పెరియతిరుమొழி-5వపత్తు (9)

శ్రీః

9. కైయిలఙ్గు

తిరుప్పేర్ నగర్ దివ్యదేశముననిత్యవాసము చేయుచున్న అప్పకుడత్తాన్ పెరుమాళ్ ను తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు. 

** కైయిలఙ్గు ఆழி శఙ్గన్, కరుముగిల్ తిరునిఱత్తన్ ,

పొయ్యిలన్ మెయ్యన్ తన్, తాళడైవరేల్ అడిమైయాక్కుమ్,

శెయ్ అలర్ కమలమోఙ్గు, శెఱి పొழிల్  తెన్ తిరుప్పేర్, 

పైయరవణైయాన్ నామమ్, పరవి నానుయ్ న్దవాఱే  ll 1428

కై ఇలఙ్గు ఆழி శఙ్గన్ = హస్తమున ప్రకాశించు చక్రాయుధము,శంఖము కలవాడును; కరు ముగిల్  తిరు నిఱత్తన్ = కాళమేఘమువంటి దివ్య వర్ణము కలవాడును;పొయ్ ఇలన్ = శాస్త్రములయందు చెప్పబడు విలక్షణములలో అసత్యము లేనివాడును; మెయ్యన్ = తన ఆశ్రితులకు ఆ విలక్షణములను సత్యముగ కనపరచువాడును; తన్  తాళ్  అడైవర్ ఏల్ అడిమై ఆక్కుమ్=(ఎవరైనను) తన దివ్యచరణములను సేవించుటకై దరిచేరినచో వారిని నిత్యకైంకర్య నిష్టులగ చేకొనువాడును;అలర్ కమలమ్ ఓఙ్గు శెయ్ = వికసించిన తామరపుష్పములు ఉన్నతముగ ఎదిగియున్న పొలములును;శెఱి పొழிల్ =  దట్టమైన తోటలుగల; తెన్ తిరుప్పేర్=అందమైన తిరుప్పేర్ నగరములో; పై అరవు అణైయాన్=విశాలమైన పడగలుగల ఆదిశేషుని తల్పముపై పవళించియున్న సర్వేశ్వరుని; నామమ్ = దివ్యనామములను;నాన్ పరవి = నేను స్తుతించి; ఉయ్ న్ద ఆఱు ఏ = ఉజ్జీవింపబడిన విధము ఆహా అమోఘము!

హస్తమున ప్రకాశించు చక్రాయుధము,శంఖము కలవాడును,కాళమేఘమువంటి దివ్య వర్ణము కలవాడును,శాస్త్రములయందు చెప్పబడు విలక్షణములలో అసత్యము లేనివాడును,తన ఆశ్రితులకు ఆ విలక్షణములను సత్యముగ కనపరచువాడును, ఎవరైనను తన దివ్యచరణములను సేవించుటకై దరిచేరినచో వారిని నిత్యకైంకర్య నిష్టులగ చేకొనువాడును,వికసించిన తామరపుష్పములు ఉన్నతముగ ఎదిగియున్న పొలములును, దట్టమైన తోటలుగల అందమైన తిరుప్పేర్ నగరములో విశాలమైన పడగలుగల ఆదిశేషుని తల్పముపై పవళించియున్న సర్వేశ్వరుని దివ్యనామములను నేను స్తుతించి ఉజ్జీవింపబడిన విధము ఆహా అమోఘము!

వఙ్గమ్ ఆర్ కడల్ గళేழுమ్, మలైయుమ్ వానగమ్ మర్ట్రుమ్,

అఙ్గణ్ మా ఞాలమెల్లామ్, అముదశెయ్ దు ఉమిழ்న్ద ఎన్దై, 

తిఙ్గల్ మా ముగిల్ అణవు, శెఱి పొழிల్ తెన్ తిరుప్పేర్, 

ఎఙ్గళ్ మాల్ ఇఱైవన్ నామమ్, ఏత్తి నాన్ ఉయ్ న్దవాఱే  ll 1429

వఙ్గమ్ ఆర్ కడల్ గళ్ ఏழுమ్=ఓడలచే నిండియున్న సప్తసముద్రములును;మలైయుమ్ వానగమ్= కులపర్వతములును;ఆకాశమును;మర్ట్రుమ్=మరియు;అఙ్గణ్ మా ఞాలమ్ ఎల్లామ్ =  అందమైన, విశాలమైన భూమండలము,సర్వమును; అముదశెయ్ దు= (ప్రళయకాలమున) ఆరగించి; ఉమిழ்న్ద = (సృష్టికాలమున) వెలిబుచ్చిన; ఎన్దై=స్వామియు; తిఙ్గల్ మా ముగిల్ అణవు = చంద్రమండలము, మేఘమండలము తాకు; శెఱి పొழிల్ =దట్టమైన తోటలుగల; తెన్ తిరుప్పేర్ = అందమైన తిరుప్పేర్ నగరములో కృపతో వేంచేసియున్న;ఎఙ్గళ్ మాల్=మాయొక్క స్వామి;ఇఱైవన్=సర్వేశ్వరుని యొక్క; నామమ్ = దివ్యనామములను; ఏత్తి = స్తుతించి; నాన్ ఉయ్ న్ద ఆఱు ఏ = నేను ఉజ్జీవింపబడిన విధము ఆహా అమోఘము!

ఓడలచే నిండియున్న సప్తసముద్రములును,కులపర్వతములును,ఆకాశమును మరియు అందమైన, విశాలమైన భూమండలము,సర్వమును ప్రళయకాలమున ఆరగించి, సృష్టికాలమున వెలిబుచ్చిన స్వామియు,చంద్రమండలము,మేఘమండలము తాకు దట్టమైన తోటలుగల అందమైన తిరుప్పేర్ నగరములో కృపతో వేంచేసియున్న మాయొక్క స్వామి సర్వేశ్వరుని యొక్క దివ్యనామములను స్తుతించి నేను ఉజ్జీవింపబడిన విధము ఆహా అమోఘము!

ఒరువనై ఉన్దిప్పూమేల్, ఓఙ్గువిత్తు ఆకన్దన్నాల్,

ఒరువనై చ్చాబమ్ నీక్కి, ఉమ్బర్ ఆళెన్ఱు విట్టాన్,

పెరువరై మదిళ్ గళ్ శూழ் న్ద, పెరునగర్ అరవణై మేల్,

కరువరై వణ్ణన్ తన్ పేర్, కరుది నాన్ ఉయ్ న్దవాఱే  ll 1430

ఒరువనై = ఒకరైన చతుర్ముఖ బ్రహ్మను; ఉన్ది పూమేల్ = నాభి కమలముపై;ఓఙ్గువిత్తు= పెంపొదించి; ఒరువనై = మరొకరైన శివుని; అకమ్ తన్నాల్ = తన వక్షస్ధలమందలి స్వేత జలముచేత;శాబమ్ నీక్కి = బ్రహ్మ హత్యాశాపమును పోగొట్టి; ఉమ్బర్ ఆళెన్ఱు విట్టాన్=పూర్వమువలెనే పైలోకములను పాలించుకొనునట్లు చేసినవాడును; పెరువరై మదిళ్ గళ్ శూழ் న్ద=పెద్ద పర్వతములను పోలిన ప్రాకారములతొ చుట్టబడిన; పెరునగర్=తిరుప్పేర్ నగరములో; అరవు అణై మేల్ = శేషశయనముపై; కరు వరై వణ్ణన్ తన్ పేర్ = నల్లని పర్వతమువంటి వర్ణముగల సర్వేశ్వరుని దివ్య నామములను; కరుది = చింతించి; నాన్ ఉయ్ న్ద ఆఱు ఏ = నేను ఉజ్జీవింపబడిన విధము ఆహా అమోఘము!

ఒకరైన చతుర్ముఖ బ్రహ్మను నాభి కమలముపై పెంపొదించి,మరొకరైన శివుని, తన వక్షస్ధలమందలి స్వేత జలముచేత బ్రహ్మ హత్యాశాపమును పోగొట్టి, పూర్వమువలెనే పైలోకములను పాలించుకొనునట్లు చేసినవాడును,పెద్ద పర్వతములను పోలిన ప్రాకారములతొ చుట్టబడిన తిరుప్పేర్ నగరములో శేషశయనముపై నల్లని పర్వతమువంటి వర్ణముగల సర్వేశ్వరుని దివ్య నామములను చింతించి నేను ఉజ్జీవింపబడిన విధము ఆహా అమోఘము!

ఊన్ అమర్ తలైఒన్ఱేన్ది, ఉలగెల్లామ్ తిరియుమీశన్,

ఈనమర్ శాపమ్ నీక్కాయ్ ఎన్న, ఒణ్ పునలై ఈన్దాన్,

తేనమర్ పొழிల్ గళ్ శూழ் న్ద, శెఱి వయల్ తెన్ తిరుప్పేర్, 

వానవర్ తలైవన్ నామమ్,వాழ் త్తి  నాన్ ఉయ్ న్దవాఱే  ll 1431

ఊన్ అమర్ తలై ఒన్ఱు ఏన్ది = మాంసభరితమైన బ్రహ్మకపాలమును చేతియందు ధరించుకొని; ఉలగు ఎల్లామ్ = సర్వలోకములను; తిరియుమ్ ఈశన్ = (భిక్షాటనము  చేయుచు) తిరుగుచుండెడి శివుని యొక్క;ఈన్ అమర్ శాపమ్ నీక్కాయ్ ఎన్న=  బహు అల్పత్వం కలుగజేయుచున్న శాపమును పోగొట్టమని ప్రార్థింప; ఒణ్ పునలై ఈన్దాన్ = అందమైన స్వేతజలము నొసగి (ఆ కపాలమును నింపి) శాపమును తీర్చిన వాడును; తేన్ అమర్ పొழிల్ గళ్ శూழ் న్ద = తుమ్మెదలతో నిండిన తోటలతో చుట్టుకొనియున్న; శెఱి వయల్  =దట్టమైన పొలములుగల; తెన్ తిరుప్పేర్ = అందమైన తిరుప్పేర్ నగరములో కృపతో వేంచేసియున్న ; వానవర్ తలైవన్ నామమ్ = దేవాదిదేవుడైన సర్వేశ్వరుని దివ్యనామములను; వాழ் త్తి  నాన్ ఉయ్ న్దవాఱే = మంగళాశాసనముచేసి నేను ఉజ్జీవింపబడిన విధము ఆహా అమోఘము!

మాంసభరితమైన బ్రహ్మకపాలమును చేతియందు ధరించుకొని సర్వలోకములను భిక్షాటనము చేయుచు తిరుగుచుండెడి శివుని యొక్క ” తనకు బహు అల్పత్వం కలుగ జేయుచున్న శాపమును పోగొట్టమని”  ప్రార్థింప,అందమైన స్వేతజలము నొసగి (ఆ కపాలమును నింపి) శాపమును తీర్చినవాడును,తుమ్మెదలతో నిండిన తోటలతో చుట్టుకొనియున్న,దట్టమైన పొలములుగల అందమైన తిరుప్పేర్ నగరములో కృపతో వేంచేసియున్న,దేవాదిదేవుడైన సర్వేశ్వరుని దివ్యనామములను, మంగళాశాసనముచేసి నేను ఉజ్జీవింపబడిన విధము ఆహా అమోఘము!

వక్కరన్ వాయ్ మున్ కీణ్డ, మాయనేయెన్ఱు వానోర్

పుక్కు, అరణ్ తన్దరుళాయెన్న, పొన్నాగత్తానై,

నక్కు అరియురువాగి, నకమ్ కిళిర్ న్దు ఇడన్దుగన్ద,

శక్కరచ్చెల్వన్ తెన్బేర్, తలైవన్ తాళ్ అడైన్దుయ్ న్దేనే  ll 1432

మున్ = మునుపొకకాలమున;వానోర్=దేవతలు;వక్కరన్ వాయ్ కీణ్డ  మాయనే ఎన్ఱు=” దంతవక్రుని నోటిని చీల్చిన ఆశ్చర్యభూతుడా! ”  అని స్తుతించుచు; పుక్కు = వచ్చి గుమిగూడి; అరణ్ తన్దు అరుళాయ్ ఎన్న = ” మాకు రక్షణనొసగి కృపజేయవలెను ” అని ప్రార్ధింపగ;పొన్ ఆగత్తానై = హిరణ్యాసురునిని; నక్కు అరి ఉరువాగి=ఆడుచున్న నాలుకతో నరసింహ రూపముదాల్చి;కిలర్ న్దు=పెద్ద ఆకారమును పొంది;నకమ్ ఇడన్దు=తన నఖములచే చీల్చివైచి; ఉగన్ద = మిక్కిలి సంతోషించిన; శక్కర శెల్వన్ = దివ్యమైన చక్రాయుధముతో ఒప్పువాడైన; తెన్ పేర్ తలైవన్ = అందమైన తిరుప్పేర్ నగరములో కృపతో వేంచేసియున్న సర్వేశ్వరునియొక్క; తాళ్ అడైన్దు = దివ్య చరణములను ఆశ్రయించి; ఉయ్ న్దేనే  = ఉజ్జీవించతిని.

మునుపొకకాలమున దేవతలు” దంతవక్రుని నోటిని చీల్చిన ఆశ్చర్యభూతుడా!”  అని స్తుతించుచు వచ్చి గుమిగూడి,” మాకు రక్షణనొసగి కృపజేయవలెను ” అని ప్రార్ధింపగ, హిరణ్యాసురునిని, ఆడుచున్న నాలుకతో నరసింహ రూపముదాల్చి,పెద్ద ఆకారమును పొంది తన నఖములచే చీల్చివైచి మిక్కిలి సంతోషించిన, దివ్యమైన చక్రాయుధముతో ఒప్పువాడైన,అందమైన తిరుప్పేర్ నగరములో కృపతో వేంచేసియున్న సర్వేశ్వరుని దివ్య చరణములను ఆశ్రయించి ఉజ్జీవించతిని.(ఆహా!)

విలఙ్గలాల్ కడల్ అడైత్తు, విలఙ్గు ఇழைపొరుట్టు, విల్లాల్

ఇలఙ్గై మానగర్కిఱైవన్, ఇరుబదు పుయమ్ తుణిత్తాన్,

నలఙ్గొళ్ నాన్మఱైవల్లార్ గళ్, ఓత్తొలియేత్త క్కేట్టు,

మలఙ్గు పాయ్ వయల్ తిరుప్పేర్, మరువి నాన్ వాழ்న్దవాఱే  ll 1433

విలఙ్గు ఇழை పొరుట్టు=ప్రకాశించు ఆభరణములచే ఒప్పు సీతాదేవి కొరకై;విలఙ్గలాల్ కడల్ అడైత్తు = పర్వతములచే సముద్రముపై సేతువును కట్టి; (లంకాపురిని ప్రవేశించి) ఇలఙ్గై మా నగర్కు ఇఱైవన్ = ఆ లంకాపురికి ప్రభువైన రావణాసురునియొక్క; ఇరుబదు పుయమ్ = ఇరువది భుజములను; విల్లాల్ = శార్ఙ్గమను విల్లుచే; తుణిత్తాన్ = త్రుంచిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన;నలమ్ కొళ్=సద్గుణములతో అలరారు; నాల్ మఱై వల్లార్ గళ్=నాలుగు వేదములు స్తుతించు బ్రాహ్మణోత్తములు;ఓత్తు ఒలి ఏత్త= వేదముల ఘోష  చేయుచుండగ; కేట్టు = అది విని; మలఙ్గు పాయ్ = మీనములు భయముతో త్రుళ్ళి త్రుళ్ళి పరుగెడుచుండు; వయల్ = పొలములుగల; తిరుప్పేర్ = తిరుప్పేర్ నగరమును; మరువి నాన్ వాழ்న్ ద ఆఱు ఏ = పొంది నేను, సుఖము అనుభవంచిన విధము ఆహా! అమోఘము!

  ప్రకాశించు ఆభరణములచే ఒప్పు సీతాదేవి కొరకై పర్వతములచే సముద్రముపై సేతువును కట్టి (లంకాపురిని ప్రవేశించి),ఆ లంకాపురికి ప్రభువైన రావణాసురునియొక్క ఇరువది భుజములను శార్ఙ్గమను విల్లుచే త్రుంచిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన, నాలుగు వేదములు స్తుతించు బ్రాహ్మణోత్తములు, వేదముల ఘోష  చేయుచుండగ అది విని మీనములు భయముతో త్రుళ్ళి త్రుళ్ళి పరుగెడుచుండు,పొలములుగల తిరుప్పేర్ నగరమును పొంది నేను, సుఖము అనుభవించిన విధము ఆహా! అమోఘము!

వెణ్ణెయ్ తానముదశెయ్య, వెకుణ్డు మత్తు ఆయ్ చ్చి ఓచ్చి,

కణ్ణియార్ కుఱుఙ్గయిర్ట్రాల్, కట్ట వెట్టెన్ఱు ఇరున్దాన్,

తిణ్ణమా మదిళ్ గళ్ శూழ் న్ద, తెన్ తిరుప్పేరుళ్, వేలై

వణ్ణణార్ నామమ్ నాళుమ్, వాయ్ మొழிన్దు ఉయ్ న్దవాఱే  ll 1434

వెణ్ణెయ్ తాన్ అముద శెయ్య= వెన్నను బాల్యమందు తాను దొంగతనముగ సర్వము ఆరగింప; వెకుణ్డు = మిక్కిలి కోపముతో; ఆయ్ చ్చి = తల్లి యశోదాదేవి;మత్తు ఓచ్చి=కొట్టుటకై కవ్వమును పైకెత్తి; కణ్ణి ఆర్ కుఱు కయిర్ట్రాల్ కట్ట=ముడుల ముడులతోనున్న చిన్న తాడుతో కట్టగ; వెట్టెన్ఱు ఇరున్దాన్= అంగీకారముతో కట్టబడియున్నవాడును; తిణ్ణమ్ మా మదిగళ్ శూழ் న్ద = దృఢమైన పెద్ద ప్రాకారములచే చుట్టుకొనియున్న; తెన్ తిరుప్పేరుళ్ = అందమైన తిరుప్పేర్ నగరములో కృపతో వేంచేసియున్న వాడును; వేలై వణ్ణణార్ = సముద్రమువంటి వర్ణము కలగిన సర్వేశ్వరునియొక్క; నామమ్= దివ్యనామములను; నాళుమ్=ప్రతిదినము;వాయ్ మొழிన్దు=నోటితో  ఉచ్చరించుచు;ఉయ్ న్ద ఆఱు ఏ = నేను ఉజ్జీవింపబడిన విధము ఆహా! అమోఘము!

          వెన్నను బాల్యమందు తాను దొంగతనముగ సర్వము ఆరగింప,మిక్కిలి కోపముతో తల్లి యశోదాదేవి కొట్టుటకై కవ్వమును పైకెత్తి , ముడుల ముడులతోనున్నచిన్న తాడుతో కట్టగ,అంగీకారముతో కట్టబడియున్నవాడును,దృఢమైన పెద్ద ప్రాకారములచే చుట్టుకొనియున్న అందమైన తిరుప్పేర్ నగరములో కృపతో వేంచేసియున్న వాడును, సముద్రమువంటి వర్ణము కలగిన సర్వేశ్వరునియొక్క దివ్యనామములను నోటితో  ఉచ్చరించుచు నేను ఉజ్జీవింపబడిన విధము ఆహా! అమోఘము!

అమ్బొనార్ ఉలగమేழுమ్ అఱియ, ఆయ్ ప్పాడితన్నుళ్,

కొమ్బనార్ పిన్నై కోలమ్, కూడుదఱ్కు ఏఱుకొన్ఱాన్,

శెమ్బొనార్ మదిళ్ గళ్ శూழ் న్ద, తెన్ తిరుప్పేరుళ్ మేవుమ్,

ఎమ్బిరాన్ నామమ్ నాళుమ్, ఏత్తి నాన్ ఉయ్ న్దవాఱే  ll 1435

అమ్ పొన్ ఆర్ ఉలగమ్ ఏழுమ్ అఱియ=అందమైన బంగారమువలె శ్లాఘ్యమైన ఏడులోకములు తెలుసుకొనునట్లు; ఆయ్ పాడి తన్నుళ్= గోకులములో; కొమ్బనార్ పిన్నై= సున్నితమైన నప్పిన్నైపిరాట్టియొక్క; కోలమ్=శరీరమును; కూడుదఱ్కు= పొందుటకు; ఏఱు = వృషభములను; కొన్ఱాన్ = వధించిన వాడును; శెమ్ పొన్ ఆర్ మదిళ్ గళ్ శూழ் న్ద = శ్లాఘ్యమైన బంగారమువలె అందమైన ప్రాకారములచే చుట్టుకొనియున్న; తెన్ తిరుప్పేరుళ్ మేవుమ్ = అందమైన తిరుప్పేర్ నగరములో కృపతో వేంచేసియున్న; ఎమ్బిరాన్ = సర్వేశ్వరునియొక్క; నామమ్ = దివ్యనామములను, నాళుమ్ = ప్రతిదినము;ఏత్తి = స్తుతించి;నాన్ ఉయ్ న్ద ఆఱు ఏ = నేను ఉజ్జీవింపబడిన విధము ఆహా !అమోఘము!

      అందమైన బంగారమువలె శ్లాఘ్యమైన ఏడులోకములు తెలుసుకొనునట్లు గోకులములో సున్నితమైన నప్పిన్నైపిరాట్టియొక్క శరీరము పొందుటకు వృషభములను వధించినవాడును, శ్లాఘ్యమైన బంగారమువలె అందమైన ప్రాకరములచే చుట్టుకొనియున్న,అందమైన తిరుప్పేర్ నగరములో కృపతో వేంచేసియున్న,సర్వేశ్వరుని యొక్కదివ్యనామములను ప్రతిదినము  స్తుతించి నేను ఉజ్జీవింపబడిన విధము ఆహా! అమోఘము! .

నాల్ వగై వేదమ్ ఐన్దువేళ్వి, ఆఱఙ్గమ్ వల్లార్,

మేలై వానవరిల్ మిక్క, వేదియర్ ఆతికాలమ్,

శేల్ ఉగళ్ వయల్ తిరుప్పేర్,  శెఙ్గణ్మాలొడుమ్ వాழ் వార్,

శీలమాదవత్తర్ శిన్దైయాళి, ఎన్ శిన్దైయానే  ll 1436

నాల్ వగై వేదమ్ = నాలుగు వేదములందును;ఆఱు అఙ్గమ్=ఆరు వేదాంగములందును; ఐన్దు వేళ్వి = పంచ మహాయజ్ఞములందును; వల్లార్=సమర్ధులైన;మేలై వానవరిల్ మిక్క వేదియర్ =పై లోకమందు గల దేవతలకంటె మిక్కిలి పండితులైన బ్రాహ్మణోత్తములు;ఆదికాలమ్ = చిరకాలమునుండి; శేల్ ఉగళ్ వయల్ తిరుప్పేర్ = మీనములు త్రుళ్ళిత్రుళ్ళి ఎగురుచుండు పొలములుగల తిరుప్పేర్ నగరములో; శెమ్ కణ్ మాలొడుమ్=ఎర్రని తామర పుష్పమువంటి నేత్రములుగల సర్వేశ్వరునితోకూడి;వాழ் వార్= నిత్యవాసము చేయుచున్న; శీలమ్ మా తవత్తర్ = సద్గుణ సంపన్నులైన గొప్ప బ్రాహ్మణోత్తముల యొక్క;శిన్దై ఆళి=వారి  హృదయాంతరాళమును పరిపాలించు సర్వేశ్వరుడు; ఎన్ శిన్దైయానే = నాయొక్క హృదయమందు నిత్యవాసము చేయుచున్నాడు.

నాలుగు వేదములందును,ఆరు వేదాంగములందును,పంచ మహాయజ్ఞములందును సమర్ధులైన పై లోకమందుగల దేవతలకంటె మిక్కిలి పండితులైన బ్రాహ్మణోత్తములు, చిరకాలము నుండి, మీనములు త్రుళ్ళిత్రుళ్ళి ఎగురుచుండు పొలములుగల తిరుప్పేర్ నగరములో, ఎర్రని తామర పుష్పమువంటి నేత్రములుగల సర్వేశ్వరునితోకూడి నిత్యవాసము చేయుచున్న సద్గుణ సంపన్నులైన గొప్ప బ్రాహ్మణోత్తముల యొక్క హృదయాంతరాళమును పరిపాలించు సర్వేశ్వరుడు నాయొక్క హృదయమందు నిత్యవాసము చేయుచున్నాడు.

** వణ్డఱై పొழிల్ తిరుప్పేర్, వరి అరవణైయిల్, పళ్ళి

కొణ్డు, ఉఱైగిన్ఱమాలై, క్కొడి మదిళ్  మాడ మంగై,

తిణ్డిఱల్ తోళ్ కలియన్, శెఞ్జొలాల్ మొழிన్ద మాలై,

కొణ్డివై పాడియాడ, క్కూడువర్ నీళ్ విశుమ్బే  ll 1437

వణ్డు అఱై పొழிల్=తుమ్మెదలు ఝంకారములు చేయుచుండెడి తోటలుగల;తిరుప్పేర్=తిరుప్పేర్ నగరములో; వరి అరవు అణైయిల్ = చిహ్నములుగల ఆదిశేషుని తల్పముపై;  పళ్ళి కొణ్డు = శయనించి; ఉఱైగిన్ఱ మాలై = నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై;కొడి మదిళ్  మాడ మంగై= ధ్వజములతో కూడిన ప్రాకారములు,భవనములు గల తిరుమంగై దేశమున అవతరించిన;తిణ్ తిఱల్ తోళ్ కలియన్=మిక్కిలి శక్తివంతమైన భుజములుగల తిరుమంగై ఆళ్వార్; శెమ్ శొలాల్ = అందమైన పదములచే;  మొழிన్ద మాలై ఇవై = అనుగ్రహించిన ఈ పాశురములమాలను; కొణ్డు = మనస్సున స్వీకరించి; పాడి ఆడ = తన్మయత్వముతో ఆడుచు,పాడుచుండువారు; నీళ్ విశుమ్బు కూడువర్ = పరమపదమును పొందుదురు.

                తుమ్మెదలు ఝంకారములు చేయుచుండెడి తోటలుగల తిరుప్పేర్ నగరములో చిహ్నములుగల ఆదిశేషుని తల్పముపై శయనించి నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై ధ్వజములతో కూడిన ప్రాకారములు,భవనములుగల తిరుమంగై దేశమున అవతరించిన మిక్కిలి శక్తివంతమైన భుజములుగల తిరుమంగై ఆళ్వార్ అందమైన పదములచే అనుగ్రహించిన ఈ పాశురములమాలను మనస్సున స్వీకరించి తన్మయత్వముతో ఆడుచు,పాడుచుండువారు పరమపదమును పొందుదురు…

********

వ్యాఖ్యానించండి