పెరియతిరుమొழி-7వపత్తు (1)

శ్రీః 

శ్రీమతే రామనుజాయనమః

తిరుమంగై ఆళ్వార్ ముఖారవిన్దమునుండి వెలువడిన

_______________

పెరియతిరుమొழி-7వపత్తు

____________

శ్రీః

1. కఱవామడనాగు

తిరుమంగై ఆళ్వార్  తనకు ఈ సంసారము సంబంధము లేక శ్రీ వారి సేవయే కరణించమని తిరునఱైయూర్ నమ్బిని కోరుకొనుచున్నారు.

** కఱవా మడనాగు, తన్ కన్ఱు ఉళ్ళినాఱ్పోల్,

మఱవాదడియేన్, ఉన్నైయే అழைక్కిన్ఱేన్,

నఱవార్ పొழிల్ శూழ், నఱైయూర్ నిన్ఱ నమ్బి,

పిఱవామై యెనై ప్పణ్ణి, ఎన్దై పిరానే  ll 1548

నఱవు ఆర్ పొழிల్ శూழ் = తేనెలతోనిండిన తోటలతో చుట్టుకొనియున్న;నఱైయూర్ నిన్ఱ నమ్బి = తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న స్వామీ!; కఱవా మడ నాగు = పాలుతో నిండిన పొదుగు గల లేత ఆవును;తన్ కన్ఱు ఉళ్ళినాల్ పోల్= దానియొక్క దూడ తలచి అరుచునట్లు, అడియేన్=దాసుడైన నేను ;మఱవాదు=(మరువక)ఎడతెగక; ఉన్నైయే అழைక్కిన్ఱేన్ = నిన్నే ఎలుగెత్తి పిలుచుచున్నాను;ఎన్దై పిరానే = నాయొక్క తండ్రీ! స్వామీ!; ఎన్నై పిఱవామై పణ్ణి = నన్ను ఈ సంసారమందు పుట్టకుండునటుల చేయుమా!.

    తేనెలతోనిండిన తోటలతో చుట్టుకొనియున్న తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న స్వామీ! పాలుతో నిండిన పొదుగు గల లేత ఆవును దానియొక్క దూడ తలచి అరుచునట్లు,  దాసుడైన నేను ఎడతెగక నిన్నే ఎలుగెత్తి పిలుచుచున్నాను. నాయొక్క తండ్రీ ! స్వామీ ! నన్ను ఈ సంసారమందు పుట్టకుండునటుల చేయుమా!.  

వర్ట్రాముదునీరొడు, మాల్ వరై యేழுమ్,

తుర్ట్రాగ మున్ తుర్ట్రియ, తొల్ పుగழோనే,

అర్ట్రేనడియేన్,  ఉన్నైయే అழைక్కిన్ఱేన్,o

పెర్ట్రేనరుళ్ తన్దిడు, ఎన్ ఎన్దై పిరానే  ll 1549

వర్ట్రా ముదు నీరొడు = ఒకప్పుడును ఎండి తగ్గిపోని సముద్రములును; మాల్ వరై ఏழுమ్ = పెద్ద కులపర్వతములు ఏడును; మున్ = మునుపొకకాలమున,తుర్ట్రాగ = ఒక కబళమువలె; తుర్ట్రియ=కబళించిన; తొల్ పుగழோనే=శాశ్వతమైన కీర్తిగల స్వామీ! అర్ట్రేన్ అడియేన్= నీయొక్క శేషభూతుడగు దాసుడైన నేను; ఉన్నైయే అழைక్కిన్ఱేన్ = నిన్నే ఎలుగెత్తి పిలుచుచున్నాను;ఎన్దై పిరానే = నాయొక్క తండ్రీ! స్వామీ!;పెర్ట్రేన్ అరుళ్ తన్దిడు =  ఇట్టు నిన్నే ఎలుగెత్తి పిలుచుచుండు భాగ్యమును పొందునట్లు కృపను నాకొసుగుము. 

ఒకప్పుడును ఎండి తగ్గిపోని సముద్రములును,పెద్ద కులపర్వతములు ఏడును, మునుపొకకాలమున ఒక కబళమువలె కబళించిన శాశ్వతమైన కీర్తిగల స్వామీ! నీయొక్క శేషభూతుడగు  దాసుడైన నేను,నిన్నే ఎలుగెత్తి పిలుచుచున్నాను. నాయొక్క తండ్రీ! స్వామీ!, ఇట్టు నిన్నే ఎలుగెత్తి పిలుచుచుండు భాగ్యమును పొందునట్లు కృపను నాకొసుగుము.

తారేన్ పిఱర్కు, ఉన్నరుళ్ ఎన్నిడైవైత్తాయ్,

ఆరేనదువే, పరుగి క్కళిక్కిన్ఱేన్,

కారేయ్ కడలే మలైయే, తిరుక్కోట్టి

యూరే ఉగన్దాయై, యుగన్దు అడియేనే  ll 1550

(తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న స్వామీ!) ఉన్ అరుళ్ ఎన్నిడై వైత్తాయ్ = నీయొక్క దివ్యమైన (ఎలుగెత్తి పిలుచెడి  భాగ్యమును పొందునట్లు)కృపను నాయందు ఉంచితివి; (ఇటువంటి కృపను) పిఱర్ క్కు= వేరెవ్వరికిని; తారేన్ = ఒసగుటకు సమ్మతింపను; కార్ ఏయ్ కడలే= మేఘములు ఆవరించుయుండు పాలసముద్రమును; మలైయే = తిరుమలను; తిరుక్కోట్టియూరే = తిరుకోట్టియూరును; ఉగన్దాయై=దివ్య హృదయమున నిత్యవాసము చేయదలచిన నిన్ను; అడియేన్ ఉగన్దు=ఈ దాసుడు సంతోషముతో; ఆరేన్=హృదయము నిండనివాడైనను;అదువే పరుగి కళిక్కిన్ఱేన్=ఆ కృపనే అనుభవించుచు ఆనందమును పొందుచున్నాను.

        తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న స్వామీ! నీయొక్క దివ్యమైన(నీకై ఎలుగెత్తి పిలుచెడి  భాగ్యమును పొందునట్లు) కృపను నాయందు ఉంచితివి. ఇటువంటి ఈ కృపను వేరెవ్వరికిని ఒసగుటకు సమ్మతింపను. మేఘములు ఆవరించుయుండు పాలసముద్రమును, తిరుమలను,తిరుకోట్టియూరును తమ దివ్య హృదయమున నిత్యవాసము చేయదలచిన నిన్ను ఈ దాసుడు సంతోషముతో మనస్సు నిండనివాడైనను ఆ కృపనే అనుభవించుచు ఆనందమును పొందుచున్నాను.( తిరుమంగై ఆళ్వార్  తనకు తిరునఱైయూర్ నమ్బి నిత్యకైంకర్య సేవ అనుగ్రహించ లేదని మిక్కిలి వేదనతో వాపోయినారు.)

పుళ్వాయ్ పిళన్ద, పునిదా ఎన్ఱழைక్క,

ఉళ్ళే నిన్ఱు, ఎన్నుళ్ళమ్ కుళిరుమొరువా,

కళ్వా, కడన్మల్లై క్కిడన్ద కరుమ్బే,

వళ్లాల్ ఉన్నై, ఎఙ్గనమ్ నాన్మఱక్కేనే  ll 1551

పుళ్ వాయ్ పిళన్ద = బకాసురునియొక్క నోటిని చీల్చి సంహరించిన;పునిదా = పరమ పవిత్రుడా!; ఎన్ఱు అழைక్క = అని నేను ఎలుగెత్తి పిలువగ; ఉళ్ళే నిన్ఱు = నాయొక్క హృదయమందు వేంచేసి;ఎన్ ఉళ్ళమ్ కుళిరుమ్ ఒరువా = నా హృదయ తాపమును చల్లపరచిన అద్వితీయుడా!; కళ్వా = ఎవ్వరికిని తెలియకుండునట్లు గొప్పచేష్టలుచేయు మోసగాడా!; కడల్ మల్లై కిడన్ద కరుమ్బే = కడల్ మల్లై దివ్యదేశమున పవళించియున్న  (చెరకు రసమువలె) పరమభోగ్యుడా!; వళ్లాల్ = ఉదారస్వభావుడా!; ఉన్నై= ఇటువంటి నిన్ను; నాన్ ఎఙ్గనమ్ మఱక్కేనే = నేను ఏవిధముగ మరచిపోగలను స్వామీ!

బకాసురునియొక్క నోటిని చీల్చి సంహరించిన పరమపవిత్రుడా! అని నేను ఎలుగెత్తి పిలువగ నాయొక్క హృదయమందు వేంచేసి నా హృదయ తాపమును చల్లపరచిన అద్వితీయుడా!,ఎవ్వరికిని తెలియకుండునట్లు అతిమానుష చేష్టలుచేయు మోసగాడా!, కడల్ మల్లై దివ్యదేశమున పవళించియున్న (చెరకు రసమువలె) పరమభోగ్యుడా!, ఉదారస్వభావుడా!, ఇటువంటి నిన్ను , నేను ఏవిధముగ మరచిపోగలను స్వామీ!.

విల్లేర్ నుదల్, వేల్ నెడుమ్ కణ్ణియుమ్ నీయుమ్,

కల్లార్ కడుఙ్గానమ్, తిరిన్ద కళిఱే,

నల్లాయ్ నరనారణనే, ఎఙ్గల్ నమ్బీ, 

శొల్లాయ్ ఉన్నై, యాన్ వణఙ్గి త్తొழுమాఱే  ll 1552

విల్ ఏర్ నుదల్ = విల్లు పోలిన కనుబొమలు మరియు; వేల్ నెడుమ్ కణ్ణియుమ్ = శూలమువలె పొడుగైన నేత్రములుగల శ్రీ మహాలక్ష్మియను; నీయుమ్ = నీవును; కల్ ఆర్ కడుమ్ కానమ్ = రాళ్ళతో నిండిన దుర్భరమైన అడవియందు; తిరిన్ద కళిఱే=సంచరించిన ఏనుగువంటివాడా!; నల్లాయ్ = ఆశ్రిత వత్సలుడా!; నర నారణనే = నరనారాయణనునిగ అవతరించినవాడా!; ఎఙ్గల్ నమ్బీ = మాయొక్క వాంఛలను తీర్చగల పరిపూర్ణుడా!,ఉన్నై = ఇటువంటి నిన్ను; యాన్ = దాసుడైన నేను; వణఙ్గి తొழுమ్ ఆఱు = నీ పాదపద్మముల యందు మోకరిల్లి నిత్యకైంకర్యము చేసుకొను విధమును; శొల్లాయ్ = దయతో అనుగ్రహింపవలెను.

      విల్లు పోలిన కనుబొమలు మరియు శూలమువలె పొడుగైన నేత్రములుగల శ్రీ మహాలక్ష్మియును, నీవును, రాళ్ళతో నిండిన దుర్భరమైన అడవి యందు సంచరించిన ఏనుగువంటివాడా!,ఆశ్రిత వత్సలుడా!,నరనారాయణనునిగ అవతరించినవాడా!, మాయొక్క వాంఛలను తీర్చగల పరిపూర్ణుడా!,ఇటువంటి నిన్నుదాసుడైన నేను నీ పాదపద్మములయందు మోకరిల్లి నిత్యకైంకర్యము చేసుకొను విధమును,దయతో అనుగ్రహింపవలెను. 

పనియేయ్ పరమ్ కున్ఱిన్, పవళ త్తిరళే,

మునియే, తిరుమూழிక్కళత్తు విళక్కే,

ఇనియాయ్ తొణ్డరోమ్, పరుగిన్నముదాయ

కనియే, ఉన్నై కణ్డుకొణ్డు ఉయ్ న్దొழிన్దేనే  ll 1553

పని ఏయ్ = హిమము మిక్కుటముగగల; పరమ్ కున్ఱిన్ = శ్లాఘ్యమైన హిమాలయ పర్వతమందుగల తిరుప్పిరిది దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న;పవళ తిరళే= పగడములగుంపువలె అతి సుందరమైనవాడా!;మునియే=ఆశ్రితులయొక్క శ్రేయస్సును చింతించువాడా!; తిరుమూழிక్కళత్తు విళక్కే = తిరుమూழிక్కళత్తు దివ్యదేశమున వెలసిన పరమజ్యోతి స్వరూపుడా!;ఇనియాయ్= పరమభోగ్యుడా!; తొణ్డరోమ్ =నీయొక్క భక్తులైన దాసులగు మేము; పరుగు=పానముచేయు;ఇన్ అముదు ఆయ= మధురమైన అమృతము వంటివాడా!; కనియే = తియ్యని ఫలము వంటివాడా!;ఉన్నై కణ్డుకొణ్డు = ఇటువంటి నిన్ను సేవించుకొని;ఉయ్ న్దు ఒழிన్దేన్ = ఉజ్జీవింపబడితిని. 

హిమము మిక్కుటముగగల శ్లాఘ్యమైన హిమాలయ పర్వతమందుగల తిరుప్పిరిది దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న పగడములగుంపువలె అతి సుందరమైనవాడా!ఆశ్రితులయొక్క శ్రేయస్సును చింతించువాడా!తిరుమూழிక్కళత్తు దివ్యదేశమున వెలసిన పరమజ్యోతి స్వరూపుడా!పరమభోగ్యుడా! నీయొక్క భక్తులైన దాసులగు మేము పానముచేయు మధురమైన అమృతమువంటివాడా! తియ్యని ఫలము వంటివాడా!ఇటువంటి నిన్ను సేవంచుకొని ఉజ్జీవింపబడితిని.

కదియేలిల్లై, నిన్నరుళల్లదెనక్కు,

నిదియే, తిరునీర్మలైనిత్తిలత్తొత్తే,

పదియే పరవిత్తొழுమ్, తొణ్డర్ తమక్కు

క్కదియే, ఉన్నై కణ్డుకొణ్డు ఉయ్ న్దొழிన్దేనే  ll 1554

నిదియే = ఆశ్రితులకు నిధివంటివాడా!; తిరునీర్మలై = తిరునీర్మలై దివ్యదేశమున కృపతో వేంచేసియున్న; నిత్తిలమ్ తొత్తే = ముత్యముల మాలవంటివాడా!; ఎనక్కు = దాసుడైన నాకు; నిన్ అరుళ్ అల్లదు = నీయొక్క కృప తప్ప; కది ఇల్లై = వేరొక ఉపాయము లేదు; పదియే పరవి తొழுమ్ తొణ్డర్ తమక్కు కదియే = దివ్యదేశములను స్తుతించి సేవించెడి భాగవతులయొక్క పరమగతియైనవాడా!; ఉన్నై కణ్డుకొణ్డు =నిన్ను సేవించుకొని; ఉయ్ న్దు ఒழிన్దేన్ = ఉజ్జీవింపబడితిని.

    ఆశ్రితులకు నిధివంటివాడా!తిరునీర్మలై దివ్యదేశమున కృపతో వేంచేసియున్న ముత్యముల మాలవంటివాడా! దాసుడైన నాకు నీయొక్క కృప తప్ప వేరొక ఉపాయము లేదు. దివ్యదేశములను స్తుతించి సేవించెడి భాగవతులయొక్క పరమగతియైనవాడా!  నిన్ను సేవంచుకొని ఉజ్జీవింపబడితిని.

అత్తాఅరియేయెన్ఱు, ఉన్నై అழைక్క

పిత్తా ఎన్ఱు పేశుగిన్ఱార్, పిఱర్ ఎన్నై,

ముత్తే మణిమాణిక్కమే, ముళైకిన్ఱ

విత్తే, ఉన్నై యెఙ్గనమ్ నాన్ విడుకేనే  ll 1555

అత్తా = ఓ! స్వామీ!; అరియే = ఓ! శ్రీ హరీ!; ఎన్ఱు = అను దివ్యనామములతో; ఉన్నై అழைక్క= శ్రీవారిని ఎలుగెత్తి పిలుచుచుండగ; పిఱర్ = పొరుగువారు; ఎన్నై=ఇట్లు పిలుచుచున్న నన్ను చూచి; పిత్తా ఎన్ఱు పేశుగిన్ఱార్ = ” ఓ! పిచ్చివాడా! ” అని చెప్పుచున్నారు; ముత్తే = ముత్యమువంటివాడా!;  మణి మాణిక్కమే = శ్లాఘ్యమైన మాణిక్యమువంటివాడా!; ముళైకిన్ఱ విత్తే = మొలకెత్తుచున్న విత్తనమువలె ఫలము ఒసగు స్వామీ!; ఉన్నై = ఇటువంటి నిన్ను; నాన్ ఎఙ్గనమ్ విడుకేనే = దాసుడైన నేను ఏవిధముగ విడువగలను!.

ఓ! స్వామీ! , ఓ! శ్రీ హరీ!, అను దివ్యనామములతో శ్రీవారిని ఎలుగెత్తి పిలుచుచుండగ, పొరుగువారు, ఇట్లు పిలుచుచున్న నన్ను చూచి ” ఓ! పిచ్చివాడా! ” అని చెప్పుచున్నారు. ముత్యమువంటివాడా! శ్లాఘ్యమైన మాణిక్యము వంటివాడా! మొలకెత్తుచున్న విత్తనమువలె ఫలము ఒసగు స్వామీ! ఇటువంటి నిన్ను దాసుడైన నేను ఏవిధముగ విడువగలను!.

తూయాయ్ శుడర్ మామదిపోల్, ఉయిర్కెల్లామ్

తాయాయ్ అళిక్కిన్ఱ, తణ్ తామరైకణ్ణా,

ఆయా అలైనీరులగేழுమ్, మున్ ఉణ్డ

వాయా, ఉన్నై యెఙ్గనమ్ నాన్ మఱక్కేనే  ll 1556

తూయాయ్ = పరిశుద్దస్వభావుడా!; శుడర్ = ప్రకాశము వెదజల్లు; మా మదిపోల్ = పూర్ణ చంద్రునివలె; ఉయిర్కు ఎల్లామ్ = సకల ప్రాణులకు; తాయ్ ఆయ్ అళిక్కిన్ఱ = మాతృమూర్తివలె కృపజూపుచున్న; తణ్ తామరై కణ్ణా = చల్లని ఎర్రనిపద్మమువంటి నేత్రములుగలవాడా!; ఆయా = గోపాలా!; అలై నీర్ ఉలగ ఏழுమ్ = అలలు గల  సముద్రముచే చుట్టుకొనియున్న సప్తలోకములను; మున్ = మునుపొకకాలమున; ఉణ్డ వాయా = ఆరగించిన దివ్యమైన నోరుగలవాడా!; ఉన్నై=ఇటువంటి నిన్ను;నాన్=దాసుడైన నేను; యెఙ్గనమ్ మఱక్కేనే = ఏ విధముగ మరువగలను!

పరిశుద్దస్వభావుడా!ప్రకాశము వెదజల్లుచున్న పూర్ణ చంద్రునివలె సకల ప్రాణులకు మాతృమూర్తివలె కృపజూపుచున్న చల్లని ఎర్రనిపద్మమువంటి నేత్రములు గలవాడా!,గోపాలా ! అలలు గల సముద్రముచే చుట్టుకొనియున్న సప్తలోకములను మునుపొకకాలమున ఆరగించిన దివ్యమైన నోరుగలవాడా!,ఇటువంటి నిన్ను, దాసుడైన నేను ఏ విధముగ మరువగలను!.

వణ్డార్ పొழிల్ శూழ்,  నఱైయూర్ నమ్బిక్కు, ఎన్ఱుమ్ 

తొణ్డాయ, కలియనొలిశెయ్ తమిழ் మాలై, 

తొణ్డీర్ ఇవై పాడుమిన్, పాడినిన్ఱు ఆడ,

ఉణ్డే విశుమ్బు, ఉన్దమక్కిల్లై తుయిరే  ll 1557

తొణ్డీర్ = ఓ! భక్తులారా!; వణ్డు ఆర్ పొழிల్ శూழ் = భ్రమరములతో నిండిన తోటలతో  చుట్టుకొనియున్న; నఱైయూర్ నమ్బిక్కు = తిరునఱైయూర్ దివ్యదేశమందు కృపతో  వేంచేసియున్న స్వామిని;ఎన్ఱుమ్ తొణ్డాయ=ఎల్లప్పుడు సేవించుకొనుచుండు; కలియన్= తిరుమంగై ఆళ్వార్; ఒలిశెయ్ = అనుగ్రహించిన; తమిழ் మాలై = తమిళ బాషలో నున్నఈ పాశురముల మాలను; పాడుమిన్ = పాడుచుండుడు;పాడి నిన్ఱు ఆడ=ఈవిధముగ  పాడుచు ఆడెడి భాగ్యము కలిగినయెడల;ఉన్ తమక్కు=మీకు; తుయిర్ ఇల్లై = సంసార దుఃఖములు లేకుండపోవును; విశుమ్బు ఉణ్డు = పరమపదము ప్రాప్తమగును!

     ఓ! భక్తులారా! భ్రమరములతో నిండిన తోటలతో చుట్టుకొనియున్న తిరునఱైయూర్ దివ్యదేశమందు కృపతో వేంచేసియున్న స్వామిని ఎల్లప్పుడు సేవించుకొనుచుండు తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన తమిళ బాషలో నున్న ఈ పాశురముల మాలను పాడుచుండుడు. ఈవిధముగ పాడుచు ఆడెడి భాగ్యము కలిగినయెడల మీకు సంసార దుఃఖములు లేకుండపోవును. పరమపదము ప్రాప్తమగును!.

*****

వ్యాఖ్యానించండి