శ్రీః
2. తాన్దమ్ పెరుమై
తిరు కూడలూరు దివ్యదేశమందు కృపతో వేంచేసియున్న వైయ్యంకాత్త పెరుమాళ్ ను తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు.
** తామ్ తమ్పెరుమైయఱియార్, తూదు
వేన్దర్కాయ, వేన్దరూర్ పోల్,
కాన్దళ్ విరల్, మెన్ కలై నన్మడవార్,
కూన్దల్ కమழுమ్, కూడలూరే ll 1358
తమ్ పెరుమై = తమయొక్క గొప్పతనమును; తామ్ అఱియార్ = తమకే తెలియని వారును; వేన్దర్కు= (పాండవ) మహారాజులకు; తూదు ఆయ = దూతగ వెడలిన; వేన్దర్ = దేవాది దేవునియొక్క; ఊర్ పోల్ = పరమపదము పోలిన దివ్యదేశము; (ఏదనగ) కాన్దళ్ విరల్=అగ్ని శిఖి పుష్పమువలె వేళ్ళుగల; మెన్ కలై = మృదువైన వస్త్రములు ధరించిన;నల్ మడవార్ =విశిష్టమైన స్త్రీలయొక్క;కూన్దల్ కమழுమ్= కుంతలములు పరిమళము వెదజల్లుచున్న; కూడలూరే=తిరు కూడలూరు దివ్యదేశమే సుమా!
తమయొక్క గొప్పతనమును తమకే తెలియని వారును,పాండవ మహారాజులకు దూతగ వెడలిన దేవాది దేవునియొక్క పరమపదము పోలిన దివ్యదేశము(ఏదనగ) అగ్ని శిఖి పుష్పమువలె వేళ్ళుగల మృదువైన వస్త్రములు ధరించినవిశిష్టమైన స్త్రీల యొక్క కుంతలములు పరిమళము వెదజల్లుచున్న తిరు కూడలూరు దివ్యదేశమేసుమా!
శెఱుమ్ తిణ్ తిమిల్ ఏఱుడైయ, పిన్నై
పెఱున్దణ్ కోలమ్, పెర్ట్రారూర్ పోల్
నఱుమ్ తణ్ తీమ్ తేన్ ఉణ్డవణ్డు,
కుఱిఞ్జి పాడుమ్, కూడలూరే ll 1359
శెఱుమ్ = పైనబడి దాడిచేయు; తిణ్ తిమిల్ = దృఢమైన మూపురములుగల; ఏఱు ఉడైయ= వృషభములను కన్యాశుల్కముగ పెట్టబడిన;పిన్నై=నప్పిన్నైపిరాట్టిని;పెఱుమ్ తణ్ కోలమ్= పొందుటకు ఆశపడునట్లు తగిన అందమైన స్వరూపమును; పెర్ట్రార్=పరిణయమాడిన నీలమేఘశ్యాముడైన సర్వేశ్వరుని;ఊర్ పోల్=పరమపదము పోలిన దివ్యదేశము;(ఏదనగ )నఱుమ్ తణ్ తీమ్ తేన్ ఉణ్డ వణ్డు = పరిమళభరితమైన చల్లని భోగ్యమైన తేనెను గ్రోలిన భ్రమరములు; కుఱిఞ్జి పాడుమ్ = కురుఞ్జి అను రాగమును ఆలాపన చేయుచుండెడి;కూడలూరే=తిరు కూడలూరు దివ్యదేశమే సుమా!
పైనబడి దాడిచేయు దృఢమైన మూపురములుగల వృషభములను కన్యాశుల్కముగ పెట్టబడిన నప్పిన్నైపిరాట్టిని;పొందుటకు ఆశపడునట్లు తగిన అందమైన స్వరూపమును పరిణయమాడిన నీలమేఘశ్యాముడైన సర్వేశ్వరుని పరమపదము పోలిన దివ్యదేశము(ఏదనగ) పరిమళభరితమైన చల్లని భోగ్యమైన తేనెను గ్రోలిన భ్రమరములు కురుఞ్జి అను రాగమును ఆలాపన చేయుచుండెడి తిరు కూడలూరు దివ్యదేశమే సుమా!.
పిళ్ళైయురువాయ్ తయిరుణ్డు, అడియే
నుళ్ళమ్ పుగున్ద, ఒరువరూర్పోల్,
కళ్ళనారై వయలుళ్, కయల్ మీన్
కొళ్ళైకొళ్ళుమ్, కూడలూరే ll 1360
పిళ్ళై ఉరువు ఆయ్=చిన్న శిశువై; తయిర్ ఉణ్డు=పెరుగును ఆస్వాదించియు; అడియేన్ ఉళ్ళమ్ పుగున్ద = ఈ దాసుని హృదయమందు కృపతో వేంచేసియున్న; ఒరువర్ = అద్వితీయుడైన సర్వేశ్వరుని;ఊర్ పోల్=పరమపదము పోలిన దివ్యదేశము; (ఏదనగ) కళ్ళమ్ నారై వయలుళ్ = కపటమైన కొంగలు పొలములలోగల; కయల్ మీన్ = కయల్ మత్స్యములను;కొళ్ళై కొళ్ళుమ్= కబళించుచుండెడి; కూడలూరే = తిరు కూడలూరు దివ్యదేశమే సుమా!
చిన్న శిశువై పెరుగును ఆస్వాదించియు,ఈ దాసుని హృదయమందు కృపతో వేంచేసియున్న అద్వితీయుడైన సర్వేశ్వరుని పరమపదము పోలిన దివ్యదేశము (ఏదనగ) కపటమైన కొంగలుగల పొలములలో కయల్ మత్స్యములను కృపతో వేంచేసియున్న అద్వితీయుడైన సర్వేశ్వరుని పరమపదము పోలిన దివ్యదేశము (ఏదనగ) కపటమైన కొంగలు పొలములలో గల కయల్ మత్స్యములను కబళించుచుండెడి తిరు కూడలూరు దివ్యదేశమే సుమా!
కూర్ట్రేరురువిన్ కుఱళాయ్, నిలమ్ నీర్
ఏర్ట్రానెన్దై, పెరుమానూర్ పోల్,
శేర్ట్రేరుழవర్, కోదైపోదు ఊణ్,
కోల్ తేన్ మురలుమ్, కూడలూరే ll 1361
కూరు ఏర్ ఉరువిల్=కొండాడతగిన స్వరూపముగల; కుఱళ్ ఆయ్ = వామనమూర్తియై; నిలమ్ నీర్ ఏర్ట్రాన్ = భూదానజలమును స్వీకరించిన; ఎన్దై పెరుమాన్ = నాయొక్క స్వామియైన సర్వేశ్వరుని; ఊర్ పోల్ = పరమపదము పోలిన దివ్యదేశము; ( ఏదనగ ) శేరు ఏర్ ఉழవర్ = బురదలలో నాగలితో దున్నెడి రైతాంగనల; కోదై పోదు ఊణ్ = కుంతలములయందు ముడిచిన పుష్పములందలి తేనెను గ్రోలిన; కోల్ తేన్ మురలుమ్ = తోటలలోని భ్రమరములు ఇంపుగ ఝంకారములు చేయుచుండెడి; కూడలూరే = తిరు కూడలూరు దివ్యదేశమే సుమా!
కొండాడతగిన స్వరూపముగల వామనమూర్తియై భూదానజలమును స్వీకరించిన నాయొక్క స్వామియైన సర్వేశ్వరుని పరమపదము పోలిన దివ్యదేశము (ఏదనగ)బురదలలో నాగలితో దున్నెడి రైతాంగనల కుంతలములయందు ముడిచిన పుష్పములందలి తేనెను గ్రోలిన తోటలలోని భ్రమరములు ఇంపుగ ఝంకారములు చేయుచుండెడి తిరు కూడలూరు దివ్యదేశమే సుమా!
తొణ్డర్ పరవ, శుడర్ శెన్ఱణవ,
అణ్డత్తమరుమ్, అడిగళూర్ పోల్,
వణ్డల్ అలైయుళ్, కెండై మిళిర,
కొణ్డల్ అదిరుమ్, కూడలూరే ll 1362
తొణ్డర్ పరవ = ఆశ్రితులు స్తుతించుటకు తగినట్లు;శుడర్ శెన్ఱు అణవ=(తన తిరుమేను) సూర్యమండల పర్యంతము పెరిగి స్పర్శింప; అణ్డత్తు అమరుమ్ = ఆకాశమంతను వ్యాపించియున్న; అడిగళ్ = దివ్య చరణారవిందములు గల సర్వేశ్వరుని; ఊర్ పోల్ = పరమపదము పోలిన దివ్యదేశము; (ఏదనగ) వణ్డల్ అలైయుమ్=దిగువన స్థిరమైన అవక్షేపములున్న అలలుగల జలాశయములలో; కెండై మిళిర = కెండై మత్స్యములు (తమయొక్క కాంతివలన)మెరయు చుండగ; (అది చూచి) కొణ్డల్ అదిరుమ్ = మేఘములు గర్జించుచుచుండెడి; కూడలూరే = తిరు కూడలూరు దివ్యదేశమే సుమా!
ఆశ్రితులు స్తుతించుటకు తగినట్లు తన తిరుమేను సూర్యమండల పర్యంతము పెరిగి స్పర్శింప, ఆకాశమంతను వ్యాపించియున్న దివ్య చరణారవిందములు గల సర్వేశ్వరుని పరమపదము పోలిన దివ్యదేశము ( ఏదనగ )దిగువన స్థిరమైన అవక్షేపములున్న అలలుగల జలాశయములలో కెండై మత్స్యములు తమయొక్క కాంతివలన మెరయు చుండగ,అది చూచి మేఘములు గర్జించుచుచుండెడి తిరు కూడలూరు దివ్యదేశమే సుమా!
తక్కన్ వేళ్వి, తగర్త తలైవన్,
తుక్కన్తుడైత్త, తుణైవర్ ఊర్ పోల్,
ఎక్కలిడు, నుణ్ మణల్ పోల్, ఎఙ్గుమ్
కొక్కిన్పழమ్ వీழ, కూడలూరే ll 1363
తక్కన్ వేళ్వి = దక్షప్రజాపతియొక్క యాగమును; తగర్త తలైవన్ = ధ్వంసముజేసిన శివుని యొక్క; దుక్కమ్ తుడైత్త = దుఃఖమును పోగొట్టిన; తుణైవర్ = ఆపద్బాంధవుడైన సర్వేశ్వరుని; ఊర్ పోల్ = పరమపదము పోలిన దివ్యదేశము;( ఏదనగ )ఎక్కలిడు = ఒండ్రు నేలపై; నుణ్ మణల్ మేల్ = సన్నని మట్టిపై;ఎఙ్గుమ్ కొక్కిన్ పழమ్ వీழ = అంతటను మామిడి పండ్లు పడుచుండెడి; కూడలూరే = తిరు కూడలూరు దివ్యదేశమే సుమా! .
దక్షప్రజాపతియొక్క యాగమును ధ్వంసముజేసిన శివుని యొక్క దుఃఖమును పోగొట్టిన ఆపద్బాంధవుడైన సర్వేశ్వరుని పరమపదము పోలిన దివ్యదేశము (ఏదనగ) ఒండ్రు నేలపై సన్నని మట్టిపై అంతటను మామిడి పండ్లు పడుచుండెడి తిరు కూడలూరు దివ్యదేశమే సుమా!
కరుంతణ్కడలుం, మలైయుములగుమ్,
అరున్దుం అడిగళ్, అమరుమూర్ పోల్,
పెరుమ్ తణ్ ముల్లై, పిళ్ళైయోడి,
కురున్దమ్ తழுవుమ్, కూడలూరే ll 1364
కరుం తణ్ కడలుం = నల్లని చల్లనైన సముద్రములును;మలైయుమ్ = పర్వతములును; ఉలగుమ్ = (మరియు) లోకములును; అరున్దుం = (ప్రళయకాలమున) ఆరగించిన; అడిగళ్ అమరుమ్= సర్వేశ్వరుడు నిత్యము అమరియున్న; ఊర్ పోల్ = పరమపదము పోలిన దివ్యదేశము; (ఏదనగ) పెరుమ్ తణ్ ముల్లై పిళ్ళై = పెద్ద చల్లనైన మల్లె తీగ ; ఓడి = వ్యాపించి; కురున్దమ్ తழுవుమ్ = కురున్దమ్ చెట్టును అల్లుకొనుచుండెడి; కూడలూరే = తిరు కూడలూరు దివ్యదేశమే సుమా! .
నల్లని చల్లనైన సముద్రములును,పర్వతములును,మరియు లోకములును ప్రళయకాలమున ఆరగించిన సర్వేశ్వరుడు నిత్యము అమరియున్న పరమపదము పోలిన దివ్యదేశము (ఏదనగ) పెద్ద చల్లనైన మల్లె తీగ వ్యాపించి కురున్దమ్ చెట్టును అల్లుకొనుచుండెడి తిరు కూడలూరు దివ్యదేశమే సుమా! .
కలై వాழ் పిణైయోడు అణైయుం, తిరునీర్
మలై వాழ் ఎన్దై, మరువుమూర్ పోల్,
ఇలై తాழ் తెఙ్గిన్ మేల్ నిన్ఱ, ఇళనీర్
కులై తాழ் కిడఙ్గిన్, కూడలూరే ll 1365
కలై పిణైయోడు = మగ లేళ్ళు ఆడ లేళ్ళతో; అణై వాழுమ్=కలసి నివసించు; తిరునీర్ మలై వాழ் ఎన్దై = తిరునీర్ మలై దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నాయొక్క స్వామి; మరువుమ్=నిత్యము వేంచేసియుండు;ఊర్ పోల్ = పరమపదము పోలిన దివ్యదేశము;(ఏదనగ) ఇలై తాழ் తెఙ్గిన్ మేల్ నిన్ఱ=మట్టలతో కూడియున్న కొబ్బరిచెట్లపై గల; ఇళనీర్ కులై = లేత కొబ్బరి కొలలు; తాழ் కిడఙ్గిన్ = (తమపైన) వ్రేలాడుచున్న నీటివనరులతో నిండిన;కూడలూరే=తిరు కూడలూరు దివ్యదేశమే సుమా!
మగ లేళ్ళు, ఆడ లేళ్ళతో కలసి నివసించుచున్న తిరునీర్ మలై దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నాయొక్క స్వామి నిత్యము వేంచేసియుండు పరమపదము పోలిన దివ్యదేశము (ఏదనగ) మట్టలతో కూడియున్నకొబ్బరిచెట్లపై గల లేత కొబ్బరి కాయల కొలలు (తమపైన) వ్రేలాడుచున్న నీటివనరులతో నిండిన తిరు కూడలూరు దివ్యదేశమే సుమా!
పెరుగు కాదల్ అడియేన్, ఉళ్ళమ్
ఉరుగప్పుగున్ద, ఒరువరూర్ పోల్
అరుగు కైతై మలర, కెణ్డై
కురుగెన్ఱు అఞ్జుమ్, కూడలూరే ll 1366
పెరుగు కాదల్=అధికమగుచున్న కాంక్షతో నున్న;అడియేన్ ఉళ్ళమ్=ఈ దాసుని యొక్క మనస్సు; ఉరుగ = ద్రవించునట్లు; పుగున్ద = నాయందు ప్రవేశించిన; ఒరువర్ = అద్వితీయుడైన సర్వేశ్వరుని;ఊర్ పోల్ = పరమపదము పోలిన దివ్యదేశము;(ఏదనగ) అరుగు = సమీపమందు; కైతై మలర=మొగలి పుష్పములు వికసించగ;(దానిని చూచి) కెణ్డై = కెన్డై మత్స్యములు;కురుగు ఎన్ఱు అఞ్జుమ్=(తమను పట్టుకొని తినుటకై వచ్చిన) కొంగలని భయపడుచుండెడి;కూడలూరే = తిరు కూడలూరు దివ్యదేశమే సుమా!
అధికమగుచున్న కాంక్షతో నున్న ఈ దాసుని యొక్క మనస్సు ద్రవించునట్లు నాయందు ప్రవేశించిన అద్వితీయుడైన సర్వేశ్వరునియొక్క పరమపదము పోలిన దివ్యదేశము(ఏదనగ) సమీపమందు మొగలి పుష్పములు వికసించగ దానిని చూచి కెన్డై మత్స్యములు తమను పట్టుకొని తినుటకై వచ్చిన కొంగలని భయపడుచుండెడి తిరు కూడలూరు దివ్యదేశమే సుమా!
** కావి ప్పెరునీర్ వణ్ణన్, కణ్ణన్
మేవి త్తిగழுమ్, కూడలూర్ మేల్,
కోవై త్తమిழாల్, కలియన్ శొన్న,
పావై ప్పాడ, ప్పావమ్ పోమే ll 1367
కావి = రెల్లు పూవువలెను; పెరునీర్ వణ్ణన్ = సముద్రమువంటి వర్ణమును కలిగిన; కణ్ణన్ = శ్రీ కృష్ణుడు; మేవి = ఆశించి వేంచేసియున్న; తిగழுమ్ కూడలూర్ మేల్ = ప్రకాశించుచున్న తిరు కూడలూరు దివ్యదేశ విషయమై;కోవై త్తమిழாల్ = క్రమబద్ధమైన తమిళ భాషలో; కలియన్ శొన్న = తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన; పావై పాడ = ఈ పాశురములను అనుసంధించిన; పావమ్ పోమే = పాపములు తొలగిపోవును కదా!.
రెల్లు పూవువలెను,సముద్రమువంటి వర్ణమును కలిగిన శ్రీ కృష్ణుడు ఆశించి వేంచేసియున్న ప్రకాశించుచున్న తిరు కూడలూరు దివ్యదేశ విషయమై క్రమబద్ధమైన తమిళ భాషలో తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన ఈ పాశురములను అనుసంధించిన పాపములు తొలగిపోవును కదా!.
**********