పెరియతిరుమొழி-6వపత్తు (6)

శ్రీః

6. అమ్బరముమ్

సర్వేశరుని దివ్యచరణారవిందములను పొందగోరువారు,తిరు నఱైయూర్ దివ్యదేశమును దర్శించి సేవించుకొనుమని తిరుమంగై ఆళ్వార్  ప్రబోధించుచున్నారు.

** అమ్బరముమ్ పెరునిలనుమ్ తిశైకళెట్టుమ్,

అలైకడలుమ్ కులవరైయుమ్ ఉణ్డ కణ్డన్,

కొమ్బమరుమ్ వడమరత్తినిలైమేల్,

పళ్ళికూడినాన్ తిరువడియే కూడగిఱ్పీర్,

వమ్బవిழுమ్ శెణ్బకత్తిన్ వాశముణ్డు,

మణివణ్డు వకుళత్తిన్ మలర్మేల్ వైగు,

శెమ్బియన్ కోచ్చెఙ్గణాన్ శేర్ న్ద కోయిల్,

తిరు నఱై యూర్మణిమాడమ్ శేర్మిన్గళే  ll 1498

అమ్బరముమ్ = ఆకాశమును; పెరునిలనుమ్ = విశాలమైన భూమిని; తిశైకళ్ ఎట్టుమ్= అష్టదిక్కులను; అలై కడలుమ్ = అలలుకొట్టుచున్న సముద్రములను; కులవరైయుమ్= కుల పర్వతములను; ఉణ్డ కణ్డన్=ఆరగించిన కంఠముగలవాడును; కొమ్బుఅమరుమ్= కొమ్మలతో వర్ధిల్లుచున్న; వడ మరత్తిన్ = వటవృక్షముయొక్క;ఇలై మేల్ = దళము పైన;పళ్ళి కూడినాన్ = శయనించిన సర్వేశ్వరుని; తిరువడియే = దివ్య చరణములనే; కూడ కిఱ్పీర్ = పొందకోరువారు; మణి వణ్డు = అందమైన భ్రమరములు; వమ్బు అవిழுమ్ శెణ్బకత్తిన్ వాశమ్ ఉణ్డు = అప్పుడే వికసించిన సంపంగి పుష్పముల పరిమళమును ఆస్వాదించి (పిదప);వకుళత్తిన్ మలర్ మేల్ వైగు = వకుళ పుష్పముపై నుండునదియు; శెమ్బియన్  కో శెఙ్గణాన్ శేర్ న్ద కోయిల్= ‘శెమ్బియన్  కో శెఙ్గణాన్’ అనబడు శోழరాజన్ సేవించుకొనిన కోవెలైన; తిరు నఱైయూర్ మణి మాడమ్ = తిరు నఱైయూర్ లోనున్న దివ్యసన్నిధిని; శేర్మిన్గళే = పోయిచేరుకొనుడు.

                        ఆకాశమును,విశాలమైన భూమిని,అష్టదిక్కులను, అలలుకొట్టుచున్న సముద్రములను, కులపర్వతములను, ఆరగించిన కంఠముగల వాడును ,కొమ్మలతో వర్ధిల్లుచున్న వటవృక్షముయొక్క దళము పైన శయనించిన సర్వేశ్వరుని దివ్య చరణములనే పొందకోరువారు,అందమైన భ్రమరములు అప్పుడే వికసించిన సంపంగి పుష్పముల పరిమళమును ఆస్వాదించిన పిదప వకుళ పుష్పముపై నుండునదియు, ‘శెమ్బియన్  కో శెఙ్గణాన్’ అనబడు శోழరాజన్ సేవించుకొనిన కోవెలైన తిరు నఱైయూర్ లోనున్న దివ్యసన్నిధిని  పోయిచేరుకొనుడు.

కొழுఙ్గయలాయ్ నెడు వెళ్ళఙ్గొణ్డ కాలమ్,

కులవరైయిన్ మీదోడి అణ్డత్తప్పాల్,

ఎழுన్దు ఇనిదు విళైయాడు మీశనెన్దై,

ఇణై యడిక్కీழ் ఇనదిరుప్పీర్ ఇనవణ్డాలుమ్,

ఉழுమ్ శెఱువిన్ మణికొణర్ న్దు కరైమేల్ శిన్ది,

ఉలగెల్లామ్ శన్దనముమగిలుఙ్గొళ్ళ,

శెழுమ్బొన్ని వళఙ్గొడుక్కుమ్ శోழన్ శేర్ న్ద,

తిరు నఱై యూర్మణిమాడమ్ శేర్మిన్గళే  ll 1499

నెడు వెళ్ళమ్ కొణ్డ కాలమ్ = పెద్ద ప్రళయము లోకములను ఆక్రమించిన సమయమున; కొழுమ్ కయలాయ్ = పెద్ద మత్స్యరూపమునుదాల్చి;కుల వరైయిన్ మీదు ఓడి = కుల పర్వతములపై పోయి సంచరించి; అప్పాల్=అటుపైన;అణ్డత్తు=అండభిత్తి పర్యంతము;  ఎழுన్దు = త్రుళ్ళి; ఇనిదు విళైయాడుమ్=సంతోషముగ విలాసముసలిపిన; ఈశన్ ఎన్దై = నాయొక్క స్వామియైన సర్వేశ్వరుని; ఇణై అడిక్కీழ் = దివ్య చరణములందు; ఇనదు ఇరుప్పీర్=సుఖముగ జీవింపనుండదలచినవారు;ఇనమ్ వణ్డు ఆలుమ్=గుంపులు గుంపులుగ  భ్రమరములు నృత్యముచేయుచున్నదియు;శెழுమ్ పొన్ని= అందమైన దివ్య కావేరినది; ఉழுమ్ శెఱువిన్ కరై మేల్ =దున్నెడి పొలముల గట్లపై;మణికొణర్ న్దు శిన్ది= రత్నములను కొట్టుకొనివచ్చి అంతటను చిందరవందరగ చేర్చియు; ఉలగుఎల్లామ్= సకల జనులు; శన్దనముమ్=చందన కర్రలును; అగిలుమ్=అగిల్ చెట్టుయొక్క కర్రలును; కొళ్ళ= తీసుకొనుటకు తగినట్లు;వళమ్ కొడుక్కుమ్=సంపదలు ఒసుగునదియు;శోழన్ శేర్ న్ద=శోழరాజన్ ఆశ్రయించిన;తిరు నఱైయూర్ మణి మాడమ్ = తిరు నఱైయూర్ లోనున్న దివ్యసన్నిధిని; శేర్మిన్గళే = పోయిచేరుకొనుడు.

                పెద్ద ప్రళయము లోకములను ఆక్రమించిన సమయమున పెద్ద మత్స్యరూపమును దాల్చి, కులపర్వతములపై పోయి సంచరించి, అటుపైన అండభిత్తి పర్యంతము త్రుళ్ళి సంతోషముగ విలాసముసలిపిన నాయొక్క స్వామియైన సర్వేశ్వరుని దివ్య చరణములందు సుఖముగ జీవింపనుండదలచినవారు, గుంపులు గుంపులుగ  భ్రమరములు నృత్యము చేయుచున్నదియు, అందమైన దివ్యకావేరినది దున్నెడి పొలముల గట్లపై రత్నములను కొట్టుకొనివచ్చి అంతటను చిందరవందరగ చేర్చియు,సకల జనులు చందన కర్రలును,అగిల్ చెట్టుయొక్క కర్రలును తీసుకొనుటకు తగినట్లు సంపదలు ఒసుగునదియు, శోழరాజన్ ఆశ్రయించిన తిరు నఱైయూర్ లో నున్న దివ్యసన్నిధిని  పోయిచేరుకొనుడు.

పవ్వనీరుడై యాడై యాగచ్చుర్ట్రి,

పార్ అకలమ్ తిరువడియా ప్పవనమ్ మెయ్యా,

శెవ్విమాదిర మెట్టుమ్ తోళా,

అణ్డమ్ తిరుముడియా నిన్ఱాన్ పాల్ శెల్లగిఱ్పీర్,

కవ్వైమాకళిఱు ఉన్ది వెణ్ణి ఏర్ట్ర,

క్కழల్మన్నర్ మణిముడిమేల్ కాగమేఱ,

తేయ్ వవాళ్ వలఙ్గొణ్డ శోழన్ శేర్ న్ద,

తిరు నఱై యూర్మణిమాడమ్ శేర్మిన్గళే  ll 1500

పవ్వమ్ నీర్=సముద్రము యొక్క నీటిని;ఉడై ఆడై యాగ శుర్ట్రి=నడుమున కట్టుకొనెడి పీతాంబరమువలె చుట్టుకొని; పార్ అకలమ్ తిరు అడి ఆ = విశాలమైన భూమిని దివ్య పాదము వలెను; పవనమ్ మెయ్ ఆ = వాయువును తిరుమేని వలెను;శెవ్వి మాదిరమ్ ఎట్టుమ్ తోళ్ ఆ=అందమైన దిశలు ఎనమిదియు భుజముల వలెను;అణ్డమ్ తిరు ముడి ఆ = అండభిత్తి దివ్య శిరస్సు వలెను; నిన్ఱాన్ పాల్ = నిలిచిన సర్వేశ్వరుని సమక్షమున; శెల్ల కిఱ్పీర్=పోయి చేరవలెనని ఆశపడువారు;కవ్వై=కోలాహలముచేయు; మా కళిఱు = పెద్ద ఏనుగులను; ఉన్ది=ముందుకు నడిపి; వెణ్ణి=వెణ్ణి యను ప్రదేశమందు; ఏర్ట్ర = ఎదిరించి వచ్చిన; కழల్ మన్నర్= తమ పాదములందు వీర కంకణములు గల రాజులయొక్క; మణి ముడి మేల్ = శ్లాఘ్యమైన తలలపై;  కాగమ్ ఏఱ = కాకులు ఎక్కి జీవించునట్లు;తేయ్ వ వాళ్ వలమ్ కొణ్డ = దివ్యమైన కత్తియొక్క బలము చూపిన; శోழన్ శేర్ న్ద=శోழరాజన్ ఆశ్రయించిన;తిరు నఱైయూర్ మణి మాడమ్ = తిరు నఱైయూర్ లోనున్న దివ్యసన్నిధిని; శేర్మిన్గళే = పోయిచేరుకొనుడు.

  సముద్రము యొక్క నీటిని నడుమున కట్టుకొనెడి పీతాంబరమువలె చుట్టుకొని, విశాలమైన భూమిని దివ్య పాదము వలెను,వాయువును తిరుమేని వలెను, అందమైన దిశలు ఎనమిదియు భుజముల వలెను, అండభిత్తి దివ్య శిరస్సు వలెను, నిలిచిన సర్వేశ్వరుని సమక్షమున పోయి చేరవలెనని ఆశపడువారు, కోలాహలముచేయు పెద్ద ఏనుగులను ముందుకు నడిపి వెణ్ణి యను ప్రదేశమందు ఎదిరించి వచ్చిన,తమ పాదములందు వీర కంకణములు గల రాజులయొక్క శ్లాఘ్యమైన తలపై కాకులు ఎక్కి జీవించునట్లు దివ్యమైన కత్తియొక్క బలము చూపిన శోழరాజన్ ఆశ్రయించిన తిరు నఱైయూర్ లోనున్న దివ్యసన్నిధిని  పోయిచేరుకొనుడు.

పైఙ్గణాళరియురువాయ్ వెరువ నోక్కి, 

ప్పరువరత్తోళిరణియనై ప్పర్ట్రివాఙ్గి,

అఙ్గైవాళుగిర్ నుదియాల్ అవనదాగమ్,

అఙ్గురుది పొఙ్గువిత్తానడిక్కీழ் నిఱ్పీర్,

వెఙ్గణ్ మాకళిఱుఉన్ది వెణ్ణి ఏర్ట్ర,

విఱల్ మన్నర్ తిఱలழிయవెమ్మా ఉయ్ త్త,

శెఙ్కణాన్ కో చ్చోழన్ శేర్ న్ద కోయిల్,

తిరు నఱై యూర్మణిమాడమ్ శేర్మిన్గళే  ll 1501

పైమ్ కణ్ = పచ్చని  నేత్రములుగల; ఆళ్ అరి ఉరువాయ్=నరసింహరూపమునుదాల్చి;  వెరువ నోక్కి = భీతికలుగునట్లు చూచి; వరమ్ పరు తోళ్ ఇరణియనై = వరబలముచే  పొందిన విశాలమైన భుజములు గల హిరణ్యాసురుని;పర్ట్రి వాఙ్గి=పట్టుకొని ఈడ్చి; అమ్ కై = అందమైన దివ్య హస్తములందుగల; వాళ్ ఉగిర్ నుదియాల్ = ప్రకాశించు నఖముల  కొనలచే; అవనదు ఆగమ్ = అతనియొక్క వక్షస్థలమును; అమ్ కురుది పొఙ్గు విత్తాన్ = నీటి ప్రవాహము వలె రక్తము ఉబుకి వచ్చునట్లు చీల్చిన సర్వేశ్వరుని యొక్క; అడి కీழ் నిఱ్పీర్ = దివ్య చరణములక్రింద నిలువ తలచినవారు;వెమ్ కణ్ మా కళిఱు ఉన్ది= తీవ్రమైన నేత్రములుగల పెద్ద గజములను ముందుకు నడిపి; వెణ్ణి ఏర్ట్ర  = వెణ్ణి యను ప్రదేశమందు ఎదిరించి వచ్చిన; విఱల్ మన్నర్ = శూరులైన రాజులయొక్క; తిఱల్ అழிయ = బలము నశించునట్లు; వెమ్ మా ఉయ్ త్త = క్రూరమైన అశ్వములను నడిపి విజయము పొందిన;శెఙ్కణాన్ కో చ్చోழన్ శేర్ న్ద కోయిల్ = ‘శెమ్బియన్  కో శెఙ్గణాన్’ అనబడు శోழరాజన్ సేవించుకొనిన కోవెలైన;తిరు నఱైయూర్ మణి మాడమ్ = తిరు నఱైయూర్ లోనున్న దివ్యసన్నిధిని; శేర్మిన్గళే = పోయిచేరుకొనుడు.

                పచ్చని నేత్రములుగల నరసింహరూపమునుదాల్చి,భీతికలుగునట్లు చూచి,వరబలముచే పొందిన విశాలమైన భుజములుగల హిరణ్యాసురుని పట్టుకొని ఈడ్చి,అందమైన దివ్య హస్తములందు గల ప్రకాశించు నఖముల  కొనలచే అతనియొక్క వక్షస్థలమును,నీటి ప్రవాహము వలె రక్తము ఉబుకి వచ్చునట్లు చీల్చిన సర్వేశ్వరుని యొక్క దివ్య చరణములక్రింద నిలువ తలచినవారు, తీవ్రమైన నేత్రములుగల పెద్ద గజములను ముందుకు నడిపి,వెణ్ణి యను ప్రదేశమందు ఎదిరించి వచ్చిన శూరులైన రాజులయొక్క బలము నశించునట్లు క్రూరమైన అశ్వములను నడిపి విజయము పొందిన ‘శెమ్బియన్  కో శెఙ్గణాన్’ అనబడు శోழరాజన్ సేవించుకొనిన కోవెలైన తిరు నఱైయూర్ లోనున్న దివ్యసన్నిధిని  పోయిచేరుకొనుడు.

అన్ఱు ఉలగమ్ మూన్ఱినైయుమళన్దు,

వేఱోర్ అరియురువాయిరణియనదాగఙ్గీణ్డు,

వెన్ఱవనై విణ్ణులగిల్ శెల ఉయ్ త్తార్కు,

విరున్దావీర్ మేలెழுన్దు విలఙ్గిల్ పాయ్ న్దు,

పొన్ శిదఱి మణి కొణర్ న్దు కరైమేల్ శిన్ది,

ప్పులమ్ పరన్దు నిలమ్ పరక్కుమ్ పొన్నినాడన్,

తెన్తమిழన్ వడపులక్కోన్ శోழన్ శేర్ న్ద,

తిరు నఱై యూర్మణిమాడమ్ శేర్మిన్గళే  ll 1502

అన్ఱు = మునుపొకకాలమున; ఉలగమ్ మూన్ఱినైయుమ్ అళన్దు = మూడులోకములను (త్రివిక్రముడై) కొలిచి స్వాధీనము చేసుకొనినవాడును; వేఱు ఓర్ అరి ఉరువాయ్ = విలక్షణమైన ఒక నరసింహ రూపముదాల్చి; ఇరణియనదు= హిరణ్యాసురునియొక్క; ఆగమ్ కీణ్డు = వక్షస్థలమును రెండు భాగములగ చీల్చి;వెన్ఱు=జయించి;  అవనై విణ్ ఉలగిల్ శెల ఉయ్ త్తార్కు = ఆ హిరణ్యాసురుని వీరస్వర్గమునకు పోవునట్లు చేసిన సర్వేశ్వరునకు; విరున్దు ఆవీర్ =(ఆ స్వామి ప్రీతికి) అతిథి కావలెననికోరుకొనువారు; మేల్ ఎழுన్దు = పొంగి పొరలి; విలఙ్గిల్ పాయ్ న్దు=(మార్గమధ్యమునగల) కొండలను బద్దలుకొట్టుచు ప్రవహించి;పొన్ శిదఱి=బంగారము అంతటను వెదజల్లి;మణి కొణర్ న్దు కరైమేల్ శిన్ది=రత్నములను సేకరించికొనివచ్చి గట్లమీద చేర్చి; పులమ్ పరన్దు = బైట భూములందంతటను వ్యాపించి; నిలమ్ పరక్కుమ్=ప్రాంతమందలి భూములందతటను వ్యాపించుచున్న;పొన్ని=కావేరి నది గల;నాడన్=దేశమునకు నాయకుడై;తెన్ తమిழన్ = దక్షిణదిక్కున గల తమిళ దేశమునకు ప్రభువై; వడ పులమ్ కోన్=ఉత్తర దిక్కునగల దేశమునకును నాయకుడైన; శోழన్ శేర్ న్ద= శోழరాజన్ ఆశ్రయించిన;తిరు నఱైయూర్ మణి మాడమ్=తిరు నఱైయూర్ లోనున్న దివ్యసన్నిధిని; శేర్మిన్గళే=పోయిచేరుకొనుడు.

     మునుపొకకాలమున మూడులోకములను (త్రివిక్రముడై) కొలిచి స్వాధీనము చేసుకొనినవాడును, ఎచటకానరాని విలక్షణమైన ఒక నరసింహ రూపముదాల్చి హిరణ్యాసురునియొక్క వక్షస్థలమును రెండు భాగములగ చీల్చి జయించి, ఆ హిరణ్యాసురుని వీరస్వర్గమునకు పోవునట్లు చేసిన సర్వేశ్వరునకు(ఆ స్వామి ప్రీతికి) అతిథి కావలెననికోరుకొనువారు,పొంగి పొరలి (మార్గమధ్యమునగల) కొండలను బద్దలు కొట్టుచు ప్రవహించి బంగారము అంతటను వెదజల్లి,రత్నములను సేకరించికొని వచ్చి గట్లమీద చేర్చి,బైట భూములందంతటను వ్యాపించి,ప్రాంతమందలి భూములందతటను వ్యాపించుచున్న, కావేరి నది గల దేశమునకు నాయకుడై,దక్షిణదిక్కునగల తమిళ దేశమునకు ప్రభువై, మరియు  ఉత్తర దిక్కునగల దేశమునకును నాయకుడైన శోழరాజన్ ఆశ్రయించిన తిరు నఱైయూర్ లో నున్న దివ్యసన్నిధిని  పోయిచేరుకొనుడు.

తన్నాలే తన్నురువమ్ పయన్దతానాయ్,

త్తయఙ్గొళి శేర్మూవులగున్తానాయ్ వానాయ్,

తన్నాలే తన్నురువిన్ మూర్తిమూన్ఱాయ్,

త్తానాయనాయినాన్ వీర్,

మిన్నాడు వేల్ ఏన్దు విళైన్దైవేళై,

విణ్ణేఱ తనివేల్ ఉయ్ త్తులగమాణ్డ,

తెన్నాడన్ కుడకొఙ్గన్ శోழన్ శేర్ న్ద,

తిరు నఱై యూర్మణిమాడమ్ శేర్మిన్గళే  ll 1503

తన్నాలే= తనయొక్క స్వేచ్ఛతోనే; తన్ ఉరువమ్=తనయొక్క దివ్యమంగళస్వరూపము; పయన్ద = ఫలింపజేసిన; తానాయ్ = దివ్య ఆత్మస్వరూపుడై; తయఙ్గు ఒళి శేర్ మూ ఉలరుమ్ తానాయ్ = మిక్కిలి ప్రకాశము కలిగిన మూడు లోకములను ‘ తాన్ ‘ అని వాక్కుయందే ఇమిడియున్నవాడును;వాన్ ఆయ్=పరమపదమునకు ప్రభువైనవాడును;  తన్నాలే= తనయొక్క సంకల్పముతోనే;తన్ ఉరువిల్= తన స్వరూపమునుండి;మూర్తి మూన్ఱాయ్= ముగ్గురు మూర్తులుగ ఉద్భవించినవాడును;తాన్ = తానే; ఆయన్ ఆయినాన్ = శ్రీ గోపాల కృష్ణునిగ అవతరించిన సర్వేశ్వరుని; శరణ్ ఎన్ఱు ఉయ్ వీర్ = శరణని ఎంచి  ఉజ్జీవింప దలచినవారు; మిన్ ఆడు = కాంతి కలిగిన; వేల్ ఏన్దు = శూలాయుధమును ధరించిన; విళైన్దై వేళై = “విళైన్దై వేళ్” అను రాజును;విణ్ ఏఱ= వీరస్వర్గము పొందునట్లు; తని వేల్ ఉయ్ త్త = సాటిలేని శూలాయుధమును ప్రయోగించి; ఉలగమ్ ఆణ్డ=లోకమును పాలింప వచ్చిన; తెన్ నాడన్ = దక్షిణ దేశమునకు రాజు;కుడ కొఙ్గన్=పడమర దిక్కునగల కొంగుదేశమునకు రాజై;శోழన్ శేర్ న్ద = శోழరాజన్ ఆశ్రయించిన;తిరు నఱైయూర్ మణి మాడమ్ = తిరు నఱైయూర్ లోనున్న దివ్యసన్నిధిని; శేర్మిన్గళే = పోయిచేరుకొనుడు.

  తనయొక్క స్వేచ్ఛతోనే తనయొక్క దివ్యమంగళస్వరూపము ఫలింపజేసిన దివ్య ఆత్మస్వరూపుడై మిక్కిలి ప్రకాశము కలిగిన మూడు లోకములను ‘ తాన్ ‘ అని వాక్కుయందే ఇమిడియున్నవాడును; పరమపదమునకు ప్రభువైనవాడును; తనయొక్క సంకల్పముతోనే ముగ్గురు మూర్తులుగ ఉద్భవించినవాడును,తానే శ్రీ గోపాల కృష్ణునిగ అవతరించిన సర్వేశ్వరుని శరణని ఎంచి  ఉజ్జీవింప దలచినవారు, కాంతి కలిగిన శూలాయుధమును ధరించిన “విళైన్దై వేళ్” అను రాజును వీరస్వర్గముపొందునట్లు సాటిలేని శూలాయుధమును ప్రయోగించి, లోకమును పాలింప వచ్చిన దక్షిణదేశమునకు రాజు, పడమర దిక్కునగల కొంగుదేశమునకు రాజై, ఆ శోழరాజన్ ఆశ్రయించిన తిరు నఱైయూర్ లోనున్న దివ్యసన్నిధిని  పోయిచేరుకొనుడు.

ములైత్తడత్త నఞ్జుణ్డు తుఞ్జప్పేయ్ చ్చి,

ముదుతువరై క్కులపతియాయ్ క్కాలిప్పిన్నే,

ఇలైత్తడత్త కుழలూది ఆయర్మాదర్,

ఇనవళై కొణ్డానడిక్కీழ் ఎయ్ దకిఱ్పీర్,

మలైతడత్త మణికొణర్ న్దు వైయముయ్య,

వళఙ్గొడుక్కుమ్ వరుపునలమ్ పొన్ని నాడన్,

శిలైత్తడక్కై క్కులచ్చోழన్ శేర్ న్ద కోయిల్, 

తిరు నఱై యూర్మణిమాడమ్ శేర్మిన్గళే  ll 1504

పేయ్ చ్చి తుఞ్జ = పూతన మరణించునట్లు; ములైతడత్తనఞ్జు ఉణ్డు = విశాలమైన స్తనములందుగల విషమును ఆస్వాదించినవాడును; ముదు తువరై = ప్రాచీనమైన ద్వారకకు;కులపతి ఆయ్=ప్రభువైన వాడును;కాలి పిన్నే = గోవుల వెనుకనే; ఇలైత్తడత్త కుழల్ ఊది = పెద్ద ఆకుతోచేయబడిన వేణువును ఊదుచు పోయినవాడును; ఆయర్ మాదర్ = గోపస్త్రీలయొక్క; వళై ఇనమ్ కొణ్డాన్ = అందరి చేతి కంకణములను (క్రీడగ) అపహరించినట్టి సర్వేశ్వరునియొక్క; అడిక్కీழ் ఎయ్ దకిఱ్పీర్ = చరణముల క్రిందచేర ఆశగలవారు;మలై తడత్త =పర్వత ప్రాంతములందుగల; మణి కొణర్ న్దు= రత్నములను  సేకరించి వచ్చి; వైయమ్ ఉయ్య = ఈ లోకము ఉజ్జీవించునట్లు; వళమ్ కొడుక్కుమ్ = సమృద్దిగ ఒసగుచున్న; వరు పునల్ = ప్రవహించెడి జలములుగల;అమ్ పొన్ని నాడన్=అందమైన కావేరినదిగల దేశమునకు ప్రభువైన; శిలై తడ క్కై = విల్లును విశాలమైన హస్తమునగల; కులమ్ శోழన్ శేర్ న్ద కోయిల్ = ప్రసిద్ధమైన శోழరాజన్ సేవించుకొనిన కోవెలైన;తిరు నఱైయూర్ మణి మాడమ్ = తిరు నఱైయూర్ లోనున్న దివ్యసన్నిధిని; శేర్మిన్గళే = పోయిచేరుకొనుడు.

        పూతన మరణించునట్లు విశాలమైన స్తనములందుగల విషమును ఆస్వాదించినవాడును, ప్రాచీనమైన ద్వారకకు ప్రభువైనవాడును,గోవుల వెనుకనే పెద్ద ఆకుతో చేయబడిన వేణువును ఊదుచు పోయినవాడును, గోపస్త్రీలయొక్క, అందరి చేతి కంకణములను (క్రీడగ) అపహరించినట్టి సర్వేశ్వరునియొక్క చరణములక్రింద చేర ఆశగలవారు,పర్వత ప్రాంతములందుగల రత్నములను సేకరించి వచ్చి,ఈ లోకము ఉజ్జీవించునట్లు సమృద్దిగ ఒసగుచున్న, ప్రవహించెడి జలములుగల అందమైన కావేరినదిగల దేశమునకు ప్రభువైన, విల్లును విశాలమైన హస్తమునగల ప్రసిద్ధమైన శోழరాజన్ సేవించుకొనిన కోవెలైన తిరు నఱైయూర్ లోనున్న దివ్యసన్నిధిని పోయి చేరుకొనుడు

మురుక్కిలఙ్గు కనిత్తువర్వాయ్ పిన్నై కేళ్వన్,

మన్నెల్లామ్ మున్నవియచ్చెన్ఱు, వెన్ఱి

చ్చెరుక్కళత్తు త్తిఱలழிయ చ్చెర్ట్రవేన్దన్,

శిరన్దుణిత్తాన్ తిరువడినుమ్ శెన్నివైప్పీర్,

ఇరుక్కిలఙ్గు తిరుమొழி వాయెణ్ తోళీశఱ్కు,

ఎழிల్మాడ మెழுపదు శెయ్ దులగమాణ్డ,

తిరుక్కులత్తు వళచ్చోழన్ శేర్ న్ద కోయిల్, 

తిరు నఱై యూర్మణిమాడమ్ శేర్మిన్గళే  ll 1505

మురుక్కు = “మురుక్కమ్” పుష్పమువలెను;ఇలఙ్గు కని తువర్ వాయ్=ప్రకాశించుచున్న పండువలె (దొండపండువలె)ఎర్రని  అదరములుగల;పిన్నై కేళ్వన్=నప్పిన్నైపిరాట్టి యొక్క వల్లభుడును; మున్ = మునుపొకకాలమున; మన్ ఎల్లామ్ = క్షత్రీయులందరు; అవియ= నిర్మూలమగునట్లు; వెన్ఱి శెరు కళత్తు = జయము నిచ్చు యుద్దభూమికి; శెన్ఱు = పోయి; శెర్ట్ర వేన్దన్ = శత్రువుల రాజైన కార్త్యవీర్యార్జునునియొక్క; తిఱల్ అழிయ = బలము నశించునట్లు; శిరమ్ తుణిత్తాన్ = అతని శిరస్సును ఖండించిన సర్వేశ్వరుని యొక్క; తిరు అడి = దివ్యమైన పాదద్వందములందు;నుమ్ శెన్ని వైప్పీర్=మీయొక్క శిరస్సులను చేర్చి ఉజ్జీవింప దలచినవారు; ఇరుక్కు =వేదములందు;ఇలఙ్గు తిరుమొழி= ప్రసిద్ధమైన పురుషసూక్తము మొదలగు దివ్యమైన సూక్తులు; వాయ్=నోటియందే గల; ఎణ్ తోళ్ = ఎనిమిది భుజములుగల; ఈశఱ్కు=శివునికి; ఎழிల్ = అందమైన;ఎழுపదు మాడమ్=డెబ్బది ఆలయములు; శెయ్ దు = నిర్మించి; ఉలగమ్ ఆణ్డ = లోకమును పాలించిన; తిరు కులత్తు = ఉన్నత వంశమున పుట్టిన;వళమ్= సంపన్నుడైన; శోழన్ శేర్ న్ద కోయిల్=  శోழరాజన్ సేవించుకొనిన కోవెలైన;తిరు నఱైయూర్ మణి మాడమ్ = తిరు నఱైయూర్ లోనున్న దివ్యసన్నిధిని; శేర్మిన్గళే = పోయిచేరుకొనుడు.

    “మురుక్కమ్” పుష్పమువలెను,ప్రకాశించుచున్న పండువలె (దొండపండువలె) ఎర్రని  అదరములుగల నప్పిన్నైపిరాట్టియొక్క వల్లభుడును;మునుపొకకాలమున క్షత్రీయులందరు నిర్మూలమగునట్లు జయము నిచ్చు యుద్దభూమికి పోయి శత్రువుల రాజైన కార్త్యవీర్యార్జునునియొక్క బలము నశించునట్లు,అతని శిరస్సును ఖండించిన సర్వేశ్వరునియొక్క దివ్యమైన పాదద్వందములందు మీయొక్క శిరస్సులను చేర్చి ఉజ్జీవింపదలచినవారు,వేదములందు ప్రసిద్ధమైన పురుషసూక్తము మొదలగు దివ్యమైన సూక్తులు నోటియందే గల ఎనిమిది భుజములుగల శివునికి అందమైన డెబ్బది ఆలయములు నిర్మించి లోకమును పాలించిన ఉన్నత వంశమున పుట్టిన సంపన్నుడైన శోழరాజన్ సేవించుకొనిన కోవెలైన తిరు నఱైయూర్ లోనున్న దివ్యసన్నిధిని పోయి చేరుకొనుడు.

తారాళన్ తణ్ణరఙ్గవాళన్, పూమేల్ 

తనియాళన్ మునియాళరేత్తనిన్ఱ

పేరాళన్, ఆయిరమ్ పేరుడైయ వాళన్,

పిన్నైక్కు మణవాళన్ పెరుమైక్కేట్పీర్,

పారాళరవరివరెన్ఱు అழுన్దైయేర్ట్ర,

ప్పడైమన్నరుడల్ తుణియ ప్పరిమావుయ్ త్త,

తేరాళన్ కో చ్చోழన్ శేర్ న్ద కోయిల్, 

తిరు నఱై యూర్మణిమాడమ్ శేర్మిన్గళే  ll 1506

తార్ ఆళన్=తులసీ మాలలు ధరించినవాడును;తణ్ అరఙ్గమ్ ఆళన్ = చల్లని శ్రీ రంగం దివ్యదేశమును పాలించువాడును; పూ మేల్ తని ఆళన్ = తామర పుష్పమందు ఉద్భవించిన సాటిలేని శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలమందు పాలించువాడును;మునియాళర్ ఏత్త నిన్ఱ  పేరాళన్ = మహర్షులు స్తుతించునట్లు తగిన గొప్పతనము కలిగినవాడును; ఆయిరమ్ పేరుడైయ ఆళన్ = సహస్రనామములు వర్ణించు కల్యాణ గుణములకు స్థానమైనవాడును; పిన్నైక్కు మణవాళన్ = నప్పిన్నైపిరాట్టియొక్క వల్లభుడైన సర్వేశ్వరుని యొక్క; పెరుమై కేట్పీర్ = మహిమను వినదలచినవారు;అవర్ ఇవర్ ఎన్ఱు పార్ ఆళర్= దుర్మార్గులగ ప్రసిద్ధులై భూమిని పాలించినవారు; అழுన్దై = తిరు అழுన్దూర్ ప్రదేశమున వచ్చి; ఏర్ట్ర = ఎదిరించిగ; పడై మన్నర్ = ఆయుధములు ధరించి వచ్చిన ఆ రాజులయొక్క;ఉడల్ తుణియ= శరీరములు ఖండింపబడునట్లు; పరి మా ఉయ్ త్త = ఆనేక అశ్వములను నడిపించినవాడును; తేర్ ఆళన్ = రథము అధిరోహించి మిక్కిలి కౌశల్యముతో  యుద్దముచేసినవాడును; కో = మహారాజైన;శోழన్ శేర్ న్ద కోయిల్=  శోழరాజన్ సేవించుకొనిన కోవెలైన;తిరు నఱైయూర్ మణి మాడమ్ = తిరు నఱైయూర్ లోనున్న దివ్యసన్నిధిని; శేర్మిన్గళే = పోయిచేరుకొనుడు.

                             తులసీమాలలు ధరించినవాడును,చల్లని శ్రీ రంగం దివ్యదేశమును పాలించువాడును, తామరపుష్పమందు ఉద్భవించిన సాటిలేని శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలమందు పాలించువాడును,మహర్షులు స్తుతించునట్లు తగిన గొప్పతనము కలిగినవాడును,సహస్రనామములు వర్ణించు కల్యాణగుణములకు స్థానమైనవాడును, నప్పిన్నైపిరాట్టియొక్క వల్లభుడైన సర్వేశ్వరునియొక్క మహిమను వినదలచినవారు, దుర్మార్గులగ ప్రసిద్ధులై భూమిని పాలించినవారు,తిరు అழுన్దూర్ ప్రదేశమున వచ్చి ఎదిరించిగ ఆయుధములు ధరించి వచ్చిన ఆ రాజులయొక్క శరీరములు ఖండింప బడునట్లు ఆనేక అశ్వములను నడిపించినవాడును, రథము అధిరోహించి మిక్కిలి కౌశల్యముతో  యుద్దముచేసినవాడును,మహారాజైన శోழరాజన్ సేవించుకొనిన కోవెలైన తిరు నఱైయూర్ లోనున్న దివ్యసన్నిధిని పోయి చేరుకొనుడు.

** శెమ్మొழிవాయ్ నాల్వేదవాణర్వాழுమ్,

తిరు నఱై యూర్మణిమాడ చ్చెఙ్గణ్మాలై,

పొయ్ మ్మొழிయొన్ఱిల్లాద మెయ్ మ్మైయాళన్,

పులమఙ్ఙై క్కులవేన్దన్ పులమై యార్ న్ద,

అమ్మొழிవాయ్ కలికన్ఱి యిన్బపాడల్,

పాడువార్ వియనులగిల్ నమనార్ పాడి,

వెమ్మొழிకేట్టు అఞ్జాదే మెయ్ మ్మై శొల్లిల్,

విణ్ణవర్కు విరున్దాగుమ్ పెరుమ్ తక్కోరే  ll 1507

శెమ్ మొழிవాయ్ = సత్యమైన వాక్కులుగలవారును;నాల్ వేదమ్ వాణర్ వాழுమ్ = నాలుగు వేదములు స్తుతించు బ్రాహ్మణోత్తములు నివసించు;తిరు నఱై యూర్మణిమాడ శెమ్ కణ్ మాలై = తిరు నఱైయూర్ లోనున్న దివ్య సన్నిధిలో వేంచేసియున్న ఎర్రని నేత్రములుగల ఆశ్రిత వ్యామోహితుడైన సర్వేశ్వరుని విషయమై; పొయ్ మ్మొழி ఒన్ఱు ఇల్లాద = అసత్యపు వాక్కులు ఏ ఒక్కటిలేని; మెయ్ మ్మై ఆళన్ = సత్య వచనములు పలుకువారును; పులమ్ మఙ్గై కులమ్ వేన్దన్ = అందమైన తిరుమంగై దేశమునకు ప్రభువును; పులమై ఆర్ న్ద అమ్ మొழிవాయ్ = పాండిత్యముతో నిండిన సుందరమైన సూక్తులు  తన దివ్యమైన నోటగలవారును;కలికన్ఱి=తిరుమంగై ఆళ్వార్ యొక్క; ఇన్బమ్  పాడల్ = ఆనందదాయకమగు ఈ పాశురములు; వియన్ ఉలగిల్ = ఈ పెద్ద లోకమున;పాడువార్=పఠించువారు;మెయ్ మ్మై శొల్లిల్= పొందెడి ఫలము నిజముగ చెప్పిన యెడల; నమనార్ పాడి = యమలోకమున; వెమ్ మొழிకేట్టు అఞ్జాదే = క్రూరమైన మాటలు వినవలసిన భయమును పొందక; విణ్ణవర్కు విరున్దు ఆగుమ్ పెరుమ్ తక్కోరే = నిత్యశూరులు ఆదరించి కొనియాడునట్లు గొప్పతనమును బడయుదురు.

      సత్యమైన వాక్కులుగలవారును,నాలుగు వేదములు స్తుతించు బ్రాహ్మణోత్తములు నివసించు తిరు నఱైయూర్ లోనున్న దివ్య సన్నిధిలో వేంచేసియున్న ఎర్రని నేత్రములు గల ఆశ్రిత వ్యామోహితుడైన సర్వేశ్వరుని విషయమై అసత్యపు వాక్కులు ఏ ఒక్కటిలేని సత్య వచనములు పలుకువారును, అందమైన తిరుమంగై దేశమునకు ప్రభువును, పాండిత్యముతో నిండిన సుందరమైన సూక్తులు  తన దివ్యమైన నోటగలవారును, తిరుమంగై ఆళ్వార్ యొక్క ఆనందదాయకమగు ఈ పాశురములు ఈ పెద్ద లోకమున పఠించువారు పొందెడి ఫలము నిజముగ చెప్పిన యెడల యమలోకమున క్రూరమైన మాటలు వినవలసిన భయమును పొందక,నిత్యశూరులు ఆదరించి కొనియాడునట్లు గొప్పతనమును బడయుదురు.

***********

వ్యాఖ్యానించండి