శ్రీః
7 . మానముడైత్తు
గోకులమందు గోపకాంతలు శ్రీకృష్ణుని చిలిపిచేష్టలను యశోదాదేవితో మొరపెట్టుకొనగ, తిరుమంగై ఆళ్వార్ ఆ యశోదాదేవి మనోస్థితిని చెప్పుచున్నారు.
** మానముడైత్తు ఉఙ్గళ్ ఆయర్ కులమ్ అదనాల్, పిఱర్ మక్కళ్ తమ్మై,
ఊనముడైయన శెయ్య ప్పెఱాయెన్ఱు, ఇరప్పన్ ఉరప్పగిల్లేన్,
నానుమ్ ఉరైత్తిలేన్ నన్దన్ పణిత్తిలన్, నఙ్గైగాళ్ నానెన్ శెయ్ గేన్,
తానుమ్ ఓర్ కన్నియుమ్ కీழைయగత్తు, త్తయిర్ కడైగిన్ఱాన్పోలుమ్ ll 1908
(శ్రీకృష్ణని చిలిపిచేష్టలకు గోపకాంతలు యశోదాదేవితో మొరపెట్టుకొనగ,ఆమె వారితో చెప్పిన మాటలు);ఉఙ్గళ్ ఆయర్ కులమ్=(నేను శ్రీకృష్ణునితో) “మీయొక్క గొల్లలకులము”; మానమ్ ఉడైత్తు అదనాల్ = మిక్కిలి గౌరవనీయమైనదిగ ప్రసిద్ధి చెందినదగుటచే; పిఱర్ మక్కళ్ తమ్మై = పొరుగు కాంతల చెంత; ఊనమ్ ఉడైయన శెయ్య పెఱాయ్ ఎన్ఱు = అవమానకరమైన చిలిపి చేష్టలు చేయకుము అని; ఇరప్పన్ = వేడుకొంటిని; (దానికి వారు శ్రీ కృష్ణుని మందలించమని కోరగ); ఉరప్పగిల్లేన్ = నేను గద్దించి తిట్టలేను; నఙ్గైగాళ్ = కాంతలారా!; నానుమ్ ఉరైత్తిలేన్ = నేనును కోపించి చెప్పలేను; నన్దన్ పణిత్తిలన్ = తండ్రి నందగోపులవారును ఏమియు మందలించరు; ( నేను వేడుకొన్నను ఇప్పుడుకూడ); తానుమ్ = శ్రీకృష్ణుడును;ఓర్ కన్నియుమ్=ఒక యౌవన కన్యయును కలసి; కీழை అగత్తు = ఆ తూర్పు దిక్కనగల గృహమున; తయిర్ కడైగిన్ఱాన్ పోలుమ్ = పెరుగు చిలుకుచున్నట్లు తెలియుచున్నది; (నిస్పృహతో) నాన్ ఎన్ శెయ్ గేన్ = నేనేమి చేయగలను?
(శ్రీకృష్ణని చిలిపిచేష్టలకు గోపకాంతలు యశోదాదేవితో మొరపెట్టుకొనగ, ఆమె వారితో చెప్పిన మాటలు): ( నేను శ్రీకృష్ణునితో) “మీయొక్క గొల్లలకులము”; మిక్కిలి గౌరవనీయమైనదిగ ప్రసిద్ధి చెందినదగుటచే, పొరుగు కాంతల చెంత అవమానకరమైన చిలిపి చేష్టలు చేయకుము అని వేడుకొంటిని.(దానికి వారు శ్రీ కృష్ణుని మందలించమని కోరగ) నేను గద్దించి తిట్టలేను,కాంతలారా! (అనురాగతిశయముచే) నేను కోపించి చెప్పలేను, తండ్రి నందగోపులవారును ఏమియు మందలించరు. (నేను వేడుకొన్నను ఇప్పుడు కూడ) శ్రీకృష్ణుడును,ఒక యౌవన కన్యయును కలసి ఆ తూర్పుదిక్కునగల గృహమున పెరుగు చిలుకుచున్నట్లు తెలియుచున్నది. (నిస్పృహతో) నేనేమి చేయగలను?
కాలై ఎழுన్దు కడైన్ద ఇమ్మోర్ విర్క ప్పోగిన్ఱేన్, కణ్డేపోనేన్,
మాలై నఱుమ్ కుఞ్జి నన్దన్ మగనల్లాల్, మర్ట్రు వన్దారుమిల్లై,
మేలై అగత్తు నఙ్గాయ్ వన్దు కాణ్మిన్ గళ్, వెణ్ణయేయన్ఱు, ఇరున్ద
పాలుమ్ పదిన్ కుడఙ్గణ్డిలేన్, పావియేనెన్ శెయ్ గేనెన్ శెయ్ గేనో ll 1909
కాలై ఎழுన్దు = ఉదయముననే లేచి; కడైన్ద ఇ మోర్ విర్క పోగిన్ఱేన్ = (కష్టపడి) చిలికిన ఈ మజ్జిగను అమ్ముటకు పోవుచున్ననేను;కణ్డే పోనేన్=(శ్రీకృష్ణుడు ఎదురుగ వచ్చుటను) చూచి గొణుగుచునే పోతిని;మాలై నఱుమ్ కుఞ్జి=పరిమళభరితమైన పూమాలతోనున్న కేశములగల; నన్దన్ మగన్ అల్లాల్ = నందగోపునియొక్క కుమారుడు శ్రీ కృష్ణుడు తప్ప; మర్ట్రు వన్దారుమ్ ఇల్లై = వేరొకరు ఎవ్వరును ఇచటకు వచ్చినట్లు లేదు; మేలై అగత్తు నఙ్గాయ్ = పడమటి దిక్కుయందలి గృహమునగల కాంతామణీ! యశోదాదేవీ!; వన్దు కాణ్మిన్ గళ్ = (శ్రీకృష్ణుడు చేసిన దొంగతనమును) మీరే స్వయముగ వచ్చి చూడుడు; వెణ్ణయే అన్ఱు = వెన్నయే కాదు; పదిన్ కుడమ్ ఇరున్ద = పది కుండలలో పెరుగుకై తోడుపెట్టి యుంచిన; పాలుమ్ = పాలును; కణ్డిలేన్ = తెలియకున్నది; పావియేన్ = దురదృష్టురాలైన నేను; ఎన్ శెయ్ గేన్ = ఏమి చేయగలను; ఎన్ శెయ్ గేనో = అమ్మా! ఏమి చేయవలెనో తెలియకున్నది!.
ఉదయముననే లేచి (కష్టపడి) చిలికిన ఈ మజ్జిగను అమ్ముటకు పోవుచున్ననేను (శ్రీకృష్ణుడు ఎదురుగ వచ్చుటను) చూచి గొణుగుచునే పోతిని. పరిమళభరితమైన పూమాలతోనున్న కేశములగల నందగోపునియొక్క కుమారుడు శ్రీ కృష్ణుడు తప్ప వేరొకరు ఎవ్వరును ఇచటకు వచ్చినట్లు లేదు. పడమటి దిక్కుయందలి గృహమునగల కాంతామణీ! యశోదాదేవీ! (శ్రీకృష్ణుడు చేసిన దొంగతనమును) మీరే స్వయముగ వచ్చి చూడుడు. వెన్నయే కాదు,పది కుండలలో పెరుగుకై తోడుపెట్టి యుంచిన పాలును తెలియకున్నది!. దురదృష్టురాలైన నేను ఇపుడు ఏమి చేయగలను?, అమ్మా! ఏమి చేయవలెనో తెలియకున్నది!.
తెళ్ళియవాయ్ చ్చిఱియాన్ నఙ్గైగాళ్, ఉఱిమేలై త్తడానిఱైన్ద,
వెళ్ళిమలై యిరున్దాలొత్త వెణ్ణైయై, వారి విழுఙ్గియిట్టు,
కళ్వన్ ఉఱఙ్గుగిన్ఱాన్ వన్దు కాణ్మిన్ గళ్, కైయెల్లామ్ నెయ్ వయిఱు
పిళ్ళై పరమన్ఱు, ఇవ్వేழுలగుఙ్గొళ్ళుమ్, పేదైయేనెన్ శెయ్ గేనో ll 1910
( ఫిర్యాదు చేయుచున్న గోపకాంతలతో యశోదాదేవి తన చిన్నికృష్ణుని అమాకత్వము చెప్పి సమర్థించుచున్నారు) నఙ్గైగాళ్ =కాంతామణులారా!;తెళ్ళియవాయ్=స్వచ్ఛమైన పగడములవంటి అదరములుగల; శిఱియాన్ = ఈ చిన్నబాలుడు; ఉఱి మేలై తడా నిఱైన్ద = ఉట్టియందలి కుండలో నిండుగ నున్న; వెళ్ళి మలై ఇరున్దాల్ ఒత్త = వెండి కొండవలె ఒప్పు; వెణ్ణైయై = వెన్నను; వారి విழுఙ్గియిట్టు = తన చేతులతోపూర్తగ ఎత్తి ఆరగించి; కళ్వన్ ఉఱఙ్గుగిన్ఱాన్ = దొంగనిద్దుర నిదురించుచున్నాడు; వన్దు కాణ్మిన్ గళ్ = మీరే స్వయముగ వచ్చి చూడుడు;( చేసిన దొంగతనమును దాచక ) కై ఎల్లామ్ నెయ్ = ఇతని చేతులంతా నెయ్యితో నిండియుండుట చూడుడు; వయిఱు = ఇతనియొక్క ఉదరము; పిళ్ళై పరమ్ అన్ఱు=చిన్న పిల్లలవలెయున్నట్లు లేదు;ఇ ఏழு ఉలగుమ్ కొళ్ళుమ్=ఈ సప్తలోకములను ఆస్వాదించునట్లున్నది; పేదైయేన్=ఏమియు తోచని స్థితిలోనున్న నేను;ఎన్ శెయ్ గేన్ = ఏమి చేయగలను?.
( ఫిర్యాదు చేయుచున్న గోపకాంతలతో యశోదాదేవి తన చిన్నికృష్ణుని అమాకత్వము చెప్పి సమర్థించుచున్నారు) కాంతామణులారా!,స్వచ్ఛమైన పగడములవంటి అదరములుగల ఈ చిన్నబాలుడు, ఉట్టియందలి కుండలో నిండుగ నున్న వెండి కొండవలె ఒప్పు వెన్నను తన చేతులతో పూర్తగ ఎత్తి ఆరగించి దొంగ నిద్దుర నిదురించుచున్నాడు,మీరే స్వయముగ వచ్చి చూడుడు.(చేసిన దొంగతనమును దాచక) ఇతని చేతులంతా నెయ్యితో నిండియుండుట చూడుడు. ఇతనియొక్క ఉదరము చిన్న పిల్లలవలెయున్నట్లు లేదు.ఈ సప్తలోకములను ఆస్వాదించునట్లున్నది!. ఏమియు తోచని స్థితిలోనున్న నేను ఏమి చేయగలను?.
మైన్నమ్బువేల్ కణ్ నల్లాళ్, మున్నమ్ పెర్ట్ర వళైవణ్ణ నన్మామేని,
తన్నమ్బి నమ్బియుమ్ ఇఙ్గువళర్ న్దదు, అవన్ ఇవై శెయ్ దఱియాన్,
పొయ్ న్నమ్బి పుళ్ళువన్ కళ్వమ్ పొతి అఱై, పోకిన్ఱవా తవழ்న్దిట్టు,
ఇన్బమ్బినమ్బియాల్ ఆయ్ చ్చియర్కు ఉయ్ విల్లై, ఎన్ శెయ్ గేనెన్ శెయ్ గేనో ll1911
మై నమ్బు = కాటుక పెట్టుకొనియున్న; వేల్ కణ్ = శూలాయుధమువలె కన్నులుగల; నల్ ఆళ్ = సద్గుణసంపన్నురాలైన గోపకాంత యశోదాదేవి!; పెర్ట్ర = కలిగియున్న; వళై వణ్ణమ్ = శంఖమువలె తెల్లని వర్ణముగల;నల్ మా మేని=మిక్కిలి శ్లాఘ్యమైన శరీరము గల; తన్ నమ్బి నమ్బియుమ్= శ్రీకృష్ణునియొక్క సోదరుడైన బలరాముడును;మున్నమ్=మునుపు; ఇఙ్గు వళర్ న్దదు = ఈ గోకులమందే పెరిగినను; అవన్ ఇవై శెయ్ దు అఱియాన్ = ఆ బలరాముడు ఇటువంటి చిలిపిచేష్టలు చేసియుండలేదు; పొయ్ నమ్బి=అసత్యములతో నిండినవాడై; పుళ్ళువన్= వంచన చేయువాడై;కళ్వమ్ పొతి అఱై = దొంగతనముతో నిండినవాడైన ఈ చిన్ని కృష్ణుడు; (తను ఏ చిలిపిపనులు చేయనట్లు) తవழ்న్దిట్టు=పాకు కొనుచు; పోకిన్ఱవా=పోవుచున్నాడు సుమా!; ఇ నమ్బి నమ్బియాల్=ఈ పూర్ణుడు,స్వామి వలన; ఆయ్ చ్చియర్కు=గోపకాంతలకు;ఉయ్ వు ఇల్లై=జీవింపశఖ్యము కాదు; ఎన్ శెయ్ గేన్ = నేనేమి చేయగలను? ఎన్ శెయ్ గేనో = అమ్మా ! ఏమి చేయవలెనో తెలియకున్నది! .
కాటుక పెట్టుకొనియున్న శూలాయుధమువలె కన్నులుగల సద్గుణసంపన్నురాలైన గోపకాంత యశోదాదేవి! నీవు కలిగియున్న, శంఖమువలె తెల్లని వర్ణముగల మిక్కిలి శ్లాఘ్యమైన శరీరము గల శ్రీకృష్ణునియొక్క సోదరుడైన బలరాముడును మునుపు ఈ గోకులమందే పెరిగినను ఆ బలరాముడు ఇటువంటి చిలిపిచేష్టలు చేసియుండలేదు. అసత్యములతో నిండినవాడై, వంచన చేయువాడై, దొంగతనముతో నిండినవాడైన ఈ చిన్ని కృష్ణుడు (తను ఏ చిలిపిపనులు చేయనట్లు) పాకు కొనుచు పోవుచున్నాడు సుమా! .ఈ పూర్ణుడు స్వామివలన,గోపకాంతలకు జీవింప శఖ్యము కాదు. నేనేమి చేయగలను?. అమ్మా ! ఏమి చేయవలెనో తెలియకున్నది! .
తన్దైపుగున్దిలేన్ నానిఙ్గిరున్దిలేన్, తోழிమార్ ఆరుమిల్లై,
శన్దమలర్ కుழలాళ్, తనియే విళైయాడుమిడమ్ కుఱుగి,
పన్దు పఱిత్తు త్తుగిల్ పర్ట్రి క్కీఱి, ప్పడిఱన్ పడిఱుశెయ్యుమ్,
నన్దన్ మదలైక్కు ఇఙ్గెన్ కడవోమ్ నఙ్గాయ్, ఎన్ శెయ్ గేనెన్ శెయ్ గేనో ll 1912
నఙ్గాయ్ = ఓ! యశోదాదేవీ!; తన్దై = (ఈ నా కుమార్తె యొక్క)తండ్రి;పుగున్దు ఇలేన్ = ఇంటికి చేరలేదు; నాన్ ఇఙ్గు ఇరున్ది ఇలేన్ = నేనును గృహమున లేకుంటిని; తోழிమార్ ఆరుమ్ ఇల్లై = ఆమె సఖీమణులు ఏ ఒక్కరును చెంత లేకుండిరి; శన్దమలర్ కుழలాళ్= పరిమళభరితమైన పూలతోనిండిన కుంతలములుగల నాయొక్క కుమార్తె; తనియే = ఒంటరిగ; విళైయాడుమ్ ఇడమ్ కుఱుగి = ఆడుకొనుచున్న స్థలమును చేరుకొని; పన్దు పఱిత్తు = ఆమె చేతియందుగల బంతిని లాగుకొనియు; తుగిల్ పర్ట్రి కీఱి = ఆమె బట్టలను పట్టుకొని చించియు; పడిఱు శెయ్యుమ్ = మిక్కిలి అల్లరిపనులు చేయుచున్న; పడిఱన్ = దూర్తుడైన; నన్దన్ మదలైక్కు = నందగోపుని పుత్రుడైన శ్రీకృష్ణుని విషయమై; ఇఙ్గు ఎన్ కడవోమ్ = ఇచట ఏమి చేయవలెను?; ఎన్ శెయ్ గేన్ = నేనేమి చేయగలను? ఎన్ శెయ్ గేనో = అమ్మా ! ఏమి చేయవలెనో తెలియకున్నది! .
ఓ! యశోదాదేవీ!, ఈ నా కుమార్తె యొక్క తండ్రి ఇంటికి చేరలేదు, నేనును గృహమున లేకుంటిని,ఆమె సఖీమణులు ఏ ఒక్కరును చెంత లేకుండిరి, పరిమళభరితమైన పూలతోనిండిన కుంతలములుగల నాయొక్క కుమార్తె, ఒంటరిగ ఆడుకొనుచున్న స్థలమును చేరుకొని,ఆమె చేతియందుగల బంతిని లాగుకొనియు, ఆమె బట్టలను పట్టుకొని చించియు, మిక్కిలి అల్లరిపనులు చేయుచున్న, దూర్తుడైన నందగోపుని పుత్రుడైన శ్రీకృష్ణుని విషయమై ఇచట ఏమి చేయవలెను?, నేనేమి చేయగలను?,అమ్మా ! ఏమి చేయవలెనో తెలియకున్నది! .
మణ్మగళ్ కేళ్వన్ మలర్ మఙ్గై నాయగన్, నన్దన్ పెర్ట్రమదలై,
అణ్ణల్ ఇలై క్కుழలూది నఞ్జేరిక్కే, అల్లిల్ తాన్ వన్దపిన్నై,
కణ్మలర్ శోర్ న్దు ములైవన్దువిమ్మి, క్కమలచ్చెవ్వాయ్ వెళుప్ప,
ఎన్మగళ్ వణ్ణమ్ ఇరుక్కిన్ఱివా నఙ్గాయ్, ఎన్ శెయ్ గేనెన్ శెయ్ గేనో ll 1913
నఙ్గాయ్=ఓ! యశోదాదేవీ!;మణ్ మగళ్ కేళ్వన్=శ్రీ భూదేవియొక్క వల్లభుడును;మలర్ మఙ్గై నాయగన్=కమలవాసినికి నాయకుడును;నన్దన్ పెర్ట్ర మదలై=నందగోపుని యొక్క కుమారుడును; అణ్ణల్ తాన్ = అట్టి గొప్పతనము కలిగిన శ్రీకృష్ణుడు; ఇలై క్కుழల్ = దళముచే చేయబడిన వేణువును; ఊది = ఊదుచు;అల్లిల్ = రాత్రియందు;నమ్ శేరిక్కే= మా గృహమునకు;వన్ద పిన్నై=వచ్చిన పిదప; కణ్ మలర్=నీలోత్పముల వంటి కన్నులు; శోర్ న్దు = వాడిపోయి; ములై వన్దు విమ్మి = వక్షోజములు తహతహలాడి పొంగి; కమల శెమ్ వాయ్ వెళుప్ప=కమలమువంటి ఎర్రని అదరములు తెల్లబడిన;ఎన్ మగళ్ వణ్ణమ్ ఇరుక్కిన్ఱి ఆ = నాయొక్క కుమార్తె స్వరూపము వివర్ణమైన విధమును ఏమని చెప్పను; ఎన్ శెయ్ గేన్ = నేనేమి చేయగలను?; ఎన్ శెయ్ గేనో = అమ్మా ! ఏమి చేయవలెనో తెలియకున్నది! .
ఓ! యశోదాదేవీ!,శ్రీ భూదేవియొక్క వల్లభుడును,కమలవాసినికి నాయకుడును,నందగోపుని యొక్క కుమారుడును, అట్టి గొప్పతనము కలిగిన శ్రీకృష్ణుడు, దళముచే చేయబడిన వేణువును ఊదుచు రాత్రియందు మా గృహమునకు వచ్చిన పిదప,నీలోత్పముల వంటి కన్నులు వాడిపోయి, వక్షోజములు తహతహలాడి పొంగి, కమలమువంటి ఎర్రని అదరములు తెల్లబడిన,నాయొక్క కుమార్తె స్వరూపము వివర్ణమైన విధమును ఏమని చెప్పను!, నేనేమి చేయగలను?, అమ్మా ! ఏమి చేయవలెనో తెలియకున్నది! .
ఆయిరఙ్గణ్ణుడై ఇన్దిరనారుక్కెన్ఱు, ఆయర్ విழுవు ఎడుప్ప,
పాశన నల్లన పణ్డికళాళ్, పుగప్పెయ్ ద అదనైయెల్లామ్,
పోయ్ ఇరున్దు అఙ్గొరు పూదవడవుకొణ్డు, ఉన్ మగన్ ఇన్ఱు నఙ్గాయ్,
మాయన్ అదనైయెల్లామ్ ముర్ట్ర, వారి వళైత్తు ఉణ్డు ఇరన్దాన్ పోలుమ్ ll 1914
నఙ్గాయ్=ఓ! యశోదాదేవీ!;ఆయర్=ఈ గోపాలకులు;ఆయిరమ్ కణ్ణుడై ఇన్దిరనారుక్కు ఎన్ఱు = వెయ్యి కన్నులుగల ఇంద్రుని;విழுవు ఎడుప్ప = ఆరాధించుటకై; నల్లన పాశనమ్ = మంచి వంటపాత్రలలో; పణ్డికళాళ్ = పలు బండ్లయందు;పుగ పెయ్ ద అదనై ఎల్లామ్ = తెచ్చి ఏర్పరచిన ఆ అన్నరాసులంతయును; ఇన్ఱు = ఈ దినమున; (గోవర్ధనపర్వత ప్రాంతమునకు మరలింపజేసి) అఙ్గు = ఆ ప్రదేశమున; మాయన్ ఉన్ మగన్ = మాయపు చేష్టలుచేయగల నీయొక్క కుమారుడు; పోయ్ ఇరున్దు = చేరుకొని; ఒరు పూదమ్ వడవు కొణ్డు= ఒక దయ్యం ఆకారమును దాల్చి; అదనై యెల్లామ్ ముర్ట్ర వారి వళైత్తు ఉణ్డు ఇరన్దాన్ పోలుమ్ = వాటినన్నింటిని పూర్తిగా ఆరగించినాడు సుమా!
ఓ! యశోదాదేవీ! ఈ గోపాలకులు వెయ్యి కన్నులుగల ఇంద్రుని, ఆరాధించుటకై, మంచి వంటపాత్రలలో పలు బండ్లయందు తెచ్చి ఏర్పరచిన ఆ అన్న రాసులంతయును, ఈ దినమున (గోవర్ధనపర్వతప్రాంతమునకు మరలింపజేసి) ఆ ప్రదేశమునకు మాయపు చేష్టలుచేయగల నీయొక్క కుమారుడు చేరుకొని ఒక దయ్యం ఆకారమును దాల్చి వాటినన్నింటిని పూర్తిగా ఆరగించినాడు సుమా!
తోయ్ త్త తయిరుమ్ నఱునెయ్యుమ్ పాలుమ్, ఓరోకుడమ్ తుర్ట్రిడుమెన్ఱు,
ఆయ్ చ్చియర్ కూడి అழைక్కవుమ్, నానితఱ్కెళ్ గి ఇవనై నఙ్గాయ్,
శోత్తమ్ పిరాన్ ఇవై శెయ్య ప్పెఱాయెన్ఱు, ఇరప్పన్ ఉరప్పగిల్లేన్,
పేయ్ చ్చి ములై యుణ్ణ పిన్నై, ఇప్పిళ్ళైయై ప్పేశువదు అఞ్జువనే ll 1915
నఙ్గాయ్ = ఓ! యశోదాదేవీ!; తోయ్ త్త తయిరుమ్ = తోడుపెట్టిన పెరుగును; నఱు నెయ్యుమ్ = పరిమళభరితమైన నెయ్యియును; పాలుమ్ = పాలును,ఓరో కుడమ్=ఒక్కొక్క కుండలనుండి; తుర్ట్రిడుమ్ ఎన్ఱు =(శ్రీకృష్ణుడు) ఆరగించెనని;ఆయ్ చ్చియర్ కూడి = గోపకాంతలందరు గుమిగూడి; అழைక్కవుమ్ = నన్ను పిలిచి చెప్పినపుడు; నాన్ = శ్రీకృష్ణుని తల్లియైన నేను; ఇదఱ్కు = ఈ పనికి; ఎళ్ గి = మిక్కిలి ఖేదముతో; (వారితో)ఇవనై = ఈ కృష్ణుని; పిరాన్ = “నా స్వామీ!; శోత్తమ్ = నీకు అంజలిచేయుచున్నాను; ఇవై శెయ్ పెఱాయ్ = ఇటువంటి తప్పుడు పనులు చేయకుమా!”, ఎన్ఱు ఇరప్పన్ = అని ఈ విధముగ వేడుకొనగలనుకాని; ఉరప్పగిల్లేన్ = కోపముతో మందగించలేను; పేయ్ చ్చి ములై యుణ్ణ పిన్నై = రక్కసి పూతనయొక్క స్తనములను ఆరగించినది మొదలుకొని;ఇ పిళ్ళైయై పేశువదు అఞ్జువనే=ఈకృష్ణుని మందలించుటకు భయపడుచున్నాను!.
ఓ! యశోదాదేవీ!,తోడుపెట్టిన పెరుగును పరిమళభరితమైన నెయ్యియును, పాలును,ఒక్కొక్క కుండలనుండి (శ్రీకృష్ణుడు) ఆరగించెనని గోపకాంతలందరు గుమిగూడి నన్ను పిలిచి చెప్పినపుడు శ్రీకృష్ణుని తల్లియైన నేను ఈ పనికి మిక్కిలి ఖేదముతో,(వారితో)ఇవనై ఈ కృష్ణుని, “నా స్వామీ! నీకు అంజలి చేయుచున్నాను. ఇటువంటి తప్పుడు పనులు చేయకుమా!” అని ఈ విధముగ వేడుకొనగలనుకాని, కోపముతో మందగించలేను.రక్కసి పూతనయొక్క స్తనములను ఆరగించినది మొదలుకొని,ఈకృష్ణుని మందలించుటకు భయపడుచున్నాను!.
ఈడుమ్ వలియుమ్ ఉడైయ, ఇన్నమ్బి పిఱన్ద ఏழுతిఙ్గళిల్,
ఏడలర్ కణ్ణియనానై వళర్ త్తి, యమునై నీరాడప్పోనేన్,
శేడన్ తిరుమఱుమార్బన్, కిడన్దు తిరువడియాల్, మలైపోల్
ఓడుమ్ శకడత్తై చ్చాడియపిన్నై, ఉరప్పువదు అఞ్జువనే ll 1916
( గోపకాంతలు పూతన విషయమును విని అసంతృప్తులై యుండుటను చూచి యశోదాదేవి) ఈడుమ్ వలియుమ్ ఉడైయ = దేహబలము,శక్తి కలిగిన; ఇ నమ్బి పిఱన్ద = ఈ నా కుమారుడు పుట్టిన; ఏழு తిఙ్గళిల్ =ఏడు మాసముల వయస్సున; ఏడు అలర్ కణ్ణియనానై = వికసించిన పూల మాలకలిగిన ఈ చిన్నికృష్ణుని;వళర్ త్తి=నిదురింజేసి; యమునై నీరాడ పోనేన్ = యమునానదికి స్నానమాచరించుటకై పోతిని; శేడన్ = ఈ పసివాడైన; తిరు మఱు మార్బన్ = శ్రీదేవియు, శ్రీవత్సచిహ్నమును వక్షస్థలమునగల ఈ బాలుడు; కిడన్దు = పరుండియే;తిరు అడియాల్ = తన దివ్యమైన పాదముతొ; మలైపోల్ ఓడుమ్ శకడత్తై శాడియ పిన్నై = ఒక పర్వతమువలె దొర్లుచు వచ్చుచున్న శకటాసురుడు ఆవేశించిన బండిని పొడిపొడియగునట్లు తన్ని వధించిన పిదప; ఉరప్పువదు అఞ్జువనే = కోపముతో మందలించుటకు భయపడుచున్నాను!.
( గోపకాంతలు పూతన విషయమును విని అసంతృప్తులై యుండుటను చూచి యశోదాదేవి) దేహబలము,శక్తి కలిగిన ఈ నా కుమారుడు పుట్టినఏడు మాసముల వయస్సున, వికసించిన పూల మాలకలిగిన ఈ చిన్నికృష్ణుని నిదురింజేసి యమునా నదికి స్నానమాచరించుటకై పోతిని, ఈ పసివాడైన, శ్రీదేవియు, శ్రీవత్సచిహ్నమును వక్షస్థలమునగల ఈ బాలుడు పరుండియే తన దివ్యమైన పాదముతొ ఒకపర్వతము వలె దొర్లుచు వచ్చుచున్న శకటాసురుడు ఆవేశించిన బండిని పొడిపొడియగునట్లు తన్ని వధించిన పిదప కోపముతో మందలించుటకు భయపడుచున్నాను!.
అఞ్జువన్ శొల్లి అழைత్తిడ నఙ్గైగాళ్, ఆయిర నాழிనెయ్యై,
పఞ్జియ మెల్లడి పిళ్ళైగళ్ ఉణ్ కిన్ఱు, పాగన్దాన్ వైయార్ గళే,
కఞ్జన్ కడియన్ కఱవు ఎట్టునాళిల్, ఎన్ కైవలత్తు ఆదుమిల్లై,
నెఞ్జిత్తిరుప్పన శెయ్ దువైత్తాయ్ నమ్బీ, ఎన్ శెయ్ గేనెన్ శెయ్ గేనో ll 1917
( గోపకాంతలు ఇంకను చింతాక్రాంతులై యుండగ యశోదాదేవి శ్రీకృష్ణునికి తన మనోవ్యధను చెప్పుచున్నారు) నఙ్గైగాళ్ = ఓ! కాంతామణులారా!; శొల్లి అழைత్తిడ అఞ్జువన్ =(ఇతని చిలిపిపనులు) చెప్పి మందలించుటకు భయపడుచున్నాను; (శ్రీ కృష్ణునితో) పఞ్జియ మెల్ అడి పిళ్ళైగళ్ = దూదివలె సున్నితమైన పాదములుగల ఈ ఊరి బాలురు;ఆయిరమ్ నాழி నెయ్యై = వెయ్యి కుండలునిండియున్న నెయ్యిని;ఉణ్ కిన్ఱు=ఆరగించునపుడు;పాగమ్ తాన్ వైయార్ గళే=స్వల్పమైనను మిగిల్చియుండలేదు!; కఞ్జన్ కడియన్ = కంసుడుమిక్కిలి కోపిష్టుడు; కఱవు = వానికి కప్పము కట్టుటకు; ఎట్టు నాళిల్ = ఎనిమిది దినముల గడువు మాత్రమే కలదు; ఎన్ కైవలత్తు ఆదుమ్ ఇల్లై = నా చేతిలో ఇప్పుడు ఏమియు లేదు; నమ్బీ = నా స్వామీ!; నెఞ్జిత్తు ఇరుప్పన శెయ్ దు వైత్తాయ్ = నాయొక్క మనస్సున క్షోభకలుగునట్లు చిలిపి చేష్టలు చేసితివికదా!; ఎన్ శెయ్ గేన్ = నేనేమి చేయగలను?; ఎన్ శెయ్ గేనో = కృష్ణా! ఏమి చేయవలెనో తెలియకున్నది! .
( గోపకాంతలు ఇంకను చింతాక్రాంతులై యుండగ యశోదాదేవి శ్రీకృష్ణునికి తన మనోవ్యధను చెప్పుచున్నారు) ఓ! కాంతామణులారా! (ఇతని చిలిపిపనులు) చెప్పి మందలించుటకు భయపడుచున్నాను. (శ్రీ కృష్ణునితో) దూదివలె సున్నితమైన పాదములుగల ఈ ఊరి బాలురు వెయ్యి కుండలునిండియున్న నెయ్యిని ఆరగించునపుడు స్వల్పమైనను మిగిల్చియుండలేదు! కంసుడు మిక్కిలి కోపిష్టుడు. వానికి కప్పము కట్టుటకు ఎనిమిది దినముల గడువు మాత్రమే కలదు. నా చేతిలో ఇప్పుడు ఏమియు లేదు. నా స్వామీ! నాయొక్క మనస్సున క్షోభకలుగునట్లు చిలిపి చేష్టలు చేసితివికదా!. నేనేమి చేయగలను? కృష్ణా! ఏమి చేయవలెనో తెలియకున్నది! .
అఙ్గనుమ్ తీమైగళ్ శెయ్ వర్ గళోనమ్బీ, ఆయర్ మడమక్కళై,
పఙ్గయనీర్ కుడైన్దాడుకిన్ఱార్ గళ్, పిన్నేశెన్ఱు ఒళిత్తిరున్దు,
అఙ్గవర్ పూన్దుగిల్ వారిక్కొణ్డిట్టు, అరవు ఏర్ ఇడైయార్ ఇరప్ప,
మఙ్గైనల్లీర్ వన్దు కొళ్మినెన్ఱు, మరమేఱి యిరున్దాయ్ పోలుమ్ ll 1918
(యశోదాదేవి శ్రీకృష్ణునితో)నమ్బీ = నా స్వామీ!; ఆయర్ మడమ్ మక్కళై అఙ్గనుమ్ = గోపాలకులకు విధేయులైన బాలకల చెంతను; తీమైగళ్ శెయ్ వర్ గళో = చిలిపి చేష్టలు చేయతగునా?; పఙ్గయమ్ నీర్ = తామరకొలనులో;కుడైన్దు ఆడుకిన్ఱార్ గళ్ పిన్నే శెన్ఱు= స్నానమాచరించుటకై పోవు వారి వెనుకనే పోయి; ఒళిత్తు ఇరున్దు = దాగియుండి;(వారు స్నానమాచరించు సమయమున) అఙ్గు = ఆ కొలనువద్ద; అవర్ = ఆ బాలికయొక్క; పూ తుగిల్ = అందమైన వస్త్రములను; వారి కొణ్డిట్టు = సంపూర్ణముగ తీసుకొనిపోయి; (వారు స్నానమాచరించిన పిదప) అరవు ఏర్ ఇడైయార్ ఇరప్ప = సర్పమువలె సన్నని నడుముగల ఆ బాలికలు తమ వస్త్రములను యాచింపగ; మఙ్గై నల్లీర్ = “అందమైన బాలికలారా!; వన్దు కొళ్మిన్ = నేనున్న చోటికి వచ్చి తీసుకొనుడు” ; ఎన్ఱు = అని చెప్పి; మరమ్ ఏఱి యిరున్దాయ్ పోలుమ్ = చెట్టు ఎక్కి ఉండినావటకదా! (ఇది నీకు తగదు సుమా!)
(యశోదాదేవి శ్రీకృష్ణునితో)నా స్వామీ! గోపాలకులకు విధేయులైన బాలకల చెంతన చిలిపి చేష్టలు చేయతగునా? తామరకొలనులో స్నానమాచరించుటకై పోవు వారి వెనుకనే పోయి దాగియుండి (వారు స్నానమాచరించు సమయమున) ఆ కొలనువద్ద ఆ బాలికయొక్క అందమైన వస్త్రములను సంపూర్ణముగ తీసుకొనిపోయి, (వారు స్నానమాచరించిన పిదప) సర్పమువలె సన్నని నడుముగల ఆ బాలికలు తమ వస్త్రములను యాచింపగ, “అందమైన బాలికలారా! నేనున్న చోటికి వచ్చి తీసుకొనుడు” అని చెప్పి,చెట్టు ఎక్కి ఉండినావటకదా!(ఇది నీకు తగదు సుమా!)
అచ్చమ్ తినైత్తనై ఇల్లై యిప్పిళ్ళైక్కు, ఆణ్మైయుమ్ శేవగముమ్,
ఉచ్చియిల్ ముత్తివళర్ త్తు ఎడుత్తేనుక్కు, ఉరైత్తిలన్ తాన్ ఇన్ఱుపోయ్,
పచ్చిలై ప్పూఙ్గడమ్బేరి, విశై కొణ్డు పాయ్ న్దుపుక్కు, ఆయిరవాయ్
నచ్చழల్ పొయ్ గైయిల్ నాగత్తినోడు, పిణఙ్గి నీవన్ధాయ్ పోలుమ్ ll 1919
( కాళీయమర్థన విషయమును గోకులవాసులు తెలుపగ,యశోదాదేవి వారితో ) ఇ పిళ్ళైక్కు = ఈ బాలునికి; ఆణ్మైయుమ్ శేవగముమ్ = శౌర్యము,వీర్యము తప్ప; తినైత్తనై = కొంచెమైనను;అచ్చమ్ ఇల్లై= భయము లేదు; ఉచ్చియిల్ ముత్తి=ప్రతిదినము నుదటిని ముద్దు పెట్టి అతి ప్రేమతో; వళర్ త్తు ఎడుత్తేనుక్కు = ఎత్తుకొని పెంచిన నాకు; తాన్ ఉరైత్తిలన్ = తాను చెప్పలేదు; (అని ఆందోళన చెందుచుండగ అప్పుడేవచ్చిన శ్రీ కృష్ణునితో మిక్కిలి దుఃఖించుచు) ఇన్ఱు పోయ్= నీవు ఈ దినమున బైటకుపోయి; పచ్చి ఇలై పూ కడమ్బు ఏరి=పచ్చని ఆకులతోను, పూలతోను నిండిన కదంబ చెట్టును ఎక్కి; విశై కొణ్డు=శీఘ్రముగా; పొయ్ గైయిల్ పాయ్ న్దు పుక్కు=(కాళీయుడను సర్పము నివసించుచున్న మడుగులో దుమికి; ఆయిరమ్ వాయ్ = సహస్ర పడగలనుండి; నఞ్జు అழల్ = విషము కక్కుచున్న; నాగత్తినోడు = (ఆ కాళీయ) సర్పముతో; పిణఙ్గి = పోరుసలిపి; నీవన్ధాయ్ పోలుమ్ =నీవు వచ్చినావు. ఇది తగదు. నీకు ఏ ఆపద సంభవించినను నేను జీవించలేను.)
( కాళీయమర్థన విషయమును గోకులవాసులు తెలుపగ,యశోదాదేవి వారితో)ఈ బాలునికి శౌర్యము,వీర్యము తప్ప కొంచెమైనను భయము లేదు.ప్రతిదినము నుదటిని ముద్దు పెట్టి అతి ప్రేమతోఎత్తుకొని పెంచిన నాకు తాను చెప్పలేదు, అని ఆందోళనచెందుచుండగ, (అప్పుడేవచ్చిన శ్రీ కృష్ణునితో మిక్కిలి దుఃఖించుచు) ఈ దినమున బైటకుపోయి పచ్చని ఆకులతోను, పూలతోను నిండిన కదంబ చెట్టును ఎక్కి శీఘ్రముగా (కాళీయుడను సర్పము నివసించుచున్న) మడుగులో దుమికి సహస్ర పడగలనుండి విషము కక్కుచున్న(ఆ కాళీయ) సర్పముతో పోరుసలిపి నీవు వచ్చినావు. ఇదు నీకు తగదు. నీకు ఏ ఆపద సంభవించినను నేను జీవించలేను.)
తమ్బరమల్లన ఆణ్మైగళై, త్తనియేనిన్ఱు తామ్ శెయ్ వరో,
ఎమ్బెరుమాన్ ఉన్నైపెర్ట్ర వయిఱుడైయేన్, ఇని యానెన్ శెయ్ గేన్,
అమ్బరమేழுమ్ అదిరుమ్ ఇడికురల్, అమ్ కనల్ శెమ్ కణ్ ఉడై,
వమ్బు అవిழ்కానత్తు మాల్ విడైయోడు, పిణఙ్గి నీవన్ధాయ్ పోలుమ్ ll 1920
ఎమ్బెరుమాన్ = నాయొక్క స్వామీ! కృష్ణా!; తమ్ పరమ్ అల్లన ఆణ్మైగళై = నీయొక్క వయస్సునకు తగని వీరోచితకార్యములను; తనియే నిన్ఱు శెయ్ వరో తామ్=ఒంటరిగ నుండి చేయతగునా?; ఉన్నై పెర్ట్ర వయిఱు ఉడైయేన్ = (అతిమానుషమైన పనులను చేసెడి)నిన్ను కనెడి దాననైతిని;యాన్ ఇని ఎన్ శెయ్ గేన్=నేనిప్పుడు ఏమి చేయగలను; వమ్బు అవిழ் కానత్తు అఙ్గు = పరిమళము వెదజల్లుచున్న ఆ అడవియందు; అమ్బరమ్ ఏழுమ్ అదిరుమ్ ఇడి కురల్ = ఊర్ధ్వలోకములు ఏడును దద్ధరిల్లునట్లు పెద్దగ గర్జించుచు; అమ్ అనల్ శెమ్ కణ్ ఉడై = నిప్పువలె ఎర్రని కన్నులు కలిగిన; మాల్ విడైయోడు = నల్లని వృషభముతో(అరిష్టాసురినితో); పిణఙ్గి = పోరుసలిపి; నీవన్ధాయ్ పోలుమ్ =నీవు వచ్చినావు. ఇది తగదు. నీకు ఏ ఆపద సంభవించినను నేను జీవించలేను.)
నాయొక్క స్వామీ! కృష్ణా!,నీయొక్క వయస్సునకు తగని వీరోచిత కార్యములను,ఒంటరిగ నుండి చేయతగునా?, (అతిమానుషమైన పనులను చేసెడి) నిన్ను కనెడి దాననైతిని,నేనిప్పుడు ఏమి చేయగలను, పరిమళము వెదజల్లుచున్న ఆ అడవియందు, ఊర్ధ్వలోకములు ఏడును దద్ధరిల్లునట్లు పెద్దగ గర్జించుచున్న, నిప్పువలె ఎర్రని కన్నులు కలిగిన నల్లని వృషభముతో (అరిష్టాసురినితో) పోరుసలిపి నీవు వచ్చినావు. ఇది తగదు. నీకు ఏ ఆపద సంభవించినను నేను జీవించలేను.)
** అన్ననడై మడఆయ్ చ్చి వయిఱడిత్తఞ్జ, అరువరై పోల్,
మన్ను కరుమ్ కళిర్ట్రు ఆరుయిర్ వవ్వియ, మైన్దనై మాకడల్ శూழ்,
కన్ని నన్మామదిళ్ మఙ్గైయర్ కావలన్, కామరుశీర్ క్కలికన్ఱి,
ఇన్నిశై మాలైగళ్ ఈరేழுమ్ వల్లవర్కు, ఏదుమ్ ఇడర్ ఇల్లైయే ll 1921
అన్నమ్ నడై = హంసగమనముగల; మడ ఆయ్ చ్చి=సద్గుణసంపన్నురాలైన గోపకాంత యశోదాదేవి; వయిఱు అడిత్తు అఞ్జ = తన కడుపు కొట్టుకొనుచు భయపడునట్లు; అరు వరై పోల్ మన్ను=పెద్ద పర్వతమువలె నున్న;కరుమ్ కళిర్ట్రు=నల్లని కువలయాపీడమను ఏనుగుయొక్క; ఆర్ ఉయిర్ = అపూర్వమైన ప్రాణములను; వవ్వియ = హరించిన; మైన్దనై = శక్తివంతుడైన శ్రీ కృష్ణుని విషయమై; మా కడల్ శూழ் = మహా సముద్రముచే చుట్టుకొనియున్న; కన్ని నల్ మా మదిళ్ = స్థిరమైన,విలక్షణమైన పెద్ద ప్రాకారములతో కూడియున్న; మఙ్గైయర్ కావలన్=తిరుమంగైదేశవాసులకు పాలకుడును;కామరుశీర్ = ఆశింపబడు సద్గుణ సంపన్నుడును; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన; ఇన్ ఇశై మాలైగళ్ ఈర్ ఏழுమ్ =మదురమైన రాగములతొ నిండిన సూక్తులమాలైన ఈ పదునాలుగును; వల్లవర్కు=పఠించువారికి; ఇడర్ ఏదుమ్ ఇల్లైయే = దుఃఖములేవియు ఉండవు!
హంసగమనముగల సద్గుణసంపన్నురాలైన గోపకాంత యశోదాదేవి తన కడుపు కొట్టుకొనుచు భయపడునట్లు,పెద్ద పర్వతమువలె నున్న నల్లని కువలయాపీడమను ఏనుగుయొక్క అపూర్వమైన ప్రాణములను హరించిన శక్తివంతుడైన శ్రీ కృష్ణుని విషయమై మహా సముద్రముచే చుట్టుకొనియున్న స్థిరమైన విలక్షణమైన పెద్ద ప్రాకారములతో కూడియున్న తిరుమంగైదేశవాసులకు పాలకుడును, ఆశింపబడు సద్గుణ సంపన్నుడును,తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన మదురమైన రాగములతొ నిండిన సూక్తులమాలైన ఈ పదునాలుగును పఠించువారికి దుఃఖములేవియు ఉండవు!
***********