శ్రీః
8. ఏழைఏదలన్
(కోయిల్ తిరుమొழி)
తిరుమంగై ఆళ్వార్ శ్రీ రంగనాధుని దివ్య చరణారవిందములందు శరణాగతిచేయుచున్నారు.
** ఏழைఏదలన్ కీழ்మగనెన్నాదిరఙ్గి, మర్ట్రవర్కు ఇన్నరుళ్ శురన్దు,
మాழைమాన్మడనోక్కి ఉన్ తోழி, ఉమ్బియెమ్బి యెన్ఱొழிన్దిలై, ఉగన్దు
తోழన్ నీ యెనక్కిఙ్గొழி యెన్ఱ శొఱ్కల్ వన్దు, అడియేన్ మన త్తిరున్దడ,
ఆழிవణ్ణ నిన్నడియిణై అడైన్దేన్, అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే ll 1418
ఆழிవణ్ణ= సముద్రమువంటి వర్ణమును కలిగినవాడా!;అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే= అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్యదేశమున కృపతో వేంచేసియున్న స్వామీ!; ఏழை ఏదలన్ కీழ் మగన్ ఎన్నాదు ఇరఙ్గి = “ఈతడు అఙ్ఞాని,హంతకుడు, నీచజాతియందు పుట్టినవాడు”అని తలచక ఆదరముతో; మర్ట్రు అవర్కు ఇన్ అరుళ్ శురన్దు = మరియు ఆ గుహునిపై ప్రీతికరమైన కరుణకలిగి; (ఆ గుహునితో) మాழை మాన్ మడ నోక్కి=”చిన్న లేడి యొక్క కపటములేని చూపులుగల నా సతి సీతాదేవి” ఉన్ తోழி = నీయొక్క స్నేహితురాలు;ఎమ్బి ఉమ్బి=నా తమ్ముడు లక్ష్మణుడు నీయొక్క తమ్ముడు; ఎన్ఱు = అనిచెప్పి; ఒழிన్దిలై = అంతటితో నిలువక;ఉగన్దు=సంతోషముతో; నీ ఎనక్కుతోழన్ = ” నీవు నాకు పరమ మిత్రుడవు”; ఇఙ్గు ఒழி = “ఇచటనే నాయొద్ద నిలువుము”;ఎన్ఱ శొఱ్కల్ వన్దు= అని రామావతారమందు పలికిన వాక్కులు పరంపరగా అందరినోటినుండి వచ్చి నా వీనులను శోకి; అడియేన్ మనత్తు ఇరున్దడ = ఈ దాసుని హృదయమున నాటుకొనిపోయినది; (అటువంటి సర్వేశ్వరుడైన) నిన్ అడి యిణై అడైన్దేన్ = నీ యొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను.
సముద్రమువంటి వర్ణమును కలిగినవాడా!,అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్యదేశమున కృపతో వేంచేసియున్న స్వామీ!, “ఈతడు అఙ్ఞాని,హంతకుడు, నీచజాతియందు పుట్టినవాడు”అని తలచక ఆదరముతో, మరియు ఆ గుహునిపై ప్రీతికరమైన కరుణకలిగి(ఆ గుహునితో) “చిన్న లేడి యొక్క కపటములేని చూపులుగల నా సతి సీతాదేవి, నీయొక్క స్నేహితురాలు.నా తమ్ముడు లక్ష్మణుడు నీయొక్క తమ్ముడు”, అని చెప్పి అంతటితో నిలువక, సంతోషముతో ” నీవు నాకు పరమ మిత్రుడవు. ఇచటనే నాయొద్ద నిలువుము”.అని రామావతారమందు పలికిన వాక్కులు పరంపరగా అందరి నోటినుండి వచ్చి నా వీనులను శోకి ఈ దాసుని హృదయమున నాటుకొని పోయినది. (అటువంటి కల్యాణగుణములకు నిధియైన) నీ యొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను.
వాద మామగన్ మఱ్కడమ్ విలఙ్గు, మర్ట్రోర్ శాది యెన్ఱొழிన్దిలై, ఉగన్దు
కాదల్ ఆదరమ్ కడలినుమ్ పెరుగ, చ్చెయ్ తగవినుక్కు ఇల్లై కైమాఱెన్ఱు,
కోదిల్ వాయ్ మైయినా యొడుమ్ ఉడనే, ఉణ్బన్ నానెన్ఱ ఒణ్ పొరుళ్, ఎనక్కుమ్
ఆదల్ వేణ్డుమెన్ఱు అడియిణై యడైన్దేన్, అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే ll 1419
అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే = అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్యదేశమున కృపతో వేంచేసియున్న స్వామీ!; వాదమ్ మా మగన్ = వాయుదేవుని పెద్ద కుమారుడైన హనుమంతుడు; మర్ట్రు ఓర్ శాది విలఙ్గు మఱ్కడమ్ ఎన్ఱు ఒழிన్దిలై=వేరొక జాతియందు పుట్టినవాడని, మరియు ఙ్ఞానవిహీనమైన మృగమనియు,అందున మర్కటమనియు అని తలచి విడిచిపెట్టక; ఉగన్దు = మిక్కిలి ప్రీతితో; కాదల్ ఆదరమ్ కడలినుమ్ పెరుగ = ప్రేమ, ఆదరము సముద్రముకంటె అధికముకాగ;శెయ్ =(నాకితను) చేసిన; తగవినుక్కు=ఉపకారములకు;ఇల్లై కైమాఱు ఎన్ఱు=ప్రత్యుపకారములేదని తలచి; కోదిల్ వాయ్ మైయినా యొడుమ్ ఉడనే=”ఎటువంటి దోషములేని వాక్కులుగల నీతోనే కలసి(కౌగిలించికొని); ఉణ్బన్ నాన్ = నేను సంతోషింతును”;ఎన్ఱ=అని ఆ హనుమంతుని గురించి చెప్పిన; ఒణ్ పొరుళ్ = శ్లాఘ్యమైన విషయములు; ఎనక్కుమ్ ఆదల్ వేణ్డుమ్ ఎన్ఱు = ఈ దాసుని విషయమునగూడ జరుగవలెనని ఆశతో; అడి యిణై అడైన్దేన్ = నీ యొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను.
అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్యదేశమున కృపతో వేంచేసియున్న స్వామీ!, వాయుదేవుని పెద్ద కుమారుడైన హనుమంతుడు వేరొక జాతియందు పుట్టినవాడని, మరియు ఙ్ఞానవిహీనమైన మృగమనియు,అందున మర్కటమనియు అని తలచి విడిచిపెట్టక, మిక్కిలి ప్రీతితో, ప్రేమ, ఆదరము సముద్రముకంటె అధికముకాగ (నాకితను)చేసిన ఉపకారములకు ప్రత్యుపకారము లేదని తలచి “ఎటువంటి దోషములేని వాక్కులుగల నీతోనే కలసి(కౌగిలించికొని)నేను సంతోషింతును” అని ఆ హనుమంతుని గురించి చెప్పిన శ్లాఘ్యమైన విషయములు, ఈ దాసుని విషయమునగూడ జరుగవలెనని ఆశతో నీ యొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను.
కడికొళ్ పూమ్బొழிల్ కామరు పొయ్ గై, వైగు తామరై వాఙ్గియ వేழమ్,
ముడియుమ్ వణ్ణమ్ ఓర్ ముழுవలిముదలై పర్ట్ర, మర్ట్రదు నిన్ శరణనినైప్ప,
కొడియవాయ్ విలఙ్గిన్ ఉయిర్ మలఙ్గ, కొణ్డశీర్ట్ర మొన్ఱుణ్డు ఉళదరిన్దు, ఉన్
అడియేనేనుమ్ వన్దు అడియిణై అడైన్దేన్, అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే ll 1420
అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే = అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్యదేశమున కృపతో వేంచేసియున్న స్వామీ!;కడి కొళ్ పూమ్ పొழிల్ = పరిమళ భరితమైన పుష్పములతో నిండిన తోటలతో చుట్టుకొనియున్న; కామరు పొయ్ గై = అందమైన కొలనుయందు; వైగు తామరై = అచటనున్న తామరపుష్పమును; వాఙ్గియ వేழమ్ = అర్చనకై త్రుంచిన ఏనుగునకు;ముడియుమ్ వణ్ణమ్=పెద్ద ఆపద కలుగునట్లు; ఓర్ ముழு వలి ముదలై పర్ట్ర = మిక్కిలి బలిష్టమైన ఒక మొసలి పట్టుకొనగ;మర్ట్రు అదు శరణ నినైప్ప=తరువాత ఆ గజేంద్రుడు నీ దివ్యచరణారవిందములను ధ్యానింప; కొడియ వాయ్ విలఙ్గిన్ ఉయిర్ మలఙ్గ = క్రూరమైన నోరుగల మొసలి యొక్క ప్రాణము నశించునట్లు; కొణ్డ ఒన్ఱు శీర్ట్రమ్= తెచ్చుకొన్న ఒక విలక్షణమైన (భక్తులకై) కోపము; ఉణ్డు ఉళదు = కలిగినవాడై యుండుటను; అరిన్దు = తెలుసుకొని; ఉన్ అడియేనునుమ్ వన్దు = నీయొక్క దాసుడును వచ్చి;అడియిణై అడైన్దేన్ =నీ యొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను.
అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్యదేశమున కృపతో వేంచేసియున్న స్వామీ!, పరిమళ భరితమైన పుష్పములతో నిండిన తోటలతో చుట్టుకొనియున్న అందమైన కొలనుయందు, అచటనున్న తామరపుష్పమును అర్చనకై త్రుంచిన ఏనుగునకు పెద్ద ఆపద కలుగునట్లు మిక్కిలి బలిష్టమైన ఒక మొసలి పట్టుకొనగ,ఆ తరువాత ఆ గజేంద్రుడు నీ దివ్యచరణారవిందములను ధ్యానింప, క్రూరమైన నోరుగల మొసలి యొక్క ప్రాణము నశించునట్లు, తెచ్చుకొన్న ఒక విలక్షణమైన (భక్తులకై) కోపము కలిగినవాడై యుండుటను తెలుసుకొని, నీయొక్క దాసుడును వచ్చి, నీ యొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను.
నఞ్జు శోర్వదోర్ వెఞ్జిన అరవమ్, వెరువి వన్దు నిన్ శరణెన చ్చరణాయ్,
నెఞ్జిఱ్కొణ్డు నిన్నఞ్జిఱైప్పఱవైక్కు; అడైక్కలమ్ కొడుత్తు అరుళ్ శెయ్ త తఱిన్దు,
వెఞ్జొలాళర్కళ్ నమన్దమర్ కడియర్, కొడియ శెయ్ వనవుళ, అదఱ్కడియేన్
అఞ్జి వన్దు నిన్నడియిణై అడైన్దేన్, అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే ll 1421
అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే = అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్యదేశమున కృపతో వేంచేసియున్న స్వామీ!; నఞ్జు శోర్వదు = విషము కక్కుటయు; వెమ్ శినమ్ = మిక్కిలి కోపము కలగినదియు; ఓర్ అరవమ్ = సుముఖన్ అను ఒక సర్పము; వెరువి = (తనను చంపుటకై వచ్చు గరుడనకు) బయపడి; వన్దు నిన్ శరణెన=నీచెంతకు వచ్చి నీవే శరణని ప్రార్ధింప; శరణ్ ఆయ్ = నీవు రక్షకుడుగ;నెఞ్జిల్ కొణ్డు = నీ మనోరథమున నుంచుకొని; నిన్ అమ్ శిఱై పఱవైక్కు అడైక్కలమ్ కొడుత్తు అరుళ్ శెయ్ దదు=నీయొక్క అందమైన రెక్కలుగల గరుడాళ్వార్ నకు ఆ సర్పముయొక్క రక్షణ భారము ఒసగి కరుణించిన విషయమును; అడియేన్ అరిన్దు=ఈ దాసుడు తెలుసుకొని; వెమ్ శొలాళర్ గళ్=క్రూరమైన మాటలు చెప్పగలవారైన;నమన్ తమర్ = యమబటుల; కడియర్=భయంకరమైన రూపములతో; శెయ్ వన= (మరణదశయందు,ఆపైనను) చేసెడు; కొడియ = క్రూరమైన పనులు;ఉళ = అనేకములుగనుండు; అదఱ్కు=వాటికి; అడియేన్ అఞ్జి = ఈ దాసుడు బయపడి;వన్దు = నే చెంతచేరి; నిన్ అడియిణై అడైన్దేన్= నీ యొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను.
అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్యదేశమున కృపతో వేంచేసియున్న స్వామీ!,విషము కక్కుటయు,మిక్కిలి కోపముకలగినదియు,సుముఖన్ అను ఒక సర్పము తనను చంపుటకై వచ్చు గరుడనకు బయపడి నీచెంతకు వచ్చి నీవే శరణని ప్రార్ధింప నీవు రక్షకుడుగ నీ మనోరథమున నుంచుకొని నీయొక్క అందమైన రెక్కలుగల గరుడాళ్వార్ నకు ఆ సర్పముయొక్క భారము ఒసగి కరుణించిన విషయమును ఈ దాసుడు తెలుసుకొని,క్రూరమైన మాటలు చెప్పగలవారైన యమబటుల భయంకరమైన రూపములతో మరణదశయందు,ఆపైనను చేసెడు క్రూరమైన పనులు అనేకములుగనుండు వాటికి ఈ దాసుడు బయపడి నీ చెంతచేరి నీ యొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను.
మాక మానిలమ్ ముழுదుమ్ వన్దిఱైఞ్జుమ్, మలరడి క్కణ్డ మామఱైయాళన్,
తోగై మామయిలన్నవర్ ఇన్బమ్, తుర్ట్రిలామైయిల్ అత్తఇఙ్గొழிన్దు,
పోగమ్ నీ ఎయ్ ది ప్పిన్నుమ్ నమ్మిడైక్కే, పోదువాయ్ ఎన్ఱ పొన్నరుళ్, ఎనక్కుమ్
ఆకవేణ్డు మెన్ఱు అడియిణై అడైన్దేన్, అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే ll 1422
అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే = అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్య దేశpమున కృపతో వేంచేసియున్న స్వామీ!;మా కమ్ = విశాలమైన పరమాకాశమందలి నిత్యశూరులు, మా నిలమ్ = విశాలమైన భూమండలమందలి వారందరు,ముழுదుమ్=తదితర చరాచరములును;వన్దు ఇఱైఞ్జుమ్= వచ్చి సేవించుకొనుచుండెడి;మలరడి కణ్డ= (నీయొక్క)పాదపద్మములను సాక్షాత్కరించిన; మా మఱై యాళన్=గోవిందస్వామియను గొప్ప వైదిక బ్రాహ్మణుని ఉద్దేశించి; అత్త =” తండ్రీ!”(కుమారా!); నీ తోగై మా మయిల్ అన్నవర్ ఇన్బమ్ తుర్ట్రిలామైయిల్=”నీవు నెమలి యొక్క పొడుగైన ఈకలవలె కుంతలములు గల యువతుల సంభోగము అనుభవంపని కారణముచే; ఇఙ్గు ఒழிన్దు= ఇచట కొంతకాలము వసించి; పోగమ్ ఎయ్ ది = విషయభోగములు అనుభవంచి; పిన్నుమ్ = పిదప; నమ్ ఇడైక్కే పోదువాయ్ = నా వద్దకు వచ్చి చేరుము”; ఎన్ఱ పొన్ అరుళ్ = అని ఈ విధముగ చూపిన శ్లాఘ్యమైన కరుణ;ఎనక్కుమ్ ఆకవేణ్డుమ్ ఎన్ఱు = నాకును జరుగవలెనని తలచి; అడియిణై అడైన్దేన్ = నీయొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను.
అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్య దేశమున కృపతో వేంచేసియున్న స్వామీ!, విశాలమైన పరమాకాశమందలి నిత్యశూరులు, విశాలమైన భూమండలమందలి వారందరు,తదితర చరాచరములునువచ్చి సేవించుకొనుచుండెడి, నీయొక్కపాదపద్మములను సాక్షాత్కరించిన గోవిందస్వామియను గొప్ప వైదిక బ్రాహ్మణుని ఉద్దేశించి కుమారా!, ” నీవు నెమలి యొక్క ఈకలవలె అందమైన,పొడుగైన కుంతలములుగల యువతుల సంభోగము అనుభవంపని కారణముచే,ఇచట కొంతకాలము వసించి,విషయభోగములు అనుభవంచి, పిదప నా వద్దకు వచ్చి చేరుము” అని ఈ విధముగ చూపిన శ్లాఘ్యమైన కరుణ నాకును జరుగవలెనని తలచి, నీయొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను.
మన్ను నాన్మఱై మాముని పెర్ట్రమైన్దనై, మదియాద వెఙ్గూర్ట్రన్,
తన్నై యఞ్జి, నిన్ శరణెన చ్చరణాయ్, తగవిల్ కాలనై ఉకమునిన్దొழிయా,
పిన్నైయెన్ఱుమ్ నిన్ తిరువడి ప్పిరియావణ్ణమ్, ఎణ్ణియ పేరరుళ్, ఎనక్కుమ్
అన్నతాకుమెన్ఱు అడియిణై అడైన్దేన్, అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే ll 1423
అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే = అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్య దేశమున కృపతో వేంచేసియున్న స్వామీ!; మన్ను = శాశ్వతమైన;నాల్ మఱై మాముని పెర్ట్ర మైన్దనై = నాలుగు వేదములు స్తుతించు ఖ్యాతిపొందిన మృకండు మహర్షికి కలిగిన పుత్రుడు మార్కండేయుడు; మదియాద వెమ్ కూర్ట్రన్ తన్నై అఞ్జి = ఏ ఒక్కరిని పట్టించుకోని మిక్కిలి క్రూరమైన యమునకు బయపడి; నిన్ శరణెన = “నీవే నాయొక్కరక్షకుడవని శరణాగతి చేయగ “; శరణాయ్ = అతనికి రక్షకుడవై; తగవు ఇల్ కాలనై ఉగ మునిన్దు = దయాగుణములేని యముని శక్తి క్షీణించునట్లు కోపగించియు; ఒழிయా = అంతటితో నిలువక; పిన్నై = పిదప; ఎన్ఱుమ్ నిన్ తిరువడి పిరియా వణ్ణమ్ ఎణ్ణియ = ఎల్లప్పుడు (ఆ మునికుమారుడు) నీయొక్క దివ్య చరణారవిందములను విడువని విధముగ అనుగ్రహించిన; పేరరుళ్=మహనీయమైన కృప;ఎనక్కుమ్ అన్నదు ఆగుమ్= నా విషయమందుగూడ ఆవిధముగనే జరుగును; ఎన్ఱు = అని తలచుచు; అడియిణై అడైన్దేన్ = నీయొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను.
అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్య దేశమున కృపతో వేంచేసియున్న స్వామీ!,శాశ్వతమైన,నాలుగు వేదములు స్తుతించు ఖ్యాతిపొందిన, మృకండు మహర్షికి కలిగిన పుత్రుడు మార్కండేయుడు, ఏ ఒక్కరిని పట్టించుకోని మిక్కిలి క్రూరమైన యమునకు బయపడి, “నీవే నాయొక్క రక్షకుడవని శరణాగతి చేయగ ” అతనికి రక్షకుడవై,దయాగుణములేని యముని శక్తి క్షీణించునట్లు కోపగించియు, అంతటితో నిలువక, పిదప, ఎల్లప్పుడు (ఆ మునికుమారుడు) నీయొక్క దివ్య చరణారవిందములను విడువని విధముగ అనుగ్రహించిన మహనీయమైన కృప “నా విషయమందు గూడ ఆవిధముగనే జరుగును” అని తలచుచు, నీయొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను
ఓదు వాయ్ మైయుమ్ ఉవనియ పిరప్పుమ్, ఉనక్కు మున్ తన్ద అన్దణనొరువన్
కాదల్ ఎన్మగన్ పుగలిడమ్ కాణేన్, కణ్డు నీ తరువాయ్ ఎనక్కెన్ఱు,
కోదిల్ వాయ్ మైయినానునై వేణ్డియ, కుఱైముడిత్తవన్ శిఱువనై క్కొడుత్తాయ్,
ఆదలాల్ వన్దు ఉన్నడియిణై అడైన్దేన్, అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే ll 1424
అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే = అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్య దేశమున కృపతో వేంచేసియున్న స్వామీ!; ఓదు = అనుసంధించి తెలుసుకొనదగిన; వాయ్ మైయుమ్ = సత్యవచనమైన వేదమును; ఉవనియమ్ పిరప్పుమ్ = ఉపనయన సంస్కారముచే కలిగెడు పునర్జన్మము; మున్ = మునుపొకకాలమున; ఉనక్కు తన్ద = నీకు ఒసగిన; కోదిల్ వాయ్ మైయినాన్ = వ్యర్ధములుకాని సత్యమైన వచనములుగల; అన్దణన్ ఒరువన్ = సాందీపమహాముని అను ఒక బ్రాహ్మణుడు; కాదల్ ఎన్ మగన్ పుగల్ ఇడమ్ కాణేన్ =” నాయొక్క ప్రేమ చిహ్నమైన పుత్రుడు వెడలిన ప్రదేశము తెలియకున్నది; కణ్డు నీ ఎనక్కు తరువాయ్ ఎన్ఱు =నీవు వెదకి నా పుత్రుని నాకు ఒసుగుము ” అని; ఉనై వేణ్డియ = నిన్ను కోరుకొనగ; కుఱై ముడిత్తు అవన్ శిఱువనై కొడుత్తాయ్=ఆ బ్రాహ్మణుని లోటును తీర్చి అతనియొక్క బాలుని ఒసగి కృపజూపితివి; ఆదలాల్ వన్దు = అట్టి భక్తుల లోటును తీర్చు కల్యాణగుణములుగల స్వామియైన నీ చెంతచేరి; ఉన్ అడియిణై అడైన్దేన్ = నీయొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను.
అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్య దేశమున కృపతో వేంచేసియున్న స్వామీ!,అనుసంధించి తెలుసుకొనదగిన సత్యవచనమైన వేదమును, ఉపనయన సంస్కారముచే కలిగెడు పునర్జన్మము;మునుపొక కాలమున నీకు ఒసగిన వ్యర్ధములుకాని సత్యమైన వచనములుగల సాందీపమహాముని అను ఒక బ్రాహ్మణుడు ” నాయొక్క ప్రేమ చిహ్నమైన పుత్రుడు వెడలిన ప్రదేశము తెలియకున్నది. నీవు వెదకి నా పుత్రుని నాకు ఒసుగుము ” అని నిన్ను కోరుకొనగ,ఆ బ్రాహ్మణుని లోటును తీర్చి అతనియొక్క బాలుని ఒసగి కృపజూపితివి.అట్టి భక్తుల లోటును తీర్చు కల్యాణ గుణములుగల స్వామియైన నీ చెంతచేరి, నీయొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను.
వేదవాయ్ మొழி అన్దణనొరువన్, ఎందై నిన్ శరణ్ ఎన్నుడై మనైవి,
కాదల్మక్కళై పయత్తలుం కాణాళ్, కడియదోర్ తెయ్ వఙ్గొణ్డుళిక్కు మెన్ఱు అழைప్ప,
ఏదలార్ మున్నే ఇన్నరుళవర్కు శెయ్ దు, ఉన్మక్కళ్ మర్ట్రివరెన్ఱు కొడుత్తాయ్,
ఆదలాల్ వన్దు ఉన్నడియిణై అడైన్దేన్, అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే ll 1425
అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే = అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్య దేశమున కృపతో వేంచేసియున్న స్వామీ!; వేదమ్ వాయ్ మొழி=వేదములే ఎల్లప్పుడు స్తుతించు; అన్దణన్ ఒరువన్=ఒక వైదిక బ్రాహ్మణోత్తముడు;ఎందై = “నాయొక్క తండ్రీ!; నిన్ శరణ్=నీ శరణాగతుడును; ఎన్నుడై మనైవి=నాయొక్క సతీమణి; కాదల్ మక్కళై = తాను ఆశతో పొందు పిల్లలను; పయత్తలుం కాణాళ్ = పుట్టునపుడుకూడ చూడలేకున్నది; కడియదు ఓర్ తెయ్ వమ్ = క్రూర స్వభావముగల ఒక దేవత; కొణ్డు ఒళిక్కుమ్ = ఆ పిల్లలను తీసుకునిపోయి మరుగుపెట్టుచున్నది; ఎన్ఱు అழைప్ప = అని చెప్పుచు నిన్ను కాపాడమని ఎలుగెత్తి పిలువగ; ఏదలార్ మున్నే = అతనిని పరిహసించెడి విరోధుల ముంగిటనే; అవర్కు ఇన్ అరుళ్ శెయ్ దు = ఆ వైదిక బ్రాహ్మణునకు ప్రీతికరమైన కృప జేసియు;మర్ట్రు ఇవర్ ఉన్ మక్కళ్ ఎన్ఱు కొడుత్తాయ్=మరియు ” ఇదుగో వీరు మీ పిల్లలు ” అని ఒసగితివి;ఆదలాల్ వన్దు = అట్టి భక్తుల లోటును తీర్చు కల్యాణగుణములుగల స్వామియైన నీ చెంతచేరి; ఉన్ అడియిణై అడైన్దేన్ = నీయొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను
అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్య దేశమున కృపతో వేంచేసియున్న స్వామీ!,వేదములే ఎల్లప్పుడు స్తుతించు ఒక వైదిక బ్రాహ్మణోత్తముడు,”నాయొక్క తండ్రీ! నేను నీ శరణాగతుడును.”,”నాయొక్క సతీమణి తాను ఆశతో పొందు పిల్లలను పుట్టునపుడుకూడ చూడలేకున్నది.క్రూర స్వభావముగల ఒక దేవత ఆ పిల్లలను తీసుకునిపోయి మరుగుపెట్టుచున్నది”. అని చెప్పుచు నిన్ను కాపాడమని ఎలుగెత్తి పిలువగ అతనిని పరిహసించెడి విరోధుల ముంగిటనే ఆ వైదిక బ్రాహ్మణునకు ప్రీతికరమైన కృప జేసియు, మరియు ” ఇదుగో వీరు మీ పిల్లలు ” అని ఒసగితివి. అట్టి భక్తుల లోటును తీర్చు కల్యాణ గుణములుగల స్వామియైన నీ చెంతచేరి, నీయొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను.
** తుళఙ్గు నీణ్ముడి అరశర్ తమ్ కురిశిల్, తొణ్డైమన్న వన్ తిణ్ తిఱలొరువఱ్కు,
ఉళఙ్గొళ్ అన్బినోడు ఇన్నరుళ్ శురన్దు, అఙ్గోడు నాழிగై యేழுడనిరుప్ప,
వళఙ్గొళ్ మన్దిరమ్ మర్ట్రవఱ్కరుళి చ్చెయ్ దవాఱు, అడియేనఱిన్దు, ఉలగమ్
అళన్ద పొన్నడియే అడైన్దుయ్ న్దేన్, అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే ll 1426
అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానే = అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్య దేశమున కృపతో వేంచేసియున్న స్వామీ!;తుళఙ్గు = ప్రకాశించు; నీళ్ ముడి = పొడుగైన కిరీటముగల; అరశర్ తమ్ కురిశిల్ = రాజులకు రాజైన; తిణ్ తిఱల్ = మిక్కిలి బలవంతుడైన; తొణ్డై మన్న వన్ ఒరువఱ్కు = తొణ్డైదేశమునకు రాజైన ఒకనికి;ఉళమ్ కొళ్ అన్బినోడు ఇన్ అరుళ్ శురన్దు = నీయొక్క దివ్యహృదయమందుగల ప్రీతితో మధురమైన కరుణ అమితముగచేసి; అఙ్గు ఓడు నాழிగై యేழுడన్ ఇరుప్ప = తన రాజ్యవిధులను నిర్వహణముచేయుచు కొంతసమయము ఏడు తత్వములతోనే కూడియుండునట్లు; వళమ్ కొళ్ మన్దిరమ్ = శ్లాఘ్యమైన మహా తిరుమంత్రమును; మర్ట్రు = మరియు అందలి విశేషార్థములను; అవఱ్కు అరుళి శెయ్ ద ఆఱు = ఆ తొణ్డైమాన్ చక్రవర్తికి ఉపదేశించి కరుణించిన విధమును; అడియేన్ అఱిన్దు = ఈ దాసుడు తెలుసుకొని; ఉలగమ్ అళన్ద పొన్ అడియే = సర్వలోకములను కొలిచిన దివ్యమైన సుందరమైన చరణారవిందములను; అడైన్దు ఉయ్ న్దేన్ = పొంది ఉజ్జీవింపబడితిని.
అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్య దేశమున కృపతో వేంచేసియున్న స్వామీ!,ప్రకాశించు పొడుగైన కిరీటముగల రాజులకు రాజైన మిక్కిలి బలవంతుడైన తొణ్డైదేశమునకు రాజైన ఒకనికి, నీయొక్క దివ్యహృదయమందుగల ప్రీతితో, మధురమైన కరుణ అమితముగచేసి,తన రాజ్యవిధులను నిర్వహణము చేయుచు కొంతసమయము ఏడు తత్వములతోనే ( దేహాత్మాభిమానము లేకుండుట, ఆత్మస్వాతంత్ర్యము లేకుండుట, ఇతర దేవతాభిమానము లేకుండుట, శ్రీమన్నారాయణుడే ఉపాయము,సర్వేశ్వరుడే సర్వబంధువు,ఇంద్రియనిగ్రహము, భాగవత శేషత్వము) కూడియుండునట్లు, శ్లాఘ్యమైన మహా తిరుమంత్రమును, మరియు అందలి విశేషార్థములను ఆ తొణ్డైమాన్ చక్రవర్తికి ఉపదేశించి కరుణించిన విధమును ఈ దాసుడు తెలుసుకొని సర్వలోకములను కొలిచిన దివ్యమైన నీ సుందరమైన చరణారవిందములను పొంది ఉజ్జీవింపబడితిని.
** మాడమాళిగై శూழ் తిరుమంగై మన్నన్, ఒన్నలర్ తఙ్గళై వెల్లుమ్,
ఆడల్ మా వలవన్ కలికన్ఱి, అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానై,
నీడు తొల్ పుగழ் ఆழிవల్లానై, ఎన్దైయై నెడుమాలై నినైన్ద,
పాడల్ పత్తివై పాడుమిన్ తొణ్డీర్, పాడ నుమ్మిడై ప్పావమ్ నిల్లావే ll 1427
మాడ మాళిగై శూழ் = భవనములతోను,మండపములతోను చుట్టుకొనియున్న; తిరుమంగై మన్నన్ = తిరుమంగై దేశమునకు ప్రభువును; ఒన్నలర్ తఙ్గళై వెల్లుమ్ = శత్రువులను జయించెడి; ఆడల్ మా = ఆడెడి శ్లాఘ్యమైన అశ్వమును అధిరోహించి నడిపించు; వలవన్ = సామర్థ్యముగల; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్;అణి పొழிల్ తిరవరఙ్గత్తమ్మానై = అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్య దేశమున కృపతో వేంచేసియున్న సర్వేశ్వరుడును; తొల్ = అనాదినుండి వచ్చుచున్న; నీడు పుగழ் = మిక్కిలి కీర్తిగల; ఆழி వల్లానై = సుదర్శనచక్రమును ప్రయోగించు సమర్ధత గలవాడును; ఎన్దైయై = మనకు స్వామియైన; నెడుమాలై = మహాన్వితుడైన శ్రీ మన్నారాయణుని;నినైన్ద=ధ్యానించి అనుభవంచి అనుగ్రహించిన;ఇవై పత్తు పాడల్=ఈ పది పాసురములను; తొణ్డీర్ = భక్తులారా!; పాడుమిన్ = మీరు అనసంధించుడు; పాడ = అట్లు అనుసంధించిన; నుమ్ ఇడై పావమ్ నిల్లావే = మీవద్ద పాపములు నిలువలేవు కదా!
భవనములతోను, మండపములతోను చుట్టుకొనియున్న తిరుమంగై దేశమునకు ప్రభువును , శత్రువులను జయించెడి,ఆడెడి శ్లాఘ్యమైన అశ్వమును అధిరోహించి నడిపించు సామర్థ్యముగల తిరుమంగై ఆళ్వార్,అందమైన తోటలచే చుట్టబడియున్న శ్రీ రంగం దివ్య దేశమున కృపతో వేంచేసియున్న సర్వేశ్వరుడును,అనాదినుండి వచ్చుచున్న మిక్కిలి కీర్తిగల సుదర్శనచక్రమును ప్రయోగించు సమర్ధతగలవాడును, మనకు స్వామియైన, మహాన్వితుడైన శ్రీ మన్నారాయణుని ధ్యానించి అనుభవంచి అనుగ్రహించిన ఈ పది పాసురములను,భక్తులారా! మీరు అనసంధించుడు. అట్లు అనుసంధించిన, మీవద్ద పాపములు నిలువలేవు కదా!
*********