిలబడిన సర్వేశ్వరుడు నిత్యవాసముచేయుచున్న దివ్యదేశమును; శిఱైకొళ్=(అందమైన) రెక్కలుగల; మయిల్ కుయిల్ = నెమళ్ళు,కోకిలలు;పయిల = కూయు చున్నదియు;మలర్ గళ్ ఉక=పుష్పములు అంతటను పెల్లుబుకి వికసించుచున్నదియు; అళి మురల =భ్రమరములు ఝంకారము చేయుచున్నదియు; అడి కొళ్ నెడు మా నఱై శెయ్ =  భూమియందుండి పైకెదిగియున్న మామిడిచెట్లు పరిమళము వీచుచుండు;పొழிల్ = తోటలలో; మழை తవழுమ్ = మేఘములు సంచరించుచున్న; నన్దిపురవిణ్ణగరమ్ = నన్దిపురవిణ్ణగరమును; మనమే నణ్ణు = ఓ! నా మనసా! చేరి సుఖించుము.

చంద్రకళ వలె ప్రకాశించెడి కోరలు మెరయ పైనపడి ఎదరించి యుద్దముచేయటకు వచ్చిన అసురుల యొక్క ఆయుధములు మొదలగునవి నెఱు నెఱు యని శబ్దించుచు శిధిలమై వారి ఉదరము మండునట్లు నిలబడిన, సర్వేశ్వరుడు నిత్యవాసముచేయుచున్న దివ్యదేశమును,అందమైన రెక్కలుగల నెమళ్ళు,కోకిలలు కూయు చున్నదియు, పుష్పములు అంతటను పెల్లుబుకి వికసించుచున్నదియు, భ్రమరములు ఝంకారము చేయుచున్నదియు,భూమియందుండి పైకెదిగియున్న మామిడిచెట్లు పరిమళము వీచుచుండు తోటలలో మేఘములు సంచరించుచున్న నన్దిపురవిణ్ణగరమును  ఓ! నా మనసా!  చేరి సుఖించుము.

మూళ వెరి శిన్ది మునివెయ్ ది అమర్ శెయ్ దుమెన, వన్ద అశురర్, 

తోళుమ్ అవర్ తాళుమ్ ముడియోడు పొడియాగ, నొడియామళవు ఎయ్ దాన్,

వాళుమ్ వరవిల్లుమ్ వళై ఆழி కదై శఙ్గ,మివై అమ్ కైయుడైయాన్,

నాళుమ్ ఉఱైగిన్ఱ నగర్, నన్దిపురవిణ్ణగరమ్ నణ్ణుమనమే  ll 1442

మూళ ఎరి శిన్ది =  అంతట రగులునట్లు నిప్పును జల్లి; మునివు ఎయ్ ది = కోపముపూని; అమర్ శెయ్ దుమ్ ఎన వన్ద అశురర్ అవర్ = “యుద్దము చేసెదము” అని  వచ్చిన అసురులయొక్క; తోళుమ్ తాళుమ్ ముడియోడు = భుజములను, కాళ్ళను, తలలను; పొడి ఆగ=పొడి పొడి అగునట్లు; నొడి ఆమ్ అళవు = ఒక క్షణ సమయమందే;ఎయ్ దాన్=బాణములను ప్రయోగించినవాడును; వాళుమ్ వరవిల్లుమ్ వళై ఆழி కదై శఙ్గమ్ ఇవై అమ్ కై ఉడైయాన్=నందకమను కత్తియును,అందమైన శార్ఙ్గమను విల్లును, సుదర్శనచక్రమును, కౌముదికమను గదను,పాంచజన్యమను శంఖమును,ఈ పంచాయుధములు అందమైన హస్తమునగల సర్వేశ్వరుడు; నాళుమ్ = ఎల్లప్పుడును; ఉఱైగిన్ఱ నగర్ = కృపతో వేంచేసియున్న దివ్యదేశము; నన్దిపురవిణ్ణగరమ్ = నన్దిపురవిణ్ణగరమును; మనమే నణ్ణు = ఓ! నా మనసా! చేరి సుఖించుము.

అంతట రగులునట్లు నిప్పును జల్లి,కోపముపూని,”యుద్దము చేసెదము” అని  వచ్చిన అసురులయొక్క భుజములను, కాళ్ళను, తలలను పొడి పొడి అగునట్లు ఒక క్షణ సమయమందే బాణములను ప్రయోగించినవాడును,నందకమను కత్తియును,అందమైన శార్ఙ్గమను విల్లును, సుదర్శనచక్రమును, కౌముదికమను గదను, పాంచజన్యమను శంఖమును, ఈ పంచాయుధములు అందమైన హస్తమునగల సర్వేశ్వరుడు ఎల్లప్పుడును కృపతో వేంచేసియున్న దివ్యదేశము నన్దిపురవిణ్ణగరమును ఓ! నా మనసా! చేరి సుఖించుము.

తమ్బియొడు తామొరువర్ తన్ తుణైవి కాదల్, తుణైయాగ ముననాళ్,

వెమ్బి  ఎరి కానగమ్ ఉలావుమవర్ తామ్, ఇనిదు మేవునగర్ తాన్,

కొమ్బు కుదికొణ్డు కుయిల్ కూవ మయాలాలుమ్, ఎழிలార్ పుఱవుశేర్,

నమ్బియుఱైగిన్ఱనగర్, నన్దిపురవిణ్ణగరమ్ నణ్ణుమనమే  ll 1443

ముననాళ్ = మునుపొకకాలమున; తామ్ ఒరువర్ = లోకమున దివ్యపురుషునిగ అవతరించిన శ్రీరామచంద్రుడు;తమ్బియొడు = తమ్ముడు లక్ష్మణుడును;తన్ కాదల్ తుణైవి = తనయొక్క ప్రేమపూర్వకమైన పత్ని సీతాదేవియు; తుణైయాగ = సహాయముగ కూడ రాగ; వెమ్బి ఎరి కానగమ్= తీక్షణముగ మండుచుండెడి అడవిలో; ఉలావుమ్ అవర్ తామ్ = సంచరించిన వారలే; ఇనిదు మేవు = ప్రీతితో అమరియున్న; నగర్ తాన్ = దివ్యదేశమును; కుయిల్ = కోకిలలు;కొమ్బు కుదికొణ్డు కూవ=చెట్ల కొమ్మల మధ్య దూకుచు కూయుచుండగ; (అది విని); మయల్ ఆలుమ్ = నెమళ్ళు నృత్యము  చేయుచున్నదియు;ఎழிల్ ఆర్ = మిక్కిలి సుందరమైన; పుఱవు శేర్ = తోటలు కలదియు;  నమ్బి = సకలకల్యాణగుణపూర్ణుడైన సర్వేశ్వరుడు;ఉఱైగిన్ఱ నగర్ = కృపతో వేంచేసియున్న దివ్యదేశము; నన్దిపురవిణ్ణగరమ్ = నన్దిపురవిణ్ణగరమును; మనమే నణ్ణు = ఓ! నా మనసా! చేరి సుఖించుము.

            మునుపొకకాలమున లోకమున దివ్యపురుషునిగ అవతరించిన శ్రీరామచంద్రుడు, తమ్ముడు లక్ష్మణుడును,తనయొక్క ప్రేమపూర్వకమైన పత్ని సీతాదేవియును సహాయముగ కూడ రాగ,తీక్షణముగ మండుచుండెడి అడవిలో సంచరించిన వారలే,ప్రీతితో అమరియున్నదివ్యదేశమును, కోకిలలు చెట్ల కొమ్మల మధ్య దూకుచు కూయుచుండగ అది విని నెమళ్ళు నృత్యము  చేయుచున్నదియు,మిక్కిలి సుందరమైన తోటలు కలదియు, సకల కల్యాణగుణపూర్ణుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న దివ్యదేశము నన్దిపురవిణ్ణగరమును ఓ! నా మనసా! చేరి సుఖించుము.

తందై మనమ్ ఉన్దు తుయర్ నన్ద విరుళ్ వన్ద విరల్, నన్దన్ మదలై,

ఎందై ఇవనెన్ఱు అమరర్ కన్దమలర్ కొణ్డు తొழ, నిన్ఱ నగర్ తాన్, 

మన్దముழవోశై మழைయాగ ఎழுకార్, మయిల్ గళ్ ఆడు పొழிల్ శూழ், 

నన్ది పణిశెయ్ ద నగర్, నన్దిపురవిణ్ణగరమ్ నణ్ణుమనమే  ll 1444

తందై = తండ్రి నందగోపుని; మనమ్ = మనస్సు; ఉన్దు =కుంగింపజేయుచున్న;తుయర్= (పుత్రుడు లేదనెడి)దుఃఖము; నన్ద = తొలగునట్లు; ఇరుళ్ వన్ద = (ఏ ఒక్కరికిని తెలియని విధముగ మధురనుండి) చీకటిలో వచ్చి చేరిన; విఱల్ = మిక్కిలి శక్తివంతమైన; నన్దన్ మదలై = నందగోపకుమారుడైన శ్రీకృష్ణుడు; అమరర్ = దేవతలు; ఇవన్ ఎన్దై ఎన్ఱు = ” ఇతడే మనయొక్క స్వామి ” అని చెప్పుకొనుచు; కన్దమ్ మలర్ కొణ్డు తొழ = గంధము,పుష్పములు సమర్పించి సేవించుకొనునట్లు; నిన్ఱ = వేంచేసిన; నగర్ తాన్ = దివ్యదేశమే; ముழవు = వాద్యముల యొక్క; మందమ్ ఓశై = మందమైన ధ్వనులను; మழை ఆగ = మేఘ గర్జనవలె తలచి; కార్ = వర్షాకాలమందు; ఎழு = ఉత్సుకతో; మయిల్ గళ్ ఆడు=నెమళ్ళు నృత్యము చేయుచుండెడి; పొழிల్ = తోటలతో; శూழ் = చుట్టుకొనియున్న; నన్ది పణిశెయ్ ద నగర్=”నంది”మహారాజు కైంకర్యములొనరించిన క్షేత్రము;నన్దిపురవిణ్ణగరమ్ = నన్దిపురవిణ్ణగరమును; మనమే నణ్ణు = ఓ! నా మనసా! చేరి సుఖించుము.

      తండ్రి నందగోపుని మనస్సు కుంగింపజేయుచున్న పుత్రుడు లేదనెడి దుఃఖము  తొలగునట్లు ఏ ఒక్కరికిని తెలియని విధముగ మధురనుండి చీకటిలో వచ్చి చేరిన,మిక్కిలి శక్తివంతమైన నందగోపకుమారుడైన శ్రీకృష్ణుడు,దేవతలు “ఇతడే మనయొక్క స్వామి” అని చెప్పుకొనుచు గంధము,పుష్పములు సమర్పించి సేవించుకొనునట్లు వేంచేసిన దివ్యదేశమే,వాద్యముల యొక్క మందమైన ధ్వనులను మేఘ గర్జనవలె తలచి, వర్షాకాలమందు  ఉత్సుకతో నెమళ్ళు నృత్యము చేయుచుండెడి తోటలతో చుట్టుకొనియున్న “నంది” మహారాజు కైంకర్యములొనరించిన క్షేత్రము నన్దిపురవిణ్ణగరమును ఓ! నా మనసా! చేరి సుఖించుము.

ఎణ్ణిల్ నినైవెయిది యిని యిల్లై యిఱైయెన్ఱు, మునియాళర్ తిరువార్,

పణ్ణిల్ మలి కీదమొడుపాడి అవర్ ఆడలొడు, కూడ ఎழிలార్,

మణ్ణిల్ ఇతుపోలు నగరిల్లైయెన, వానవర్ గళ్ తామ్ మలర్ గళ్ తూయ్,

నణ్ణి ఉఱైగిన్ఱ నగర్, నన్దిపురవిణ్ణగరమ్ నణ్ణుమనమే  ll 1445

ఎణ్ణిల్ = బాగుగ చింతించి; నినైవు ఎయ్ ది ఇఱై = ధ్యానింపతగిన స్వామి; ఇని ఇల్లై ఎన్ఱు = ఇతనికంటె ఇక ఎవరు లేరని; (నిశ్చయించి); మునియాళర్ = మహామునులు; తిరు ఆర్ పణ్ణిల్ మలి =మిక్కిలి సుందరమైన రాగభరితమైన; కీదమొడుపాడి = పాటలతో కూడ స్తుతులు చేసి ;(మరియు ఆ పాటలకు) అవర్ ఆడలొడు కూడ = ఆ మునుల చేయు నృత్యములతో బాటు; వానవర్ గళ్ తామ్ = దేవతలు; ఎழிలార్ మణ్ణిల్ = ” శ్లాఘ్యమైన ఈ భూలోకములో “; ఇదు పోలు నగర్ ఇల్లై ఎన = “ఈ దివ్యదేశమువంటి నగరము ఎచ్చటను లేదు” అని కొనియాడి;మలర్ గళ్ తూయ్ = పుష్పములను సమర్పించి; నణ్ణి = ఆశ్రయించి;ఉఱైగిన్ఱ నగర్ =నిత్యవాసము చేయుచున్న దివ్యస్థలము; నన్దిపురవిణ్ణగరమ్ = నన్దిపురవిణ్ణగరమును; మనమే నణ్ణు = ఓ! నా మనసా! చేరి సుఖించుము.

బాగుగ చింతించి ధ్యానింపతగిన స్వామి ఇతనికంటె ఇక ఎవరు లేరని నిశ్చయించి మహామునులు మిక్కిలి సుందరమైన, రాగభరితమైన,పాటలతో కూడ స్తుతులు చేసి, మరియు ఆ పాటలకు ఆ మునుల చేయు నృత్యములతో బాటు,దేవతలు ” శ్లాఘ్యమైన ఈ భూలోకములో,ఈ దివ్యదేశమువంటి నగరము ఎచ్చటను లేదు” అని కొనియాడి, పుష్పములను సమర్పించి,ఆశ్రయించి నిత్యవాసము చేయుచున్న దివ్యస్థలము, ” నన్దిపురవిణ్ణగరమును ఓ! నా మనసా! చేరి సుఖించుము.

వఙ్గమలి పౌవమదు మా ముకడిన్ ఉచ్చిపుక, మిక్క పెరునీర్, 

అఙ్గమழிయార్ అవనదాణై తలైశూడుమ్, అడియార్ అఱిదియేల్,

పొఙ్గుపునల్ ఉన్దు మణి కఙ్గుల్ ఇరుళ్ శీరుమ్ ఒళి, ఎఙ్గుమ్ ఉళదాల్,

నఙ్గళ్ పెరుమాన్ ఉఱైయుమ్, నన్దిపురవిణ్ణగరమ్ నణ్ణు మనమే  ll 1446

మనమే = ఓ! నా మనసా!; అవనదు ఆణై = ఆ సర్వేశ్వరునియొక్క (వేదములు, వేదాంగములు) దివ్యాఙ్ఞనలను;తలై శూడుమ్ అడియార్ = శిరాసావహించెడి భక్తులు; వఙ్గమ్ మలి పౌవమ్ అదు = ఓడలచే నిండియున్న సముద్రము; మా ముకడిన్ ఉచ్చి పుక = పైనున్న అండభిత్తియొక్క అగ్రమువరకు పోయి వ్యాపించగ; మిక్క = పొంగిన; పెరు నీర్ = ఆ మహాజలధిలోను;అఙ్గమ్ అழிయార్ = శరీర నాశనము పొందరు; అఱిదియేల్ = ఇది నీకు తెలిసినిచో; పొఙ్గు పునల్ ఉన్దు మణి=పొంగి ప్రవహించెడి జలములు తోసుకొని చేర్చు నవరత్నముల;కఙ్గుల్ ఇరుళ్ శీరుమ్ ఒళి = రాత్రి చీకటిని పోగొట్టు ప్రకాశము; ఎఙ్గుమ్ ఉళదాల్ = ప్రదేశమంతను పగలువలె చేయుచున్నదియు; నఙ్గళ్ పెరుమాన్ ఉఱైయుమ్ = మనయొక్క సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న ఆ దివ్యదేశము; నన్దిపురవిణ్ణగరమ్ = నన్దిపురవిణ్ణగరమును;నణ్ణు = చేరి సుఖించుము.

        ఓ! నామనసా!సర్వేశ్వరునియొక్క(వేదములు,వేదాంగములు) దివ్యాఙ్ఞనలను శిరాసావహించెడి భక్తులు ఓడలచే నిండియున్న సముద్రము,పైనున్న అండభిత్తియొక్క అగ్రమువరకు పోయి వ్యాపించగ పొంగిన ఆ మహాజలధిలోను శరీర నాశనము పొందరు. ఇది నీకు తెలిసినిచో పొంగి ప్రవహించెడి జలములు తోసుకొని చేర్చు నవరత్నముల రాత్రి చీకటిని పోగొట్టు ప్రకాశము, ప్రదేశమంతను పగలువలె చేయుచున్నదియు, మనయొక్క సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న ఆ దివ్యదేశము నన్దిపురవిణ్ణగరము చేరి సుఖించుము.

** నఱైశెయ్ పొழிల్ మழை త్తవழுమ్, నన్దిపురవిణ్ణగరమ్ నణ్ణిఉఱైయుమ్,

ఉఱైకొళ్ పుకరాழி శురిశఙ్గ, మవై అమ్ కై యుడైయానై, ఒళిశేర్

కఱై వళరుమ్ వేల్ వల్ల, కలియన్ ఒలిమాలై ఇవై ఐన్దు మైన్దుమ్, 

ముఱైయిల్ ఇవై పయిలవల అడియవర్ గళ్ కొడు వినైగళ్, ముழுదు అగలుమేll1447

నఱై శెయ్ పొழிల్ మழை త్తవழுమ్ = తేనెలతో నిండిన తోటలలో మేఘములు సంచరించెడు; నన్దిపురవిణ్ణగరమ్ = నన్దిపురవిణ్ణగరమను దివ్యదేశమును; నణ్ణి = వేంచేసి; ఉఱైయుమ్=నిత్యవాసము చేయుచున్న;ఉఱై కొళ్ పుకర్ ఆழி= ఒరతోనున్న తేజస్సుగల సుదర్శనచక్రమును; శురి శఙ్గమ్ = సుడులుగల శంఖమును; అవై = మిగిలిన ఆయుధములును;అమ్ కై ఉడై యానై = అందమైన దివ్య హస్తమునగల సర్వేశ్వరుని విషయమై;కఱై వళరుమ్=రక్తపు మరకలు ఎక్కువగ కల; ఒళి శేర్ = ప్రకాశించు; వేల్ వల్ల = శూలాయుధము ప్రయోగించగల; కలియన్ = తిరుమంగై ఆళ్వార్;ఒలి మాలై  = అనుగ్రహించిన సూక్తులమాలైన;ఇవై ఐన్దు మైన్దుమ్=ఈ పది పాసురములను;ముఱైయిల్= క్రమబద్ధముగ; పయిలవల = అభ్యసించు; అడియవర్ గళ్ = భక్తులయొక్క; కొడు వినైగళ్ ముழுదు = క్రూరమైన పాపములన్నియు; అగలుమే = విడిచిపోవును.

      తేనెలతో నిండిన తోటలలో మేఘములు సంచరించెడు నన్దిపురవిణ్ణగరమను దివ్యదేశమును కృపతో వేంచేసి నిత్యవాసము చేయుచున్న, ఒరతోనున్న తేజస్సుగల సుదర్శనచక్రమును,సుడులుగల శంఖమును,మిగిలిన ఆయుధములును అందమైన దివ్య హస్తమునగల సర్వేశ్వరుని విషయమై,రక్తపు మరకలు ఎక్కువగ గల,ప్రకాశించు  శూలాయుధము ప్రయోగించ సమర్ధతగల తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన సూక్తుల మాలగనున్న ఈ పది పాసురములను క్రమబద్ధముగ అభ్యసించు భక్తులయొక్క క్రూరమైన పాపములన్నియు విడిచిపోవును.

తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం 

*******

వ్యాఖ్యానించండి