శ్రీః
10 . పెరుమ్బుఱక్కడల్
తిరుక్కణ్ణమఙ్గై దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న భక్తవత్సల పెరుమాళ్ ను దర్శించి తిరుమంగై ఆళ్వార్ అమితానందముతో స్తుతించుచుచున్నారు.
** పెరుమ్ పుఱక్కడలై అడల్ ఏర్ట్రినై, ప్పెణ్ణైయాణై, ఎణ్ణిల్ మునివర్కు అరుళ్
తరుమ్ తవత్తైముత్తిన్ తిరల్ కోవైయై, ప్పత్తరావియై నిత్తిలతొత్తినై,
అరుమ్బినై అలరై అడియేన్ మనత్తాశైయై, అముదమ్ పొదియిన్ శువై,
కరుమ్బినై క్కనియై చ్చెన్ఱునాడి, కణ్ణమఙ్గైయుళ్ కణ్డుకొణ్డేనే ll 1638
పెరుమ్ పుఱమ్ కడలై = విశాలమైన స్థలమందుగల సముద్రమువలె ఊహించలేని స్వరూపము, స్వభావము గలవాడును; అడల్ ఏర్ట్రినై = పోరుసలిపెడి వృషభమువంటి వాడును; పెణ్ణై = స్త్రీ వలె పారతంత్ర్యయ రూపము కలవాడును;ఆణై =స్వతంత్రుడును; ఎణ్ణిల్ మునివర్కు అరుళ్ తరుమ్ తవత్తై = లెక్కలేని యోగులకు కృపజేయు శీలుడును; ముత్తిన్ తిరల్ కోవైయై = ముత్యములను గుంపులు గుంపులుగ కట్టిన మాలవంటి వాడును; పత్తర్ ఆవియై = భక్తులకు ప్రాణము వంటి వాడును; నిత్తిలమ్ తొత్తినై = ముత్యముల గుత్తివలె సౌందర్యము కలిగియున్నవాడును; అరుమ్బినై = మొగ్గవలె అతి సుకుమారమైన వాడును; అలరై = వికసించిన పుష్పము వలె యౌవనముతో నిగనిగ లాడుతూ నుండువాడును; అడియేన్ మనత్తు ఆశైయై=ఈ దాసుని యొక్క మనస్సున గల కోరికకు లక్ష్యమైనవాడును;అముదమ్ పొది ఇన్ శువై కరుమ్బినై = అమృతము నీరువలె పారుచున్నట్లున్న మంచి రుచిగల చెరకురసమువలె మధురమైనవాడును; కనియై = పండువలె భోగ్యమైన సర్వేశ్వరుని; శెన్ఱు నాడి = వెదుకుచు తిరిగి తిరిగి; కణ్ణమఙ్గైయుళ్ = తిరు కణ్ణమఙ్గై దివ్యదేశమున; కణ్డుకొణ్డేన్ =సేవించుకొంటిని!.
విశాలమైన స్థలమందుగల సముద్రమువలె ఊహించలేని స్వరూపము, స్వభావము గలవాడును, పోరుసలిపెడి వృషభమువంటి వాడును, స్త్రీ వలె పారతంత్ర్యయ రూపము కలవాడును, స్వతంత్రుడును,లెక్కలేని యోగులకు కృపజేయు శీలుడును,ముత్యములను గుంపులు గుంపులుగ కట్టిన మాలవంటి వాడును, భక్తులకు ప్రాణము వంటి వాడును, ముత్యముల గుత్తివలె సౌందర్యము కలిగియున్నవాడును, మొగ్గవలె అతి సుకుమారమైన వాడును, వికసించిన పుష్పము వలె యౌవనముతో నిగనిగలాడుతూ నుండువాడును,ఈ దాసుని యొక్క మనస్సునగల కోరికకు లక్ష్యమైన వాడును,అమృతము నీరు వలె పారుచున్నట్లున్న మంచి రుచిగల చెరకు రసమువలె మధురమైన వాడును,పండువలె భోగ్యమైన సర్వేశ్వరుని వెదుకుచు తిరిగి తిరిగి తిరుకణ్ణమఙ్గై దివ్యదేశమున సేవించుకొంటిని!.
మెయ్ న్నలత్తవత్తై త్తివత్తైత్తరుమ్, మెయ్యైప్పొయ్యినై క్కైయిలోర్ శఙ్గుడై,
మైన్నిఱక్కడలై క్కడల్ వణ్ణనై, మాలై ఆలిలై ప్పళ్ళికొళ్ మాయనై,
నెన్నలై ప్పగలై ఇర్ట్రైనాళినై, నాళైయాయ్ వరుమ్ తిఙ్గళై ఆణ్డినై,
కన్నలై కరుమ్బినిడై త్తేఱలై, క్కణ్ణమఙ్గైయుళ్ కణ్డుకొణ్డేనే ll 1639
మెయ్ నలమ్ తవత్తై=నిజమైన మంచి భక్తియోగమునకు ప్రవర్తకుడును;తివత్తై తరుమ్ మెయ్యై=పరమపదమును కలుగజేయు ప్రపత్తియోగమునకు ప్రవర్తకుడును;పొయ్యినై=(తనయందు ప్రీతిలేనివారికి) అసత్యమైనవాడును; కైయిల్ ఓర్ శఙ్గుడై = హస్తమున సాటిలేని పాంచజన్యమను శంఖమును కలవాడును; మై నిఱ కడలై = కాటుకవలె నల్లని వర్ణముగల సముద్రమువంటి వాడును;కడల్ వణ్ణనై=సముద్రమువలె గంభీర స్వభావము కలవాడును;మాలై=అందరికంటె అధికుడును;ఆలిలై పళ్ళి కొళ్ మాయనై= వటదళముపై పవళించిన ఆశ్చర్యభూతుడును; నెన్నలై పగలై = నిన్నటి దినమున అనుభవించిన వస్తువువలెగాక మనస్సును విడిచిపోవని భోగ్యతకలవాడును; ఇర్ట్రై నాళినై = ఇప్పుడు అనుభవించు వస్తువువలెను; నాళైయాయ్ వరుమ్ = ముందు వచ్చెడి దినములందును ఈ విధముగనే అనుభవింప బోగ్యత కలిగియుండువాడును; తిఙ్గళై ఆణ్డినై = మాసములకు,సంవత్సరములకు నిర్వాహకుడును;కన్నలై=పటికబెల్లమువంటి వాడును; కరుమ్బినిడై తేఱలై = చెరకుగడ్డల యొక్క రసమువలె భోగ్యమైన సర్వేశ్వరుని; కణ్ణమఙ్గైయుళ్ = తిరు కణ్ణమఙ్గై దివ్యదేశమున; కణ్డుకొణ్డేన్ =సేవించుకొంటిని!.
నిజమైన మంచి భక్తియోగమునకు ప్రవర్తకుడును,పరమపదమును కలుగజేయు ప్రపత్తియోగమునకు ప్రవర్తకుడును,(తనయందు ప్రీతిలేనివారికి) అసత్యమైన వాడును,హస్తమున సాటిలేని పాంచజన్యమను శంఖమును కలవాడును, కాటుకవలె నల్లని వర్ణముగల సముద్రమువంటి వాడును,సముద్రమువలె గంభీర స్వభావము కలవాడును,అందరికంటె అధికుడును,వటదళముపై పవళించిన ఆశ్చర్యభూతుడును, నిన్నటి దినమున అనుభవించిన వస్తువువలెగాక మనస్సును విడిచిపోవని భోగ్యత కలవాడును, ఇప్పుడు అనుభవించు వస్తువువలెను ముందువచ్చెడి దినములందును ఈ విధముగనే అనుభవింప బోగ్యత కలిగియుండువాడును, మాసములకు, సంవత్సరములకు నిర్వాహకుడును,పటికబెల్లమువంటి వాడును, చెరకుగడ్డల యొక్క రసమువలె భోగ్యమైన సర్వేశ్వరుని తిరుకణ్ణమఙ్గై దివ్యదేశమున సేవించుకొంటిని!.
ఎఙ్గళుక్కు అరళ్ శెయ్ గిన్ఱ ఈశనై, వాశవార్ కుழలాళ్ మలైమఙ్గైతన్
పఙ్గనై, పఙ్గిల్ వైత్తు ఉకన్దాన్ తన్నై, ప్పాన్మయై పని మామదియన్దవழ்,
మఙ్గులై చ్చుడరై వడమామలై యుచ్చియై, నచ్చినామ్ వణఙ్గప్పడుమ్,
కఙ్గులై, పగలై చ్చెన్ఱునాడి, కణ్ణమఙ్గైయుళ్ కణ్డుకొణ్డేనే ll 1640
ఎఙ్గళుక్కు అరళ్ శెయ్ గిన్ఱ ఈశనై=మాయొక్క విషయమున కృపజేయు సర్వేశ్వరుడు; వాశమ్ వార్ కుழలార్ = పరిమళము వెదజల్లు కుంతలములుగల; మలై మఙ్గై తన్ పఙ్గనై=పర్వత పుత్రి పార్వతిని అర్ధశరీరమునగల శివునిని;పఙ్గిల్ వైత్తు ఉకన్దాన్ తన్నై= తన శరీరమున ఒక పక్కనుంచుకొని సంతోషించినవాడును; పాన్మయై = ఇటువంటి సౌశీల్యము కలవాడును;పని మామదిమ్ తవழ் మఙ్గులై = చల్లని పూర్ణచంద్రుడు సంచరించుచున్న ఆకాశముగ నిలిచియున్నవాడును;శుడరై=సూర్యునకు అంతర్యామిగ యున్నవాడును;వడ మా మలై ఉచ్చియై = దక్షణదిక్కునగల వేంకటాచలము యొక్క శిఖరము తానైనవాడును; నచ్చి నామ్ వణఙ్గ పడుమ్ = ఆశతో మనచే సేవింపబడు వాడును; కఙ్గులై పగలై= రాత్రింపగళ్లుకు నిర్వాహకుడైన సర్వేశ్వరుని; శెన్ఱు నాడి = వెదుకుచు తిరిగి తిరిగి; కణ్ణమఙ్గైయుళ్ = తిరు కణ్ణమఙ్గై దివ్యదేశమున; కణ్డుకొణ్డేన్ = సేవించుకొంటిని !.
మాయొక్క విషయమున కృపజేయు సర్వేశ్వరుడు,పరిమళము వెదజల్లు కుంతలములుగల పర్వత పుత్రి పార్వతిని అర్ధశరీరమునగల శివునిని తన శరీరమున ఒక పక్కనుంచుకొని సంతోషించిన వాడును,ఇటువంటి సౌశీల్యము కలవాడును,చల్లని పూర్ణచంద్రుడు సంచరించుచున్న ఆకాశముగ నిలిచియున్నవాడును, సూర్యునకు అంతర్యామిగ యున్నవాడును,దక్షణదిక్కునగల వేంకటాచలము యొక్క శిఖరము తానైనవాడును,ఆశతో మనచే సేవింపబడు వాడును, రాత్రింపగళ్లుకు నిర్వాహకుడైన సర్వేశ్వరుని వెదుకుచు తిరిగి తిరిగి తిరుకణ్ణమఙ్గై దివ్యదేశమున సేవించుకొంటిని!.
పేయ్ ముల్లైత్తలై నఞ్జుణ్డ పిళ్ళైయై, త్తెళ్ళియార్ వణఙ్గప్పడున్దేవనై,
మాయనై మదిళ్ కోవల్ ఇడైకழிమైన్దనై, అన్ఱి అన్దణర్ శిన్దైయుళ్
ఈశనై, ఇలఙ్గుమ్ శుడర్ చ్చోదియై, ఎన్దైయై ఎనక్కు ఎయ్ ప్పినిల్ వైప్పినై,
కాశినై మణియై చ్చెన్ఱునాడి, క్కణ్ణమఙ్గైయుళ్ కణ్డుకొణ్డేనే ll 1641
పేయ్ = రక్కసి పూతనయొక్క; ముల్లై తలై = స్తనములపై రాసుకొనిన;నఞ్జు ఉణ్డ = విషమును ఆరగించిన; పిళ్ళైయై = శిశువును; తెళ్ళియార్=ఙ్ఞానవంతులచే; వణఙ్గ పడుమ్ దేవనై=ఆశ్రయింపబడు దైవమును; మాయనై = ఆశ్చర్యభూతుడును;మదిళ్ కోవల్ ఇడైకழி మైన్దనై=ప్రాకరములుగల తిరు కోవలూర్ దివ్యదేశమున మృకండముని ఇంటి వరండాలో మొదటి ముగ్గురు ఆళ్వార్ ల నడుమ వేంచేసిన నిత్య యౌవనుడును;అన్ఱి=ఇదిగాక; అన్దణర్ శిన్దైయుళ్ ఈశనై =బ్రాహ్మణోత్తములయొక్క హృదయమందుండి వారిని నియమించువాడును;ఇలఙ్గుమ్= ప్రకాశించెడి; శుడర్ శోదియై = ఉజ్వలమైన జ్యోతి స్వరూపుడును; ఎన్దైయై = నాకు స్వామియును;ఎయ్ ప్పినిల్ వైప్పినై = వృద్ధాప్యమున నాకు నిధివంటి ఆపద్బాంధవుడును; కాశినై = బంగారము వంటివాడును; మణియై = రత్నమువంటి సర్వేశ్వరుని;శెన్ఱు నాడి = వెదుకుచు తిరిగి తిరిగి; కణ్ణమఙ్గైయుళ్ = తిరు కణ్ణమఙ్గై దివ్యదేశమున; కణ్డుకొణ్డేన్ = సేవించుకొంటిని !.
రక్కసి పూతనయొక్క స్తనములపై రాసుకొనిన విషమును ఆరగించిన శిశువును, ఙ్ఞానవంతులచే ఆశ్రయింపబడు దైవమును, ఆశ్చర్యభూతుడును, ప్రాకరములు గల తిరు కోవలూర్ దివ్యదేశమున మృకండముని ఇంటి వరండాలో మొదటి ముగ్గురు ఆళ్వార్ ల నడుమ వేంచేసిన నిత్యయౌవనుడును,ఇదిగాక బ్రాహ్మణోత్తములయొక్క హృదయమందుండి వారిని నియమించు వాడును; ప్రకాశించెడి ఉజ్వలమైన జ్యోతి స్వరూపుడును,నాకు స్వామియును, వృద్ధాప్యమున నాకు నిధివంటి ఆపద్బాంధవుడును, బంగారము వంటివాడును,రత్నమువంటి సర్వేశ్వరుని,వెదుకుచు తిరిగి తిరిగి తిరుకణ్ణమఙ్గై దివ్యదేశమున సేవించుకొంటిని!.
** ఏర్ట్రినై యిమయత్తుళెమ్మీశనై, ఇమ్మైయై మఱుమైక్కు మరున్దినై,
ఆర్ట్రలై అణ్డత్తప్పుఱత్తు ఉయ్ త్తిడుమ్ ఐయనై, కైయిలాழிయొన్ఱేన్దియ
కూర్ట్రినై, కురుమామణి కున్ఱినై, నిన్ఱవూర్ నిన్ఱ నిత్తిలత్తొత్తినై,
కార్ట్రినై ప్పునలై చ్చెన్ఱునాడి, క్కణ్ణమఙ్గైయుళ్ కణ్డుకొణ్డేనే ll 1642
ఏర్ట్రినై = వృషభమువలె బలిష్ఠుడును; ఇమయత్తుళ్ ఎమ్ ఈశనై = హిమాలయ పర్వతమందు గల తిరుప్పిరిది దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నాయొక్క స్వామియును; ఇమ్మైయై మఱమైక్కు మరున్దినై = ఈ లోకఫలములకు; పరలోక పురుషార్థములకు కారణభూతుడును;ఆర్ట్రలై = పరిపూర్ణశక్తి తన స్వరూపముగ కలిగిన వాడును; అణ్డత్తు అపుఱత్తు=అణ్డములకు పైనున్న పరమపదమందు; ఉయ్ త్తిడుమ్=(తనకు ప్రీతిపాత్రులైన ఆశ్రితులను) చేర్చుశక్తిగల; ఐయనై = స్వామియును; కైయిల్ = హస్తమున; ఒన్ఱు ఆழி ఏన్దియ = సాటిలేని సుదర్శనచక్రమును ధరించినవాడును; కూర్ట్రినై = విరోధులకు యముడువంటివాడును; కురు మా మణి కున్ఱినై = శ్లాఘ్యమైన నీలమణి పర్వతమువంటి రూపముకలవాడును; నిన్ఱవూర్ నిన్ఱ నిత్తిలత్తొత్తినై = తిరునిన్ఱవూర్ దివ్యదేశమున వేంచేసియున్న ముత్యముల గుత్తి వలె సుందరుడును; కార్ట్రినై=గాలి వలె సుఖమునిచ్చువాడును; పునలై=నీరు వలె ప్రాణము నిలుపువాడైన సర్వేశ్వరుని;శెన్ఱు నాడి = వెదుకుచు తిరిగి తిరిగి; కణ్ణమఙ్గైయుళ్ = తిరు కణ్ణమఙ్గై దివ్యదేశమున; కణ్డుకొణ్డేన్ = సేవించుకొంటిని !
వృషభమువలె బలిష్ఠుడును,హిమాలయపర్వతమందు గల తిరుప్పిరిది దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నాయొక్క స్వామియును,ఈ లోక ఫలములకు; పరలోక పురుషార్థములకు కారణభూతుడును,పరిపూర్ణశక్తి తన స్వరూపముగ కలిగినవాడును, అణ్డములకు పైనున్న పరమపదమందు తనకు ప్రీతిపాత్రులైన ఆశ్రితులను చేర్చుశక్తిగల స్వామియును,హస్తమున సాటిలేని సుదర్శనచక్రమును ధరించినవాడును,విరోధులకు యముడువంటివాడును,శ్లాఘ్యమైన నీలమణి పర్వతమువంటి రూపముకలవాడును, తిరునిన్ఱవూర్ దివ్యదేశమున వేంచేసియున్న ముత్యముల గుత్తి వలె సుందరుడును,గాలి వలె సుఖము నిచ్చువాడును,నీరు వలె ప్రాణము నిలుపువాడైన సర్వేశ్వరుని, వెదుకుచు తిరిగి తిరిగి తిరుకణ్ణమఙ్గై దివ్యదేశమున సేవించుకొంటిని!.
తుప్పనై తురఙ్గమ్పడ చ్చీఱియతోన్ఱలై, చ్చుడర్ వాన్కలన్
పెయ్ దదోర్ శెప్పినై, తిరుమంగై మణాళనై, తేవనై త్తిగழுమ్ పవళత్తొళి
యొప్పనై, ఉలగేழிనై ఊழிయై ఆழிయేన్దియ కైయనై, అన్దణర్
కఱ్పినై, కழுనీర్ మలరుమ్ వయల్, కణ్ణమఙ్గైయుళ్ కణ్డుకొణ్డేనే ll 1643
తుప్పనై = సత్యసంకల్పుడును; తురఙ్గమ్ పడ = అశ్వరూపములో వచ్చిన కేశియను అసురుడు మరణించునట్లు; శీఱియ = కోపగించిన;తోన్ఱలై = గొప్పతనము కలిగిన వాడును; శుడర్ వాన్ కలన్ పెయ్ దదు ఓర్ శెప్పినై = ప్రకాశించెడి శ్లాఘ్యమైన ఆభరణములు ఉంచబడెడి దృఢమైన భోషాణమువంటి వాడును; తిరుమంగై మణాళనై = శ్రీదేవి వల్లభుడును; తేవనై = ఆ శ్రీ దేవి కూడియుండుటచే మిక్కిలి ప్రకాశించువాడును; తిగழுమ్ పవళత్తు ఒళి ఒప్పనై = ప్రకాశించుచుండు పగడముల కాంతితో ఒప్పుచుండువాడును; ఉలగు ఏழிనై = సప్తలోకములకు నియామకుడును; ఊழிయై = కాలమైయుండు వాడును; ఆழி ఏన్దియ కైయనై=సుదర్శనచక్రము ధరించిన హస్తము కలవాడును; అన్దణర్ కఱ్పినై = బ్రాహ్మణోత్తముల ఙ్ఞానమునకు విషయమైన సర్వేశ్వరుని; కழுనీర్ మలరుమ్ వయల్ = ఎర్రకలువలు వికసించుచుండెడి పొలములు గల;కణ్ణమఙ్గైయుళ్ = తిరు కణ్ణమఙ్గై దివ్యదేశమున; కణ్డుకొణ్డేన్ = సేవించుకొంటిని!.
సత్యసంకల్పుడును,అశ్వరూపములో వచ్చిన కేశియను అసురుడు మరణించునట్లు కోపగించిన గొప్పతనము కలిగిన వాడును,ప్రకాశించెడి శ్లాఘ్యమైన ఆభరణములు ఉంచబడెడి దృఢమైన భోషాణమువంటి వాడును,శ్రీదేవి వల్లభుడును, ఆ శ్రీ దేవి కూడియుండుటచే మిక్కిలి ప్రకాశించువాడును,ప్రకాశించుచుండు పగడముల కాంతితో ఒప్పుచుండువాడును,సప్తలోకములకు నియామకుడును, కాలమై యుండువాడును, సుదర్శనచక్రము ధరించిన హస్తము కలవాడును, బ్రాహ్మణోత్తముల ఙ్ఞానమునకు విషయమైన సర్వేశ్వరుని ఎర్రకలువలు వికసించు చుండెడి పొలములు గల తిరుకణ్ణమఙ్గై దివ్యదేశమున సేవించుకొంటిని!.
తిరుత్తనై తిశైనాన్ముగన్ తన్దైయై, త్తేవాదేవనై మూవరిల్ మున్నియ
విరుత్తనై, విలఙ్గుమ్ శుడర్ శోదియై, విణ్ణైమణ్ణినై కణ్ నుతల్ కూడియ
అరుత్తనై, అరియై ప్పరికీఱియ అప్పనై, అప్పిల్ ఆర్ అழలాయ్ నిన్ఱ
కరుత్తనై, కళివణ్డఱైయుమ్ పొழிల్, కణ్ణమఙ్గైయుళ్ కణ్డుకొణ్డేనే ll 1644
తిరుత్తనై = ఎల్లప్పుడు సంతృప్తితోనుండువాడును; తిశై నాన్ముగన్ తన్దైయై = చతుర్ముఖ బ్రహ్మకు జనకుడును,తేవాదేవనై=దేవాదిదేవుడును; మూవరిల్=”హరి, బ్రహ్మ, శివుడు” అనబడు ముగ్గురి మూర్తులలోను; మున్నియ విరుత్తినై = మొదటి వాడైన శ్రీ హరియను ప్రభువును;విలఙ్గుమ్ శుడర్ శోదియై=ప్రకాశించు తేజోరాశిమయమయిన దివ్యమంగళ విగ్రహరూపము కలవాడును; విణ్ణై = పైనున్న లోకములకు నియామకుడును; మణ్ణినై = ఈ భూలోకమునకు నియామకుడును; కణ్ నుతల్ కూడియ అరుత్తనై = నుదిటియందు నేత్రముగల శివునిని తన శరీరమున ఒక పక్కన నుంచుకొనినవాడును; అరియై = హరి యను నామముకలవాడును; పరి కీఱియ అప్పనై = అశ్వరూపములో వచ్చిన కేశియను అసురుని యొక్క నోటిని చీల్చిన ఉపకారకుడును; అప్పిల్ ఆర్ అழలాయ్ నిన్ఱ కరుత్తనై = జలమందలి బడబాగ్ని లీనమైయుండు సంకల్పముకల సర్వేశ్వరుని; కళి వణ్డు అఱైయుమ్ పొழிల్ = సంతోషముతో తుమ్మెదలు ఝంకారము చేయుచుండెడి తోటలు గల; కణ్ణమఙ్గైయుళ్ = తిరు కణ్ణమఙ్గై దివ్యదేశమున; కణ్డుకొణ్డేన్ = సేవించుకొంటిని!.
ఎల్లప్పుడు సంతృప్తితోనుండువాడును,చతుర్ముఖ బ్రహ్మకు జనకుడును, దేవాదిదేవుడును,” హరి, బ్రహ్మ, శివుడు” అనబడు ముగ్గురి మూర్తులలోను మొదటి వాడైన శ్రీ హరియను ప్రభువును,ప్రకాశించు తేజోరాశిమయమయిన దివ్యమంగళ విగ్రహ రూపము కలవాడును,పైనున్న లోకములకు నియామకుడును, ఈ భూలోకమునకు నియామకుడును,నుదిటియందు నేత్రముగల శివునిని తన శరీరమున ఒక పక్కన నుంచుకొనినవాడును,హరియను నామముకలవాడును,అశ్వరూపములో వచ్చిన కేశియను అసురుని యొక్క నోటిని చీల్చిన ఉపకారకుడును,జలమందలి బడబాగ్ని లీనమై యుండు సంకల్పముకల సర్వేశ్వరుని, సంతోషముతో తుమ్మెదలు ఝంకారము చేయుచుండెడి తోటలుగల తిరుకణ్ణమఙ్గై దివ్యదేశమున సేవించుకొంటిని!
వెఞ్జిన క్కళిర్ట్రై విలఙ్గాయ్ వీழ, క్కన్ఱువీశియ ఈశనై, పేయ్ మగళ్
తుఞ్జ నఞ్జు శువైత్తుణ్డ తోన్ఱలై, త్తోన్ఱల్ వాళరక్కన్ కెడ తోన్ఱియ
నఞ్జినై, అముదిత్తినై నాదనై, నచ్చువారుచ్చి మేల్ నిఱ్కుమ్ నమ్బియై,
కఞ్జనై త్తుఞ్జ వఞ్జిత్త వఞ్జనై, కణ్ణమఙ్గైయుళ్ కణ్డుకొణ్డేనే ll 1645
వెమ్ శినమ్ కళిర్ట్రై=క్రూరమైన కోపముగల మదజలము స్రవించు ఏనుగువంటివాడును; విలఙ్గాయ్ వీழ = (అసురుడు ఆవేశించిన) వెలగచెట్టు యొక్క కాయలు రాలి క్రింద పడునట్లు; కన్ఱు = (వేరొక అసుర రూపమున) వచ్చిన దూడను;వీశియ = పట్టుకొని (ఆ అసురులిద్దరు మరణించునట్లు) విసిరిన; ఈశనై = స్వామియును;పేయ్ మగళ్ = రక్కసి పూతన;తుఞ్జ=మరణించునట్లు;నఞ్జు= (ఆమె తన స్తనములందు రాసు కొనిన) విషమును;శువైత్తు ఉణ్డ=రుచి చూచి ప్రాణములను హరించిన; తోన్ఱలై=శిశువును; తోన్ఱల్ వాళ్ అరక్కన్ కెడ = లంకాపురికి ప్రభువైన, ఖడ్గము ఆయుధముగగల రాక్షసుడు రావణాసురుడు నశించునట్లు; తోన్ఱియ నఞ్జినై = అవతరించిన విషము వంటివాడును; అముదిత్తినై = ఆశ్రితులకు అమృతమువంటి భోగ్యమైనవాడును;నాదనై= సర్వజనులకు నాధుడును; నచ్చువార్ ఉచ్చి మేల్ నిఱ్కుమ్ నమ్బియై = తనను ఆశ్రయించినవారికి శిరోభూషణముగనుండు పరిపూర్ణుడును; కఞ్జనై తుఞ్జ వఞ్జిత్త వఞ్జనై = కంసుడు మరణించునట్లు వానిని వంచనచేసిన కపటియైన సర్వేశ్వరుని; కణ్ణమఙ్గైయుళ్ = తిరు కణ్ణమఙ్గై దివ్యదేశమున; కణ్డుకొణ్డేన్ = సేవించుకొంటిని!.
క్రూరమైన కోపముగల మదజలము స్రవించు ఏనుగువంటివాడును, (అసురుడు ఆవేశించిన) వెలగచెట్టు యొక్క కాయలు రాలి క్రింద పడునట్లు(వేరొక అసుర రూపమున) వచ్చిన దూడను పట్టుకొని (ఆ అసురులిద్దరు మరణించునట్లు) విసిరిన స్వామియను, రక్కసి పూతన మరణించునట్లు (ఆమె తన స్తనములందు రాసు కొనిన) విషమును రుచి చూచి ప్రాణములను హరించిన శిశువును, లంకాపురికి ప్రభువైన, ఖడ్గము ఆయుధముగగల రాక్షసుడు రావణాసురుడు నశించునట్లు అవతరించిన విషము వంటివాడును, ఆశ్రితులకు అమృతమువంటి భోగ్యమైనవాడును, తనను ఆశ్రయించినవారికి శిరోభూషణముగనుండు పరిపూర్ణుడును, కంసుడు మరణించునట్లు వానిని వంచనచేసిన కపటియైన సర్వేశ్వరుని తిరుకణ్ణమఙ్గై దివ్యదేశమున సేవించుకొంటిని!
పణ్ణినై ప్పణ్ణిల్ నిన్ఱదోర్ పాన్మైయై, ప్పాలుళ్ నెయ్యినై మాలురువాయ్ నిన్ఱ
విణ్ణినై, విళఙ్గుమ్ శుడర్చోదియై, వేళ్వియై విళక్కినొళితన్నై,
మణ్ణినై మలైయై అలైనీరినై, మాలై మామతియై మఱైయోర్ తఙ్గళ్
కణ్ణినై, కణ్గళారళవుమ్ నిన్ఱు, కణ్ణమఙ్గైయుళ్ కణ్డుకొణ్డేనే ll 1646
పణ్ణినై=సంగీతమువలె ఆనందకరమైనవాడును;పణ్ణిల్ నిన్ఱదు ఓర్ పాన్మైయై=ఆ సంగీతములో నున్న విలక్షణమైన లయబద్దమైన రాగములు తన స్వభావముగ కలవాడును;పాలుళ్ నెయ్యినై=పాలయందు లీనమై గోప్యముగనుండు నెయ్యివలె అంతటను లీనమై గోప్యముగనుండువాడును; మాల్ ఉరువాయ్ నిన్ఱ విణ్ణినై=మిక్కిలి వ్యాపించియున్న నిత్యవిభూతికి నాధుడును;విళఙ్గుమ్ శుడర్ శోదియై= ప్రకాశించుచున్న పరంజ్యోతి స్వరూపుడును; వేళ్వియై = యాగ స్వరూపుడును; విళక్కిన్ ఒళి తన్నై = దీపముయొక్క ప్రకాశమువలె స్వయంప్రకాశకుడును; మణ్ణినై = భూమివలె సహన శీలుడును; మలైయై = పర్వతమువలె కదలింపబడనివాడును; అలై నీరినై = అలలు కొట్టుచున్న నీరువలె సమీపించు వాడును; మాలై = ఆశ్రితుల విషయమున అమిత వ్యామోహముగలవాడును; మా మతియై = శ్లాఘ్యమైన బుద్ధిని ఒసగువాడును; మఱైయోర్ తఙ్గళ్ కణ్ణినై = వేదపండితులకు నేత్రములువలెనుండు సర్వేశ్వరుని; కణ్గళ్ ఆరళవుమ్ నిన్ఱు = నా కన్నులు పూర్తిగ సంతృప్తిపొందునట్లు నిలిచియుండి; తిరు కణ్ణమఙ్గై దివ్యదేశమున; కణ్డుకొణ్డేన్ = సేవించుకొంటిని!.
సంగీతమువలె ఆనందకరమైనవాడును,ఆ సంగీతములోనున్న విలక్షణమైన లయబద్దమైనరాగములు తన స్వభావముగ కలవాడును,పాలయందు లీనమై గోప్యముగనుండు నెయ్యివలె అంతటను లీనమై గోప్యముగనుండువాడును, మిక్కిలి వ్యాపించియున్న నిత్యవిభూతికి నాధుడును,భూమివలె సహన శీలుడును, పర్వతమువలె కదలింపబడనివాడును, అలలు కొట్టుచున్న నీరువలె సమీపించు వాడును, ఆశ్రితుల విషయమున అమిత వ్యామోహముగలవాడును,శ్లాఘ్యమైన బుద్ధిని ఒసగువాడును, వేదపండితులకు నేత్రములువలెనుండు సర్వేశ్వరుని నా కన్నులు పూర్తిగ సంతృప్తి పొందునట్లు నిలిచియుండి, తిరుకణ్ణమఙ్గై దివ్యదేశమున సేవించుకొంటిని!.
** కణ్ణమఙ్గైయుళ్ కణ్డుకొణ్డేనెన్ఱు, కాదలాల్ కలికన్ఱి ఉరైశెయ్ ద,
వణ్ణమ్ ఒణ్ తమిழ் ఒన్బతోడొన్ఱివై, వల్లరాయ్ ఉరైప్పార్ మదియమ్ తవழ்,
విణ్ణిల్ విణ్ణవరాయ్ మగిழ் వెయుదువర్, మెయ్ మై శొల్లిల్ వెణ్ శఙ్గమొన్ఱేన్దియ
కణ్ణ, నిన్ తనక్కుమ్ కుఱిప్పాగిల్ కఱ్కలామ్, కవియిన్పొరుళ్ దానే ll 1647
కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్; కణ్ణమఙ్గైయుళ్ కణ్డుకొణ్డేన్ ఎన్ఱు = ” తిరు కణ్ణమఙ్గై దివ్యదేశమున (భక్తవత్సల పెరుమాళ్ ను)సేవించుకొంటిని”అని; కాదలాల్ ఉరైశెయ్ ద=ప్రీతితో అనుగ్రహించిన; వణ్ణమ్ ఒణ్ తమిழ் ఒన్బతోడు ఒన్ఱు ఇవై = సుందరమైన తమిళ భాషలో నున్న రాగభరితమైన ఈ పది పాశురములు; వల్లర్ ఆయ్ ఉరైప్పార్ = సమర్థులై పఠించువారు; మదియమ్ తవழ் విణ్ణిల్ = చంద్రుడు సంచరించుచున్న పైలోకములను చేరి; విణ్ణవర్ ఆయ్ = దేవతలై; మగిழ்వు ఎయుదువర్ = ఆనందము పొందుదురు; మెయ్ మై శొల్లిల్ = నిజము చెప్పదలచినచో; వెణ్ శఙ్గము ఒన్ఱు ఏన్దియ కణ్ణ=తెల్లని విలక్షణమైన శ్రీ పాంచజన్య శంఖమును ధరించిన స్వామీ!;కుఱిప్పు ఆగిల్ = అంగీకారమైనచో; కవియిన్ పొరుళ్ = ఈ పాశురముల దివ్యమైన అర్ధములు; నిన్ తనక్కుమ్ కఱ్కలామ్ = సర్వఙ్ఞులైన శ్రీవారును విని తెలుసుకొనదగును!.( సర్వేశ్వరునికి తన మహిమ తెలియదని భావము…)
తిరుమంగై ఆళ్వార్ ” తిరు కణ్ణమఙ్గై దివ్యదేశమున(భక్తవత్సల పెరుమాళ్ ను) సేవించుకొంటిని ” అని ప్రీతితో అనుగ్రహించిన, సుందరమైన తమిళబాషలో నున్న రాగభరితమైన ఈ పది పాశురములు సమర్థులై పఠించువారు చంద్రుడు సంచరించుచున్న పైలోకములను చేరి దేవతలై ఆనందము పొందుదురు. నిజము చెప్పదలచినచో, తెల్లని విలక్షణమైన శ్రీ పాంచజన్య శంఖమును ధరించిన స్వామీ! అంగీకారమైనచో, ఈ పాశురముల దివ్యమైన అర్ధములు సర్వఙ్ఞులైన శ్రీవారును విని తెలుసుకొనదగును!.( సర్వేశ్వరునికి తన మహిమ తెలియదని భావము…)
తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం
********