పెరియతిరుమొழி-11వపత్తు (3)

శ్రీః

3  . మన్నిలఙ్గు

                 సర్వేశ్వరుని సామీప్యమును పరకాలనాయకి వర్ణించుచున్నారు.

** మన్ ఇలఙ్గు పారదత్తు తేర్ ఊర్ న్దు, మావలియై

పొన్ ఇలఙ్గు తిణ్ విలఙ్గిల్ వైత్తు, పొరుకడల్ శూழ், 

తెన్ ఇలఙ్గై యీడழிత్త, తేవర్ క్కిదు కాణీర్,

ఎన్ ఇలఙ్గు శఙ్గోడు, ఎழிల్ తోర్ట్రిరున్దేనే  ll 1972

మన్ ఇలఙ్గు = పలు మహారాజులు వేంచేసి నిలచియున్న; పారదత్తు = మహాభారత యుద్దమున; తేర్ ఊర్ న్దు = సారథియై రథమును నడిపినవాడును; మావలియై = మహాబలిని; పొన్ ఇలఙ్గు తిణ్ విలఙ్గిల్ వైత్తు = బంగారుమయమయిన ప్రకాశించెడి  దృఢమైన సంకెళ్ళలో బంధించినవాడును; పొరు కడల్ శూழ் = అలలుకొట్టుచున్న మహా సముద్రముచే చుట్టుకొనియున్న;తెన్ ఇలఙ్గై = అందమైన లంకాపురియొక్క; యీడు అழிత్త = గొప్పతనమును నశింపజేసిన; తేవఱ్కు= సర్వేశ్వరునికి; ఎన్ ఇలఙ్గు శఙ్గోడు=నాయొక్క మిక్కిలి ప్రకాశించుచున్న కంకణములును; ఎழிల్ = సౌందర్యమును; తోర్ట్రు ఇరున్దేన్ = కోల్పోయియున్నాను; ఇదు కాణీర్=ఈ నాయొక్క సౌభాగ్యమును చూడుడు!

పలు మహారాజులు వేంచేసి నిలచియున్న మహాభారత యుద్దమునసారథియై రథమును నడిపినవాడును మహాబలిని బంగారుమయమయిన ప్రకాశించెడి దృఢమైన సంకెళ్ళలో బంధించినవాడును, అలలుకొట్టుచున్న మహా సముద్రముచే చుట్టుకొనియున్న అందమైన లంకాపురియొక్క గొప్పతనమును నశింపజేసిన సర్వేశ్వరునికి నాయొక్క మిక్కిలి ప్రకాశించుచున్న కంకణములును, సౌందర్యమును కోల్పోయియున్నాను. ఈ నాయొక్క సౌభాగ్యమును చూడుడు!

ఇరున్దానెన్నుళ్ళత్తు ఇఱైవన్, కఱై శేర్

పరున్దాళ్ కళిర్ట్రుక్కు, అరుళ్ శెయ్ ద శెఙ్గణ్,

పెరున్దోళ్ నెడుమాలై, ప్పేర్ పాడియాడ,

వరున్దాదెన్ కొఙ్గై, ఒళిమన్నుమన్నే  ll 1973

అన్నే = నా సఖీ!; ఎన్ ఉళ్ళత్తు=నాయొక్క హృదయమున; ఇరున్దాన్= వేంచేసియున్న వాడును; ఇఱైవన్=సర్వస్వామియును;కఱై శేర్ పరున్ద తాళ్ కళిర్ట్రుక్కు అరుళ్ శెయ్ ద= రోకలివలె పెద్ద కాళ్ళుగల గజేంద్రునకు కృపజేసిన; శెమ్ కణ్ = ఎర్రని తామర పుష్పము వంటి నేత్రములు గలవాడును; పెరుమ్ తోళ్ = గొప్ప భుజములుగల; నెడుమాలై = సర్వేశ్వరునియొక్క; పేర్ = దివ్యనామములను; పాడి ఆడ = నోరార పాడుచు, నృత్యము చేయగ;ఎన్ కొఙ్గై=నాయొక్క వక్షోజములు; వరున్దాదు= క్షతిపొందక; ఒళి మన్నుమ్= చైతన్యము కలిగి ప్రకాశమును పొందుచుండును!

నా సఖీ!,నాయొక్క హృదయమున వేంచేసియున్న వాడును, సర్వస్వామియును, రోకలివలె పెద్ద కాళ్ళుగల గజేంద్రునకు కృపజేసిన ఎర్రని తామర పుష్పము వంటి నేత్రములు గలవాడును, గొప్ప భుజములుగల సర్వేశ్వరునియొక్క దివ్యనామములను  నోరార పాడుచు, నృత్యము చేయగ, నాయొక్క వక్షోజములు క్షతిపొందక చైతన్యము కలిగి ప్రకాశమును పొందుచుండును!

అన్నే ఇవరైయఱివన్, మఱైనాన్గుమ్

మున్నే ఉరైత్త, మునివరివర్ వన్దు,

పొన్నేయ్ వళైకవర్ న్దు, పోగార్మనమ్ పుగున్దు, 

ఎన్నే ఇవరెణ్ణుమ్, ఎణ్ణమ్ అఱియోమే  ll 1974

అన్నే = ఓ నా సఖీ!; ఇవరై అఱివన్ = ఈ మహాపురుషుడు (నాకు చక్కగ) తెలుసును;  ఇవర్ = వీరు; మున్నే = మునుపొకకాలమున; మఱైనాన్గుమ్ = నాలుగు వేదములను; ఉరైత్త =  (చతుర్ముఖ బ్రహ్మకు) ఉపదేశించిన; మునివర్ = మునీశ్వరుడు;(అటువంటి వారు) వన్దు = వచ్చి; పొన్ ఏయ్ వళై కవర్ న్దు = బంగారు మయమయిన చేతి కంకణములును ఆశించి; మనమ్ పుగున్దు = నాయొక్క హృదయమున ప్రవేశించి; పోగార్ = వదలిపోకుండ యున్నారు; ఇవర్ ఎణ్ణుమ్ ఎణ్ణమ్=వీరు తలచెడి సంకల్పములు; ఎన్నే = ఏ విధముగ నుండునో; అఱియోమే = తెలుసుకొనలేము సుమా!

  ఓ నా సఖీ!, ఈ మహాపురుషుడు (నాకు చక్కగ) తెలుసును,వీరు  మునుపొకకాలమున నాలుగు వేదములను (చతుర్ముఖ బ్రహ్మకు) ఉపదేశించిన మునీశ్వరుడు (అటువంటి వారు) వచ్చి బంగారు మయమయిన చేతి కంకణములను ఆశించి, నాయొక్క హృదయమున ప్రవేశించి, వదలిపోకుండ యున్నారు, వీరు తలచెడి సంకల్పములు, ఏ విధముగనుండునో తెలుసుకొనలేము సుమా!

అఱియోమేయెన్ఱు, ఉరైక్కలామే ఎమక్కు, 

వెఱియార్ పొழிల్ శూழ், వియన్ కుడన్దై మేవి,

శిఱియానోర్ పిళ్ళైయాయ్, మెళ్ళనడన్దిట్టు,

ఉఱియార్ నఱువెణ్ణైయ్, ఉణ్డు ఉగన్దార్ తమ్మైయే  ll 1975

( సంశయాత్మకముగ చూచుచున్న తన సఖితో పరకాలనాయకి ) వెఱి ఆర్ పొழிల్ శూழ் = పరిమళభరితమైన తోటలతో చుట్టుకొనియున్న;వియన్ =విశాలమైన;కుడన్దై మేవి =తిరు క్కుడందై దివ్యదేశమున వేంచేసియున్నవాడు;శిఱియాన్ ఓర్ పిళ్ళై ఆయ్ = (కృష్ణావతారమందు)సాటిలేని చిన్న బాలునిగ అవతరించి; మెళ్ళ నడన్దిట్టు = మెల్లగ నడచుకొనుచు; ఉఱి ఆర్ నఱు వెణ్ణైయ్ = ఉట్లయందు భద్రపరచబడిన పరిమళ భరితమైన వెన్నను; ఉణ్డు ఉగన్దార్ తమ్మై = ఆరగించి మిక్కిలి ఆనందించిన ఈ మహాపురుషుని; అఱియోమ్ ఎన్ఱు ఉరైక్కల్ =  ” మనము ఎరుగుదుము ” అనెడి వాక్కులు; ఎమక్కు ఆమే = చెప్పుట మనకు తగును కదా?

                (సంశయాత్మకముగ చూచుచున్న తన సఖితో పరకాలనాయకి )పరిమళ భరితమైన తోటలతో చుట్టుకొనియున్న విశాలమైన తిరు క్కుడందై దివ్యదేశమున వేంచేసియున్నవాడు (కృష్ణావతారమందు) సాటిలేని చిన్న బాలునిగ అవతరించి మెల్లగ నడచుకొనుచు ఉట్లయందు భద్రపరచబడిన పరిమళభరితమైన వెన్నను ఆరగించి మిక్కిలి ఆనందించిన ఈ మహాపురుషుని, ” మనము ఎరుగుదుము ” అనెడి వాక్కులు  చెప్పుట మనకు తగును కదా?

తమ్మైయే నాళుమ్, వణఙ్గి త్తొழுవార్ క్కు,

తమ్మైయే యొక్క, అరుళ్ శెయ్ వర్ ఆదలాల్,

తమ్మైయే నాళుమ్, వణఙ్గి త్తొழுతిఱైఞ్జి,

తమ్మైయే పర్ట్రా, మనత్తెన్ఱుమ్ వైత్తోమే  ll 1976

నాళుమ్ = ప్రతిదినము; తమ్మైయే వణఙ్గి త్తొழுవార్ క్కు=తననే వినయముతో సేవించు వారికి; తమ్మైయే ఒక్క అరుళ్ శెయ్ వర్ = తమయొక్క సామ్యమునే ప్రసాదించును;  ఆదలాల్ = ఆ కారణముచే; తమ్మైయే = అట్టి ఆ సర్వేశ్వరునే; నాళుమ్ = ప్రతిదినము;  వణఙ్గి త్తొழுదు ఇఱైఞ్జి = (త్రికరణములతో) సేవించి,నోరార స్తుతించి, ధ్యానించి; తమ్మైయే = ఆ సర్వేశ్వరునే; ఎన్ఱుమ్ = ఎల్లప్పుడును; పర్ట్రు ఆ = శరణ్యముగ; మనత్తు వైత్తోమ్ = హృదయమున నిలుపుకొంటిమి!

ప్రతిదినము తననే వినయముతో సేవించువారికి తమయొక్క సామ్యమునే ప్రసాదించును, ఆ కారణముచే  అట్టి ఆ సర్వేశ్వరునే ప్రతిదినము (త్రికరణములతో) సేవించి,నోరార స్తుతించి, ధ్యానించి ఆ సర్వేశ్వరునే, ఎల్లప్పుడును  శరణ్యముగ హృదయమున నిలుపుకొంటిమి!

వైత్తార్ అడియార్, మనత్తినిల్ వైత్తు, ఇన్బమ్

ఉయ్ త్తారొళి విశుమ్బిల్, ఓరడివైత్తు, ఓరడిక్కుమ్

ఎయ్ త్తాదు మణ్ణెన్ఱు, ఇమైయోర్ తొழுదేత్తి,

కైత్తామరై కువిక్కుమ్, కణ్ణన్ ఎన్ కణ్ణనైయే  ll 1977

ఒళి విశుమ్బిల్=నక్షత్రాదులచే ప్రకాశించుచున్న ఆకాశమున;ఓరడివైత్తు=ఒక పాదమును చాచి; ఓరడిక్కుమ్ = మరియొక పాదమునకు; మణ్ ఎయ్ త్తాదు ఎన్ఱు = భూలోకము సరిపడలేదనుచు; ఇమైయోర్ = బ్రహ్మాదిదేవతలు; తొழுదు ఏత్తి = సేవించి, స్తుతించి; కై = తమయొక్క చేతులను; తామరై కువిక్కుమ్ = తామరమొగ్గవలె అంజలిమోడ్చినట్టి; ఎన్ కణ్ణన్ కణ్ణనై = నాకు నేత్రమువంటి శ్రీకృష్ణుని; అడియార్ = ఆశ్రితులు;మనత్తినిల్ = తమ హృదయమున; వైత్తార్ = స్థాపించుకొంటిరి; వైత్తు = ఆ విధముగ స్థాపించుకొని; ఇన్బమ్ ఉయ్ త్తార్ = మహదానందమును పొందుచున్నారు!

      నక్షత్రాదులచే ప్రకాశించుచున్న ఆకాశమునఒక పాదమును చాచి,   మరియొక పాదమునకు, భూలోకము సరిపడలేదనుచు బ్రహ్మాదిదేవతలు సేవించి స్తుతించి, తమయొక్క చేతులను తామరమొగ్గవలె అంజలిమోడ్చినట్టి నాకు నేత్రము వంటి శ్రీకృష్ణుని ఆశ్రితులు తమ హృదయమున స్థాపించుకొంటిరి. ఆ విధముగ స్థాపించుకొని మహదానందమును పొందుచున్నారు!

కణ్ణన్ మనత్తుళ్ళే నిఱ్కవుమ్ కైవళైగళ్

ఎన్నోకழన్ఱ, ఇవైయెన్న మాయఙ్గళ్,

పెణ్ణానోమ్, పెణ్మైయోమ్ నిఱ్క, అవన్ మేయ

అణ్ణల్ మలైయుమ్, అరఙ్గముమ్ పాడోమే  ll 1978

కణ్ణన్ = శ్రీకృష్ణుడు; మనత్తుళ్ళే = నాయొక్క హృదయమందే; నిఱ్కవుమ్ = వేంచేసి యుండుటయు: కై వళైగళ్ = నాయొక్క చేతి కంకణములు; ఎన్నో కழన్ఱ = ఏమిటో జారిపోయినవి!; ఇవై ఎన్న మాయఙ్గళ్ = ఇది చాల ఆశ్చర్యకరముగనున్నది; పెణ్ ఆనోమ్ = స్త్రీయై పుట్టిన మనము; పెణ్మైయోమ్ నిఱ్క= మిక్కిలి సుందరమైన స్త్రీ గుణములతో; అవన్ మేయ = ఆ సర్వేశ్వరుడు ఆశించి వసించుచున్న; అణ్ణల్ = శ్లాఘ్యమైన; మలైయుమ్ = తిరు వేంకటాచలమును; అరఙ్గముమ్ = శ్రీ రంగమును; పాడోమ్ = ప్రత్యక్షముగ దర్శించి  పాడుదుము!

శ్రీకృష్ణుడు నాయొక్క హృదయమందే  వేంచేసియుండుటయు నాయొక్క చేతి కంకణములు, ఏమిటో! జారిపోయినవి!, ఇది చాల ఆశ్చర్యకరముగ  నున్నది.  స్త్రీయై పుట్టిన మనము, మిక్కిలి సుందరమైన స్త్రీ గుణములతో, ఆ సర్వేశ్వరుడు ఆశించి వసించుచున్న శ్లాఘ్యమైన తిరు వేంకటాచలమును, శ్రీ రంగమును ప్రత్యక్షముగ దర్శించి  పాడుదుము!

పాడోమే ఎన్దైపెరుమానై, పాడినిన్ఱు

ఆడోమే, ఆయిరమ్ పేరానై, పేర్ నినైన్దు

శూడోమే, శూడుమ్ తుழாయలఙ్గల్, శూడినామ్

కూడోమే, కూడక్కుఱిప్పాకిల్ నన్నెఞ్జే  ll 1979

నల్ నెఞ్జే=ఓ! నాయొక్క మంచిమనసా!; (ఇది నిర్మలముగ చింతించుమా!)ఎన్దై పెరుమానై=నాయొక్క (కల్యాణ గుణములను కలిగిన )స్వామిని;పాడోమే=పాడమా?; ఆయిరమ్ పేరానై = సహస్రనామములుగల ఆ సర్వేశ్వరుని; పాడినిన్ఱు = పాడుచు; ఆడోమే=(పరమానందముతో) నృత్యముచేయమా!; పేర్ = వానియొక్క దివ్య నామములను; నినైన్దు = ధ్యానించి; శూడుమ్ తుழாయ్ అలఙ్గల్ =ఆ స్వామి ధరించిన తులసీమాలలను; శూడోమే = ధరించమా!; శూడి = వాటిని ధరించి; కూడ = అతనితో కలియికకు; కుఱిప్పు ఆగిల్=నీయొక్క అంగీకారము యున్నయెడల;నామ్ కూడోమే=మనము కలియకుందుమా?.

నాయొక్క మంచిమనసా! (ఇది నిర్మలముగ చింతించుమా!) నాయొక్క (కల్యాణ గుణములను కలిగిన) స్వామిని పాడమా?,సహస్రనామములుగల ఆ సర్వేశ్వరుని పాడుచు ,(పరమానందముతో) నృత్యముచేయమా?, వానియొక్క దివ్య నామములను ధ్యానించి ఆ స్వామి ధరించిన తులసీమాలలను ధరించమా?, వాటిని ధరించి అతనితో కలియికకు నీయొక్క అంగీకారము యున్నయెడల మనము కలియకుందుమా?.(మనసు యొక్క సహకారముచే సకలము సాధ్యమగునని భావము)

నన్నెఞ్జే నమ్బెరుమాన్, నాళుమ్ ఇనిదు అమరుమ్,

అన్నమ్ శేర్ కానల్, అణియాలి కై తొழுదు,

మున్నమ్ శేర్ వల్వినైగళ్, పోక ముగిల్ వణ్ణన్,

పొన్నమ్ శేర్ శేవడిమేల్, పోదు అణియ ప్పెర్ట్రోమే  ll 1980

నల్ నెఞ్జే = ఓ! నాయొక్క మంచిమనసా!; నమ్ పెరుమాన్ = మనయొక్క స్వామి; నాళుమ్ = ఎల్లప్పుడును; ఇనిదు అమరుమ్ = సంతోషముతో అమరియున్న; అన్నమ్ శేర్ కానల్ = హంసలు చేరి నివసించుచున్న మడ అడవులుగల;అణి=అందమైన; ఆలి=తిరువాలి దివ్యదేశమును;  కై తొழுదు = సేవించి; మున్నమ్ శేర్ వల్ వినైగళ్ పోక = చిరకాలముగ చేరియున్న క్రూరమైన పాపములు తొలగిపోవునట్లు; ముగిల్ వణ్ణన్ = కాలమేఘమువంటి వర్ణముగల సర్వేశ్వరునియొక్క; పొన్నమ్ శేర్ శే అడిమేల్ పోదు=ఆశింపబడెడి  దివ్యపాదములపైనున్న పుష్పములను; అణియ ప్పెర్ట్రోమ్ = ధరించెడి మహాభాగ్యము పొందితిమి!

    ఓ! నాయొక్క మంచిమనసా! (నీయొక్క సహకారముచే),మనయొక్క స్వామి ఎల్లప్పుడును సంతోషముతో అమరియున్న, హంసలు చేరి నివసించుచున్న మడ అడవులుగల అందమైన తిరువాలి దివ్యదేశమును సేవించి, చిరకాలముగ చేరియున్న క్రూరమైన పాపములు తొలగిపోవునట్లు, కాలమేఘమువంటి వర్ణముగల సర్వేశ్వరునియొక్క ఆశింపబడెడి  దివ్యపాదములపైనున్న పుష్పములను, ధరించెడి మహాభాగ్యము పొందితిమి! 

** పెర్ట్రు ఆరార్, ఆయిరమ్ పేరానై,  పేర్ పాడ

పెర్ట్రాన్, కలియన్ ఒలిశెయ్ తమిழ் మాలై, 

కర్ట్రారోముర్ట్రులకాళ్వర్, ఇవై కేట్కల్

ఉర్ట్రార్ క్కు, ఉఱుతుయరిల్లై యులగత్తే  ll 1981

పెర్ట్రు ఆరార్ = భాగ్యశాలురైన ఎవరెవరు;ఆయిరమ్ పేరానై = సహస్రనామములుగల సర్వేశ్వరుని యొక్క; పేర్ పాడ పెర్ట్రాన్ =దివ్యమైన నామములను అనుసంధించు భాగ్యము పొందిన; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; ఒలి శెయ్ = అనుగ్రహించిన;తమిழ் మాలై=తమిళ భాషలో నున్న ఈ సూక్తుల మాలను; కర్ట్రారో = అభ్యసించెదరో;ముర్ట్రు ఉళగు ఆళ్ వర్ = వారు లోకములంతయును పరిపాలించుదురు; ఇవై = ఈ పాశురములను; కేట్కల్ ఉర్ట్రార్ క్కు= చెవి యొగ్గి వినువారికి; ఉలగత్తే = లోకమందెచ్చటను; ఉఱు తుయర్ ఇల్లై=అనుభవింపతగిన దుఃఖములేవియు ఉండవు!

           భాగ్యశాలురైన ఎవరెవరు,సహస్రనామములుగల సర్వేశ్వరునియొక్క దివ్యమైన నామములను అనుసంధించు భాగ్యము పొందిన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన తమిళ భాషలో నున్న ఈ సూక్తుల మాలను అభ్యసించెదరో, వారు లోకములంతయును పరిపాలించుదురు. ఈ పాశురములను చెవి యొగ్గి వినువారికి లోకమందెచ్చటను అనుభవింపతగిన దుఃఖములేవియు ఉండవు!

*********

వ్యాఖ్యానించండి