పెరియతిరుమొழி-10వపత్తు (6)

శ్రీః

6 . ఎఙ్గానుమ్

శ్రీమన్నారాయణుని పరత్వము,మరియు సౌలభ్యము, సౌశీల్యము గుణములను తిరుమంగై ఆళ్వార్ అనుభవించుచున్నారు. 

** ఎఙ్గానుమ్ ఈదొప్పదోర్ మాయమ్ ఉణ్డే, నరనారణనాయ్ ఉలగత్తఱనూల్,

శిఙ్గామై విరిత్తవన్ ఎమ్బెరుమాన్, అతువన్ఱియుమ్ శెఞ్జుడరుమ్ నిలనుమ్,

పొఙ్గార్ కడలుమ్ పొరుప్పుమ్ నెరుప్పుమ్ నెరుక్కి పుగ, పొన్మిడఱు అత్తనైపోదు,

అఙ్గాన్దవన్ కాణ్మి నిన్ఱు ఆయ్ చ్చియరాల్, అళై వెణ్ణైయుణ్డు ఆప్పుణ్డిరున్దవనే ll 1898

నరన్ నారణన్ ఆయ్=(శిష్యునిగా,ఆచార్యునిగా) నరనారాయణనునిగ అవతరించి; ఉలగత్తు=లోకములో; అఱమ్ నూల్ శిఙ్గామై విరిత్తవన్=ధర్మమార్గములు తెలియజేయు సూక్తులుగల వేదములు సమసిపోనీయక దానిని విస్తరింపజేసినవాడును;ఎమ్బెరుమాన్ = నాయొక్క స్వామియు;అదు అన్ఱియుమ్=అదియునుగాక;శెమ్ శుడరుమ్ నిలనుమ్= సూర్యచంద్రాదులను,భూమియు; పొఙ్గు ఆర్ కడలుమ్ = అలలతో ఉప్పొంగుచుండెడి సముద్రములను;పొరుప్పుమ్ = పర్వతములను;నెరుప్పుమ్ = అగ్నియును (మొదలగు ఇవన్నియును);నెరుక్కి = చిన్న స్థానమున అణగియుండునటుల; పొన్ మిడఱు = దివ్య ఉదరము; పుగ అత్తనైపోదు = లోపల చేరునంత వరకు;అఙ్గాన్దవన్ కాణ్మిన్ = నోటిని విశాలముగ తెరచినవాడే సుమా!; ఇన్ఱు = ఇప్పుడు; అళై వెణ్ణై ఉణ్డు = పెరుగు,వెన్న దొంగతనముగ ఆరగించి;ఆయ్ చ్చియరాల్=గోపస్త్రీలచే; ఆప్పుణ్డు ఇరున్దవన్=(తాటితో) కట్టబడి యున్నాడు;ఈదు ఒప్పదు ఓర్ మాయమ్ = ఇటువంటి  అత్యంతమైన ఆశ్చర్యము; ఎఙ్గానుమ్ = ఎక్కడైనా; ఉణ్డే = ఉండునా?

      (శిష్యునిగాను,ఆచార్యునిగాను) నరనారాయణనునిగ అవతరించి,లోకములో ధర్మమార్గములు తెలియజేయు సూక్తులుగల వేదములు సమసిపోనీయక దానిని విస్తరింపజేసినవాడును, నాయొక్క స్వామియు, అదియునుగాక, సూర్య చంద్రాదులను,భూమియు,అలలతో ఉప్పొంగుచుండెడి సముద్రములను, పర్వతములను,అగ్నియును(మొదలగు ఇవన్నియును) చిన్న స్థానమున అణగి యుండునటుల దివ్య ఉదరము లోపల చేరునంత వరకు నోటిని విశాలముగ తెరచినవాడే సుమా!, ఇప్పుడు పెరుగు,వెన్న దొంగతనముగ ఆరగించి గోపస్త్రీలచే (తాటితో)కట్టబడి యున్నాడు!. ఇటువంటి  అత్యంతమైన ఆశ్చర్యము ఎక్కడైనా ఉండునా?

కున్ఱుఒన్ఱు మత్తా అరవమ్ అళవి, క్కురైమాకడలై క్కడన్దిట్టు, ఒరుకాల్

నిన్ఱు ఉణ్డైకొణ్డొట్టి వన్ కూన్ నిమిర, నినైన్ద పెరుమాన్ అదువన్ఱియుమ్ మున్,

నన్ఱుణ్డ తొల్ శీర్ మకరక్కడలేழு, మలైయేழு ఉలగేழு ఒழிయామై నమ్బి,

అన్ఱుణ్డవన్ కాణ్మిన్ ఇన్ఱు ఆయ్ చ్చియరాల్, అళై వెణ్ణైయుణ్డు ఆప్పుణ్డిరున్దవనే ll 1899

ఒన్ఱు కున్ఱు = మంధరమను ఒక పర్వతమును; మత్తా = కవ్వముగా; అరవమ్ = వాసుకి అను సర్పమును; అళవి = తాడుగ కట్టి; కురై మా కడలై = ఘోషించుచున్న మహా సముద్రమును; కడన్దు ఇట్టు = చిలికి; ఒరుకాల్ = వేరొక సమయమున; ఉణ్డై కొణ్డు = (విల్లుయందు) మట్టి బంతులతో; వన్ కూన్ = తీవ్రమైన గూనిని; ఒట్టి నిన్ఱు = పోగొట్టి; నిమిర = నిటారుగ సరియగునట్లు; నినైన్ద పెరుమాన్ = సంకల్పించిన సర్వేశ్వరుడును; అదు అన్ఱియుమ్=అదియునుగాక; మున్ అన్ఱు = మునుపొకకాలమున;నన్ఱు ఉణ్డ తొల్ శీర్ = బాగుగ ఆరగించెడి అనాదియైన కీర్తిగల; మకర కడల్ ఏழு = మకరములు సంచరించు సప్తసముద్రములను; మలై ఏழு=సప్త కులపర్వతములను;ఉలగు ఏழு= సప్త లోకములను; ఒழிయామై = ఏఒక్కటిని విడువక; నమ్బి ఉణ్డవన్ కాణ్మిన్ = ఆరగించి తన ఉదరమున ఉంచుకొనిన స్వామియే సుమా!; ఇన్ఱు = ఇప్పుడు;అళై వెణ్ణై ఉణ్డు = పెరుగు,వెన్న దొంగతనముగ ఆరగించి;ఆయ్ చ్చియరాల్= గోపస్త్రీలచే; ఆప్పుణ్డు ఇరున్దవన్= (తాటితో) కట్టబడి యున్నాడు!

          మంధరమను ఒక పర్వతమును కవ్వముగా, వాసుకి అను సర్పమును తాడుగ కట్టి, ఘోషించుచున్న మహా సముద్రమును చిలికియు, వేరొక సమయమున  (విల్లుయందు) మట్టి బంతులతో, తీవ్రమైన గూనిని పోగొట్టి నిటారుగ సరియగునట్లు  సంకల్పించిన సర్వేశ్వరుడును, అదియునుగాక,  మునుపొకకాలమున  బాగుగ ఆరగించెడి అనాదియైన కీర్తిగల, మకరములు సంచరించు సప్తసముద్రములను, సప్త కులపర్వతములను, సప్త లోకములను, ఏఒక్కటిని విడువక, ఆరగించి తన ఉదరమున ఉంచుకొనిన స్వామియే సుమా!, ఇప్పుడు, పెరుగు,వెన్న దొంగతనముగ ఆరగించి, గోపస్త్రీలచే, (తాటితో) కట్టబడి యున్నాడు! 

ఉళైన్దిట్టు ఎழுన్ద మదుకైటవర్ గళ్, ఉలప్పిల్ వలియాలవర్ పాల్, వయిరమ్

విళైన్దిట్ట దెన్ఱెణ్ణి విణ్ణోర్ పరవ, అవర్ నాళ్ ఒழிత్త పెరుమాన్ ముననాళ్,

వళైన్దిట్ట విల్లాళి వల్ వాళ్ ఎయిర్ట్రు, మలైపోల్ అవుణనుడల్ వల్ ఉకిరాల్,

అళైన్దిట్టవన్ కాణ్మిన్ ఇన్ఱు ఆయ్ చ్చియరాల్, అళై వెణ్ణైయుణ్డు ఆప్పుణ్డిరున్దవనేll 1900

ఉలప్పిల్ వలియాల్ = సాటిలేని శక్తితో; ఎழுన్ద = ఉద్భవించిన; మదుకైటవర్ గళ్ అవర్ పాల్ = మధుకైటభులను అసురులతో; వయిరమ్=పగ; విళైన్దిట్టదు ఎన్ఱు ఎణ్ణి = ఏర్పడినదని తెలుసుకొని; ఉళైన్దిట్టు = భయముతో వణుకుచు;విణ్ణోర్ పరవ=దేవతలు సర్వేశ్వరుని సేవించి స్తుతించగ;అవర్ నాళ్ ఒழிత్త పెరుమాన్=ఆ మధుకైటభులయొక్కజీవితకాలము నశింపజేసిన సర్వేశ్వరుడును;(అదియునుగాక) ముననాళ్ = మునుపొక కాలమున; వళైన్దిట్ట విల్లాళి = వంచిన విల్లును చేతియందు ధరించినవాడును; వల్ వాళ్ ఎయిఱు = బలమైన మెరయుచున్న పళ్ళు కలవాడును; మలైపోల్ = పర్వతము వలె నున్న;అవుణన్=అసురుడు హిరణ్యాసురునియొక్క;ఉడల్= శరీరమును;వల్ ఉకిరాల్ = వాడియైన నఖములచే; అళైన్దిట్టవన్ కాణ్మిన్ = రెండుగచీల్చి వధించిన స్వామియే సుమా!; ఇన్ఱు = ఇప్పుడు;అళై వెణ్ణై ఉణ్డు = పెరుగు,వెన్న దొంగతనముగ ఆరగించి; ఆయ్ చ్చియరాల్= గోపస్త్రీలచే; ఆప్పుణ్డు ఇరున్దవన్= (తాటితో) కట్టబడి యున్నాడు!

    సాటిలేని శక్తితో ఉద్భవించిన మధుకైటభులను అసురులతో పగ ఏర్పడినదని తెలుసుకొని,భయముతో వణుకుచు దేవతలు సర్వేశ్వరుని సేవించి స్తుతించగ, ఆ మధుకైటభులయొక్క జీవితకాలము నశింపజేసిన సర్వేశ్వరుడును (అదియునుగాక)  మునుపొక కాలమున, వంచిన విల్లును చేతియందు ధరించినవాడును, బలమైన మెరయుచున్న పళ్ళు కలవాడును, పర్వతము వలె నున్న అసురుడు హిరణ్యాసురునియొక్క శరీరమును వాడియైన నఖములచే రెండుగచీల్చి వధించిన స్వామియే సుమా! ఇప్పుడు పెరుగు,వెన్న దొంగతనముగ ఆరగించి గోపస్త్రీలచే (తాటితో) కట్టబడి యున్నాడు!

తళర్ న్దిట్టు ఇమైయోర్ శరణ్ తా ఎన, త్తాన్ శరణాయ్ మురణాయవనై, ఉగిరాల్

పిళన్దిట్టు అమరర్కు అరుళ్ శెయ్ దుగన్ద, పెరుమాన్ తిరుమాల్ విరినీర్ ఉలగై,

వళర్ న్దిట్టతొల్ శీర్ విఱల్ మావలియై, మణ్ కొళ్ళవఞ్జిత్తు ఒరుమాణ్కుఱళాయ్,

అళన్దిట్టవన్ కాణ్మిన్ ఇన్ఱు ఆయ్ చ్చియరాల్, అళై వెణ్ణైయుణ్డు ఆప్పుణ్డిరున్దవనే ll1901

ఇమైయోర్ = దేవతలు; తళర్ న్దిట్టు=(అసురుల వలన) మిక్కిలి వ్యధచెంది;శరణ్ తా ఎన = రక్షించమని వేడుకొనగ;తాన్ శరణాయ్=తాను రక్షకుడుగ నిలిచి;మురణాయ అవనై = మిక్కిలి బలిష్టుడైన హిరణ్యాసురుని; ఉగిరాల్ = నఖములచే; పిళన్దిట్టు= చీల్చి  సంహరించి; అమరర్కు = దేవతలకు; అరుళ్ శెయ్ దు ఉగన్ద = కృపజేసి ఆనందించిన; పెరుమాన్ = సర్వేశ్వరుడును; తిరుమాల్ = శ్రీదేవి వల్లభుడును; వళర్ న్దిట్ట తొల్ శీర్ = అతిశయించిన సంపదలుకలిగిన; విఱల్ మావలియై=బలశాలియైన మహాబలికి;మణ్ కొళ్ళ = భూమిని స్వాధీనము చేసుకొనుటకై; ఒరు మాణ్ కుఱళాయ్ = అద్వితీయమైన బ్రహ్మచారి వామనమూర్తిగ; వఞ్జిత్తు = తన చిన్ని పాదములను కనపరచి (మూడడుగుల నేలను యాచించి, దానజలమును గ్రహించి); విరినీర్ ఉలగై = సముద్రముచే చుట్టుకొని యున్న లోకములను;అళన్దిట్టవన్ కాణ్మిన్=కొలిచిన స్వామియే సుమా!;ఇన్ఱు= ఇప్పుడు; అళై వెణ్ణై ఉణ్డు=పెరుగు,వెన్న దొంగతనముగ ఆరగించి;ఆయ్ చ్చియరాల్= గోపస్త్రీలచే; ఆప్పుణ్డు ఇరున్దవన్= (తాటితో) కట్టబడి యున్నాడు!

దేవతలు (అసురుల వలన) మిక్కిలి వ్యధచెంది రక్షించమని వేడుకొనగ తాను రక్షకుడుగ నిలిచి, మిక్కిలి బలిష్టుడైన హిరణ్యాసురుని, నఖములచే చీల్చి  సంహరించి దేవతలకు కృపజేసి ఆనందించిన సర్వేశ్వరుడును, శ్రీదేవి వల్లభుడును, అతిశయించిన సంపదలు కలిగిన బలశాలియైన మహాబలికిి భూమిని స్వాధీనము చేసుకొనుటకై అద్వితీయమైన బ్రహ్మచారి వామనమూర్తిగ, తన చిన్ని పాదములను కనపరచి (మూడడుగుల నేలను యాచించి, దానజలమును గ్రహించి) సముద్రముచే చుట్టుకొని యున్న లోకములను కొలిచిన స్వామియే సుమా! ఇప్పుడు పెరుగు,వెన్న దొంగతనముగ ఆరగించి గోపస్త్రీలచే (తాటితో) కట్టబడి యున్నాడు!

నీణ్డాన్ కుఱళాయ్ నెడువానళవుమ్, అడియార్ పడుమ్ ఆழ் తుయరాయ వెల్లామ్,

తీణ్డామై నినైన్దు ఇమైయోరళవుమ్, శెల వైత్త పిరాన్ అదువన్ఱియుమ్ మున్, 

వేణ్డామై నమన్దమర్ ఎన్దమరై, వినవ ప్పెఱువారలెన్ఱు, ఉలగేழு

ఆణ్డానవన్ కాణ్మిన్ ఇన్ఱు ఆయ్ చ్చియరాల్, అళై వెణ్ణైయుణ్డు ఆప్పుణ్డిరున్దవనే ll 1902

అడియార్ పడుమ్ = ఆశ్రితులు అనుభవించుచుండు; ఆழ் తుయరాయ ఎల్లామ్ = దుర్భరమైన పాపఫలములన్నియు; తీణ్డామై = వారిని తాకనీయక;నినైన్దు=సంకల్పించి; కుఱళాయ్ = వామనమూర్తియై; నెడు వాన్ అళవుమ్=విశాలమైన ఆకాశ పర్యంతము; నీణ్డాన్ = పెరిగి; ఇమైయోర్ అళవుమ్ = నిత్యశూరులయొక్క స్థానమువరకును; శెల = చేరునట్లు; వైత్త = తన పాదపద్మములను పైకెత్తిన;పిరాన్ = ఉపకారకుడును; అదు అన్ఱియుమ్= అదియునుగాక;మున్ = మునుపొకకాలమున; వేణ్డామై = (యమబటులు జనులను నిశితముగ పరిశీలించుట) లేనట్లు; నమన్ తమర్ ఎన్ తమరై వినవ పెఱువార్ అలర్ ఎన్ఱు=”యమబటులు నాయొక్క ఆశ్రితులను శోధించరని” నియమించి  కృపచేసిన; ఉలగు ఏழு ఆణ్డాన్ అవన్ కాణ్మిన్ = సర్వలోకములను రక్షించు స్వామియే సుమా!; ఇన్ఱు= ఇప్పుడు; అళై వెణ్ణై ఉణ్డు=పెరుగు,వెన్న దొంగతనముగ ఆరగించి;ఆయ్ చ్చియరాల్= గోపస్త్రీలచే; ఆప్పుణ్డు ఇరున్దవన్= (తాటితో) కట్టబడి యున్నాడు!

ఆశ్రితులు అనుభవించుచుండు దుర్భరమైన పాపఫలములన్నియు వారిని తాకనీయక సంకల్పించి వామనమూర్తియై,విశాలమైన ఆకాశ పర్యంతము పెరిగి,  నిత్యశూరులయొక్క స్థానమువరకును చేరునట్లు తన పాదపద్మములను పైకెత్తిన, ఉపకారకుడును , అదియునుగాక మునుపొకకాలమున  (యమబటులు జనులను నిశితముగ పరిశీలించుట) లేనట్లు,”యమబటులు నాయొక్క ఆశ్రితులనుశోధించరని”  నియమించి కృపచేసిన సర్వలోకములను రక్షించు స్వామియే సుమా!,ఇప్పుడు పెరుగు,వెన్న దొంగతనముగ ఆరగించి గోపస్త్రీలచే (తాటితో) కట్టబడి యున్నాడు!

పழிత్తిట్ట ఇన్బప్పయన్ పర్ట్రఱుత్తు, ప్పణిన్దేత్త వల్లార్ తుయరాయ వెల్లామ్,

ఒழிత్తిట్టు అవరై త్తనక్కాక్కవల్ల, పెరుమాన్ తిరుమాల్ అదువన్ఱియుమ్ మున్,

తెழிత్తిట్టు ఎழுన్దేయెదిర్ నిన్ఱమన్నన్, శిన త్తోళవై యాయిరముమ్ మழுవాల్,

అழிత్తిట్టవన్ కాణ్మిన్ ఇన్ఱు ఆయ్ చ్చియరాల్, అళై వెణ్ణైయుణ్డు ఆప్పుణ్డిరున్దవనేll 1903

పழிత్తిట్ట = శాస్త్రములందు చెప్పబడిన; ఇన్బమ్ పయన్ = క్షణభంగురమైన స్వల్ప సుఖఫలములను;పర్ట్రు అఱుత్తు = ఆశింపక విసర్జించి; పణిన్దు ఏత్త వల్లార్= సేవించి  స్తుతించు సమర్ధతగలవారి; తుయర్ ఆయ ఎల్లామ్ = దుఃఖములనబడునవన్నియు; ఒழிత్తిట్టు = నశింపజేసి; అవరై తనక్కు ఆక్కవల్ల=వారిని తన నిత్య కింకరులుగ చేకొను సమర్ధతగల; పెరుమాన్ = సర్వేశ్వరుడును; తిరుమాల్ = శ్రీదేవి వల్లభుడును; అదు అన్ఱియుమ్=అదియునుగాక;మున్ = మునుపొకకాలమున; తెழிత్తు ఇట్టు = పెద్దగ గర్జించుచు; ఎழுన్దే = తన రొమ్మును చరచుకొనుచు; ఎదిర్ నిన్ఱ=ఎదురించి నిలబడిన; మన్నన్ = (కార్త్యవీర్యార్జునుడు అను)మహారాజుయొక్క;శిన=కోపముతో పొంగియున్న; తోళ్ అవై ఆయిరముమ్ = ఆ సహస్రభుజములును; మழுవాల్ = గండ్రగొడ్డలిచే; అழிత్తిట్టవన్ కాణ్మిన్ = ఖండించి వధించిన స్వామియే సుమా!; ఇన్ఱు= ఇప్పుడు; అళై వెణ్ణై ఉణ్డు=పెరుగు,వెన్న దొంగతనముగ ఆరగించి;ఆయ్ చ్చియరాల్= గోపస్త్రీలచే; ఆప్పుణ్డు ఇరున్దవన్= (తాటితో) కట్టబడి యున్నాడు!

    శాస్త్రములందు చెప్పబడిన క్షణభంగురమైన స్వల్ప సుఖఫలములను ఆశింపక విసర్జించి  సేవించి స్తుతించు సమర్ధతగలవారి దుఃఖములనబడునవన్నియు నశింపజేసి వారిని తన నిత్య కింకరులుగ చేకొను సమర్ధతగల సర్వేశ్వరుడును, శ్రీదేవి వల్లభుడును, అదియునుగాక  మునుపొకకాలమున పెద్దగ గర్జించుచు తన రొమ్మును చరచుకొనుచు ఎదురించి నిలబడిన (కార్త్యవీర్యార్జునుడు అను) మహారాజుయొక్క కోపముతో పొంగియున్న ఆ సహస్రభుజములును గండ్రగొడ్డలిచే ఖండించి వధించిన స్వామియే సుమా! ఇప్పుడు పెరుగు,వెన్న దొంగతనముగ ఆరగించి గోపస్త్రీలచే(తాటితో) కట్టబడి యున్నాడు!

పడైత్తిట్టదు ఇవ్వైయముయ్య ముననాళ్, ప్పణిన్దేత్త వల్లార్ తుయరాయ వెల్లామ్,

తుడైత్తిట్టు అవరై తనక్కాక్క వెన్న, త్తెళియాఅరక్కర్ తిఱల్ పోయ్ అవియ,

మిడైత్తిట్టు ఎழுన్ద క్కురఙ్గై ప్పడైయా, విలఙ్గల్ పుగ ప్పాయ్ చ్చివిమ్మ, కడలై

అడైత్తిట్టవన్ కాణ్మిన్ ఇన్ఱు ఆయ్ చ్చియరాల్, అళై వెణ్ణైయుణ్డు ఆప్పుణ్డిరున్దవనేll 1904

ముననాళ్ = మునుపొకకాలమున;ఇ వైయమ్=ఈ లోకములను; పడైత్తిట్టు = (కరణ కళేబరములు ఒసగి) సృజించి; అదు = ఆలోకములు;ఉయ్య = ఉజ్జీవించుటకై; పణిన్దు= శ్రీపాదములను సేవించి; ఏత్త వల్లార్ = స్తుతించు సమర్ధతగలవారి యొక్క; తుయరాయ ఎల్లామ్ = దుఃఖములనబడునవన్నియు; తుడైత్తిట్టు = పోగొట్టి; అవరై= వారిని; తనక్కు ఆక్క ఎన్న = తన కైంకర్యపరులుగ స్వీకరించు సంకల్పమున; తెళియా= ఆ సంకల్పమును సహింపజాలక కలతచెంది క్రూరమైన కర్మలుచేయు;అరక్కర్=రావణాది రాక్షసులయొక్క; తిఱల్ = శక్తి; పోయ్ అవియ=తరిగి నశించునట్లు;మిడైత్తిట్టు ఎழுన్ద= నిబిడముగ చేరిన; కురఙ్గై పడైయా = వానరవీరులను సేనగ; విమ్మ = (సముద్రము) పూరింపబడునట్లు; విలఙ్గల్ పుగ పాయ్ చ్చి = పర్వతములను పరచి; కడలై = మహాసముద్రమును; అడైత్తిట్టవన్ కాణ్మిన్ = అడ్డగించిన స్వామియే సుమా!, ఇన్ఱు= ఇప్పుడు; అళై వెణ్ణై ఉణ్డు=పెరుగు,వెన్న దొంగతనముగ ఆరగించి;ఆయ్ చ్చియరాల్= గోపస్త్రీలచే;ఆప్పుణ్డు ఇరున్దవన్= (తాటితో) కట్టబడి యున్నాడు!

      మునుపొకకాలమున,ఈ లోకములను(కరణకళేబరములు ఒసగి) సృజించి  ఆలోకములు ఉజ్జీవించుటకై, శ్రీపాదములను సేవించి స్తుతించు సమర్ధతగలవారి యొక్క  దుఃఖములనబడునవన్నియు పోగొట్టి వారిని తన కైంకర్యపరులుగ స్వీకరించు సంకల్పమున, ఆ సంకల్పమును సహింపజాలక కలతచెంది క్రూరమైన కర్మలుచేయు రావణాది రాక్షసులయొక్క శక్తి తరిగి నశించునట్లు, నిబిడముగ చేరిన వానరవీరులను సేనగ, (సముద్రము) పూరింపబడునట్లు పర్వతములను పరచి మహాసముద్రమును  అడ్డగించిన స్వామియే సుమా!,ఇప్పుడు పెరుగు,వెన్న దొంగతనముగ ఆరగించి గోపస్త్రీలచే(తాటితో) కట్టబడి యున్నాడు!

నెఱిత్తిట్ట మెన్ కూழைనన్నేర్ ఇழைయోడు, ఉడనాయ విల్లెన్న వల్లేయదనై,

ఇఱుత్తిట్టు అవళిన్బమ్ ఆన్బోడణైన్దిట్టు, ఇళఙ్గొర్ట్ర వనాయ్ తుళఙ్గాదమున్నీర్,

శెఱుత్తిట్టు ఇలఙ్గై మలఙ్గ అరక్కన్, శెழுనీణ్ముడి తోళొడు తాళ్ తుణియ,

అఱుత్తిట్టవన్ కాణ్మిన్ ఇన్ఱు ఆయ్ చ్చియరాల్,అళై వెణ్ణైయుణ్డు ఆప్పుణ్డిరున్దవనేll 1905

నెఱిత్తిట్ట మెన్ కూழை = నల్లని మృదువైన కేశములతో ఒప్పు కొప్పును; నల్ నేర్ ఇழைయోడు = విలక్షణమైన అందమైన ఆభరణములు కలిగియున్న సీతాదేవితో; ఉడన్ అయ = కూడ జతచేరియున్న; వల్లన్న విల్ అదనై=కఠినమైన ఆ శివధనస్సును; ఇఱుత్తిట్టు = (కన్యశుల్కముగ యున్నదానిని) విరిచి; అవళ్ ఇన్బమ్ = ఆ సీతాదేవితో సంశ్లేష సుఖమును;ఆన్బోడు అణైన్దిట్టు=మిక్కిలి ప్రీతితో పొంది; ఇళ కొర్ట్రవన్ ఆయ్=యువరాజై; (తదుపరి వనవాసము కలగిన పిదప) తుళఙ్గాద మున్నీర్=ఏ ఒక్కరివలన కదలింపలేని సముద్రమున; శెఱుత్తిట్టు = సేతువును కట్టి; ఇలఙ్గై మలఙ్గ = లంకాపురి కలతచెంది; అరక్కన్ = రావణాసురుని; శెழு నీళ్ ముడి = మిక్కిలి ఆకర్షణీయమైన పొడుగైన తలలును;తోళొడు తాళ్=భుజములును,కాళ్ళను తుణియ =శిధిలమగునట్లు; అఱుత్తిట్టవన్ కాణ్మిన్గళ్ = శరములచే ఖండించిన స్వామియే సుమా!; ఇన్ఱు= ఇప్పుడు; అళై వెణ్ణై ఉణ్డు=పెరుగు,వెన్న దొంగతనముగ ఆరగించి;ఆయ్ చ్చియరాల్= గోపస్త్రీలచే;ఆప్పుణ్డు ఇరున్దవన్= (తాటితో) కట్టబడి యున్నాడు!

నల్లని మృదువైన కేశములతో ఒప్పు కొప్పును,విలక్షణమైన అందమైన ఆభరణములు కలిగియున్న సీతాదేవితో కూడ జతచేరియున్న అతికఠినమైన ఆ శివధనస్సును (కన్యశుల్కముగ యున్నదానిని) విరిచి ఆ సీతాదేవితో సంశ్లేష సుఖమును మిక్కిలి ప్రీతితో పొంది యువరాజై (తదుపరి వనవాసము కలగిన పిదప) ఏ ఒక్కరివలన కదలింపలేని సముద్రమున ,సేతువును కట్టి లంకాపురి కలతచెంది   రావణాసురునియొక్క మిక్కిలి ఆకర్షణీయమైన పొడుగైన తలలును, భుజములును, కాళ్ళను శిధిలమగునట్లు శరములచే ఖండించిన స్వామియే సుమా!, ఇప్పుడు పెరుగు, వెన్న దొంగతనముగ ఆరగించి గోపస్త్రీలచే(తాటితో) కట్టబడి యున్నాడు!

శురిన్దిట్టశెఙ్గేழு ఉళై ప్పొఙ్గు అరిమా, తొలైయ ప్పిరియాదు శెన్ఱు ఎయ్ ది,ఎయ్ దా

తిరిన్దిట్టు ఇడఙ్గొణ్డడఙ్గాదన్వాయ్, ఇరుకూఱు శెయ్ ద పెరుమాన్ ముననాళ్, 

వరిన్దిట్టవిల్లాల్ మరమేழுమెయ్ దు, మలైపోలురువత్తు ఒరుఇరాక్కదిమూక్కు,

అరిన్దిట్టవన్ కాణ్మిన్ ఇన్ఱు ఆయ్ చ్చియరాల్, అళై వెణ్ణైయుణ్డు ఆప్పుణ్డిరున్దవనేll 1906

శురిన్దిట్ట = వంకువంకులతో; శెమ్ కేழு ఉళై = ఎర్రని జూలుకలిగియున్న;పొఙ్గు అరిమా=ఉద్రేకముతో ఉప్పొంగి వచ్చిన అశ్వరూపములో నున్న కేశియను అసురుని; తొలైయ = అంతమొందునట్లు; పిరియాదు=దానిని విడువక;శెన్ఱుఎయ్ ది=సమీపమునకు పోయి; ఎయ్ దాదు ఇరిన్దిట్టు ఇడమ్ కొణ్డు అడఙ్గా అదన్ వాయ్ = దగ్గరకు చేరక అచట ఇచట పరిగెడుచు అవకాశమీయక చిక్కని ఆ అశ్వము యొక్క నోటిని; ఇరు కూఱు శెయ్ ద = రెండు భాగములుగ చేసిన; పెరుమాన్=సర్వేశ్వరుడును; ముననాళ్=మునుపొకకాలమున;వరిన్దిట్ట=సంధించిన; విల్లాల్ =తన విల్లుచే; మరమ్ ఏழுమ్ ఎయ్ దు= సప్త సాలవృక్షములను ఒకే బాణముచే కూలగొట్టి మరియు; మలై పోల్ ఉరువత్తు =  పర్వతాకారములోనున్న; ఒరు ఇరాక్కది = ఒక రక్కసి శూర్పణఖయొక్క; మూక్కు= ముక్కును; అరిన్దిట్టవన్ కాణ్మిన్ = కోసిన స్వామియే సుమా!; ఇన్ఱు= ఇప్పుడు; అళై వెణ్ణై ఉణ్డు=పెరుగు,వెన్న దొంగతనముగ ఆరగించి;ఆయ్ చ్చియరాల్ = గోపస్త్రీలచే; ఆప్పుణ్డు ఇరున్దవన్= (తాటితో) కట్టబడి యున్నాడు!

వంకువంకులతో ఎర్రని జూలు కలిగియున్న ఉద్రేకముతో ఉప్పొంగి వచ్చిన అశ్వరూపములో నున్న కేశియను అసురుని అంతమొందునట్లు దానిని విడువక  సమీపమునకు పోయి, దగ్గరకు చేరక అచట ఇచట పరిగెడుచు అవకాశమీయక చిక్కని ఆ అశ్వముయొక్క నోటిని రెండు భాగములుగ చేసిన సర్వేశ్వరుడును, మునుపొక కాలమున సంధించిన తన విల్లుచే సప్త సాలవృక్షములను ఒకే బాణముచే కూలగొట్టి,  మరియు పర్వతాకారములోనున్న ఒక రక్కసి శూర్పణఖయొక్క ముక్కును  కోసిన స్వామియే సుమా! ఇప్పుడు పెరుగు,వెన్న దొంగతనముగ ఆరగించి గోపస్త్రీలచే (తాటితో) కట్టబడి యున్నాడు!

** నిన్ఱార్ముకప్పు చ్చిఱిదుమ్ నినైయాన్, వయిర్ట్రైనిఱైప్పానుఱి ప్పాల్తయిర్ నెయ్,

అన్ఱు ఆయ్ చ్చియర్ వెణ్ణైయ్ విழுఙ్గి, ఉరలోడు ఆప్పుణ్డిరున్ద పెరుమాన్ అడిమేల్,

నన్ఱాయ తొల్ శీర్ వయల్ మఙ్గైయర్కోన్, కలియనొలి శెయ్ తమిழ் మాలై వల్లార్,

ఎన్ఱాను మెయ్ దారిడర్ ఇన్బమెయ్ ది, ఇమైయోర్కుమప్పాల్ శెలవెయ్ దువారేll 1907

నిన్ఱార్ ముకప్పు = తనను చూడవచ్చినవారి ఎదుట;శిఱిదుమ్ నినైయాన్=లేశమాత్రము బిడియపడుట తలచక;  వయిర్ట్రై నిఱైప్పాన్ = కడుపు నిండుగ; ఆయ్ చ్చియర్ = గోపకాంతలయొక్క; ఉఱి = ఉట్లయందలి; పాల్ తయిర్ నెయ్ వెణ్ణైయ్ = పాలు,పెరుగు, నెయ్యి,వెన్న; విழுఙ్గి =(దొంగతనముగ) ఆరగించగ; అన్ఱు=ఆ సమయమున;ఉరలోడు =  రోకలికి; ఆప్పుణ్డు ఇరున్ద = కట్టబడియుండిన; పెరుమాన్=శ్రీ కృష్ణునియొక్క;అడిమేల్ = పాదద్వందములపై; నన్ఱాయ తొల్ శీర్ = అతిశయించిన సద్గుణ సంపన్నులైనవారైన; వయల్ మఙ్గైయర్కోన్ = పొలములచే చుట్టుకొనియున్న తిరుమంగై దేశవాసులకు ప్రభువైన; కలియన్ = తిరుమంగై ఆళ్వార్;ఒలి శెయ్=అనుగ్రహించిన; తమిழ் మాలై = తమిళ బాషలో నున్న ఈ పాశురములను; వల్లార్ = పఠించువారు; ఎన్ఱానుమ్ = ఒకనాడైనను; ఇడర్ ఎయ్ దార్ = కష్టములు పొందరు; ఇన్బమ్ ఎయ్ ది = సుఖమును పొంది; ఇమైయోర్కుమ్ అప్పాల్ శెల = దేవతలకు పైనున్న పరమపదమును లభించెడి  భాగ్యమును; ఎయ్ దువార్ = పొందుదురు!.

తనను చూడవచ్చినవారి ఎదుట లేశమాత్రము బిడియపడుట తలచక, కడుపు నిండుగ గోపకాంతలయొక్క ఉట్లయందలి పాలు,పెరుగు, నెయ్యి,వెన్న (దొంగతనముగ) ఆరగించగ, ఆ సమయమున రోకలికి కట్టబడియుండిన శ్రీ కృష్ణునియొక్క పాదద్వందములపై అతిశయించిన సద్గుణ సంపన్నులైనవారైన,  పొలములచే చుట్టుకొనియున్న తిరుమంగై దేశవాసులకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన తమిళ బాషలో నున్న ఈ పాశురములను పఠించువారు, ఒకనాడైనను కష్టములు పొందరు. సుఖమును పొంది దేవతలకు పైనున్న పరమపదమును లభించెడి     భాగ్యమును పొందుదురు!.

******

వ్యాఖ్యానించండి