శ్రీః
10 .తిరుత్తాయ్
పరకాలనాయకి సర్వేశ్వరునితో సంశ్లేషణమును కోరుకునుచున్నారు
** తిరుత్తాయ్ శెమ్బోత్తే,
తిరుమామగళ్ తన్ కణవన్,
మరుత్తార్ తొల్ పుగழ், మాదవనై వర,
తిరుత్తాయ్ శెమ్బోత్తే ll 1942
శెమ్ పోత్తే = ఓ! భరధ్వాజ పక్షీ!; తిరుమామగళ్ తన్ కణవన్ = శ్రీమహాలక్ష్మియొక్క విభుడైన; మరు తార్ = పరిమళభరితమైన మాలను ధరించియున్న; తొల్ పుగழ் = నిత్యసిద్ధమైన కీర్తిగల; మాదవనై = సర్వేశ్వరుడు; వర తిరుత్తాయ్ = ఇచటకు వచ్చునట్లు (నీవు శకునముగ నా కుడివైపు వచ్చి) నన్ను ఉద్దరించవలెను!;శెమ్ పోత్తే తిరుత్తాయ్ = ఓ! భరధ్వాజ పక్షీ! సర్వేశ్వరుని నాతో చేర్చుమా!
ఓ! భరధ్వాజ పక్షీ! శ్రీమహాలక్ష్మియొక్క విభుడైన, పరిమళభరితమైన మాలను ధరించియున్న,నిత్యసిద్ధమైన కీర్తిగల సర్వేశ్వరుడు,ఇచటకు వచ్చునట్లు (నీవు శకునముగ నా కుడివైపు వచ్చి) నన్ను ఉద్దరించుమా!,ఓ! భరధ్వాజ పక్షీ! సర్వేశ్వరుని నాతో చేర్చుమా!
కరైయాయ్ క్కాక్కైప్పిళ్ళాయ్,
కరుమాముగిల్ పోల్ నిఱత్తన్,
ఉరైయార్ తొల్ పుగழ், ఉత్తమనైవర,
కరైయాయ్ క్కాక్కైప్పిళ్ళాయ్ ll 1943
కాక్కై పిళ్ళాయ్ = ఓ! కాకిపిల్లా!; కరుమాముగిల్ పోల్ నిఱత్తన్ = కాలమేఘమువంటి వర్ణముగలవాడును; ఉరై ఆర్ తొల్ పుగழ் = సహస్ర నామములతో నిత్యసిద్ధమైన కీర్తిగల; ఉత్తమనై = పురుషోత్తముడు; వర కరైయాయ్ = వచ్చునట్లు నీవు కూయుమా!; కాక్కై పిళ్ళాయ్ కరైయాయ్ = ఓ! కాకిపిల్లా! నీవు కూసి సర్వేశ్వరుని నాతో చేర్చుమా!
ఓ! కాకిపిల్లా!, కాలమేఘమువంటి వర్ణముగలవాడును సహస్ర నామములతో నిత్యసిద్ధమైన కీర్తిగల, పురుషోత్తముడు వచ్చునట్లు నీవు కూయుమా!.ఓ! కాకిపిల్లా! నీవు కూసి సర్వేశ్వరుని నాతో చేర్చుమా!
కూవాయ్ పూఙ్గుయిలే,
కుళిర్ మారి తడుత్తుగన్ద,
మావాయ్ కీణ్డ, మణివణ్ణనైవర,
కూవాయ్ పూఙ్గుయిలే ll 1944
పూ కుయిలే = ఓ! అందమైన కోకిలా!; కుళిర్ మారి = ( ఇంద్రునిచే కురిపింపబడిన) అతిచల్లని వర్షమును; తడుత్తు = ( గోవర్ధనపర్వతమును గొడుగుగ పైకెత్తి) అడ్డగించి; ఉగన్ద=ఆనందించినవాడును; మా వాయ్ కీణ్డ = కేశియను అశ్వరూపములో నున్న అసురుని యొక్క నోటిని చీల్చినవాడును; మణివణ్ణనై = నీలమణివర్ణము వంటి వర్ణముగల సర్వేశ్వరుడు; వర కూవాయ్ = వచ్చునట్లు నీవు కూయుమా!;పూ కుయిలే కూవాయ్ = ఓ! అందమైన కోకిలా! నీవు ఇంపుగ కూయుచు సర్వేశ్వరుని నాతో చేర్చుమా!
ఓ! అందమైన కోకిలా!,( ఇంద్రునిచే కురిపింపబడిన) అతిచల్లని వర్షమును (గోవర్ధన పర్వతమును గొడుగుగ పైకెత్తి) అడ్డగించి ఆనందించినవాడును,కేశియను అశ్వరూపములో నున్న అసురుని యొక్క నోటిని చీల్చినవాడును,నీలమణి వర్ణము వంటి వర్ణముగల సర్వేశ్వరుడు వచ్చునట్లు నీవు కూయుమా!;పూ కుయిలే కూవాయ్ = ఓ! అందమైన కోకిలా! నీవు ఇంపుగ కూయుచు సర్వేశ్వరుని నాతో చేర్చుమా!
కొట్టాయ్ బల్లిక్కుట్టి,
కుడమాడి యులగళన్ద,
మట్టార్ పూఙ్గుழల్, మాదవనైవర,
కొట్టాయ్ బల్లిక్కుట్టి ll 1945
బల్లి కుట్టి = ఓ! బల్లి పిల్లా!; కుడమ్ ఆడి = కుంభనృత్యము చేసినవాడును;ఉలగు అళన్ద = (త్రివిక్రమావతారమున) సర్వలోకములు తన పాదముచే కొలిచిన;మట్టు ఆర్ పూ కుழల్=తేనెతో నిండిన పూలతో ఒప్పు కేశములుగల;మాదవనై =శ్రీ దేవి వల్లభుడు; వర కొట్టాయ్=వచ్చునట్లు శబ్ధించుమా; బల్లి కుట్టి కొట్టాయ్=ఓ! బల్లి పిల్లా! నీవు శబ్ధించి సర్వేశ్వరుని నాతో చేర్చుమా!.
ఓ! బల్లి పిల్లా!,కుంభనృత్యము చేసినవాడును,(త్రివిక్రమావతారమున) సర్వలోకములు తన పాదముచే కొలిచిన,తేనెతో నిండిన పూలతో ఒప్పు కేశములుగల శ్రీ దేవి వల్లభుడు,వచ్చునట్లు శబ్ధించుమా.ఓ! బల్లి పిల్లా! నీవు శబ్ధించి సర్వేశ్వరుని నాతో చేర్చుమా!.
** శొల్లాయ్ పైఙ్గిళియే,
శుడరాழி వలనుయర్త,
మల్లార్ తోళ్, వడవేఙ్గడవనైవర,
శొల్లాయ్ పైఙ్గిళియే ll 1946
పైఙ్గిళియే=ఓ!పచ్చని చిలుకా!;శుడర్ ఆழி=మిక్కిలి ప్రకాశించుచున్న చక్రాయుధమును; వలన్ = తన కుడి హస్తమున;ఉయర్త = పైకెత్తిన; మల్ ఆర్ తోళ్ = శక్తివంతమైన భుజములుగల; వడవేఙ్గడవనై = ఉత్తరదిక్కునగల వేంకటాచలముపై వేంచేసియున్న సర్వేశ్వరుడు; వర శొల్లాయ్ = ఇచటకు వచ్చునట్లు పలుకుమా!; పైఙ్గిళియే శొల్లాయ్=ఓ!పచ్చని చిలుకా! నీవు ఇంపుగ పలికి సర్వేశ్వరుని నాతో చేర్చుమా!.
ఓ!పచ్చని చిలుకా!,మిక్కిలి ప్రకాశించుచున్న చక్రాయుధమును తన కుడి హస్తమున పైకెత్తిన శక్తివంతమైన భుజములుగల ఉత్తరదిక్కునగల వేంకటాచలముపై వేంచేసియున్న సర్వేశ్వరుడు ఇచటకు వచ్చునట్లు పలుకుమా!,ఓ!పచ్చని చిలుకా! నీవు ఇంపుగ పలికి సర్వేశ్వరుని నాతో చేర్చుమా!.
కోழி కూవెన్ను మాల్,
తోழி నానెన్ శెయ్ గేన్,
ఆழிవణ్ణర్,వరుమ్బొழுదాయిర్ట్రు,
కోழி కూవెన్ను మాల్ ll 1947
తోழி = నాయొక్క సఖీ!; కోழி కూ ఎన్నుమ్ = కోడి కూత కూసినది; ఆழி వణ్ణర్ = సముద్రమువంటి వర్ణముగల సర్వేశ్వరుడు; వరుమ్ పొழுదు ఆయిర్ట్రు = ఇచటకు వచ్చు సమయమయినది; ఆల్ = ఆహా! ఆహా!(చాల హాయిగ ఉన్నది); కోழி కూ ఎన్నుమ్ = తిరిగి కోడి కూత కూయుచున్నదే! (నా స్వామి నన్ను వదలి తిరిగి మరలిపోవుచున్నాడే!); నాన్ ఎన్ శెయ్ గేన్ = నేనేమి చేయగలను? ఆల్ = అయ్యో!
నాయొక్క సఖీ!, కోడి కూత కూసినది.సముద్రమువంటి వర్ణముగల సర్వేశ్వరుడు ఇచటకు వచ్చు సమయమయినది. ఆహా! ఆహా!(చాల హాయిగ ఉన్నది). తిరిగి కోడి కూత కూయుచున్నదే!(నా స్వామి నన్ను వదలి తిరిగి మరలిపోవుచున్నాడే) నేనేమి చేయగలను? అయ్యో!
కామఱ్కెన్ కడవేన్,
కరుమాముగిల్ వణ్ణఱ్కల్లాల్,
పూమేలైఙ్గణైకోత్తు, ప్పుగున్దెయ్య,
కామఱ్కెన్ కడవేన్ ll 1948
కరు మా ముగిల్ వణ్ణఱ్కు అల్లాల్=నల్లని పెద్ద మేఘమువంటి వర్ణముగల సర్వేశ్వరునికి (నాయొక్క వల్లభునకు)అనుగుణముగ నుండుట తప్ప;మేల్=దానకిపైన; పూ ఐ కణై = పంచ పుష్ప బాణములను; కోత్తు = విల్లులో సంధించి;పుగున్దు ఎయ్య= ఇచట ప్రవేశించి ప్రయోగించి హింసింపజూసిన;కామఱ్కు ఎన్ కడవేన్=మన్మధునకు ఎందులకు బాధ్యతగ ఉండవలయును; కామఱ్కు ఎన్ కడవేన్=నాయొక్క పుత్రుడైన మన్మధునకు ఎందులకు బాధ్యతగ ఉండవలయును.
నల్లని పెద్ద మేఘమువంటి వర్ణముగల సర్వేశ్వరునికి(నాయొక్క వల్లభునకు) అనుగుణముగ నుండుట తప్ప, దానకిపైన పంచ పుష్పబాణములను విల్లులో సంధించి ఇచట ప్రవేశించి ప్రయోగించి హింసింపజూసిన మన్మధునకు ఎందులకు బాధ్యతగ ఉండవలయును?.నాయొక్క పుత్రుడైన మన్మధునకు ఎందులకు బాధ్యతగ ఉండవలయును.
ఇఙ్గే పోదుఙ్గొలో,
ఇనవేల్ నెడుఙ్గణ్ కళిప్ప,
కొఙ్గార్ శోలై, కుడన్దై క్కిడన్దమాల్,
ఇఙ్గే పోదుఙ్గొలో ll 1949
కొఙ్గు ఆర్ శోలై = తేనెలతోనిండిన తోటలుగల; కుడన్దై = తిరుకుడందై దివ్యదేశమున; కడన్దమాల్ = పవళించియున్న స్వామి; ఇన వేల్ నెడు కణ్ కళిప్ప= శూలమువలె పొడవైన నాయొక్క రెండు కన్నులు దర్శించి ఆనందించునట్లు; ఇఙ్గే పోదుఙ్గొలో = ఇచటికే ఏతెంచునా?;ఇఙ్గే పోదుఙ్గొలో=నా స్వామి ఇచటకు ఏతెంచి అనుగ్రహించునా?.
తేనెలతోనిండిన తోటలుగల తిరుకుడందై దివ్యదేశమున పవళించియున్న స్వామి,శూలమువలె పొడవైన నాయొక్క రెండు కన్నులు దర్శించి ఆనందించునట్లు,ఇచటికే ఏతెంచునా?, నా స్వామి ఇచటకు ఏతెంచి అనుగ్రహించునా?.
ఇన్నారెన్ఱఱియేన్,
అన్నే ఆழிయొడుమ్,
పొన్నార్ శార్ ఙ్గముడైయవడిగళై,
ఇన్నారెన్ఱఱియేన్ ll 1950
అన్నే = అహో!; ఆழிయొడుమ్ = సుదర్శనచక్రముతోను; పొన్ ఆర్ శార్ ఙ్గమ్=మిక్కిలి అందమైన శారంగం విల్లును; ఉడైయ అడిగళై = తన హస్తమున కలిగియున్న స్వామిని; ఇన్నార్ ఎన్ఱు అఱియేన్ = వీరెవరైయుందురో యని తెలుసుకొనలేకపోవుచున్నాను! ఇన్నార్ ఎన్ఱు అఱియేన్ = వీరు తిరుకుడందై ఆరావముద పెరుమాళ్ అవునో కాదోయని తెలుసుకొనలేక పోవుచున్నాను!
** తొణ్డీర్ పాడుమినో,
శురుమ్బార్ పొழிల్ మఙ్గైయర్ కోన్,
ఒణ్డార్ వేల్, కలియనొలి మాలైగళ్,
తొణ్డీర్ పాడుమినో ll 1951
తొణ్డీర్ = భగవద్భక్తులారా!; శురుమ్బు ఆర్ పొழிల్ = తుమ్మెదలతో నిండిన తోటలుగల; మఙ్గైయర్ కోన్ = తిరుమంగై దేశవాసులకు ప్రభువును; ఒణ్ తార్ వేల్ = అందమైన మాలలను,శూలాయుధమును కలిగిన; కలియన్=తిరుమంగై ఆళ్వార్; ఒలి మాలై గళ్ = అనుగ్రహించిన సూక్తులమాలను; పాడుమిన్ = పాడుచుండుడు; తొణ్డీర్ పాడుమిన్ = భగవద్భక్తులారా! పాడుకొని స్వామి పాదపద్మములను పొందుడు!
భగవద్భక్తులారా!, తుమ్మెదలతో నిండిన తోటలుగల తిరుమంగై దేశవాసులకు ప్రభువును, అందమైన మాలలను,శూలాయుధమును కలిగిన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన సూక్తులమాలను పాడుచుండుడు, భగవద్భక్తులారా! పాడుకొని స్వామి పాదపద్మములను పొందుడు!
తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం
*********************