పెరియతిరుమొழி-10వపత్తు (1)

శ్రీః 

శ్రీమతే రామనుజాయనమః

తిరుమంగై ఆళ్వార్ ముఖారవిన్దమునుండి వెలువడిన

_______________

పెరియతిరుమొழி-10వపత్తు

____________

శ్రీః

1 . ఒరునల్ శుర్ట్రమ్

  శ్రీమన్నారాయణుని నిర్హేతుకకృపచే తిరుమంత్రోపదేశమును పొంది, పలు దివ్యదేశములందు  ఆసర్వేశ్వరుని దివ్యమంగళస్వరూపమును, కల్యాణ గుణములను అనుభవించిన తిరుమంగై ఆళ్వార్ తాము పరమపదమునకు ఏతెంచుటకుముందు తమ హృదయమున హత్తుకొన్న కొన్ని దివ్యదేశములను సేవించుకొనుచున్నారు.

** ఒరునల్ శుర్ట్రమ్, ఎనక్కు యిరు ఒణ్ పొరుళ్,

వరునల్తొల్కది, ఆగియమైన్దనై,

నెరునల్కణ్డదు, నీర్మలై యిన్ఱు పోయ్,

కరునెల్ శూழ், కణ్ణమఙ్గైయుళ్ కాణ్డుమే  ll 1848

ఒరు నల్ శుర్ట్రమ్ = అద్వితీయమైన విలక్షణమైన బంధువును;ఎనక్కు ఉయిర్ = నాయొక్క ప్రాణమును; ఒణ్ పొరుళ్ = శ్లాఘ్యమైన నిధియును;వరు నల్ తొల్ కది ఆగియ = నాకు రాబోవు మంచి అనాదియైన పరమగతిగ ఉండువాడును; మైన్దనై = నిత్యయౌవనుడైన సర్వేశ్వరుని;నెరునల్= నిన్నటిదినమున;;నీర్మలై= తిరు నీర్మలై దివ్యదేశములో వేంచేసియున్న నీర్వణ్ణ పెరుమాళ్ ను; కణ్డదు = సేవించుకొంటిని; ఇన్ఱు = ఈ దినమున; (ఎచటకనగ)కరు నెల్ శూழ் = నల్ల ధాన్యపుపంటలచే చుట్టుకొనియున్న;కణ్ణమఙ్గైయుళ్ పోయ్ = తిరుకణ్ణమఙ్గై దివ్యదేశమునకు పోయి భక్తవత్సల పెరుమాళ్ ను; కాణ్డుమ్= సేవించుకొందును! .

        అద్వితీయమైన విలక్షణమైన బంధువును,నాయొక్క ప్రాణమును, శ్లాఘ్యమైన నిధియును, నాకు రాబోవు మంచి అనాదియైన పరమగతిగ ఉండు వాడును, నిత్యయౌవనుడైన సర్వేశ్వరుని నిన్నటిదినమున తిరు నీర్మలై దివ్యదేశములో వేంచేసియున్న నీర్వణ్ణ పెరుమాళ్ ను, సేవించుకొంటిని.ఈ దినమున (ఎచటకనగ) నల్ల ధాన్యపుపంటలచే చుట్టుకొనియున్న తిరుకణ్ణమఙ్గై దివ్యదేశమునకు పోయి, భక్తవత్సల పెరుమాళ్ ను సేవించుకొందును! .

  ** పొన్నై మామణియై, అణియార్ న్ద దోర్

మిన్నై, వేఙ్గడత్తుచ్చియిల్ కణ్డుపోయ్,

ఎన్నై యాళుడై యీశనై, ఎమ్బిరాన్ 

తన్నై, యామ్ శెన్ఱుకాణ్డుమ్, తణ్గావిలే  ll 1849

పొన్నై = బంగారమువలె ఆశింపబడువాడును;మా మణియై=శ్లాఘ్యమైన నీలమణివంటి  వర్ణము కలవాడును; అణి ఆర్ న్ద దు ఓర్ మిన్నై = మిక్కిలి సుందరమైన  మెరుపువలె ప్రకాశించువాడును; ఎన్నై ఆళుడై ఈశనై = నన్ను పాలించు స్వామియైన; ఎమ్బిరాన్ తన్నై = సర్వేశ్వరుని; (నెరునల్=నిన్నటి దినమున) వేఙ్గడత్తు ఉచ్చియిల్ కణ్డు పోయ్ = తిరు వేంకటాచల శిఖరమున వేంచేసియున్న శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ను సేవించికొన్న; యామ్= దాసులైన మేము; (ఇన్ఱు = ఈ దినమున); తణ్ కావిలే శెన్ఱు = తిరు తణ్ కావిల్ దివ్యదేశమునకు పోయి అచట వేంచేసియున్న విళక్కాళి పెరుమాళ్ ను; కాణ్డుమ్ = సేవించుకొందుము ! 

బంగారమువలె ఆశింపబడువాడును,శ్లాఘ్యమైన నీలమణివంటి  వర్ణము కలవాడును,మిక్కిలి సుందరమైన  మెరుపువలె ప్రకాశించువాడును, నన్ను పాలించు స్వామియైన,సర్వేశ్వరుని,(నిన్నటిదినమున)తిరువేంకటాచల శిఖరమున వేంచేసియున్న శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ను సేవించుకొన్న, దాసులైన మేము,(ఈ దినమున) తిరు తణ్ కావిల్ దివ్యదేశమునకు పోయి అచట వేంచేసియున్న విళక్కాళి పెరుమాళ్ ను సేవించుకొందుము !

వేలైయాలిలై, పళ్ళివిరుమ్బియ,

పాలై ఆరముదత్తినై, పైన్దుழாయ్,

మాలై ఆలియిల్, కణ్డు మగిழ் న్దు పోయ్,

ఞాలమున్నియై క్కాణ్డుమ్, నాఙ్గూరిలే  ll 1850

వేలై = (ప్రళయకాలమున) సముద్రములో;ఆల్ ఇలై=వటదళముపై;పళ్ళి విరుమ్బియ= యోగనిద్రలో పవళించియుండుటకు ఆశించిన; పాలై = పాలువలె భోగ్యమైనవాడును; ఆర్ అముదత్తినై = అపురూపమైన అమృతము వంటివాడును; పైన్దుழாయ్ =పచ్చని తులసీమాలను ధరించియున్న వాడును; ఞాలమ్ ఉన్నియై = లోకమందున్నవారిచే ధ్యానింపబడువాడైన,మాలై=సర్వేశ్వరుని;(నెరునల్=నిన్నటిదినమున);ఆలియిల్ = తిరువాలి దివ్యదేశమున వయలాలి మణవాళన్ పెరుమాళ్ ను; కణ్డు మగిழ் న్దు = సేవించుకొన్న ఆనందముతో; (ఇన్ఱు = ఈ దినమున); నాఙ్గూరిలే పోయ్ = నాఙ్గూర్ దివ్యదేశమునకు పోయి; కాణ్డుమ్= సేవించుకొందుము !

          ( ప్రళయకాలమున) సముద్రములో వటదళముపై యోగనిద్రలో పవళించియుండుటకు ఆశించిన, పాలువలె భోగ్యమైనవాడును, అపురూపమైన అమృతము వంటివాడును,పచ్చని తులసీమాలను ధరించియున్నవాడును, లోకమందున్నవారిచే ధ్యానింపబడువాడైన,సర్వేశ్వరుని (నిన్నటిదినమున) తిరువాలి దివ్యదేశమున వయలాలి మణవాళన్ పెరుమాళ్ ను సేవించుకొన్న ఆనందముతో (ఈ దినమున) నాఙ్గూర్ దివ్యదేశమునకుపోయి సేవించుకొందుము!

తుళక్కమిల్ శుడరై,అవుణనుడల్

పిళక్కుమ్ మైన్దనై, పేరిల్ వణఙ్గి ప్పోయ్,

అళప్పిల్ ఆరముదై, అమరర్కరుళ్

విళక్కినై, శెన్ఱు వెళ్ళఱై క్కాణ్డుమే  ll 1851

తుళక్కమ్ ఇల్ శుడరై = ఏ ఒక్కరివలనను వ్యధ లేని తేజస్సుగలవాడును; అవుణన్ = అసురుడు హిరణ్యాసురుని యొక్క; ఉడల్ = శరీరమును; పిళక్కుమ్ =చీల్చి వధించిన;  మైన్దనై = శక్తివంతుడును; అళప్పు ఇల్ ఆర్ అముదై = అత్యంత అపురూపమైన అమృతము వంటివాడును; అమరర్కు అరుళ్ విళక్కినై = నిత్యశూరులను కరుణించు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని; (నెరునల్=నిన్నటిదినమున); పేరిల్ వణఙ్గి పోయ్ = తిరుప్పేర్ నగరమున అప్పకుడత్తాన్ పెరుమాళ్ ను సేవించినమేము; (ఇన్ఱు=ఈ దినమున); వెళ్ళఱై శెన్ఱు=తిరు వెళ్ళఱై దివ్యదేశమునకు పోయి పుండరీకాక్షన్ పెరుమాళ్ ను; కాణ్డుమ్= సేవించుకొందుము!

         ఏ ఒక్కరివలనను వ్యధ లేని తేజస్సుగలవాడును,అసురుడు హిరణ్యాసురుని యొక్క శరీరమును చీల్చి వధించిన శక్తివంతుడును, అత్యంత అపురూపమైన అమృతము వంటివాడును, నిత్యశూరులను కరుణించు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని (నిన్నటిదినమున) తిరుప్పేర్ నగరమున అప్పకుడత్తాన్ పెరుమాళ్ ను సేవించినమేము ,(ఈ దినమున) తిరు వెళ్ళఱై దివ్యదేశమునకు పోయి పుండరీకాక్షన్ పెరుమాళ్ ను సేవించుకొందుము!

శుడలైయిల్, శుడు నీఱనమర్ న్ద దోర్,

నడలై తీర్తవనై, నఱైయూర్ క్కణ్డు, ఎన్

ఉడలైయుళ్ పుగున్దు, ఉళ్ళమురుక్కి యుణ్,

విడలైయై చ్చెన్ఱుకాణ్డుమ్, మెయ్యత్తుళ్ళే  ll 1852

శుడలైయిల్=దహనముచేయు శ్మశానమున;శుడు నీఱన్=చితిభస్మమును రాసుకొనిన శివునికి ; అమర్ న్దదు = అమరియున్న; ఓర్ నడలై = ఒక కష్టమును ;తీర్తవనై = పోగొట్టి    కరుణించినవాడును;ఎన్ ఉడలైయుళ్ పుగున్దు = నాయొక్క శరీరమున ప్రవేశించి; ఉళ్ళమ్ = హృదయమును;ఉరుక్కి ఉణ్ = ద్రవింపజేయుచున్న; విడలైయై = పరాక్రమశాలియైన సర్వేశ్వరుని; (నెరునల్=నిన్నటిదినమున); నఱైయూర్ కణ్డు=తిరు నఱైయూర్ దివ్యదేశమున నఱైయూర్ నమ్బి పెరుమాళ్ ను సేవించిననేను; (ఇన్ఱు=ఈ దినమున); మెయ్యత్తుళ్ళే శెన్ఱు=తిరు మెయ్యమ్ దివ్యదేశమునకు పోయి సత్యగిరి నాథన్ పెరుమాళ్ ను; కాణ్డుమ్ = సేవించుకొందును!    

      దహనముచేయు శ్మశానమున చితిభస్మమును రాసుకొనిన శివునికి  అమరియున్న ఒక కష్టమును(బ్రహ్మహత్యాపాతకమును) పోగొట్టి కరుణించినవాడును,  నాయొక్క శరీరమున ప్రవేశించి, హృదయమును ద్రవింపజేయుచున్న పరాక్రమశాలియైన సర్వేశ్వరుని (నిన్నటిదినమున) తిరు నఱైయూర్ దివ్యదేశమున నఱైయూర్ నమ్బి పెరుమాళ్ ను సేవించిననేను (ఈ దినమున)తిరు మెయ్యమ్ దివ్యదేశమునకు పోయి సత్యగిరి నాథన్ పెరుమాళ్ ను సేవించుకొందును!   

వానై యారముదమ్, తన్దవళ్ళలై,

తేనై నీళ్ వయల్, శేఱైయిల్ కణ్డుపోయ్, 

ఆనైవాట్టియరుళుమ్, అమరర్ తమ్

కోనై, యామ్ కుడన్దై చ్చెన్ఱుకాణ్డుమే  ll 1853

వానైయార్ = దేవతలకు; అముదమ్ తన్ద = అమృతమును తీసి ఒసగిన; వళ్ళలై = ఉదార స్వభావుడును;తేనై=తేనెవలె భోగ్యమైనవాడును;ఆనై=(కువలయాపీడమను)  ఏనుగును; వాట్టి అరుళుమ్ = గాయపరచి చంపినవాడును; అమరర్ తమ్ కోనై = నిత్యశూరులయొక్క ప్రభువైన సర్వేశ్వరుని;(నెరునల్=నిన్నటిదినమున);నీళ్ వయల్ శేఱైయిల్ = పొడుగైన తోటలుగల తిరుశేఱై దివ్యదేశమున సారనాధ పెరుమాళ్ ను ,కణ్డు పోయ్ = సేవించుకొనిన; యామ్ = దాసులైన మేము; (ఇన్ఱు=ఈ దినమున); కుడన్దై శెన్ఱు = తిరు కుడన్దై దివ్యదేశమునకు పోయి ఆరావముద పెరుమాళ్ ను; కాణ్డుమ్ = సేవించుకొందుము! 

          దేవతలకు అమృతమును తీసి ఒసగిన ఉదార స్వభావుడును, తేనెవలె భోగ్యమైనవాడును,(కువలయాపీడమను)ఏనుగును గాయపరచి చంపిన వాడును, నిత్యశూరులయొక్క ప్రభువైన సర్వేశ్వరుని,(నిన్నటిదినమున) పొడుగైన తోటలుగల తిరుశేఱై దివ్యదేశమున సారనాధ పెరుమాళ్ ను సేవించుకొనిన దాసులైన మేము(ఈ దినమున) తిరు కుడన్దై దివ్యదేశమునకు పోయి ఆరావముద పెరుమాళ్ ను  సేవించుకొందుము! 

కూన్దలార్మగిழ், కోవలనాయ్, వెణ్ణెయ్

మాన్దழுన్దైయిల్, కణ్డు మగిழ் న్దు పోయ్,

పాన్దళ్ పాழிయిల్, పళ్ళివిరుమ్బియ, 

వేన్దనై చ్చెన్ఱుకాణ్డుమ్, వెహ్ కావుళే  ll 1854

కూన్దలార్ మగిழ் కోవలన్ ఆయ్=శ్లాఘ్యమైన కేశములుగల గోపస్త్రీలు ఆనందించునట్లు గోపాలకృష్ణునిగ అవతరించి; వెణ్ణెయ్ = వెన్నను; మాన్ద =ఆరగించిన సర్వేశ్వరుని; ( నెరునల్ = నిన్నటిదినమున ) అழுన్దైయిల్ పోయ్=తిరుఅழுన్దూర్ దివ్యదేశమునకు  పోయి అమరవియప్పన్ పెరుమాళ్ ను; కణ్డు = సేవించినమేము; మగిழ் న్దు= సంతోషముతో; (ఇన్ఱు=ఈ దినమున);పాన్దళ్ పాழிయిల్ = ఆదిశేషుని తల్పముపై; పళ్ళి విరుమ్బియ= పవళించుటకు కోరి స్వీకరించిన;వేన్దనై=సర్వేశ్వరుని; వెహ్ కావుళే శెన్ఱు = తిరు వెహ్ కా దివ్యదేశమునకు పోయి శొణ్ణవణ్ణమ్ శెయ్ ద పెరుమాళ్ ను;  కాణ్డుమ్ = సేవించుకొందుము! 

శ్లాఘ్యమైన కేశములుగల గోపస్త్రీలు ఆనందించునట్లు గోపాలకృష్ణునిగ అవతరించి, వెన్నను ఆరగించిన సర్వేశ్వరుని; (నిన్నటిదినమున) తిరుఅழுన్దూర్ దివ్యదేశమునకు  పోయి అమరవియప్పన్ పెరుమాళ్ ను సేవించిన మేము, సంతోషముతో (ఈ దినమున) ఆదిశేషుని తల్పముపై పవళించుటకు కోరి స్వీకరించిన సర్వేశ్వరుని తిరు వెహ్ కా దివ్యదేశమునకు పోయి శొణ్ణవణ్ణమ్ శెయ్ ద పెరుమాళ్ ను   సేవించుకొందుము! 

పత్తర్ ఆవియై, ప్పాన్మదియై, అణి

తొత్తై, మాలిరుఞ్జోలై త్తొழுదు పోయ్,

ముత్తినై మణియై, మణిమాణిక్క

విత్తినై, శెన్ఱు విణ్ణగర్ క్కాణ్డుమే  ll 1855

పత్తర్ ఆవియై = భక్తజనులకు ప్రాణము వంటివాడును; పాల్ మదియై = కళంకములేని చంద్రునివలె అందమైనవాడును; అణి తొత్తై = ఆభరణముల మాలవంటివాడును; ముత్తినై = ముత్యమువంటి వాడును;మణియై = నీలమణివలె ప్రకాశించువాడును; మణి మాణిక్కమ్ = శ్లాఘ్యమైన మాణిక్యమువంటి వాడను; విత్తినై = జగత్కారణభూతుడైన సర్వేశ్వరుని;(నెరునల్ = నిన్నటిదినమున) మాలిరుఞ్జోలై పోయ్ = తిరు మాలిరుఞ్జోలై దివ్యదేశమునకు పోయి అழగర్ పెరుమాళ్ ను;తొழுదు = సేవించిన నేను; (ఇన్ఱు=ఈ దినమున)విణ్ణగర్ శెన్ఱు=తిరువిణ్ణగర్ దివ్యదేశమునకు పోయి ఒప్పిలియప్నన్  పెరుమాళ్ ను; కాణ్డుమ్ = సేవించుకొందును! 

          భక్తజనులకు ప్రాణము వంటివాడును, కళంకములేని చంద్రునివలె అందమైన వాడును,ఆభరణముల మాలవంటివాడును, ముత్యమువంటివాడును, నీలమణివలె ప్రకాశించువాడును, శ్లాఘ్యమైన మాణిక్యము వంటివాడను,  జగత్కారణభూతుడైన సర్వేశ్వరుని, (నిన్నటిదినమున) తిరు మాలిరుఞ్జోలై దివ్యదేశమునకు పోయి అழగర్ పెరుమాళ్ ను సేవించిన నేను (ఇన్ఱు=ఈ దినమున)  తిరువిణ్ణగర్ దివ్యదేశమునకు పోయి ఒప్పిలియప్నన్ పెరుమాళ్ ను సేవించుకొందును! 

కమ్బ మాకళిఱు, అఞ్జి క్కలఙ్గ, ఓర్

కొమ్బు కొణ్డ, కురై కழల్ కూత్తనై,

కొమ్బులామ్ పొழிల్, కోట్టియూర్కణ్డుపోయ్,

నమ్బనై చ్చెన్ఱు కాణ్డుమ్, నావాయుళే  ll 1856

కమ్బమ్ = చూచువారికి కంపము కలిగించు; మా=పెద్ద; కళిఱు= కువలయాపీడమను  ఏనుగు; అఞ్జి = భయముతో; కలఙ్గ = కలతచెంది మరణించునట్లు; ఓర్ కొమ్బు కొణ్డ=దాని దంతమును విరిచినవాడును; కురై కழల్ = ధ్వనించుచున్న వీరకంకణములుగల  పాదములు కలవాడును;కూత్తనై = విచిత్రమైన గమనము కలవాడును; నమ్బనై = (భక్తుల)విశ్వసనీయడైన సర్వేశ్వరుని;(నెరునల్ = నిన్నటిదినమున) కొమ్బు ఉలామ్ పొழிల్ = కదలాడు కొమ్మలతో నిండిన తోటలుగల; కోట్టియూర్ పోయ్ = తిరు కోట్టియూర్ దివ్యదేశమునకు పోయి శౌమ్యనారాయణన్ పెరుమాళ్ ను; కణ్డు =  సేవించిన నేను;(ఇన్ఱు=ఈ దినమున)నావాయుళే శెన్ఱు=తిరునావాయ్ దివ్యదేశమునకు పోయి శ్రీముకుంద పెరుమాళ్ ను; కాణ్డుమ్ = సేవించుకొందును! .

చూచువారికి కంపము కలిగించు పెద్ద కువలయాపీడమను ఏనుగు భయముతో, కలతచెంది మరణించునట్లు దాని దంతమును విరిచినవాడును, ధ్వనించుచున్న వీరకంకణములుగల  పాదములు కలవాడును, విచిత్రమైన గమనము కలవాడును, (భక్తుల)విశ్వసనీయడైన సర్వేశ్వరుని (నిన్నటిదినమున)  కదలాడు కొమ్మలతో నిండిన తోటలుగల  తిరు కోట్టియూర్ దివ్యదేశమునకు పోయి శౌమ్యనారాయణన్ పెరుమాళ్ ను  సేవించిన నేను (ఈ దినమున) తిరునావాయ్ దివ్యదేశమునకు  పోయి శ్రీముకుంద పెరుమాళ్ ను సేవించుకొందును! .

** పెర్ట్రమ్ ఆళియై, ప్పేరిల్ మణాళనై,

కర్ట్రనూల్, కలికన్ఱి యురైశెయ్ ద,

శొల్ తిఱమివై, శొల్లియతొణ్డర్ గట్కు, 

అర్ట్ర మిల్లై, అణ్డమవర్కు ఆట్చియే  ll 1857

పెర్ట్రమ్ ఆళియై=గోవులను పాలించువాడైన;పేరిల్ మణాళనై=తిరుప్పేర్ నగరమున  పెండ్లికొడుకుగ వేంచేసియున్న సర్వేశ్వరుని విషయమై;నూల్ కర్ట్ర కలికన్ఱి ఉరైశెయ్ ద=శాస్త్రములను అభ్యసించిన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన; శొల్ తిఱమ్ ఇవై = ఈ శబ్దరాసులను; శొల్లియ తొణ్డర్ గట్కు = పఠించెడి భాగవతులకు; అర్ట్రమ్ ఇల్లై =  (కైంకర్యసేవలందు)అడ్డంకులు ఒకనాడైనను ఉండదు;అవర్కు ఆణ్డమ్ ఆట్చి= వారికి పరమపదము పాలనలో నుండును!

    గోవులను పాలించువాడైన,తిరుప్పేర్ నగరమున పెండ్లికొడుకుగ వేంచేసియున్న సర్వేశ్వరుని విషయమై,శాస్త్రములను అభ్యసించిన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన ఈ శబ్దరాసులను పఠించెడి భాగవతులకు,(కైంకర్యసేవలందు)అడ్డంకులు ఒకనాడైనను ఉండదు, వారికి పరమపదము పాలనలో నుండును!

*******

వ్యాఖ్యానించండి