శ్రీః
7. ఆళుమ్బణియుమ్
తిరునఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని తిరుమంగైఆళ్వార్ స్తుతించుచుచున్నారు.
** ఆళుమ్ పణియుమ్ అడియేనై క్కొణ్డాన్, విణ్డ నిశాశరరై,
తోళుమ్ తలైయుమ్ తుణివెయ్ ద, చ్చుడు వెఞ్జిలవాయ్ చ్చరన్దురన్దాన్,
వేళుమ్ శేయుమ్ అనైయారుమ్, వేఱ్కణారుమ్ పయిల్ వీది,
నాళుమ్ విழవి నొలియోవా, నఱైయూర్ నిన్ఱ నమ్బియే ll 1508
అడియేనై = ఈ దాసునిని;ఆళుమ్ పణియుమ్ కొణ్డాన్=శేషభూతునిగను,నిత్యకింకరుని గను తన దివ్యహృదయమున స్వీకరించినవాడును;విణ్డ నిశాశరరై=ప్రతికూలరైన రాక్షసుల; తోళుమ్ తలైయుమ్ తుణివెయ్ ద=భుజములు,తలలు ముక్కలు ముక్కలుగా ఖండింప బడునట్లు;శుడు వెమ్ శిల వాయ్ = మిక్కిలి కఠోరమైన విల్లు నుండి; శరమ్ తురన్దాన్ = బాణములను ప్రయోగించిన సర్వేశ్వరుడు; (ఎవరనిన);వేళుమ్ శేయుమ్ అనైయారుమ్ = మన్మధునితోను,సుబ్రహ్మణ్యస్వామితోను,పోలిన అందమైన పురషులును; వేల్ కణారుమ్=శూలము పోలిన నేత్రములుగల యువతులును;పయిల్ వీది = వసించు వీధులుగలదై;నాళుమ్=ఎల్లప్పుడు;విழవిన్ ఒలి ఓవా=ఉత్సవముల కోలాహలములు ఎడతెగక జరుగుచుండు; నఱైయూర్ = తిరు నఱైయూర్ దివ్యదేశమందు; నిన్ఱ = నిత్యవాసము చేయుచున్న; నమ్బియే = తిరునఱైయూర్ నమ్బియే! సుమా!.
ఈ దాసునిని శేషభూతునిగను,నిత్యకింకరునిగను తన దివ్యహృదయమున స్వీకరించినవాడును, ప్రతికూలరైన రాక్షసుల భుజములు,తలలు ముక్కలు ముక్కలుగా ఖండింప బడునట్లు మిక్కిలి కఠోరమైన విల్లు నుండి బాణములను ప్రయోగించిన సర్వేశ్వరుడు (ఎవరనిన) మన్మధునితోను,సుబ్రహ్మణ్యస్వామితోను,పోలిన అందమైన పురషులును,శూలము పోలిన నేత్రములుగల యువతులును, వసించు వీధులుగలదై, ఎల్లప్పుడు ఉత్సవముల కోలాహలములు ఎడతెగక జరుగుచుండు తిరు నఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న తిరునఱైయూర్ నమ్బియే! సుమా!.
మునియాయ్ వన్దు మూవెழுకాల్, ముడిశేర్ మన్నరుడల్ తుణియ,
తనివాయ్ మழுవిన్ పడైయాణ్డ, తారార్ తోళాన్ వార్ పుఱవిల్,
పనిశేర్ ముల్లై పల్లరుమ్బ, పానల్ ఒరుపాల్ కణ్ కాట్ట,
ననిశేర్ కమల ముగఙ్గాట్టుమ్, నఱైయూర్ నిన్ఱ నమ్బియే ll 1509
ముని ఆయ్ వన్దు = పరశురామ మునిగ అవతరించి; మూఎழு కాల్ = ఇరువదియొక్క మార్లు; ముడిశేర్ మన్నర్ ఉడల్ తుణియ = కిరీటములుగల క్షత్రీయ రాజులయొక్క శరీరములు ముక్కలుగ ఖండింపబడునట్లు;తని వాయ్ మழுవిన్ పడై ఆణ్డ = సాటిలేని (వాడియైన)నోరుగల గండ్రగొడ్డలి ఆయుధముగ ప్రయోగించినవాడును; తార్ ఆర్ తోళాన్ =(తులసీ)మాలలచే అలంకృతమైన భుజములుగల సర్వేశ్వరుడు (ఎవరనిన); వార్ పుఱవిల్ = పొడుగైన తోటలప్రక్కన; ఒరు పాల్ = ఒక చోట;పని శేర్ ముల్లై పల్ అరుమ్బ = చల్లని మల్లెపూల మొగ్గలు (ఆ ఊరిలోనున్న యవతుల) పళ్ళను స్పురింప జేయుచున్నదియు; పానల్ = నల్ల కలువలు; (ఒరుపాల్ = మరియొకచోట)కణ్ కాట్ట = (ఆ యువతుల)నేత్రములును స్పురింప జేయుచున్నదియు; నని శేర్ కమలమ్ = మిక్కుటముగ గల తామరపుష్పములు;ముగమ్ కాట్టుమ్ = ఆ స్త్రీల ముఖమును స్పురింపజేయునదియు యైన; నఱైయూర్ = తిరు నఱైయూర్ దివ్యదేశమందు; నిన్ఱ = నిత్యవాసము చేయుచున్న; నమ్బియే = తిరునఱైయూర్ నమ్బియే! సుమా!.
పరశురామ మునిగ అవతరించి ఇరువదియొక్క మార్లు కిరీటములుగల క్షత్రీయ రాజులయొక్క శరీరములు ముక్కలుగ ఖండింపబడునట్లు సాటిలేని (వాడియైన) నోరుగల గండ్రగొడ్డలి ఆయుధముగ ప్రయోగించినవాడును, తులసీ మాలలచే అలంకృతమైన భుజములుగల సర్వేశ్వరుడు(ఎవరనిన) పొడుగైన తోటలప్రక్కన, ఒక చోట చల్లని మల్లెపూల మొగ్గలు (ఆ ఊరిలోనున్న యవతుల) పళ్ళను స్పురింప జేయుచున్నదియు, నల్ల కలువలు (మరియొకచోట)(ఆ యువతుల) నేత్రములును స్పురింప జేయుచున్నదియు, మిక్కుటముగగల తామరపుష్పములు ఆ స్త్రీల ముఖమును స్పురింప జేయునదియు యైన తిరు నఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న తిరునఱైయూర్ నమ్బియే! సుమా!.
తెళ్ళార్ కడల్ వాయ్ విడవాయ, శినవాళ్ అరవిల్ తుయిలమర్ న్దు,
తుళ్ళావరు మాన్ వీழ, వాళి తురన్దాన్ ఇరన్దాన్ మావలిమణ్,
పుళ్ళార్ పుఱవిల్ పూఙ్గావి, పులన్గొళ్ మాదర్ కణ్ కాట్ట,
నళ్ళార్ కమలముగఙ్గాట్టుమ్, నఱైయూర్ నిన్ఱ నమ్బియే ll 1510
తెళ్ ఆర్ కడల్ వాయ్ = స్వచ్ఛమైన పాలసముద్రమందు;విడమ్ వాయ = (శత్రువులపై) విషమును గ్రక్కుచున్న నోరుగలదియు;శినమ్=కోపముతో నుండునదియు;వాళ్=మిక్కిలి తేజస్సుగల; అరవిల్ = ఆదిశేషునితల్పముపై; తుయిల్ అమర్ న్దు=యోగనిద్రలో అమరి యున్నవాడును; తుళ్ళా వరు మాన్ వీழ = (పంచవటియందు) త్రుళ్ళి త్రుళ్ళి గెంతుచు, ఆడుచూ వచ్చిన (మారీచుడను) మాయలేడి మరణించునట్లు; వాళి తురన్దాన్ = బాణమును ప్రయోగించినవాడును; మా వలి మణ్ ఇరన్దాన్= మహాబలి నుండి భూమిని యాచించిన సర్వేశ్వరుడు; (ఎవరనిన), పుళ్ ఆర్ పుఱవిల్ = పక్షులతో నిండిన తోటల ప్రక్కనగల; పూమ్ కావి = అందమైన నీలోత్పములు; పులన్ కొళ్ మాదర్ కణ్ కాట్ట = అందమైన యువతుల నేత్రములు స్పురింప జేయుచున్నదియు; నళ్ ఆర్ కమలమ్ ముగమ్ కాట్టుమ్ = దళములతో నిండిన తామర పుష్పములు ఆ స్త్రీల ముఖమును స్పురింపజేయునదియు యైన; నఱైయూర్ = తిరు నఱైయూర్ దివ్యదేశమందు; నిన్ఱ = నిత్యవాసము చేయుచున్న; నమ్బియే = తిరునఱైయూర్ నమ్బియే! సుమా!.
స్వచ్ఛమైన పాలసముద్రమందు శత్రువులపై, విషమును గ్రక్కుచున్న నోరుగలదియు, కోపముతో నుండునదియు, మిక్కిలి తేజస్సుగల ఆదిశేషునితల్పముపై యోగనిద్రలో అమరియున్న వాడును,పంచవటియందు త్రుళ్ళి త్రుళ్ళి గెంతుచు,ఆడుచూ వచ్చిన (మారీచుడను) మాయలేడి మరణించునట్లు బాణమును ప్రయోగించినవాడును,మహాబలి నుండి భూమిని యాచించిన సర్వేశ్వరుడు, (ఎవరనిన),పక్షులతో నిండిన తోటలప్రక్కన గల అందమైన నీలోత్పములు అందమైన యువతుల నేత్రములు స్పురింప జేయుచున్నదియు, దళములతో నిండిన తామర పుష్పములు ఆ స్త్రీల ముఖమును స్పురింపజేయునదియు యైన తిరు నఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న తిరునఱైయూర్ నమ్బియే! సుమా!.
ఒళియా వెణ్ణెయ్ ఉణ్డానెన్ఱు, ఉరలోడాయ్ చ్చి ఒణ్ కయిర్ట్రాల్,
విళియా ఆర్క ఆప్పుణ్డు, విమ్మి అழுదాన్ మెన్ మలర్ మేల్,
కళియా వణ్డు కళ్ళుణ్ణ, క్కామర్ తెన్ఱల్ అలర్ తూర్ట్ర,
నళిర్ వాయ్ ముల్లై ముఱువలిక్కుమ్, నఱైయూర్ నిన్ఱ నమ్బియే ll 1511
ఒళియా = దాగి దొంగతనముతో; వెణ్ణెయ్ ఉణ్డాన్ ఎన్ఱు = వెన్నను ఆరగించినాడని; ఆయ్ చ్చి = యశోదాదేవి; విళియా=కోపముతో;ఒణ్ కయిర్ట్రాల్=(ముడులతోనున్న చిన్న) అందమైన తాడుతో; ఉరలోడు=రోకలికి చేర్చి;ఆర్క= కట్టగ;ఆప్పుణ్డు=కట్టబడి; విమ్మి అழுదాన్ = వెక్కి వెక్కి ఏడ్చిన సర్వేశ్వరుడు;(ఎవరనిన); మెన్ మలర్ మేల్ = మృదువైన పుష్పముల మీద; వణ్డు = భ్రమరములు; కళియా = సంతోషముతో; కళ్ ఉణ్ణ = తేనెను పానముచేయుచుండునదియు;; కామర్ తెన్ఱల్=అందమైన దక్షణపుగాలి; అలర్ తూర్ట్ర= పుష్పములను చెల్లాచెదరు చేయుచుండునదియు;నళిర్ వాయ్ ముల్లై ముఱువు అలిక్కుమ్ = చల్లని ముఖముతో మల్లెలు చిరునవ్వు చేయుచున్నట్లు వికసించుచుండెడి; నఱైయూర్ = తిరు నఱైయూర్ దివ్యదేశమందు; నిన్ఱ = నిత్యవాసము చేయుచున్న; నమ్బియే = తిరునఱైయూర్ నమ్బియే! సుమా!.
దాగి దొంగతనముతో వెన్నను ఆరగించినాడని యశోదాదేవి కోపముతో (ముడులతోనున్న చిన్న) అందమైన తాడుతో రోకలికి చేర్చి కట్టగ ,కట్టబడి వెక్కి వెక్కి ఏడ్చిన సర్వేశ్వరుడు (ఎవరనిన) , మృదువైన పుష్పముల మీద భ్రమరములు సంతోషముతో తేనెను పానముచేయుచుండునదియు, అందమైన దక్షణపుగాలి పుష్పములను చెల్లాచెదరు చేయుచుండునదియు,చల్లని ముఖముతో మల్లెలు చిరునవ్వు చేయుచున్నట్లు వికసించుచుండెడి తిరు నఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న తిరునఱైయూర్ నమ్బియే! సుమా!.
విల్లార్ విழవిల్ వడమదురై, విరుమ్బి విరుమ్బా మల్లడర్తు,
కల్లార్ తిరడోళ్ కఞ్జనై క్కాయ్ న్దాన్, పాయ్ న్దాన్ కాళియన్మేల్,
శొల్లార్ శురుది ముఱై యోది, శోముచ్చెయ్యుమ్ తొழிలినోర్,
నల్లార్ మఱైయోర్ పలర్ వాழுమ్, నఱైయూర్ నిన్ఱ నమ్బియే ll 1512
విల్ ఆర్ విழవిల్=( కంసునిచే ఏర్పాటుచేయబడిన) ధనుర్యాగములో; వడమదురై విరుమ్బి= ఉత్తరమధురకు ఏతెంచుటకు ఆశపడి;(అచటకు చేరి) ; విరుమ్బా=శత్రువులైన;మల్ అడర్తు= చాణూరముష్టికులనబడు మల్లులను చంపి;(పిదప) కల్ ఆర్ తిరళ్ తోళ్ కఞ్జనై కాయ్ న్దాన్ = పర్వతమువలె దృఢమైన మెలితిరిగిన కండలుకలిగిన భుజములుగల కంసుని వధించినవాడును; కాళియన్ మేల్ పాయ్ న్దాన్= కాళీయుడను సర్పముయొక్క పడగలపై దుమికి దాని బలమును క్షీణింపజేసిన సర్వేశ్వరుడు (ఎవరనిన):శొల్లార్ శురుది ముఱై ఓది = సూక్తులతో నిండిన వేదములను క్రమబద్దముగ స్తుతించి;శోము శెయ్యుమ్ తొழிలినోర్ = సోమయాగము మొదలగు యాగములను నడిపించుటయే తమ కర్మములుగ కలవారు; నల్లార్ = విలక్షణమైన; మఱైయోర్ పలర్ వాழுమ్=వేదపండితులు అనేకులు నివసించుచున్న; నఱైయూర్ = తిరు నఱైయూర్ దివ్యదేశమందు; నిన్ఱ = నిత్యవాసము చేయుచున్న; నమ్బియే = తిరునఱైయూర్ నమ్బియే! సుమా!.
కంసునిచే ఏర్పాటు చేయబడిన ధనుర్యాగములో,ఉత్తరమధురకు ఏతెంచుటకు ఆశపడి, అచటకు చేరి,శత్రువులైన చాణూరముష్టికులనబడు మల్లులను చంపి (పిదప),పర్వతమువలె దృఢమైన మెలితిరిగిన కండలుకలిగిన భుజములుగల కంసుని వధించిన వాడును,కాళీయుడను సర్పముయొక్క పడగలపై దుమికి దాని బలమును క్షీణింపజేసిన సర్వేశ్వరుడు(ఎవరనిన) సూక్తులతో నిండిన వేదములను క్రమబద్దముగ స్తుతించి, సోమయాగము మొదలగు యాగములను నడిపించుటయే తమ కర్మములుగ కలవారు విలక్షణమైన వేదపండితులు అనేకులు నివసించుచున్న, తిరు నఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న తిరునఱైయూర్ నమ్బియే! సుమా!.
వళ్ళికొழுవన్ ముదలాయ, మక్కలోడు ముక్కణాన్,
వెళ్ గియోడ, విఱల్ వాణన్, వియన్ తోళ్ వనత్తై త్తుణిత్తుకన్దాన్,
పళ్ళి కమలత్తిడై ప్పట్ట, పగువాయ్ అలవన్ ముగమ్ నోక్కి,
నళ్ళి యూడుమ్ వయల్ శూழ் న్ద, నఱైయూర్ నిన్ఱ నమ్బియే ll 1513
వళ్ళి కొழுవన్ ముదలాయ = వల్లి వల్లభుడైన సుబ్రహ్మణ్యుడు మొదలగువారు; మక్కలోడు= తమ పుత్రులతోకూడ; ముక్కణాన్ = ముక్కంటి శివుడు;వెళ్ గి ఓడ= (ఎదిరించలేక) సిగ్గుపడి పారిపోగ; విఱల్ వాణన్ = బలిష్ఠుడైన భాణాసురునియొక్క; వియన్ తోళ్ వనత్తై = గొప్పభుజములనెడి వనమును; తుణిత్తు=ఖండించి;ఉకన్దాన్=సంతోషించిన సర్వేశ్వరుడు;( ఎవరనిన );కమలత్తిడై= తామర పుష్పమందు; పళ్ళి పట్ట = చేరి శయనించియున్న;పగువాయ్ అలవన్ = పెద్ద నోరుగల మగ పీతయొక్క; ముగమ్ = ముఖమును;నళ్ళి=ఆడ పీత;నోక్కి=చూచి;ఊడుమ్=ప్రణయ కలహముచేయుచుండెడి; వయల్ శూழ் న్ద = పొలములతో చుట్టుకొనియున్న; నఱైయూర్ = తిరునఱైయూర్ దివ్యదేశమందు; నిన్ఱ=నిత్యవాసము చేయుచున్న; నమ్బియే = తిరునఱైయూర్ నమ్బియే! సుమా!.
వల్లి వల్లభుడైన సుబ్రహ్మణ్యుడు మొదలగువారు తమపుత్రులతోకూడ ముక్కంటి శివుడు ఎదిరించలేక సిగ్గుపడి పారిపోగ బలిష్ఠుడైన భాణాసురునియొక్క గొప్ప భుజములనెడి వనమును ఖండించి సంతోషించిన సర్వేశ్వరుడు( ఎవరనిన ), తామరపుష్పమందు చేరి శయనించియున్న పెద్ద నోరుగల మగ పీతయొక్కముఖమును ఆడ పీత చూచి ప్రణయ కలహముచేయుచుండెడి పొలములతో చుట్టుకొనియున్న తిరు నఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న తిరునఱైయూర్ నమ్బియే! సుమా!.
మిడైయా వన్ద వేల్ మన్నర్ వీழ, విశయన్ తేర్ కడవి,
కుడయావరై యొన్ఱెడుత్తు ఆయర్ కోవాయ్ నిన్ఱాన్, కూరాழி
ప్పడైయాన్, వేద నాన్గైన్దు వేళ్వి, అఙ్గమాఱిశైయేழ்,
నడైయా వల్ల అన్దణర్వాழ், నఱైయూర్ నిన్ఱ నమ్బియే ll 1514
మిడైయా వన్ద = గుంపు గుంపులుగ వచ్చిన; వేల్ మన్నర్ వీழ = శూలాయుధముగల రాజులు మరణము పొందునట్లు; విశయన్ తేర్ కడవి=విజయుని రథమును నడిపిన వాడును;కుడైయా వరై ఒన్ఱు ఎడుత్తు=గొడుగువలె గోవర్ధనమను పర్వతమునొకటి పైకెత్తి; ఆయర్ కోవాయ్ నిన్ఱాన్ = గొల్లవాండ్రకు పభువై రక్షకుడుగ నిలిచినవాడును; కూర్ ఆழி పడైయాన్ = వాడియైన చక్రాయుధము హస్తమందుగల సర్వేశ్వరుడు; (ఎవరనిన); వేద నాన్గు = నాలుగు వేదములు; ఐన్దు వేళ్వి = పంచ మహాయజ్ఞములు; అఙ్గమ్ ఆఱు = ఆరు వేదాంగములు; ఇశై ఏழ் = సప్త స్వరములు; నడై ఆ వల్ల = మొదలగువానితో కాలము గడుపుచుండెడి; అన్దణర్ వాழ் = బ్రాహ్మణోత్తములు నివసించుచున్న; నఱైయూర్ = తిరునఱైయూర్ దివ్యదేశమందు; నిన్ఱ=నిత్యవాసము చేయుచున్న; నమ్బియే = తిరునఱైయూర్ నమ్బియే! సుమా!.
గుంపు గుంపులుగ వచ్చిన శూలాయుధముగల రాజులు మరణము పొందునట్లు విజయుని రథమును నడిపినవాడును,గొడుగువలె గోవర్ధనమను పర్వతమునొకటి పైకెత్తి గొల్లవాండ్రకు పభువై రక్షకుడుగ నిలిచినవాడును,వాడియైన చక్రాయుధము హస్తమందుగల సర్వేశ్వరుడు(ఎవరనిన) నాలుగు వేదములు,పంచ మహాయజ్ఞములు,ఆరు వేదాంగములు, సప్త స్వరములు మొదలగువానితో కాలము గడుపుచుండెడి బ్రాహ్మణోత్తములు నివసించుచున్న తిరు నఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న తిరునఱైయూర్ నమ్బియే! సుమా!.
పన్దార్ విరలాళ్ పాఞ్జాలి, కూన్దల్ ముడిక్క ప్పారదత్తు,
కన్దార్కళిర్ట్రు క్కழల్ మన్నర్ కలఙ్గ, శఙ్గమ్ వాయ్ వైత్తాన్,
శెన్దామరైమేల్ అయనోడు, శివనుమనైయ పెరుమైయోర్,
నన్దావణ్ కై మఱైయోర్ వాழ், నఱైయూర్ నిన్ఱ నమ్బియే ll 1515
పన్దు ఆర్ విరలాళ్ = బంతిచే పరిపూర్ణమై మిక్కిలి మనోజ్ఞమైన వేళ్ళుగల; పాఞ్జాలి = ద్రౌపది; కూన్దల్ ముడిక్క = తన కుంతలములను తిరిగి కొప్పుగ ముడుచుకొనుటకై; పారదత్తు= మహాభారతయుద్దమున; కన్దు ఆర్ కళిఱు = మదజలముయొక్క పరిమళము గల గజములపై వేంచేసినవారును; కழల్ మన్నర్= తమ కాళ్ళయందు వీరకంకణములు గల (దుర్యోదనాదులు మొదలగు)మహారాజుల; కలఙ్గ=మనస్సులు కలతచెందునట్లు; శఙ్గమ్ వాయ్ వైత్తాన్ = తనయొక్క పాంచజన్యమను శంఖమును పూరించిన సర్వేశ్వరుడు;(ఎవరనిన) శెమ్ తామరైమేల్ అయనోడు శివనుమ్ అనైయ = అందమైన కమలముపై ఆసనుడైన బ్రహ్మతోను మరియు శివునితోను సరిసమానమైన; పెరుమైయోర్ = గొప్పతనము కలిగినవారును; నన్దా వణ్ కై = ఎన్నడును కొరతలేని ఔదార్యము కలిగిన; మఱైయోర్ వాழ்= బ్రాహ్మణోత్తములు నివసించుచున్న;నఱైయూర్ = తిరునఱైయూర్ దివ్యదేశమందు; నిన్ఱ=నిత్యవాసము చేయుచున్న; నమ్బియే = తిరునఱైయూర్ నమ్బియే! సుమా!.
బంతిచే పరిపూర్ణమై మిక్కిలి మనోజ్ఞమైన వేళ్ళుగల ద్రౌపది తన కుంతలములను తిరిగి కొప్పుగ ముడుచుకొనుటకై, మహాభారతయుద్దమున మదజలముయొక్క పరిమళము గల గజములపై వేంచేసినవారును,తమ కాళ్ళయందు వీరకంకణములుగల (దుర్యోదనాదులు మొదలగు)మహారాజుల మనస్సులు కలతచెందునట్లు తనయొక్క పాంచజన్యమను శంఖమును పూరించిన సర్వేశ్వరుడు (ఎవరనిన),అందమైన తామర పుష్పముపై ఆసనుడైన బ్రహ్మతోను మరియు శివునితోను సరిసమానమైన గొప్పతనము కలిగిన వారును,ఎన్నడును కొరతలేని ఔదార్యము కలిగిన బ్రాహ్మణోత్తములు నివసించు తిరు నఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న తిరు నఱైయూర్ నమ్బియే! సుమా!.
ఆఱుమ్ పిఱైయుమ్ అరవముమ్, అడమ్బుమ్ శడై మేల్ అణిన్దు, ఉడలమ్
నీఱుమ్ పూశి ఏఱూరుమ్, ఇఱైయోన్ శెన్ఱు కుఱైయిరప్ప,
మాఱొన్ఱిల్లా వాశనీర్, వరై మార్బగలత్తు అళిత్తు ఉకన్దాన్,
నాఱుమ్ పొழிల్ శూழ் న్దழగాయ, నఱైయూర్ నిన్ఱ నమ్బియే ll 1516
ఆఱుమ్ = గంగానదియు; పిఱైయుమ్ = చంద్రకళను; అరవముమ్ = సర్పములను; అడమ్బుమ్ = ” అడమ్బుమ్” అను పుష్పమును;శడై మేల్ అణిన్దు=తనయొక్క జటలపై ధరించి; ఉడలమ్ = శరీరముపై; నీఱుమ్ పూశి = బూడిద రాసుకొని;ఏఱ ఊరుమ్ = వృషభముపై పయనించు; ఇఱైయోన్ = శివుడు; శెన్ఱు = వచ్చి;కుఱై ఇరప్ప= తనయొక్క బ్రహ్మహత్యాపాతకమును తొలగింపుమని ప్రార్ధింపగ;వరై మార్బు అగలత్తు=పర్వతముపోలిన దివ్య వక్షస్థలమునుండి;మాఱు ఒన్ఱు ఇల్లా వాశమ్ నీర్=సాటిలేని పరిమళభరితమైన స్వేదజలమును;అళిత్తు=ఒసగి;ఉకన్దాన్=సంతోషించిన సర్వేశ్వరుడు (ఎవరనిన ); నాఱుమ్ పొழிల్ శూழ் న్ద అழగాయ = పరిమళభరితమైన తోటలతో చుట్టుకొనియున్న సుందరమైన; నఱైయూర్ = తిరునఱైయూర్ దివ్యదేశమందు; నిన్ఱ=నిత్యవాసము చేయుచున్న; నమ్బియే = తిరునఱైయూర్ నమ్బియే! సుమా!.
గంగానదియు,చంద్రకళను,సర్పములను,” అడమ్బుమ్” అను పుష్పమును, తనయొక్క జటలపై ధరించి,శరీరముపై బూడిద రాసుకొని, వృషభముపై పయనించు శివుడు తనయొక్క బ్రహ్మహత్యాపాతకమును తొలగింపుమని ప్రార్ధింపగ, పర్వతము పోలిన దివ్య వక్షస్థలమునుండి సాటిలేని పరిమళభరితమైన స్వేదజలమును ఒసగి సంతోషించిన సర్వేశ్వరుడు (ఎవరనిన) , పరిమళభరితమైన తోటలతో చుట్టుకొనియున్న సుందరమైన తిరు నఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న తిరు నఱైయూర్ నమ్బియే! సుమా!.
** నన్మైయుడైయ మఱైయోర్వాழ், నఱైయూర్ నిన్ఱ నమ్బియై,
కన్ని మదిళ్ శూழ் వయల్ మఙ్గై, క్కలియన్ ఒలి శెయ్ తమిழ் మాలై,
పన్ని యులగిల్ పాడువార్, పాడుశారా పழవినైగళ్,
మన్ని యులగమాణ్డు పోయ్, వానోర్ వణఙ్గ వాழ்వారే ll 1517
నన్మై ఉడైయ మఱైయోర్ వాழ் = విలక్షణమైన వైదిక బ్రాహ్మణోత్తముల నివసించుచున్న; నఱైయూర్ నిన్ఱ నమ్బియై=తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్నతిరునఱైయూర్ నమ్బి విషయమై; కన్ని మదిళ్=దృఢమైన ప్రాకారములతోను, వయల్ = పొలములతోను; శూழ் = చుట్టుకొనియున్న; మఙ్గై = తిరుమంగై దేశమునకు ప్రభువైన; కలియన్=తిరుమంగై ఆళ్వార్; ఒలి శెయ్ తమిழ் మాలై= అనుగ్రహించిన తమిళభాషలో నున్న ఈ పాశురముల మాలను;ఉలగిల్=ఈ లోకమున; పన్ని=పరిశోధించి; పాడువార్ పాడు = పాడుచుండువారి సమీపమున; పழ వినైగళ్ = పూర్వపు పాపములు; శారా = చేరలేవు; (మరియు) మన్ని = చాలకాలము సుఖముగ నివసించి; ఉలగమ్ ఆణ్డు = ఈ లోకమును పాలించి; పోయ్=(పిదప పరమపదమునకు) పోయి;వానోర్ వణఙ్గ=అచటి నిత్యవాసులు ఆదరించునట్లు; వాழ்వార్ = సుఖమును పొందుదురు.
విలక్షణమైన వైదిక బ్రాహ్మణోత్తముల నివసించుచున్న తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న తిరునఱైయూర్ నమ్బి విషయమై,దృఢమైన ప్రాకారములతోను, పొలములతోను చుట్టుకొనియున్న తిరుమంగై దేశమునకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన తమిళభాషలో నున్న ఈ పాశురముల మాలను ఈ లోకమున పరిశోధించి పాడుచుండువారి సమీపమున పూర్వపు పాపములు చేరలేవు. మరియు చాలకాలము సుఖముగ నివసించి,ఈ లోకమును పాలించి, పిదప పరమపదమునకు పోయి, అచటి నిత్యవాసులు ఆదరించునట్లు సుఖమును పొందుదురు.
************