పెరియతిరుమొழி-10వపత్తు (3)

 శ్రీః

3 . ఏత్తుగిన్ఱోమ్

        ” కుழమణితూరము” అను జానపద నృత్యమునందు రావణుని సైనికులు తమ ఓటమిని, దుఃఖములను, శ్రీరాముని విజయమును నృత్యముద్వారా వ్యక్తపరుచుటను తిరుమంగై ఆళ్వార్ వర్ణించుచున్నారు. 

** ఏత్తుగిన్ఱోమ్  నాత్తழுమ్బ, ఇరామన్ తిరునామమ్,

శోత్త నమ్బీ శుక్కిరీవా, ఉమ్మై త్తొழுగిన్ఱోమ్,

వార్తై పేశీర్ ఎమ్మై, ఉఙ్గళ్ వానరమ్ కొల్లామే,

కూత్తర్ పోల ఆడుగిన్ఱోమ్, కుழమణితూరమే  ll 1868

ఇరామన్ తిరునామమ్ = శ్రీరాముని దివ్య నామమును; నా త్తழுమ్బ= మా నాలుక మొద్దుబారునట్లు; ఏత్తుగిన్ఱోమ్ = జపించుచున్నాము;నమ్బీ శుక్కిరీవా = మహారాజా! సుగ్రీవా!; శోత్తమ్ = ఇదియే మా అంజలి!; ఉమ్మై త్తొழுగిన్ఱోమ్ = మిమ్ములను సేవించుచున్నాము; ఉఙ్గళ్ వానరమ్ = మీయొక్క వానరవీరులు; ఎమ్మై కొల్లామే=మమ్ములను  వధింపకుండుటకై; వార్తై పేశీర్ = సందేశములను పంపి కరుణించుడు; కూత్తర్ పోల = నృత్యముచేయువారివలె; కుழమణితూరమ్ = మీయొక్క విజయము మాయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుచున్నాము

శ్రీరాముని దివ్య నామమును మా నాలుక మొద్దుబారునట్లు జపించుచున్నాము. మహారాజా! సుగ్రీవా!, ఇదియే మా అంజలి! మిమ్ములను సేవించు చున్నాము, మీయొక్క వానరవీరులు మమ్ములను వధింపకుండుటకై సందేశములను పంపి కరుణించుడు. నృత్యముచేయువారివలె మీయొక్క విజయము మాయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుచున్నాము!

ఎమ్బిరానే యెన్నై యాళ్వాయ్, ఎన్ఱెన్ఱరర్ట్రాదే,

అమ్బిన్ వాయ్ పట్టు ఆర్ట్రగిల్లాదు, ఇన్దిరశిత్తు అழிన్దాన్,

నమ్బి అనుమా శుక్కిరీవా, అఙ్గదనే నళనే,

కుమ్బకర్ణన్ పట్టుప్పోనాన్, కుழమణితూరమే  ll 1869

ఇన్దిరశిత్తు = ఇంద్రజిత్తు; ఎమ్బిరానే ఎన్నై ఆళ్వాయ్, ఎన్ఱెన్ఱు అరర్ట్రాదే = “సర్వేశ్వరా! నన్ను పాలించుమా!” అని శ్రీరాముని దివ్య నామములను ఎలుగెత్తి పలుకక; అమ్బిన్ వాయ్ పట్టు= బాణములకు ఆహుతియై;ఆర్ట్రగిల్లాదు అழிన్దాన్=సుఖమునుకోల్పోయి నశించిపోయెను; నమ్బి అనుమా శుక్కిరీవా అఙ్గదనే నళనే = ఓ! హనుమా!,సుగ్రీవా!,అఙ్గదా!,నళా!; కుమ్బకర్ణన్ పట్టు పోనాన్ = కుమ్బకర్ణుడును శ్రీరాముని బాణములకు ఆహుతియై మరణించెను; కుழమణితూరమ్ = మీయొక్క విజయము మాయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుచున్నాము!

                    ఇంద్రజిత్తు, “సర్వేశ్వరా! నన్ను పాలించుమా!” అని శ్రీరాముని దివ్యనామములను ఎలుగెత్తి పలుకక బాణములకు ఆహుతియై సుఖమును కోల్పోయి నశించిపోయెను  ఓ! హనుమా!,సుగ్రీవా!, అఙ్గదా!,నళా!,కుమ్బకర్ణుడును శ్రీరాముని బాణములకు ఆహుతియై మరణించెను, మీయొక్క విజయము మాయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుచున్నాము!

ఞాలమాళుమ్ ఉఙ్గళ్ కోమాన్, ఎఙ్గళిరావణఱ్కు,

కాలనాగి వన్దవా క్కణ్డు, అఞ్జి క్కరుముగిల్ పోల్,

నీలన్ వాழ்గ శుడేణన్ వాழ்గ, అఙ్గదన్ వాழ்గ ఎన్ఱు,

కోలమాగ ఆడుగిన్ఱోమ్, కుழమణితూరమే  ll 1870

ఞాలమాళుమ్=ఈ భూమండలమంతను పాలించు;ఉఙ్గళ్ కోమాన్=మీయొక్క ప్రభువైన శ్రీ రాముడు; ఎఙ్గళ్ ఇరావణఱ్కు= మాయొక్క ప్రభువైన రావణునకు; కాలన్ ఆగి వన్ద ఆ కణ్డు = మృత్యువై వచ్చిన విధమును చూచి; అఞ్జి = భయపడి; కరుముగిల్ పోల్ = కాళ మేఘము వంటి; నీలన్ వాழ்గ = నీలుడు వర్ధిల్లుగాక!; శుడేణన్ వాழ்గ = సుషేణుడు వర్ధిల్లుగాక!; అఙ్గదన్ వాழ்గ = అంగదుడు వర్ధిల్లుగాక!; ఎన్ఱు = అని ప్రతియొక్కరిని మంగళాశాసనము చేయుచు; కోలమ్ ఆగ = సుందరముగ; కుழమణితూరమే ఆడుగిన్ఱోమ్ = మీయొక్క విజయము మాయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుచున్నాము!

      ఈ భూమండలమంతను పాలించు మీయొక్క ప్రభువైన శ్రీ రాముడు  మాయొక్క ప్రభువైన రావణునకు మృత్యువై వచ్చిన విధమును చూచి భయపడి, కాళమేఘమువంటి  నీలుడు వర్ధిల్లుగాక!, సుషేణుడు వర్ధిల్లుగాక!,అంగదుడు వర్ధిల్లుగాక!  అని ప్రతియొక్కరిని మంగళాశాసనము చేయుచు, సుందరముగ మీయొక్క విజయము మాయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుచున్నాము!

మణఙ్గళ్ నాఱుమ్ వార్ కుழలార్, మాదర్ గళ్ ఆదరత్తై,

పుణర్ న్ద శిన్దై ప్పున్మైయాళన్, పొన్ఱ వరిశిలైయాల్,

కణఙ్గళుణ్ణ వాళియాణ్డ, కావలనుక్కు ఇళైయోన్,

కుణఙ్గళ్ పాడియాడుగిన్ఱోమ్, కుழమణితూరమే  ll 1871

మణఙ్గళ్ నాఱుమ్ వార్ కుழలార్ మాదర్ గళ్=పరిమళము వెదజల్లుచుండెడి దట్టమైన కుంతలములుగల స్త్రీలయందు; ఆదరత్తై పుణర్ న్ద శిన్దై = అమితమైన కాంక్షతో కూడిన మనస్సు కలిగిన;పున్మైయాళన్=పరమనీచుడైన రావణుడు; పొన్ఱ=మరణించునట్లును; కణఙ్గళ్ ఉణ్ణ = పిశాచములు పైనబడి తినునట్లును; వరి శిలైయాల్ = తన అందమైన విల్లుతో;వాళి ఆణ్డ=బాణములను ప్రయోగించిన; కావలనుక్కు = సర్వరక్షకుడైన సర్వేశ్వరుని యొక్క; ఇళైయోన్=తమ్ముడైన లక్ష్మణస్వామియొక్క; కుణఙ్గళ్ పాడి = గుణములను పాడుకొనుచు; కుழమణితూరమే ఆడుగిన్ఱోమ్ = మీయొక్క విజయము మాయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుచున్నాము!

                పరిమళము వెదజల్లుచుండెడి దట్టమైన కుంతలములుగల స్త్రీలయందు అమితమైన కాంక్షతో కూడిన మనస్సు కలిగిన పరమనీచుడైన రావణుడు మరణించునట్లును, పిశాచములు పైనబడి తినునట్లును,తన అందమైన విల్లుతో, బాణములను ప్రయోగించిన,సర్వరక్షకుడైన సర్వేశ్వరునియొక్క తమ్ముడైన లక్ష్మణస్వామియొక్క గుణములను పాడుకొనుచు, మీయొక్క విజయము మాయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుచున్నాము!

వెన్ఱితన్దోమ్ మానమ్ వేణ్డోమ్, తానమెమక్కాగ,

ఇన్ఱుతమ్మిన్ ఎఙ్గళ్ వాణాళ్, ఎమ్బెరుమాన్ తమర్ గాళ్, 

నిన్ఱు కాణీర్ కణ్గళార, నీర్ ఎమ్మై క్కొల్లాదే,

కున్ఱుపోల అడుగిన్ఱోమ్, కుழమణితూరమే  ll 1872

ఎమ్బెరుమాన్ తమర్ గాళ్ = శ్రీరామభక్తులైన ఓ! వానర వీరులారా!; వెన్ఱి తన్దోమ్ = జయము తమకు అంగీకరించితిమి; మానమ్ వేణ్డోమ్ = “మేము మహావీరుల”మను అహంకారమును విడిచిపెట్టితిమి; ఎఙ్గళ్ వాழ்నాళ్ = మాయొక్క జీవనము;ఎమక్కు దానమాగ = మాకు దానముగ; ఇన్ఱు తమ్మిన్ = ఇపుడు ఇచ్చి; నీర్ ఎమ్మై కొల్లాదే = మీరు మమ్ము వధింపక; కణ్గళార = కన్నులతో తృప్తిగ; నిన్ఱు కాణీర్=వేంచేసి చూడుడు; కున్ఱు పోల = పర్వతముల వలె చేరి; కుழమణితూరమే ఆడుగిన్ఱోమ్ = మీయొక్క విజయము మాయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుచున్నాము!

             శ్రీరామభక్తులైన ఓ! వానర వీరులారా!,జయము తమకు అంగీకరించితిమి, “మేము మహావీరుల”మను అహంకారమును విడిచిపెట్టితిమి, మాయొక్క జీవనము మాకు దానముగ ఇపుడు ఇచ్చి, మీరు మమ్ము వధింపక, కన్నులతో తృప్తిగ, వేంచేసి చూడుడు. పర్వతముల వలె చేరి, మీయొక్క విజయము మాయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుచున్నాము! 

కల్లిల్ మున్నీర్ మార్ట్రివన్దు, కావల్ కడన్దు, ఇలఙ్గై

అల్లల్ శెయ్ దాన్ ఉఙ్గళ్ కోమాన్, ఎమ్మై అమర్ కళత్తు,

వెల్లకిల్లాదు అఞ్జినోఙ్గాణ్, వెఙ్గదిరోన్ శిఱువా, 

కొల్లవేణ్డా ఆడుగిన్ఱోమ్, కుழమణితూరమే  ll 1873

(వానర శ్రేష్టులారా!)ఉఙ్గళ్ కోమాన్ = మీయొక్క ప్రభువైన శ్రీ రాముడు; కల్లిల్ = పర్వతములతో; మున్నీర్ మార్ట్రి వన్దు = సముద్రమును అడ్డగించి వచ్చి; ఇలఙ్గై = లంకాపురి యొక్క;కావల్ కడన్దు = సంరక్షణాత్మక అవరోధములను అధిగమించి; ఎమ్మై= మమ్ములను;అమర్ కళత్తు=యుద్ధ భూమిలో;అల్లల్ శెయ్ దాన్= అనేక దుఃఖములందు ముంచివేసెను; వెమ్ కదిరోన్ శిఱువా = తీవ్రమైన కిరణములుగల సూర్యుని కుమారా! సుగ్రీవా!;వెల్ల కిల్లాదు=మిమ్ములను జయింపలేక;అఞ్జినోమ్ కాణ్=భయపడియున్నాము  చూడుమా!; కొల్ల వేణ్డా = మమ్ములను వధింపవద్దు; కుழమణితూరమే ఆడుగిన్ఱోమ్ = మీయొక్క విజయము మాయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుచున్నాము!

    వానర శ్రేష్టులారా!, మీయొక్క ప్రభువైన శ్రీ రాముడు పర్వతములతో  సముద్రమును అడ్డగించి వచ్చి లంకాపురి యొక్క సంరక్షణాత్మక అవరోధములను అధిగమించి, మమ్ములను యుద్ధ భూమిలో అనేక దుఃఖములందు ముంచివేసెను. తీవ్రమైన కిరణములుగల సూర్యుని కుమారా! సుగ్రీవా!,మిమ్ములను జయింపలేక  భయపడియున్నాము చూడుమా!, మమ్ములను వధింపవద్దు. మీయొక్క విజయము మాయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుచున్నాము!

మార్ట్రమావదు ఇత్తనైయే, వమ్మిన్ అరక్కరుళ్ళీర్,

శీర్ట్రమ్ నుమ్మేల్ తీరవేణ్డిల్, శేవకమ్ పేశాదే,

ఆర్ట్రల్ శాన్ఱ తొల్ పిఱప్పిల్, అనుమనై వాழ்గ ఎన్ఱు,

కూర్ట్రమన్నార్ కాణ ఆడీర్, కుழమణితూరమే  ll 1874

అరక్కర్ ఉళ్ళీర్ = రాక్షసకులమందు జనించిన లంకాపురివాసులారా!; వమ్మిన్ = మీరు మాతోకలసి రండి; మార్ట్రమ్ ఆవదు ఇత్తనైయే=మీకు మేము చెప్పు మాటలు ఇవియే!; నుమ్మేల్ = మీపైన; శీర్ట్రమ్ = (శ్రీరాముని సేనయొక్క) కోపము;తీర వేణ్డిల్ = పోవలెనని కోరుకున్నచో; శేవకమ్ పేశాదే = ఇక శౌర్య పరాక్రమములను మాటలాడక; తొల్ పిఱప్పిల్ ఆర్ట్రల్ శాన్ఱ అనుమనై = అనాదికాలముగ  ప్రసిద్ధి చెందిన మిక్కిలి శక్తివంతుడైన హనుమను; వాழ்గ ఎన్ఱు = వర్ధిల్లవలెనని మంగళాశాసనము చేసి; కూర్ట్రమ్ అన్నార్ కాణ = మృత్యువువలెయున్న వానరవీరులు చూచునట్లు; కుழమణితూరమే ఆడీర్ = వారి యొక్క విజయమును మనయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుడు!

రాక్షసకులమందు జనించిన లంకాపురివాసులారా!, మీరు మాతోకలసి రండి. మీకు మేము చెప్పు మాటలు ఇవియే!. మీపైన (శ్రీరాముని సేనయొక్క) కోపము  పోవలెనని కోరుకున్నచో,ఇక శౌర్య పరాక్రమములను మాటలాడక, అనాదికాలముగ ప్రసిద్ధి చెందిన మిక్కిలి శక్తివంతుడైన హనుమను, వర్ధిల్లవలెనని మంగళాశాసనము చేసి, మృత్యువు వలెయున్న వానరవీరులు చూచునట్లు వారి యొక్క విజయమును మనయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుడు!

కవళయానై ప్పాయ్ పురవి, తేరోడరక్కరెల్లామ్

తువళ, వెన్ఱ వెన్ఱి యాళన్దన్, తమర్ కొల్లామే, 

తవళమాడ నీడు అయోత్తి, క్కావలన్దన్ శిఱువన్,

కువళై వణ్ణన్ కాణ ఆడీర్, కుழమణితూరమే  ll 1875

కవళమ్ యానై = ఎప్పుడు గ్రాసము ఆరగించు గజములును; పాయ్ పురవి = వేగముగ పరుగెత్తెడి అశ్వములును; తేరొడు = రథములతో;అరక్కర్ ఎల్లామ్ తువళ= రాక్షసులు అందరు క్షీణించునట్లు; వెన్ఱ = జయించిన; వెన్ఱి ఆళన్ తన్ తమర్ = జయశీలుడైన శ్రీరాముని యొక్క కింకరులైన వానరవీరులు; కొల్లామే = మనలను వధింపకనుండునట్లు; తవళమ్ మాడమ్ నీడు = తెల్లని సౌధములతో నిండియున్న విశాలమైన; అయోత్తి = అయోధ్యకు; కావలన్ తన్ శిఱువన్ = రక్షకుడైన దశరథుని పుత్రుడు;  కువళై వణ్ణన్= నీలోత్పముల  పుష్పములవంటి వర్ణముగల శ్రీ రాముడు; కాణ = చూచునట్లు; కుழమణితూరమే ఆడీర్= వారి యొక్క విజయమును మనయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుడు!

          ఎప్పుడు గ్రాసము ఆరగించు గజములును, వేగముగ పరుగెత్తెడి అశ్వములును,రథములతో రాక్షసులు అందరు క్షీణించునట్లు జయించిన, జయశీలుడైన శ్రీరాముని యొక్క కింకరులైన వానరవీరులు మనలను వధింపకనుండునట్లు   తెల్లని సౌధములతో నిండియున్న విశాలమైన అయోధ్యకు రక్షకుడైన దశరథుని పుత్రుడు, నీలోత్పముల పుష్పములవంటి వర్ణముగల శ్రీ రాముడు చూచునట్లు వారి యొక్క విజయమును మనయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుడు!

ఏడొత్త ఏన్దుమ్ నీళ్ ఇలైవేల్, ఎఙ్గిళిరావణనార్

ఓడిప్పోనార్, నాఙ్గళ్ ఎయ్ త్తోమ్, ఉయ్ వదోర్ కారణత్తాల్,

శూడిప్పోన్దోమ్ ఉఙ్గళ్ కోమాన్, ఆణై తొడరేన్మిన్,

కూడిక్కూడి యాడుగిన్ఱోమ్, కుழమణితూరమే  ll 1876

ఏడు ఒత్త నీళ్ ఇలై వేల్ = తాటి ఆకు వలె విశాలమైన పొడవైన చారలుగల శూలాయుధము;  ఏన్దుమ్ = ధరించిన; ఎఙ్గిళ్ ఇరావణనార్ = మాయొక్క ప్రభువైన రావణుడు; ఓడి పోనార్ = ఓడి మరణించిరి; నాఙ్గళ్ ఎయ్ త్తోమ్ = మేము మిక్కిలి దుర్భలులైతిమి;ఉయ్ వదోర్ కారణత్తాల్=ఇక ఉజ్జీవింపబడుటకై; ఉఙ్గళ్ కోమాన్ ఆణై=మీయొక్క ప్రభువైన శ్రీ రాముని ఆఙ్ఞలను;శూడి పోన్దోమ్=శిరసావహించుచుందము; తొడరేల్ మిన్ = (మమ్ములను వధించుటకై) ఉపక్రమించవద్దు;కూడి కూడి = గుంపులుగ చేరి; కుழమణితూరమే ఆడుగిన్ఱోమ్ = మీయొక్క విజయము మాయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుచున్నాము!

తాటి ఆకు వలె విశాలమైన పొడవైన చారలుగల శూలాయుధము  ధరించిన మాయొక్క ప్రభువైన రావణుడు  ఓడి మరణించిరి మేము మిక్కిలి దుర్భలులైతిమి, ఇక ఉజ్జీవింపబడుటకై మీయొక్క ప్రభువైన శ్రీ రాముని ఆఙ్ఞలను శిరసావహించుచుందము.(మమ్ములను వధించుటకై) ఉపక్రమించవద్దు.గుంపులుగ చేరి, మీయొక్క విజయము మాయొక్క ఓటమిని వ్యక్తపరచు  కుழమణితూరమను ఆటను ఆనందముతో ఆడుచున్నాము!

** వెన్ఱ తొల్ శీర్ తెన్నిలఙ్గై, వెఞ్జమత్తు, అన్ఱు అరక్కర్

కున్ఱమన్నార్ ఆడిఉయ్ న్ద, కుழమణితూరత్తై,

కన్ఱి నెయ్ నీర్ నిన్ఱ వేఱ్కై, క్కలియనొలిమాలై,

ఒన్ఱు మొన్ఱుమ్ ఐన్దుమూన్ఱుమ్, పాడి నిన్ఱు ఆడుమినే  ll 1877

తొల్=చిరకాలముగ;వెన్ఱ శీర్=జయించుటయే స్వభావముగల;తెన్నిలఙ్గై=లంకాపురిలో;  అన్ఱు వెఞ్జమత్తు = ఆనాటి తీవ్రమైన శ్రీరామ,రావణయుద్ధమందు;కున్ఱమ్ అన్నార్= పర్వతము వంటి రూపముగల; అరక్కర్ = రాక్షసులు; కుழమణితూరత్తై ఆడి ఉయ్ న్ద= కుழమణితూరమను ఆటను ఆడి ఉజ్జీవించిన విషయమై; కన్ఱి నెయ్ నీర్ నిన్ఱ వేల్ కై= నెయ్యితో మెరుగుపెట్టిన పదునైన శూలాయుధము తన చేతియందుగల; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; ఒలి = అనుగ్రహించిన; మాలై ఒన్ఱుమ్ ఒన్ఱుమ్ ఐన్దు మూన్ఱుమ్ = సూక్తులమాలైన ఈ పది పాసురములను; (ఓ! భక్తులారా!)  పాడి నిన్ఱు ఆడుమినే = పాడుకొనుచు ఆడి ఉజ్జీవింపుడు!

చిరకాలముగ జయించుటయే స్వభావముగల, లంకాపురిలో ఆనాటి తీవ్రమైన శ్రీరామ,రావణ యుద్ధమందు, పర్వతము వంటి రూపముగల రాక్షసులు, కుழమణితూరమను ఆటను ఆడి ఉజ్జీవించిన విషయమై, నెయ్యితో మెరుగుపెట్టిన పదునైన శూలాయుధము తన చేతియందుగల తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన సూక్తులమాలైన ఈ పది పాసురములను ఓ! భక్తులారా! పాడుకొనుచు ఆడి ఉజ్జీవింపుడు!

********

వ్యాఖ్యానించండి