పెరియతిరుమొழி-6వపత్తు (9)

శ్రీః

9 . పెడైయడర్త

(కోయిల్ తిరుమొழி)

తిరునఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని దివ్య పాదద్వందములందు చేరి ఉజ్జీవింపమని తమ మనస్సుకు తిరుమంగై ఆళ్వార్ ప్రబోధించుచున్నారు.

** పెడైయడర్త మడవన్నమ్, పిరియాదు,  మలర్కమలమ్

మడలెడుత్తు మదునుగరుమ్,  వయలుడుత్త తిరునఱైయూర్, 

ముడైయడర్త శిరమేన్ది, మూవులగుమ్ పలి తిరివోన్,

ఇడర్ కెడుత్త తిరువాళన్, ఇణై యడియే యడైనెఞ్జే  ll 1528

పెడై అడర్త = తన ఆడ పక్షితో కూడిన;మడ అన్నమ్ = అందమైన హంస;పిరియాదు= ఒక క్షణమైనను విడువక; మలర్ కమలమ్ = వికసించిన తామరపుష్పమందు;మడల్ ఎడుత్తు = దళములను విడదీసి; మదు నుగరుమ్ = తేనెను పానముచేయుచుండెడి; వయల్ ఉడుత్త = పొలములచే చుట్టుకొనియున్న; తిరునఱైయూర్ = తిరు నఱైయూర్  దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న ;ముడై అడర్త = (కుళ్ళిపోవుటచే) దుర్వాసనతో కూడిన,శిరమ్ ఏన్ది=బ్రహ్మకపాలమును చేతియందుకలిగి;మూఉలగుమ్= మూడు లోకములందును; పలి తిరివోన్ = భిక్షమెత్తుకొని తిరిగెడి శివునియొక్క; ఇడర్ కెడుత్త= బ్రహ్మహత్యాపాతకమును తొలిగించిన; తిరు ఆళన్=దివ్యమైన ప్రభువు యొక్క; ఇణై అడియే = పాదద్వందములను; నెఞ్జే అడై = ఓ! నా మనసా! ఆశ్రయించుమా!.

  తన ఆడ పక్షితో కూడిన అందమైన హంస ఒక క్షణమైనను విడువక కలసియుండి, వికసించిన తామరపుష్పమందు దళములను విడదీసి తేనెను పానము చేయుచుండెడి పొలములచే చుట్టుకొనియున్న తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న, (కుళ్ళిపోవుటచే) దుర్వాసనతో కూడిన బ్రహ్మకపాలమును చేతియందుకలిగి మూడు లోకములందును భిక్షమెత్తుకొని తిరిగెడి శివునియొక్క బ్రహ్మహత్యాపాతకమును తొలిగించిన దివ్యమైన ప్రభువు యొక్క పాదద్వందములను ఓ! నా మనసా! ఆశ్రయించుమా!.

కழிయారుమ్ కన శఙ్గమ్, కలన్దు ఎఙ్గుమ్ నిఱైన్దు ఏఱి,

వழிయార ముత్తీన్ఱు, వళఙ్గొడుక్కుమ్ తిరు నఱైయూర్, 

పழிయారుమ్ విఱల్ అరక్కన్, పరు ముడిగళవై శిదఱ,

అழలారుమ్ శరన్దురన్దాన్,  అడియిణైయే యడైనెఞ్జే   ll 1529

కழி ఆరుమ్=ఉప్పు కాలువయందు నిండియున్న;కనమ్ శఙ్గమ్=ఘనమైన శంఖములు; ఎఙ్గుమ్ కలన్దు = అన్ని ప్రదేశములనందుండి వచ్చిచేరి; నిఱైన్దు=వరుస వరుసగ; ఏఱి = పాకుచు; వழி ఆర = దారి పొడుగున; ముత్తు ఈన్ఱు = ముత్యములు ఇచ్చుచు; వళమ్ కొడుక్కుమ్=సంపదలు కలుగజేయు; తిరు నఱైయూర్=తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న; పழி ఆరుమ్ =మిక్కిలి చెడ్డపేరుకలిగిన; విఱల్ అరక్కన్ = బలిష్టుడైన రాక్షసుడు రావణాసురునియొక్క; పరు ముడిగళ్ అవై శిదఱ = పెరిగియున్న పది తలలను ఛిన్నభిన్నమగునట్లు;అழల్ ఆరుమ్ శరమ్ తురన్దాన్=నిప్పులు గ్రక్కుచున్న బాణములను ప్రయోగించిన సర్వేశ్వరుని; ఇణై అడియే=పాదద్వందములను; నెఞ్జే అడై = ఓ! నా మనసా! ఆశ్రయించుమా!.

                             ఉప్పు కాలువయందు నిండియున్న ఘనమైన శంఖములు, అన్ని ప్రదేశములనందుండి వచ్చిచేరి, వరుస వరుసగ పాకుచు దారి పొడుగున ముత్యములు ఇచ్చుచు సంపదలు కలుగజేయు తిరునఱైయూర్ దివ్య దేశమున నిత్యవాసము చేయుచున్న, మిక్కిలి చెడ్డపేరుకలిగిన బలిష్టుడైన రాక్షసుడు రావణాసురునియొక్క పెరిగియున్న పది తలలను ఛిన్నభిన్నమగునట్లు నిప్పులుగ్రక్కుచున్న బాణములను ప్రయోగించిన సర్వేశ్వరుని పాదద్వందములను, ఓ! నా మనసా! ఆశ్రయించుమా!.

శుళైకొణ్డ పలఙ్గనిగళ్, తేన్ పాయ కదళిగళిన్,

తిళైకొణ్డ పழమ్ కెழுము, తిగழ் శోలై త్తిరు నఱైయూర్, 

వళైకొణ్డ వణ్ణత్తన్, పిన్ తోన్ఱల్ మూవులగోడు,

అళైవెణ్ణె యుణ్డాన్ తన్, అడియిణైయే యడైనెఞ్జే   ll 1530

శుళై కొణ్డ = పలు తొనలతో నిండిన; పలమ్ కనిగళ్ = పనసపండ్లనుండి;తేన్ పాయ = తేనె స్రవించుచుండునదియు;కదళిగళిన్=అరటిచెట్లయొక్క,తిళై కొణ్డ  పழమ్ కెழுము= అరటిపండ్ల గెలలతో దట్టముగ వ్యాపించి; తిగழ் శోలై = ప్రకాశించుచుండు తోటలుగల; తిరు నఱైయూర్=తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న; వళై కొణ్డ వణ్ణత్తన్=శంఖమువలె తెల్లని వర్ణముగల బలరామునియొక్క;పిన్ తోన్ఱల్=తమ్ముడును; మూవులగోడు=మూడు లోకములును మరియు;అళై వెణ్ణె ఉణ్డాన్ తన్=పెరుగు,వెన్నను ఆరగించిన సర్వేశ్వరుని;అడి ఇణైయే= పాదద్వందములను;నెఞ్జే అడై = ఓ! నా మనసా! ఆశ్రయించుమా!.

పలు తొనలతో నిండిన పనసపండ్లనుండి తేనె స్రవించుచుండునదియు, అరటిచెట్లయొక్క అరటిపండ్ల గెలలతో దట్టముగ వ్యాపించి ప్రకాశించుచుండు తోటలుగల తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న,శంఖమువలె తెల్లని వర్ణముగల బలరామునియొక్క తమ్ముడును, మూడు లోకములును మరియు పెరుగు, వెన్నను ఆరగించిన సర్వేశ్వరుని పాదద్వందములను, ఓ! నా మనసా! ఆశ్రయించుమా!.

తున్ఱోళిత్తుగిఱ్పడలమ్, తున్ని యెఙ్గుమ్ మాళిగైమేల్,

నిన్ఱార వాన్ మూడుమ్, నీళ్ శెల్వత్తిరునఱైయూర్,

మన్ఱార కుడమాడి, వరైయెడుత్తు మழைతడుత్త,

కున్ఱారుమ్ తిరళ్ తోళన్, కురైకழలే యడైనెఞ్జే   ll 1531

తున్ఱు=దగ్గరగ చేరి;ఓళి=ఒకే వరుసలో;తుగిల్ పడలమ్=ధ్వజములయొక్క విస్తృతి కలిగి; మాళిగైమేల్= భవంతులపైన;ఎఙ్గుమ్=అంతటను;తున్ని=నిబిడముగ; ఆర నిన్ఱు= వ్యాపించియుండి; వాన్ మూడుమ్ = ఆకాశమును కప్పుచున్నదియు; నీళ్ శెల్వమ్ = గొప్ప సంపదలతో తులతూగుచున్న; తిరునఱైయూర్ = తిరునఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న; మన్ఱు ఆర = బయట మైదానములందు; కుడమ్ ఆడి = కుంభనృత్యము చేసిన వాడును; వరై ఎడుత్తు మழை తడుత్త = గోవర్ధనపర్వతమును గొడుగుగ చేసుకొని పైకెత్తి (ఇంద్రునిచే) కురిపింపబడిన భయంకరమైన వర్షమును అడ్డగించినవాడును; కున్ఱు అరుమ్ తిరళ్ తోళన్=పర్వతము పోలిన దృఢమైన కండలు తిరిగిన భుజములుగల సర్వేశ్వరుని; కురైకழలే=శబ్దించెడి వీర కంకణములుగల దివ్య పాదద్వందములను;నెఞ్జే అడై=ఓ! నా మనసా!ఆశ్రయించుమా!.

దగ్గరగ చేరి ఒకే వరుసలో ధ్వజములయొక్క విస్తృతి కలిగి భవంతులపైన అంతటను నిబిడముగ వ్యాపించియుండి ఆకాశమును కప్పుచున్నదియు, గొప్ప సంపదలతో తులతూగుచున్న తిరునఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న, బయట మైదానములందు కుంభనృత్యము చేసిన వాడును, గోవర్ధనపర్వతమును గొడుగుగ చేసుకొని పైకెత్తి  (ఇంద్రునిచే) కురిపింపబడిన భయంకరమైన వర్షమును అడ్డగించినవాడును, పర్వతము పోలిన దృఢమైన కండలు తిరిగిన భుజములుగల సర్వేశ్వరుని,శబ్దించెడి వీర కంకణములుగల దివ్య పాదద్వందములను ! నా మనసా!ఆశ్రయించుమా!.

అగిల్ కుఱడుమ్ శన్దనముమ్, అమ్బొన్నుమ్ అణిముత్తుమ్,

మిగక్కొణర్ న్దు తిరైయున్దుమ్, వియన్ పొన్ని త్తిరునఱైయూర్,

పకల్ కరన్ద శుడరాழிపడైయాన్, ఇవ్వులగేழுమ్,

పుగ క్కరన్ద తిరువయిర్ట్రిన్, పొన్నడియే యడైనెఞ్జే   ll 1532

అగిల్ కుఱడుమ్=అగిల్ చెట్టుయొక్క కర్రలును;శన్దనముమ్=చందనపు కర్రలును; అమ్ పొన్నుమ్ = అందమైన బంగారము; అణి ముత్తుమ్=అందమైన ముత్యములను;తిరై = కెరటములు; మిగ కొణర్ న్దు ఉన్దుమ్=మిక్కుటముగ సేకరించికొనివచ్చి గట్లమీద చేర్చు;  వియన్ పొన్ని = విశాలమైన కావేరినదిగల; తిరునఱైయూర్ = తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న;పకల్ కరన్ద=(భారతయుద్దమందు) సూర్యుని మరుగుపరచిన; శుడర్ ఆழி పడైయాన్ = ఉజ్వలమైన చక్రాయుధము హస్తమందుగల కలవాడును; ఇ ఉలగు ఏழுమ్ = ఈ సప్తలోకములను;పుగ కరన్ద తిరు వయిర్ట్రిన్= తన నోటియందు ప్రవేశింపజేసి ఆస్వాదించి మరుగుపరచిన దివ్యఉదరముగల సర్వేశ్వరుని, పొన్ అడియే = అందమైన పాదద్వందములను; నెఞ్జే అడై = ఓ! నామనసా! ఆశ్రయించుమా!.

అగిల్ చెట్టుయొక్క కర్రలును,చందనపు కర్రలును,అందమైన బంగారము,  అందమైన ముత్యములను, కెరటములు మిక్కుటముగ సేకరించికొనివచ్చి గట్లమీద చేర్చు విశాలమైన కావేరినదిగల తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న, (భారతయుద్దమందు) సూర్యుని మరుగుపరచిన ఉజ్వలమైన చక్రాయుధము హస్తమందుగల కలవాడును,ఈ సప్తలోకములను తన నోటియందు ప్రవేశింపజేసి ఆస్వాదించి మరుగుపరచిన దివ్యఉదరముగల సర్వేశ్వరుని అందమైన పాదద్వందములను ఓ! నా మనసా!ఆశ్రయించుమా!.

పొన్ ముత్తుమ్ అరియుగిరమ్, పుழைక్కైమ్మా కరిక్కోడుమ్,

మిన్న త్తణ్ తిరై యున్దుమ్, వియన్ పొన్ని త్తిరునఱైయూర్, 

మిన్నొత్త నుణ్ మరుఙ్గుల్, మెల్లియలై, తిరు మార్బిల్

మన్న త్తాన్ వైత్తుగన్దాన్, మలరడియే యడైనెఞ్జే   ll 1533

మిన్న = నిగనిగలాడే; పొన్ = బంగారము;ముత్తుమ్=ముత్యములను;అరి ఉగిరమ్= సింహము యొక్క నఖములను;పుழை కై మా కరి కోడుమ్=గొట్టమువంటి తొండముగల పెద్ద ఏనుగులయొక్క దంతములను; తణ్ తిరై ఉన్దుమ్ = చల్లని అలలచే కొట్టుకొనివచ్చి ఒడ్డులయందు చేర్చెడి; వియన్ పొన్ని = విశాలమైన కావేరినదిగల; తిరునఱైయూర్ = తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న;మిన్ ఒత్త = మెరుపువలె; నుణ్ మరుఙ్గుల్ = సన్నని నడుముగల; మెల్ ఇయలై= సౌకుమార్యమైన స్వభావముగల  శ్రీమహాలక్ష్మిని; తిరు మార్బిల్ = దివ్యమైన వక్షస్థలమందు; మన్న = నివసించునట్లు; తాన్ వైత్తు ఉగన్దాన్ = తాను ధరించుకొని ఆనందముతో ఉప్పొంగిన సర్వేశ్వరుని; మలర్ అడియే = దివ్యమైన పద్మములవంటి పాదద్వందములను; నెఞ్జే అడై = ఓ! నామనసా! ఆశ్రయించుమా! . 

    నిగనిగలాడే బంగారము, ముత్యములను,సింహము యొక్క నఖములను, గొట్టమువంటి తొండముగలపెద్ద ఏనుగులయొక్క దంతములను చల్లని అలలచే కొట్టుకొనివచ్చి ఒడ్డులయందు చేర్చెడి విశాలమైన కావేరినదిగల తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న, మెరుపువలె సన్నని నడుముగల సౌకుమార్యమైన స్వభావముగల శ్రీమహాలక్ష్మిని దివ్యమైన వక్షస్థలమందు నివసించునట్లు తాను ధరించుకొని ఆనందముతో ఉప్పొంగిన సర్వేశ్వరుని,దివ్యమైన పద్మములవంటి పాదద్వందములను ఓ! నామనసా! ఆశ్రయించుమా! . 

శీర్ తழைత్త కదిర్ చ్చెన్నెల్, శెఙ్గమలత్తు ఇడైయిడై యిన్,

పార్ తழைత్తు క్కరుమ్బోఙ్గి, ప్పయన్ విళైక్కుమ్ తిరునఱైయూర్, 

కార్ తழைత్త తిరువురువన్, కణ్ణపిరాన్ విణ్ణవర్ కోన్,

తార్ తழைత్త తుழாయ్ ముడియన్, తళరడియే యడైనెఞ్జే ll  1534

శీర్ తழைత్త కదిర్=మిక్కిలి సుందరమైన కంకులుగల; శెన్నెల్=ఎర్రధాన్యపు పొలములు కలదియు; (వాటి పక్కనే) శెమ్ కమలత్తు = ఎర్ర తామరలు కలిగినవియు; ఇడై యిడై యిన్ = మధ్య మధ్యలో; క్కరుమ్బు = చెరకుమొక్కలు; ఓఙ్గి పార్ తழைత్తు = ఎత్తుగ నేలపై ఒరుగునట్లు పెరిగి; పయన్ విళైక్కుమ్ = లాభము కలిగించు; తిరునఱైయూర్ = తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న; కార్ తழைత్త తిరు ఉరువిన్ = కాలమేఘమువంటి తిరుమేనిగలవాడును;విణ్ణవర్ కోన్ = దేవాదిదేవుడును; తార్ తழைత్త తుழாయ్ ముడియన్ = పూలతోనిండిన తులసీమాలలు తన దివ్యమైన శిరస్సున ధరించినవాడును, కణ్ణపిరాన్ = శ్రీకృష్ణుని; తళర్ అడియే = పల్లవములవంటి పాదద్వందములను; నెఞ్జే అడై = ఓ! నామనసా! ఆశ్రయించుమా! .

            మిక్కిలి సుందరమైన కంకులుగల ఎర్రధాన్యపు పొలములు కలదియు,వాటి పక్కనే ఎర్ర తామరలు కలిగినవియు మధ్య మధ్యలో చెరకుమొక్కలు ఎత్తుగ నేలపై ఒరుగునట్లు పెరిగి లాభము కలిగించు తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న, కాలమేఘమువంటి తిరుమేనిగలవాడును,దేవాదిదేవుడును పూలతోనిండిన తులసీమాలలు తన దివ్యమైన శిరస్సున ధరించినవాడును,శ్రీకృష్ణుని పల్లవములవంటి పాదద్వందములను ఓ! నామనసా! ఆశ్రయించుమా! .

**  కులైయార్ న్ద పழுక్కాయుమ్, పశుఙ్గాయుమ్ పాళైముత్తుమ్,

తలైయార్ న్ద ఇళమ్ కముగిన్, తడఞ్జోలై త్తిరునఱైయూర్, 

మలైయార్ న్ద కోలమ్ శేర్, మణిమాడ మిగమన్ని,

నిలైయార నిన్ఱాన్ తన్, నీళ్ కழలే యడైనెఞ్జే   ll   1535

కులై ఆర్ న్ద పழு కాయమ్=గెలలతో నిండిన పండిన కాయలును;పశుమ్ కాయుమ్ = పండని పచ్చని కాయలును; పాళై ముత్తుమ్ = పూబాళలలోనున్న ముత్యములును; తలై ఆర్ న్ద ఇళమ్ కముగిన్ = శిఖరమున నిండియున్న లేత పోకచెట్లయొక్క; తడమ్ శోలై = విశాలమైన తోటలు కలిగిన; తిరునఱైయూర్ = తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న; మలై ఆర్ న్ద కోలమ్ శేర్=పర్వతమువలె అందము కలిగిన; మణి మాడమ్ = మణిమాడక్కోయిల్  లో; మిగ మన్ని= మిక్కిలి అమరి;  నిలై ఆర నిన్ఱాన్ తన్ = స్థిరముగ వేంచేసియున్న సర్వేశ్వరుని; నీళ్ కழలే = పొడుగైన పాదద్వందములను; నెఞ్జే అడై = ఓ! నామనసా! ఆశ్రయించుమా! .

గెలలతో నిండిన, పండిన కాయలు,పండని పచ్చని కాయలు,పూబాళలలోనున్న ముత్యములు, శిఖరమున నిండియున్న లేత పోకచెట్లయొక్క విశాలమైన తోటలు కలిగిన తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న,పర్వతమువలె అందము కలిగిన మణిమాడక్కోయిల్  లో మిక్కిలి అమరి,స్థిరముగ వేంచేసియున్న సర్వేశ్వరుని పొడుగైన పాద ద్వందములను ఓ! నామనసా! ఆశ్రయించుమా!.

మఱైయారుమ్ పెరువేళ్వి, క్కొழுమ్పుగై పోయ్ వళర్ న్దు, ఎఙ్గుమ్ 

నిఱైయార వాన్ మూడుమ్, నీళ్ శెల్వత్తిరునఱైయూర్, 

పిఱైయారుమ్ శడైయానుమ్, పిరమనుమున్ తొழுదేత్త,

ఇఱైయాగి నిన్ఱాన్ తన్, ఇణైయడియే యడైనెఞ్జే   ll 1536

మఱై ఆరుమ్ = వేదములచే ప్రతిపాదింపబడిన; పెరు వేళ్వి = పెద్ద యఙ్ఞములవలన; క్కొழுమ్ పుగై = మంచి ధూమము; వళర్ న్దు పోయ్ = అధికమై పైకెగిసి ;ఎఙ్గుమ్ = అంతటను; నిఱై ఆర వాన్ మూడుమ్ = సంపూర్ణముగ ఆకాశమును మరుగుపరచెడి; నీళ్ శెల్వ=మిక్కిలి సంపదలుగల;తిరునఱైయూర్ = తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న; పిఱై ఆరుమ్ శడైయానుమ్ = చంద్రకళను తనయొక్క  జటల యందుగల శివుడును; పిరమనుమ్ = చతుర్ముఖ బ్రహ్మయు;మున్=ముంగిటనే నిలిచి; తొழுదు ఏత్త = సేవించుకొని స్తుతించునట్లు; ఇఱై ఆగి నిన్ఱాన్ తన్ = స్వామిగ నిలిచిన సర్వేశ్వరుని; ఇణై అడియే = పాదద్వందములను; నెఞ్జే అడై = ఓ! నామనసా! ఆశ్రయించుమా!

వేదములచే ప్రతిపాదింపబడిన పెద్ద యఙ్ఞములవలన మంచి ధూమము అధికమై పైకెగిసి అంతటను సంపూర్ణముగ ఆకాశమును మరుగుపరచెడి మిక్కిలి సంపదలుగల తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న,చంద్రకళను తనయొక్క  జటల యందుగల శివుడును, చతుర్ముఖ బ్రహ్మయు ముంగిటనే నిలిచి సేవించుకొని స్తుతించునట్లు స్వామిగ నిలిచిన సర్వేశ్వరుని పాదద్వందములను ఓ! నామనసా! ఆశ్రయించుమా!.

** తిణ్ కళగ మదిళ్ పుడై శూழ், తిరునఱైయూర్ నిన్ఱానై,

వణ్ కళగ నిలవెఱిక్కుమ్, వయల్ మఙ్గై నగరాళన్,

పణ్ కళగమ్ పయిన్ఱ శీర్, ప్పాడలివై పత్తుమ్ వల్లార్, 

విణ్ కళగత్తు ఇమైయవరాయ్, వీర్ట్రిరున్దు వాழ்వారే  ll 1537

తిణ్  కళగమ్ మదిళ్ = దృఢముగ సిమెంటుతో కట్టబడిన ప్రాకారములతో; పుడై శూழ்=నాలుగు వైపుల చుట్టుకొనియున్న; తిరునఱైయూర్ నిన్ఱానై = తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై; నిల ఎఱిక్కుమ్ = చంద్రుని వలె ప్రకాశించుచుండు; వణ్ కళగమ్= అందమైన హంసలును; వయల్  = పొలములుగల; మఙ్గై నగర్ ఆళన్ = తిరుమంగై దేశమునకు ప్రభువు తిరుమంగై ఆళ్వార్ ; పణ్ కళ్ అగమ్ పయిన్ఱ = రాగభరితమైనవానిలో అతి మధురమైనది అనుగ్రహించిన; శీర్=గొప్పతనము కలిగిన; పాడల్ ఇవై పత్తుమ్ వల్లార్ = ఈ పది పాశురములు పఠించువారు;  విణ్ కళ్ అగత్తు = పై లోకములలో ముఖ్యమైన పరమపదమందు; ఇమైయవర్ ఆయ్ = నిత్యశూరులయొక్క గోష్ఠిలో ఒకరై; వీర్ట్రిరున్దు వాழ்వారే = ఆ పరమపదమందు నిత్యసేవలో సుఖముగ నివసింతురు.

        దృఢముగ సిమెంటుతో కట్టబడిన ప్రాకారములతో నాలుగువైపుల చుట్టుకొనియున్నతిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై, చంద్రుని వలె ప్రకాశించుచుండు అందమైన హంసలును, పొలములుగల తిరుమంగై దేశమునకు ప్రభువు తిరుమంగై ఆళ్వార్,  రాగభరితమైనవానిలో అతి మధురమైనది అనుగ్రహించిన, గొప్పతనము కలిగిన ఈ పది పాశురములు పఠించువారు పై లోకములలో ముఖ్యమైన పరమపదమందు నిత్యశూరులయొక్క గోష్ఠిలో ఒకరై ఆ పరమపదమందు నిత్యసేవలో సుఖముగ నివసింతురు.

******

వ్యాఖ్యానించండి