శ్రీః
4 . నిలైయిడమ్
సర్వేశ్వరునియొక్క దివ్యమైన అవతారములను తిరుమంగై ఆళ్వార్ అనుభవించుచున్నారు.
** నిలైయిడమెఙ్గుమిన్ఱి నెడువెళ్ళమ్ ఉమ్బర్, వళనాడుమూడ ఇమైయోర్,
తలైయిడమర్ట్రు ఎమక్కోర్ శరణిల్లైయెన్న, అరణావనెన్నుమ్ అరుళాల్,
అలైకడల్ నీర్ కుழுమ్బ అగడుఆడఓడి, అగల్వాన్ ఉరిఞ్జ, ముదుకిల్
మలైకళై మీదుకొణ్డు వరుమీనైమాలై, మఱవాదు ఇఱైఞ్జు ఎన్ మననే ll 1982
ఎన్ మననే = ఓ! నా మనసా!;ఎఙ్గుమ్ నిలై యిడమ్ ఇన్ఱి =ఎచ్చటను నిలబడియుండు స్థానముకూడ లేనట్లు; నెడు వెళ్ళమ్ = మహా ప్రళయజలములు; ఉమ్బర్= ఊర్ధ్వలోక మందున్నవారియొక్క; వళమ్ నాడు = మహోన్నతమైన స్థానములు; మూడ=వ్యాపించి ముంచగ; ఇమైయోర్ = దేవతలు(భయముతో వణుకుచు),ఎమక్కు= “మాకు; తలై యిడ = శిరస్సుతో సేవించి యాచించుటకు; మర్ట్రు ఓర్ శరణ్ ఇల్లై ఎన్న = (నీయొక్క చరణారవిందములు తప్ప) వేరొక శరణ్యము లేదని” ప్రార్ధించగ; (అట్టి సమయమున) అరణ్ ఆవన్ ఎన్నుమ్ అరుళాల్ = ” మీకు నేను రక్షణగ నుండెదను ” అని దయతో; (వారికి వసించు స్థానము నొసగుటకై) అలై కడల్ నీర్ కుழுమ్బ అగడు ఆడ = అలలు కొట్టుచున్న సముద్ర జలములు తన ఉదరము యొక్క క్రిందబాగమున చేరి యుండునట్లు; అగల్ వాన్ ఓడి = విశాలమైన ఆకాశమున పోయి; ఉరిఞ్జ = తనను ఒత్తుకొనియుండునట్లు; ముదగిల్ = వీపున; మలై గళై మీదు కొణ్డు = పర్వతములను ధరించుకొని; వరుమ్ = ఏతెంచిన; మీనై మాలై = మత్స్యరూపియైన సర్వేశ్వరుని; మఱవాదు ఇఱైఞ్జు = ఎన్నడు మరువక సేవించి ఉజ్జీవింపుమా!
ఓ! నా మనసా!,ఎచ్చటను నిలబడియండు స్థానముకూడ లేనట్లు మహాప్రళయజలములు ఊర్ధ్వలోకమందున్నవారియొక్క మహోన్నతమైన స్థానములను వ్యాపించి ముంచగ, దేవతలు (భయముతో వణుకుచు) “మాకు శిరస్సుతో సేవించి యాచించుటకు (నీయొక్క చరణారవిందములు తప్ప)వేరొక శరణ్యము లేదని”ప్రార్ధించగ (అట్టి సమయమున) ” మీకు నేను రక్షణగ నుండెదను ” అని దయతో (వారికి వసించు స్థానము నొసగుటకై) అలలుకొట్టుచున్న సముద్ర జలములు తన ఉదరము యొక్క క్రిందబాగమున చేరి యుండునట్లు విశాలమైన ఆకాశమున పోయి,తనను ఒత్తుకొని యుండునట్లు వీపున పర్వతములను ధరించుకొని ఏతెంచిన మత్స్యరూపియైన సర్వేశ్వరుని ఎన్నడు మరువక సేవించి ఉజ్జీవింపుమా!
శెరుమికు వాళ్ ఎయిర్ట్ర అరవొన్ఱుశుర్ట్రి, త్తిశై మణ్ణుమ్ విణ్ణుమ్ ఉడనే,
వెరువర వెళ్ళైవెళ్ళమ్ ముழுదుమ్ కుழுమ్బ, ఇమైయోర్ గళ్ నిన్ఱుకడైయ,
పరువరైయొన్ఱునిన్ఱు ముతుకిల్ పరన్దు, శుழுల క్కిడన్దు తుయిలుమ్,
అరువరై యన్న తన్మై అడల్ అమైయాన, తిరుమాల్ నమక్కోరరణే ll 1983
శెరు మికు = బలిష్టమైన; వాళ్ = ప్రకాశించుచున్న;ఎయిర్ట్ర = కోరలుగల; అరవు ఒన్ఱు శుర్ట్రి = వాసుకియను సర్పమును(కవ్వమునకు తాడువలె)చుట్టి; తిశై మణ్ణుమ్ విణ్ణుమ్ ఉడనే = సమస్త దిక్కులందున్నవారు, భూలోకమందున్నవారు,ఊర్ధ్వలోకమందున్నవారు ఒక్కసారిగా; వెరువర = భయముతో వణుకునట్లు; వెళ్ళై వెళ్ళమ్ ముழுదుమ్ = తెల్లని పాలసముద్రమంతయును; కుழுమ్బ = అలజడిచెందునట్లు;ఇమైయోర్ గళ్ = దేవతలు; నిన్ఱు కడైయ = నిలిచి చిలుకునట్లు; పరు వరై ఒన్ఱు = పెద్ద పర్వతము ఒకటి;ముతుకిల్= తన వీపుపై; శుழுల = తిరగునట్లు; కిడన్దు = ఆ పర్వతముయొక్క అడుగున పరుండి; తుయిలుమ్ = విశ్రమించిన; అరు వరై అన్న తన్మై = పెద్ద పర్వతమొకటి చేరియున్నదా అనునట్లున్న; అమై ఆన = కూర్మరూపియైన; తిరు మాల్ = సర్వేశ్వరుడు; నమక్కు ఓర్ అరణే = మనకు సాటిలేని రక్షకుడు!
బలిష్టమైన,ప్రకాశించుచున్న,కోరలుగల వాసుకియను సర్పమును (కవ్వమునకు తాడువలె) చుట్టి,సమస్త దిక్కులందున్నవారు,భూలోకమందున్నవారు, ఊర్ధ్వలోకమందున్నవారు ఒక్కసారిగా భయముతో వణుకునట్లు తెల్లని పాలసముద్రమంతయును అలజడిచెందునట్లు,దేవతలునిలిచి చిలుకునట్లు పెద్ద పర్వతము (మంధర పర్వతము) ఒకటి తన వీపుపై తిరగునట్లు ఆ పర్వతము యొక్క అడుగున పరుండి విశ్రమించిన పెద్ద పర్వతమొకటి చేరియున్నదా అనునట్లున్న కూర్మరూపియైన సర్వేశ్వరుడు మనకు సాటిలేని రక్షకుడు!
తీతఱు తిఙ్గళ్ పొఙ్గు శుడర్ ఉమ్బర్, ఉమ్బర్ ఉలగేழிనోడుముడనే,
మాదిరమ్ మణ్ శుమన్దు వడకున్ఱు నిన్ఱ, మలైయాఱుమ్ ఏழுకడలుమ్,
పాదమర్ శూழ் కుళమ్బిన కమణ్డలత్తిన్, ఒరుపాల్ ఒడుఙ్గ వళర్ శేర్,
ఆది మున్ ఏనమాకి అరణాయ మూర్తి, యదు నమ్మై ఆళుమ్ అరశే ll 1984
తీదు అఱు = దోషములేని; తిఙ్గళ్ = చంద్రుడును; పొఙ్గు శుడర్ = మిక్కిలి తేజస్సుగల సూర్యుడును; ఉమ్బర్ = దేవతలును; ఉమ్బర్ ఉలగు ఏழிనోడుమ్ ఉడనే = పైనున్న ఏడులోకములతోను; మాదిరమ్ = దిక్కులును; మణ్ శుమన్దు వడ కున్ఱు = భూమిని ధరించిన మేరుపర్వతమును; నిన్ఱ మలై ఆఱుమ్=మిగిలిన కులపర్వతములు ఆరును; ఏழு కడలుమ్=సప్తసముద్రములును; (మొదలగు ఇవన్నియు);పాదమ్ అమర్ = పాదమందు అమరియున్న; శూழ் కుళమ్బిన్=పెద్ద గిట్టలయొక్క; అకమ్ మణ్డలత్తిన్ = లోపల వలయమున; ఒరుపాల్ ఒడుఙ్గ = ఒక భాగమున అణుగునట్లు; వళర్ శేర్ = తగినట్లు పెరిగిన;ఆది=కారణభూతుడైన సర్వేశ్వరుడు;మున్= వరాహకల్పాదియందు; ఎనమాకి = మహావరాహరూపియై;అరణాయ=రక్షకుడై యున్న;మూర్తి అదు=ఆ స్వామి; నమ్మై ఆళుమ్ అరశే = మనలను పాలించెడి ప్రభువే!
దోషములేని చంద్రుడును,మిక్కిలి తేజస్సుగల సూర్యుడును,దేవతలును, పైనున్న ఏడులోకములతోను దిక్కులును, భూమిని ధరించిన మేరుపర్వతమును, మిగిలిన కులపర్వతములు ఆరును,సప్తసముద్రములును, (మొదలగు ఇవన్నియు) పాదమందు అమరియున్న పెద్ద గిట్టలయొక్క లోపల వలయమున ఒక భాగమున అణుగునట్లు తగినట్లు పెరిగిన కారణభూతుడైన సర్వేశ్వరుడు వరాహకల్పాదియందు మహావరాహరూపియై, రక్షకుడై యున్న ఆ స్వామి మనలను పాలించెడి ప్రభువే!
తళైయవిழ் కోదైమాలై ఇరుపాల్ తయఙ్గ, ఎరికాన్ఱు ఇరణ్డు తఱుకణ్,
అళవెழ వెమ్మైమిక్క అరియాగి అన్ఱు, పరియోన్ శినఙ్గళవిழ,
వళై ఉగిరాళిమొయ్ మ్బిల్ మఱవోనతు ఆగమ్, మదియాదు శెన్ఱుఓరుగిరాల్,
పిళవెழுవిట్ట కుట్టమదు వైయమూడు, పెరునీరిల్ ముమ్మై పెరిదే ll 1985
అన్ఱు = మునుపొకకాలమున; తళై అవిழ் కోదై మాలై=వికసించిన పుష్పములమాలలు; ఇరుపాల్ తయఙ్గ = ఇరువైపుల కదులుచుండగ;ఎరి కాన్ఱు=నిప్పులు గ్రక్కుచున్న; ఇరణ్డుతఱుకణ్=శూరత్వముతోనిండిన రెండు కన్నులు; అళవు ఎழ = అపరిమితముగ ప్రకాశించుచుండగ; వెమ్మై మిక్క అరి ఆగి = మిక్కిలి భయంకరమైన నరసింహరూపియై; పరియోన్ =స్థూలకాయుడైన హిరణ్యాసురునియొక్క; శినఙ్గళ్ = భగవత, భాగవతుల విషయమున చేసిన అపచారములన్నియు; అవిழ = తొలగిపోవునట్లు;వళై ఉగిర్ ఆళి= వంగియున్న నఖములుగల కలిగి; మొయ్ మ్బిల్ మఱవోనతు=మిక్కిలి బలిష్టుడైన, ద్వేషముతో నిండిన హిరణ్యాసురుని యొక్క; ఆగమ్ = శరీరమును;మదియాదు శెన్ఱు= విశిష్టత కలదానినిగ భావించక (తృణముగ ఎంచి) సమీపించి; ఒరు ఉగిరాల్ = ఒక నఖముచే;పిళవు ఎழு విట్ట = రెండు భాగములగునట్లు చేయుటచే; కుట్టమ్అదు=రక్తపు మడుగు;వైయమ్ మూడు=ఈ లోకమంతటను వ్యాపించిన; పెరునీరిల్= ప్రళయ జలముల కంటె; ముమ్మై పెరిదుమ్ = మూడురెట్లు పెద్దదిగ నుండెను!
మునుపొకకాలమున వికసించిన పుష్పములమాలలు ఇరువైపుల కదులుచుండగ,నిప్పులు గ్రక్కుచున్న శూరత్వముతోనిండిన రెండు కన్నులు అపరిమితముగ ప్రకాశించుచుండగ మిక్కిలి భయంకరమైన నరసింహరూపియై స్థూలకాయుడైన హిరణ్యాసురునియొక్క భగవత, భాగవతుల విషయమున చేసిన అపచారములన్నియు తొలగిపోవునట్లు వంగియున్న నఖములను కలిగి మిక్కిలి బలిష్టుడైన, ద్వేషముతో నిండిన హిరణ్యాసురుని యొక్క శరీరమును విశిష్టత కలదానినిగ భావించక (తృణముగ ఎంచి) సమీపించి, ఒక నఖముచే రెండు భాగములగు నట్లు చేయుటచే రక్తపు మడుగు, ఈ లోకమంతటను వ్యాపించిన ప్రళయ జలముల కంటె మూడురెట్లు పెద్దదిగ నుండెను!
వెన్దిఱల్ వాణన్ వేళ్వియిడమెయ్ ది, అఙ్గోర్ కుఱళాగి మెయ్ మ్మై ఉణర,
శెన్దొழிల్ వేదనావిల్ మునియాగి, వైయమ్ అడిమూన్ఱిరన్దు పెఱినుమ్,
మన్దరమీదు పోగి మదినిన్ఱు ఇఱైఞ్జ, మలరోన్ వణఙ్గ వళర్ శేర్,
అన్దరమేழிనూడు శెల వుయ్ త్త పాదమదు, నమ్మై ఆళుమరశే ll 1986
వెమ్ తిఱల్ = తీవ్రమైన శక్తిగల; వాణన్ = మహాబలి యొక్క; వేళ్వి ఇడమ్ = యాగ భూమిలో;అఙ్గు ఓర్ కుఱళ్ ఆగి=అచటకు విలక్షణమైన వామనమూర్తియై;ఎయ్ ది = ఏతెంచి; మెయ్ మ్మై ఉణర = ” ఈ వామనుడు నిజముగ యాచకుడేయని మహాబలి గ్రహించునట్లు; శెమ్ తొழிల్ వేదమ్ నావిల్ మునియాగి = మంచి అనుష్టానములతో నిండిన వేదములను తన నోటితో ఉచ్ఛరించెడి ఋషియై నిలిచి;మూన్ఱు అడి వైయమ్=మూడడుగుల భూమిని; ఇరన్దు = యాచించి; పెఱినుమ్ = పొందగనే; మన్దరమీదు పోగి మదినిన్ఱు ఇఱైఞ్జ= మేరు పర్వతమును అధిగమించి పోయి చంద్రుడు ప్రార్ధించునట్లును; మలరోన్ = చతుర్ముఖ బ్రహ్మ; వణఙ్గ = సేవించునట్లు; వళర్ శేర్ = పెరుగుచు; అన్దరమ్ ఏழிన్ ఊడు=ఊర్ధ్వలోకములు ఏడింటినుండి; శెల ఉయ్ త్త పాదమ్ అదు = పోవునట్లు చాచిన ఆ దివ్యమైన పాదము;నమ్మై అరశు ఆళుమ్ = మనలను రక్షించుచు పాలించును!
తీవ్రమైన శక్తిగల మహాబలి యొక్క యాగ భూమిలో,అచటకు విలక్షణమైన వామనమూర్తియై ఏతెంచి, ” ఈ వామనుడు నిజముగ యాచకుడే ” యని మహాబలి గ్రహించునట్లు మంచి అనుష్టానములతో నిండిన వేదములను తన నోటితో ఉచ్ఛరించెడి ఋషియై నిలిచి మూడడుగుల భూమిని యాచించి, పొందగనే, మేరు పర్వతమును అధిగమించి పోయి చంద్రుడు ప్రార్ధించునట్లును, చతుర్ముఖ బ్రహ్మ సేవించునట్లు పెరుగుచు ఊర్ధ్వలోకములు ఏడింటినుండి పోవునట్లు చాచిన ఆ దివ్యమైన పాదము మనలను రక్షించుచు పాలించును!
ఇరునిల మన్నర్ తమ్మై ఇరునాలు మెట్టుమ్, ఒరునాలు మొన్ఱుముడనే,
శెరునుదలూడు పోగి అవరావి మఙ్గ, మழுవాళిల్ వెన్ఱ తిఱలోన్,
పెరునిలమఙ్గై మన్నర్ మలర్ మఙ్గై నాదర్, పులమఙ్గై కేళ్వర్ పుగழ் శేర్,
పెరునిలమ్ ఉణ్డుమిழ்న్ద పెరువాయరాగియవర్, నమ్మై యాళ్వర్ పెరిదే ll 1987
ఇరు నిలమ్ మన్నర్ తమ్మై =విశాలమైన ఈ భూమండలమునగల మహారాజులయొక్క ; ఇరునాలుమ్ ఎట్టుమ్ ఒరు నాలుడనే ఒన్ఱుమ్ = ఇరవదియొక్క తరములను; శెరు నుదలూడు పోగి = యుద్దభూమికి పోయి; అవర్ ఆవి మఙ్గ = వారియొక్క ప్రాణములు నశించునట్లు; మழு వాళిల్ = గండ్రగొడ్డలిచే; వెన్ఱ తిఱలోన్ = సంహరించిన మిక్కిలి శక్తివంతుడైన; పెరు నిలమ్ మఙ్గై మన్నర్ = శ్రీ భూదేవియొక్క నాయకుడును; మలర్ మఙ్గై నాదర్ = కమలవాసిని శ్రీమహాలక్ష్మియు క్క నాధుడును; పులమ్ మఙ్గై కేళ్వర్ =తనయొక్క సకలేంద్రియములును చూరగొన్న నీళాదేవియొక్క ప్రభువును; పుగழ் శేర్==మిక్కిలి ఖ్యాతికలిగిన; (ప్రళయకాలమున) పెరునిలమ్ ఉణ్డు=ఈ భూమండలమును తన ఉదరమున ఉంచుకొని; (పిదప సృష్టికాలమున) ఉమిழ்న్ద = వెలిబుచ్చిన; పెరు వాయర్ ఆగియవర్ = పెద్ద నోరుకలిగిన (పరశురామునిగ అవతరించిన) సర్వేశ్వరుడు, పెరిదే = నిరంతరముగ; నమ్మై ఆళ్వర్ = మనలను పాలించుదురు!
విశాలమైన ఈ భూమండలమునగల మహారాజులయొక్క ఇరవదియొక్క తరములను, యుద్దభూమికి పోయి వారియొక్క ప్రాణములు నశించునట్లు గండ్రగొడ్డలిచే సంహరించిన మిక్కిలి శక్తివంతుడైన శ్రీ భూదేవియొక్క నాయకుడును, కమలవాసిని శ్రీమహాలక్ష్మియుక్క నాధుడును,తనయొక్క సకలేంద్రియములును చూరగొన్న నీళాదేవియొక్క ప్రభువును, మిక్కిలి ఖ్యాతికలిగిన (ప్రళయకాలమున) ఈ భూమండలమును తన ఉదరమున ఉంచుకొని, (పిదప సృష్టికాలమున) వెలిబుచ్చిన పెద్ద నోరుకలిగిన, (పరశురామునిగ అవతరించిన) సర్వేశ్వరుడు,నిరంతరముగ మనలను పాలించుదురు!
ఇలైమలి పళ్ళి యెయ్ ది ఇదు మాయమెన్న, ఇనమాయమాన్ పిన్ ఎழிల్ శేర్,
అలైమలి వేఱ్కణాళై అగల్విప్పదఱ్కు, ఓరురువాయ మానై అమైయా,
కొలైమలి వెయ్ దువిత్త కొడియోనిలఙ్గై, పొడియాగ వెన్ఱి అమరుళ్,
శిలైమలి శెఞ్జరఙ్గళ్ శెలవుయ్ త్త నఙ్గళ్, తిరుమాల్ నమక్కోరరణే ll 1988
ఇలై మలి పళ్ళి యెయ్ ది = పర్ణశాల చేరువకు వచ్చి; అలై మలి వేల్ కణాళై= దుఃఖము కలుగజేయు స్వభావముగల శూలమువంటి వాడియైన నేత్రములుగల సీతాదేవిని; ఎழிల్ శేర్=మిక్కిలి అందమైన; అగల్విప్పదఱ్కు=వేరుపరచుటకు;ఇనమాయ మాన్ పిన్ = సజాతీయమైన లేళ్ళ వెనుకనే; ఇదు మాయమ్ ఎన్న = ” ఇది ఆశ్చర్యకరమైన లేడి ” అనునట్లు;ఓర్ ఉరు ఆయ=విలక్షణమైన రూపముదాల్చి వచ్చిన;మానై= (మారీచుడను) మాయ లేడిని; అమైయా = నిరసించి;కొలై మలివు ఎయ్ దువిత్త కొడియోన్= పరులను హింసించెడిగుణమే తనయందు పూర్తిగకలగియున్న క్రూరమైన రావణునియొక్క;ఇలఙ్గై= లంకాపురిని;పొడి ఆగ=భస్మీపటలమగునట్లు; వెన్ఱి అమరుళ్=జయించెడి యుద్దములో; శిలై మలి శెమ్ శరఙ్గళ్ = విల్లులో నిండుగ శ్లాఘ్యమైన బాణములను; శెల ఉయ్ త్త= ప్రయోగించిన; నఙ్గళ్ తిరుమాల్ = (శ్రీ రామచంద్రునిగ అవతరించిన) మనయొక్క సర్వేశ్వరుడు; నమక్కు ఓర్ అరణ్ = మనకు సాటిలేని రక్షకుడు!
పర్ణశాల చేరువకు వచ్చి,,దుఃఖముకలుగజేయు స్వభావముగల శూలమువంటి వాడియైన నేత్రములుగల,మిక్కిలి అందమైన సీతాదేవిని వేరుపరచుటకు సజాతీయమైన లేళ్ళ వెనుకనే ” ఇది ఆశ్చర్యకరమైన లేడి ” అనునట్లు విలక్షణమైన రూపముదాల్చి వచ్చిన (మారీచుడను) మాయ లేడిని నిరసించి, పరులనుహింసించెడి గుణమే తనయందు పూర్తిగకలగియున్న క్రూరమైన రావణునియొక్క లంకాపురిని భస్మీపటలమగునట్లు జయించెడి యుద్దములో విల్లులో నిండుగ శ్లాఘ్యమైన బాణములను ప్రయోగించిన (శ్రీ రామచంద్రునిగ అవతరించిన)మనయొక్క సర్వేశ్వరుడు మనకు సాటిలేని రక్షకుడు!
మున్నులకఙ్గళేழுమ్ ఇరుళ్ మణ్డియుణ్ణ, ముదలోడు వీడుమ్ అఱియాదు,
ఎన్నిదు వన్దదెన్న ఇమైయోర్ తిశైప్ప, ఎழிల్ వేదమిన్ఱి మఱైయ,
పిన్నైయుమ్ వానవర్కుమ్ మునివర్కుమ్ నల్గి, ఇరుళ్ తీర్ న్దివ్వైయమగిழ,
అన్న మదాయిరున్దు అఙ్గఱనూలురైత్త, అదు నమ్మై ఆళుమ్ అరశే ll 1989
మున్ = మునుపొకకాలమున; ఉలకఙ్గళ్ ఏழுమ్ = సప్త లోకములను; ఇరుళ్ =అఙ్ఞానాంధకారము; మణ్డి ఉణ్ణ = వ్యాపింపబడునట్లును; ఇమైయోర్ = దేవతలు; ముదలోడు వీడుమ్ అఱియాదు= ఆదియు, అంతము తెలియకుండనటుల;ఎన్ ఇదు వన్దుదు ఎన్న=” ఆకస్మికముగ ఈ విధముగ అయినదేమిటి? ” అని; తిశైప్ప= దిగ్భ్రాంతి చెందునట్లును; ఎழிల్ వేదమ్ = అతిసుందరమైన వేదములు; (మధు కైటభులను అసురుల వలన )ఇన్ఱి మఱైయ = లేకుండ మాయమవగ; పిన్నైయుమ్ = తరువాత; వానవర్కుమ్ మునివర్కుమ్ = దేవతలకు, మహాఋషులకు; నల్గి = కరుణించి; ఇ వైయమ్ = ఈ లోకము; ఇరుళ్ తీర్ న్దు మగిழ= అఙ్ఞానాంధకారము తొలగి ఆనందించునట్లు; (ఆ అసురులను వధించి) అన్నమ్ అదు ఆయ్ ఇరున్దు = హంస రూపియై అవతరించి; అఙ్గు=ఆ సమయమున;అఱమ్ నూల్ ఉరైత్త=వేదశాస్త్రములను అనుగ్రహించిన; అదు = ఆ పరంజ్యోతియే; నమ్మై అరశు ఆళుమ్=మనలను రక్షించుచు పాలించును!
మునుపొకకాలమున సప్త లోకములను అఙ్ఞానాంధకారము వ్యాపింపబడునట్లును, దేవతలు ఆదియు,అంతము తెలియకుండనటుల,” ఆకస్మికముగ ఈ విధముగ అయినదేమిటి? ” అని దిగ్భ్రాంతి చెందునట్లును, అతి సుందరమైన వేదములు (మధు కైటభులను అసురుల వలన ) లేకుండ మాయమవగ, తరువాత, దేవతలకు, మహాఋషులకు, కరుణించి ఈ లోకము అఙ్ఞానాంధకారము తొలగి ఆనందించునట్లు (ఆ అసురులను వధించి) హంస రూపియై అవతరించి, ఆ సమయమున వేదశాస్త్రములను అనుగ్రహించిన ఆ పరంజ్యోతియే మనలను రక్షించుచు పాలించును!
తుణై నిలై మర్ట్రెమక్కోరుళదెన్ఱిరాదు, తొழுమిఙ్గళ్ తొణ్డర్, తొలైయ
ఉణములై మున్ కొడుత్త ఉరవోళదు ఆవి, ఉగవుణ్డు వెణ్ణెయ్ మరువి,
పణైములై ఆయర్ మాదర్ ఉరలోడుకట్ట, అదనోడు మోడి అడల్ శేర్,
ఇణై మరుదు ఇర్ట్రువీழ నడైకర్ట్రతెర్ట్రల్, వినైపర్ట్రు అఱుక్కుమ్ విదియే ll 1990
తొణ్డర్ = భాగవతులారా;ఎమక్కు మర్ట్రు ఓర్ తుణై నిలై ఉళదు ఎన్ఱు ఇరాదు = ” మనకు వేరొక ఆశ్రయము కలదు ” యని తలచక; తొழுమిన్ గళ్= (సర్వేశ్వరుని) సేవించుకొనుడు;మున్=మునుపొక కాలమున;తొలైయ=అంతమొందింపవలనని తలచి;ఉణ్= ఆరగించునట్లు; ములై కొడుత్త=విషము రాసుకొనియున్న తన స్తనములను ఒసగిన; ఉరవోళదు = క్రూరమనస్సుకలిగియున్న రక్కసి పూతనయొక్క; ఆవి ఉగ = ప్రాణము పోవునట్లు; ఉణ్డు = స్తన్యములను గ్రోలియు; వెణ్ణెయ్ మరువి = వెన్నను ఆశించి (దొంగిలించగ); పణై ములై ఆయర్ మాదర్ = పెద్ద వక్షోజములుగల గోపకాంత యశోదాదేవి; ఉరలోడుకట్ట = రోకలికి కట్టగ; అదనోడుమ్ ఓడి=దానితో పాకుచుపోయి; అడల్ శేర్ = దృఢముగ చేరియున్న; ఇణై మరుదు=రెండు మద్ది వృక్షములు; ఇర్ట్రువీழ=విరిగి క్రిందపడునట్లు; నడై కర్ట్ర తెర్ట్రల్ = నడత కలిగిన పరిఙ్ఞానమున్న చిన్న శిశువు (శ్రీకృష్ణునిగ అవతరించిన ఆ సర్వేశ్వరుడు); వినై పర్ట్రు అఱుక్కుమ్ = మనయొక్క పాపములు కూకటివేళ్ళతో పెకలించివేయును; విదియే = ఇది ఖచ్చితము సుమా!
భాగవతులారా!,” మనకు వేరొక ఆశ్రయము కలదు ” యని తలచక, (సర్వేశ్వరుని)సేవించుకొనుడు. మునుపొకకాలమున,అంతమొందింపవలనని తలచి, ఆరగించునట్లు విషము రాసుకొనియున్న తన స్తనములను ఒసగిన క్రూరమైనమనస్సు కలిగియున్న రక్కసి పూతనయొక్క ప్రాణము పోవునట్లు స్తన్యములను గ్రోలియు,వెన్నను ఆశించి (దొంగిలించగ) పెద్ద వక్షోజములుగల గోపకాంత యశోదాదేవి రోకలికి కట్టగ, దానితో పాకుచుపోయి దృఢముగ చేరియున్న రెండు మద్ది వృక్షములు విరిగి క్రింద పడునట్లు, నడత కలిగిన పరిఙ్ఞానమున్న చిన్న శిశువు (శ్రీకృష్ణునిగ అవతరించిన ఆ సర్వేశ్వరుడు) మనయొక్క పాపములు కూకటివేళ్ళతో పెకలించివేయును.ఇది ఖచ్చితము సుమా!
** కొలైకెழு శెమ్ముగత్త కళిఱొన్ఱు కొన్ఱు, కొడియోన్ ఇలఙ్గై పొడియా,
శిలైకెழு శెఞ్జరఙ్గళ్ శెలవుయ్ త్త నఙ్గళ్, తిరుమాలై వేలై పుడైశూழ்,
కలికెழு మాడవీది వయల్ మఙ్గైమన్ను, కలికన్ఱి శొన్న పనువల్,
ఒలికెழு పాడల్ పాడియుழల్ గిన్ఱ తొణ్డర్, అవర్ ఆళ్వరుమ్బరులగే ll 1991
కొలై కెழு = చంపెడు స్వభావముతో వెలయు; శెమ్ ముగత్త = ఎర్రని ముఖముతో వచ్చిన; కళిఱ్ ఒన్ఱు కొన్ఱు = కువలయాపీడమను ఏనుగునొకదానిని వధించియు; కొడియోన్ = దుర్మార్గుడైన రావణునియొక్క; ఇలఙ్గై = లంకాపురిని; పొడియా = భస్మీపటలమగునట్లు; శిలై కెழு శెమ్ శరఙ్గళ్ శెల ఉయ్ త్త = విల్లుతో అగ్నివర్షించెడి బాణములు ప్రయోగించినట్టి; నఙ్గళ్ తిరుమాలై = మనయొక్క సర్వేశ్వరుని విషయమై; వేలై పుడై శూழ் = సముద్రముతొ అంతటను చుట్టుకొనియున్న; కలి కెழு మాడ వీది = దృఢమైన మాడవీదులుగల; వయల్ మఙ్గై మన్ను = పొలములతో ఒప్పు తిరుమఙ్గై దేశవాసులైన; కలికన్ఱి తిరుమంగై ఆళ్వార్;శొన్న=అనుగ్రహించిన;పనువల్=శ్రీ సూక్తులైన; ఒలి కెழு పాడల్ = శబ్ద పుష్ఠిగల ఈ పాశురములను; పాడి=నోరారపాడి;ఉழల్ గిన్ఱ = కాలముగడుపుచు తిరిగెడి; తొణ్డర్ అవర్ = ఆ భాగవతోత్తములు; ఉమ్బర్ ఉలగు = పరమపదమును; ఆళ్వర్ = పాలించుదురు!
చంపెడు స్వభావముతో వెలయు,ఎర్రని ముఖముతో వచ్చిన కువలయాపీడమను ఏనుగునొకదానిని వధించియు, దుర్మార్గుడైన రావణునియొక్క లంకాపురిని భస్మీపటలమగునట్లు విల్లుతో అగ్నివర్షించెడి బాణములు ప్రయోగించినట్టి, మనయొక్క సర్వేశ్వరుని విషయమై సముద్రముతొ అంతటను చుట్టుకొనియున్నదృఢమైన మాడవీదులుగల, పొలములతో ఒప్పు తిరుమఙ్గై దేశవాసులైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన శ్రీ సూక్తులైన, శబ్ద పుష్ఠిగల ఈ పాశురములను నోరారపాడి తమయొక్క కాలముగడుపుచు తిరిగెడి ఆ భాగవతోత్తములు, పరమపదమును పాలించుదురు!
********