శ్రీః
5 . పూఙ్గోదై
యశోదాదేవి భావనతో తిరుమంగై ఆళ్వార్,ఆడుకొనుచున్న చిన్నారి శ్రీకృష్ణుని తన చిన్ని చేతులతో చప్పట్లు కొట్టి రంజింపజేయమని వేడుకొనుచున్నారు.
** పూఙ్గోదై ఆయ్ చ్చి, కడై వెణ్ణై పుక్కు ఉణ్ణ,
ఆఙ్గవళార్తు ప్పుడైక్క, ప్పుడైయుణ్డు,
ఏఙ్గి యిరున్దు, శిణుఙ్గివిళై యాడుమ్,
ఓఙ్గోదవణ్ణనే శప్పాణి, ఒళిమణివణ్ణనే శప్పాణి ll 1888
(ఈ పాసురమున యశోదాదేవి తనకు తానే ఉద్దేశించుకొని చెప్పుచున్నారు. …..) పూ కోదై ఆయ్ చ్చి = పుష్పములతో అలంకరించుకొనిన కొప్పుగల యశోదాదేవిచే;కడై వెణ్ణై= చిలికి తీసిపెట్టిన వెన్నను; పుక్కు ఉణ్ణ = దొంగతనముగ ప్రవేశించి ఆరగించిగ; అవళ్ = ఆ యశోదాదేవి; ఆఙ్గు = అచ్చోటనే; ఆర్తు = తాడుచేకట్టి; పుడైక్క = కొట్టగ; పుడై ఉణ్డు=దెబ్బలు తిని; ఏఙ్గి ఇరున్దు = (కొంత సమయమువరకు ) వెక్కి వెక్కి ఏడ్చుకొనుచు ఉండి; శిణుఙ్గి = బుజ్జగింపడి; విళైయాడుమ్ = ఆడుకొనుచున్న కృష్ణుడు; ఓఙ్గు ఓద వణ్ణనే=ఎత్తైన అలలుగల సముద్రమువంటి వర్ణముగల చిన్ని కృష్ణా!; శప్పాణి= చప్పట్లు కొట్టుమా!; ఒళి మణి వణ్ణనే శప్పాణి = కాంతిగల నీలమణివంటి వర్ణముగల చిన్ని కృష్ణా! చప్పట్లు కొట్టుమా!. అని వేడుకొనబడె.
(ఈ పాసురమున యశోదాదేవి తనకు తానే ఉద్దేశించుకొని చెప్పుచున్నారు). పుష్పములతో అలంకరించుకొనిన కొప్పుగల యశోదాదేవిచే, చిలికి తీసిపెట్టిన వెన్నను దొంగతనముగ ప్రవేశించి ఆరగించిగ ఆ యశోదాదేవి అచ్చోటనే తాడుచేకట్టి కొట్టగ,దెబ్బలు తిని (కొంత సమయమువరకు ) వెక్కి వెక్కి ఏడ్చుకొనుచు ఉండి, బుజ్జగింపడి, ఆడుకొనుచున్న కృష్ణుడు “ఎత్తైన అలలుగల సముద్రమువంటి వర్ణముగల చిన్ని కృష్ణా!,చప్పట్లు కొట్టుమా!, కాంతిగల నీలమణివంటి వర్ణముగల చిన్ని కృష్ణా! చప్పట్లు కొట్టుమా!.” అని వేడుకొనబడె.
తాయర్మనఙ్గళ్ తడిప్ప, తయిర్ నెయ్యుణ్డు
ఏయెమ్బిరాక్కళ్, ఇరునిలత్తు ఎఙ్గళ్ తమ్,
ఆయర్ అழగ అడిగళ్, అరవిన్ద
వాయవనే కొట్టాయ్ శప్పాణి, మాల్ వణ్ణనే కొట్టాయ్ శప్పాణి ll 1889
తాయర్ మనఙ్గళ్ తడిప్ప = (చిన్ని కృష్ణనికి ఏమగునోయని)తల్లుల మనస్సు దడదడ లాడునట్లు; తయిర్ నెయ్ ఉణ్డు = పెరుగు,నెయ్యి అమితముగ ఆరగించి; ఏయ్ = వంచనచేయు; ఎమ్ పిరాక్కళ్ = నాయొక్క స్వామీ!; ఇరు నిలత్తు = విశాలమైన ఈ భూమండలమున;ఎఙ్గళ్ తమ్ ఆయర్=మాయొక్క గోపకులమందున్న; అழగ = సుందరుడా!; అరవిన్దమ్ అడిగళ్ వాయవనే = కమలములవంటి పాదములు, అదరములు గల నా చిన్ని కృష్ణా!;శప్పాణి కొట్టాయ్=చప్పట్లు కొట్టుమా!; మాల్ వణ్ణనే = నల్లని వర్ణముగల నా చిన్ని కృష్ణా!; శప్పాణి కొట్టాయ్ = చప్పట్లు కొట్టుమా!.
(చిన్ని కృష్ణనికి ఏమగునోయని) తల్లుల మనస్సు దడదడ లాడునట్లు పెరుగు,నెయ్యి అమితముగ ఆరగించి వంచనచేయు నాయొక్క స్వామీ!, విశాలమైన ఈ భూమండలమున మాయొక్క గోపకులమందున్న సుందరుడా!, కమలములవంటి పాదములు,అదరములు గల నా చిన్ని కృష్ణా!,చప్పట్లు కొట్టుమా! నల్లని వర్ణముగల నా చిన్ని కృష్ణా!, చప్పట్లు కొట్టుమా!.
తామోర్ ఉరుట్టి, త్తయిర్ నెయ్ విழுఙ్గిట్టు
తామోతవழ்వర్ ఎన్ఱు, ఆయ్ చ్చియర్ తామ్బినాల్,
తా మోదర క్కైయాల్, ఆర్ క్క త్తழிమ్బిరున్ద,
తామోదరా కొట్టాయ్ శప్పాణి, తామరైక్కణ్ణనే శప్పాణి ll 1890
తా = తన చేతితో తడిమిచూచి; మోర్ ఉరుట్టు=మజ్జిగ అయినచో ఆ కుండను నేలపై బోర్లించి; తయిర్ నెయ్ విழுఙ్గిట్టు = పెరుగు, నెయ్యి ఉన్నచో వాటిని సంపూర్ణముగ ఆరగించగ; తామో తవழ்వర్ ఎన్ఱు = ” ఇటువంటి అల్లరి చేష్టలు చేసిన బాలుడే అమాయకుని వలె పాకుచున్నాడు ” అని చెప్పుచు; ఆయ్ చ్చియర్ = గోపస్త్రీలు; తామ్బినాల్ ఆర్ క్క=తాటితో కట్టగాను;తా కైయాల్ మోదర=బాధపడుతూ చేతులతో కొట్టగాను; తழிమ్బు ఇరున్ద = వాటిచే మచ్చలు గుర్తులుగ కలగియున్న; తామోదరా= దామోదరా! నా చిన్ని కృష్ణా!; శప్పాణి కొట్టాయ్ = చప్పట్లు కొట్టుమా!.తామరై కణ్ణనే = పుండరీకాక్షా! నా చిన్ని కృష్ణా!; శప్పాణి = చప్పట్లు కొట్టుమా!.
తన చేతితో తడిమిచూచి,మజ్జిగ అయినచో ఆ కుండను నేలపై బోర్లించి,పెరుగు, నెయ్యి ఉన్నచో వాటిని సంపూర్ణముగ ఆరగించగ, ” ఇటువంటి అల్లరి చేష్టులు చేసిన బాలుడే అమాయకుని వలె పాకుచున్నాడు ” అని చెప్పుచు, గోపస్త్రీలు తాటితో కట్టగాను, బాధపడుతూ చేతులతో కొట్టగాను, వాటిచే మచ్చలు గుర్తులుగ కలగియున్న దామోదరా! నా చిన్ని కృష్ణా!, చప్పట్లు కొట్టుమా!,పుండరీకాక్షా! నా చిన్ని కృష్ణా! చప్పట్లు కొట్టుమా!.
పెర్ట్రార్ తళైకழల, పేర్ న్దఙ్గు అయలిడత్తు,
ఉర్ట్రార్ ఒరువరుమిన్ఱి,ఉలగినిల్,
మర్ట్రారుమ్ అఞ్జప్పోయ్, వఞ్జప్పెణ్ నఞ్జుణ్డ,
కర్ట్రాయనే కొట్టాయ్ శప్పాణి, కార్ వణ్ణనే కొట్టాయ్ శప్పాణి ll 1891
పెర్ట్రార్ తళై కழల = తల్లిదండ్రుల కాళ్ళసంకెళ్లు తెగి క్రిందపడునట్లు; పేర్ న్దు = పాలసముద్రమున శేష తల్పమును విడిచి వచ్చి అవతరించి గోకులమున ఏతెంచి; ఆఙ్గు = అచ్చోటనే; అయలిడత్తు ఉర్ట్రార్ ఒరువరుమ్ ఇన్ఱి=సమీపమున ఆత్మీయులు ఏ ఒక్కరును లేని సమయమున; ఉలగినిల్ మర్ట్రారుమ్ అఞ్జ = లోకమున అందరు భయపడునట్లు; వఞ్జ పెణ్ నఞ్జు ఉణ్డ = వంచనతో యశోదాదేవి రూపములో వచ్చిన పూతన (స్తనమందు రాసుకొనిన)విషమును ఆరగించిన;కన్ఱు ఆయనే= గోపాలకృష్ణుడా!; శప్పాణి కొట్టాయ్ = చప్పట్లు కొట్టుమా!; కార్ వణ్ణనే = కాలమేఘమువంటి వర్ణముగల నా చిన్ని కృష్ణా!; శప్పాణి = చప్పట్లు కొట్టుమా!.
తల్లిదండ్రుల కాళ్ళసంకెళ్లు తెగి క్రిందపడునట్లు పాలసముద్రమున శేష తల్పమును విడిచి వచ్చి అవతరించి గోకులమున ఏతెంచి, అచ్చోటనే, సమీపమున ఆత్మీయులు ఏ ఒక్కరును లేని సమయమున, లోకమున అందరు భయపడునట్లు వంచనతో యశోదాదేవి రూపములో వచ్చిన పూతన (స్తనమందు రాసుకొనిన) విషమును ఆరగించిన గోపాలకృష్ణుడా! చప్పట్లు కొట్టుమా!, కాలమేఘమువంటి వర్ణముగల నా చిన్ని కృష్ణా!, చప్పట్లు కొట్టుమా!.
శోత్తెననిన్నై, త్తొழுవన్ వరన్దర,
పేయ్ చ్చి ములై యుణ్డపిళ్ళాయ్, పెరియన
ఆయ్ చ్చియర్, అప్పమ్ తరువర్, అవర్కాగ
చ్చార్ట్రి యోరాయిరమ్ శప్పాణి, తడమ్ క్కైకళాల్ కొట్టాయ్ శప్పాణి ll 1892
పేయ్ చ్చి ములై యుణ్డపిళ్ళాయ్ = రక్కసి పూతనయొక్క స్తనములను ఆరగించిన నా చిన్ని కృష్ణా!; వరమ్ తర = నా ఇచ్ఛను నీవు పూరించుటకై; నిన్నై = నిన్ను; శోత్తమ్ ఎన = నీకొక దణ్ణమని చెప్పుచు; తొழுవన్ = సేవించుచుంటిని; ఆయ్ చ్చియర్ = గోపస్త్రీలు; పెరియన అప్పమ్ తరువర్ = పెద్ద పెద్ద అప్పములు ఇచ్చెదరు;అవర్కు ఆగ శార్ట్రి=వారికొరకు ఇచటకు వచ్చి;ఓర్ ఆయిరమ్ శప్పాణి=ఒక వెయ్యి చప్పట్లు కొట్టుమా; తడమ్ కైయాల్ = నీయొక్క పెద్ద చేతితో; శప్పాణి కొట్టాయ్ = చప్పట్లు కొట్టుమా!;
రక్కసి పూతనయొక్క స్తనములను ఆరగించిన నా చిన్ని కృష్ణా! నా ఇచ్ఛను నీవు పూరించుటకై, నిన్ను, నీకొక దణ్ణమని చెప్పుచు సేవించుచుంటిని. గోపస్త్రీలు పెద్ద పెద్ద అప్పములు ఇచ్చెదరు వారికొరకు ఇచటకు వచ్చి ఒక వెయ్యి చప్పట్లు కొట్టుమా, నీయొక్క పెద్ద చేతితో చప్పట్లు కొట్టుమా!;
కేవలమన్ఱు, ఉన్ వయిఱు, వయిర్ట్రుక్కు
నాన్, అవల్ అప్పమ్ తరువన్, కరువిళై
ప్పూవలర్ నీణ్ముడి, నన్దన్ తన్ పోరేఱే,
కోవలనే కొట్టాయ్ శప్పాణి, కుడమాడీ కొట్టాయ్ శప్పాణి ll 1893
కరువిళై పూవలర్ = “కరువిళై” పుష్పమువంటి వర్ణముగలవాడా!;నీళ్ ముడి = పొడుగైన కిరీటము గలవాడా!; నన్దన్ తన్ పోరేఱే = నందగోపునిచే పెంచబడిన బలిష్టమైన వృషభమువంటి వాడా!; కోవలనే = పశువులను మేపగల సమర్ధుడా!; ఉన్ వయిఱు కేవలమన్ఱు = నీయొక్క ఉదరము సామాన్యమైనది కాదు; నాన్ వయిర్ట్రుక్కు అవల్ అప్పమ్ తరువన్ = నేను నీ ఉదరమునకు తగినట్లు అటుకులు, అప్పములు ఇచ్చెదను; శప్పాణి కొట్టాయ్ = చప్పట్లు కొట్టుమా!; కుడమాడీ = కుంభనృత్యము చేసినవాడా!; శప్పాణి కొట్టాయ్ = చప్పట్లు కొట్టుమా!
“కరువిళై” పుష్పమువంటి వర్ణముగలవాడా!, పొడుగైన కిరీటము గలవాడా!, నందగోపునిచే పెంచబడిన బలిష్టమైన వృషభమువంటి వాడా!, పశువులను మేపగల సమర్ధుడా!, నీయొక్క ఉదరము సామాన్యమైనదికాదు,నేను నీ ఉదరమునకు తగినట్లు అటుకులు,అప్పములు ఇచ్చెదను,చప్పట్లు కొట్టుమా!, కుంభనృత్యము చేసినవాడా! చప్పట్లు కొట్టుమా!;
పుళ్ళినైవాయ్ పిళన్దు, పూఙ్గురున్దమ్ శాయ్ త్తు,
తుళ్ళివిళై యాడి, తూఙ్గు ఉఱి వెణ్ణైయై,
అళ్ళియకైయాల్, అడియేన్ ములై నెరుడుమ్,
పిళ్ళై పిరాన్ కొట్టాయ్ శప్పాణి, పేయ్ ములై యుణ్డానే శప్పాణి ll1894
పుళ్ళినైవాయ్ పిళన్దు = బకాసురునియొక్క నోటిని చీల్చి సంహరించి; పూ కురున్దమ్ శాయ్ త్తు=పూలతో నిండిన కురున్దు వృక్షమును విరిచి పడగొట్టియు;తుళ్ళి విళైయాడి=ఎగిరి ఎగిరి ఆడుచు; తూఙ్గు ఉఱి వెణ్ణైయై = వేలాడుచున్న ఉట్లయందలి వెన్నను; అళ్ళియ = నిండుగఎత్తిన; కైయాల్=చేతులతో; అడియేన్ ములై నెరుడుమ్=నాయొక్క స్తనములను పాలకై నిమురుతున్న; పిళ్ళై పిరాన్ = నాయొక్క చిన్నారి కృష్ణా!; శప్పాణి కొట్టాయ్ = చప్పట్లు కొట్టుమా!; పేయ్ ములై యుణ్డానే శప్పాణి = రక్కసి పూతనయొక్క స్తనములను ఆరగించి వధించిన నా చిన్ని కృష్ణా! చప్పట్లు కొట్టుమా!.
బకాసురునియొక్క నోటిని చీల్చి సంహరించి,పూలతో నిండిన కురున్దు వృక్షమును విరిచి పడగొట్టియు,ఎగిరి ఎగిరి ఆడుచు వేలాడుచున్న ఉట్లయందలి వెన్నను నిండుగ ఎత్తిన చేతులతో నాయొక్క స్తనములను పాలకై నిమురుతున్న, నాయొక్క చిన్నారి కృష్ణా!, చప్పట్లు కొట్టుమా!, రక్కసి పూతనయొక్క స్తనములను ఆరగించి వధించిన నా చిన్ని కృష్ణా! చప్పట్లు కొట్టుమా!.
యాయుమ్ పిఱరుమ్, అఱియాద యామత్తు,
మాయవలవై, ప్పెణ్ వన్దుములైతర,
పేయెన్ఱు అవళై, పిడిత్తు ఉయిరై ఉణ్డ,
వాయవనే కొట్టాయ్ శప్పాణి, మాల్ వణ్ణనే కొట్టాయ్ శప్పాణి ll 1895
యాయుమ్ = తల్లి నేనును; పిఱరుమ్ = మిగిలినవారును; అఱియాద యామత్తు = ఏమియు తెలియని నడిరేయి గాఢనిద్రలోనుండగ;మాయమ్= వంచకియైన;అలవై పెణ్=దుష్టురాలైన రక్కసి పూతన;వన్దు = (కంసుడు ప్రరేపించగ గోకులమునకు యశోదాదేవి రూపములో )వచ్చి; ములై తర = తన స్తనమందలి పాలును ఇచ్చుటకు పూనుకొనగ; పేయ్ ఎన్ఱు అవళై పిడిత్తు = రక్కసి యని గ్రహించి ఆ వంచకి పూతనను పట్టుకొని; ఉయిరై ఉణ్డ =(ఆమె స్తనములను ఆరగించుచు)ప్రాణములను హరించిన; వాయవనే=దివ్యమైన నోరుగల నా చిన్ని కృష్ణా!; శప్పాణి కొట్టాయ్ = చప్పట్లు కొట్టుమా!; మాల్ వణ్ణనే = నల్లని వర్ణముగల నా చిన్ని కృష్ణా!; శప్పాణి కొట్టాయ్ = చప్పట్లు కొట్టుమా!.
తల్లి నేనును,మిగిలినవారును ఏమియు తెలియని నడిరేయి, గాఢనిద్రలోనుండగ, వంచకియైన దుష్టురాలైన రక్కసి పూతన (కంసుడు ప్రరేపించగ గోకులమునకు యశోదాదేవి రూపములో )వచ్చి తన స్తనమందలి పాలును ఇచ్చుటకు పూనుకొనగ, రక్కసి యని గ్రహించి ఆ వంచకి పూతనను పట్టుకొని,(ఆమె స్తనములను ఆరగించుచు) ప్రాణములను హరించిన దివ్యమైన నోరుగల నా చిన్ని కృష్ణా!, చప్పట్లు కొట్టుమా!,నల్లని వర్ణముగల నా చిన్ని కృష్ణా!,చప్పట్లు కొట్టుమా!.
కళ్ళక్కుழవియాయ్, క్కాలాల్ శగడత్తై,
తళ్ళియుదైత్తిట్టు, త్తాయాయ్ వరువాళై,
మెళ్ళ త్తొడర్ న్దు, పిడిత్తు ఆరుయిరుణ్డ,
వళ్ళలే కొట్టాయ్ శప్పాణి, మాల్ వణ్ణనే కొట్టాయ్ శప్పాణి ll 1896
కళ్ళ కుழవియాయ్ = మాయపు చేష్టలుగల చిన్న బాలునిగ అవతరించి; శగడత్తై = (అసురుడు ఆవేశించిన) బండిని;కాలాల్ తళ్ళి ఉదైత్తిట్టు=కాళ్ళను ఆడించుచు తన్నిన వాడును; తాయ్ ఆయ్ వరువాళై = తల్లి రూపముదాల్చి వచ్చిన పూతనను; మెళ్ళ తొడర్ న్దు పిడిత్తు = ఏమియు తెలియని వానివలె మెల్లగ ఒడిలో చేరి ఆమెయొక్క స్తనములను ఆరగించుటకై పట్టుకొని; ఆర్ ఉయిరుణ్డ = ఆమెయొక్క అపురూపమైన ప్రాణమును హరించిన;వళ్ళలే=ఉదారస్వభావుడైన నా చిన్ని కృష్ణా!;శప్పాణి కొట్టాయ్= చప్పట్లు కొట్టుమా!;మాల్ వణ్ణనే=నల్లని వర్ణముగల నా చిన్ని కృష్ణా!;శప్పాణి కొట్టాయ్= చప్పట్లు కొట్టుమా!.
మాయపు చేష్టలుగల చిన్న బాలునిగ అవతరించి,(అసురుడు ఆవేశించిన) బండిని కాళ్ళను ఆడించుచు తన్నినవాడును, తల్లి రూపముదాల్చి వచ్చిన పూతనను ఏమియు తెలియని వానివలె మెల్లగ ఒడిలో చేరి ఆమెయొక్క స్తనములను ఆరగించుటకై పట్టుకొని ఆమెయొక్క అపురూపమైన ప్రాణమును హరించిన ఉదార స్వభావుడైన నా చిన్ని కృష్ణా!,చప్పట్లు కొట్టుమా!, నల్లని వర్ణముగల నా చిన్ని కృష్ణా!, చప్పట్లు కొట్టుమా!.
** కారార్ పుయల్ కై, కలికన్ఱి మఙ్గైయర్కోన్,
పేరాళన్ నెఞ్జిల్, పిరియాదిడఙ్గొణ్డ
శీరాళా, శెమ్ తామరై క్కణ్ణా,తణ్ తుழாయ్,
తారాళా కొట్టాయ్ శప్పాణి, తడమార్వా కొట్టాయ్ శప్పాణి ll 1897
కారా ఆర్ పుయల్ కై=వర్షాకాలమున నీటిని గ్రహించి పైకెగిసి అంతటను వర్షించుచుండు మేఘమువంటి ఔదార్యము కలిగినవారును; మఙ్గైయర్ కోన్ = తిరుమంగై దేశవాసులకు ప్రభువును; పేరాళన్ = గొప్పతనము కలిగినవారైన;కలికన్ఱి=తిరుమంగై ఆళ్వార్ యొక్క; నెఞ్జిల్ = హృదయమున; పిరియాదు=ఎన్నడును విడువక;ఇడమ్ కొణ్డ = నిత్యవాసము చేయుచున్న; శీరాళా=కల్యాణగుణములతో ప్రకాశించుచున్నవాడా!;శెమ్ తామరై కణ్ణా= ఎర్రని తామర పుష్పములవంటి నేత్రములుగలవాడా!;తణ్ తుழாయ్ తార్ ఆళా = చల్లని తులసీమాలను ధరించియున్న కృష్ణా!; శప్పాణి కొట్టాయ్ = చప్పట్లుకొట్టుమా!; తడమార్వా = విశాలమైన వక్షస్థలముగలవాడా!;శప్పాణి కొట్టాయ్ = చప్పట్లు కొట్టుమా!.
వర్షాకాలమున నీటిని గ్రహించి పైకెగిసి అంతటను వర్షించుచుండు మేఘమువంటి ఔదార్యము కలిగినవారును, తిరుమంగై దేశవాసులకు ప్రభువును, గొప్పతనము కలిగినవారైన, తిరుమంగై ఆళ్వార్ యొక్క హృదయమున ఎన్నడును విడువక నిత్యవాసము చేయుచున్నకల్యాణగుణములతో ప్రకాశించుచున్నవాడా!, ఎర్రని తామర పుష్పములవంటి నేత్రములుగలవాడా!,చల్లని తులసీమాలను ధరించియున్న కృష్ణా!, చప్పట్లుకొట్టుమా!,విశాలమైన వక్షస్థలముగలవాడా!,చప్పట్లు కొట్టుమా!.
*******