పెరియతిరుమొழி-11వపత్తు (8)

శ్రీః

8  . మార్ట్రముళ

(కోయిల్ తిరుమొழி)

******

                  శ్రీమన్నారాయణుని దివ్యమైన చరణారవిందముల ధ్యానమునందు శరీరసంబంధము వలన కలిగెడి ఇబ్బందులను తొలగించుమని తిరుమంగై ఆళ్వార్ వేడుకొనుచున్నారు.

** మార్ట్రమ్ ఉళ, ఆగిలుమ్ శొల్లువన్, మక్కళ్ 

తోర్ట్ర క్కుழி, తోర్ట్రువిప్పాయ్ కొల్ ఎన్ఱు ఇన్నమ్,

ఆర్ట్రఙ్గరై వాழ் మరమ్ పోల్, అఞ్జుగిన్ఱేన్,

నార్ట్ర చ్చువై, ఊరు ఒలియాగియ నమ్బీ  ll 2022

నార్ట్రమ్ శువై ఊరు ఒలి ఆగియ నమ్బీ=గంధము,రసము; స్పర్శము,శబ్దము మొదలగు ఇంద్రియములకు ప్రభువైన సర్వేశ్వరా!; మార్ట్రమ్ ఉళ ఆగిలుమ్ = (” నీవు ఈ దాసుని నిత్యకైంకర్యములను స్వీకరించలేదు” అని నేను చెప్పిన దానికి  బదులుగా నీకు నాయొక్క  దోషములపై ) చెప్పతగిన మాటలు ఉండినను; శొల్లువన్ = నేను ఒకటి విన్నవించుకొను చున్నాను; మక్కళ్ తోర్ట్రమ్ కుழி ఇన్నమ్ తోర్ట్రు విప్పాయ్ కొల్ ఎన్ఱు = ( నిన్ను శరణు కోరని సాధారణమైన) మనుష్యులగ (కర్మవశముచే) జన్మమెత్తెడి గర్భమున నన్ను  ఇంకను జన్మించునట్లు చేయుదువని తలచి; ఆర్ట్రఙ్గరై వాழ் మరమ్ పోల్= ఉప్పొంగెడి నది యొక్క ఒడ్డునగల చెట్టువలె యున్నానని; అఞ్జుగిన్ఱేన్ = ( కలుగబోవు అపాయమును తలచుకొని) భయపడుచున్నాను!

గంధము,రసము; స్పర్శము,శబ్దము మొదలగు ఇంద్రియములకు ప్రభువైన సర్వేశ్వరా! (” నీవు ఈ దాసుని నిత్యకైంకర్యములను స్వీకరించలేదు” అని నేను చెప్పిన దానికి  బదులుగా నీకు నాయొక్క  దోషములపై ) చెప్పతగిన మాటలు ఉండినను, నేను ఒకటి విన్నవించు కొనుచున్నాను.( నిన్ను శరణుకోరని సాధారణమైన) మనుష్యులగ (కర్మవశముచే) జన్మమెత్తెడి గర్భమున నన్ను  ఇంకను జన్మించునట్లు చేయుదువని తలచి ఉప్పొంగెడి నది యొక్క ఒడ్డునగల చెట్టువలె యున్నానని, (కలుగబోవు అపాయమును తలచుకొని) భయపడుచున్నాను!

శీర్ట్రముళ, ఆగిలుమ్ శెప్పువన్, మక్కళ్ 

తోర్ట్ర క్కుழி, తోర్ట్రువిప్పాయ్ కొల్ ఎన్ఱు అఞ్జి,

కార్ట్రత్తిడైప్పట్ట, కలవర్ మనమ్బోల్,

ఆర్ట్రత్తుళఙ్గా నిఱ్పన్, ఆழிవలవా  ll 2023

ఆழி వలవా=సుదర్శనచక్రము ప్రయోగించెడి సమర్ధతగలవాడా!; శీర్ట్రము ఉళ ఆగిలుమ్ = శ్రీవారి కోపమునకు తగినట్లు నాయందు ఘోర అపరాధములు కలవు అయినను;శెప్పువన్ =  (నీవుతప్ప నాకు వేరుగతి లేదు. కావున ) నేను ఒకటి విన్నవించుకొను చున్నాను;మక్కళ్ తోర్ట్రమ్ కుழி ఇన్నమ్ తోర్ట్రు విప్పాయ్ కొల్ ఎన్ఱు = ( నిన్ను శరణుకోరని సాధారణమైన) మనుష్యులగ (కర్మవశముచే) జన్మమెత్తెడి గర్భమున నన్ను  ఇంకను జన్మించునట్లు చేయుదువని తలచి; అఞ్జి= భయముతో; కార్ట్రత్తు ఇడై పట్ట కలవర్ మనమ్ పోల్ = తుపానులో చిక్కుకొన్న ఓడయందలివారి మనస్సు వలె; ఆర్ట్ర తుళఙ్గా నిఱ్పన్ = మిక్కిలి వణుకుచున్నాను!

        సుదర్శనచక్రము ప్రయోగించెడి సమర్ధతగలవాడా!, శ్రీవారి కోపమునకు తగినట్లు నాయందు ఘోర అపరాధములు కలవు అయినను,(నీవు తప్ప నాకు వేరుగతి లేదు. కావున) నేను ఒకటి విన్నవించుకొను చున్నాను, ( నిన్ను శరణుకోరని సాధారణమైన) మనుష్యులగ (కర్మవశముచే) జన్మమెత్తెడి గర్భమున నన్ను  ఇంకను జన్మించునట్లు చేయుదువని తలచి భయముతో, తుపానులో చిక్కుకొన్న ఓడయందలివారి మనస్సు వలె మిక్కిలి వణుకుచున్నాను!

తూఙ్గార్ పిఱవిక్కళ్, ఇన్నమ్ పుగప్పెయ్ దు,

వాఙ్గాయెన్ఱు శిన్దిత్తు, నానదఱ్కఞ్జి,

పామ్బోడొరు కూరైయిలే, పయిన్ఱాప్పోల్,

తాఙ్గాదు ఉళ్ళమ్ తళ్ళుమ్, ఎన్ తామరైక్కణ్ణా  ll 2024

ఎన్ తామరై కణ్ణా = ఎర్ర తామరపుష్పమువంటి కన్నులుగల నాయొక్క స్వామీ!; తూఙ్గు ఆర్ పిఱవిక్కళ్=అఙ్ఞానముచే నిండియున్న జన్మలలో;ఇన్నమ్ పుగప్పెయ్ దు=ఇంకను ప్రవేశించునటుల చేసి; వాఙ్గాయ్ ఎన్ఱు శిన్దిత్తు =  విమోచనము కలిగించవేమో అని తలచి; నాన్ అదఱ్కు అఞ్జి=నేను ఆ జన్మమరణములకు భయముతో; పామ్బోడు ఒరు  కూరైయిలే పయిన్ఱాప్పోల్=విషసర్పముతో ఒక గృహమున పక్కపక్కనే వసించునట్లు; తాఙ్గాదు ఉళ్ళమ్ తళ్ళుమ్ = (పల పాపములకు కారణముగనుండు శరీరమును పొందుటను) భరించలేని నాయొక్క మనస్సు వ్యధచెందుచున్నది!

ఎర్ర తామరపుష్పమువంటి కన్నులుగల నాయొక్క స్వామీ! అఙ్ఞానముచే నిండియున్న జన్మలలో ఇంకను ప్రవేశించునటుల చేసి, విమోచనము కలిగించవేమో అని తలచి, నేను ఆ జన్మమరణములకు భయముతో, విషసర్పముతో ఒక గృహమున పక్కపక్కనేవసించునట్లు, (పల పాపములకు కారణముగ నుండు శరీరమును పొందుటను) భరించలేని నాయొక్క మనస్సు వ్యధచెందుచున్నది!

ఉరువార్ పిఱవిక్కళ్, ఇన్నమ్ పుగప్పెయ్ దు,

తిరివాయెన్ఱు శిన్దిత్తి, ఎన్ఱు అదఱ్కఞ్జి

ఇరుపాడు ఎరికొళ్ళియిన్, ఉళ్ ఎరుమ్బేపోల్,

ఉరుగా నిఱ్కుమ్ ఎన్నుళ్ళమ్, ఊழிముదల్వా  ll 2025

ఊழி ముదల్వా = ప్రళయకాలమున( సర్వలోకములను తన ఉదరమున ఉంచుకొని) కాచిన ప్రభువా!; ఉరు ఆర్ పిఱవిక్కళ్ = శరీరసంబంధముతో నుండు జన్మలలో;ఇన్నమ్ పుగప్పెయ్ దు = ఇంకను (నన్ను) ప్రవేశించునటుల చేసి;తిరివాయ్ ఎన్ఱు శిన్దిత్తి ఎన్ఱు=(కర్మవశముచే) తిరుగుచుండు విధముగ (నా విషయమున నీవు)హృదయమున తలచు చుంటివేమో? అని; అదఱ్కు అఞ్జి=అంతులేని ఆ జన్మమరణములు కలిగియుండుటకు భయముతో; ఇరు పాడు ఎరి కొళ్ళియిన్ ఉళ్ ఎరుమ్బే పోల్ = రెండువైపుల మంటలు రగులుచున్న కట్టె నడుమ చిక్కుకొన్న చీమవలె; ఎన్ ఉళ్ళమ్ ఉరుగా నిఱ్కుమ్ = నాయొక్క మనస్సు క్లేశముతో కుములి కుములి కరిగిపోవుచున్నది!

ప్రళయకాలమున ( సర్వలోకములను తన ఉదరమున ఉంచుకొని) కాచిన ప్రభువా!, శరీరసంబంధముతో నుండు జన్మలలో ఇంకను (నన్ను) ప్రవేశించు నటుల చేసి, (కర్మవశముచే) తిరుగుచుండు విధముగ (నా విషయమున నీవు) హృదయమున తలచు చుంటివేమో? అని,అంతులేని ఆ జన్మమరణములు కలిగి యుండుటకు భయముతో  రెండువైపుల మంటలు రగులుచున్న కట్టె నడుమ చిక్కుకొన్న చీమవలె నాయొక్క మనస్సు క్లేశముతో కుములి కుములి కరిగిపోవుచున్నది!

కొళ్ళ క్కుఱైయాద, ఇడుమ్బై క్కుழிయిల్,

తళ్ళి ప్పుగప్పెయ్ దికొల్, ఎన్ఱదఱ్కఞ్జి,

వెళ్ళత్తిడైపట్ట, నరియినమ్ పోలే,

ఉళ్ళమ్ తుళఙ్గా నిఱ్పన్, ఊழிముదల్వా  ll 2026

ఊழி ముదల్వా = ప్రళయకాలమున (సర్వలోకములను తన ఉదరమున ఉంచుకొని) కాచిన ప్రభువా!; కొళ్ళ కుఱైయాద ఇడుమ్బై క్కుழிయిల్=ఎంత అనభవించినను తగ్గని పాపములు కలుగజేయు గర్భమున; తళ్ళి పుగప్పెయ్ ది కొల్ ఎన్ఱు = (కర్మవశముచే) నన్ను ప్రవేశించునటుల చేసెదవో నీవుయని;అదఱ్కు అఞ్జి=అంతులేని ఆ జన్మలయొక్క దుఃఖములకు భయముతో; వెళ్ళత్తు ఇడై పట్ట నరి యినమ్ పోలే=వరదలలో చిక్కుకొన్న నక్కలగుంపు వలె; ఉళ్ళమ్ తుళఙ్గా నిఱ్పన్ = మనస్సు దడ దడ లాడుచున్నది!

ప్రళయకాలమున (సర్వలోకములను తన ఉదరమున ఉంచుకొని) కాచిన ప్రభువా!, ఎంత అనభవించినను తగ్గన పాపములు కలుగజేయు, గర్భమున   (కర్మవశముచే) నన్ను ప్రవేశించునటుల చేసెదవో నీవుయని,అంతులేని ఆ జన్మలయొక్క దుఃఖములకు భయముతో, వరదలలో చిక్కుకొన్న నక్కలగుంపు వలె, మనస్సు దడ దడ లాడుచున్నది!

 ** పడై నిన్ఱ, పైన్దామరై యోడు,

అణినీలమ్ మడై నిన్ఱలరుమ్, వయలాలిమణాళా,

ఇడైయిన్ ఎఱిన్ద మరమే, ఒత్తిరామే,

అడైయ అరుళాయ్, ఎనక్కున్దన్ అరుళే  ll 2027

పడై నిన్ఱ = నాగలిచే కలపుమొక్కలను దున్నునపుడు అందు చిక్కుకొని నలిగి నశించక యున్న; పైన్ తామరై యోడు = పచ్చని తామరతూడులును; అణి నీలమ్=సుందరమైన నీలోత్పముల తూడులును; మడై నిన్ఱు అలరుమ్ = జలములు ప్రవహించు చిన్న చిన్న అనకట్టల సమీపమున వికసించుచున్న; వయల్ = పొలములుగల; ఆలి = తిరువాలి దివ్యదేశమున వేంచేసియున్న; మణాళా = ” మణవాళన్ ” యని ఖ్యాతిగల సర్వేశ్వరా!; ఇడైయిన్ ఎఱిన్ద మరమే ఒత్తు ఇరామే = గొల్లవాండ్రు ( తమ పశువులకొరకు) గొడ్డలితో కొమ్మలను నరుకుచుండెడి వృక్షమువలె నేను ఒకవిధముగ వాడిపోయి నశింపనట్లు; అడైయ=నేను నిన్ను పొందునట్లు; ఎనక్కు=ఈ దాసునికి; ఉన్ దన్ అరుళ్ అరుళాయ్ = నీయొక్క కృప ఒసుగుమా!

నాగలిచే కలపుమొక్కలను దున్నునపుడు అందు చిక్కుకొని నలిగినశించకయున్న, పచ్చని తామరతూడులును,సుందరమైన నీలోత్పముల తూడులును,  జలములు ప్రవహించు చిన్న చిన్న అనకట్టల సమీపమున వికసించుచున్న పొలములుగల తిరువాలి దివ్యదేశమున వేంచేసియున్న “మణవాళన్” అని ఖ్యాతిగల సర్వేశ్వరా!, గొల్లవాండ్రు ( తమ పశువులకొరకు) గొడ్డలితో కొమ్మలను నరుకుచుండెడి వృక్షమువలె నేను ఒకవిధముగ వాడిపోయి నశింపనట్లు,నేను నిన్ను  పొందునట్లు, ఈ దాసునికి నీయొక్క కృప ఒసగుమా!

  ** వేమ్బిన్ పుழு, వేమ్బన్ఱి ఉణ్ణాదు, అడియేన్ 

నాన్ పిన్నుమ్, ఉన్ శేవడియన్ఱి నయవేన్,

తేమ్బల్ ఇళమ్ తిఙ్గళ్, శిఱైవిడుత్తు, ఐవర్

పామ్బిన్  అణై, పళ్ళికొణ్డాయ్ పరఞ్జోదీ, 2028

తేమ్బల్ ఇళమ్ తిఙ్గళ్ శిఱై విడుత్తు = క్షీణించుచున్న బాలచంద్రుని లోపములు తొలిగించినవాడును; ఐవర్ పామ్బిన్ అణై = ఐదు పడగల ఆదిశేషుని తల్పముపై;  పళ్ళి కొణ్డాయ్ = పవళించియున్నవాడును; పరఞ్జోదీ = పరంజ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుడా!; వేమ్బిన్ పుழு = వేపచెట్టుపైనుండు పురుగు,వేమ్బు అన్ఱి ఉణ్ణాదు = ఆ వేపచెట్టుయొక్క ఆకులు అలములు తప్ప వేరొకటి తిననట్లు; అడియేన్ నాన్ = నీ దాసుడైన నేను; పిన్నుమ్ = నావిషయమున (నాయొక్క అపరాధములు వలన అమృతమువలె భోగ్యమైన) నీవు  వేపపండువలె యున్నను; ఉన్ శేవడి అన్ఱి =  శ్రీవారి చరణారవిందములు తప్ప వేరొకటి; నయవేన్ = కోరను;

                                    క్షీణించుచున్న బాలచంద్రుని లోపములు తొలిగించినవాడును, ఐదు పడగల ఆదిశేషుని తల్పముపై పవళించియున్నవాడును,పరంజ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుడా! వేపచెట్టుపైనుండు పురుగు,ఆ వేపచెట్టుయొక్క ఆకులు అలములు తప్ప వేరొకటి తిననట్లు నీ దాసుడైన నేను, నావిషయమున (నాయొక్క అపరాధములు వలన అమృతమువలె భోగ్యమైన) నీవు  వేపపండువలె యున్నను  శ్రీవారి చరణారవిందములు తప్ప వేరొకటి  కోరను;

  ** అణియార్ పొழிల్ శూழ், అరఙ్గనగర్ అప్పా,

తుణియేన్ ఇని, నిన్నరుళ్ అల్లదు ఎనక్కు, 

మణియే మణిమాణిక్కమే, మదుశూదా,

పణియాయ్ ఎనక్కు ఉయ్యుమ్ వగై, పరఞ్జోదీ ll2029

అణియార్ పొழிల్ శూழ்= మిక్కిలి అందమైన తోటలతోోో చుట్టుకొనియున్న,అరఙ్గనగర్= శ్రీరంగం దివ్యదేశమున వేంచేసియున్న,అప్పా=నా తండ్రీ,ఇని నిన్ అరుళ్ అల్లదు=  నీయొక్క కృప తప్ప వేరొకటి, ఎనక్కుతుణియేన్=నాకు ఆధారముగ తలచలేను, మణియే= నీలమణివంటి రూపము కలవాడా, మణిమాణిక్కమే= శ్లాఘ్యమైన మాణిక్యము వలె గొప్పతనమును కలిగినవాడా, మదుశూదా= మధువను అసురుని వధించిన వాడా, పరఞ్జోదీ = పరంజ్యోతి స్వరూపుడా,  ఎనక్కు ఉయ్యుమ్ వగై పణియాయ్ = నాకు (జన్మరాహిత్యము కలిగి పరమపదమును పొంది) ఉజ్జీవించెడి విధమును తెలుపుమా!

మిక్కిలి అందమైన తోటలతోోో చుట్టుకొనియున్నశ్రీరంగం దివ్యదేశమున వేంచేసియున్న నా తండ్రీ, నీయొక్క కృప తప్ప వేరొకటి నాకు ఆధారముగ తలచలేను,నీలమణివంటి రూపము కలవాడా, శ్లాఘ్యమైన మాణిక్యము వలె గొప్పతనమును కలిగినవాడా,మధువను అసురుని వధించిన వాడా,  పరంజ్యోతి స్వరూపుడా, నాకు (జన్మరాహిత్యము కలిగి పరమపదమును పొంది) ఉజ్జీవించెడి విధమును తెలుపుమా!

  ** నన్దానరకత్తు అழுన్దావగై, నాళుమ్

ఎన్దాయ్ తొణ్డరానవర్కు, ఇన్నరుళ్ శెయ్ వాయ్,

శన్దోగా తలైవనే, తామరైకణ్ణా,

అన్దో అడియేఱ్కు, అరుళాయ్ ఉన్నరళే  ll       2030

నన్దానరకత్తు=నశించని నరకమయిన జన్మమరణములను దుఃఖసముద్రములో,  అழுన్దావగై= మునగనీయనివిధముగ,నాళుమ్= ఎల్లప్పుడును,తొణ్డర్  ఆనవర్కు= నీయొక్క ఆశ్రితులకు, ఇన్ అరుళ్ శెయ్ వాయ్ = ప్రీతికరమైన కృప చేయుస్వభావము కలవాడా!, ఎన్దాయ్=నాయొక్క స్వామీ!, శన్దోగా= వేదజ్ఞుడా!, తలైవనే=సర్వేశ్వరుడా!, తామరైకణ్ణా= ఎర్రతామరవంటి నేత్రములు కలవాడా!, అన్దో=అయ్యోయని, అడియేఱ్కు= నీదాసుడైన నాకు, ఉన్ అరళే అరుళాయ్ = నీయొక్క దివ్యమైన కృప ఒసగి కరుణించుమా.

నశించని నరకమయిన జన్మమరణములను దుఃఖసముద్రములో,  మునగనీయని విధముగ, ఎల్లప్పుడును నీయొక్క ఆశ్రితులకు, ప్రీతికరమైన కృప చేయుస్వభావము కలవాడా!నాయొక్క స్వామీ!వేదజ్ఞుడా!సర్వేశ్వరుడా! ఎర్రతామరవంటి నేత్రములు కలవాడా! అయ్యోయని,  నీదాసుడైన నాకు, నీయొక్క దివ్యమైన కృప ఒసగి కరుణించుమా.

** కున్ఱమెడుత్తు, ఆనిరైకాత్తవన్దన్నై,

మన్ఱిల్ పుగழ், మఙ్గైమన్ కలికన్ఱి శొల్, 

ఒన్ఱునిన్ఱ ఒన్బదుమ్, వల్లవర్ తమ్మేల్,

ఎన్ఱుమ్ వినైయాయిన, శారగిల్లావే  ll 2031

కున్ఱమెడుత్తు=గోవర్ధనపర్వతమును గొడుగువలె పైకెత్తి (దానిచే భయంకరమైన వర్షమును అడ్డగించి), ఆనిరైకాత్తవన్ తన్నై=గో సమూహములను కాపాడిన సర్వేశ్వరుని విషయమై, మన్ఱిల్ పుగழ்= సభలంతటను కీర్తింపబడు, మఙ్గైమన్=తిరుమఙ్గై దేశ వాసులైన, కలికన్ఱి= తిరుమఙ్గై ఆళ్వార్, శొల్= అనుగ్రహించిన,ఒన్ఱునిన్ఱ ఒన్బదుమ్= ఈపదిపాశురములను, వల్లవర్ తమ్మేల్=పఠించువారిపై,వినై ఆయిన=కర్మములు, ఎన్ఱుమ్=ఎన్నడను, శారగిల్లావే= సమీపమునకు చేరలేవు.

                          గోవర్ధనపర్వతమును గొడుగువలె పైకెత్తి (దానిచే భయంకరమైన వర్షమును అడ్డగించి) గో సమూహములను కాపాడిన సర్వేశ్వరుని విషయమై, సభలంతటను కీర్తింపబడు తిరుమఙ్గై దేశ వాసులైన తిరుమఙ్గై ఆళ్వార్ అనుగ్రహించిన ఈపది పాశురములను పఠించువారిపై కర్మములు ఎన్నడను సమీపమునకు చేరలేవు!

పెరియతిరుమొழி సంపూర్ణం

తిరుమఙ్గై ఆళ్వార్ తిరువడిగళే శరణమ్

***********

వ్యాఖ్యానించండి