పెరియతిరుమొழி-10వపత్తు (4)

శ్రీః

4 . శన్దమలర్కుழల్

యశోదాదేవి భావనతో తిరుమంగై ఆళ్వార్  ఆడుకొనుచున్న చిన్నారి    శ్రీకృష్ణుని పాలు త్రాగుటకై పిలుచచున్నారు.

** శన్ద మలర్ కుழల్ తాழ, త్తాన్ ఉగన్దు ఓడిత్తనియే

వన్దు, ఎన్ ములై త్తడన్దన్నైవాఙ్గి, నిన్ వాయిల్ మడుత్తు,

నన్దన్ పెఱప్పెర్ట్ర నమ్బీ, నాన్ ఉగన్దు ఉణ్ణుమ్ అముదే,

ఎన్దై పెరుమానే ఉణ్ణాయ్, ఎన్నమ్మమ్ శేమమ్ ఉణ్డాయే  ll 1878

నన్దన్ పెఱ పెర్ట్ర నమ్బీ = నందగోపుని పిల్లవానిగ పెరుగునట్లు వేంచేసియున్న స్వామీ!; నాన్ ఉగన్దు ఉణ్ణుమ్ అముదే = నేను ప్రీతితో ఆరగించెడి అమృతమా!;ఎన్దై పెరుమానే= నాయొక్క కులనాధుడైన చిన్ని కృష్ణా!; శన్దమ్ మలర్ కుழల్ = అందమైన పూలతో అలంకరింపబడిన కేశములు;తాழ= కదులుచుండగ; తాన్ తనియే ఉగన్దు ఓడి వన్దు=నీవు ఒంటరిగ కేరింతలతో పరుగున నావద్దకు వచ్చి; ఎన్ ములై తడమ్ తన్నై వాఙ్గి = నాయొక్క స్తనములను చిన్ని చేతులతో పట్టుకుని; నిన్ వాయిల్ మడుత్తు = నీయొక్క  నోటియందుంచుకొని; ఉణ్ణాయ్ = త్రాగుమా!; ఎన్ అమ్మమ్ = నాయొక్క స్తనమందలి  పాలు; శేమమ్ = క్షేమకరము; (జాగుచేయక) ఉణ్ణాయ్ = ఆరగించుమా!

      నందగోపుని పిల్లవానిగ పెరుగునట్లు వేంచేసియున్న స్వామీ!, నేను ప్రీతితో ఆరగించెడి అమృతమా!, నాయొక్క కులనాధుడైన చిన్ని కృష్ణా!,అందమైన పూలతో అలంకరింపబడిన కేశములు కదులుచుండగ, నీవు ఒంటరిగ కేరింతలతో పరుగున నావద్దకు వచ్చి, నాయొక్క స్తనములను చిన్ని చేతులతో పట్టుకుని నీయొక్క నోటియందుంచుకొని త్రాగుమా!. నాయొక్క స్తనమందలి పాలు క్షేమకరము. (జాగుచేయక)  ఆరగించుమా!;

వఙ్గ మఱికడల్ వణ్ణా, మా ముగిలే ఒక్కుమ్ నమ్బీ,

శెఙ్గణ్ నెడియ తిరువే, శెఙ్గమలమ్ పురై వాయా,

కొఙ్గై శురన్దిడ ఉన్నై, క్కూవియుమ్ కాణాదిరున్దేన్,

ఎఙ్గిరున్దు ఆయర్ గళోడుమ్, ఎన్విళైయాడుగిన్ఱాయే  ll 1879

వఙ్గ మఱి కడల్ వణ్ణా = అలలుకొట్టుచున్న సముద్రమువంటి వర్ణముగలవాడా! మా ముగిలే ఒక్కుమ్ నమ్బీ = కాళమేఘమును ఒప్పు స్వామీ!;నెడియ శెమ్ కణ్ తిఱువే=పెద్ద ఎర్రని నేత్రములుగల శ్రీమంతుడా!; శెమ్ కమలమ్ పురై వాయా = ఎర్ర తామర పుష్పమువంటి అదరములుగలవాడా!; కొఙ్గై శురన్దిడ = స్తనములందు పాలు చేరి యున్నది; ఉన్నై కూవియుమ్ = నిన్ను బిగ్గరగ పిలిచినను; కాణాదు ఇరున్దేన్=ఎక్కడను చూడకున్నాను; ఆయర్ గళోడుమ్ = గోపబాలురతో; ఎఙ్గు ఇరున్దు = ఎక్కడ ఉండి; ఎన్ విళైయాడుగిన్ఱాయే = ఏమి ఆటలు ఆడుచున్నావు? (జాగు చేయక వచ్చి పాలును ఆరగించుమా!)

                  అలలుకొట్టుచున్న సముద్రమువంటి వర్ణముగలవాడా!,కాళమేఘమును ఒప్పు స్వామీ!, పెద్ద ఎర్రని నేత్రములుగల శ్రీమంతుడా!, ఎర్ర తామర పుష్పమువంటి అదరములు గలవాడా!, స్తనములందు పాలు చేరియున్నది. నిన్ను బిగ్గరగ పిలిచినను, ఎక్కడను చూడకున్నాను. గోపబాలురతో ఎక్కడ ఉండి, ఏమి ఆటలు ఆడుచున్నావు? (జాగు చేయక వచ్చి పాలును ఆరగించుమా!)

తిరువిల్ పొలిన్ద ఎழிలార్, ఆయర్ తమ్బిళ్ళైగళోడు,

తెరువిల్ తిళైక్కిన్ఱ నమ్బీ, శెయ్ గిన్ఱ తీమైగళ్ కణ్డిట్టు,

ఉరుగి ఎన్ కొఙ్గైయిన్ తీమ్బాల్, ఓట్టన్దు పాయ్ న్దిడుగిన్ఱ,

మరువి కుడఙ్గాల్ ఇరున్దు, వాయ్ ములై యుణ్ణ నీ వారాయ్ ll 1880

తిరువిల్ పొలిన్ద ఎழிల్ ఆర్ = మిక్కిలి సంపన్నులైన, సౌందర్యముగల; ఆయర్ తమ్ పిళ్ళైగళోడు = గోపబాలురతో; తెరువిల్ తిళైక్కిన్ఱ నమ్బీ = వీధులలో ఆడుకొనుచున్న  స్వామీ!; శెయ్ గిన్ఱ తీమైగళ్ కణ్డిట్టు = నీవు చేయుచున్న  అల్లరిపనులు చూచి; (సంతోషముతో) ఎన్ కొఙ్గైయిన్ తీమ్ పాల్=నాయొక్క స్తనమందలి మధురమైన పాలు; ఉరుగి= కరిగి; ఓట్టన్దు పాయ్ న్దిడుగిన్ఱ = వరదగ పొంగి కారుచు వ్యర్ధమగుచున్నది; కుడఙ్గాల్ = నాయొక్క ఒడిలో; మరువి ఇరున్దు = చేరియుండి; వాయ్ = నీయొక్క చిన్న నోటితో; ములై యుణ్ణ = స్తనమందున్న పాలను త్రాగుటకై; నీ వారాయ్ = నీవు జాగుచేయక రమ్ము!

మిక్కిలి సంపన్నులైన,సౌందర్యముగల గోపబాలురతో వీధులలో ఆడుకొనుచున్న  స్వామీ!, నీవు చేయుచున్న  అల్లరిపనులు చూచి (సంతోషముతో) నాయొక్క స్తనమందలి మధురమైన పాలు కరిగి వరదగ పొంగి కారుచు వ్యర్ధమగు చున్నది. నాయొక్క ఒడిలో చేరియుండి నీయొక్క చిన్న నోటితో స్తనమందున్న పాలను  త్రాగుటకై  నీవు జాగుచేయక రమ్ము!

మక్కళ్ పెఱు తవమ్బోలుమ్, వైయత్తు వాழுమ్ మడవార్,

మక్కళ్ పిఱర్ కణ్ణుక్కొక్కుమ్ ముదల్వా, మదక్కళిఱన్నాయ్,

శెక్కర్ ఇళమ్బిఱై తన్నైవాఙ్గి, నిన్ కైయిల్ తరువన్,

ఒక్కలైమేల్ ఇరున్దు అమ్మమ్ ఉగన్దు,ఇనిదు ఉణ్డ నీవారాయ్ll 1881

వైయత్తు వాழுమ్ మడవార్ = ఈ దేశమునగల స్రీలయొక్కయు;పిఱర్ మక్కళ్ = తక్కిన మనుష్యల యొక్కయు;కణ్ణుక్కు= నేత్రములకు; మక్కళ్ పెఱు తవమ్ పోలుమ్ ఒక్కుమ్ముదల్వా = పిల్లలు పొందుటకు చేయు తపమే ఒక రూపమును పొందినదో అనునట్లున్న జగత్కారణభూతుడా!; మద కళిఱు అన్నాయ్ = మదించిన ఏనుగువంటి శక్తిగలవాడా!; శెక్కర్ ఇళమ్ పిఱై తన్నై వాఙ్గి=ఆకాశములోనున్న అందమైన బాలచంద్రునుని పట్టుకొని; తరువన్ = నీకిచ్చెదను; ఒక్కలై మేల్ ఇరున్దు = నా ఒడిలో ఉండి; అమ్మమ్ ఉగన్దు = స్తనమందలి పాలను సంతోషముతో; ఇనుదు = భోగ్యముగ; ఉణ్ణ =  త్రాగుటకై; నీ వారాయ్ = నీవు జాగుచేయక రమ్ము!

  ఈ దేశమునగల స్రీలయొక్కయు, తక్కిన మనుష్యలయొక్కయు నేత్రములకు, పిల్లలు పొందుటకు చేయు తపమే ఒక రూపమును పొందినదో అనునట్లున్న జగత్కారణభూతుడా!, మదించిన ఏనుగువంటి శక్తిగలవాడా!, ఆకాశములో నున్న అందమైన బాలచంద్రునుని పట్టుకొని నీకిచ్చెదను. నా ఒడిలో ఉండి స్తనమందలి పాలను సంతోషముతో భోగ్యముగ  త్రాగుటకై నీవు జాగుచేయక రమ్ము!

మైత్త కరుమ్ కుఞ్జి మైన్దా, మామరుదు ఊడు నడన్దాయ్,

విత్తకనే విరైయాదే, వెణ్ణెయ్ విழுఙ్గుమ్ వికిర్ దా,

ఇత్తనైపోదన్ఱి ఎన్దన్, కొఙ్గై శురన్దిరుక్కకిల్లా,

ఉత్తమనే అమ్మమ్ ఉణ్ణాయ్, ఉలగళన్దాయ్ అమ్మముణ్ణాయ్ ll 1882

మైత్త కరుమ్ కుఞ్జి=కాటుకవలె నల్లని కురులుగల; మైన్దా=నా బాలకృష్ణా!; మా మరుదు ఊడు = పెద్ద మద్ది వృక్షముల నడుమ;నడన్దాయ్= క్రిందపడునట్లు పాకిన; విత్తకనే = ఆశ్చర్యమైన శక్తి కలిగినవాడా!; విరైయాదే = ఎటువంటి తొందరలేక;వెణ్ణెయ్ విழுఙ్గుమ్= వెన్నను దొంగతనమునగ ఆరగింప సమర్ధతగల; వికిర్ దా=విలక్షణమైన వాడా!;ఎన్ తన్ కొఙ్గై = నాయొక్క స్తనములు; శురన్దు = పాలతో నిండి; ఇత్తనై పోదు అన్ఱి= ఇప్పటివరకు పైకిపొర్లనీయక ఆ భారమును భరించితిని; ఇరుక్కకిల్లా = ఇక సహించలేను; ఉత్తమనే = శ్లాఘ్యమైన గుణములు కలవాడా!; అమ్మమ్ ఉణ్ణాయ్ = పాలును త్రాగుమా!; ఉలగళన్దాయ్ = సర్వలోకములను పాదములచే కొలిచిన స్వామీ!; అమ్మమ్ ఉణ్ణాయ్ = పాలును త్రాగుమా!.

కాటుకవలె నల్లని కురులుగల నా బాలకృష్ణా!,పెద్ద మద్ది వృక్షములనడుమ క్రిందపడునట్లు పాకిన ఆశ్చర్యమైన శక్తి కలిగినవాడా!, ఎటువంటి తొందరలేక వెన్నను దొంగతనమునగ ఆరగింప సమర్ధతగల విలక్షణమైనవాడా!, నాయొక్క స్తనములు  పాలతో నిండి, ఇప్పటివరకు పైకి పొర్లనీయక ఆ భారమును భరించితిని. ఇక సహించలేను. శ్లాఘ్యమైన గుణములు కలవాడా! పాలును త్రాగుమా!, సర్వలోకములను పాదములచే కొలిచిన స్వామీ! పాలును త్రాగుమా!.

పిళ్ళైగళ్ శెయ్ వన శెయ్యాయ్, పేశిల్ పెరిదుమ్ వలియై, 

కళ్ళమనత్తిల్ ఉడైయై, కాణవే తీమైగళ్ శెయ్ ది,

ఉళ్ళమురుగి ఎన్ కొఙ్గై, ఓట్టన్దు పాయ్ న్దిడుగిన్ఱ, 

పళ్ళిక్కుఱిప్పు చ్చెయ్యాదే, పాలముదు ఉణ్ణ నీ వారాయ్  ll 1883

పిళ్ళైగళ్ శెయ్ వన శెయ్యాయ్ = నీ వయస్సుగల పిల్లలు చేయు అల్లరులవలె నీవు చేయవు; పేశిల్ = నీ చేతలను చెప్పదలిచినచో; పెరిదుమ్ వలియై = మిక్కిలి శక్తితో కూడినవిగనుండును; మనత్తిల్ = మనసున; కళ్ళమ్ ఉడైయై=కపటము కలిగియుంటివి; తీమైగళ్ శెయ్ ది=అల్లరిపనులుతో కూడిన దివ్యమైన చేష్టితములను చేయుచుందువు; కాణవే = అవి చూచినవెంటనే; ఎన్ ఉళ్ళమ్ ఉరుగి= నాయొక్క మనస్సు ఆనందముతో ద్రవించి; కొఙ్గై = నా స్తనముల; ఓట్టన్దు పాయ్ న్దిడుగిన్ఱ = పాలు వరదగ పొంగి కారుచు వ్యర్ధమగుచున్నది;పళ్ళి కుఱిప్పు శెయ్యాదే = కృష్ణా! దొంగ నిదుర అభినయము చేయక; పాలముదు ఉణ్ణ నీ వారాయ్=మధురమైన పాలను త్రాగుటకై నీవు జాగుచేయక రమ్ము!

నీ వయస్సుగల పిల్లలు చేయు అల్లరులవలె నీవు చేయవు, నీ చేతలను చెప్పదలిచినచో మిక్కిలి శక్తితో కూడినవిగనుండును.మనసున కపటము కలిగియుంటివి; అల్లరిపనులుతో కూడిన దివ్యమైన చేష్టితములను చేయుచుందువు.   అవి చూచినవెంటనే నాయొక్క మనస్సు ఆనందముతో ద్రవించి నా స్తనముల పాలు వరదగ పొంగి కారుచు వ్యర్ధమగుచున్నది. కృష్ణా! దొంగనిదుర అభినయము చేయక  మధురమైన పాలను త్రాగుటకై నీవు జాగుచేయక రమ్ము!

తన్మగనాగ వన్ పేయ్ చ్చి, తాన్ ములై యుణ్ణక్కొడుక్క,

వన్మగనాయ్ అవళ్ ఆవివాఙ్గి, ములైయుణ్ణ నమ్బీ,

నన్మగళ్ ఆయ్ మగళోడు, నా నిలమఙ్గై మణాళా,

ఎన్మగనే అమ్మమ్ ఉణ్ణాయ్, ఎన్నమ్మమ్ శేమముణ్ణాయే  ll 1884

వల్ పేయ్ చ్చి = క్రూరమైన రక్కసి పూతన; తన్ మగన్ ఆగ = నిన్ను తన పుత్రునిగ చేరదీసి; తాన్ ములై ఉణ్ణ కొడుక్క= తన స్తనమందలి పాలును ఆరగించమని ఇవ్వగ; వల్ మగనాయ్=బలమైన బాలుడై;అవళ్ ఆవివాఙ్గి ములై ఉణ్ణ నమ్బీ=ఆపూతనయొక్క ప్రాణము హరించుచు స్తనమందలి పాలు త్రాగిన స్వామీ!; నల్ మగళ్ ఆయ్ మగళోడు= శ్లాఘ్యమైన గోపస్త్రీ నప్పిన్నైపిరాట్టికిని;నానిలమఙ్గై=శ్రీ భూదేవికిని;మణాళా= వల్లభుడా!; ఎన్ మగనే=నా చిట్టి తండ్రీ!; అమ్మమ్ ఉణ్ణాయ్ = పాలు త్రాగుమా!; శేమమ్ ఉణ్ణాయే=క్షేమకరము! (జాగుచేయక) ఆరగించుమా!

క్రూరమైన రక్కసి పూతన, నిన్ను తన పుత్రునిగ చేరదీసి,తన స్తనమందలి పాలును ఆరగించమని ఇవ్వగ,బలమైన బాలుడై ఆపూతనయొక్క ప్రాణము హరించుచు స్తనమందలి పాలు త్రాగిన స్వామీ!, శ్లాఘ్యమైన గోపస్త్రీ నప్పిన్నైపిరాట్టికిని శ్రీ భూదేవికిని వల్లభుడా!,నా చిట్టి తండ్రీ! పాలు త్రాగుమా!, క్షేమకరము! (జాగుచేయక)ఆరగించుమా!

ఉన్దమడిగళ్ మునివర్, ఉన్నై నాన్ ఎన్ కైయిల్ కోలాల్,

నొన్దిడ మోదవుమ్ కిల్లేన్, ఉఙ్గళ్ తమ్ ఆనిరైయెల్లామ్,

వన్దు పుగుతరుమ్బోదు, వానిడై త్తైయ్ వఙ్గళ్ కాణ,

అన్దియమ్బోదు అఙ్గునిల్లేల్, ఆழிఅమ్ కైయనే వారాయ్  ll 1885

ఆழி అమ్ కైయనే = సుదర్శనచక్రముచే సౌందర్యము ఇనుమడించిన హస్తముగలవాడా; ( నీవు చేయుచున్న కొంటెపనులను చూచి) ఉన్దమ్ అడిగళ్ = మీయొక్క తండ్రి నందగోపస్వామి; మునివర్ = కోపగించుచున్నారు; నాన్ ఎన్ కైయిల్ కోలాల్ = నేను నా చేతిలోనున్న కర్రచే; ఉన్నై నొన్దిడ మోదవుమ్ కిల్లేన్ = నిన్ను నొప్పి కలుగునట్లు కొట్టలేను; ఉఙ్గళ్ తమ్ ఆనిరై ఎల్లామ్ = మీయొక్క గోవుల సమూహములంతయు; వన్దు పుగుతరుమ్ పోదు=(అడవులందు మేపుకొని నీవు)వచ్చి ఊరిలో చేరెడు సమయమున; వానిడై తెయ్ వఙ్గళ్ కాణ = ఆకాశమున దేవతలు అసూయతో చూచునట్లు; అన్దియమ్ పోదు = సంధ్యాకాలమున; అఙ్గునిల్లేల్ = నాలుగువీధులమధ్య నిలిచియుండవద్దు; వారాయ్ = నా వద్దకు వచ్చియుండుము!

సుదర్శనచక్రముచే సౌందర్యము ఇనుమడించిన హస్తముగలవాడా!,( నీవు చేయుచున్న కొంటె పనులను చూచి) మీయొక్క తండ్రి నందగోపస్వామి కోపగించుచున్నారు, నేను నా చేతిలోనున్న కర్రచే  నిన్ను నొప్పి కలుగునట్లు కొట్టలేను. మీయొక్క గోవుల సమూహములంతయు (అడవులందు మేపుకొని నీవు) వచ్చి ఊరిలో చేరెడు సమయమున, ఆకాశమున దేవతలు అసూయతో చూచునట్లు సంధ్యాకాలమున  నాలుగు వీధులమధ్య నిలిచియుండవద్దు. నా వద్దకు వచ్చియుండుము

పెర్ట్ర త్తలైవన్ ఎమ్ కోమాన్, పేరరుళాళన్ మదలాయ్,

శుర్ట్ర క్కుழாత్తు ఇళఙ్గోవే, తోన్ఱియ తొల్ పుగழாళా,

కర్ట్రినన్దోఱుమ్ మఱిత్తు, క్కానన్ తిరిన్ద కళిఱే,

ఎర్ట్రుక్కు ఎన్నమ్మముణ్ణాదే, ఎమ్బెరుమాన్ ఇరున్దాయే  ll 1886

పెర్ట్ర తలైవన్ = గోవులకు నాధుడా!; ఎమ్ కోమాన్ = మాయొక్క స్వామీ!;పేరరుళాళన్ మదలాయ్ = గొప్ప దయాగుణములుగల నందగోపునియొక్క కుమారా!; శుర్ట్రమ్ క్కుழாత్తు = బంధుసమూహములంతటికి; ఇళమ్ కోవే = యువరాజా!;తోన్ఱియ తొల్ పుగழாళా= అంతటను వ్యాపించిన,ప్రకాశించుచున్న శాశ్వతమైన కీర్తిగలవాడా!; కానమ్ తోఱుమ్ = అడవులలో; కన్ఱు ఇనమ్ = గో సమూహములను; మఱిత్తు = కాపాడుచు; తిరిన్ద = సంచరించిన; కళిఱే = గజరాజా!; ఎమ్ పెరుమాన్ = నాకు గొప్పతనమును కలుగజేసిన తండ్రీ!; ఎర్ట్రుక్కు=ఎందులకు; ఎన్ అమ్మమ్ ఉణ్ణాదే ఇరున్దాయ్=నాయొక్కస్తనమందలి పాలను త్రాగకున్నావు? 

      గోవులకు నాధుడా!, మాయొక్క స్వామీ!,గొప్ప దయాగుణములుగల నందగోపునియొక్క కుమారా!, బంధుసమూహములంతటికి యువరాజా! , అంతటను వ్యాపించిన,ప్రకాశించుచున్న శాశ్వతమైన కీర్తిగలవాడా!,అడవులలో గోసమూహములను కాపాడుచు సంచరించిన గజరాజా!, నాకు గొప్పతనమును కలుగజేసిన తండ్రీ!, ఎందులకు నాయొక్క స్తనమందలి పాలను త్రాగకున్నావు? 

** ఇమ్మై ఇడర్ కెడవేణ్డి, ఏన్దెழிల్ తోళ్ కలికన్ఱి, 

శెమ్మై ప్పనువల్ నూల్ కొణ్డు, శెఙ్గణ్ నెడియవన్ తన్నై,

అమ్మముణ్ణెన్ఱు ఉరైగిన్ఱ, పాడలివై యైన్దుమైన్దుమ్,

మెయ్ మ్మై మనత్తువైత్తేత్త, విణ్ణవర్ ఆగలుమామే  ll 1887

ఎழிల్  ఏన్దు తోళ్ కలికన్ఱి = అతి సౌందర్యముతో ఒప్పు భుజములుగల తిరుమంగై ఆళ్వార్;ఇమ్మై ఇడర్ కెడ వేణ్డి=ఈ జన్మమునగల దుఃఖములు నశింపజేయవలెనని ఆశించి; శెమ్ కణ్ నెడియవన్ తన్నై = పుండరీకాక్షుడైన సర్వేశ్వరుని విషయమై;శెమ్మై నూల్  పనువల్ కొణ్డు = శ్లాఘ్యమైన శాస్త్రవిదితమైన సూక్తులను గ్రహించి; అమ్మమ్ ఉణ్ణు ఎన్ఱు ఉరైగిన్ఱ పాడల్ ఇవై ఐన్దుమ్ ఐన్దుమ్ = ” స్తనమందలి పాలును ఆరగింప రమ్మని ”  పిలుచుచుండెడి ఈ పదిపాసురములను; మెయ్ మ్మై= యదార్ధమైన ప్రీతితో; మనత్తు వైత్తు ఏత్త = మనసున గ్రహించి అనుసంధించినచో; విణ్ణవర్ ఆగలుమ్ ఆమే = నితశూరులగు భాగ్యము కలుగును!

                    అతి సౌందర్యముతో ఒప్పు భుజములుగల తిరుమంగై ఆళ్వార్   ఈ జన్మమునగల దుఃఖములు నశింపజేయవలెనని ఆశించి పుండరీకాక్షుడైన సర్వేశ్వరుని విషయమై  శ్లాఘ్యమైన శాస్త్రవిదితమైన సూక్తులను గ్రహించి, ” స్తనమందలి పాలును ఆరగింప రమ్మని ”  పిలుచుచుండెడి ఈ పదిపాసురములను  యదార్ధమైన ప్రీతితో మనసున గ్రహించి అనుసంధించినచో నితశూరులగు భాగ్యము కలుగును!

*******

వ్యాఖ్యానించండి