పెరియతిరుమొழி-11వపత్తు (1)

శ్రీః 

శ్రీమతే రామనుజాయనమః

తిరుమంగై ఆళ్వార్ ముఖారవిన్దమునుండి వెలువడిన

_______________

పెరియతిరుమొழி-11వపత్తు

____________

శ్రీః

1 .కున్ఱమొన్ఱెడుత్తు

  సర్వేశ్వరునియందలి అమితమైన కాంక్షతో ఎడబాటును సహింపలేని   పరకాలనాయకి తాననుభవించు స్థితికి ఆ స్వామియే కారణమని చెప్పుచున్నారు. 

** కున్ఱమొన్ఱు ఎడుత్తేన్ది, మామழை

అన్ఱు కాత్త అమ్మాన్, అరక్కరై

వెన్ఱ విల్లియార్, వీరమేకొలో, తెన్ఱల్ వన్దు,

తీ వీశుమ్ ఎన్ శెయ్ గేన్  ll 1952

అన్ఱు = మునుపొకకాలమున;కున్ఱమ్ ఒన్ఱు ఎడుత్తు =(గోవర్ధనమును)ఒక పర్వతమును   గొడగువలె పైకెత్తి; ఏన్ది = ( ఏడుదినములు) పట్టుకొనియుండి;మా మழை= (ఇంద్రునిచే కురిపింపబడిన) పెద్ద వర్షమునుండి; కాత్త = (గోవులను,ఆశ్రితులైన గోకులవాసులను) కాపాడిన; అమ్మాన్ = స్వామి; అరక్కరై=రాక్షసులను;వెన్ఱ=వధించిన;విల్లియార్=విల్లు కలిగిన ఆ స్వామియొక్క; వీరమేకొలో = పరాక్రమమువలనే?; (సర్వేశ్వరునియొక్క సంకల్పము వలనే) తెన్ఱల్ వన్దు తీ వీశుమ్ = దక్షిణపుగాలి వచ్చి అగ్ని వీచుచున్నది; ఎన్ శెయ్ గేన్ = (దీనికి) నేనేమి చేయగలను? 

మునుపొకకాలమున,(గోవర్ధనమును)ఒక పర్వతమును   గొడగువలె పైకెత్తి,(ఏడుదినములు) పట్టుకొనియుండి (ఇంద్రునిచే కురిపింపబడిన) పెద్ద వర్షమునుండి (గోవులను,ఆశ్రితులైన గోకులవాసులను) కాపాడిన స్వామి, రాక్షసులను వధించిన విల్లుకలిగిన ఆ స్వామియొక్క పరాక్రమమువలనే?, (సర్వేశ్వరుని సంకల్పము వలనే) దక్షిణపుగాలి వచ్చి అగ్ని వీచుచున్నది. (దీనికి) నేనేమి చేయగలను? 

కారుమ్ వార్ పని, క్కడలు మన్నవన్,

తారుమార్వముమ్,కణ్డదణ్డమో,

శోరుమాముగిల్, తుళియినూడువన్దు,

ఈరవాడైతాన్, ఈరుమెన్నైయే  ll 1953

శోరుమ్ మా ముగిల్ =  వర్షించుచుండు కాళమేఘము యొక్క;తుళియనూడు వన్దు= చినుకులలోనున్న చల్లదనమును మోసుకొని వచ్చి; ఈరమ్ వాడై తాన్=ఆ అమితమైన చల్లనిగాలి; ఎన్నై ఈరుమ్ = నన్ను మిక్కిలి హింసించుచున్నది; (ఇది) కారుమ్ వార్ పని = కాలమేఘమును, వ్యాపించియున్న చల్లని సముద్రమును ఒప్పుచుండు సర్వేశ్వరునియొక్క; తారుమ్ = తులసీమాలయు; మార్వముమ్ = వక్షస్థలమును,కణ్డ = కాంచవలయునని(పొందవలయునని) ఆశపడుచున్నందులకు నాకు; దణ్డమో= (కలుగుచున్న) శిక్షా!ఏమి?

వర్షించుచుండు కాళమేఘము యొక్క చినుకులలోనున్న చల్లదనమును మోసుకొని వచ్చి ఆ అమితమైన చల్లనిగాలి నన్ను మిక్కిలి హింసించుచున్నది; (ఇది) కాలమేఘమును, వ్యాపించియున్న చల్లని సముద్రమును ఒప్పుచుండు సర్వేశ్వరుని యొక్క తులసీమాలయు వక్షస్థలమును కాంచవలయునని (పొందవలయునని) ఆశపడుచున్నందలకు నాకు కలుగుచున్న శిక్షా!ఏమి?

శఙ్గుమామైయుమ్, తళరుమేనిమేల్,

తిఙ్గళ్ వెఙ్గదిర్, శీఱుమెన్ శెయ్ గేన్,

పొఙ్గు వెణ్ తిరై, ప్పుణరి వణ్ణనార్,

కొఙ్గలర్ న్దదార్, కూవుమెన్నైయే  ll 1954

శఙ్గుమ్ = చేతి కంకణములును; మామైయుమ్ = నాయొక్క వర్ణమును; తళరుమ్=నిలువని; మేని మేల్ = ఈ శరీరముపై; తిఙ్గళ్= చంద్రునియొక్క; వెమ్ కదిర్ = తీవ్రమైన కిరణములు; శీఱుమ్= మండిపడుచున్నవి; పొఙ్గు వెణ్ తిరై పుణరి వణ్ణనార్ = పైకెగియుచున్న తెల్లని కెరటములుగల సముద్రమువంటి వర్ణముగల సర్వేశ్వరుని యొక్క; కొఙ్గు అలర్ న్ద తార్ = పరిమళము వెదజల్లుచున్న తులసీమాల; ఎన్నై కూవుమ్ = నన్ను తనతో పోరుసలుపుటకు పిలుచుచున్నది; ఎన్ శెయ్ గేన్ =(దీనికి) నేనేమి చేయగలను?

  చేతి కంకణములును, నాయొక్క వర్ణమును నిలువని  ఈ శరీరముపై  చంద్రునియొక్క తీవ్రమైన కిరణములు మండి పడుచున్నవి, పైకెగియుచున్న తెల్లని కెరటములుగల సముద్రమువంటి వర్ణముగల సర్వేశ్వరుని యొక్క పరిమళము వెదజల్లుచున్న తులసీమాల నన్ను తనతో పోరుసలుపుటకు పిలుచుచున్నది.(దీనికి) నేనేమి చేయగలను?

అఙ్గోరాయ్ కులత్తుళ్, వళర్ న్దు శెన్ఱు,

అఙ్గోర్, తాయురువాగి వన్దవళ్,

కొఙ్గై నఞ్జుణ్డ, కోయిన్మైకొలో,

తిఙ్గళ్ వెఙ్గదిర్, శీఱుగిన్ఱదే  ll 1955

శెన్ఱు = (మధురనుండి) వెడలి; అఙ్గు ఓర్ ఆయ్ కులత్తుళ్ వళర్ న్దు = అచట ఒక విలక్షణమైన గొల్లకులమున పెరిగినపుడు; అఙ్గు ఓర్, తాయ్ ఉరువాగి వన్దవళ్ = ఆ ప్రదేశమునకు తల్లి యశోదాదేవి రూపములో వచ్చిన పూతనయొక్క; కొఙ్గై నఞ్జు ఉణ్డ = స్తనమందు రాసుకొనిన విషమును ఆరగించిన; కోయిన్మైకొలో = పరాక్రమము చూపదలచుటవలనే (సర్వేశ్వరుని  సంకల్పమువలనే) చంద్రునియొక్క; వెమ్ కదిర్ = తీవ్రమైన కిరణములు; శీఱుకిన్ఱదు = నాపై మండి పడుచున్నవి;

(మధురనుండి) వెడలి,అచట ఒక విలక్షణమైన గొల్లకులమున పెరిగినపుడు, ఆ ప్రదేశమునకు తల్లి యశోదాదేవి రూపములో వచ్చిన పూతనయొక్క స్తనమందు రాసుకొనిన విషమును ఆరగించిన పరాక్రమము చూపదలచుటవలనే (సర్వేశ్వరుని సంకల్పము వలననే)  చంద్రునియొక్క తీవ్రమైన కిరణములు నాపై మండి పడుచున్నవి.

అఙ్గోరాళరియాయ్, అవుణనై,

ప్పఙ్గమా, ఇరుకూఱు శెయ్ దవన్,

మఙ్గుల్ మామది, వాఙ్గవేకొలో,

పొఙ్గుమాకడల్, పులమ్బుకిన్ఱదే  ll 1956

అఙ్గు = ” సర్వేశ్వరుడు అంతటను కలడని ” ప్రహ్లాదుడు చెప్పిన ఆ సమయముననే;  ఓర్ ఆళ అరి ఆయ్ = అద్వితీయమైన నరసింహమూర్తిగ అవతరించి; అవుణనై = అసురుడైన హిరణ్యాసురుని; పఙ్గమ్ ఆ=మానభంగముచేసి; ఇరు కూఱు శెయ్ దవన్ = రెండు భాగములుగ చీల్చి సంహరించిన సర్వేశ్వరుడు;మఙ్గుల్ మా మది =(తననుండి..సాగరము నుండి జనించిన) ఆకాశములో ప్రకాశించుచున్న శ్లాఘ్యమైన చంద్రునిని; వాఙ్గవేకొలో = (అదియున్న స్థానమునుండి) అపహరించుటవలననే; పొఙ్గు మా కడల్= ఎగిరిపడుచున్న  కెరటములుగల మహాసముద్రము; పులమ్బుకిన్ఱదు = (నా వలె మనోవ్యధతో) ఘోషించుచున్నది!

సర్వేశ్వరుడు అంతటను కలడని ” ప్రహ్లాదుడు చెప్పిన ఆ సమయముననే అద్వితీయమైన నరసింహమూర్తిగ అవతరించి అసురుడైన హిరణ్యాసురుని మానభంగము చేసి,రెండు భాగములుగ చీల్చి సంహరించిన సర్వేశ్వరుడు (తననుండి….సాగరమునుండి జనించిన) ఆకాశములో ప్రకాశించుచున్న శ్లాఘ్యమైన చంద్రునిని ( అదియున్న స్థానము నుండి) అపహరించుటవలననే  ఎగిరిపడుచున్న  కెరటములుగల మహాసముద్రము (నా వలె మనోవ్యధతో) ఘోషించుచున్నది!

శెన్ఱువార్ శిలైవళైత్తు, ఇలఙ్గయై

వెన్ఱవిల్లియార్, వీరమేకొలో,

మున్ఱిల్ పెణ్ణైమేల్, ముళరిక్కూట్టగత్తు,

అన్ఱిలిన్ కురల్, అడరుమెన్నైయే  ll 1957

శెన్ఱు = ( శత్రువున్న స్థానమునకే ) వెడలి; వార్ శిలై = పెద్ద విల్లును; వళైత్తు = వంచి  బాణములు ప్రయోగించి; ఇలఙ్గయై = లంకాపురిని; వెన్ఱ = జయించిన; విల్లియార్ = విల్లు ధరించిన సర్వేశ్వరుడు తనయొక్క;వీరమేకొలో=పరాక్రమము చూపదలచుట వలనే (సర్వేశ్వరుని సంకల్పము వలనే);మున్ఱిల్ పెణ్ణై మేల్=ముంగిటనున్న తాటి చెట్టుపై నున్న;ముళరి కూట్టగత్తు = తామరపూలతో కట్టుకొన్న గూటియందు;అన్ఱిలిన్ కురల్ = అన్ఱిల్ పక్షులయొక్క కిచకిచ ధ్వనులు; ఎన్నై అడరుమ్ = నన్ను మిక్కిలి వేధించుచున్నవి!

        ( శత్రువున్న స్థానమునకే ) వెడలి పెద్ద విల్లును వంచి  బాణములు ప్రయోగించి లంకాపురిని జయించిన విల్లు ధరించిన సర్వేశ్వరుడు తనయొక్క పరాక్రమము చూపదలచుటవలనే (సర్వేశ్వరుని సంకల్పము వలనే) ముంగిటనున్న తాటిచెట్టుపై నున్న తామరపూలతో కట్టుకొన్న గూటియందు అన్ఱిల్ పక్షులయొక్క కిచకిచ ధ్వనులు నన్ను మిక్కిలి వేధించుచున్నవి!

పూవై వణ్ణనార్, పుళ్ళిన్ మేల్ వర,

మేవినిన్ఱునాన్, కణ్డ దణ్డమో,

వీవిల్ ఐఙ్గణై, విల్లి అమ్బుకోత్తు,

ఆవియే, ఇలక్కాక ఎయ్ వదే  ll 1958

ఐఙ్గణై  విల్లి = మన్మధుడు; వీవు ఇల్ = ఎడతెగక; అమ్బుకోత్తు =బాణములు సంధించి; ఆవియే  ఇలక్కు ఆక ఎయ్ వదు = నా ప్రాణములను లక్ష్యముగచేసుకొని ప్రయోగించు చున్నాడు; పూవై వణ్ణనార్ = రెల్లు పూవువంటి వర్ణముగల సర్వేశ్వరుడు; పుళ్ళిన్ మేల్ వర = గరుడాళ్వార్ పై వచ్చుచుండగ; నాన్ మేవి నిన్ఱు = నేను మిక్కిలి ఆశతో; కణ్డ = కాంచవలయునని ఆశించినందులకు; దణ్డమో = (నాకు కలుగుచున్న) శిక్షా! 

      మన్మధుడు ఎడతెగక బాణములు సంధించి నాప్రాణములను లక్ష్యముగచేసుకొని ప్రయోగించుచున్నాడు. రెల్లు పూవువంటి వర్ణముగల సర్వేశ్వరుడు గరుడాళ్వార్ పై వచ్చుచుండగ నేను మిక్కిలి ఆశతో కాంచవలయునని ఆశించినందులకు  (నాకు కలుగుచున్న) శిక్షా! 

మాల్ ఇనమ్ తుழாయ్,వరుమ్ ఎన్నెఞ్జగమ్,

మాలిన్ అమ్ తుழாయ్, వన్దు ఎన్నుళ్ పుగ,

కోలవాడైయుమ్, కొణ్డువన్దదోర్,

ఆలివన్దదాల్, అరిదుకావలే  ll 1959

ఎన్ నెఞ్జగమ్ = నాయొక్క మనస్సు; మాల్ ఇనమ్ =  (ఆ సర్వేశ్వరుని యందుగల) వ్యామోహమునకు తగినట్లు;తుழாయ్ వరుమ్ = వ్యాకులతతో వెదుకుచు తిరుగుచు రాకున్నది; మాలిన్ = ఆ సర్వేశ్వరునియొక్క; అమ్ తుழாయ్=అందమైన తులసీమాల; ఎన్నుళ్ వన్దు పుగ = నాయందు వచ్చి ప్రవేశింప; కోల వాడైయుమ్ = అందమైన మంద మారుతమును; కొణ్డువన్దదు ఓర్ ఆలి = అది తనతో మోసుకొనివచ్చిన అతిచల్లని చినుకులును; వన్దదు ఆల్ = వచ్చి చేరినది అయ్యో!; కావల్ = (నా ప్రాణమును) కాపాడుకొనుటకిక; అరిదు = శఖ్యముకాదు!

                        నాయొక్క మనస్సు (ఆ సర్వేశ్వరుని యందుగల) వ్యామోహమునకు తగినట్లు  వ్యాకులతతో వెదుకుచు తిరుగుచు రాకున్నది. ఆ సర్వేశ్వరునియొక్క అందమైన తులసీమాల నాయందు వచ్చి ప్రవేశింప, అందమైన మంద మారుతమును,  అది తనతో మోసుకొనివచ్చిన అతిచల్లని చినుకులును వచ్చి చేరినది అయ్యో!. (నా ప్రాణమును) కాపాడుకొనుటకిక  శఖ్యముకాదు!  

కెణ్డై ఒణ్ కణుమ్, తుయిలుమ్, ఎన్ నిఱమ్,

పణ్డు పణ్డు పోల్ ఒక్కుమ్, మిక్క శీర్

తొణ్డరిట్ట, పూమ్ తుళవిన్ వాశమే,

వణ్డుకొణ్డువన్దు, ఊదుమాగిలే  ll 1960

మిక్క శీర్ తొణ్డర్ ఇట్ట = మిక్కిలి సద్గుణసంపన్నులైన శ్రీవైష్ణవులు సమర్పించిన; పూమ్ తుళవిన్ వాశమ్ = తులసీపుష్పముల పరిమళమును; వణ్డు కొణ్డు వన్దు = తుమ్మెదలు తీసుకొని వచ్చి; ఊదుమ్ ఆగిల్=నా సమీపమున ఊదినచో; కెణ్డై ఒణ్ కణుమ్ = కెణ్డై మత్స్యములవంటి అందమైన (నాయొక్క) కన్నులు;తుయిలుమ్=నిదురించును; ఎన్ నిఱమ్= నాయొక్క మేని సౌందర్యము;పణ్డు పణ్డు పోల్ ఒక్కుమ్=మునపటివలనే ప్రకాశించును!

మిక్కిలి సద్గుణసంపన్నులైన శ్రీవైష్ణవులు సమర్పించిన తులసీపుష్పముల పరిమళమును తుమ్మెదలు తీసుకొని వచ్చి నా సమీపమున ఊదినచో  కెణ్డై మత్స్యములవంటి అందమైన (నాయొక్క) కన్నులు నిదురించును మరియు నాయొక్క మేని సౌందర్యము మునపటివలనే ప్రకాశించును!

** అన్ఱుపారదత్తు,ఐవర్ తూదనాయ్,

శెన్ఱమాయనై, చ్చెఙ్గణ్మాలినై,

మన్ఱిలార్ పుగழ், మఙ్గైవాళ్ కలి

కన్ఱి, శొల్వల్లార్కు, అల్లలిల్లైయే  ll 1961

అన్ఱు = మునుపొకకాలమున;పారదత్తు=మహాభారతయుద్దము జరుగుటకు మునుపు; ఐవర్ తూదనాయ్ = పంచ పాండవులయొక్క దూతగ; శెన్ఱ = వెడలిన; మాయనై = ఆశ్చర్యశక్తి యుక్తుడును;శెమ్ కణ్ మాలినై=ఎర్ర తామరవంటి నేత్రములుగల సర్వేశ్వరుని విషయమై; మన్ఱిల్ ఆర్ పుగழ்= నాలుగు వీధులయందును కీర్తింపబడు;మఙ్గై=తిరుమంగై దేశవాసులైన; వాళ్ = ఖడ్గము ఆయుధముగగల; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్ (అనుగ్రహించిన); శొల్ = ఈ సూక్తులమాలను; వల్లార్కు = పఠించువారికి; అల్లల్ ఇల్లై = దుఃఖములు ఉండవు!

మునుపొకకాలమున మహాభారతయుద్దము జరుగుటకు మునుపు  పంచ పాండవులయొక్క దూతగ వెడలిన ఆశ్చర్యశక్తియుక్తుడును,ఎర్ర తామరవంటి నేత్రములుగల సర్వేశ్వరుని విషయమై, నాలుగువీధులయందును కీర్తింపబడు తిరుమంగై  దేశవాసులైన, ఖడ్గము ఆయుధముగగల తిరుమంగై ఆళ్వార్ (అనుగ్రహించిన); ఈ సూక్తులమాలను పఠించువారికి దుఃఖములు ఉండవు!

*****************

వ్యాఖ్యానించండి