శ్రీః
2 . ఇరక్కమిన్ఱి
శ్రీరామ,రావణయుద్దమున, రావణాసురుడు వధింపబడిన పిదప, ఆరావణుని సైనికుల మనోభావములను తిరుమంగై ఆళ్వార్ చెప్పుచున్నారు.
** ఇరక్కమిన్ఱి ఎఙ్గోన్ శెయ్ ద తీమై, ఇమ్మైయే ఎమక్కెయ్ దిర్ట్రుక్కాణీర్,
పరక్కయామ్ ఇన్ఱురైత్తెన్ ఇరావణన్ పట్టనన్, ఇని యావర్కు ఉరైక్కోమ్,
కురక్కు నాయకర్ గాళ్ ఇళఙ్గోవే, కోలవల్ విల్ ఇరామపిరానే,
అరక్కర్ ఆడழைప్పార్ ఇల్లై, నాఙ్గళ్ అఞ్జినోమ్ తడమ్ పొఙ్గత్తమ్బొఙ్గో ll 1858
ఎమ్ కోన్ = మాయొక్క ప్రభువైన రావణుడు;ఇరక్కమ్ ఇన్ఱి శెయ్ ద = దయాగుణము లేక చేసిన; తీమై= అపరాధములు;ఇమ్మైయే=ఈ జన్మలోనే;ఎమక్కు=మాకు;ఎయ్ దిర్ట్రు కాణీర్ = ఫలములొసగు చున్నవి చూడుడు;ఇన్ఱు=ఇపుడు; యామ్ = మేము; పరక్కఉరైత్తు ఎన్ = పైకి అధికముగ చెప్పుకొనుటవలన ఏమి ప్రయోజనము?; ఇరావణన్ పట్టనన్ = మా రాజు రావణుడు మరణావస్థపొందెను; ఇని= ఇప్పుడిక; యావర్కు ఉరైక్కోమ్=ఎవరికి చెప్పుకొందుము; కురక్కు నాయకర్ గళ్ =వానర సేనాధిపతులారా!; ఇళమ్ కోవే = లక్ష్మణస్వామీ!; కోలమ్ వల్ విల్ ఇరామపిరానే =అందమైన, దృఢమైన శార్ఙ్గమను విల్లును ధరించిన శ్రీ రామచంద్రుడా!;అరక్కర్= రాక్షసజాతియందు; ఆడు అழைప్పార్ ఇల్లై = జయించుట కొరకు పిలిచెడివారొక్కరును లేరు;నాఙ్గళ్ = ఏమియు తోచని మేము; అఞ్జినోమ్=భయపడియున్నాము; తడమ్ పొఙ్గత్తమ్ పొఙ్గో=శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్క లొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!
మాయొక్క ప్రభువైన రావణుడు దయాగుణము లేక చేసిన అపరాధములు ఈ జన్మలోనే మాకుఫలములొసగు చున్నవి చూడుడు, ఇపుడు మేము పైకి అధికముగ చెప్పుకొనుటవలన ఏమి ప్రయోజనము?, మా రాజు రావణుడు మరణావస్థపొందెను. ఇప్పుడిక ఎవరికి చెప్పుకొందుము?.వానర సేనాధిపతులారా!, లక్ష్మణస్వామీ!, అందమైన,దృఢమైన శార్ఙ్గమను విల్లును ధరించిన శ్రీ రామచంద్రుడా! రాక్షసజాతియందు జయించుట కొరకు పిలిచెడి వారొక్కరును లేరు, ఏమియు తోచని మేము భయపడియున్నాము. శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్క లొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!
పత్తు నీళ్ ముడియుమ్ అవర్ట్రిరట్టి, పాழிత్తోళుమ్ పడైత్తవన్ శెల్వమ్,
శిత్తమ్ మఙ్గైయర్ పాల్ వైత్తు క్కెట్టాన్, శెయ్ వదొన్ఱఱియా అడియోఙ్గళ్,
ఒత్త తోళిరణ్డు మొరుముడియుమ్, ఒరువర్ తమ్ తిఱత్తోమన్ఱి వాழ்న్దోమ్,
అత్త ఎమ్బెరుమాన్ ఎమ్మై క్కొల్లేల్, అఞ్జినోమ్ తడమ్ పొఙ్గత్తమ్బొఙ్గో ll 1859
అత్త ఎమ్బెరుమాన్ = స్వామీ! శ్రీరామా!; నీళ్ పత్తు ముడియుమ్ = పొడవైన పది తలలును; అవర్ట్రిరట్టి = అవి పునరావవృతమును చేయగల సమర్ధతను; పాழி తోళుమ్ = బలిష్టమైన ఇరువది భుజములను; పడైత్తవన్ = కలిగిన రావణుడు; మఙ్గైయర్ పాల్ శిత్తమ్ వైత్తు = స్త్రీల విషయమున తనమనస్సును ఉంచి; శెల్వమ్ కెట్టాన్ = తనయొక్క సంపదను నశింపజేసుకొనెను; శెయ్ వదు ఒన్ఱు అఱియా అడియోఙ్గళ్ = ఇక చేయవలసినది ఏమీ తెలియని మేము; ఒత్త తోళ్ ఇరణ్డుమ్ ఒరు ముడియుమ్ = సాటిలేని రెండు భుజములు, ఒక శిరస్సుగల; ఒరువర్ తమ్ తిఱత్తోమ్ అన్ఱి = అద్వితీయులైన శ్రీ వారి చెంతకు (విభీషణుని వలె) ముందటనే చేరకుండుటచే; వాழ்న్దోమ్ = నశించిపోతిమి;ఎమ్మై కొల్లేల్ = మమ్ములను వధింపక విడిచిపెట్టమని కోరుచున్నాము; అఞ్జినోమ్= భయపడి యున్నాము; తడమ్ పొఙ్గత్తమ్ పొఙ్గో = శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్క లొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!
స్వామీ! శ్రీరామా!, పొడవైన పది తలలును, అవి పునరావవృతము చేయగల సమర్ధతను, బలిష్టమైన ఇరువది భుజములను కలిగిన రావణుడు, స్త్రీల విషయమున తనమనస్సును ఉంచి, తనయొక్క సంపదను నశింపజేసుకొనెను, ఇక చేయవలసినది ఏమీ తెలియని మేము,సాటిలేని రెండు భుజములు ఒక శిరస్సు గల అద్వితీయులైన శ్రీ వారి చెంతకు (విభీషణుని వలె) ముందటనే చేరకుండుటచే నశించిపోతిమి,మమ్ములను వధింపక విడిచిపెట్టమని కోరుచున్నాము, భయపడి యున్నాము. శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్క లొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!
దణ్డకారణియమ్ పుగున్దు, అన్ఱుతైయలై త్తకవిలి ఎఙ్గోమాన్,
కొణ్డుపోన్దు కెట్టాన్ ఎమక్కిఙ్గు ఓర్ కుర్ట్రమిల్లై, కొల్లేల్ కులవేన్దే,
పెణ్డిరాల్ కెడుమ్ ఇక్కుడితన్నై, ప్పేశుకిన్ఱదెన్ దాశరథీ, ఉన్
అణ్డవాణర్ ఉగప్పదే శెయ్ దాయ్, అఞ్జినోమ్ తడమ్ పొఙ్గత్తమ్బొఙ్గో ll 1860
కులమ్ వేన్దే = (తప్పులేని వారిని దండింపని) ఇక్ష్వాకువంశమునకు ప్రభువా!; దాశరథీ = దశరథ పుత్రుడైన శ్రీ రామా!;తకవు ఇలి ఎమ్ కోమాన్ = దయాగుణములేని మాయొక్క ప్రభువైన రావణుడు; అన్ఱు=(మీరు పంచవటియందు నివసించుచున్న)ఆ సమయమున; దణ్డకారణియమ్ పుగున్దు = దణ్డకారణ్యమును ప్రవేశించి; తైయలై = శ్లాఘ్యమైన అందముగల సీతాదేవిని; కొణ్డు పోన్దు కెట్టాన్ = అపహరించి లంకాపురికి తీసుకొనివచ్చి నశించిపోయెను; ఇఙ్గు = ఈవిషయమున; ఎమక్కు = మాకు; ఓర్ కుర్ట్రమ్ ఇల్లై = ఏ ఒక దోషము లేదు; (ఆ కారణముచే) కొల్లేల్ = మమ్ములను వధింపక విడిచిపెట్టమని కోరుచున్నాము; పెణ్డిరాల్ కెడుమ్ = స్త్రీచాపల్యముచే నశించెడి; ఇ కుడి తన్నై = ఈ రాక్షసజాతి విషయమై; పేశుకిన్ఱదు ఎన్ = చెప్పుకొనుటకేమున్నది?; ఉన్ అణ్డ వాణర్ ఉగప్పదే శెయ్ దాయ్ = శ్రీవారికి ప్రియమైన దేవతలు సంతోషించెడి కార్యమునే చేసి కరుణించిరి; అఞ్జినోమ్ = మేము భయపడియున్నాము; తడమ్ పొఙ్గత్తమ్ పొఙ్గో = శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్క లొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!
(ఏతప్పులేని వారిని దండింపని) ఇక్ష్వాకువంశమునకు ప్రభువా!, దశరథ పుత్రుడైన శ్రీ రామా!, దయాగుణములేని మాయొక్క ప్రభువైన రావణుడు (మీరు పంచవటియందు నివసించుచున్న) ఆ సమయమున, దణ్డకారణ్యమును ప్రవేశించి, శ్లాఘ్యమైన అందముగల సీతాదేవిని అపహరించి లంకాపురికి తీసుకొనివచ్చి నశించిపోయెను, ఈవిషయమున మాకు ఏ ఒక్క దోషము లేదు (ఆ కారణముచే) మమ్ములను వధింపక విడిచిపెట్టమని కోరుచున్నాము. స్త్రీచాపల్యముచే నశించెడి ఈ రాక్షసజాతి విషయమై చెప్పుకొనుటకేమున్నది?, శ్రీవారికి ప్రియమైన దేవతలు సంతోషించెడి కార్యమునే చేసి కరుణించిరి. మేము భయపడియున్నాము. శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్క లొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!.
ఎఞ్జలిల్ ఇలఙ్గైక్కిఱై ఎఙ్గోన్దన్నై, మున్ పణిన్దు ఎఙ్గళ్ కణ్ముగప్పే,
నఞ్జుతాన్ అరక్కర్ కుడిక్కెన్ఱు, నఙ్గైయై అవన్ తమ్బియే శొన్నాన్,
విఞ్జెయ్ వానవర్ వేణ్డిర్ట్రే పట్టోమ్, వేరి వార్ పొழிల్ మామయిలన్న,
అఞ్జుల్ ఓదియై కొణ్డు నడమిన్, అఞ్జినోమ్ తడమ్ పొఙ్గత్తమ్బొఙ్గో ll 1861
ఎఞ్జలిల్ = ఎటువంటి కొరతలేక; ఇలఙ్గైక్కు ఇఱై = లంకాపురికి ప్రభువైన; ఎమ్ కోన్ తన్నై = మాయొక్క నాయకుడైన రావణునిజూచి; మున్ = మునుపు; ఎఙ్గళ్ కణ్ ముగప్పే = మా కన్నుల ఎదుటనే నిండు సభలో; అవన్ తమ్బియే = అతని తమ్ముడైన విభీషణుడే; పణిన్దు = వినయముతో చేతులు జోడించి సేవించుచు; నఙ్గైయై అరక్కర్ కుడిక్కు నఞ్జుతాన్ ఎన్ఱు శొన్నాన్ = “ఈ సీతాదేవి రాక్షసవంశమునకు విషమగును” అని చెప్పెను “;( ఆ వాక్కులను పెడచెవిని పెట్టిన కారణముచే) విఞ్జెయ్ వానవర్ వేణ్డిర్ట్రే పట్టోమ్ = విఙ్ఞానులైన దేవతలు ఆశించినవిధముగనే మేము అనర్ధములపాలైపోతిమి; వేరి వార్ పొழிల్ మా మయిల్ అన్న=పరిమళభరితమైన,విశాలమైన తోటలలో పెరిగిన శ్లాఘ్యమైన నెమలివంటి; అఞ్జు అల్ ఓదియై = (పరిమళముతోను, గిరిజములతోను, మృదుత్వముతోను, దట్టముగాను, పొడవుగాను) ఐదు గుణములతో రాత్రివలె నల్లని కుంతలములు గల సీతాదేవిని; కొణ్డు నడమిన్ = గ్రహించి తీసుకొని వేంచేయమని ప్రార్ధించుచున్నాము; అఞ్జినోమ్ = మేము భయపడియున్నాము; తడమ్ పొఙ్గత్తమ్ పొఙ్గో = శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్క లొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!
ఎటువంటి కొరతలేక లంకాపురికి ప్రభువైన మాయొక్క నాయకుడైన రావణునిజూచి మునుపు మా కన్నుల ఎదుటనే నిండు సభలో అతని తమ్ముడైన విభీషణుడే వినయముతో చేతులు జోడించి సేవించుచు “ఈ సీతాదేవి రాక్షసవంశమునకు విషమగును” అని చెప్పెను. ( ఆ వాక్కులను పెడచెవిని పెట్టిన కారణముచే) విఙ్ఞానులైన దేవతలు ఆశించిన విధముగనే మేము అనర్ధముల పాలైపోతిమి. పరిమళభరితమైన, విశాలమైన తోటలలో పెరిగిన శ్లాఘ్యమైన నెమలివంటి (పరిమళముతోను, గిరిజములతోను, మృదుత్వముతోను,దట్టముగాను,పొడవుగాను) ఐదు గుణములతో రాత్రివలె నల్లని కుంతలములు గల సీతాదేవిని గ్రహించి తీసుకొని వేంచేయమని ప్రార్ధించుచున్నాము. మేము భయపడియున్నాము. శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్క లొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!
శెమ్బొన్ నీణ్ముడి ఎఙ్గళిరావణన్, శీతైయెన్బదోర్ తెయ్ వమ్ కొణర్ న్దు,
వమ్బులామ్ కడికావిల్ శిఱైయావైత్తదే,కుర్ట్రమాయిర్ట్రు క్కాణీర్,
కుమ్బనోడు నికుమ్బునుమ్ పట్టాన్, కూర్ట్రమ్ మానిడమాయ్ వన్దు తోన్ఱి,
అమ్బినాల్ ఎమ్మై క్కొన్ఱిడుగిన్ఱదు, అఞ్జినోమ్ తడమ్ పొఙ్గత్తమ్బొఙ్గో ll 1862
శెమ్ పొన్ నీళ్ ముడి = మేలిమి బంగారముతొ చేయబడిన పొడుగైన కిరీటముగల; ఎఙ్గళ్ = మాయొక్క ప్రభువైన; ఇరావణన్ = రావణుడు; శీతై ఎన్బదు ఓర్ తెయ్ వమ్ కొణర్ న్దు = సీతాదేవి అనబడు ఒక దేవతా స్త్రీని అపహరించి తీసుకొని వచ్చి; వమ్బు ఉలామ్ కడి కావిల్ = నవీనత్వము చెడని పరిమళభరితమైన(అశోక) వనమున; శిఱై ఆ వైత్తదే=చెఱలో బంధించి పెట్టుటయే; కుర్ట్రమ్ ఆయిర్ట్రు కాణీర్ = పెద్ద అపరాధమైనది సుమా!; (ఆకారణముచే) కుమ్బనోడు నికుమ్బునుమ్ పట్టాన్ = కుంభకర్ణుడు,నికుమ్భుడు మరణమునుపొందిరి; కూర్ట్రమ్=మృత్యుదేవత;మానిడమ్ ఆయ్ వన్దు తోన్ఱి=మనుష్య రూపమును ధరించి ఇచట అవతరించి;ఎమ్మై=మమ్ములను; అమ్బినాల్ = బాణములచే; కొన్ఱిడుగిన్ఱదు = సంహరించుచున్నది; అఞ్జినోమ్ = మేము భయపడియున్నాము;(శ్రీరామా!) తడమ్ పొఙ్గత్తమ్ పొఙ్గో=శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్క లొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!
మేలిమి బంగారముతొ చేయబడిన పొడుగైన కిరీటముగల,మాయొక్క ప్రభువైన రావణుడు, సీతాదేవి అనబడు ఒక దేవతా స్త్రీని అపహరించి తీసుకొని వచ్చి నవీనత్వము చెడని పరిమళభరితమైన (అశోక) వనమున చెఱలో బంధించి పెట్టుటయే పెద్ద అపరాధమైనది సుమా!(ఆకారణముచే) కుంభకర్ణుడు,నికుమ్భుడు మరణమును పొందిరి, మృత్యుదేవత మనుష్యరూపమును ధరించి ఇచట అవతరించి మమ్ములను బాణములచే సంహరించుచున్నది, మేము భయపడియున్నాము. (శ్రీరామా!) శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్క లొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!
ఓద మా కడలై క్కడన్దేఱి, ఉయిర్ కొళ్ మాక్కడి కావై యిఱుత్తు,
కాదల్ మక్కళుమ్ శుర్ట్రముమ్ కొన్ఱు, కడియిలఙ్గై మలఙ్గ ఎరిత్తు,
తూదువన్ద కురఙ్గుక్కే, ఉఙ్గళ్ తోన్ఱల్ దేవియై విట్టుకొడాదే,
ఆదర్ నిన్ఱు పడుగిన్ఱతన్దో, అఞ్జినోమ్ తడమ్ పొఙ్గత్తమ్బొఙ్గో ll 1863
( ఓ! వానర వీరులారా! ) ఓదమ్ మా కడలై=అలలుకొట్టుచున్న మహా సముద్రమును; కడన్దు ఏఱి=దాటి; ఉయిర్ కొళ్ మా కడి కావై ఇఱుత్తు =మిక్కిలి ఎత్తైన పెద్ద పరిమళభరితమైన అశోకవనమును ధ్వంసము చేసి; కాదల్ = (రావణునియొక్క) ప్రీతిపూర్వకమైన; మక్కళుమ్ = అక్షయకుమారుడు మొదలగు పుత్రులను; శుర్ట్రముమ్ = అంతరంగ సేవకులను; కొన్ఱు= సంహరించి; కడి ఇలఙ్గై మలఙ్గ ఎరిత్తు = కావలి కలిగిన లంకాపురి కలతచెందునట్లు అగ్నికి ఆహుతిచేసి; తూదు వన్ద = సీతాదేవి నిమిత్తమై దూతగ వచ్చిన; కురఙ్గుక్కే = హనమంతుని చేతికి ; ఉఙ్గళ్ తోన్ఱల్ దేవియై = మీ ప్రభువుయొక్క సీతాదేవిని; విట్టు కొడాదే = సమర్పించక; ఆదర్ = అవివేకులైనమేము; నిన్ఱు పడుగిన్ఱదు అన్దో = అయ్యో ఇట్లు శిథిలమై నిలబడితిమి; అఞ్జినోమ్ = మేము భయపడియున్నాము; తడమ్ పొఙ్గత్తమ్ పొఙ్గో = శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్క లొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!
( ఓ! వానర వీరులారా! ) అలలుకొట్టుచున్న మహా సముద్రమును దాటి మిక్కిలి ఎత్తైన పెద్ద పరిమళభరితమైన అశోకవనమును ధ్వంసము చేసి, (రావణునియొక్క) ప్రీతిపూర్వకమైన అక్షయకుమారుడు మొదలగు పుత్రులను, అంతరంగ సేవకులను, సంహరించి కావలి కలిగిన లంకాపురి కలతచెందునట్లు అగ్నికి ఆహుతిచేసి, సీతాదేవి నిమిత్తమై దూతగ వచ్చిన హనమంతుని చేతికి మీ ప్రభువు యొక్క సీతాదేవిని సమర్పించక అవివేకులైనమేము, అయ్యో! ఇట్లు శిథిలమై నిలబడితిమి. మేము భయపడియున్నాము. శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్క లొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!
తాழమిన్ఱి మున్నీరై అఞ్ఞాన్ఱు, తకైన్దదేకణ్డు వఞ్జి నుణ్మరుఙ్గుల్,
మాழைమాన్ మడనోక్కియైవిట్టు, వాழకిల్లామదియిన్ మనత్తానై,
ఏழைయై యిలఙ్గైక్కిఱైతన్నై, ఎఙ్గళై ఒழிయ క్కొలై యవనై,
శూழுమా నినై మా మణివణ్ణా, శొల్లినోమ్ తడమ్ పొఙ్గత్తమ్బొఙ్గో ll 1864
మా మణివణ్ణా = శ్లాఘ్యమైన నీలమణివంటి వర్ణముగల శ్రీరామా!; తాయమ్ ఇన్ఱి = కాలయాపన చేయక;మున్నీరై=సముద్రమున;అఞ్ఞాన్ఱు=సీతాదేవి జాడ తెలిసినప్పుడు; తకైన్దదే కణ్డు=సేతువు కట్టినదొక్కటియే చూచి; వఞ్జి నుణ్ మరుఙ్గుల్=పాకెడు తీగవంటి సున్నితమైన నడుముగల; మాழை మాన్ మడనోక్కియై = అమాయకమైన లేడివంటి కపటములేని చూపులుగల సీతాదేవిని; విట్టు = శ్రీవారి సన్నిధిలో విడిచిపెట్టి;వాழకిల్లా= సుఖముగ జీవింప ప్రాప్తిలేనట్టి; మది యిల్ మనత్తానై = బుద్ధిలేనివాడును;ఏழைయై = దౌర్భాగ్యుడైన; ఇలఙ్గైక్కు ఇఱై తన్నై అవనై=లంకాపురికి ప్రభువైన ఆ రావణుడు;ఎఙ్గళై ఒழிయ కొలై = మమ్ములను విడువబడునట్లు సంహరింపబడగ; శూழுమా నినై = అట్టి మేము మీచుట్టును గుమిగూడి చేయుప్రార్థనను శ్రీ వారు కరుణతో గ్రహింపవలెననియు; శొల్లినోమ్= శ్రీవారే మాగతియనియు విన్నపము చేయుచున్నాము; తడమ్ పొఙ్గత్తమ్ పొఙ్గో = శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్క లొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!
శ్లాఘ్యమైన నీలమణివంటి వర్ణముగల శ్రీరామా!,కాలయాపన చేయక సముద్రమున, సీతాదేవి జాడ తెలిసినప్పుడు సేతువు కట్టినదొక్కటియే చూచి, పాకెడు తీగవంటి సున్నితమైన నడుముగల, అమాయకమైన లేడివంటి కపటములేని చూపులు గల సీతాదేవిని శ్రీవారి సన్నిధిలో విడిచిపెట్టి, సుఖముగ జీవింప ప్రాప్తిలేనట్టి బుద్ధిలేని వాడును, దౌర్భాగ్యుడైన లంకాపురికి ప్రభువైన ఆ రావణుడు, మమ్ములను విడువ బడునట్లు సంహరింపబడగ, అట్టి మేము మీచుట్టును గుమిగూడి చేయు ప్రార్థనను శ్రీ వారు కరుణతో గ్రహింపవలెననియు, శ్రీవారే మాగతి యనియు విన్నపము చేయుచున్నాము, శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్క లొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!
మనఙ్గొణ్డేఱుమ్ మణ్డోదరిముదలా, అమ్ కழల్ కణ్ణినార్ గళ్ ఇరుప్ప,
తనఙ్గొళ్ మెన్ములైనోక్కమ్ ఒழிన్దు, తఞ్జమే శిల తాపదరెన్ఱు,
పునఙ్గొళ్ మెన్మయిలై చ్చిఱైవైత్త, పున్మైయాళన్ నెఞ్జిల్ పుగ వెయ్ ద,
అనఙ్గనన్నతిణ్ తోళ్ ఎమ్మి రామఱ్కు, అఞ్జినోమ్ తడమ్ పొఙ్గత్తమ్బొఙ్గో ll 1865
మనమ్ కొణ్డు ఏఱుమ్ = మనస్సును హరింపజేయు అందమైన; మణ్డోదరి ముదలా= మండోదరి మొదలగు; అమ్ కழల్ కణ్ణినార్ గళ్ ఇరుప్ప=సుందరమైన మత్స్యములవంటి నేత్రములుగల భార్యలు కలిగియున్నను; తనమ్ కొళ్ మెల్ ములై నోక్కమ్ ఒழிన్దు = తనయొక్క సంపదైన వారియొక్క అందమైన వక్షోజములయందు దృష్టిని విడిచిపెట్టి; శిల తాపదర్ తఞ్జమే ఎన్ఱు=(సీతాదేవిని కాపాడుచున్నవారిని) సామన్యమైన తాపస సహాయకులగ ఎంచి; పునమ్ కొళ్ మెన్ మయిలై శిఱై వైత్త=అడవిలో ఇష్టానుసారముగ సంచరించు అందమైన నెమలివంటి సీతాదేవిని చెఱలో బంధించిన; పున్మైయాళన్ = పరమనీచుడైన రావణునియొక్క; నెఞ్జిల్ పుగ ఎయ్ ద=వక్షస్థలమున చొచ్చుకొనునట్లు బాణమును ప్రయోగించిన; అనఙ్గన్ అన్న=మన్మధునివలె అందమైనవాడును; తిణ్ తోళ్ = దృఢమైన భుజములుగలవాడును;ఎమ్ ఇరామఱ్కు= మాయొక్క శ్రీ రామునికి; అఞ్జినోమ్ = భయపడియున్నాము; (ఓ! శ్రీ రామా!) తడమ్ పొఙ్గత్తమ్ పొఙ్గో = శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్క లొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!
మనస్సును హరింపజేయు అందమైన మండోదరి మొదలగు సుందరమైన మత్స్యములవంటి నేత్రములుగల భార్యలు కలిగియున్నను, తనయొక్క సంపదైన వారియొక్క అందమైన వక్షోజములయందు దృష్టిని విడిచిపెట్టి, (సీతాదేవిని కాపాడుచున్నవారిని) సామన్యమైన తాపస సహాయకులగ ఎంచి, అడవిలో ఇష్టానుసారముగ సంచరించు అందమైన నెమలివంటి సీతాదేవిని చెఱలో బంధించిన పరమనీచుడైన రావణునియొక్క వక్షస్థలమున చొచ్చుకొనునట్లు బాణమును ప్రయోగించిన, మన్మధునివలె అందమైనవాడును, దృఢమైన భుజములుగలవాడును, మాయొక్క శ్రీ రామునికి; భయపడియున్నాము. ( ఓ! శ్రీ రామా!) శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్క లొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!
పురఙ్గళ్ మూన్ఱుమ్ ఓర్ మాత్తిరైప్పోదిల్, పొఙ్గు ఎరిక్కుఇరైకణ్డవన్ అమ్బిన్,
శరఙ్గళే కొడిదాయ్ అడుగిన్ఱ, శామ్బవానుడన్ నిఱ్క త్తొழுదోమ్,
ఇరఙ్గు నీఎనక్కెన్దై పిరానే, ఇలఙ్గు వెఙ్గదిరోన్ శిఱువా,
కురఙ్గుగట్కరశే ఎమ్మై క్కొల్లేల్, కూఱినోమ్ తడమ్ పొఙ్గత్తమ్బొఙ్గో ll 1866
ఓర్ మాత్తిరై పోదిల్=ఒక క్షణమాత్రములో;పురఙ్గళ్ మూన్ఱుమ్=త్రిపురములను; పొఙ్గు ఎరిక్కు= అగ్నిజ్వాలలకు; ఇరై కణ్డవన్=ఆహుతి చేసిన శివునియొక్క;అమ్బిన్=అమ్ముల కంటెను; శరఙ్గళే = ఈ శ్రీరాముని బాణములే; కొడిదు ఆయ్ = తీవ్రముగ; అడుగిన్ఱ = కబళించుచున్నవి;శామ్బవాన్ = జాంబవంతుడు;ఉడన్ నిఱ్క= మాయొక్క సహాయము చేయుచుండగ; తొழுదోమ్ = సేవించుచుంటిమి; ఎన్దై పిరానే=మాయొక్క నాయకుడా!; ఇలఙ్గు వెమ్ కదిరోన్ శిఱువా=ప్రకాశించు తీవ్రమైన కిరణములుగల సూర్యుని కుమారా!; కురఙ్గుగట్కు అరశే = వానరసేనకు ప్రభువైన సుగ్రీవుడా!; ఎమక్కు నీ ఇరఙ్గు = మా విషయమై నీవు కరుణించవలెను;ఎమ్మై కొల్లేల్ కూఱినోమ్=మమ్ములను వధింపక విడిచి పెట్టమని కోరుచున్నాము; తడమ్ పొఙ్గత్తమ్ పొఙ్గో = శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్క లొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!
ఒక క్షణమాత్రములో త్రిపురములను అగ్నిజ్వాలలకు ఆహుతి చేసిన శివునియొక్క అమ్ముల కంటెను ఈ శ్రీరాముని బాణములే తీవ్రముగ కబళించుచున్నవి, జాంబవంతుడు మాయొక్క సహాయము చేయుచుండగ సేవించుచుంటిమి,మాయొక్క నాయకుడా!, ప్రకాశించు తీవ్రమైన కిరణములుగల సూర్యుని కుమారా!, వానరసేనకు ప్రభువైన సుగ్రీవుడా!, మా విషయమై నీవు కరుణించవలెను, మమ్ములను వధింపక విడిచి పెట్టమని కోరుచున్నాము. శ్లాఘ్యమైన మీ విజయునకు మాయొక్కలొంగుబాటుకు మేము ఆనందముతో చేయు నృత్యమును దర్శించుడు!
** అఙ్గు వ్వానవర్కాకుల న్దీర, అణి ఇలఙ్గై అழிత్తవన్ తన్నై,
పొఙ్గు మా వలవన్ కలికన్ఱి, పుగన్ఱ పొఙ్గత్తఙ్గొణ్డు, ఇవ్వులగినిల్
ఎఙ్గుమ్పాడి నిన్ఱాడుమిన్ తొణ్డీర్, ఇమ్మైయే యిడరిల్లై, ఇఱన్దాల్
తఙ్గుమూర్ అణ్డమే కణ్డుకొణ్మిన్, శార్ట్రినోమ్ తడమ్ పొఙ్గత్తమ్బొఙ్గో ll 1867
తొణ్డీర్ = భగవద్భక్తులారా!; అఙ్గు వానవర్కు ఆకులమ్ తీర = దేవలోకమందలి దేవతలయొక్క వ్యాకులత తీరునట్లు; అణి ఇలఙ్గై అழிత్తవన్ తన్నై = సుందరమైన లంకాపురిని నాశనముచేసిన సర్వేశ్వరుని విషయమై; పొఙ్గు మా వలవన్ కలికన్ఱి = శక్తివంతమైన “ఆడల్ మా” అశ్వమును నడపింప సామర్ధ్యముగల తిరుమంగై ఆళ్వార్; పుగన్ఱ = అనుగ్రహించిన; పొఙ్గత్తమ్ కొణ్డు = “పొఙ్గత్తమ్ పొఙ్గో” అను ఈ విజయ పాశురములను గ్రహించి;ఇ ఉలగినిల్=ఈ లోకమున; ఎఙ్గుమ్=అన్ని ప్రదేశములందును; పాడి నిన్ఱు ఆడుమిన్=పాడుకొనుచు నృత్యముచేయుడు;(అట్లు చేసినవారికి) ఇమ్మైయే ఇడర్ ఇల్లై = ఈ జన్మలోనే దుఃఖములుండవు; ఇఱన్దాల్ = మరణము కలిగిన పిదప; తఙ్గుమ్ ఊర్ = ప్రాప్తించు స్థానము; అణ్డమే = పరమపదమే యగును; కణ్డుకొణ్మిన్=(ఇది అనుభవముచే) తెలుసుకోండి; శార్ట్రినోమ్ = ఇది అందరికి తెలియునట్లు చెప్పుచున్నాము; తడమ్ పొఙ్గత్తమ్బొఙ్గో = మీకు పెద్ద జయమే జయము!
భగవద్భక్తులారా!,దేవలోకమందలి దేవతలయొక్క వ్యాకులత తీరునట్లు సుందరమైన లంకాపురిని నాశనముచేసిన సర్వేశ్వరుని విషయమై, శక్తివంతమైన “ఆడల్ మా” అశ్వమును నడపింప సామర్ధ్యముగల తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన, “పొఙ్గత్తమ్ పొఙ్గో” అను ఈ విజయ పాశురములను గ్రహించి, ఈ లోకమున అన్ని ప్రదేశములందును పాడుకొనుచు నృత్యముచేయుడు, (అట్లు చేసినవారికి) ఈ జన్మలోనే దుఃఖములుండవు, మరణము కలిగిన పిదప ప్రాప్తించు స్థానము పరమపదమే యగును.(ఇది అనుభవముచే) తెలుసుకోండి. ఇది అందరికి తెలియునట్లు చెప్పుచున్నాము. మీకు పెద్ద విజయమే విజయము..!
******