శ్రీః
7. పణ్డైనాన్మఱైయుమ్
శ్రీ రంగం దివ్యదేశమున శ్రీ రంగనాధుని సేవించుకొనిన తిరుమంగై ఆళ్వార్, అమితానందముతో స్తుతించుచుచున్నారు.
** పణ్డైనాన్మఱైయుమ్ వేళ్వియుమ్ కేళ్వి ప్పదఙ్గళుమ్, పదఙ్గళిన్ పొరుళుమ్,
పిణ్ణమాయ్ విరిన్ద పిఱఙ్గొళి యనలుమ్, పెరుగియ పునలొడు నిలనుమ్,
కొణ్డల్ మారుదముమ్ కురైకడలేழுమ్, ఏழுమామలైగళుమ్ విశుమ్బుమ్,
అణ్డముమ్ తానాయ్ నిన్ఱ ఎమ్బెరుమాన్, అరఙ్గమానగర్ అమర్ న్దానే ll 1408
పణ్డై నాల్ మఱైయుమ్=అనాదికాలమునుండి నున్న నాలుగు వేదములు; వేళ్వియుమ్=యాగములును; కేళ్వి పదఙ్గళుమ్ = విని తెలుసుకొనదగిన వ్యాకరణ శాస్త్రములును; పదఙ్గళిన్ పొరుళుమ్=పదముల అర్థములును;పిణ్ణమాయ్ విరిన్ద =(మూలకారణమైన) పిండముగనుండి విస్తరించిన; పిఱఙ్గు ఒళి అనలుమ్=ఉధృతమైన కాంతిగల అగ్నిగను; పెరుగియ పునలొడు నిలనుమ్=ప్రవహించెడి జలములతోకూడ భూమియును;కొణ్డల్= మేఘములు;మారుదముమ్ = వాయువు; కురై కడల్ ఏழுమ్ = ఘోషించుచున్న సప్త సముద్రములును;ఏழு మామలైగళుమ్=ఏడు మహాకుల పర్వతములును; విశుమ్బుమ్=ఆకాశమును;(వీటితో కూడి) అణ్డముమ్ = బ్రహ్మాండము; తానాయ్ నిన్ఱ ఎమ్బెరుమాన్=” ఇదంతయు తానే ” అయి యున్నటివంటి నాయొక్క స్వామి; అరఙ్గమ్ మా నగర్ అమర్ న్దానే=శ్రీ రంగం మను పెద్ద కోవెలలో శయనకోలములో వేంచేసియున్నాడు!
అనాదికాలమునుండి నున్న నాలుగు వేదములు,యాగములును,విని తెలుసుకొనదగిన వ్యాకరణ శాస్త్రములును,పదముల అర్థములును,(మూలకారణమైన) పిండముగనుండి విస్తరించిన ఉధృతమైన కాంతిగల అగ్నిగను, ప్రవహించెడి జలములతో కూడ భూమియును,మేఘములు, వాయువు, ఘోషించుచున్నసప్త సముద్రములును, ఏడు మహాకులపర్వతములును,ఆకాశమును(వీటితో కూడి) బ్రహ్మాండము,” ఇదంతయు తానే ” అయి యున్నటివంటి నాయొక్క స్వామి శ్రీ రంగం మను పెద్ద కోవెలలో శయనకోలములో వేంచేసియున్నాడు!
ఇన్దిరన్ పిరమన్ ఈశనెన్ఱివర్ గళ్, ఎణ్ణిల్ పల్ కుణఙ్గలే యియర్ట్ర,
తందైయుమ్ తాయుమ్ మక్కళుమ్ మిక్కశుర్ట్రముమ్, శుర్ట్రి నిన్ఱు అగలా
ప్పన్దముమ్, పన్దమ్ అఱుప్పదోర్ మరున్దుమ్ పాన్మైయుం, పల్లుయిర్కెల్లామ్,
అన్దముమ్ వాழ் వుమాయ ఎమ్బెరుమాన్, అరఙ్గమానగర్ అమర్ న్దానై ll 1409
ఇన్దిరన్ పిరమన్ ఈశన్ ఎన్ఱ ఇవర్ గళ్ = ఇంద్రుడు,బ్రహ్మ,శివుడు అని చెప్పబడు ఈ దేవతలు; ఎణ్ ఇల్ = లెక్కలేని; పల్ కుణఙ్గలే యియర్ట్ర = పలు కల్యాణగుణములను స్తుతించగ;పల్ ఉయిర్కు ఎల్లామ్=అనేక జీవరాసులంతటికిని;తందైయుమ్ తాయుమ్ మక్కళుమ్ = తల్లియు, తండ్రియు, పిల్లలును; మిక్క శుర్ట్రముమ్ = పెక్కు ఙ్ఞాతులును; శుర్ట్రి నిన్ఱు అగలా పన్దముము = చుట్టుకొనియుండు విడిపోవని బంధు వర్గములును; పన్దమ్ అఱుప్పదు ఓర్ మరున్దుమ్=సంసారబంధము తెంచుకొనుటకు ఒక విలక్షణమైన మందును; పాన్మైయుం = నిర్మల స్వభావమును; అన్దముమ్ వాழ்వుమ్= వినాశము, సుఖము; ఆయ = తానే అయిన; ఎమ్బెరుమాన్ = నాయొక్క స్వామి; అరఙ్గమ్ మా నగర్ అమర్ న్దానే=శ్రీ రంగం మను పెద్ద కోవెలలో శయనకోలములో వేంచేసియున్నాడు!
ఇంద్రుడు,బ్రహ్మ,శివుడు అని చెప్పబడు ఈ దేవతలు లెక్కలేని పలు కల్యాణ గుణములను స్తుతించగ, అనేక జీవరాసులంతటికిని తల్లియు, తండ్రియు, పిల్లలును, పెక్కు ఙ్ఞాతులును, చుట్టుకొనియుండు విడిపోవని బంధువులును, సంసార బంధము తెంచుకొనుటకు ఒక విలక్షణమైన మందును,నిర్మల స్వభావమును ,వినాశము, సుఖము తానే అయిన నాయొక్క స్వామి శ్రీ రంగం మను పెద్ద కోవెలలో శయనకోలములో వేంచేసియున్నాడు! .
మన్ను మానిలనుమ్ మలైగళుమ్ కడలుమ్, వానముమ్ దానవరులగుమ్,
తున్ను మాయిరుళాయ్ త్తులఙ్గొళి శురుఙ్గి, తొల్లై నాన్మఱైగళుమ్ మఱైయ,
పిన్నుమ్ వానవర్కుమ్ మునివర్కుమ్ నల్గి, పిఱఙ్గిరుళ్ నిఱఙ్గెడ, ఒరునాళ్
అన్నమాయ్ అన్ఱఙ్గు అరుమఱై పయన్దాన్, అరఙ్గమానగర్ అమర్ న్దానై ll 1410
మన్నుమ్ మా నిలనుమ్ = స్థావరమైన భూమియు,మలైగళుమ్ = పర్వతములును; కడలుమ్ = సముద్రములును; వానముమ్ = ఆకాశమును; దానవర్ ఉలగుమ్ = దానవులయొక్క ప్రపంచము;(అయిన ఇవన్నియు)తున్ను మా ఇరుళ్ ఆయ్=దట్టమైన గొప్ప చీకటి అల్లుకొని; తులఙ్గు ఒళి శురుఙ్గి = ప్రకాశించెడి కాంతి క్షీణింపగ; తొల్లై నాల్ మఱైగళుమ్ మఱైయ=అనాదియైన నాలుగు వేదములు అదృశ్యము చెందగ; పిన్నుమ్= తరువాత; వానవర్కుమ్ మునివర్కుమ్ నల్గి=దేవతలకు,ఋషులకు కృపజేసి;పిఱఙ్గు ఇరుళ్ నిఱమ్ కెడ = నిబిడమైన చీకటి తొలగి నశించునట్లు; అన్ఱు ఒరునాళ్ = అపుడు ఒకసమయమున; అన్నమ్ ఆయ్ = హంసరూపమున అవతరించి; అఙ్గు =వారికి; అరు మఱై పయన్దాన్ = దుర్లభమైన వేదములను కలుగజేసిన సర్వేశ్వరుడు; అరఙ్గమ్ మా నగర్ అమర్ న్దానే=శ్రీ రంగం మను పెద్ద కోవెలలో శయనకోలములో వేంచేసియున్నాడు!
స్థావరమైన భూమియు,పర్వతములును,సముద్రములును,ఆకాశమును, దానవులయొక్క ప్రపంచము ,అయిన ఇవన్నియు దట్టమైన గొప్ప చీకటి అల్లుకొని, ప్రకాశించెడి కాంతి క్షీణింపగ, అనాదియైన నాలుగు వేదములు అదృశ్యము చెందగ,పిదప దేవతలకు, ఋషులకు కృపజేసి, నిబిడమైన చీకటి తొలగి నశించునట్లు ఒకసమయమున హంస రూపమున అవతరించి, వారికి దుర్లభమైన వేదములను కలుగజేసిన సర్వేశ్వరుడు ,శ్రీ రంగం మను పెద్ద కోవెలలో శయనకోలములో వేంచేసియున్నాడు!
మా యిరుమ్ కున్ఱమొన్ఱు మత్తాగ, మాశుణమ్ అదనోడుమ్ అళవి,
పా ఇరుమ్ పౌవమ్ పకడువిణ్డు అలఱ, ప్పడుతిరై విశుమ్బిడై ప్పడర,
శే ఇరు విశుమ్బుమ్ తిఙ్గళుమ్ శుడరుమ్, తేవరుమ్ తాముడన్ తిశైప్ప,
ఆయిరుమ్ తోళాల్ అలైకడల్ కడన్దాన్, అరఙ్గమానగర్ అమర్ న్దానై ll 1411
మా ఇరుమ్ కున్ఱమ్ ఒన్ఱు=ఎత్తైన విశాలమైన(మందర)ఒక పర్వతమును;మత్తు ఆగ = కవ్వము వలెను; మా శుణమ్ అదనోడుమ్ అళవి = (వాసుకి యను) మహాసర్పమును ఆ పర్వతమునకు చుట్టి; పా ఇరుమ్ పౌవమ్ = విశాలమైన, పొడుగైన సముద్రము; పకడు విణ్డు అలఱ = తన నోరు తెరచి అరచునట్లు; పడు తిరై = ఏర్పడిన అలలు; విశుమ్బు ఇడై పడర=ఆకాశపర్యంతము పోయి వ్యాపించుచుండగ;శే ఇరు విశుమ్బుమ్ = మిక్కిలి ఊర్థ్వమునగల స్వర్గాదిలోకములును; తిఙ్గళుమ్ = చంద్రుడును; శుడరుమ్= తేజోపదార్ధములును, తేవర్ తాముమ్ = దేవతలును; ఉడన్ తిశైప్ప = ఒక్కసారిగ అచ్చెరువు చెందునట్లు; అలై కడల్ = అలలుకొట్టుచున్న సముద్రమును; ఆయిరుమ్ తోళాల్ కడన్దాన్ = సహస్ర భుజములతొ చిలికిన సర్వేశ్వరుడు;అరఙ్గమ్ మా నగర్ అమర్ న్దానే=శ్రీ రంగం మను పెద్ద కోవెలలో శయనకోలములో వేంచేసియున్నాడు!
ఎత్తైన విశాలమైన(మందర)ఒక పర్వతమును కవ్వము వలెను,(వాసుకి యను) మహాసర్పమును ఆ పర్వతమునకు చుట్టి, విశాలమైన, పొడుగైన సముద్రము తన నోరు తెరచి అరచునట్లు ఏర్పడిన అలలు ఆకాశపర్యంతము పోయి వ్యాపించుచుండగ మిక్కిలి ఊర్థ్వమునగల స్వర్గాది లోకములును, చంద్రుడును, తేజోపదార్ధములును, దేవతలును ఒక్కసారిగ అచ్చెరువు చెందునట్లు అలలుకొట్టుచున్న సముద్రమును సహస్ర భుజములతొ చిలికిన సర్వేశ్వరుడు,శ్రీ రంగం మను పెద్ద కోవెలలో శయనకోలములో వేంచేసియున్నాడు !
ఎఙ్గనే ఉయ్ వర్ తానవర్ నినైన్దాల్, ఇరణియ నిలఙ్గు పూణగలమ్,
పొఙ్గు వెఙ్గురుది పొన్మలై పిళన్దు, పొழிతర అరువియొత్తు ఇழிయ,
వెఙ్గణ్ వాళ్ ఎయిర్ట్రు ఓర్ వెళ్ళి మావిలఙ్గల్, విణ్ణుఱక్కనల్ విழிత్తెழுన్దదు,
అఙ్గనే యొక్క అరియురువానాన్, అరఙ్గమానగర్ అమర్ న్దానై ll 1412
దానవర్ = దానవులు; నినైన్దాల్ = (హిరణ్యాసురుని మరణమును)తలచినచో;ఎఙ్గనే ఉయ్ వర్ = ఏ విధముగ జీవింపగలరు; ఇరణియన్ = హిరణ్యాసురునియొక్క; ఇలఙ్గు పూణ్ అగలమ్ = ఆభరణములచే ప్రకాశించుచున్న వక్షస్థలమున;పొఙ్గు వెమ్ కురుది = పొంగి పొరలు వేడి రక్తము; పొన్ మలై పిళన్దు = మేరు పర్వతమును చొచ్చుకొని; పొழிతర అరువి ఒత్తు ఇழிయ = ప్రవహించెడి జలపాతము వలె పెరుగునట్లు; వెమ్ కణ్ = తీక్షణమైన నేత్రములతోను,వాళ్ ఎయిర్ట్రు=కత్తివలె వాడియైన కోరలతోను; మా = పెద్ద; ఓర్ వెళ్ళి విలఙ్గల్ = ఒక వెండి కొండ; విణ్ ఉఱ = ఆకాశమును సమీపించి; కనల్ విழிత్తు = అగ్ని వర్షించు నేత్రములచే చూచుచు;ఎழுన్దదు అఙ్గనే ఒక్క= లేచిన ఏవిధముగ ఉండునో అటులనే నుండు;అరి ఉరువు ఆనాన్ = నరసింహరూపమున అవతరించిన సర్వేశ్వరుడు; అరఙ్గమ్ మా నగర్ అమర్ న్దానే=శ్రీ రంగం మను పెద్ద కోవెలలో శయనకోలములో వేంచేసియున్నాడు!
దానవులు,హిరణ్యాసురుని మరణమునుతలచినచో ఏ విధముగ జీవింపగలరు! హిరణ్యాసురునియొక్క ఆభరణములచే ప్రకాశించుచున్న వక్షస్థలమున,పొంగి పొరలు వేడి రక్తము మేరు పర్వతమును చొచ్చుకొని ప్రవహించెడి జలపాతము వలె పెరుగునట్లు తీక్షణమైన నేత్రములతోను,కత్తివలె వాడియైన కోరలతోను,పెద్ద ఒక వెండి కొండ, ఆకాశమును సమీపించి,అగ్ని వర్షించు నేత్రములచే చూచుచు లేచిన ఏవిధముగ ఉండునో అటులనే నుండు నరసింహరూపమున అవతరించిన సర్వేశ్వరుడు, శ్రీ రంగం అను పెద్ద కోవెలలో శయనకోలములో వేంచేసియున్నాడు!
ఆయిరమ్ కున్ఱమ్ శెన్ఱు తొక్కనైయ, అడల్ పురై యెழிల్ తిగழ் తిరళ్తోళ్,
ఆయిరన్దుణియ అడల్ మழுపర్ట్రి, మర్ట్రవన్ అగల్ విశుమ్బణైయ,
ఆయిరమ్ పెయరాల్ అమరర్ శెన్ఱిఱైఞ్జ, అఱితుయిల్ అలైకడల్ నడువే,
ఆయిరమ్ శుడర్ వాయ్ అరవణైత్తుయిన్ఱాన్, అరఙ్గమానగర్ అమర్ న్దానై ll 1413
ఆయిరమ్ కున్ఱమ్ శెన్ఱు తొక్కనైయ = వెయ్యి పర్వతములు దగ్గర చేర్చినట్లున్న;అడల్ పురై = యుద్దమునకు తగినట్లు;ఎழிల్ తిగழ் = కాంతితో ప్రకాశించు;తిరళ్ తోళ్ ఆయిరమ్ = కూడియున్న సహస్రభుజములను; తుణియ = ఖండింపబడునట్లు; అడల్ మழு పర్ట్రి=తీక్షణమైన గండ్రగొడ్డలి చేతబూని;మర్ట్రవన్=ఆ కార్త్యవీర్యార్జునుడు; అగల్ విశుమ్బు అణియ =విశాలమైన వీరస్వర్గము పొందునట్లుజేసి; అమరర్ = దేవతలు;శెన్ఱు = సమీపించి; ఆయిరమ్ పెయరాల్ ఇఱైఞ్జ = సహస్రనామములతొ స్తుతించగ;అలైకడల్ నడువే =అలలుకొట్టుచున్న సముద్రము మధ్య;శుడర్ ఆయిరమ్ వాయ్ =తేజోమయమయిన సహస్రముఖములుకలిగిన; అరవణై తుయిన్ఱాన్ = ఆదిశేషునితల్పముపై పవళించియున్న సర్వేశ్వరుడు; అరఙ్గమ్ మా నగర్ అమర్ న్దానే=శ్రీ రంగం మను పెద్ద కోవెలలో శయన కోలములో వేంచేసియున్నాడు!
వెయ్యి పర్వతములు దగ్గర చేర్చినట్లున్న,యుద్దమునకు తగినట్లు,కాంతితో ప్రకాశించు, కూడియున్న సహస్రభుజములను, ఖండింపబడునట్లు, తీక్షణమైన గండ్రగొడ్డలి చేతబూని,ఆ కార్త్యవీర్యార్జునుడు విశాలమైన వీరస్వర్గము పొందునట్లుజేసి, దేవతలు సమీపించి సహస్రనామములతొ స్తుతించగ, అలలుకొట్టుచున్న సముద్రము మధ్య, తేజోమయమయిన సహస్రముఖములుకలిగిన ఆదిశేషునితల్పముపై పవళించియున్న సర్వేశ్వరుడు,శ్రీ రంగం అను పెద్ద కోవెలలో శయనకోలములో వేంచేసియున్నాడు!
శురికుழల్ కనివాయ్ త్తిరువినై పిరిత్త, కొడుమైయిల్ కడువిశై అరక్కన్.
ఎరివిழிత్తు ఇలఙ్గు మణిముడి పొడిశెయ్ దు; ఇలఙ్గై పాழ் పడుదఱ్కెణ్ణి,
వరిశిలై వళైయ అడుశరమ్ తురన్దు, మఱికడల్ నెఱిపడ, మలైయాల్
అరికులమ్ పణికొణ్డు అలైకడలడైత్తాన్, అరఙ్గమానగర్ అమర్ న్దానై ll 1414
శురి కుழల్ = శ్లాఘ్యమైన కుంతలములు; కని వాయ్ = దొండపండువలె ఎర్రని అదరములు గల; తిరువినై=సీతాదేవిని; పిరిత్త=వేరుపరచిన; కొడుమైయిల్ కడువిశై = క్రూరమైన కార్యములు బహు శీఘ్రముగ ఒనరించు; అరక్కన్ =రావణాసురునియొక్క; ఎరి విழிత్తు ఇలఙ్గు మణి ముడి = అగ్నివలె ప్రకాశించు మణులతో పొదిగిన కిరీటములను; పొడిశెయ్ దు=ధూళిగ చేసి;ఇలఙ్గై పాழ் పడుదఱ్కు ఎణ్ణి = లంకాపురిని ధ్వంసము చేయవలెనని సంకల్పించి;(సముద్ర మార్గమునకై)వరిశిలై వళైయ = అందమైన విల్లును వంచి; అడుశరమ్ తురన్దు = మృత్యువు కలుగజేయు శరములను ఎక్కుపెట్టగ; మఱికడల్ నెఱిపడ = అలలుకొట్టుచున్న సముద్రము మార్గమొసగ; అరికులమ్ పణికొణ్డు = వానర సమూహముల కైంకర్యమును పొంది;అలై కడల్ = అలలతో ఘోషించుచున్న సముద్రమును; మలైయాల్ = పర్వతములచే; అడైత్తాన్ = సేతువు కట్టిన సర్వేశ్వరుడు; అరఙ్గమ్ మా నగర్ అమర్ న్దానే= శ్రీ రంగం మను పెద్ద కోవెలలో శయనకోలములో వేంచేసియున్నాడు!
శ్లాఘ్యమైన కుంతలములు,దొండపండువలెఎర్రని అదరములు గల సీతాదేవిని వేరుపరచిన క్రూరమైన కార్యములు బహు శీఘ్రముగ ఒనరించు రావణాసురుని యొక్క అగ్నివలె ప్రకాశించు మణులతో పొదిగిన కిరీటములను ధూళిగ చేసి,లంకాపురిని ధ్వంసముచేయవలెనని సంకల్పించి, (సముద్ర మార్గమునకై) అందమైన విల్లును వంచి మృత్యువు కలుగజేయు శరములను ఎక్కుపెట్టగ, అలలుకొట్టుచున్న సముద్రము మార్గమొసగ, వానర సమూహముల కైంకర్యమును పొంది, అలలతొ ఘోషించుచున్న సముద్రమును పర్వతములచే సేతువు కట్టిన సర్వేశ్వరుడు, శ్రీ రంగం మను పెద్ద కోవెలలో శయనకోలములో వేంచేసియున్నాడు!
ఊழிయాయ్ ఓమత్తు ఉచ్చియాయ్, ఒరుకాలుడై యతేరొరువనాయ్, ఉలగిల్
శూழிమాల్ యానైత్తుయర్ కెడుత్తు, ఇలఙ్గై మలఙ్గ అన్ఱడు శరన్దురన్దు,
పాழிయాల్ మిక్క పార్తనుక్కరుళి, పకలవన్ ఒళికెడ, పగలే
ఆழிయాల్ అన్ఱఙ్గాழிయై మఱైత్తాన్, అరఙ్గమానగర్ అమర్ న్దానై ll 1415
ఊழி ఆయ్ = కాలము మొదలగు సకల పదార్థములకు నిర్వాకుడై; ఓమత్తు ఉచ్చి ఆయ్=యఙ్ఞములకు ప్రభువై; ఒరుకాల్ ఉడైయ తేర్ ఒరువన్ ఆయ్ = ఏక చక్ర రథారూఢుడైన సూర్యునికి అంతర్యామియై; ఉలగిల్ = ఈ జగత్తులో; శూழி మాల్ యానై=ఏత్తైన అతి పెద్ద తలగల గజేంద్రుని; తుయర్ కెడుత్తు= దుఃఖమును పోగొట్టియు; అన్ఱు = మునుపొక కాలమున; ఇలఙ్గై = లంకాపురి; మలఙ్గ = కలతచెందునట్లు; అడు= మరణము కలుగజేయు ;శరమ్ తురన్దు = బాణములు ప్రయోగించియు; అన్ఱు అఙ్గు = మహాభారత యుద్దమున ఒకసమయమున; పాழிయాల్ మిక్క పార్తనుక్కు అరుళి = బలవంతుడైన అర్జునునిపై కరుణతో; పకలవన్ ఒళికెడ = సూర్యునియొక్క తేజస్సు క్షీణించునట్లు; పగలే = పట్టపగలే, ఆழிయాల్ = చక్రాయుధముతో;ఆழிయై=సూర్యుని; మఱైత్తాన్ = మరుగుపరచిన సర్వేశ్వరుడు; అరఙ్గమ్ మా నగర్ అమర్ న్దానే=శ్రీ రంగం మను పెద్ద కోవెలలో శయనకోలములో వేంచేసియున్నాడు!
కాలము మొదలగు సకల పదార్థములకు నిర్వాకుడై,యఙ్ఞములకు ప్రభువై, ఏక చక్ర రథారూఢుడైన సూర్యునికి అంతర్యామియై,ఈ జగత్తులో ఏత్తైన అతి పెద్ద తలగల గజేంద్రుని దుఃఖమును పోగొట్టియు,మునుపొకకాలమున లంకాపురి, కలతచెందునట్లు మరణము కలుగజేయు బాణములను ప్రయోగించియు; మహాభారత యుద్దమున, ఒకసమయమున,బలవంతుడైన అర్జునునిపై కరుణతో సూర్యునియొక్క తేజస్సు క్షీణించునట్లు, పట్టపగలే చక్రాయుధముతో సూర్యుని మరుగుపరచిన సర్వేశ్వరుడు శ్రీ రంగం మను పెద్ద కోవెలలో శయనకోలములో వేంచేసియున్నాడు!
పేయినార్ములై యూణ్ పిళ్ళై యాయొరుకాల్,పెరునిలమ్ విழுఙ్గియదుమిழ்న్ద
వాయనాయ్; మాలాయ్ ఆలిలై వళర్ న్దు, మణిముడి వానవర్ తమక్కు
చ్చేయనాయ్, అడియేఱ్కణియనాయ్ వన్దు, ఎన్ శిందైయుళ్ వెన్దుయరఱక్కుం,
ఆయనాయ్ అన్ఱు కున్ఱమొన్ఱెడుత్తాన్, అరఙ్గమానగర్ అమర్ న్దానై ll 1416
పేయిన్ ఆర్ ములై = పూతనయొక్క విషపూరితమైన స్తనములను; ఊణ్ పిళ్ళై ఆయ్=ఆస్వాదించు చిన్న బాలుడైనవాడును; ఒరుకాల్ = ఒకప్పుడు; పెరునిలమ్ విழுఙ్గి అదు ఉమిழ்న్ద వాయ నాయ్ = విశాలమైన భూమిని మ్రింగియు, దానిని వెలిబుచ్చిన నోరు గలవాడును; మాలాయ్ = సర్వస్వామియై; ఆలిలై వళర్ న్దు = వటదళముపై అమరి శయనించినవాడును; మణి ముడి వానవర్ తమక్కు = మణులతోనిండిన కిరీటములు కలిగిన దేవతలకు; శేయన్ ఆయ్ = దూరస్థుడును; అడియేఱ్కు = ఈ దాసునకు; అణియనాయ్ వన్దు = చేరువకు వచ్చి; ఎన్ శిందైయుళ్ వెమ్ తుయర్ అఱక్కుం = నాయొక్క హృదయమందు క్రూరమైన దుఃఖమును పోగొట్టు; అన్ఱు = మునుపొకకాలమున; ఆయన్ ఆయ్ = గోపాలకృష్ణునిగ అవతరించి; కున్ఱమ్ ఒన్ఱు ఎడుత్తాన్ = గోవర్ధన పర్వతమును గొడుగుగ పైకెత్తిన సర్వేశ్వరుడు; అరఙ్గమ్ మా నగర్ అమర్ న్దానే=శ్రీ రంగం మను పెద్ద కోవెలలో శయనకోలములో వేంచేసియున్నాడు!
పూతనయొక్క విషపూరితమైన స్తనములను ఆస్వాదించు చిన్న బాలుడైనవాడును,ఒకప్పుడు విశాలమైన భూమిని మ్రింగియు, దానిని వెలిబుచ్చిన నోరు గలవాడును,సర్వస్వామియై వటదళముపై అమరి శయనించిన వాడును, మణులతో నిండిన కిరీటములు కలిగిన దేవతలకు దూరస్థుడును, ఈ దాసునకు చేరువ వచ్చి, నాయొక్క హృదయమందు క్రూరమైన దుఃఖమును పోగొట్టు, మునుపొక కాలమున, గోపాలకృష్ణునిగ అవతరించి గోవర్ధనపర్వతమును గొడుగుగ పైకెత్తిన, సర్వేశ్వరుడు, శ్రీ రంగం మను పెద్ద కోవెలలో శయనకోలములో వేంచేసియున్నాడు!
** పొన్ను మామణియుమ్ ముత్తముమ్ శుమన్దు, పొరుతిరై మానది పుడై శూழ் న్దు,
అన్న మాడులవుమ్ అలైపునల్ శూழ் న్ద, అరఙ్గమానగర్ అమర్ న్దానై,
మన్ను మా మాడ మంగైయర్ తలైవన్, మానవేల్ కలియన్ వాయొలిగళ్,
పన్నియ పనువల్ పాడువార్, నాళుమ్ పழవినై పర్ట్రఱుప్పారే ll 1417
పొన్నుమ్ = బంగారము;మా మణియుమ్ = శ్లాఘ్యమైన మణులను;ముత్తముమ్ = ముత్యములను; శుమన్దు=మోసుకొని;పొరు తిరై మా నది=అలలుకొట్టుచున్న పెద్ద నది కావేరిచే; పుడై శూழ் న్దు=అన్ని దిశలయందు చుట్టబడినదియు;మాడు =సమీపమున; అన్నమ్ ఉలవుమ్ = హంసలు సంచరించెడి; అలై పునల్ శూழ் న్ద = అలలు కలిగిన చంద్రపుష్కరణి మొదలగు తటాకములతో చుట్టబడియున్న; అరఙ్గమానగర్ అమర్ న్దానై = శ్రీ రంగం దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై; మన్ను మా మాడ మంగైయర్ తలైవన్ = శాశ్వతమైన పెద్ద భవంతులుగల తిరుమంగై దేశవాసులకు ప్రభువైన;మానమ్ వేల్=శ్లాఘ్యమైన శూలాయుధము కలిగిన; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; వాయ్ ఒలిగళ్ పన్నియ = ముఖపద్మమునుండి దివ్య పదములచే అనుగ్రహించిన; పనువల్ = ఈ పది పాసురములు; నాళుమ్ పాడువార్ = ప్రతిదినము అనుసంధించువారు; పழ వినై పర్టు అఱుప్పారే = అనాదియైన తమ యొక్క పాపములను నిశ్శేషముగ తొలగించుకొందురు.
బంగారము,శ్లాఘ్యమైన మణులును,ముత్యములును మోసుకొని అలలు కొట్టుచున్న పెద్ద నది కావేరిచే అన్ని దిశలయందు చుట్టబడినదియు, సమీపమున హంసలు సంచరించెడి అలలు కలిగిన చంద్రపుష్కరణి మొదలగు తటాకములతో చుట్టబడియున్న శ్రీ రంగం దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై, శాశ్వతమైన పెద్ద భవంతులుగల తిరుమంగై దేశవాసులకు ప్రభువైన శ్లాఘ్యమైన శూలాయుధము కలిగిన తిరుమంగై ఆళ్వార్, ముఖపద్మమునుండి దివ్య పదములచే అనుగ్రహించిన,ఈ పది పాసురములు ప్రతిదినము అనుసంధించువారు,అనాదియైన తమ పాపములను నిశ్శేషముగ తొలగించుకొందురు.
*******