శ్రీః
10 . కిడన్దనమ్బి
తిరుమంగై ఆళ్వార్ తమకు పంచసంస్కాములు అనుగ్గ్రహించిన ఆచార్యుని తిరునామమును అనుసంధించి భక్తులచే అనుసంధింప జేయుచున్నారు.
** కిడన్ద నమ్బి కుడందై మేవి, క్కేழలా యులగై
యిడన్ద నమ్బి, ఎఙ్గల్ నమ్బి, ఎఱిఞ్జర్ అరణ్ అழிయ,
కడన్ద నమ్బి కడియార్ ఇలఙ్గై, ఉలగై ఈరడియాల్,
నడన్ద నమ్బి నామమ్ శొల్లిల్, నమోనారాయణమే ll 1538
కుడందై మేవి = తిరుకుడందై దివ్యదేశమున వేంచేసి; కిడన్ద నమ్బి= పవళించియున్న స్వామి; క్కేழలాయ్ = వరాహరూపముదాల్చి; ఉలగై = ఈ లోకమును; ఇడన్ద నమ్బి= అండభిత్తినుండి పెగళించి ఉద్దరించిన స్వామి; ఎఙ్గల్ నమ్బి = మాయొక్క స్వామి; ఎఱిఞ్జర్ అరణ్ అழிయ=శత్రువుల యొక్క కోట నాశనమగునట్లు;కడియార్ ఇలఙ్గై= కఠోరమైన అసురులు నివసించు లంకాపురిని; కడన్ద నమ్బి = అతిక్రమించిన స్వామి; ఉలగై = సర్వలోకములను;ఈరడియాల్=రెండడుగులచే;నడన్ద నమ్బి=కొలిచిన స్వామి అయిన సర్వేశ్వరుని యొక్క; నామమ్ శొల్లిల్ = దివ్యమైన నామమును చెప్పినయెడల; నమో నారాయణమే = అది తిరుమంత్రమే యగును.
తిరుకుడందై దివ్యదేశమున వేంచేసి పవళించియున్న స్వామి,వరాహ రూపముదాల్చి ఈలోకమును అండభిత్తినుండి పెగళించి ఉద్దరించిన స్వామి,మాయొక్క స్వామి శత్రువుల యొక్క కోట నాశనమగునట్లు కఠోరమైన అసురులు నివసించు లంకాపురిని అతిక్రమించిన స్వామి, సర్వలోకములను రెండడుగులచే కొలిచిన స్వామి అయిన సర్వేశ్వరుని యొక్క దివ్యమైన నామమును చెప్పినయెడల అది తిరుమంత్రమే యగును.
విడన్దానుడైయ అరవమ్ వెరువ, చ్చెరువిల్ ముననాళ్, మున్
తడన్దామరై నీర్ పొయ్ గైపుక్కు, మిక్క తాళాళన్,
ఇడన్దాన్ వైయమ్ కేழలాగి, ఉలగై ఈరడియాల్,
నడన్దానుడైయ నామమ్ శొల్లిల్, నమోనారాయణమే ll 1539
ముననాళ్ = మునుపొకకాలమున; విడమ్ ఉడైయ అరవమ్ తాన్ = విషము కలిగిన కాళీయుడను సర్పము; వెరువ = భీతిచెందునట్లు; మున్ = తన తోటి గోపాల బాలుర ముంగిటనే; త డమ్ తామరై నీర్ పొయ్ గై పుక్కు = పెద్ద తామర పుష్పములుగల యమునయొక్క ఒక మడుగుయందలి నీటిలో ప్రవేశించి; శెరువిల్ =ఆ కాళీయునితొ జరిగిన పోరులో; మిక్క = మిక్కిలి ఖ్యాతికలిగిన; తాళ్ ఆళన్ = నృత్యముచేసిన దివ్య పాదములు కలవాడును; కేழల్ ఆగి=వరాహమూర్తిగ అవతరించి;వైయమ్= ఈభూమిని; ఇడన్దాన్ = అండభిత్తినుండి పెగళించి ఉద్దరించినవాడును; ఈర్ అడియాల్ = రెండడుగులతొ; ఉలగై = సర్వలోకములను;నడన్దాన్ ఉడైయ=కొలిచినవానియొక్క; నామమ్ శొల్లిల్ = దివ్యమైన నామమును చెప్పినయెడల; నమో నారాయణమే = అది తిరుమంత్రమే యగును.
మునుపొకకాలమున విషము కలిగిన కాళీయుడను సర్పము భీతిచెందునట్లు,తన తోటి గోపాల బాలుర ముంగిటనే పెద్ద తామర పుష్పములుగల యమునయొక్క ఒక మడుగు యందలి నీటిలో ప్రవేశించి ఆ కాళీయునితొ జరిగిన పోరులో మిక్కిలి ఖ్యాతికలిగిన నృత్యముచేసిన దివ్య పాదములు కలవాడును, వరాహమూర్తిగ అవతరించి ఈ భూమిని అండభిత్తినుండి పెగళించి ఉద్దరించినవాడును రెండడుగులతో సర్వలోకములను కొలిచినవానియొక్క దివ్యమైన నామమును చెప్పినయెడల అది తిరుమంత్రమే యగును.
పూణాదు అనలుమ్, తఱు కణ్ వేழమ్ మఱుక,వళైమరుప్పై
ప్పేణాన్ వాఙ్గి, అముదమ్ కొణ్డ పెరుమాన్ తిరుమార్వన్,
పాణా వణ్డు మురలుమ్ కూన్దల్, ఆయ్ చ్చితయిర్ వెణ్ణెయ్,
నాణాదు ఉణ్డాన్ నామమ్ శొల్లిల్, నమోనారాయణమే ll 1540
పూణాదు = అడ్డగింప శఖ్యము కానివిధముగ; అనలుమ్ = రౌద్ర రూపముతొ నుండునదియు;తఱు కణ్= క్రూరమైన కన్నులుగల;వేழమ్ = కువలయాపీడమను ఏనుగు; మఱుక = పేగులు ముద్ద ముద్దగునట్లు; పేణాన్ = దానిని లెక్కచేయక; వళై మరుప్పై = వంగియున్న దంతములను; వాఙ్గి = పెరికివేసిన వాడును; అముదమ్ కొణ్డ పెరుమాన్ = పాలసముద్రమునుండి అమృతమును చిలికి తీసిన గొప్పతనము కలిగినవాడును; తిరు మార్వన్ = శ్రీ మహాలక్ష్మినివక్షస్థలమందు కలవాడును; వణ్డు = భ్రమరములు;పాణ్ ఆ = రాగభరితముగ;మురలుమ్ = ఝంకారము చేయు; కూన్దల్ = కొప్పుగల; ఆయ్ చ్చి=గోపస్త్రీ యశోదాదేవి ఉట్టియందుంచిన;తయిర్ వెణ్ణెయ్= పెరుగు, వెన్నను; నాణాదు ఉణ్డాన్ = సిగ్గుపడక దొంగతనమున ఆరగించిన సర్వేశ్వరుని యొక్క; నామమ్ శొల్లిల్ = దివ్యమైన నామమును చెప్పినయెడల; నమో నారాయణమే = అది తిరుమంత్రమే యగును.
అడ్డగింప శఖ్యము కానివిధముగ రౌద్ర రూపముతొ నుండునదియు,క్రూరమైన కన్నులుగల కువలయాపీడమను ఏనుగు పేగులు ముద్ద ముద్దగునట్లు, దానిని లెక్కచేయక వంగియున్న దంతములను పెరికివేసిన వాడును, పాలసముద్రమునుండి అమృతమును చిలికి తీసిన గొప్పతనము కలిగినవాడును,శ్రీ మహాలక్ష్మినివక్షస్థలమందు కలవాడును, భ్రమరములు రాగభరితముగ ఝంకారము చేయుచుండెడి కొప్పుగల గోపస్త్రీ యశోదాదేవి ఉట్టియందుంచిన పెరుగు, వెన్నను సిగ్గుపడక దొంగతనమున ఆరగించిన సర్వేశ్వరుని యొక్క దివ్యమైన నామమును చెప్పినయెడల అది తిరుమంత్రమే యగును.
కల్లార్ మదిళ్ శూழ், కచ్చి నగరుల్ నచ్చి, పాడగత్తుళ్
ఎల్లావులగుమ్ వణఙ్గ, ఇరున్ద అమ్మాన్, ఇలఙ్గైక్కోన్
వల్లాళ్ ఆగమ్, విల్లాల్ మునిన్ద ఎన్దై, విబీడణఱ్కు
నల్లానుడైయ నామమ్ శొల్లిల్, నమోనారాయణమే ll 1541
కల్ ఆర్ మదిళ్ శూழ் కచ్చి నగరుల్ నచ్చి = నల్లని రాతిచే కట్టబడిన ప్రాకరములతో చుట్టుకొనియున్న కాంచీపురములో నివసింప ఆశతో; ఎల్లా ఉలగుమ్ వణఙ్గ = సమస్త లోకములు సేవించుకొనునట్లు; పాడగత్తుళ్ ఇరున్ద అమ్మాన్ = తిరు పాడగమను దివ్య దేశమున కృపతో వేంచేసియున్న స్వామియు; ఇలఙ్గై కోన్ = లంకాపురికి ప్రభువైన రావణాసురునియొక్క; వల్ ఆళ్ ఆగమ్ = మిక్కిలి బలిష్టమైన శరీరమును; విల్లాల్ మునిన్ద = శార్ఙ్గమను విల్లుచే కోపముతో ఛిన్నాభిన్నముచేసిన; ఎన్దై = నాయొక్క స్వామియు; విబీడణఱ్కు నల్లానుడైయ = విభీషణుని విషయమై ప్రీతికలవాడైన సర్వేశ్వరుని; నామమ్ శొల్లిల్ = దివ్యమైన నామమును చెప్పినయెడల; నమో నారాయణమే = అది తిరుమంత్రమే యగును.
నల్లని రాతిచే కట్టబడిన ప్రాకరములతో చుట్టుకొనియున్న కాంచీపురములో నివసింపవలెనని ఆశతో సమస్త లోకములు సేవించుకొనునట్లు తిరు పాడగమను దివ్య దేశమున కృపతో వేంచేసియున్న స్వామియు, లంకాపురికి ప్రభువైన రావణాసురుని యొక్క మిక్కిలి బలిష్టమైన శరీరమును శార్ఙ్గమను విల్లుచే కోపముతో ఛిన్నాభిన్నము చేసిన నాయొక్క స్వామియు,విభీషణుని విషయమై ప్రీతికలవాడైన సర్వేశ్వరునియొక్క దివ్యమైన నామమును చెప్పినయెడల అది తిరుమంత్రమే యగును.
కుడైయా వరైయాల్, నిరైమున్ కాత్త పెరుమాన్, మరువాద
విడై తానేழுమ్ వెన్ఱాన్, కోవల్ నిన్ఱాన్, తెన్నిలఙ్గై
అడైయా అరక్కర్ వీయ పొరుదు, మేవి వెఙ్గూర్ట్రమ్,
నడైయా వుణ్ణ క్కణ్డాన్ నామమ్, నమోనారాయణమే ll 1542
మున్= మునుపొకకాలమున; కుడై ఆమ్ వరైయాల్ = గొడుగుగ చేసుకొని పైకెత్తిన గోవర్ధనపర్వతము వలన; నిరై = గోవుల సమూహములను; కాత్త పెరుమాన్ = (పెద్ద వర్షమునుండి) సంరక్షించిన స్వామియు; మరువాద విడై ఏழுమ్ తాన్ వెన్ఱాన్ = ఎదిరించిన ఏడు వృషభములను తాను వధించినవాడును; కోవల్ నిన్ఱాన్ = తిరు కోవలూర్ దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో నిత్యవాసము చేయుచున్న వాడును; తెన్ ఇలఙ్గై అడైయా = అందమైన లంకాపురిలో తనను ఆశ్రయించని;అరక్కర్ వీయ పొరుదు = అసురులు మరణించునట్లు పోరుసంకల్పించి; వెమ్ కూర్ట్రమ్ = క్రూరమైన యముడు; మేవి = ఎట్టి భయములేక అమరి; నడైయా=అదియే తన పనిగ; ఉణ్ణ కణ్డాన్ = (లంకాపురియందు అసురులను) భక్షించునట్లు చేసిన సర్వేశ్వరుని యొక్క;నామమ్ శొల్లిల్ = దివ్యమైన నామమును చెప్పినయెడల;నమో నారాయణమే= అది తిరుమంత్రమే యగును.
మునుపొకకాలమున గొడుగుగ చేసుకొని పైకెత్తిన గోవర్ధనపర్వతమువలన గోవుల సమూహములను (పెద్ద వర్షమునుండి) సంరక్షించిన స్వామియు,ఎదిరించిన ఏడు వృషభములను తాను వధించినవాడును,తిరు కోవలూర్ దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో నిత్యవాసము చేయుచున్న వాడును,అందమైన లంకాపురిలో తనను ఆశ్రయించని అసురులు మరణించునట్లు పోరుసంకల్పించి క్రూరమైన యముడు ఎట్టి భయములేక అమరి,అదియే తన పనిగ, లంకాపురియందు అసురులను భక్షించునట్లు చేసిన సర్వేశ్వరుని యొక్క దివ్యమైన నామమును చెప్పిన యెడల అది తిరుమంత్రమే యగును.
కాన ఎణ్గుమ్ కురఙ్గుమ్, ముశువుమ్ పడైయా, అడల్ అరక్కర్
మాన మழிత్తునిన్ఱ, వెన్ఱియమ్మాన్, ఎనక్కెన్ఱుమ్
తేనుమ్ పాలుమ్ అముదుమాయ, తిరుమాల్ తిరునామమ్,
నానుమ్ శొన్నేన్ నమరుమ్ ఉరైమిన్, నమోనారాయణమే ll 1543
కానమ్ ఎణ్గుమ్=అడవి ఎలుగుబంట్లను;కురఙ్గుమ్=కోతులను;ముశువుమ్= ‘ముశు’ అను వంశపు వానరములను; పడైయా = తనయొక్క సేనగ చేసుకొని;అడల్ అరక్కర్ = క్రూరమైన రాక్షసులయొక్క; మానమ్ = దురభిమానమును; అழிత్తు నిన్ఱ=నశింపజేసిన; వెన్ఱియ అమ్మాన్=జయశీలుడైన స్వామి; తిరుమాల్ తిరునామమ్ = ఆ శ్రియఃపతి యొక్క దివ్యనామము; ఎనక్కు ఎన్ఱుమ్=ఈ దాసునికి ఎల్లప్పుడును;తేనుమ్ పాలుమ్ అముదుమ్ ఆయ = తేనె,పాలు వలె పరమభోగ్యుముగనున్న; నమోనారాయణమే =తిరుమంత్రమే; నానుమ్ శొన్నేన్= అది నేనును ఉచ్ఛరించితిని; నమరుమ్ ఉరైమిన్ = నాయొక్క ఆప్తులైన మీరును అనుసంధించండి.
అడవి ఎలుగుబంట్లను,కోతులను,’ముశు’ అను వంశపు వానరములను తనయొక్క సేనగ చేసుకొని క్రూరమైన రాక్షసులయొక్క దురభిమానమును నశింపజేసిన జయశీలుడైన స్వామి,ఆ శ్రియఃపతి యొక్క దివ్యనామము,ఈ దాసునికి ఎల్లప్పుడును తేనె,పాలు వలె పరమభోగ్యుముగనున్న తిరుమంత్రమే!.అది నేనును ఉచ్ఛరించితిని,నాయొక్క ఆప్తులైన మీరును అనుసంధించండి.
నిన్ఱవరైయుమ్ కిడన్దకడలుమ్, తిశైయుమ్ ఇరునిలనుమ్,
ఒన్ఱుమ్ ఒழிయావణ్ణమ్, ఎణ్ణి నిన్ఱ అమ్మానార్,
కున్ఱు కుడైయా ఎడుత్త, అడిగళుడైయ తిరునామమ్,
నన్ఱు కాణ్మిన్ తొణ్డీర్ శొన్నేన్, నమోనారాయణమే ll 1544
నిన్ఱ వరైయుమ్ = స్థిరముగ నిలిచియున్న పర్వతములను; కిడన్ద కడలుమ్ = ఎన్నడు ఎండిపోని సముద్రములను; తిశైయుమ్ = దిక్కులను; ఇరు నిలనుమ్ = విశాలమైన భూమిని;(ఇవన్నిటిని) ఒన్ఱుమ్ ఒழிయా వణ్ణమ్ = స్వల్పమైనను క్షతిలేని విధముగ; ఎణ్ణి నిన్ఱ అమ్మానార్ = తన సంకల్పమునందే నియమించు స్వామి; కున్ఱు కుడైయా ఎడుత్త అడిగళుడైయ = గోవర్ధనపర్వతమును గొడుగుగ పైకెత్తిన ఆ స్వామి యొక్క; తిరునామమ్= దివ్యమైన నామము; నమోనారాయణమే = తిరుమంత్రమే!;తొణ్డీర్ =ఓ! భక్తులారా!; నన్ఱు శొన్నేన్ కాణ్మిన్ = విపులముగ చెప్పితిని ,తెలుసుకోండి.
స్థిరముగ నిలిచియున్న పర్వతములను,ఎన్నడు ఎండిపోని సముద్రములను దిక్కులను,విశాలమైన భూమిని మొదలగు ఇవన్నిటిని స్వల్పమైనను క్షతిలేని విధముగ తన సంకల్పమునందే నియమించు స్వామి,గోవర్ధనపర్వతమును గొడుగుగ పైకెత్తిన ఆ స్వామి యొక్క దివ్యమైన నామము తిరుమంత్రమే!. ఓ! భక్తులారా! విపులముగ చెప్పితిని,తెలుసుకోండి.
కడుఙ్గాల్ మారికల్లే పొழிయ, అల్లే యెమక్కెన్ఱు
పడుఙ్గాల్, నీయే శరణెన్ఱు, ఆయరఞ్జ అఞ్జామున్,
నెడుఙ్గాల్ కున్ఱమ్ కుడైయొన్ఱేన్ది, నిరయై చ్చిరమత్తాల్,
నడుఙ్గా వణ్ణమ్ కాత్తాన్ నామమ్, నమోనారాయణమే ll 1545
కడుమ్ = కఠోరమైన; కాల్ = గాలితో కూడి; మారి = మేఘములు; కల్లే పొழிయ = రాళ్ళనే వర్షింపగ; ఎమక్కు అల్లే ఎన్ఱు = ” ఇది మనకు కాళరాత్రివలె ఉన్నది ” అని; పడుఙ్గాల్ = మనసునందు తలచి; ఆయర్ = గోపాలురు; నీయే శరణ్ ఎన్ఱు అఞ్జ = మమ్ము “నీవే రక్షింపవలెనని చెప్పి” భయపడుచునుండగ;అఞ్జామున్=ఆ భయమునకు కారణమైన దుఃఖము కలుగకమునుపే; నెడు కాల్ కున్ఱమ్ ఒన్ఱు = చుట్టు కొండలుగల ఒక గోవర్ధన పర్వతమును; కుడై ఏన్ది = గొడుగుగ చేసుకొని పైకెత్తి పట్టుకొని; నిరయై = గోవుల సమూహములను; శిరమత్తాల్ నడుఙ్గా వణ్ణమ్ = ఆయాసముతో బాధపడని విధముగ; కాత్తాన్ = రక్షించిన సర్వేశ్వరునియొక్క; నామమ్ నమోనారాయణమే = దివ్య నామము తిరుమంత్రమే యగును.
కఠోరమైన గాలితో కూడి మేఘములు రాళ్ళనే వర్షింపగ,”ఇది మనకు కాళ రాత్రివలె ఉన్నది” అని మనసునందు తలచి గోపాలురు, మమ్ము “నీవే రక్షింపవలెనని చెప్పి” భయపడుచునుండగ, ఆ భయమునకు కారణమైన దుఃఖము కలుగక మునుపే చుట్టు కొండలుగల ఒక గోవర్ధనపర్వతమును గొడుగుగ చేసుకొని పైకెత్తి పట్టుకొని గోవుల సమూహములను ఆయాసముతో బాధపడని విధముగ రక్షించిన సర్వేశ్వరునియొక్కదివ్య నామము తిరుమంత్రమే యగును..
పొఙ్గు పుణరిక్కడల్ శూழ் ఆడై, నిలమామగళ్ మలర్ మా
మఙ్గై, పిరమన్ శివన్ ఇన్దిరన్, వానవర్ నాయకరాయ,
ఎఙ్గళడిగళ్ ఇమైయోర్, తలై వరుడైయ తిరునామమ్,
నఙ్గళ్ వినైగళ్ తవిరవురైమిన్, నమోనారాయణమే ll 1546
పొఙ్గు పుణరి = ఉప్పొంగిన అలలుగల; కడల్ = సముద్రము;శూழ் ఆడై = చుట్టుకొనియున్న వస్త్రముగాగల; నిలమామగళ్ = శ్రీ భూదేవికిని;మలర్ మామఙ్గై = శ్రీమహాలక్ష్మికిని; పిరమన్ = చతుర్ముఖ బ్రహ్మకు; శివన్=శివునికి; ఇన్దిరన్=ఇంద్రునకు; వానవర్ = మిగిలిన దేవతలకు; నాయకర్ ఆయ = నిర్వాహకుడును;ఎఙ్గళ్ అడిగళ్ = మాయొక్క స్వామి; ఇమైయోర్ తలైవరుడైయ = నిత్యశూరులయొక్క ప్రభువైన సర్వేశ్వరుని; తిరునామమ్ = దివ్యమైన నామము; నమోనారాయణమే = తిరుమంత్రమే!; నఙ్గళ్ వినైగళ్ తవిర ఉరైమిన్=ఆ మంత్రమునే మనయొక్క పాపములు తొలగిపోవునట్లు అనుసంధించండి.
ఉప్పొంగిన అలలుగల సముద్రము చుట్టుకొనియున్న వస్త్రముగాగల శ్రీ భూదేవికిని, శ్రీమహాలక్ష్మికిని,చతుర్ముఖ బ్రహ్మకు,శివునికి,ఇంద్రునకు మిగిలిన దేవతలకు నిర్వాహకుడును,మాయొక్క స్వామి,నిత్యశూరులయొక్క ప్రభువైన సర్వేశ్వరుని దివ్యమైన నామము తిరుమంత్రమే!. ఆ మంత్రమునే మనయొక్క పాపములు తొలగిపోవునట్లు అనుసంధించండి.
** వావిత్తడమ్ శూழ் మణిముత్తార్ట్రు, నఱైయూర్ నెడుమాలై
నావిల్ పరవి నెఞ్జిల్ కొణ్డు, నమ్బి నామత్తై,
కావిత్తడఙ్గణ్ మడవార్ కేళ్వన్, కలియనొలిమాలై,
మేవి చ్చొల్లవల్లార్ పావమ్, నిల్లా వీయుమే ll 1547
వావి = కొలనులతోను, తడమ్ = తటాకములతోను; శూழ் = చుట్టుకొనియున్న, మణిముత్తార్ట్రు = ‘మణిముత్తార్ట్రు’ పుష్కరణిగల; నఱైయూర్ = తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న; నెడుమాలై = సర్వేశ్వరుని; నావిల్ పరవి = తమ నాలుకతో స్తుతించి; నెఞ్జిల్ కొణ్డు = హృదయమున ధ్యానించి; నమ్బి నామత్తై=ఆ తిరునఱైయూర్ నమ్బి యొక్క దివ్యనామ విషయమై; కావి తడమ్ కణ్ మడవార్ కేళ్వన్ = నల్ల కలువవలె విశాలమైన కన్నులుగల యువతులు ఆశించెడి; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; ఒలిమాలై = అనుగ్రహించిన సూక్తులమాలను; మేవి = ఆశించి; శొల్ల వల్లార్ పావమ్ = పఠించువారియొక్క పాపములు; నిల్లా వీయుమ్ = నిలువలేక నశించును.
కొలనులతోను,తటాకములతోను చుట్టుకొనియున్న,’మణిముత్తార్ట్రు’ పుష్కరణిగల తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని తమ నాలుకతో స్తుతించి, హృదయమున ధ్యానించి, ఆ తిరునఱైయూర్ నమ్బి యొక్క దివ్యనామ విషయమై,నల్ల కలువవలె విశాలమైన కన్నులుగల యువతులు ఆశించెడి తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన సూక్తులమాలను ఆశించి పఠించువారియొక్క పాపములు నిలువలేక నశించును.
తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం
*************