శ్రీః
5 . మానమరుమ్
సర్వేశ్వరునియొక్క పరత్వ, సౌలభ్యగుణముల విషయమై ఇద్దరి యవతులు నడుమ జరిగిన సంభాషణను తిరుమంగై ఆళ్వార్ వెలిబుచ్చుచున్నారు.
** మాన్ అమరు మెన్నోక్కి, వైదేవియిన్ తుణైయా,
కాన్ అమరుమ్ కల్లదర్ పోయ్, క్కాడుఱైన్దాన్ కాణ్ ఏడీ,
కాన్ అమరుమ్ కల్లదర్ పోయ్, క్కాడుఱైన్ద పొన్నడిక్కళ్,
వానవర్ తమ్ శెన్ని, మలర్ కణ్డాయ్ శాழలే ll 1992
ఏడీ=ఓ! నా సఖీ!;(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి);మాన్ అమరుమ్= లేడికన్నులతో ఒప్పు; మెల్ నోక్కి=సౌమ్యమైన కన్నులుగల;వైదేవి=విదేహరాజవంశమున జన్మించిన సీతాదేవిని; ఇన్ తుణై ఆ = ప్రియమైన తోడుగ స్వీకరించి; కాన్ అమరుమ్ = అడవులలో అమరియుండు; కల్ అదర్ పోయ్ = రాళ్ళు రప్పలతో నిండియున్న మార్గములద్వారా పోయి; కాడు ఉఱైన్దాన్ కాణ్ = అడవిలో వసించినాడు చూడుము! (అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవయువతి) శాయలే = సఖీ! కాన్ అమరుమ్ = అడవులలో అమరియుండు; కల్ అదర్ పోయ్ = రాళ్ళు రప్పలతో నిండియున్న మార్గములద్వారా పోయి; కాడు ఉఱైన్ద= అడవిలో వసించిన; పొన్ అడిక్కళ్= ఆ స్వామియొక్క దివ్య చరణములను; వానవర్ తమ్=బ్రహ్మాదిదేవతలు తమయొక్క; శెన్ని = శిరస్సులయందు ధరించిన; మలర్= పుష్పములని; కణ్డాయ్=తెలుసుకొనుమా!
ఓ! నా సఖీ!(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి) లేడికన్నులతో ఒప్పు సౌమ్యమైన కన్నులుగల విదేహరాజవంశమున జన్మించిన సీతాదేవిని ప్రియమైన తోడుగ స్వీకరించి అడవులలో అమరియుండు రాళ్ళు రప్పలతో నిండియున్న మార్గములద్వారా అడవిలో వసించినాడు చూడుము! (అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవయువతి) సఖీ! అడవులలో అమరియుండు రాళ్ళు రప్పలతో నిండియున్న మార్గములద్వారా పోయి అడవిలో వసించిన ఆ స్వామి యొక్క దివ్య చరణములను బ్రహ్మాదిదేవతలు తమయొక్క శిరస్సులయందు ధరించిన పుష్పములని తెలుసుకొనుమా!
తన్దైతళై కழల, త్తోన్ఱిప్పోయ్, ఆయ్ ప్పాడి
నన్దన్ కులమదలైయాయ్, వళర్ న్దాన్ కాణ్ ఏడీ,
నన్దన్ కులమదలైయాయ్ వళర్ న్దాన్, నాన్ముగఱ్కు
తన్దై కాణ్, ఎన్దైపెరుమాన్ కాణ్ శాழలే ll 1993
ఏడీ=ఓ! నా సఖీ!;(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి) తన్దై = తండ్రి వసుదేవునియొక్క; తళై = కాలి సంకెళ్ళు;కழల = జారి క్రిందపడునట్లు; తోన్ఱి = అవతరించి; పోయ్= మధురనుండి పోయి; ఆయ్ పాడి = గోకులమున; నన్దన్ = నందగోపాలునియొక్క; కులమ్ = కులమున; మదలై ఆయ్= కుమారునిగ; వళర్ న్దాన్= పెరిగినాడు; కాణ్ = చూడుము;(అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవయువతి) శాయలే = సఖీ!;నన్దన్ = నందగోపాలునియొక్క; కులమ్ = కులమున; మదలై ఆయ్ = కుమారునిగ; వళర్ న్దాన్ = పెరిగిన ఆ శిశువు; నాన్ముగఱ్కు తన్దై కాణ్ = చతుర్ముఖ బ్రహ్మకు తండ్రియని తెలుసుకొనుమా!;(మరియు)ఎన్దై పెరుమాన్ కాణ్ = నాయొక్క కులనాధుడనియు తెలుసుకొనుమా!
ఓ! నా సఖీ!(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి) తండ్రి వసుదేవునియొక్క కాలి సంకెళ్ళు జారి క్రిందపడునట్లు అవతరించి మధురనుండి పోయి గోకులమున నందగోపాలునియొక్క కులమున కుమారునిగ పెరిగినాడు చూడుము (అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవయువతి) సఖీ! నందగోపాలుని యొక్క కులమున కుమారునిగ పెరిగిన ఆ శిశువు చతుర్ముఖ బ్రహ్మకు తండ్రియని తెలుసుకొనుమా!(మరియు) నాయొక్క కులనాధుడనియు తెలుసుకొనుమా!
ఆழ் కడల్ శూழ் వైయకత్తార్ ఏశప్పోయ్, ఆయ్ ప్పాడి
తాழ் కుழలార్ వైత్త, తయిరుణ్డాన్ కాణ్ ఏడీ,
తాழ் కుழలార్ వైత్త, తయిరుణ్డ పొన్ వయిరు, ఇ
వ్వేழுలగు ముణ్డుమ్, ఇడముడైత్తు ఆల్ శాழలే ll 1994
ఏడీ=ఓ! నా సఖీ!;(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి) ఆழ் కడల్ శూழ் వైయకత్తార్ = ఆగాధమైన సముద్రముచే చుట్టుకొనియున్న భూలోకమందున్నవారు; ఏశ = నిందించునట్లు; ఆయ్ ప్పాడి = గోకులమున; తాழ் కుழలార్ వైత్త = వేలాడు కేశములుగల గోపకాంతలు ఉట్లయందు భద్రపరచియుంచిన; తయిర్ = పెరుగును; పోయ్ ఉణ్డాన్ కాణ్ = దొంగతనముగ పోయి ఆరగించెను చూడుము; (అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవయువతి) శాయలే =సఖీ!; తాழ் కుழలార్ వైత్త = వేలాడు కేశములుగల గోపకాంతలు ఉట్లయందు భద్రపరచియుంచిన; తయిర్=పెరుగును; ఉణ్డపొన్ వయిఱు = ఆరగించిన దివ్యమైన ఆ ఉదరమున;ఇ ఏழ் ఉలగుమ్ ఉణ్డుమ్ = ఈ సర్వలోకములను ఆరగించినను; ఇడమ్ ఉడైత్తు= ( పెరుగు ,నెయ్యి మొదలగునవి ఆరగించుటకు) ఇంకను స్థలము కలిగియన్నది; ఆల్ = ఆహా! ఏమి ఈ ఆశ్చర్యము! చూడుమా!
ఓ! నా సఖీ!;(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి) ఆగాధమైన సముద్రముచే చుట్టుకొనియున్న భూలోకమందున్నవారు నిందించునట్లు గోకులమున వేలాడు కేశములుగల గోపకాంతలు ఉట్లయందు భద్రపరచియుంచిన పెరుగును దొంగతనముగ పోయి ఆరగించెను చూడుము! (అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవయువతి) సఖీ! వేలాడు కేశములుగల గోపకాంతలు ఉట్లయందు భద్రపరచియుంచిన పెరుగును ఆరగించిన దివ్యమైన ఆ ఉదరమున ఈ సర్వ లోకములను ఆరగించినను ( పెరుగు మొదలగునవి ఆరగించుటకు) ఇంకను స్థలము కలిగియన్నది. ఆహా! ఏమి ఈ ఆశ్చర్యము! చూడుమా!
అఱియాదార్కు, ఆనాయనాగి ప్పోయ్, ఆయ్ ప్పాడి
ఉఱియార్ నఱువెణ్ణైయ్, ఉణ్డుగన్దాన్ కాణ్ ఏడీ,
ఉఱియార్ నఱువెణ్ణైయ్, ఉణ్డుగన్ద పొన్ వయిర్ట్రుక్కు,
ఎఱినీర్ ఉలగనైత్తుమ్, ఎయ్ దాదాల్ శాழలే ll 1995
ఏడీ=ఓ! నా సఖీ!;(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి) అఱియాదార్కు= ఏమీ తెలియని వారి నడుమ; ఆన్ ఆయన్ ఆగి = పశువులను మేపెడి కులమునకు చెందినవాడుగ అవతరించి; ఆయ్ పాడి = గోకులమున; పోయ్ ఉఱి యార్ నఱు వెణ్ణైయ్ = దొంగతనముగ గృహములందు ప్రవేశించి ఉట్లయందు భద్రపరచియుంచిన పరిమళ భరితమైన వెన్నను; ఉణ్డు ఉగన్దాన్ కాణ్ = ఆరగించి సంతోషించిన వానిని చూడుము!;(అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవయువతి) శాయలే = సఖీ!; ఉఱి యార్ నఱు వెణ్ణైయ్ ఉణ్డు ఉగన్ద పొన్ వయిర్ట్రుక్కు = ఉట్లయందు భద్రపరచియుంచిన పరిమళ భరితమైన వెన్నను ఆరగించి సంతోషించిన దివ్యమైన ఉదరమునకు; ఎఱి నీర్ ఉలగు అనైత్తుమ్ = సముద్రముచే చుట్టుకొనియున్న లోకములన్నియు; ఎయ్ దాదు = సరిపడలేదు; ఆల్ = ఈ ఆశ్చర్యమును చూడుమా!
ఓ! నా సఖీ!;(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి) ఏమీ తెలియనివారి నడుమ పశువులను మేపెడి కులమునకు చెందినవాడుగ అవతరించి గోకులమున దొంగతనముగ గృహములందు ప్రవేశించి ఉట్లయందు భద్రపరచియుంచిన పరిమళభరితమైన వెన్నను ఆరగించి సంతోషించిన వానిని చూడుము! (అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవయువతి) సఖీ!; ఉట్లయందు భద్రపరచియుంచిన పరిమళభరితమైన వెన్నను ఆరగించి సంతోషించిన దివ్యమైన ఉదరమునకు సముద్రముచే చుట్టుకొనియున్న లోకములన్నియు సరిపడలేదు ఈ ఆశ్చర్యమును చూడుమా!
వణ్ణక్కరుఙ్గుழల్, ఆయ్ చ్చియాల్ మొత్తుణ్డు,
కణ్ణి క్కుఱుఙ్గయిర్ట్రాల్, కట్టుణ్డాన్ కాణ్ ఏడీ,
కణ్ణి క్కుఱుఙ్గయిర్ట్రాల్, కట్టుణ్డానాగిలుమ్,
ఎణ్ణఱ్కరియన్, ఇమైయోర్కుమ్ శాழలే ll 1996
ఏడీ=ఓ! నా సఖీ!;(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి)వణ్ణమ్=అందమైన; కరు కుழల్ = నల్లని కుంతలములుగల; ఆయ్ చ్చియాల్ = గోపకాంత యశోదాదేవిచే; మొత్తుణ్డు = దెబ్బలు తిని; కణ్ణి కుఱు కయిర్ట్రాల్ = ముడులు వేసిన అల్పమైన చిన్న తాడుచే; కట్టుణ్డాన్ కాణ్ = కట్టబడియున్నాడు చూడుము!; (అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవ యువతి) శాయలే = సఖీ!; కణ్ణి కుఱు కయిర్ట్రాల్ = ముడులువేసిన అల్పమైన చిన్న తాడుచే; కట్టుణ్డానాగిలుమ్=కట్టబడియున్నను; ఇమైయోర్కుమ్= బ్రహ్మాదిదేవతలకు కూడ; ఎణ్ణఱ్కు = తమ హృదయమున వాని ఔనత్యము తలచుటకు కూడ; అరియన్ = అసాధ్యుడు! (ఇది తెలుసుకొనుమా!)
ఓ! నా సఖీ!;(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి) అందమైన నల్లని కుంతలములుగల గోపకాంత యశోదాదేవిచే దెబ్బలు తిని, ముడులు వేసిన అల్పమైన చిన్న తాడుచే కట్టబడియున్నాడు చూడుము! (అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవ యువతి) సఖీ!ముడులువేసిన అల్పమైన చిన్న తాడుచే కట్టబడియున్నను, బ్రహ్మాదిదేవతలకు కూడ తమ హృదయమున వాని ఔనత్యము తలచుటకు కూడ అసాధ్యుడు! (ఇది తెలుసుకొనుమా!)
కన్ఱ ప్పఱై కఱఙ్గ, కణ్డవర్ తమ్ కణ్ కళిప్ప,
మన్ఱిల్ మరక్కాల్, కూత్తు ఆడినాన్ కాణ్ ఏడీ,
మన్ఱిల్ మరక్కాల్, కూత్తు ఆడినానాగిలుమ్,
ఎన్ఱుమ్ అరియన్, ఇమైయోర్కుమ్ శాழలే ll 1997
ఏడీ=ఓ! నా సఖీ!;(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి) కన్ఱ =శత్రువులు మనస్తాపం పొందనట్లు; పఱై కఱఙ్గ = డప్పులు మ్రోగింపబడుచుండగ;కణ్డవర్ తమ్ కణ్ కళిప్ప=చూచువారియొక్క కన్నులు ఆనందించునట్లు;మన్ఱిల్=నాలుగు వీధుల నడుమ; మరక్కాల్ కూత్తు ఆడినాన్ = ” మరక్కాల్ నృత్యము (కాళ్ళకు కట్టెలు కట్టుకొని దానిపై నిలిచి చేయు నృత్యము)” చేసినవానిని; కాణ్ = చూడుము!; (అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవ యువతి) శాయలే = సఖీ!; మన్ఱిల్=నాలుగు వీధుల నడుమ; మరక్కాల్ కూత్తు ఆడినానాగిలుమ్ = ” మరక్కాల్ నృత్యము (కాళ్ళకు కట్టెలు కట్టుకొని దానిపై నిలిచి చేయు నృత్యము) ” చేసినను; ఇమైయోర్కుమ్=బ్రహ్మాదిదేవతలకు కూడ; ఎన్ఱుమ్ = ఎన్నటికిని; అరియన్ = తెలుసుకొనుటకు దుర్లభుడని తెలుసుకొనుమా!
ఓ! నా సఖీ!(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి) శత్రువులు మనస్తాపం పొందనట్లు, డప్పులు మ్రోగింపబడుచుండగ చూచువారియొక్క కన్నులు ఆనందించునట్లు నాలుగు వీధుల నడుమ” మరక్కాల్ నృత్యము (కాళ్ళకు కట్టెలు కట్టుకొని దానిపై నిలిచి చేయు నృత్యము)” చేసినవానిని చూడుము! (అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవ యువతి) సఖీ! నాలుగు వీధుల నడుమ ” మరక్కాల్ నృత్యము (కాళ్ళకు కట్టెలు కట్టుకొని దానిపై నిలిచి చేయు నృత్యము) ” చేసినను బ్రహ్మాదిదేవతలకు కూడ ఎన్నటికిని తెలుసుకొనుటకు దుర్లభుడను విషయము తెలుసుకొనుమా!
కోదై వేల్ ఐవర్కాయ్, మణ్ణకలమ్ కూఱిడువాన్,
తూదనాయ్ మన్నవనాల్, శొల్ ఉణ్డాన్ కాణ్ ఏడీ,
తూదనాయ్ మన్నవనాల్, శొల్ ఉణ్డానాగిలుమ్,
ఓదనీర్ వైయగమ్, మున్నుఉణ్డుమిழ்న్దాన్ శాழలే ll 1998
ఏడీ=ఓ! నా సఖీ!;(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి) కోదై వేల్ ఐవర్కాయ్ = (రాజులకు లక్షణమైన) పూమాలలును; శూలాయుధము ధరించిన పంచ పాండవులకొరకు; మణ్ అకలమ్ కూఱు ఇడువాన్=(కౌరవులకు,పాండవులకు) భూమిని పంచి సంధిచేయు నిమిత్తమై; తూదన్ ఆయ్ = దూతగ వెడలి; మన్నవనాల్ = రాజైన దుర్యోధనునిచే; శొల్ ఉణ్డాన్ =దూషింపబడిన వానిని; కాణ్ = చూడుము!;(అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవ యువతి) శాయలే=సఖీ!;తూదన్ ఆయ్=దూతగ వెడలి; మన్నవనాల్=రాజైన దుర్యోధనునిచే; శొల్ ఉణ్డానాగిలుమ్=దూషింపబడిన వాడైనను;మున్= మునుపొక కాలమున; ఓదమ్ నీర్ వైయగమ్ = సముద్రముచే చుట్టుకొనియున్న లోకములన్నియు; ఉణ్డు ఉమిழ்న్దాన్ = (ప్రళయకాలమున)తన ఉదరమున ఉంచుకుని రక్షించి, (సృష్టికాలమున) వెలిబుచ్చినవాడని తెలుసుకొనుమా!
ఓ! నా సఖీ!(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి) (రాజులకు లక్షణమైన) పూమాలలును, శూలాయుధము ధరించిన పంచపాండవుల కొరకు,(కౌరవులకు, పాండవులకు) భూమిని పంచి సంధిచేయు నిమిత్తమై దూతగ వెడలి రాజైన దుర్యోధనునిచే దూషింపబడిన వానిని చూడుము!,(అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవ యువతి) సఖీ!దూతగ వెడలి రాజైన దుర్యోధనునిచే దూషింపబడిన వాడైనను, మునుపొకకాలమున సముద్రముచే చుట్టుకొనియున్న లోకములన్నియు (ప్రళయకాలమున) తన ఉదరమున ఉంచుకుని రక్షించి (సృష్టికాలమున) వెలిబుచ్చిన వాడని తెలుసుకొనుమా!
పార్ మన్నర్ మఙ్గ, ప్పడై తొట్టు వెఞ్జమత్తు,
తేర్ మన్నర్ క్కాయ్ అన్ఱు, తేరూర్ న్దాన్ కాణ్ ఏడీ,
తేర్ మన్నర్ క్కాయ్, అన్ఱు తేరూర్ న్దానాగిలుమ్,
తార్ మన్నర్ తఙ్గళ్, తలైమేలాన్ శాழలే ll 1999
ఏడీ=ఓ! నా సఖీ!;(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి) అన్ఱు= భారత యుద్దము జరుగు సమయమున; పార్ మన్నర్ మఙ్గ = భూమియందలి రాజులందరును మరణించునట్లు జరిగిన; వెమ్ శమత్తు = తీవ్రమైన పోరులో; పడై తొట్టు= (తన ప్రతిఙ్ఞకు వ్యతిరేకముగ) ఆయుధము పట్టియు; తేర్ మన్నర్ క్కు = రథయుద్దమున వీరుడైన అర్జునునకు; ఆయ్ = సారథియై; తేర్ ఊర్ న్దాన్ = రథమును నడిపినవానిని; కాణ్ = చూడుము!; (అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవ యువతి) శాయలే = సఖీ!; తేర్ మన్నర్ క్కు = రథయుద్దమున వీరుడైన అర్జునునకు; ఆయ్ = సారథియై; తేర్ ఊర్ న్దా నాగిలుమ్ = రథమును నడిపినవాడైనను; తార్ మన్నర్ తఙ్గళ్=జయమాల అలంకరించిన రాజులందరియొక్క; తలైమేలాన్=శిరోభూషణమని తెలుసుకొనుమా!
ఓ! నా సఖీ!;(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి) భారత యుద్దము జరుగు సమయమున భూమియందలి రాజులందరును మరణించునట్లు జరిగిన తీవ్రమైన పోరులో (తన ప్రతిఙ్ఞకు వ్యతిరేకముగ) ఆయుధము పట్టియు, రథయుద్దమున వీరుడైన అర్జునునకు సారథియై రథమును నడిపినవానిని చూడుము! (అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవ యువతి) సఖీ! రథయుద్దమున వీరుడైన అర్జునునకు సారథియై తేర్ రథమును నడిపినవాడైనను జయమాల అలంకరించిన రాజులందరియొక్క శిరోభూషణమని తెలుసుకొనుమా!
కణ్ణార్ ఇరఙ్గ, క్కழிయ క్కుఱళురువాయ్,
వణ్ తారాన్ వేళ్వియిల్, మణ్ ఇరన్దాన్ కాణ్ ఏడీ,
వణ్ తారాన్ వేళ్వియిల్, మణ్ ఇరన్దానాగిలుమ్,
విణ్డేழுలగుక్కుమ్, మిక్కాన్ కాణ్ శాழలే ll 2000
ఏడీ=ఓ! నా సఖీ!;(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి) కణ్ణార్ = చూచిన వారందరు; ఇరఙ్గ = మనసున జాలికలుగునట్లు; కழிయ కుఱళ్ ఉరువాయ్ = మిక్కిలి చిన్న వామనుని రూపముదాల్చి; వణ్ తారాన్ = తన దాతృత్వ స్వభావమును వ్యక్త పరచెడి విలక్షణమైన మాలనుధరించిన మహాబలి యొక్క; వేళ్వియిల్ = యాగభూమి యందు; మణ్ ఇరన్దాన్ = భూమిని యాచించినవానిని;కాణ్= చూడుము!; (అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవ యువతి) శాయలే = సఖీ!; వణ్ తారాన్ = తన దాతృత్వ స్వభావమును వ్యక్త పరచెడి విలక్షణమైన మాలనుధరించిన మహాబలి యొక్క; వేళ్వియిల్ = యాగభూమి యందు; మణ్ ఇరన్దానాగిలుమ్ = భూమిని యాచించిన వాడైనను; విణ్డు = విష్ణువై; ఏழ் ఉలగుక్కుమ్ = సప్తలోకములందును;మిక్కాన్ కాణ్ = ఔన్నత్యముగల అద్వితీయపురుషుడు సుమా!
ఓ! నా సఖీ!;(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి) చూచిన వారందరు మనసున జాలికలుగునట్లు, మిక్కిలి చిన్న వామనుని రూపముదాల్చి, తన దాతృత్వ స్వభావమును వ్యక్త పరచెడి విలక్షణమైన మాలనుధరించిన మహాబలియొక్క యాగభూమి యందు భూమిని యాచించినవానిని చూడుము!,(అని చెప్పగ,ఆమెకు బదులుగ రెండవ యువతి) సఖీ!,తన దాతృత్వ స్వభావమును వ్యక్త పరచెడి విలక్షణమైన మాలనుధరించిన మహాబలియొక్క యాగభూమియందు భూమిని యాచించినవాడైనను విష్ణువై, సప్తలోకములందును ఔన్నత్యముగల అద్వితీయపురుషుడు సుమా!
** కళ్ళత్తాల్ మావలియై, మూవడి మణ్ కొణ్డు అళన్దాన్,
వెళ్ళత్తాన్, వేఙ్గడత్తాన్ ఎన్బరాల్ కాణ్ ఏడీ,
వెళ్ళత్తాన్, వేఙ్గడత్తానేలుమ్, కలికన్ఱి
ఉళ్ళత్తినుళ్ళే, ఉళన్ కణ్డాయ్ శాழలే ll 2001
ఏడీ=ఓ! నా సఖీ!;(నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి); కళ్ళత్తాల్ = కపట వేషములో; మావలియై = మహాబలివద్దనుండి; మూ అడి మణ్ కొణ్డు = మూడడుగుల భూమిని యాచనచేపొంది; అళన్దాన్ = సప్తలోకములు కొలిచి స్వీకరించినవాడు; (ఏ ఒక్కరికిని సులభుడుకానట్లు) వెళ్ళత్తాన్ = పాలసముద్రమున అమరియున్నవాడు; వేఙ్గడత్తాన్ ఎన్బరాల్ = తిరుమలలో నిలిచియున్నాడని చెప్పుచున్నారు కదా!; కాణ్ = చూడుము!; (అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవ యువతి) శాయలే = సఖీ!; (ఏ ఒక్కరికిని సులబుడుకానట్లు)వెళ్ళత్తాన్ = పాలసముద్రమున అమరియున్నవాడు; వేఙ్గడత్తాన్ ఏలుమ్ = తిరుమలలో నిలిచియున్న వాడైనను; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్ యొక్క; ఉళ్ళత్తిన్ ఉళ్ళే = హృదయమునందే; ఉళన్ కణ్డాయ్ = మిక్కిలి సులభుడై వేంచేసియున్నాడు సుమా!
ఓ! నా సఖీ! (నీవు మిక్కిలి ప్రీతితో స్తుతించుచున్న ఆ స్వామి), కపట వేషములో మహాబలివద్దనుండి మూడడుగుల భూమిని యాచనచేపొంది సప్త లోకములు కొలిచి స్వీకరించినవాడు, (ఏ ఒక్కరికిని సులభుడుకానట్లు) పాలసముద్రమున అమరియున్న వాడు, తిరుమలలో నిలిచియున్నాడని చెప్పుచున్నారు కదా! చూడుము! (అని చెప్పగ, ఆమెకు బదులుగ రెండవ యువతి) సఖీ!, (ఏ ఒక్కరికిని సులబుడుకానట్లు) పాలసముద్రమున అమరియున్నవాడు, తిరుమలలో నిలిచియున్న వాడైనను, తిరుమంగై ఆళ్వార్ యొక్క హృదయమునందే మిక్కిలి సులభుడై వేంచేసియున్నాడు సుమా! చూడుమా!
**********