శ్రీః
5. కలఙ్గమున్నీర్
తిరునఱైయూర్ నమ్బి పెరుమాళ్ కృపతో నిత్యవాసము చేయుచున్న దివ్యదేశమును తిరుమంగై ఆళ్వార్ కొనియాడుచున్నారు.
** కలఙ్గ మున్నీర్ కడైన్దు, అముదఙ్గొణ్డు, ఇమైయోర్
తుళఙ్గల్ తీర, నల్ గు శోది చ్చుడరాయ,
వలఙ్గై యాழி యిడఙ్గై చ్చఙ్గమ్, ఉడైయానూర్,
నలఙ్గొళ్ వాయ్ మై, అన్దణర్ వాழுమ్ నఱైయూరే ll 1488
మున్నీర్ = మూడురకములైన నీటితోఒప్పు సముద్రము; కలఙ్గ = కలతచెందునట్లు; కడైన్దు = చిలికి; అముదమ్ కొణ్డు = అమృతమును తీసి; ఇమైయోర్ తుళఙ్గల్ తీర నల్గు = దేవతలయొక్క విచారము తీరునట్లు వారికి ఒసగి కరుణించినవాడును;శోది శుడరాయ = పరంజ్యోతి స్వరూపుడును; వలఙ్గై ఆழி ఇడఙ్గై శఙ్గమ్ ఉడైయాన్= కుడి హస్తమున సుదర్శనచక్రము,ఎడమ హస్తమున శంఖము ధరించిన ఆ సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న ;ఊర్= దివ్యదేశము; (ఏదనగ) నలమ్ కొళ్ వాయ్ మై = మంచిసత్యవాదులైన; అన్దణర్ వాழுమ్ = బ్రాహ్మణోత్తముల నివసించుచున్న; నఱైయూరే = తిరు నఱైయూరే సుమా!
మూడురకములైన నీటితోఒప్పు సముద్రము కలతచెందునట్లు చిలికి, అమృతమును తీసి దేవతలయొక్క విచారము తీరునట్లు వారికి ఒసగి కరుణించిన వాడును,పరంజ్యోతి స్వరూపుడును,కుడిహస్తమున సుదర్శనచక్రము,ఎడమ హస్తమున శంఖము ధరించిన ఆ సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము, (ఏదనగ ) మంచిసత్యవాదులైన బ్రాహ్మణోత్తముల నివసించుచున్న తిరు నఱైయూరే సుమా!.
మునైయార్ శీయమాగి, అవుణన్ మురణ్ మార్వమ్,
పునై వాళ్ ఉగిరాల్, పోழ்పడ ఈర్ న్ద పునిదనూర్,
శినైయార్ తే మామ్, శెన్దళిర్ కోది క్కుయిల్ కూవుమ్,
ననైయార్ శోలై శూழ் న్దు, అழగాయ నఱైయూరే ll 1489
మునై = పోరు సలుపుటలో; ఆర్ = మిక్కిలి నైపుణ్యముగల; శీయమ్ ఆగి = నరసింహరూపమూర్తిగ అవతరించి; అవుణన్ = అసురుడు హిరణ్యాసురుని యొక్క, మురణ్ మార్వమ్ = మిక్కిలి దృఢమైన వక్షస్థలమును; పునై = అందమైన; వాళ్ = ప్రకాశించు; ఉగిరాల్ =నఖములచే; పోழ்పడ = రెండు భాగములగునట్లు; ఈర్ న్ద = చీల్చివేసిన; పునిదన్ ఊర్=పరమపవిత్రుడైన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; (ఏదనగ ),కుయిల్=కోకిలలు; శినై ఆర్ తే మామ్=కొమ్మలతో వర్ధిల్లుచున్న తేనెలొలుకు మామిడి చెట్లయొక్క;శెమ్ తళిర్=ఎర్రని చిగురుటాకులను; కోది=ముక్కుతో పొడుచుకొని తిని; కూవుమ్ = కూయుచున్నదియు; ననై ఆర్ శోలై శూழ் న్దు = పూల మొగ్గలతో నిండిన తోటలతో చుట్టుకొనియున్న; అழగాయ = సుందరమైన; నఱైయూరే = తిరు నఱైయూరే సుమా!
పోరు సలుపుటలో మిక్కిలి నైపుణ్యముగల నరసింహరూపమూర్తిగ అవతరించి అసురుడు హిరణ్యాసురుని యొక్క మిక్కిలి దృఢమైన వక్షస్థలమును అందమైన ప్రకాశించు నఖములచే రెండు భాగములగునట్లు చీల్చివేసిన పరమపవిత్రుడైన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము (ఏదనగ ),కోకిలలు కొమ్మలతో వర్ధిల్లుచున్న తేనెలొలుకు మామిడి చెట్లయొక్క ఎర్రని చిగురుటాకులను ముక్కుతో పొడుచుకొని తిని కూయుచున్నదియు,పూల మొగ్గలతో నిండిన తోటలతో చుట్టుకొనియున్న సుందరమైన తిరు నఱైయూరే సుమా!.
ఆనై ప్పురవి, త్తేరొడు కాలాళ్ అణికొణ్డ,
శేనై త్తొకైయైచ్చాడి, యిలఙ్గై శెర్ట్రానూర్,
మీనై త్తழுవి వీழ்న్దు ఎழுమ్, మళ్ళర్కు అలమన్దు,
నాన ప్పుతలిల్, ఆమై యొళిక్కుమ్ నఱైయూరే ll 1490
ఆనై=ఏనుగులును; పురవి = గుఱ్ఱములును; తేరొడు = రథములుతోకూడ; కాలాళ్ అణి కొణ్డ=కాల్బలము సంరక్షణముకై వ్యూహముగ ఏర్పరచిన;శేనై తొకైయై శాడి= సేనయొక్క సమూహములంతయును ఛిన్నభిన్నముచేసి;ఇలఙ్గై శెర్ట్రాన్ ఊర్= లంకాపురిని నాశనముచేసిన సర్వేశ్వరుడు కృపతో నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; ( ఏదనగ ) మీనై = మీనములను; తழுవి = (పట్టుకొనుటకై) రెండు చేతులు జోడించి;(పట్టగ) వీழ்న్దు=(ఆ మీనములు విదిలించుకొని జారిపోగ)క్రిందపడి; ఎழுమ్ = (తిరిగి పట్టుకొనుటకై ) లేచుచున్న; మళ్ళర్కు = రైతులకు; అలమన్దు = భయపడిన; ఆమై = తాబేళ్ళు; నానమ్ పుతలిల్ = పసుపు పొదలలో; ఒళిక్కుమ్ = దాగుచుండెడి; నఱైయూరే = తిరు నఱైయూరే సుమా!
ఏనుగులును,గుఱ్ఱములును,రథములుతోకూడ కాల్బలము సంరక్షణముకై వ్యూహముగ ఏర్పరచిన సేనయొక్క సమూహములంతయును ఛిన్నభిన్నముచేసి లంకాపురిని నాశనముచేసిన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము ( ఏదనగ ) మీనములను పట్టుకొనుటకై రెండు చేతులు జోడించి పట్టగ,ఆ మీనములు విదిలించుకొని జారిపోగ, క్రిందపడి, తిరిగి పట్టుకొనుటకై లేచుచున్న రైతులకు భయపడిన తాబేళ్ళు పసుపు పొదలలో దాగుచుండెడి తిరు నఱైయూరే సుమా!
ఉఱియార్ వెణ్ణెయుణ్డు, ఉరలోడుమ్ కట్టుణ్డు,
వెఱియార్ కూన్దల్, పిన్నై పొరుట్టు ఆన్ వెన్ఱాన్ ఊర్,
పొఱియార్ మఞ్ఞై, పూమ్బొழிల్ తోఱుమ్ నడమాడ,
నఱు నాణ్ మలర్ మేల్, వణ్డిశై పాడుమ్ నఱైయూరే ll 1491
ఉఱి యార్ = ఉట్లయందు కుండలలో నింపిపెట్టిన;వెణ్ణెయ్ ఉణ్డు = వెన్నను ఆరగించి; ఉరలోడుమ్ కట్టుణ్డు=(ఆ దొంగతనమునకు)రోకలికి కట్టబడినవాడును;వెఱి ఆర్ కూన్దల్ పిన్నై పొరుట్టు = పరిమళ భరితమైన కుంతలములు గల నప్పిన్నైపిరాట్టి కొరకు; ఆన్ వెన్ఱాన్ ఊర్ = (ఏడు) వృషభములతో పోరుసలిపి గెలిచిన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; ( ఏదనగ ), పొఱి ఆర్ మఞ్ఞ=పింఛములతో నున్న నెమళ్ళు; పూమ్ పొழிల్ తోఱుమ్ నడమాడ = పుష్పముల తోటలయందు పురివిప్పి నృత్యము చేయుచుండగ; వణ్డు=భ్రమరములు; నఱు నాళ్ మలర్ మేల్=పరిమళభరితమైన ఆ రోజునే వికసించిన పుష్పములపైన (సంచరించుచు);ఇశై పాడుమ్ = రాగభరితముగ ఝంకారము చేయుచుండెడి; నఱైయూరే = తిరు నఱైయూరే సుమా!.
ఉట్లయందు కుండలలో నింపిపెట్టిన వెన్నను ఆరగించి (ఆ దొంగతనమునకు) రోకలికి కట్టబడినవాడును, పరిమళ భరితమైన కుంతలములు గల నప్పిన్నైపిరాట్టి కొరకు (ఏడు) వృషభములతో పోరుసలిపి గెలిచిన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము ( ఏదనగ ), పింఛములతో నున్న నెమళ్ళు పుష్పముల తోటలయందు పురివిప్పి నృత్యము చేయుచుండగ భ్రమరములు పరిమళభరితమైన ఆ రోజునే వికసించిన పుష్పములపైన (సంచరించుచు) రాగభరితముగ ఝంకారము చేయుచుండెడి తిరు నఱైయూరే సుమా!.
విడైయేழ் వెన్ఱు, మెన్ తోళ్ ఆయ్ చ్చిక్కన్బనాయ్,
నడైయాల్ నిన్ఱ, మరుదమ్ శాయ్ త్త నాదనూర్,
పెడైయోడన్నమ్, పెయ్ వళైయార్ తమ్ పిన్ శెన్ఱు,
నడైయోడు ఇయలి, నాణి ఒళిక్కుమ్ నఱైయూరే ll 1492
ఏழ் విడై వెన్ఱు = ఏడు వృషభములను ( కన్యాశుల్కముగ ) జయించి; మెన్ తోళ్ ఆయ్ చ్చిక్కు అన్బన్ ఆయ్ = మృదువైన భుజములుగల నప్పిన్నైపిరాట్టికి నాయకుడు అయినవాడును; నడైయాల్ = బాలునిగ పాకుచు; నిన్ఱ మరుదమ్ = జతగా చేరియున్న రెండు మద్ది వృక్షములను; శాయ్ త్త నాదన్ ఊర్ = క్రింద పడునట్లుచేసిన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము;(ఏదనగ) అన్నమ్=హంసలు; పెడైయోడు=తమ ఆడ హంసలతో కూడి;పెయ్ వళైయార్ తమ్ పిన్ శెన్ఱు = శ్లాఘ్యమైన చేతికంకణములచే అలంకరించుకొనిన యువతుల వెనుక పోయి;నడైయోడు ఇయలి= వారియొక్క నడకను అనుకరించి నడచుటకు యత్నముచేసి; (అట్లు నడవలేక),నాణి ఒళిక్కుమ్ = సిగ్గుపడి దాగుచుండెడి; నఱైయూరే = తిరు నఱైయూరే సుమా!.
ఏడు వృషభములను ( కన్యాశుల్కముగ ) జయించి మృదువైన భుజములుగల నప్పిన్నైపిరాట్టికి నాయకుడయినవాడును; బాలునిగ, పాకుచు జతగా చేరియున్న రెండు మద్ది వృక్షములను క్రింద పడునట్లుచేసిన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము ఏదనగ, హంసలు తమ ఆడ హంసలతో కూడి శ్లాఘ్యమైన చేతికంకణములచే అలంకరించుకొనిన యువతుల వెనుక పోయి, వారియొక్క నడకను అనుకరించి నడచుటకు యత్నముచేసి, అట్లు నడవలేక సిగ్గుపడి దాగుచుండెడి తిరు నఱైయూరే సుమా!.
పగువాయ్ వన్ పేయ్, కొఙ్గై శువైత్తు ఆరుయిరుణ్డు,
పుగువాయ్ నిన్ఱ, పోతకమ్ వీழ ప్పొరుదానూర్,
నెగువాయ్ నెయ్ దల్, పూమదుమాన్ది కమలత్తిన్,
నగువాయ్ మలర్మేల్, అన్నమ్ ఉఱఙ్గుమ్ నఱైయూరే ll 1493
పగు వాయ్=పెద్ద నోరుగల; వన్ పేయ్=క్రూరమైన రక్కసి పూతనయొక్క; కొఙ్గై శువైత్తు = స్తనములను ఆస్వాదించి; ఆర్ ఉయిర్ ఉణ్డు = ఆమెయొక్క ఇష్టమైన ప్రాణమును తీసినవాడును; పుగువాయ్ నిన్ఱ = (కంసుని కోటయొక్క) ప్రవేశ ద్వారమున (మత్తు పానీయుము త్రాగించి) నిలపెట్టబడిన; పోతకమ్ వీழ = కువలయాపీడమను ఏనుగు మరణించునట్లు;పొరుదాన్ ఊర్=పోరుసలిపిన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము;(ఏదనగ)అన్నమ్=హంసలు;నెగువాయ్ నెయ్ దల్ పూ=బాగుగ వికసించిన నీలోత్పముల పుష్పములందలి; మదు మాన్ది = తేనెను పానముచేసి; కమలత్తిన్ నగు వాయ్ మలర్ మేల్ = బాగుగ వికసించిన తామరపుష్పములపై; ఉఱఙ్గుమ్ = నిదురించుచుండెడి; నఱైయూరే = తిరు నఱైయూరే సుమా!.
పెద్ద నోరుగల క్రూరమైన రక్కసి పూతనయొక్క స్తనములను ఆస్వాదించి ఆమెయొక్క ఇష్టమైన ప్రాణమును తీసినవాడును, కంసుని కోటయొక్క ప్రవేశ ద్వారమున మత్తుపానీయుము త్రాగించి నిలపెట్టబడిన కువలయాపీడమను ఏనుగు మరణించునట్లు పోరుసలిపిన సర్వేశ్వరుడు నిత్యవాసముచేయుచున్న దివ్యదేశము (ఏదనగ),హంసలు బాగుగ వికసించిన నీలోత్పముల పుష్పములందలి తేనెను పానముచేసి బాగుగ వికసించిన తామరపుష్పములపై నిదురించుచుండెడి తిరు నఱైయూరే సుమా!.
మున్దునూలుమ్ ముప్పురినూలుమ్, మున్నీన్ద,
అన్దణాళన్ పిళ్ళైయై, అన్నాన్ఱు అళిత్తానూర్,
పొన్దిల్ వాழுమ్ పిళ్ళైక్కాగి, ప్పుళ్ళోడి,
నన్దువారుమ్, పైమ్బునల్ వావి నఱైయూరే ll 1494
ముప్పురినూలుమ్ = యజ్ఞోపవీతమును;మున్దు నూలుమ్ = అనాదియైన వేదాక్షర రాశియును; మున్ ఈన్ద= మునుపు తనకు ఒసంగిన; అన్దణాళన్=సాందీపమహాముని యను బ్రాహ్మణోత్తమునియొక్క; పిళ్ళైయై = (సముద్రమందు మునిగితప్పిన) పుత్రుని; అన్నాన్ఱు = (గురుదక్షిణ సమర్పించు) ఆ కాలమున; అళిత్తాన్ ఊర్ = సమర్పించి కృప జేసిన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము, (ఏదనగ) పుళ్=పక్షులు; పొన్దిల్ వాழுమ్ = చెట్టు తొర్రలలో నివసించెడి; పిళ్ళైక్కు ఆగి=తమ పిల్లల ఆహారము కొరకు; ఓడి= పరుగున వచ్చి; నన్దు వారుమ్ = నత్తలను సేకరించి తెచ్చి పెట్టుటకై; పైమ్ పునల్ వావి = స్వచ్ఛమైన జలములుగల తటాకములుగలదైన;నఱైయూరే = తిరు నఱైయూరే సుమా!.
యజ్ఞోపవీతమును,అనాదియైన వేదాక్షర రాశియును మునుపు తనకు ఒసంగిన సాందీపమహాముని యను బ్రాహ్మణోత్తమునియొక్క సముద్రమందు మునిగితప్పిన పుత్రుని గురుదక్షిణ సమర్పించు సమయమున మునివద్దకు చేర్చి కృపజేసిన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము, (ఏదనగ), పక్షులు చెట్టు తొర్రలలో నివసించెడి తమ పిల్లల ఆహారము కొరకు పరుగున వచ్చి నత్తలను సేకరించి తెచ్చి పెట్టుటకై స్వచ్ఛమైన జలములుగల తటాకములుగలదైన తిరు నఱైయూరే సుమా!.
వెళ్ళై ప్పురవి త్తేర్ విశయఱ్కాయ్, విఱల్ వియూగమ్
విళ్ళ, శిన్దు క్కోన్ విழ, ఊర్ న్ద విమలనూర్,
కొళ్ళైక్కొழுమీన్ ఉణ్, కురుగు ఓడి ప్పెడైయోడుమ్,
నళ్ళ క్కమల, త్తేఱల్ ఉగుక్కుమ్ నఱై ఊరే ll 1495
వెళ్ళై పురవి = తెల్లని అశ్వములను కట్టిన; తేర్ =రథముకలిగిన;విశయఱ్కు ఆయ్ = విజయుని కొరకు; విఱల్ వియూగమ్ విళ్ళ = (శత్రువుల యొక్క) శక్తివంతమైన సేనా సమూహములను చేధించి; శిన్దు క్కోన్ విழ = సింధుదేశపు రాజు సైంధవుడు మరణించునట్లు, ఊర్ న్ద = ఆ రథమును నడిపించిన: విమలన్ ఊర్ = పరిశుద్ద స్వభావుడైన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; (ఏదనగ), కొళ్ళై క్కొழுమీన్ ఉణ్=మిక్కిలి బలిసిన మీనములు పట్టుకొని తినెడు; కురుగు= కొంగలు; ఓడి= పరుగెత్తికొని; పెడైయోడుమ్ = తమ ఆడ కొంగలతో; నళ్ళ కమలమ్=శ్లాఘ్యమైన దళములు గల తామరపుష్పమందలి; తేఱల్ ఉగక్కుమ్=తేనెను పానము చేయుచుండెడి; నఱైయూరే = తిరు నఱైయూరే సుమా!.
తెల్లని అశ్వములను కట్టిన రథము కలిగిన విజయుని కొరకు శత్రువుల యొక్క శక్తివంతమైన సేనా సమూహములను చేధించి,సింధుదేశపు రాజు సైంధవుడు మరణించునట్లు ఆ రథమును నడిపించిన పరిశుద్ద స్వభావుడైన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము (ఏదనగ),మిక్కిలి బలిసిన మీనములు పట్టుకొని తినెడు కొంగలు పరుగెత్తికొని తమ ఆడ కొంగలతో శ్లాఘ్యమైన దళములుగల తామరపుష్పమందలి తేనెను పానము చేయుచుండెడి తిరు నఱైయూరే సుమా!.
పారై ఊరుమ్ పారమ్ తీర, పార్తన్ తన్
తేరై యూరుమ్, తేవతేవన్, శేరుమూర్,
తారై యూరుమ్, తణ్ తళిర్ వేలి పుడై శూழ்,
నారై ఊరుమ్, నల్ వయల్ శూழ் న్ద నఱై ఊరే ll 1496
పారై = భూమిపై; ఊరుమ్ = నడయాడుచున్న(దుర్మార్గుల); పారమ్ తీర = భారము తీరునట్లు; పార్తన్ తన్ = అర్జునుని యొక్క; తేరై ఊరుమ్ = రథమును నడిపించిన; తేవతేవన్ శేరుమ్ ఊర్ = సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము;( ఏదనగ ), తారై ఊరుమ్ = (పూల నుండి తేనె) ధారగ పెరుగుచున్న; తణ్ తళిర్ = చల్లని దళములతో నిండిన;వేలి పుడై శూழ் = కంచెలచే నాలుగువైపుల చుట్టబడినదియు; నారై ఊరుమ్ = కొంగలు సంచరించుచున్న; నల్ వయల్ శూழ் న్ద = మంచి పొలములచే చుట్టుకొనియున్న; నఱైయూరే = తిరు నఱైయూరే సుమా!.
భూమిపై నడయాడుచున్న దుర్మార్గుల భారము తీరునట్లు అర్జునుని యొక్కరథమును నడిపించిన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము ( ఏదనగ) పూల నుండి తేనె ధారగ పెరుగుచున్న చల్లని దళములతో నిండిన కంచెలచే నాలుగువైపుల చుట్టబడినదియు,కొంగలు సంచరించుచున్న మంచి పొలములచే చుట్టుకొనియున్న తిరు నఱైయూరే సుమా!.
** తామత్తుళప, నీణ్ ముడి మాయన్ తాన్ నిన్ఱ,
నామత్తిరళ్ మా మాళిగై శూழ் న్ద, నఱై ఊర్ మేల్,
కామక్కదిర్ వేల్ వల్లాన్, కలియన్ ఒలిమాలై,
శేమత్తుణైయామ్, శెప్పుమవర్కు త్తిరుమాలే ll 1497
తులపమ్=తులసీదళముల;తామమ్=మాలతొ అలంకరింపబడిన; నీళ్ ముడి మాయన్ తాన్= పొడుగైన కిరీటముగగల ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వరుడు;నిన్ఱ=నిత్యవాసము చేయుచున్నదియు; నామమ్ = ప్రసిద్ధమైనదియు; తిరళ్ = దగ్గరగచేరియున్న; మా మాళిగై శూழ் న్ద = పెద్ద గృహములచే చుట్టబడియున్న; నఱై ఊర్ మేల్ = తిరు నఱైయూర్ విషయమై; కామ కదిర్ వేల్ వల్లాన్ = మిక్కిలి ప్రకాశించు శూలాయుధమును ప్రయోగించు సమర్ధతగల; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; ఒలిమాలై = అనుగ్రహించిన సూక్తులమాలను;శెప్పుమ్ అవర్కు = పఠించువారికి; తిరుమాలే = శ్రీలక్ష్మీవల్లభుడు, ఆశ్రిత వ్యామోహితుడైన ఆ సర్వేశ్వరుడే; శేమమ్ తుణై ఆమ్ = ఎల్లప్పుడు రక్షణయందు సహాపరుడగును.
తులసీదళముల మాలతొ అలంకరింపబడిన పొడుగైన కిరీటముగగల ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్నదియు, ప్రసిద్ధమైనదియు ,దగ్గరగ చేరియున్న గృహములచే చుట్టబడియున్న తిరు నఱైయూర్ విషయమై మిక్కిలి ప్రకాశించు శూలాయుధమును ప్రయోగించు సమర్ధతగల తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన సూక్తుల మాలను పఠించువారికి శ్రీలక్ష్మీవల్లభుడు, ఆశ్రిత వ్యామోహితుడైన ఆ సర్వేశ్వరుడే ఎల్లప్పుడు రక్షణయందు సహాపరుడగును.
***********