శ్రీః
2 .కున్ఱమెడుత్తు
సర్వేశ్వరుని ఎడబాటులో ప్రకృతివలన తనకు కలగెడి మనోవ్యధను పరకాలనాయకి చెప్పుచున్నారు.
** కున్ఱమెడుత్తు మழைతడుత్తు, ఇళైయారొడుమ్,
మన్ఱిల్ కురవై పిణైన్దమాల్, ఎన్నైమాల్ శెయ్ దాన్,
మున్ఱిల్ తనినిన్ఱ పెణ్ణైమేల్, కిడన్దు ఈర్ గిన్ఱ,
అన్ఱిలిన్ కూట్టై, పిరిక్కకిఱ్పవర్ ఆర్ కొలో ll 1962
కున్ఱమ్ ఎడుత్తు = గోవర్ధనపర్వతమును గొడుగుగ పైకెత్తి;మழை తడుత్తు= వర్షమును అడ్డగించినవాడును; ఇళైయారొడుమ్ = యౌవన గోపకన్యలతో; మన్ఱిల్ = నాలుగు వీధుల మధ్య; కురవై పిణైన్ద మాల్ = చేతులుకలిపి రాసక్రీడ సలిపిన శ్రీ కృష్ణుడు;ఎన్నై మాల్ శెయ్ దాన్ = నన్ను వ్యామోహింపజేసెను; మున్ఱిల్ = ఇంటిముంగిట; తని నిన్ఱ = ఒంటరిగయున్న; పెణ్ణై మేల్ = తాటిచెట్టుపై; కిడన్దు = ఉండి; ఈర్ గిన్ఱ= (తమకిచ కచ ధ్వనులతో) హింసించుచున్న; అన్ఱిలిన్= అన్ఱిల్ పక్షులను; కూట్టై = వాటియొక్క గూటినుండి; పిరిక్క కిఱ్పవర్ ఆర్ కొలో= పట్టుకొని బైట విడిచిపెట్టు సమర్ధులెవరో? (తెలియకున్నది).
గోవర్ధనపర్వతమును గొడుగుగ పైకెత్తి వర్షమును అడ్డగించినవాడును, యౌవన గోపకన్యలతో నాలుగు వీధుల మధ్య చేతులుకలిపి రాసక్రీడ సలిపిన శ్రీ కృష్ణుడు, నన్ను వ్యామోహింపజేసెను. ఇంటిముంగిట ఒంటరిగయున్న తాటిచెట్టుపై ఉండి,(తమకిచ కచ ధ్వనులతో) హింసించుచున్న అన్ఱిల్ పక్షులను వాటియొక్క గూటినుండి పట్టుకొని బైట విడిచిపెట్టు సమర్ధులెవరో? (తెలియకున్నది).
పూఙ్గురున్దొశిత్తు ఆనైకాయ్ న్దు, అరిమాచ్చెగుత్తు,
ఆఙ్గు వేழత్తిన్ కొమ్బుకొణ్డు, వన్ పేయ్ ములై
వాఙ్గియుణ్డ, అవ్వాయిన్ నిఱ్క, ఇవ్వాయన్ వాయ్,
ఏఙ్గు వేయ్ ఙ్గుழల్, ఎన్నో డాడుమ్ ఇళైమైయే ll 1963
పూ కురున్దు ఒశిత్తు = పూలతోనిండిన (అసురుడు ఆవేశించిన)కురున్దు వృక్షమును విరిచినవాడును; ఆనైకాయ్ న్దు=వృషభములనేడింటిపై కోపగించి వధించినవాడును; అరి మా శెగుత్తు = శత్రువైన కేశియను అశ్వరూపములోనున్న అసురుని సంహరించిన వాడును; ఆఙ్గు =కంసుని యొక్క కోటప్రాంగణములో; వేழత్తిన్ = కువలయాపీడమను ఏనుగుయొక్క; కొమ్బు కొణ్డు = దంతమును పెరికి వధించినవాడును;వన్ పేయ్ ములై=క్రూరమైన రక్కసి పూతనయొక్క(విషము రాసుకొనియున్న) స్తనములను; వాఙ్గి = చేతులతో పట్టుకుని;ఉణ్డ అవ్వాయిన్ = ఆరగించిన దివ్యమైన నోరుగల శ్రీకృష్ణుడు; నిఱ్క = ఉదాసీనతతో నుండగ (నన్ను చేరక యుండగ);ఆయన్=ఆ గోపాలకృష్ణుని యొక్క; వాయ్=నోటినుండి; ఏఙ్గు = ధ్వనించుచున్న; ఇ వేయ్ కుழల్ = ఈ వేణునాదము;ఎన్నోడు= నా విషయమున; ఇళమైయై ఆడుమ్ = యౌవనమును రగిలించి బాధపెట్టుచున్నది!
పూలతోనిండిన (అసురుడు ఆవేశించిన)కురున్దు వృక్షమును విరిచినవాడును, వృషభములనేడింటిపై కోపగించి వధించినవాడును,శత్రువైన కేశియను అశ్వరూపములోనున్న అసురుని సంహరించినవాడును, కంసుని యొక్క కోట ప్రాంగణములో కువలయాపీడమను ఏనుగుయొక్క దంతమును పెరికి వధించిన వాడును, క్రూరమైన రక్కసి పూతనయొక్క (విషము రాసుకొనియున్న) స్తనములను చేతులతో పట్టుకుని ఆరగించిన దివ్యమైన నోరుగల శ్రీకృష్ణుడు ఉదాసీనతతో నుండగ (నన్ను చేరక యండగ) ఆ గోపాలకృష్ణుని యొక్క నోటినుండి ధ్వనించుచున్నఈ వేణునాదము నా విషయమున యౌవనమును రగిలించి బాధపెట్టుచున్నది!
మల్లొడు కఞ్జనుమ్ తుఞ్జ, వెన్ఱ మణివణ్ణన్,
అల్లిమలర్ తణ్ తుழாయ్, నినైన్దిరున్దేనైయే,
ఎల్లియిన్ మారుదమ్, వన్దడుమ్ అదువన్ఱియుమ్,
కొల్లైవల్ ఏర్ట్రిన్ మణియుమ్, కోయిన్మైశెయ్యుమే ll 1964
మల్లొడు = చాణూరముష్టికులనబడు మల్లులతో; కఞ్జనుమ్ = కంసుడును; తుఞ్జ = మరణించునట్లు; వెన్ఱ =జయించిన; మణివణ్ణన్ = నీలమణివంటి వర్ణముగల శ్రీ కృష్ణునియొక్క;అల్లి తణ్ తుழாయ్ మలరైయే = దళములతో కూడియున్న చల్లని తులసీమాలనే; నినైన్దు ఇరున్దేనై = స్మరించుచుండెడి నన్ను; ఎల్లియిల్ మారుదమ్ = రాత్రియందు వీచెడి మారుతము;వన్దు అడుమ్=నేనున్నచోటికే వచ్చి వణికించుచున్నది; అదువన్ఱియుమ్ = అదియునుగాక; కొల్లై వల్ ఏర్ట్రిన్ మణియుమ్ = బాహ్యప్రదేశముల నుండి మేసి తిరిగివచ్చుచున్న బలిష్టమైన వృషభముల మెడలందుగల గంటల ధ్వని; కోయిన్మై శెయ్యుమ్ = కృష్ణునియందలి కోరికను రేకెత్తించుచున్నది!
చాణూరముష్టికులనబడు మల్లులతో, కంసుడును మరణించునట్లు జయించిన నీలమణివంటి వర్ణముగల శ్రీ కృష్ణునియొక్క, దళములతో కూడియున్న చల్లని తులసీమాలనే స్మరించుచుండెడి నన్ను రాత్రియందు వీచెడి మారుతము నేనున్నచోటికే వచ్చి వణికించుచున్నది, అదియునుగాక బాహ్యప్రదేశములనుండి మేసి తిరిగివచ్చుచున్న బలిష్టమైన వృషభముల మెడలందుగల గంటల ధ్వని కృష్ణునియందలి కోరికను రేకెత్తించుచున్నది!
పొరున్దు మామరమ్, ఏழுమెయ్ ద పునిదనార్,
తిరున్దు శేవడి, ఎన్ మనత్తు నినైతొఱుమ్,
కరుమ్ తణ్ మాకడల్, కఙ్గుల్ ఆర్ క్కుమ్ అదువన్ఱియుమ్,
వరున్ద వాడై వరుమ్, ఇదఱ్కిని యెన్ శెయ్ గేన్ ll 1965
పొరున్దు మా మరమ్ = ఒకే వరుసలో నిలిచియున్న పెద్ద సాలవృక్షములు; ఏழுమ్ ఎయ్ ద = ఏడును ఒకే బాణము ప్రయోగించి పడగొట్టిన; పునిదనార్ = పరిశుద్ద స్వభావుడైన సర్వేశ్వరునియొక్క; తిరు ఉన్దు శేవడి = ఐశ్వర ప్రకాశకమైన దివ్యమైన పాదద్వందములను; ఎన్ మనత్తు = నాయొక్క హృదయమందు; నినైతొఱుమ్ = ధ్యానించుచున్న సమయమందెల్లప్పుడును; కరుమ్ తణ్ మా కడల్ = నల్లనైన చల్లని మహాసముద్రము; కఙ్గుల్ ఆర్ క్కుమ్ = రాత్రంతయు ఘోషించుచుండును; అదువన్ఱియుమ్ = అదియునుగాక;వాడై=ఉత్తరపుగాలి;వరున్ద=నేను పరితపించునట్లు; వరుమ్ = వచ్చి వీచుచున్నది; ఇదఱ్కు ఇని ఎన్ శెయ్ గేన్ = దీనకిక నేను ఏమి చేయగలను;
ఒకే వరుసలో నిలిచియున్న పెద్ద సాలవృక్షములు ఏడును ఒకే బాణము ప్రయోగించి పడగొట్టిన పరిశుద్ద స్వభావుడైన సర్వేశ్వరునియొక్క ఐశ్వర ప్రకాశకమైన దివ్యమైన పాదద్వందములను నాయొక్క హృదయమందు ధ్యానించుచున్న సమయమందెల్లప్పుడును, నల్లనైన చల్లని మహాసముద్రము రాత్రంతయు ఘోషించు చుండును, అదియునుగాక ఉత్తరపుగాలి,నేను పరితపించునట్లు వచ్చి వీచుచున్నది. దీనకిక నేను ఏమి చేయగలను;
అన్నై మునివదుమ్, అన్ఱిలిన్ కురల్ ఈర్ వదుమ్,
మన్ను మఱికడల్ ఆర్పదుమ్, వళైశోర్ వదుమ్,
పొన్ అమ్ కలై అల్ గుల్, అన్న మెన్నడై ప్పూఙ్గుழల్,
పిన్నైమణాళర్, తిఱత్త మాయిన పిన్నైయే ll 1966
అన్నై మునివదుమ్ = కన్నతల్లి కోపముతో మందలించుటయు; అన్ఱిలిన్ కురల్ ఈర్ వదుమ్ = అన్ఱిల్ పక్షులయొక్క కిచకిచ ధ్వనులు హింసించుటయు; మన్ను మఱి కడల్ ఆర్పదుమ్ = ఎప్పుడును అలలుకొట్టుచున్న మహాసముద్రము ఘోషించుటయు; వళై శోర్ వదుమ్ = చేతిలోనున్న కంకణములు జారిపోవుటయు,(మెదలగు ఇవన్నియు) అమ్ = అందమైన; పొన్ కలై = పీతాంబరము ధరించియున్న; అల్ గుల్ = నితంబప్రదేశము కలదియు; అన్నమ్ మెన్ నడై = హంసగమనమువలె అందమైన గమనముగలదియు; పూ కుழల్ = పూలతో అలంకరింపబడిన కేశములు కలిగిన;పిన్నై= నప్పిన్నైపిరాట్టియొక్క; మణాళర్ = నాయకుడైన శ్రీ కృష్ణునియొక్క; తిఱత్తమ్ ఆయిన పిన్నైయే = విషయమై నేను మిక్కిలి ప్రీతికలిగి పొందగోరినప్పటినుండియే సుమా!
కన్నతల్లి కోపముతో మందలించుటయు, అన్ఱిల్ పక్షులయొక్క కిచకిచ ధ్వనులు హింసించుటయు,ఎప్పుడును అలలుకొట్టుచున్న మహాసముద్రము ఘోషించుటయు, చేతిలోనున్న కంకణములు జారిపోవుటయు,(మెదలగు ఇవన్నియు) అందమైన పీతాంబరము ధరించియున్న నితంబప్రదేశము కలదియు, హంసగమనము వలె అందమైన గమనముగలదియు,పూలతో అలంకరింపబడిన కేశములు కలిగిన నప్పిన్నైపిరాట్టియొక్క నాయకుడైన శ్రీ కృష్ణునియొక్క విషయమై నేను మిక్కిలి ప్రీతికలిగి పొందగోరినప్పటినుండియే సుమా!
ఆழிయుమ్ శఙ్గుముడైయ, నఙ్గళ్ అడిగళ్ తామ్,
పాழிమైయాన కనవిల్, నమ్మైప్పకర్ విత్తార్,
తోழிయుమ్ నానుమ్ ఒழிయ, వైయమ్ తుయిన్ఱదు,
కోழிయుమ్ కూగిన్ఱదిల్లై, కూరిరుళాయిర్ట్రే ll 1967
ఆழிయుమ్ శఙ్గుమ్ ఉడైయ = సుదర్శనచక్రము,పాంచజన్యశంఖము,కలిగిన; నఙ్గళ్ అడిగళ్ తామ్ = మాయొక్క స్వామి సర్వేశ్వరుడు; నమ్మై = మమ్ములను;పాழிమైయాన కనవిల్ = మిక్కిలి గొప్పదైన స్వప్నతుల్యమైన సంశ్లేషముచే; పకర్ విత్తార్= ఈ విధముగ బిగ్గరగ విలపించునట్లు చేసెను; తోழிయుమ్ నానుమ్ ఒழிయ = నాసఖియు,నేనును తప్ప; వైయమ్ తుయిన్ఱదు = లోకమంతయు నిదురించుచున్నది; కోழிయుమ్ = కోడి కూడ; కూగిన్ఱదు ఇల్లై = ( తెల్లవారుచున్నదని సూచకముగ) కూయుజాడలే లేదు; కూర్ ఇరుళ్ ఆయిర్ట్రే = గాఢమైన అంధకారముగా ఉన్నదే!
సుదర్శనచక్రము,పాంచజన్యశంఖము,కలిగిన మాయొక్క స్వామి సర్వేశ్వరుడు మమ్ములను, మిక్కిలి గొప్పదైన స్వప్నతుల్యమైన సంశ్లేషముచే, ఈ విధముగ బిగ్గరగ విలపించునట్లు చేసెను. నాసఖియు, నేనును తప్ప లోకమంతయు నిదురించుచున్నది, కోడి కూడ (తెల్లవారుచున్నదని సూచకముగ) కూయుజాడలే లేదు; గాఢమైన అంధకారముగా ఉన్నదే!
కామన్ తనక్కు ముఱైయల్లేన్, కడల్వణ్ణనార్,
మామణవాళర్, ఎనక్కు త్తానుమ్ మగన్ శొల్లిల్,
యామఙ్గళ్ తోఱు ఎరివీశుమ్, ఎన్ ఇళమ్ కొఙ్గైగళ్,
మామణివణ్ణర్, తిఱత్తవాయ్ వళర్ కిన్ఱవే ll 1968
కామన్ తనక్కు ముఱైయల్లేన్ = మన్మధునివలన బాధింపబడుటకు నేను తగినదానిని కాను; శొల్లిల్ = ఏలననగ; కడల్ వణ్ణనార్ = సముద్రమువంటి వర్ణముగల శ్రీ కృష్ణుడు; ఎనక్కు మా మణవాళర్ = నాయొక్క శ్లాఘ్యమైన నాయకుడైయుండుటచే; తాన్ = ఆ మన్మధుడు; ఎనక్కు మగన్ = నాకు కుమారుడయియున్నను; యామఙ్గళ్ తోఱు = ఎల్లప్పుడును; ఎరి వీశుమ్ = అగ్నిజ్వాలలను వీచుచున్నాడు; ఎన్ ఇళమ్ కొఙ్గైగళ్ = నాయొక్క యౌవన వక్షోజములు; మా మణివణ్ణర్ తిఱత్త ఆయ్ వళర్ కిన్ఱవే = శ్లాఘ్యమైన నీలమణివంటి వర్ణముగల ఆ సర్వేశ్వరుని తలపులందే వృద్ధిపొందుచున్నది!
మన్మధునివలన బాధింపబడుటకు నేను తగినదానిని కాను, ఏలననగ సముద్రమువంటి వర్ణముగల శ్రీ కృష్ణుడు నాయొక్క శ్లాఘ్యమైన నాయకుడై యుండుటచే, ఆ మన్మధుడు నాకు కుమారుడయియున్నను ఎల్లప్పుడును అగ్ని జ్వాలలను వీచుచున్నాడు.నాయొక్క యౌవన వక్షోజములు శ్లాఘ్యమైన నీలమణివంటి వర్ణముగల ఆ సర్వేశ్వరుని తలపులందే వృద్ధిపొందుచున్నది!
మఞ్జుఱు మాలిరుఞ్జోలై, నిన్ఱ మణాళనార్,
నెఞ్జమ్ నిఱైకొణ్డుపోయినార్, నినైకిన్ఱిలర్,
వెఞ్జుడర్ పోయ్ విడియామల్, ఎవ్విడమ్ పుక్కదో,
నఞ్జు ఉడలుమ్ తుయిన్ఱాల్, నమక్కిని నల్లదే ll 1969
మఞ్జు ఉఱు=మేఘమండలమును తాకుచున్నట్లుండెడి శిఖరములుగల;మాలిరుఞ్జోలై= తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమున; నిన్ఱ = నిత్యవాసము చేయుచున్న; మణాళనార్ = నాయొక్క స్వామి; నెఞ్జమ్ నిఱై = నాయొక్క హృదయమందు గల లజ్జ, వినయ, విధేయతలను; కొణ్డు పోయినార్ = అహహరించుకొని పోయిరి; నినైకిన్ఱిలర్ = నన్ను మరచిపోయిరి; వెఞ్జుడర్ = సూర్యుడు; పోయ్ = అస్తమించి; విడియామల్ = తిరిగి ఉదయించక; ఎవ్విడమ్ పుక్కదో = ఎచట ప్రవేశించి దాగియుండెనో; ఇని= ఇప్పుడిక; నమక్కు = మనయొక్క; ఉడలుమ్ = శరీరము; నఞ్జు = శిధిలమై; తుయిన్ఱాల్ = అంతమైపోయినచో; నల్లదు = చాలమంచిది!
మేఘమండలమును తాకుచున్నట్లుండెడి శిఖరములుగల తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నాయొక్క స్వామి నాయొక్క హృదయమందు గల లజ్జ, వినయ, విధేయతలను అహహరించుకొని పోయిరి, నన్ను మరచిపోయిరి, సూర్యుడు అస్తమించి తిరిగి ఉదయించక ఎచట ప్రవేశించి దాగియుండెనో?, ఇప్పుడిక మనయొక్క శరీరము శిధిలమై అంతమైపోయినచో చాలమంచిది!
కామన్ కణైక్కు ఓరిలక్కమాయ్, నలత్తిన్ మిగు,
పూమరు కోల, నమ్ పెణ్మై శిన్దిత్తిరాదుపోయ్,
తూమలర్ నీర్ కొడు, తోழிనామ్ తొழுదేత్తినాల్,
కార్ముగిల్ వణ్ణరై, కణ్గళాల్ కాణలాఙ్గొలో ll 1970
(శరీరముయొక్క అంతము సర్వేశ్వరుని ఇచ్ఛానుసారముగ నుండుటచే తమ స్వరూపమునకు అనుగుణముగ) తోழி = నా సఖీ!; కామన్ కణైక్కు = మన్మధుని బాణములకు; ఓర్ ఇలక్కమ్ ఆయ్ = లక్ష్యమై యుండి; నలత్తిన్ మిగు = సద్గుణములందు మేలైన; పూ మరు=ఆశింపబడు; కోలమ్ = అందమైన; నమ్ పెణ్మై = మనము స్త్రీలయొక్క గుణమును; శిన్దిత్తు = తలచుకొని; ఇరాదు = ఇచటనే యుండక; పోయ్ = బయలుదేరి; కార్ ముగిల్ వణ్ణరై = కాలమేఘమువంటి వర్ణముగల సర్వేశ్వరుని; తూ మలర్ నీర్ కొడు = పరిశుద్దమైన పుష్పములు, తీర్థములు తీసుకొని పోయి; నామ్ తొழுదు ఏత్తినాల్ = మనము సేవించి స్తుతించినయెడల; కణ్గళాల్ కాణల్ ఆమ్ కొలో = (ఆ సర్వేశ్వరుని) కన్నులారా కాంచి సేవింప గలుగుదుముకదా!
(శరీరముయొక్క అంతము సర్వేశ్వరుని ఇచ్ఛానుసారముగ నుండుటచే తమ స్వరూపమునకు అనుగుణముగ) నా సఖీ! మన్మధుని బాణములకు లక్ష్యమై యుండి, సద్గుణములందు మేలైన ఆశింపబడు అందమైన మనము స్త్రీలయొక్క గుణమును తలచుకొని ఇచటనేయుండక బయలుదేరి, కాలమేఘమువంటి వర్ణముగల సర్వేశ్వరుని, పరిశుద్దమైన పుష్పములు తీర్థములు తీసుకొని పోయి మనము సేవించి స్తుతించినయెడల (ఆ సర్వేశ్వరుని) కన్నులారా కాంచి సేవింపగలుగుదుముకదా!
** వెన్ఱి విడైయుడన్, ఏழ் అడర్త అడిగళై,
మన్ఱిల్ మలి పుగழ், మఙ్గైమన్ కలికన్ఱి శొల్,
ఒన్ఱునిన్ఱ ఒన్బదుమ్, ఉరైప్పవర్ తఙ్గళ్ మేల్,
ఎన్ఱుమ్ నిల్లా వినై, ఒన్ఱుమ్ శొల్లిల్ ఉలగిలే ll 1971
వెన్ఱి విడై ఎழ் = పోరులో ఎల్లప్పుడు గెలిచెడి వృషభముల ఏడింటిని; ఉడనే అడర్త = వెంటనే అణచి వధించిన; అడిగళై = సర్వేశ్వరుని విషయమై; మన్ఱిల్ మలి పుగழ் = నాలుగువీధులయందును మిక్కిలి కీర్తింపబడు; మఙ్గై మన్ = తిరుమంగై దేశమునకు ప్రభువైన; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్; శొల్ = అనుగ్రహించిన; ఒన్ఱునిన్ఱ ఒన్బదుమ్=ఈ పది సూక్తులను;ఉరైప్పవర్ తఙ్గళ్ మేల్=పఠించెడివారిపై; వినై ఒన్ఱుమ్ = పాపములు ఏఒక్కటియు;ఎన్ఱుమ్ నిల్లా = ఒక నాడైనను అంటియుండదు; శొల్లిల్ = విపులముగ చెప్పదలిచినచో; ఉలగిలే = దేశవాసులపైనను పాపములు అంటవు!
పోరులో ఎల్లప్పుడు గెలిచెడి వృషభముల ఏడింటిని వెంటనే అణచి వధించిన సర్వేశ్వరుని విషయమై, నాలుగువీధులయందును మిక్కిలి కీర్తింపబడు తిరుమంగై దేశమునకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన ఈ పది సూక్తులను పఠించెడివారిపై పాపములు ఏఒక్కటియు ఒక నాడైనను అంటియుండదు. విపులముగ చెప్పదలిచినచో దేశవాసులపైనను పాపములు అంటవు!
*******