పెరియతిరుమొழி-6వపత్తు (1)

శ్రీః 

శ్రీమతే రామనుజాయనమః

తిరుమంగై ఆళ్వార్ ముఖారవిన్దమునుండి వెలువడిన

_______________

పెరియతిరుమొழி-6వపత్తు

____________

శ్రీః

1.వణ్డుణునఱుమలర్

     తిరు విణ్ణగరమున నిత్యవాసము చేయుచున్న ఒప్పిలయప్పన్ పెరుమాళ్ ను తిరుమంగై ఆళ్వార్, శ్రీ వారి కైంకర్యసేవ కరుణించమనియు; తనకు సంసారజీవనముపై కోరికలేదనియు మిక్కిలి వేదనతో విన్నపముచేయుచున్నారు.

** వణ్డుణు నఱుమలర్ ఇణ్డై కొణ్డు, పణ్డై నమ్ వినై కెడ ఎన్ఱు, అడిమేల్

తొణ్డరుమ్ అమరరుమ్ పణియనిన్ఱు, అఙ్గణ్డమోడు అకలిడమళన్దవనే,

ఆణ్డాయ్ ఉన్నైకాణ్బదోర్, అరుళెనక్కు అరుళిదియేల్,

వేణ్డేన్ మనైవాழ்క్కైయై, విణ్ణగర్ మేయవనే  ll 1448

అమరరుమ్ = దేవతలును; తొణ్డరుమ్ = సమస్త భక్తులును; నమ్ పణ్డై వినై కెడ ఎన్ఱు=” మనయొక్క పూర్వ పాపములన్నియు నశింపవలెను ” అని తలచి; వణ్డు ఉణుమ్ నఱు మలర్ ఇణ్డై కొణ్డు = భ్రమరములు మధువును గ్రోలు పరిమళభరితమైన పుష్ప మాలలను తెచ్చి;అడిమేల్ పణియ నిన్ఱు= దివ్య చరణములందు మోకరిల్లి సేవించునట్లు నిలిచిన స్వామీ;అఙ్గు=ఆ వామనావతార కాలమున; అణ్డమోడు = అణ్డములన్నియు; అగల్ ఇడమ్ = విశాలమైన భూమిని;అళన్దవనే=దివ్య పాదములచే కొలిచినవాడా!; ఆణ్డాయ్= నన్ను పాలించు స్వామీ!; విణ్ణగర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నవాడా!; ఉన్నై కాణ్బదు ఓర్ అరుళ్ = శ్రీవారిని సేవించుకొనెడి దివ్య కృప; ఎనక్కు అరుళిది ఏల్ = నా యందు కరుణించిన యెడల;మనై వాழ்క్కైయై= (ఇక)సంసారజీవనమును; వేణ్డేన్ = ఆశించను.

  దేవతలును, సమస్త భక్తులును ” మనయొక్క పూర్వ పాపములన్నియు నశింపవలెను ” అని తలచి భ్రమరములు మధువును గ్రోలు పరిమళభరితమైన పుష్ప మాలలను తెచ్చి దివ్య చరణములందు మోకరిల్లి సేవించునట్లు నిలిచిన స్వామీ!, ఆ వామనావతార కాలమున అణ్డములన్నియు,విశాలమైన భూమిని దివ్య పాదములచే కొలిచినవాడా!,నన్ను పాలించు స్వామీ!,తిరు విణ్ణగరమున నిత్యవాసము చేయుచున్నవాడా!, శ్రీవారిని సేవించుకొను దివ్య కృప, నా యందు కరుణించిన యెడల ఇక సంసారజీవనమును ఆశించను. 

అణ్ణల్ శెయ్ దు అలైకడల్ కడైన్దు, అదనుల్ కణ్ నుదల్ నఞ్జుణ్ణక్కణ్డవనే,

విణ్ణవర్ అముద ఉణ అముదిల్ వరుమ్, పెణ్ణముదుణ్డ ఎమ్బెరుమానే,

ఆణ్డాయ్ ఉన్నైకాణ్బదోర్, అరుళెనక్కు అరుళిదియేల్,

వేణ్డేన్ మనైవాழ்క్కైయై, విణ్ణగర్ మేయవనే  ll 1449

అణ్ణల్ శెయ్ దు అలైకడల్ కడైన్దు = “తన స్వామిత్వమును”  ప్రకాశింపజేయుచు, అలలుకొట్టుచున్న సముద్రమును చిలికి; అదనుల్ నఞ్జు = ఆ సముద్రమున జనించిన కాలకూటవిషమును,కణ్ నుదల్=నుదట నేత్రముగల శివుడు;ఉణ్ణ=ఆస్వాదించునట్లు; కణ్డవనే = నియమించినవాడా!; విణ్ణవర్ అముద ఉణ = దేవతలు అముదము పానము చేయ; అముదిల్ వరుమ్ పెణ్ అముదు = ఆ అమృతమునుండి సారముగ వెడలిన శ్రీ మహాలక్ష్మియను అమృతమును; ఉణ్డ = అనుభవించిన; ఎమ్బెరుమానే = నాయొక్క స్వామీ!;ఆణ్డాయ్= నన్ను పాలించు స్వామీ!; విణ్ణగర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నవాడా!; ఉన్నై కాణ్బదు ఓర్ అరుళ్ = శ్రీవారిని సేవించుకొనెడి దివ్య కృప; ఎనక్కు అరుళిది ఏల్ = నా యందు కరుణించిన యెడల;మనై వాழ்క్కైయై= (ఇక)సంసారజీవనమును; వేణ్డేన్ = ఆశించను.

                    “తన స్వామిత్వమును”  ప్రకాశింపజేయుచు, అలలుకొట్టుచున్న సముద్రమును చిలికి, ఆ సముద్రమున జనించిన కాలకూటవిషమును నుదట నేత్రము గల శివుడు ఆస్వాదించునట్లు నియమించినవాడా!, దేవతలు అముదము పానము చేయ, ఆ అమృతమునుండి సారముగ వెడలిన శ్రీ మహాలక్ష్మియను అమృతమును అనుభవించిన నాయొక్క స్వామీ! నన్ను పాలించు స్వామీ!, తిరు విణ్ణగరమున నిత్యవాసము చేయుచున్నవాడా!, శ్రీవారిని సేవించుకొను దివ్య కృప,నా యందు కరుణించిన యెడల ఇక సంసారజీవనమును ఆశించను. 

కుழల్ నిఱవణ్ణ నిన్ కూఱుకొణ్డ, తழల్ నిఱ వణ్ణన్ నణ్ణార్ నగరమ్

విழ, ననిమలై శిలైవళైవు శెయ్ దు, అఙ్గు అழల్ నిఱ అమ్బదు వానవనే,

ఆణ్డాయ్ ఉన్నైకాణ్బదోర్, అరుళెనక్కు అరుళిదియేల్,

వేణ్డేన్ మనైవాழ்క్కైయై, విణ్ణగర్ మేయవనే  ll 1450

కుழల్ నిఱ వణ్ణ=కుంతలముల వలె నల్లని వర్ణముకలిగినవాడా!;నిన్ కూఱు కొణ్డ = నీయొక్క తిరుమేనిలో కుడిబాగము స్థానముగ గలవాడును; తழల్ నిఱ వణ్ణన్ = నిప్పుయొక్క వర్ణమువంటి వర్ణముగల శివునిచే; నణ్ణార్ నగరమ్ విழ = శత్రువులైన అసురులయొక్క త్రిపురము నాశనమగునట్లు; నని మలై= పెద్దమేరుపర్వతమువంటి; శిలై=విల్లును;వళైవు శెయ్ దు=వంగింపజేసి;అఙ్గు= ఆయుద్దమున; అழల్ నిఱ అమ్బదు ఆనవనే = అగ్ని వలె బాణమందు ఆవేశించి నిలచినవాడా!, ఆణ్డాయ్=నన్ను పాలించు స్వామీ!; విణ్ణగర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నవాడా!; ఉన్నై కాణ్బదు ఓర్ అరుళ్=శ్రీవారిని సేవించుకొనెడి దివ్య కృప; ఎనక్కు అరుళిది ఏల్ = నా యందు కరుణించిన యెడల;మనై వాழ்క్కైయై= (ఇక)సంసారజీవనమును;వేణ్డేన్ = ఆశించను.

కుంతలముల వలె నల్లని వర్ణముకలిగినవాడా!,నీయొక్క తిరుమేనిలో కుడిబాగము స్థానముగ గలవాడును,నిప్పుయొక్క వర్ణమువంటి వర్ణముగల శివునిచే శత్రువులైన అసురులయొక్క త్రిపురము నాశనమగునట్లు, పెద్దమేరుపర్వతమువంటి విల్లును వంగింపజేసి,ఆయుద్దమున అగ్ని వలె బాణమందు ఆవేశించి నిలచినవాడా!,నన్ను పాలించు స్వామీ!,తిరు విణ్ణగరమున నిత్యవాసము చేయుచున్నవాడా!, శ్రీవారిని సేవించుకొను దివ్య కృప,నా యందు కరుణించిన యెడల ఇక సంసారజీవనమును ఆశించను. 

నిలనొడు వెయ్యిల్ నిలవు ఇరుశుడరుం, ఉలగముం ఉయిర్గళముణ్డొరుకాల్

కలైతరు కుழవియిన్ ఉరువినై యాయ్, అలైకడల్ ఆలిలై వళర్ న్దవనే,

ఆణ్డాయ్ ఉన్నైకాణ్బదోర్, అరుళెనక్కు అరుళిదియేల్,

వేణ్డేన్ మనైవాழ்క్కైయై, విణ్ణగర్ మేయవనే  ll 1451

ఒరుకాల్ = (ప్రళయకాలమున ) ఒక సమయమున; నిలనొడు వెయ్యిల్ నిలవు ఇరు శుడరుం = వెన్నెలతోను ,ఎండతోను కూడి సంచరించుచున్న చంద్రుడు,సూర్యులను; ఉలగముం = లోకములను; ఉయిర్గళమ్ = అచటనున్న ప్రాణులను; ఉణ్డు = దివ్యమైన ఉదరమందుంచుకొని; కలై తరు = మిక్కిలి చిన్న ఆకారముగల; కుழవియిన్ ఉరువినై ఆయ్ = బాలుని రూపము ధరించి; అలై కడల్ = అలలుకొట్టుచున్న సముద్రమందు; ఆలిలై వళర్ న్దవనే = వటదళముపై పవళించిన సర్వేశ్వరా!; ఆణ్డాయ్=నన్ను పాలించు స్వామీ!; విణ్ణగర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నవాడా!; ఉన్నై కాణ్బదు ఓర్ అరుళ్=శ్రీవారిని సేవించుకొనెడి దివ్య కృప; ఎనక్కు అరుళిది ఏల్ = నా యందు కరుణించిన యెడల;మనై వాழ்క్కైయై= (ఇక)సంసారజీవనమును;వేణ్డేన్ = ఆశించను.

(ప్రళయకాలమున ) ఒక సమయమున,వెన్నెలతోను ఎండతోను కూడి సంచరించుచున్న చంద్రుడు,సూర్యులను,లోకములను,అచటనున్న ప్రాణులను దివ్యమైన ఉదరమందుంచుకొని,మిక్కిలి చిన్న ఆకారముగల బాలుని రూపము ధరించి అలలుకొట్టుచున్న సముద్రమందు వటదళముపై పవళించిన సర్వేశ్వరా!,నన్ను పాలించు స్వామీ!,తిరు విణ్ణగరమున నిత్యవాసము చేయుచున్నవాడా!, శ్రీవారిని సేవించుకొను దివ్య కృప,నా యందు కరుణించిన యెడల ఇక సంసారజీవనమును ఆశించను.

పారెழு కడలెழு  మలైయెழுమాయ్, శీర్ కెழுమ్ ఇవ్వులగేழுమెల్లామ్,

ఆర్ కెழு వయిర్ట్రినిల్ అడక్కినిన్ఱు, అఙ్గోరెழுత్తు ఓరురువానవనే,

ఆణ్డాయ్ ఉన్నైకాణ్బదోర్, అరుళెనక్కు అరుళిదియేల్,

వేణ్డేన్ మనైవాழ்క్కైయై, విణ్ణగర్ మేయవనే  ll 1452

పార్ ఎழு=ఏడు ద్వీపములతో కూడిన భూమికిని; కడల్ ఎழு=సప్తసముద్రములకును;  మలై ఎழுమ్ = సప్తకులపర్వతములకును; ఆయ్ = నిర్వాహకుడై; అఙ్గు = ప్రళయము వచ్చిన ఆసమయమున; శీర్ కెழுమ్ = అతి సుందరమైన; ఇ ఉలగు ఏழுమ్ ఎల్లామ్ =ఈ లోకములు ఏడును;ఆర్ కెழு వయిర్ట్రినిల్= మిక్కిలి సుందరమైన దివ్య ఉదరమున; అడక్కి నిన్ఱు = ఇముడ్చుకొన్నవాడై; ఓర్ ఏழுత్తు ఓర్ ఉరు ఆనవనే = ‘అ’ కారమునకు ముఖ్యమైన అర్థముగనున్న సర్వేశ్వరా!;ఆణ్డాయ్=నన్ను పాలించు స్వామీ!; విణ్ణగర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నవాడా!; ఉన్నై కాణ్బదు ఓర్ అరుళ్=శ్రీవారిని సేవించుకొనెడి దివ్య కృప; ఎనక్కు అరుళిది ఏల్ = నా యందు కరుణించిన యెడల;మనై వాழ்క్కైయై= (ఇక)సంసారజీవనమును;వేణ్డేన్ = ఆశించను.

  ఏడు ద్వీపములతో కూడిన భూమికిని, సప్తసముద్రములకును, సప్త కుల పర్వతములకును,నిర్వాహకుడై, ప్రళయము వచ్చిన ఆ సమయమున అతిసుందరమైన ఈ లోకములు ఏడును మిక్కిలి సుందరమైన దివ్య ఉదరమున ఇముడ్చుకొన్నవాడై,’అ’ కారమునకు ముఖ్యమైన అర్థముగనున్న సర్వేశ్వరా!,నన్ను పాలించు స్వామీ! తిరు విణ్ణగరమున నిత్యవాసము చేయుచున్నవాడా!, శ్రీవారిని సేవించుకొను దివ్య కృప నా యందు కరుణించిన యెడల ఇక సంసారజీవనమును ఆశించను.

కార్ కెழுకడల్  గళుమ్ మలైగళుమాయ్, ఏర్  కెழுమ్ ఉలగుమాగి, ముత

లార్ గళుమ్ అఱివరుమ్ నిలైయినైయాయ్, శీర్ కెழு నాన్మఱైయానవనే,

ఆణ్డాయ్ ఉన్నైకాణ్బదోర్, అరుళెనక్కు అరుళిదియేల్,

వేణ్డేన్ మనైవాழ்క్కైయై, విణ్ణగర్ మేయవనే  ll 1453

కార్ కెழு = మేఘములు మిక్కుటముగ ఆవరించుయుండు; కడల్ గళుమ్ = సముద్రములకును; మలైగళుమ్ = పర్వతములకును;ఆయ్ = ఆధారమైనవాడవును; ఏర్ కెழுమ్= మిక్కిలి సక్రమతకలిగిన; ఉలగుమ్ ఆగి = లోకములకు నిర్వాహకుడైన వాడవును; ముదలార్ గళుమ్ = ప్రధానులైన బ్రహ్మ మొదలగువారికి; అఱివు అరుమ్ నిలైయినై ఆయ్ = తెలసుకొనుటకు దుర్లభమైన స్వభావము కలిగినవాడవును;శీర్ కెழு నాల్ మఱై ఆనవనే=శ్లాఘ్యమైన నాలుగు వేదములచే ప్రతిపాదింపబడు సర్వేశ్వరా!; ఆణ్డాయ్=నన్ను పాలించు స్వామీ!; విణ్ణగర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నవాడా!; ఉన్నై కాణ్బదు ఓర్ అరుళ్=శ్రీవారిని సేవించుకొనెడి దివ్య కృప; ఎనక్కు అరుళిది ఏల్ = నా యందు కరుణించిన యెడల;మనై వాழ்క్కైయై= (ఇక)సంసార జీవనమును;వేణ్డేన్ = ఆశించను.

         మేఘములు మిక్కుటముగ ఆవరించుయుండు సముద్రములకును,  పర్వతములకును ఆధారమైనవాడవును, మిక్కిలి సక్రమతకలిగిన లోకములకు నిర్వాహకుడైనవాడవును, ప్రధానులైన బ్రహ్మ మొదలగువారికి తెలసుకొనుటకు దుర్లభమైన స్వభావము కలిగినవాడవును,శ్లాఘ్యమైన నాలుగు వేదములచే ప్రతిపాదింపబడు సర్వేశ్వరా!,నన్ను పాలించు స్వామీ!తిరు విణ్ణగరమున నిత్యవాసము చేయుచున్నవాడా!, శ్రీవారిని సేవించుకొను దివ్య కృప నా యందు కరుణించిన యెడల ఇక సంసారజీవనమును ఆశించను.

ఉరుక్కుఱునఱునెయ్ కొణ్డు ఆరழలిల్, ఇరుక్కురుమ్ అన్దణర్ శన్దియిన్వాయ్,

పెరుక్కమొడు అమరర్ గళ్ అమరనల్గుమ్, ఇరుక్కినిల్ ఇన్నిశై యానవనే,

ఆణ్డాయ్ ఉన్నైకాణ్బదోర్, అరుళెనక్కు అరుళిదియేల్,

వేణ్డేన్ మనైవాழ்క్కైయై, విణ్ణగర్ మేయవనే  ll 1454

ఇరుక్కు ఉరుమ్ అన్దణర్ = వేదములు స్తుతించు బ్రాహ్మణోత్తములు; అమరర్ గళ్= దేవతలవలన; పెరుక్కమొడు అమర =(తమయొక్క) సంపద వృద్ధికలుగునట్లు; శన్దియిన్ వాయ్=సంధ్యాకాలమందు; ఉరుక్కుఱునఱు నెయ్ కొణ్డు=కాచిన సువాసనగల నెయ్యిని తెచ్చి;ఆర్ అழలిల్ =మండుచున్న అగ్నిలో;నల్గుమ్=హోమముచేయు నపుడు; ఇరుక్కినిల్ = వేదమందుగల; ఇన్ ఇశై ఆనవనే= ప్రణవముచే ప్రతిపాద్యుడైన సర్వేశ్వరా! ఆణ్డాయ్=నన్ను పాలించు స్వామీ!; విణ్ణగర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నవాడా!; ఉన్నై కాణ్బదు ఓర్ అరుళ్=శ్రీవారిని సేవించుకొనెడి దివ్య కృప; ఎనక్కు అరుళిది ఏల్ = నా యందు కరుణించిన యెడల;మనై వాழ்క్కైయై= (ఇక)సంసారజీవనమును;వేణ్డేన్ = ఆశించను.

      వేదములు స్తుతించు బ్రాహ్మణోత్తములు,దేవతలవలన,తమయొక్క సంపద వృద్ధికలుగునట్లు సంధ్యాకాలమందు కాచిన సువాసనగల నెయ్యిని తెచ్చి,మండుచున్న అగ్నిలో హోమముచేయు నపుడు, వేదమందుగల ప్రణవముచే ప్రతిపాద్యుడైన సర్వేశ్వరా!,నన్ను పాలించు స్వామీ!తిరు విణ్ణగరమున నిత్యవాసము చేయుచున్నవాడా!, శ్రీవారిని సేవించుకొను దివ్య కృప నా యందు కరుణించిన యెడల ఇక సంసారజీవనమును ఆశించను.

కాదల్ శెయ్ దు ఇళైయవర్ కలవితరుమ్, వేదనై వినైయదు వెరువుదలామ్,

ఆదలిల్ ఉనదడి యణుగువన్ నాన్, పోదలర్ నెడుముడిప్పుణ్ణియనే,

ఆణ్డాయ్ ఉన్నైకాణ్బదోర్, అరుళెనక్కు అరుళిదియేల్,

వేణ్డేన్ మనైవాழ்క్కైయై, విణ్ణగర్ మేయవనే  ll 1455

అలర్ నెడు ముడి = ఆ ఆ కాలమందలి పుష్పములచే అమరిన పొడవైన కిరీటముగల; పుణ్ణియనే = పరిశుద్దస్వభావుడా!;ఇళైయవర్=యౌవన యువతులు;కాదల్ శెయ్ దు= ప్రేమించి; కలివితరుమ్ = వారొసెగెడిసంభోగము;వేదనై వినై అదు = దుఃఖరూపమై, ఆ కర్మములు; వెరువుదల్ ఆమ్ = నాకు మిక్కిలి భయము కలిగించునవిగ యున్నవి. ఆదలిల్ = ఆ కారణముచే; ఉనదు అడి = నీయొక్క పాదద్వందములందు;నాన్=నేను; అణుగువన్ = చేరియున్నాను;ఆణ్డాయ్=నన్ను పాలించు స్వామీ!; విణ్ణగర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నవాడా!; ఉన్నై కాణ్బదు ఓర్ అరుళ్=శ్రీవారిని సేవించుకొనెడి దివ్య కృప; ఎనక్కు అరుళిది ఏల్ = నా యందు కరుణించిన యెడల;మనై వాழ்క్కైయై= (ఇక)సంసారజీవనమును;వేణ్డేన్ = ఆశించను.

          ఆ ఆ కాలమందలి పుష్పములచే అమరిన పొడవైన కిరీటముగల పరిశుద్దస్వభావుడా!, యౌవన యువతులు ప్రేమించి,వారొసెగెడిసంభోగము, దుఃఖరూపమై ఆ కర్మములు నాకు మిక్కిలి భయము కలిగించునవిగ యున్నవి.ఆ కారణముచే నీయొక్క పాదద్వందములందు నేను చేరియున్నాను.నన్ను పాలించు స్వామీ!తిరు విణ్ణగరమున నిత్యవాసము చేయుచున్నవాడా!, శ్రీవారిని సేవించుకొను దివ్య కృప నా యందు కరుణించిన యెడల ఇక సంసారజీవనమును ఆశించను.

శాదలుమ్ పిఱత్తలుమ్ ఎన్ఱివర్ట్రై, కాదల్ శెయ్యాదునకழల్ అడైన్దేన్,

ఓతల్ శెయ్ నాన్మఱైయాగి, ఉమ్బర్ ఆదల్ శెయ్ మూ ఉరు ఆనవనే,

ఆణ్డాయ్ ఉన్నైకాణ్బదోర్, అరుళెనక్కు అరుళిదియేల్,

వేణ్డేన్ మనైవాழ்క్కైయై, విణ్ణగర్ మేయవనే  ll 1456

ఓతల్ శెయ్=పారంపర్యముగ స్తుతింపబడుచున్న;నాల్ మఱై ఆగి=నాలుగువేదములకు నిర్వాహకుడై; ఉమ్బర్ ఆదల్ శెయ్ మూ ఉరు ఆనవనే = దేవతలు గొప్పగ పరిగణించు బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు ముగ్గురికిని నియామకుడైనవాడా;శాదలుమ్ పిఱత్తలుమ్ ఎన్ఱ ఇవర్ట్రై = చనుట,పుట్టుట అను సంసారమును; కాదల్ శెయ్యాదు = ఆశించక;ఉన కழల్ అడైన్దేన్ = నీయొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను; ఆణ్డాయ్=నన్ను పాలించు స్వామీ!; విణ్ణగర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నవాడా!; ఉన్నై కాణ్బదు ఓర్ అరుళ్=శ్రీవారిని సేవించుకొనెడి దివ్య కృప; ఎనక్కు అరుళిది ఏల్ = నా యందు కరుణించిన యెడల;మనై వాழ்క్కైయై= (ఇక)సంసారజీవనమును;వేణ్డేన్ = ఆశించను.

                పారంపర్యముగ స్తుతింపబడుచున్న నాలుగువేదములకు నిర్వాహకుడై, దేవతలు గొప్పగ పరిగణించు బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు ముగ్గురికిని నియామకుడైనవాడా!,చనుట,పుట్టుట అను సంసారమును ఆశించక నీయొక్క దివ్యమైన పాదద్వందములను శరణుజొచ్చుచున్నాను.నన్ను పాలించు స్వామీ! తిరు విణ్ణగరమున నిత్యవాసము చేయుచున్నవాడా!, శ్రీవారిని సేవించుకొను దివ్య కృప నా యందు కరుణించిన యెడల ఇక సంసారజీవనమును ఆశించను.

** పూమరు పొழிల్ అణి, విణ్ణకర్ మేల్,

కామరుశీర్,  క్కలికన్ఱి శొన్న, 

పామరు తమిழிవై, పాడవల్లార్,

వామనన్ అడియిణై, మరువువరే ll 1457

పూమరు = ఎల్లప్పుడును పుష్పములు కలిగియుండెడి; పొழிల్ = తోటలతో; అణి =అలంకరింపబడి యుండు;విణ్ణకర్ మేల్ = తిరు విణ్ణగర దివ్యదేశ విషయమై; కామరు శీర్ కలికన్ఱి శొన్న=ఆశింపతగిన శ్రీ వైష్ణవలక్ష్మి గలవారైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన; పా మరు తమిழ் ఇవై = తమిళ బాషలో నున్న ఈ  పది పాశురములు; పాడవల్లార్ = పాడగలసమర్ధులు; వామనన్ అడియిణై = సర్వేశ్వరుని పాదద్వందములను; మరువువర్ = పొందుదురు.

ఎల్లప్పుడును పుష్పములు కలిగియుండెడి తోటలతో అలంకరింపబడి యుండు తిరు విణ్ణగర దివ్యదేశ విషయమై ఆశింపతగిన శ్రీ వైష్ణవలక్ష్మి గలవారైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన తమిళ బాషలో నున్న ఈ  పది పాశురములు పాడగల సమర్ధులు సర్వేశ్వరుని పాదద్వందములను పొందుదురు.

****************

వ్యాఖ్యానించండి