శ్రీః
6 . మైనిన్ఱ
ప్రళయకాలమున సప్తలోకములను తన ఉదరమున ఉంచుకుని రక్షించిన ఆ సర్వేశ్వరుని చరణారవిందములను ఆశ్రయించి ఉజ్జీవించమని తిరుమంగై ఆళ్వార్ సెలవిచ్చుచున్నారు.
** మైనిన్ఱ కరుఙ్గడల్ వాయ్ ఉలకిన్ఱి, వానవరుమ్ యాముమెల్లామ్,
నెయ్ నిన్ఱ శక్కరత్తన్ తిరువయిర్ట్రిల్, నెడుఙ్గాలమ్ కిడన్దదు ఓరీర్,
ఎన్నన్ఱి శెయ్ దారా, ఏదిలోర్ దెయ్ వత్తై యేత్తుకిన్ఱీర్,
శెయ్ న్నన్ఱి కున్ఱేల్ మిన్, తొణ్డర్ గాళ్ అణ్డనైయే ఏత్తీర్ గళే ll 2002
తొణ్డర్ గాళ్ = (క్షుద్ర దేవతలను ఆశ్రయించిన)భక్తులారా!; మై నిన్ఱ కరు కడల్ వాయ్ = మాయని కాటుకవలె నున్న నల్లని సమద్ర గర్భమున; ఉలగు ఇన్ఱి = లోకములు ఏఒక్కటియు లేకుండ; వానవరుమ్ యాముమ్ ఎల్లామ్= దేవతలు, మనము, సమస్త వస్తువులు; నెయ్ నిన్ఱ శక్కరత్తన్ తిరువయిర్ట్రిల్ = నేతితో మెరుగుపెట్టిన సుదర్శన చక్రముగల సర్వేశ్వరుని దివ్యమైన ఉదరమున; నెడు కాలమ్ కిడన్దదు ఓరీర్ = చిరకాలము అణగియుండి రక్షింపబడిన విషయము పరిశీలించుడు?; ఎన్నన్ఱి శెయ్ దార్ ఆ = ఏమి ఉపకారము చేసితిరని; ఏదిలోర్ దెయ్ వత్తై ఏత్తుకిన్ఱీర్ = విరోధులయొక్క దేవతాంతరములను స్తుతించుచుంటిరి; శెయ్ నన్ఱి కున్ఱేల్ మిన్ = (సర్వేశ్వరునియొక్క) చేసిన మహోపకారమును మరువకండి; అణ్డనైయే = ఆ సర్వేశ్వరునే; ఏత్తీర్ గళే = సేవించి స్తుతించండి!
(క్షుద్ర దేవతలను ఆశ్రయించిన)భక్తులారా! మాయని, కాటుకవలె నున్న నల్లని సమద్ర గర్భమున (ప్రళయకాలమున) లోకములు ఏఒక్కటియు లేకుండ, దేవతలు, మనము, సమస్త వస్తువులు నేతితో మెరుగుపెట్టిన సుదర్శన చక్రముగల సర్వేశ్వరుని దివ్యమైన ఉదరమున చిరకాలము అణగియుండి రక్షింపబడిన విషయము పరిశీలించుడు? ఏమి ఉపకారము చేసితిరని విరోధులయొక్క దేవతాంతరములను స్తుతించుచుంటిరి. (సర్వేశ్వరునియొక్క) చేసిన మహోపకారమును మరువకండి. ఆ సర్వేశ్వరునే సేవించి స్తుతించండి!
నిల్లాద పెరువెళ్ళమ్, నెడువిశుమ్బిన్ మీదు ఓడి నిమిర్ న్దకాలమ్,
మల్లాణ్డ తడక్కైయాల్, పకిరణ్డమకప్పడుత్తకాలత్తు, అన్ఱు
ఎల్లారుమ్ అఱియారో, ఎమ్బెరుమాన్ ఉణ్డుమిழ்న్ద ఎచ్చిల్ తేవర్,
అల్లాదార్ తాముళరే, అవనరుళే ఉలగావదు అఱియీర్ గళే ll 2003
నిల్లాద పెరు వెళ్ళమ్ = ఏ ఒక్క ప్రదేశమునకు పరిమితముగాని మహాప్రళయము; నెడు విశుమ్బిన్ మీదు = విశాలమైన ఆకాశ పర్యంతము; ఓడి = పొంగి; నిమిర్ న్ద కాలమ్= వ్యాపించుచున్న సమయమున;మల్ ఆణ్డ తడ కైయాల్ = శక్తివంతమైన పెద్ద హస్తములతో; పకిరణ్డమ్ = విశ్వమంతను; అగపడుత్త కాలత్తు అన్ఱు = (ప్రళయ జలములు ముంచనీయక) తన ఉదరమున ఉంచుకొనిన ఆ సమయమున; తేవర్ ఎమ్బెరుమాన్ ఉణ్డుమిழ்న్ద ఎచ్చిల్ (ఎన్ఱు) ఎల్లారుమ్ అఱియారో = దేవతలందరు సర్వేశ్వరుడు ఆరగించుటచే ఉదరమున ఉండి తరువాత ఆ స్వామి నోటినుండి ఉమ్మబడినవారని అందరు తెలియకున్నారా?; అల్లాదార్ తామ్ ఉళరే = ఆవిధముగ నోటినుండి ఉమ్మబడనిదేవతలు కలరా? (లేరు); ఉలగు ఆవదు=ఈ లోకము ఇట్టి స్థితి కలిగియుండుట;అవన్ అరుళే=ఆ సర్వేశ్వరుని యొక్క కృపకు అధీనమైయున్నదని; అఱియీర్ గళే = తెలుసుకొనుడు!
ఏ ఒక్క ప్రదేశమునకు పరిమితముగాని మహాప్రళయము విశాలమైన ఆకాశ పర్యంతము పొంగి వ్యాపించుచున్న సమయమున శక్తివంతమైన పెద్ద హస్తములతో విశ్వమంతను (ప్రళయ జలములు ముంచనీయక) తన ఉదరమున ఉంచుకొనిన ఆ సమయమున,దేవతలందరు సర్వేశ్వరుడు ఆరగించుటచే ఉదరమున ఉండి తరువాత ఆ స్వామి నోటినుండి ఉమ్మబడినవారని అందరు తెలియకున్నారా?,ఆవిధముగ నోటినుండి ఉమ్మబడనిదేవతలు కలరా? (లేరు),ఈ లోకము ఇట్టి స్థితి కలిగియుండుట ఆ సర్వేశ్వరునియొక్క కృపకు అధీనమై యున్నదని తెలుసుకొనుడు!
నెర్ట్రిమేల్ కణ్ణానుమ్, నిఱైమొழிవాయ్ నాన్ముగనుమ్ నీణ్డనాల్వాయ్,
ఒర్ట్రైక్కై వెణ్ పగట్టిన్, ఒరువనైయుమ్ ఉళ్ళిట్ట అమరరోడుమ్,
వెర్ట్రిప్పోర్ క్కడలరైయన్, విழுఙ్గామల్ తాన్ విழுఙ్గి ఉయ్యకొణ్డ,
కొర్ట్ర ప్పోరాழிయాన్, కుణమ్ పరవా చ్చిఱు తొణ్డర్ కొడియవాఱే ll 2004
నెర్ట్రిమేల్ కణ్ణానుమ్ = నుదిటియందు నేత్రముగల శివుడును;నిఱై మొழிవాయ్ నాన్ ముగనుమ్ = వేదములు ఉచ్ఛరించు చతుర్ముఖ బ్రహ్మయు; నీణ్డ నాల్ వాయ్ ఒర్ట్రై కై వెణ్ పగట్టిల్ ఒరువనైయుమ్ ఉళ్ళిట్ట = పొడవైన వేలాడుచున్న నోరును,తొండమును కలిగిన (ఐరావతమను) తెల్లని గజమును నడిపించు ఇంద్రుడును మొదలగు; అమరరోడుమ్ = దేవతలందరును; వెర్ట్రి పోర్ కడలరైయన్ విழுఙ్గామల్ = జయశీలుడైన సముద్రరాజు తనగర్భమున చేర్చుకొననీయక; తాన్ విழுఙ్గి = తానే తన ఉదరమున ఉంచుకొని; ఉయ్యకొణ్డ = ఉజ్జీవింపజేసిన; కొర్ట్రమ్ పోర్ ఆழிయాన్=యుద్దములందు జయము పొందెడి సుదర్శనచక్రము ధరించిన సర్వేశ్వరునియొక్క; కుణమ్ పరవా = కల్యాణగుణములను స్తుతించని; శిఱు తొణ్డర్ = అల్పులైన (క్షుద్ర దేవతలను ఆశ్రయించిన)భక్తులు కొడియవాఱే = మిక్కిలి చెడు స్వభావము గలగినట్టివారు సుమా!
నుదిటియందు నేత్రముగల శివుడును, వేదములు ఉచ్ఛరించు చతుర్ముఖ బ్రహ్మయు,పొడవైన వేలాడుచున్న నోరును,తొండమును కలిగిన (ఐరావతమను) తెల్లని గజమును నడిపించు ఇంద్రుడును మొదలగు దేవతలందరును జయశీలుడైన సముద్రరాజు తనగర్భమున చేర్చుకొననీయక తానే తన ఉదరమున ఉంచుకొని ఉజ్జీవింపజేసిన యుద్దములందు జయము పొందెడి సుదర్శనచక్రము ధరించిన సర్వేశ్వరునియొక్క కల్యాణగుణములను స్తుతించని అల్పులైన (క్షుద్ర దేవతలను ఆశ్రయించిన) భక్తులు మిక్కిలి చెడు స్వభావముగలగినట్టివారు సుమా!
పని ప్పరవైత్తిరై తదుమ్బ, ప్పారెల్లామ్ నెడుఙ్గడలే యానకాలమ్,
ఇని క్కళైకణ్ ఇవర్కిలైయెన్ఱు, ఉలగేழிనైయుమ్ ఊழிల్ వాఙ్గి,
ముని త్తలైవన్ ముழఙ్గొళిశేర్, తిరువయిర్ట్రిల్ వైత్తు ఉమ్మై ఉయ్యక్కొణ్డ,
కని క్కళవత్తిరువురువత్తు ఒరువనైయే, కழల్ తొழுమా కల్లీర్గళే ll 2005
పార్ ఎల్లామ్ = భూమండలమంతటను;పని పరవై = చల్లదనము వ్యాపించియున్న; తిరై తదుమ్బ = అలలు ఎగియునట్లు; నెడుమ్ కడలే ఆన కాలమ్ = మహా ప్రళయ జలములు వ్యాపించుచున్న సమయమున; ఇవర్కు = ఈ లోకమందున్నవారికి; ఇని = ఇక; కళై కణ్ ఇల్లై = రక్షకులెవ్వరు లేరని; ఉలగు ఏழிనైయుమ్ = లోకములన్నింటిని; ఊழிల్ వాఙ్గి= తన స్వభావ సిద్దమైన గుణముచే గ్రహించి; ముழఙ్గు ఒళి శేర్ తిరు వయిర్ట్రిల్ వైత్తు = (లోకములు ప్రవేశించుటచే కలిగిన)పెద్ద ఘోషతో నిండిన దివ్యమైన ఉదరమున ఉంచుకొని; ఉమ్మై = మిమ్ములను;ఉయ్యక్కొణ్డ=ఉజ్జీవింపజేసిన; ముని తలైవన్ = ఋషులకు ప్రభువైన; కళవ తిరు ఉరువత్తు ఒరువనైయే = వాక్కాయ ఫలము వలె దివ్యమైన రూపముగల అద్వితీయడైన సర్వేశ్వరునియొక్క;కழల్ తొழுమ్ ఆ= పాదద్వందములను సేవించునట్లుగ; కల్లీర్గళే = అభ్యసించకయుండెదరా?
భూమండలమంతటను చల్లదనము వ్యాపించియున్న అలలు ఎగియునట్లు మహా ప్రళయ జలములు వ్యాపించుచున్న సమయమున, ఈ లోకమందున్నవారికి ఇక రక్షకులెవ్వరు లేరని లోకములన్నింటిని తన స్వభావ సిద్దమైన గుణముచే గ్రహించి (లోకములు ప్రవేశించుటచే కలిగిన)పెద్ద ఘోషతో నిండిన దివ్యమైన ఉదరమున ఉంచుకొని మిమ్ములను ఉజ్జీవింపజేసిన, ఋషులకు ప్రభువైన, వాక్కాయ ఫలము వలె దివ్యమైన రూపముగల అద్వితీయడైన సర్వేశ్వరునియొక్క పాదద్వందములను సేవించునట్లుగ, అభ్యసించకయుండెదరా?
పార్ ఆరుమ్ కాణామే, పరవై మానెడుఙ్గడలే యానకాలమ్,
ఆరానుమ్ అవనుడైయ తిరువయిర్ట్రిల్, నెడుఙ్గాలమ్ కిడన్దదు, ఉళ్ళత్తు
ఓరాద వుణర్విలీర్ ఉణరుదిరేల్, ఉళగళన్ద ఉమ్బర్ కోమాన్,
పేరాళన్ పేరాన, పేర్ గళాయిరఙ్గళుమే పేశీర్ గళే ll 2006
పార్ = భూమియందు; ఆరుమ్ కాణామే = ఏ ఒక్కరును కనబడకుండునట్లు; పరవై మా నెడుమ్ కడలే ఆన కాలమ్ = వ్యాపించుచున్న మహా ప్రళయ జలములు సంభవించిన సమయమున; ఆరానుమ్ = ఎవరైనను;అవనుడైయ తిరువయిర్ట్రిల్ = ఆ సర్వేశ్వరుని దివ్యమైన ఉదరమున; నెడుమ్ కాలమ్ కిడన్దదు = చిరకాలము అణగియుండుటను; ఉళ్ళత్తు = హృదయమున; ఓరాద = చింతించలేని; ఉణర్వు ఇలీర్ = మూర్ఖులారా! (మీరు) ఉణరుదిర్ ఏల్ = (ఆ సర్వేశ్వరుని గొప్పతనమును) తెలసుకొనదలచినచో; ఉళగు అళన్ద=సర్వలోకములను పాదములచే కొలిచిన;ఉమ్బర్ కోమాన్= నిత్యశూరుల నాధుడైన; పేరాళన్ = గొప్పతనము కలిగిన సర్వేశ్వరునియొక్క;పేర్ ఆన=నామములుగ ప్రసిద్ధికెక్కిన; పేర్ గళ్ ఆయిరఙ్గళుమే = సహస్రనామములనే; పేశీర్ గళే = ఆలపించుడు!
భూమియందు ఏ ఒక్కరును కనబడకుండునట్లు వ్యాపించుచున్న మహా ప్రళయ జలములు సంభవించిన సమయమున,ఎవరైనను,ఆ సర్వేశ్వరుని దివ్యమైన ఉదరమున చిరకాలము అణగియుండుటను తమ హృదయమున చింతించలేని, మూర్ఖులారా! (మీరు) (ఆ సర్వేశ్వరుని గొప్పతనమును) తెలసుకొనదలచినచో, సర్వలోకములను పాదములచే కొలిచిన నిత్యశూరుల నాధుడైన, గొప్పతనము కలిగిన సర్వేశ్వరునియొక్క నామములుగ ప్రసిద్ధికెక్కిన సహస్రనామములనే ఆలపించుడు!
పేయిరుక్కు నెడువెళ్ళమ్, పెరువిశుమ్బుమ్ మీదోడి ప్పెరుగుకాలమ్,
తాయిరుక్కుమ్ వణ్ణమే, ఉమ్మై త్తన్ వయిర్ట్రిరుత్తి ఉయ్యకొణ్డాన్,
పోయిరుక్క మర్ట్రిఙ్గోర్, పుదు త్తెయ్ వమ్ కొణ్డాడుమ్ తొణ్డీర్, పెర్ట్ర
తాయిరుక్క మణై వెన్నీరాట్టుదిరో, మాట్టాద తగవర్ట్రీరే ll 2007
పేయ్ ఇరక్కుమ్ = (మనుష్యులు ఏ ఒక్కరును లేనట్లు) పిశాచములే ఉండు; నెడు వెళ్ళమ్ = మహా ప్రళయజలములు; పెరు విశుమ్బుమ్ మీదు ఓడి=విశాలమైన ఆకాశ పర్యంతము వ్యాపించుచు; పెరుగు కాలమ్ = ప్రవహించు సమయమున; తాయ్ ఇరుక్కుమ్ వణ్ణమే= కన్నతల్లి వలె;ఉమ్మై=మిమ్ములను; తన్ వయిఱు= తన ఉదరమున; ఇరుత్తి = ఉంచుకొని; ఉయ్యకొణ్డాన్ =ఉజ్జీవింపజేసిన సర్వేశ్వరుడు; పోయ్ ఇరుక్క = ఎదుటనే ఉండగ;ఇఙ్గు= ఇచట; మర్ట్రు ఓర్ పుదు తైయ్ వమ్=మరియొక క్షుద్రదేవతను; కొణ్డాడుమ్=కొనియాడెడి; తొణ్డీర్= భక్తులారా!; పెర్ట్ర తాయ్ ఇరుక్క=కన్నతల్లి ఎదురగ ఉండగ; (ఇది పుట్టిన బిడ్డకు వేన్నీళ్ళు పోయక)మణై వెన్నీరాట్టుదిరో = అచేతనమైన పీటకు ఉపచారములు సలుపుదురా!;మాట్టాద తగవు అర్ట్రీరే = అపురూపమైన సర్వేశ్వరుని యొక్క కృపకు లక్ష్యము కాకుందురా!
(మనుష్యులు ఏ ఒక్కరును లేనట్లు) పిశాచములే ఉండు మహా ప్రళయజలములు విశాలమైన ఆకాశపర్యంతము వ్యాపించుచు ప్రవహించు సమయమున కన్నతల్లి వలె మిమ్ములను తన ఉదరమున ఉంచుకొని ఉజ్జీవింపజేసిన సర్వేశ్వరుడు ఎదుటనే ఉండగ ఇచట మరియొక క్షుద్రదేవతనుకొనియాడెడి భక్తులారా! కన్నతల్లి ఎదురగ ఉండగ, (ఇది పుట్టిన బిడ్డకు వేన్నీళ్ళు పోయక) అచేతనమైన పీటకు ఉపచారములు సలుపుదురా!, అపురూపమైన సర్వేశ్వరునియొక్క కృపకు లక్ష్యము కాకుందురా!
మణ్ణాడుమ్ విణ్ణాడుమ్, వానవరుమ్ తానవరుమ్ మర్ట్రు మెల్లామ్,
ఉణ్ణాద పెరువెళ్ళమ్, ఉణ్ణామల్ తాన్ విழுఙ్గి ఉయ్యకొణ్డ,
కణ్ణాళన్ కణ్ణమఙ్గైనగరాళన్, కழల్ శూడి అవనై ఉళ్ళత్తు,
ఎణ్ణాద మానిడత్తై, ఎణ్ణాదపోదెల్లామ్ ఇనయవాఱే ll 2008
మణ్ణాడుమ్ విణ్ణాడుమ్ = భూమండలమును, ఊర్ధ్వలోకములును; వానవరుమ్ తానవరుమ్ మర్ట్రుమ్ ఎల్లామ్ = దేవతలు, అసురులు మరియు మిగలిన అన్ని వస్తువులను; ఉణ్ణాద = (కబళించుటకు సిద్ధమగుచున్న) ఇంకను కబళించని; పెరు వెళ్ళమ్ ఉణ్ణామల్ = మహా ప్రళయజలములు పొంగి కబళించనీయక; తాన్ విழுఙ్గి ఉయ్యకొణ్డ = తాను తన ఉదరమున ఉంచుకొని ఉజ్జీవింపజేసిన; కణ్ణాళన్ = గొప్ప గుణములు కలిగిన; కణ్ణమఙ్గైనగరాళన్ = తిరుకణ్ణమఙ్గై దివ్యదేశమునకు ప్రభువైన సర్వేశ్వరునియొక్క; కழల్ శూడి = దివ్యచరణములను శిరస్సున ధరించి; అవనై ఉళ్ళత్తు ఎణ్ణాద మానిడత్తై =ఆ స్వామిని తమ హృదయమున తలచని మనుజులను; ఎణ్ణాద పోదు ఎల్లామ్ ఇనయవాఱే = తలచని సమయమంతయు మిక్కిలి భోగ్యముగనుండును;
భూమండలమును, ఊర్ధ్వలోకములును, దేవతలు, అసురులు మరియు మిగలిన అన్ని వస్తువులను (కబళించుటకు సిద్ధమగుచున్న)ఇంకను కబళించని మహా ప్రళయ జలములు పొంగి కబళించనీయక తాను తన ఉదరమున ఉంచుకొని ఉజ్జీవింపజేసిన, గొప్ప గుణములు కలిగిన తిరుకణ్ణమఙ్గై దివ్యదేశమునకు ప్రభువైన సర్వేశ్వరునియొక్క దివ్యమైన చరణములను శిరస్సున ధరించి, ఆ స్వామిని తమ హృదయమున తలచని మనుజులను, తలచని సమయమంతయు మిక్కిలి భోగ్యముగనుండును సుమా!
మఱమ్ కిళర్ న్ద కరుఙ్గడల్ నీర్, ఉరమ్ తురన్దు పరన్దేఱి అణ్డత్తప్పాల్,
పుఱమ్ కిళర్ న్దు కాలత్తు, ప్పొన్ను లగమేழிనైయుమ్ ఊழிల్ వాఙ్గి,
అఱమ్ కిళర్ న్ద తిరువయిర్ట్రిన్, అగమ్పడియిల్ వైత్తు ఉమ్మై ఉయ్యకొణ్డ,
నిఱమ్ కిళర్ న్దు కరుమ్ శోది, నెడున్దగైయై నినైయాదార్ నీశర్ తామే ll 2009
మఱమ్ కిళర్ న్ద=ప్రాణాంతకమైన;కరుఙ్గడల్ నీర్ = నల్లని సముద్ర జలములు; ఉరమ్= అమిత వేగముతో; తురన్దు = పరుగెడుచు; పరన్దు=చుట్టును వ్యాపించి;అణ్డత్తు అప్పాల్ పుఱమ్ = అండముయొక్క ఆవలవరకు; ఏఱి = వ్యాపించి;కిళర్ న్దు కాలత్తు = వృద్ది పొందుచున్న సమయమున; పొన్ = ఆశింపబడు; ఉలగమ్ ఏழிనైయుమ్ = సమస్త లోకములను;ఊழிల్ వాఙ్గి=తన స్వభావ సిద్దమైన గుణముచే గ్రహించి;అఱమ్ కిళర్ న్ద తిరువయిర్ట్రిన్ అగమ్ పడియిల్ వైత్తు = ధర్మమునకు నిలయమైన దివ్య ఉదరములో ఒకపక్కన ఉంచుకొని; ఉమ్మై ఉయ్యకొణ్డ = మిమ్ములను ఉజ్జీవింపజేసిన; కరు నిఱమ్ కిళర్ న్ద = మిక్కిలి నల్లని వర్ణముతో నిండిన;శోది = తేజస్సుతో ఒప్పు; నెడున్ తగైయై = సర్వేశ్వరుని; నినైయాదార్ తామ్ = చింతించనివారు; నీశర్ =నీచ వర్గము వారగుదురు!
ప్రాణాంతకమైన నల్లని సముద్ర జలములు అమితవేగముతో పరుగెడుచు చుట్టును వ్యాపించి అండముయొక్క ఆవలవరకు వ్యాపించి వృద్ది పొందుచున్న సమయమున ఆశింపబడు సమస్త లోకములను తన స్వభావ సిద్దమైన గుణముచే గ్రహించి ధర్మమునకు నిలయమైన దివ్య ఉదరములో ఒకపక్కన ఉంచుకొని మిమ్ములను ఉజ్జీవింపజేసిన మిక్కిలి నల్లని వర్ణముతో నిండిన తేజస్సుతో ఒప్పు సర్వేశ్వరుని చింతించనివారు నీచ వర్గము వారగుదురు!
అణ్డత్తిన్ ముగడు అழுన్ద, అలైమున్నీర్ తిరై తదుమ్బ ఆవావెన్ఱు,
తొణ్డర్కుమ్ అమరర్కుమ్, మునివర్కుమ్ తానరుళి, ఉలగమేழுమ్
ఉణ్డు ఒత్త తిరువయిర్ట్రిన్, అగమ్పడియిల్ వైత్తు ఉమ్మై ఉయ్యక్కొణ్డ,
కొణ్డల్ కై మణివణ్ణన్, తణ్ కుడన్దైనగర్ పాడి యాడీర్ గళే ll 2010
అణ్డత్తిన్ ముగడు = అణ్డభిత్తి; అழுన్ద=లోపల మునిగియుండునట్లు;అలై మున్నీర్ తిరై తదుమ్బ= అలలుకొట్టుచున్న మహాసముద్రముయొక్క కెరటములు ఎగయుచుండగ; ఆ ఆ ఎన్ఱు = అయ్యయ్యో! అని; తొణ్డర్కుమ్ = భక్తులకు; అమరర్కుమ్ = దేవతలకు; మునివర్కుమ్ = ఋషులకు; తాన్ అరుళి = తాను కరుణించి;ఉలగమ్ ఏழுమ్ ఉణ్డు=సమస్త లోకములు ఆరగించి; ఒత్త = మునపటివలనే ఉండునట్లు; తిరువయిర్ట్రిన్ అగమ్ పడియిల్ వైత్తు = దివ్య ఉదరములో ఒకపక్కన ఉంచుకొని;ఉమ్మై ఉయ్యకొణ్డ= మిమ్ములను ఉజ్జీవింపజేసిన;కొణ్డల్ కై=మేఘమువలె ఉదారమైనవాడును;మణివణ్ణన్= నీలమణివంటి వర్ణముగల సర్వేశ్వరునియొక్క; తణ్ కుడన్దైనగర్ పాడి = చల్లని తిరుకుడందై దివ్యదేశమును పాడి; ఆడీర్ గళే = నృత్యము చేయుడు!
అణ్డభిత్తి లోపల మునిగియుండునట్లు అలలుకొట్టుచున్న మహాసముద్రముయొక్క కెరటములు ఎగయుచుండగ,అయ్యయ్యో! అని భక్తులకు, దేవతలకు, ఋషులకు తాను కరుణించి, సమస్త లోకములు ఆరగించి,మునపటివలనే ఉండునట్లు దివ్య ఉదరములో ఒకపక్కన ఉంచుకొని మిమ్ములను ఉజ్జీవింపజేసిన మేఘమువలె ఉదారమైనవాడును, నీలమణివంటి వర్ణముగల సర్వేశ్వరునియొక్క చల్లని తిరుకుడందై దివ్యదేశమును పాడి, నృత్యము చేయుడు!
** తేవరైయుమ్ అశురైయుమ్, తిశైగళైయుమ్ కడల్ గళైయుమ్ మర్ట్రుమ్ముర్ట్రుమ్,
యావరుయుమ్ ఒழிయామే, ఎమ్బెరుమాన్ ఉణ్డుమిழ்న్దదఱిన్దుశొన్న,
కావళరుమ్బొழிల్ మఙ్గై కలికన్ఱి ఒలిమాలై కర్ట్రువల్లార్,
పూవళరుమ్ తిరుమామగళాలరుళ్ పెర్ట్రు, పొన్నులగిల్ పొలివర్ తామే ll 2011
తేవరైయుమ్ = దేవతలను;అశురైయుమ్ = అసురులను;తిశైగళైయుమ్ = దిక్కులను; కడల్ గళైయుమ్ = సప్తసముద్రములను; మర్ట్రుమ్ మ్ముర్ట్రుమ్ యావరుయుమ్ ఒழிయామే = మరియు మిగిలియున్న సమస్తమును ఏఒక్కటిని వదలక;ఎమ్బెరుమాన్ ఉణ్డు ఉమిழ் న్దదు = సర్వేశ్వరుడు ప్రళయకాలమున తన దివ్యమైన ఉదరమున ఉంచుకొని పిదప వెలిబుచ్చిన విషయమును;అఱిన్దు శొన్న=తమ హృదయమున గ్రహించి అనుగ్రహించిన; కా వళరుమ్ పొழிల్ మఙ్గై = పూల తోటలతో వర్ధిల్లుచున్న తిరుమంగై దేశమునకు ప్రభువైన; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్ యొక్క; ఒలి మాలై=ఈ సూక్తుల మాలను; కర్ట్రువల్లార్ తామ్ = అభ్యసించి మననము చేయువారు; పూ వళరుమ్ తిరుమామగళాల్ అరుళ్ పెర్ట్రు = తామరపుష్పమున వసించుచున్నశ్రీ మహాలక్ష్మియొక్క కృపను పొంది; పొన్ ఉలగిల్ = నిత్యవిభూతిలో; పొలివర్ = ప్రకాశించెదరు!
దేవతలను,అసురులను, దిక్కులను,సప్తసముద్రములను, మరియు మిగిలియున్న సమస్తమును ఏఒక్కటిని వదలక సర్వేశ్వరుడు ప్రళయకాలమున తన దివ్యమైన ఉదరమున ఉంచుకొని పిదప వెలిబుచ్చిన విషయమును, తమ హృదయమున గ్రహించి అనుగ్రహించిన పూల తోటలతో వర్ధిల్లుచున్న తిరుమంగై దేశమునకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ యొక్క ఈ సూక్తుల మాలను అభ్యసించి మననము చేయువారు తామర పుష్పమున వసించుచున్న శ్రీ మహాలక్ష్మియొక్క కృపను పొంది నిత్యవిభూతిలో ప్రకాశించెదరు!
*******