శ్రీః
5. వెరువాదాళ్
శ్రీ రంగం దివ్యదేశముయొక్క వైభవమును పొగుడుచు ఆశ్రీరంగనాధుని స్మరణయందే లీనమై పోయిన తిరుమంగై ఆళ్వార్, పరకాలనాయకి అవస్థను పొందినది గాంచిన ఆమెయొక్క తల్లి తన కుమార్తె విషయమై సహచరులకు తన వేదనను వెలిబుచ్చుచున్నారు.
** వెరువాదాళ్ వాయ్ వెరువి, వేఙ్గడమే వేఙ్గడమే యెన్గిన్ఱాళాల్,
మరువాళ్ ఆల్ ఎన్ కుడఙ్గాల్, వాణెడుఙ్గణ్ తుయిల్మఱన్దాళ్, వణ్డార్ కొణ్డల్
ఉరువాళన్ వానవర్ తమ్ ఉయిరాళన్, ఒలి తిరైనీర్ ప్పౌవఙ్గొణ్డ
తిరువాళన్, ఎన్ మగళై చ్చెయ్ దనగళ్, ఎఙ్గనమ్ నాన్ శిన్దిక్కేనే ll 1388
వెరువాదాళ్ = భయమేమియులేక; వాయ్ వెరువి = గట్టిగా పలవరించుచు; వేఙ్గడమే వేఙ్గడమే ఎన్గిన్ఱాళ్ ఆల్=వెంకటాచలమో! వెంకటాచలమో! అని పలుకుచున్నదయ్యో!; ఎన్ కుడఙ్గాల్ = నాయొక్క ఒడిలో; మరువాళ్ ఆల్ = చేరదయ్యో!; వాళ్ నెడుమ్ కణ్ = కత్తివలె వాడియైన పెద్ద కనులుగల ఈమె; తుయిల్ మఱన్దాళ్ = నిద్ర మరచిపోయినది; వణ్డు ఆర్ కొణ్డల్=తుమ్మెదల సంచారములతో నిండిన మేఘము వలె; (ఆహ్లాదకరమైన) ఉరువాళన్ = దివ్యమైన రూపముకలవాడును; వానవర్ తమ్ ఉయిరాళన్= నిత్యశూరులయొక్క ప్రాణభూతుడైయున్నవాడును; ఒలి తిరై నీర్ = ఘోషించుచున్న అలలుగల నీటితోఒప్పు; ప్పౌవమ్ కొణ్డ=సముద్రమునందు ఉద్భవించిన;తిరు ఆళన్=శ్రీదేవియొక్క విభుడును అయిన శ్రీ రంగనాథుడు; ఎన్ మగళై శెయ్ దనగళ్ = నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును; ఎఙ్గనమ్ నాన్ శిన్దిక్కేనే = ఏవిధముగ నేను ఊహించగలను?
భయమేమియులేక గట్టిగా పలవరించుచు “వెంకటాచలమో! వెంకటాచలమో!” అని పలుకుచున్నదయ్యో! నాయొక్క ఒడిలో చేరదయ్యో !,కత్తివలె వాడియైన పెద్ద కనులుగల ఈమె నిద్ర మరచిపోయినది.తుమ్మెదల సంచారములతో నిండిన మేఘము వలె ఆహ్లాదకరమైన దివ్యమైన రూపము కలవాడును,నిత్యశూరులయొక్క ప్రాణభూతుడై యున్నవాడును,ఘోషించుచున్న అలలుగల నీటితోఒప్పు సముద్రమున ఉద్భవించిన శ్రీదేవియొక్క విభుడును, అయిన శ్రీ రంగనాథుడు నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును ఏవిధముగ నేను ఊహించగలను?
కలై ఆళా అగల్ అల్ గుల్, కనవళైయుమ్ కైయాళా ఎన్ శెయ్ గేన్నాన్,
విలైయాళా అడియేనై, వేణ్డుదియో వేణ్డాయో ఎన్నుమ్, మెయ్య
మలైయాళన్ వానవర్ తమ్ తలైయాళన్, మరామరమేழெయ్ ద వెన్ఱి
శిలైయాళన్, ఎన్ మగళై చ్చెయ్ దనగళ్, ఎఙ్గనమ్ నాన్ శిన్దిక్కేనే ll 1389
అగల్ అల్ గుల్=విశాలమైన కటిప్రదేశముగల నా కుమార్తె; కలై ఆళా=వస్త్రములను మార్చుకొనదు; కన వళైయుమ్ కై ఆళా=బంగారు గాజులు చేతికి అలంకరించుకొనదు; నాన్ ఎన్ శెయ్ గేన్=నేనేమి చేయగలను?; అడియేనై=”దాసురాలైన నన్ను;విలై ఆళ్ ఆ= విక్రయింపబడిన స్త్రీవలె ఏమైనా చేయుటకు;వేణ్డుదియో వేణ్డాయో ఎన్నుమ్ = నీ మనోరథమున కోరుకొనుచున్నావో, లేదో ” అని చెప్పుచుండును; మెయ్యుమ్ మలై ఆళన్=తిరు మెయ్యమను కొండను పాలించుచున్నవాడును; వానవర్ తమ్ తలై ఆళన్=నిత్యశూరులకు ప్రభువైనవాడును;మరామరమ్ ఏழ் ఎయ్ ద= సాలవృక్షములు ఏడు కూలగొట్టిన; వెన్ఱి శిలై ఆళన్ = జయశీలమైన బాణమును ప్రయోగించిన సర్వేశ్వరుడు; ఎన్ మగళై శెయ్ దనగళ్ = నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును; ఎఙ్గనమ్ నాన్ శిన్దిక్కేనే = ఏవిధముగ నేను ఊహించగలను?
విశాలమైన కటిప్రదేశముగల నా కుమార్తె వస్త్రములను మార్చుకొనదు,బంగారు గాజులు చేతికి అలంకరించుకొనదు,దీనికి నేనేమి చేయగలను? “దాసురాలైన నన్ను విక్రయింపబడిన స్త్రీవలె ఏమైనా చేయుటకు నీ మనోరథమున కోరుకొనుచున్నావో, లేదో ” అని చెప్పుచుండును.తిరు మెయ్యమను కొండను పాలించుచున్నవాడును, నిత్యశూరులకు ప్రభువైనవాడును,సాలవృక్షములు ఏడు కూలగొట్టిన జయశీలమైన బాణమును ప్రయోగించిన సర్వేశ్వరుడు నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును ఏవిధముగ నేను ఊహించగలను?
మానాయ మెన్నోక్కి, వాణెడుఙ్గణ్ణీర్ మల్ గుమ్ వళైయుమ్ శోరుమ్,
తేనాయ నఱున్దుழாయ్ అలఙ్గలిన్, తిఱమ్ పేశి ఉఱఙ్గాళ్ కాణ్మిన్,
కాన్ ఆయన్ కడి మనైయిల్ తయిరుణ్డు నెయ్ పరుగ, నన్దన్ పెర్ట్ర
ఆనాయన్, ఎన్ మగళై చ్చెయ్ దనగళ్, అమ్మనైమీర్ అఱికిలేనే ll 1390
మాన్ ఆయ మెన్ నోక్కి = లేడివలె అందమైన చూపులుగల నా కుమార్తె; వాళ్ నెడుమ్ కణ్ నీర్ మల్ గుమ్=ప్రకాశించుచుండు పెద్ద కన్నులునుండి అశ్రువులు కార్చుచుండును; వళైయుమ్ శోరుమ్ = గాజులు చేతినుండి జారిపోవుచున్నది; తేన్ ఆయ నఱుమ్ తుழாయ్ = తేనెలతోనిండిన పరిమళ భరితమైన తులసీదళముల;అలఙ్గలిన్ తిఱమ్ పేశి = మాలల వైభవమును చెప్పుచు; ఉఱఙ్గాళ్ = నిదురించదు; కాణ్మిన్ = మీరు స్వయముగ చూడుడు;కాన్ ఆయన్ = కాననమందు తిరిగెడివాడును;కడి మనైయిల్ = మిక్కిలి రక్షణకలిగిన ఇండ్లలోని; తయిర్ ఉణ్డు = పెరుగును ఆస్వాదించునట్లు; నెయ్ పరుగ = నెయ్యిని త్రాగునట్లు; నన్దన్ పెర్ట్ర ఆన ఆయన్ = నందగోపుడు పొందిన గోపాల కృష్ణ భగవానుడు; ఎన్ మగళై శెయ్ దనగళ్ = నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును;అమ్మనైమీర్=ఓ! అమ్మలారా!;అఱిగిలేనే=నాకేమియు తెలియుటలేదు.
లేడివలె అందమైన చూపులుగల నా కుమార్తె ప్రకాశించుచుండు పెద్ద కన్నులునుండి అశ్రువులు కార్చుచుండును,గాజులు చేతినుండి జారిపోవుచున్నది, తేనెలతోనిండిన పరిమళభరితమైన తులసీదళముల మాలల వైభవమును చెప్పుచు నిదురించదు. మీరే స్వయముగ చూడుడు. కాననమందు తిరిగెడివాడును,మిక్కిలి రక్షణకలిగిన ఇండ్లలోని పెరుగును ఆస్వాదించునట్లు,నెయ్యిని త్రాగునట్లు నందగోపుడు పొందిన గోపాల కృష్ణభగవానుడు నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును, ఓ! అమ్మలారా! నాకేమియు తెలియుటలేదు.
తాయ్ వాయిల్ శొల్ కేళాళ్, తన్ ఆయత్తోడు అణైయాళ్ తడమెన్ కొంగై
యే, ఆర చ్చాన్దణియాళ్, ఎమ్బెరుమాన్ తిరువరఙ్గమెఙ్గేయెన్నుమ్,
పేయ్ మాయ ములైయుణ్డు ఇవ్వులగుణ్డ పెరువయర్ట్రిన్, పేశిల్ నఙ్గాయ్,
మామాయన్ ఎన్ మగళై చ్చెయ్ దనగళ్, మంగైమీర్ మదిక్కలేనే ll 1391
నఙ్గాయ్ = ఓ! బాలికలారా!; మంగైమీర్ = ఓ! యౌవన అంగనలారా!;తాయ్ వాయిల్ శొల్ కేళాళ్ = నా కుమార్తె తల్లియైన నాయొక్క నోటిమాటలు వినిపించుకొనదు;తన్ ఆయత్తోడు అణైయాళ్ = తనయొక్క స్నేహితురాళ్ళతో కలవదు; తడమెన్ కొంగైయే= పెద్ద మృదువైన వక్షోజములను; ఆర శాన్దు అణియాల్ = మునుపటివలె పూర్తిగ చందనముతో అలంకరించుకొనదు; ఎమ్బెరుమాన్ తిరువరఙ్గమ్ ఎఙ్గే ఎన్నుమ్ = ” నాయొక్క స్వామి కృపతో వేంచేసిన శ్రీ రంగం దివ్యదేశము ఎక్కడ! “అని చెప్పును; పేయ్ మాయ ములై ఉణ్డు=రక్కసి పూతన చనునట్లు స్తనములందు పాలను ఆస్వాదించి;(మరియు) ఇవ్వులగు ఉణ్డ = ఈ లోకములన్నింటిని ఆరగించిన; పెరు వయర్ట్రిన్ =పెద్ద ఉదరముగలవాడైన;మా మాయన్ = మిక్కిలి ఆశ్చర్యభూతుడు, ఎన్ మగళై శెయ్ దనగళ్=నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును;పేశిల్=చెప్పుటకు ప్రారంభించిన; మదిక్కలేనే = నాకు గ్రహించి చెప్పుటకు శఖ్యముకాదు!
ఓ! బాలికలారా!, ఓ! యౌవన అంగనలారా!,నా కుమార్తె, తల్లియైన నాయొక్క నోటిమాటలు వినిపించుకొనదు,తనయొక్క స్నేహితురాళ్ళతో కలవదు, పెద్ద మృదువైన వక్షోజములను మునుపటివలె పూర్తిగ చందనముతో అలంకరించు కొనదు,” నాయొక్క స్వామి కృపతో వేంచేసిన శ్రీ రంగం దివ్యదేశము ఎక్కడ! ” అని చెప్పును.రక్కసి పూతన చనునట్లు స్తనములందు పాలను ఆస్వాదించి మరియు ఈ లోకములన్నింటిని ఆరగించిన పెద్ద ఉదరముగలవాడైన మిక్కిలి ఆశ్చర్యభూతుడు నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును చెప్పుటకు ప్రారంభించిన, నాకు గ్రహించి చెప్పుటకు శఖ్యముకాదు!
పూణ్ములై మేల్ శాన్దణియాళ్, పొరుకయఱ్కణ్మైయెழுదాళ్ పూవై పేణాళ్,
ఏణరియాళ్ ఎత్తనైయుమ్, ఎమ్బెరుమాన్ తిరువరఙ్గమెఙ్గేయెన్నుమ్,
నాణ్ మలరాళ్ నాయకనాయ్, నామ్ అఱియ ఆయ్ ప్పాడి వళర్ న్దనమ్బి,
ఆణ్ మగనాయ్ ఎన్ మగళై చ్చెయ్ దనగళ్, అమ్మనైమీర్ అఱికిలేనే ll 1390
పూణ్ ములై మేల్ = ఆభరణములతో కూడిన వక్షోజములపై; శాన్దు అణియాళ్= చందనము రాసుకొనదు; పొరు కయల్ కణ్ = ఒకటితోమరొకటి పోరుసలిపెడి రెండు మత్స్యముల పోలిన నేత్రములందు;మై ఎழுదాల్=కాటుక పెట్టుకొనదు; పూవై పేణాల్=తన పెంపుడు చిలుకను ఆదరించదు;ఎత్తనైయుమ్ ఏణ్ అరియాళ్ = ఏ వస్తువును తన మనసున చితింపదు;ఎమ్బెరుమాన్ తిరువరఙ్గము ఎఙ్గే ఎన్నుమ్ =” నాయొక్క స్వామి కృపతో వేంచేసిన శ్రీ రంగం దివ్యదేశము ఎక్కడ! “అని చెప్పును; నాళ్ మలరాళ్ నాయకన్ ఆయ్ = నూన్యతగల తామరపుష్పమునందు ఉద్భవించిన శ్రీమహాలక్ష్మికి నాయకుడును; నామ్ అఱియ = మనకందరికి తెలియునట్లు; ఆయ్ పాడి వళర్ న్ద నమ్బి = గోకులమందు పెరిగిన స్వామి; ఆణ్ మగన్ ఆయ్ = యౌవన పురుషుడై; ఎన్ మగళై శెయ్ దనగళ్ = నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును;అమ్మనైమీర్=ఓ! అమ్మలారా!;అఱిగిలేనే=నాకేమియు తెలియుటలేదు.
ఆభరణములతో కూడిన వక్షోజములపై చందనము రాసుకొనదు. ఒకటితోమరొకటి పోరుసలిపెడి రెండు మత్స్యముల పోలిన నేత్రములందు కాటుక పెట్టుకొనదు.తన పెంపుడు చిలుకను ఆదరించదు.ఏ వస్తువును మనసున చితింపదు, ” నాయొక్క స్వామి కృపతో వేంచేసిన శ్రీ రంగం దివ్యదేశము ఎక్కడ! “అని చెప్పును. నూన్యతగల తామరపుష్పమునందు ఉద్భవించిన శ్రీమహాలక్ష్మికి నాయకుడును, మనకందరికి తెలియునట్లు గోకులమందు పెరిగిన స్వామి యౌవన పురుషుడై, నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును,ఓ! అమ్మలారా! నాకేమియు తెలియుటలేదు.
తాదాడు వనమాలై, తారానో ఎన్ఱెన్ఱే తళర్ న్దాళ్ కాణ్మిన్,
యాదాను మొన్ఱురైక్కిల్, ఎమ్బెరుమాన్ తిరువరఙ్గమెన్నుమ్, పూమేల్
మాదాళన్ కుడమాడి మదుశూదన్, మన్నర్కాయ్ మున్నమ్ శెన్ఱ
తూదాళన్, ఎన్ మగళై చ్చెయ్ దనగళ్, ఎఙ్గనమ్ నాన్ శొల్లుగేనే ll 1393
తాదు ఆడు వనమాలై = పుప్పొడి రేణువులతొ నిండిన వనమాలను; తారానో = నాకు ఒసగడా?; ఎన్ఱెన్ఱే తళర్ న్దాళ్ కాణ్మిన్ = అని పలుమార్లు చెప్పుచు వ్యధచెందుచున్న నా కుమార్తెను చూడుడు; యాదానుమ్ ఒన్ఱు ఉరైక్కిల్ = ఎదైన ఒకటి నేను చెప్పినచో; (దానికి బదులుగ ఆమె) ఎమ్బెరుమాన్ తిరువరఙ్గము ఎఙ్గే ఎన్నుమ్ = ” నాయొక్క స్వామి కృపతో వేంచేసిన శ్రీ రంగం దివ్యదేశము ఎక్కడ! ” అని చెప్పును; పూ మేల్ మాదు ఆళన్ = కమలవాసినికి వల్లభుడును; కుడమ్ ఆడి = కుంభనృత్యము చేసిన వాడును; మదుశూదన్=మధువను అసురిని వధించినవాడును; మున్నమ్= మునుపొక కాలమున; మన్నర్కు ఆయ్ = పాండవుల కొరకు; తూదు శెన్ఱ ఆళన్ = దూతగ వెడలిన స్వామి;ఎన్ మగళై చ్చెయ్ దనగళ్ = నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును; ఎఙ్గనమ్ నాన్ శొల్లుగేనే = ఏ విధముగ నేను చెప్పుకొందును?
పుప్పొడి రేణువులతొ నిండిన వనమాలను నాకు ఒసగడా? అని పలుమార్లు చెప్పుచు వ్యధచెందుచున్న నా కుమార్తెను చూడుడు.ఎదైన ఒకటి నేను చెప్పినచో దానికి బదులుగ ఆమె, ” నాయొక్క స్వామి కృపతో వేంచేసిన శ్రీ రంగం దివ్యదేశము ఎక్కడ! ” అని చెప్పును. కమలవాసినికి వల్లభుడును,కుంభనృత్యము చేసినవాడును, మధువను అసురిని వధించినవాడును, మునుపొక కాలమున పాండవుల కొరకు దూతగ వెడలిన స్వామి, నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును ఏ విధముగ నేను చెప్పుకొందును?
వారాళుమ్ ఇళమ్ కొంగై, వణ్ణమ్ వేఱాయిన వాఱు ఎణ్ణాళ్, ఎణ్ణిల్
పేరాళన్ పేరల్లాల్ పేశాళ్, ఇప్పెణ్ పెర్ట్రేన్ ఎన్ శెయ్ గేన్ నాన్,
తారాళన్ తణ్ కుడందై నగరాళన్, ఐవర్కాయ్ అమరిల్ ఉయ్ త్త
తేరాళన్, ఎన్ మగళై చ్చెయ్ దనగళ్, ఎఙ్గనమ్ నాన్ శెప్పుగేనే ll 1394
వార్ ఆళుమ్ = వస్త్రముచే తగినట్లు కట్టబడిన; ఇళమ్ కొంగై = (తన) యౌవన వక్షోజముల; వణ్ణమ్ వేఱు ఆయిన ఆఱు ఎణ్ణాల్ = వర్ణము మారిన విధము తలచుట లేదు; ఎణ్ణిల్ = ఏదైనను తలచుచుండినచో మనసున సర్వేశ్వరునే తలచుచు;పేరాళన్ పేర్ అల్లాల్ పేశాళ్ =ఆ సర్వేశ్వరుని నామములను తప్ప వేరొకటి చెప్పదు; ఇ పెణ్ పెర్ట్రేన్= ఇటువంటి కన్యను కనితిని;నాన్ ఎన్ శెయ్ గేన్=నేనేమి చేయగలను?; తార్ ఆళన్=దివ్యమైన మాలలచే అలంకృతుడైన; తణ్ కుడందై నగర్ ఆళన్=చల్లని తిరుకుడందై దివ్యదేశమును పాలించుచున్న స్వామియు;ఐవర్కు ఆయ్=పంచ పాండవులకొరకు; అమరిల్=మహాభారతయుద్దమున; ఉయ్ త్త తేర్ ఆళన్ = నడిపించబడిన రథమును కలవాడైన స్వామి;ఎన్ మగళై చ్చెయ్ దనగళ్ = నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును; నాన్ ఎఙ్గనమ్ శెప్పుగేనే = నేను ఏవిధముగ చెప్పగలను;
వస్త్రముచే తగినట్లు కట్టబడిన తన వక్షోజముల వర్ణము మారిన విధము తలచుటలేదు. ఏదైనను తలచుచుండినచోమనసున సర్వేశ్వరునే తలచుచు ఆ సర్వేశ్వరుని నామములను తప్ప వేరొకటి చెప్పదు.ఇటువంటి కన్యను కనితిని. నేనేమి చేయగలను?. దివ్యమైన మాలలచే అలంకృతుడైన చల్లని తిరుకుడందై దివ్యదేశమును పాలించుచున్న స్వామియు,పంచ పాండవుల కొరకు మహాభారతయుద్దమున నడిపించబడిన రథమును కలవాడైన స్వామి,నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును నేను ఏవిధముగ చెప్పగలను?.
ఉఱువాదుమిల్ ఎన్ఱెన్ఱు, ఒழிయాదు పలర్ ఏశుమ్ అలరాయిర్ట్రు ఆల్,
మఱవాదే యెప్పొழுదుమ్, మాయవనే మాదవనే యెన్గిన్ఱాళ్ ఆల్,
పిఱవాద పేరాళన్ పెణ్ణాళన్ మణ్ణాళన్, విణ్ణోర్ తఙ్గళ్
అఱవాళన్, ఎన్ మగళై చ్చెయ్ దనగళ్, అమ్మనైమీర్ అఱికిలేనే ll 1395
ఉఱువు ఆదుమ్ ఇల్=బంధువులు ఏ ఒక్కరును లేరు;ఎన్ఱెన్ఱు= అని పలుమార్లు చెప్పునట్లు;పలర్ = అనేకులు; ఒழிయాదు=నిరంతరము;ఏశుమ్ అలర్ ఆయిర్ట్రు ఆల్=నిందలు వేయువిధముగ అయిపోయినది అయ్యో!;(నా కుమార్తె మాత్రము)మఱవాదే=మరువక; ఎప్పొழுదుమ్=ఎల్లప్పుడు; మాయనే మాదవనే ఎన్గిన్ఱాళ్ ఆల్=ఆశ్చర్యభూతుడా!, మాధవుడా! అని చెప్పుచుండును అహో!; పిఱవాద=కర్మవశమున జన్మించని;పేరాళన్= గొప్పతనము కలిగిన వాడును;పెణ్ ఆళన్=వనితల హృదయమును పాలించువాడును; మణ్ ఆళన్ = భూ లోకమును పరిపాలించువాడును; విణ్ణోర్ తఙ్గళ్ అఱవాళన్ = నిత్యశూరుల విషయమున పరమ కృప కలిగినవాడును అయిన స్వామి;ఎన్ మగళై శెయ్ దనగళ్ = నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును;అమ్మనైమీర్=ఓ! అమ్మలారా!; అఱిగిలేనే= నాకేమియు తెలియుటలేదు.
బంధువులు ఏ ఒక్కరును లేరు,అని పలుమార్లు చెప్పునట్లు,అనేకులు నిరంతరము నిందలు వేయువిధముగ అయిపోయినది అయ్యో!,నా కుమార్తె మాత్రము మరువక ఆశ్చర్యభూతుడా!, మాధవుడా! అని చెప్పుచుండును అహో!,కర్మవశమున జన్మించని గొప్పతనము కలిగిన వాడును, వనితల హృదయమును పాలించువాడును, భూ లోకమును పరిపాలించువాడును,నిత్యశూరుల విషయమున పరమ కృప కలిగిన వాడును అయిన స్వామి నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును, ఓ! అమ్మలారా! నాకేమియు తెలియుటలేదు.
పన్దోడు కழల్ మరువాళ్, పైఙ్గిళియుమ్ పాలూట్టాళ్ పావై పేణాళ్,
వన్దానో తిరువరఙ్గన్, వారానో ఎన్ఱెన్ఱే వళైయుమ్ శోరుమ్ ,
శన్దోకన్ పౌழிయన్ ఐన్దழల్ ఓమ్బు, తైత్తిరియన్ శామవేది,
అన్దోవన్దు ఎన్ మగళై చ్చెయ్ దనగళ్, అమ్మనైమీర్ అఱికిలేనే ll 1396
పన్దోడు కழల్ మరువాళ్=బంతి, గచ్చకాయలు, ఈ ఆటవస్తువులను ముట్టుటలేదు; పై కిళియుమ్ = తనయొక్క పచ్చని చిలుకకు;పాల్ ఊట్టాళ్ = పాలు ఒసగుటలేదు; పావై పేణాళ్ = ఆటలాడుకొను బొమ్మలను ఆశించదు;తిరు అరఙ్గన్=” శ్రీ రంగనాథుడు; వన్దానో వారానో ఎన్ఱు ఏన్ఱే = ఏతెంచెనా? ఏతెంచడా? ” అని చెప్పుచు; వళైయుమ్ శోరుమ్=తన చేతియందుగాజులు జారిపోగొట్టుకొనును; శన్దోకన్=ఛాందోగ్యోపనిషత్తుచే ప్రతిపాద్యుడును; పౌழிయన్ = కౌషిదకీ బ్రాహ్మణముచే ప్రతిపాద్యుడును; ఐన్దు అழల్ ఓమ్బు= పంచాగ్నులచే ఆరాధింపబడువాడును; తైత్తిరియన్ =తైత్తరీయ ఉపనిషత్తుచే ప్రతిపాద్యుడును; శామవేది = సామవేదముచే ప్రతిపాదింపబడు స్వామి; వన్దు = వచ్చి; అన్దో = అయ్యో!; ఎన్ మగళై శెయ్ దనగళ్ = నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును;అమ్మనైమీర్=ఓ! అమ్మలారా!; అఱిగిలేనే=నాకేమియు తెలియుటలేదు.
బంతి, గచ్చకాయలు, ఈ ఆటవస్తువులను ముట్టుటలేదు.తనయొక్క పచ్చని చిలుకకు పాలు ఒసగుటలేదు.ఆటలాడుకొను బొమ్మలను ఆశించదు.” శ్రీ రంగనాథుడు ఏతెంచెనా? ఏతెంచడా? ” అని చెప్పుచు తన చేతియందుగాజులు జారిపోగొట్టుకొనును. ఛాందోగ్యోపనిషత్తుచే ప్రతిపాద్యుడును, కౌషిదకీ బ్రాహ్మణముచే ప్రతిపాద్యుడును,పంచాగ్నులచే ఆరాధింపబడువాడును, తైత్తరీయ ఉపనిషత్తుచే ప్రతిపాద్యుడును, సామవేదముచే ప్రతిపాదింపబడు స్వామి,వచ్చి,అయ్యో! నా కుమార్తెపై కలుగజేసిన ప్రభావమును,ఓ! అమ్మలారా! నాకేమియు తెలియుటలేదు.
** శేల్ ఉగళుమ్ వయల్ పుడై శూழ், తిరువరఙ్గత్తమ్మానై శిన్దైశెయ్ ద,
నీలమలర్ కణ్ మడవాళ్ నిఱై అழிవై, త్తాయ్ మొழிన్దవదనై, నేరార్
కాలవేల్ పరకాలన్, కలికన్ఱి యొలిమాలై కర్ట్రు వల్లార్,
మాలై శేర్ వెణ్ క్కుడైక్కీழ் మన్నవరాయ్, పొన్నులగిల్ వాழ்వర్ తామే ll 1397
శేల్ ఉగళుమ్ = మత్స్యములు త్రుళ్ళిత్రుళ్ళి ఎగురుచుండు; వయల్ పుడై శూழ்=పొలములతో చుట్టును చుట్టుకొనియున్న; తిరువరఙ్గత్తు అమ్మానై = శ్రీ రంగం దివ్యదేశమున వేంచేసియున్న సర్వేశ్వరుని; శిన్దైశెయ్ ద = ధ్యానించుచున్న;నీల మలర్ కణ్ మడవాళ్ = నీలోత్పములువలె కన్నులుగల పరకాలనాయకి యొక్క; నిఱై అழிవై = స్త్రీ సౌందర్యము నశించిన విషయమై; తాయ్ మొழிన్ద అదనై = ఆమె తల్లి చెప్పినది; నేరార్ కాలన్ = ఎదిరించిన శత్రువులకు యముడును; వేల్ పరకాలన్ = శూలాయుధము గల పరకాలన్ పేరుగలవారును; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్; ఒలి మాలై = అనుగ్రహించిన ఈ పాశురములమాలను;కర్ట్రు వల్లార్ తామ్ = అభ్యసించి అనుసంధించువారు;మాలై శేర్ వెణ్ కుడై కీழ் = ముత్యములతో కూర్చబడిన మాలలు కలిగిన తెల్లని ఛాత్రముక్రింద; మన్నవర్ ఆయ్ = మహారాజులుగ నుండి పరిపాలనచేసి; (పిదప)పొన్ ఉలగిల్ వాழ்వర్ = పరమపదమందు సుఖముగ నివసింతురు.
మత్స్యములు త్రుళ్ళిత్రుళ్ళి ఎగురుచుండు పొలములతో చుట్టును చుట్టుకొనియున్న శ్రీ రంగం దివ్యదేశమున వేంచేసియున్న సర్వేశ్వరుని ధ్యానించుచున్న నీలోత్పములువలె కన్నులుగల పరకాలనాయకి యొక్క స్త్రీ సౌందర్యము నశించిన విషయమై, ఆమె తల్లి చెప్పినది, ఎదిరించిన శత్రువులకు యముడును,శూలాయుధము గల పరకాలన్ పేరుగలవారును;తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన ఈ పాశురముల మాలను అభ్యసించి అనుసంధించువారు, ముత్యములతో కూర్చబడిన మాలలు కలిగిన తెల్లని ఛాత్రముక్రింద, మహారాజులుగ నుండి పరిపాలనచేసి, పిదప పరమపదమందు సుఖముగ నివసింతురు.
*****