పెరియతిరుమొழி-7వపత్తు (2)

శ్రీః

2. పుళ్ళాయేనముమాయ్

తిరుమంగై ఆళ్వార్ తమ హృదయాంతరాళమున వేంచేసియున్నతిరు నఱైయూర్ నమ్బిని గాంచి పరవశులై స్తుతించుచున్నారు.

** పుళ్ళాయ్ ఏనముమాయ్ పుగున్దు, ఎన్నైయుళ్ళఙ్గొణ్డ

కళ్వా ఎన్ఱలుమ్, ఎన్ కణ్గళ్ నీర్ గళ్ శోర్ దరుమాల్,

ఉళ్ళేనిన్ఱురుగి, నెఞ్జుమున్నై యుళ్ళియక్కాల్,

నళ్ళేన్ ఉన్నై యల్లాల్, నఱైయూర్ నిన్ఱ నమ్బియో  ll 1558

ఓ నఱైయూర్ నిన్ఱ నమ్బీ! = ఓ! తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!; పుళ్ళాయ్ ఏనముమ్ ఆయ్ పుగున్దు=హంసరూపమునుదాల్చి, వరాహరూపము దాల్చియు నాయొక్క హృదయమందు ప్రవేశించి;ఎన్నై ఉళ్ళమ్ కొణ్డ కళ్వా ఎన్ఱలుమ్ = నాయొక్క మనస్సును హరించిన వంచకుడా! అని చెప్పినవెంటనే; ఎన్ కణ్గళ్ = నాయొక్క నేత్రములు;నీర్ గళ్ శోర్ దరుమ్ = కన్నీటి దారలు వర్షించు చున్నది; ఆల్ = ఆహా!; నెఞ్జుమ్ ఉన్నై = నాయొక్క మనస్సు, సర్వేశ్వరుడైన నిన్ను; ఉళ్ళియక్కాల్ = అనుసంధింప మొదలిడిన; ఉళ్ళే నిన్ఱు ఉరుగి = హృదయమందే స్థిరమై ద్రవింప జేయుటచే; ఉన్నై అల్లాల్=ఇటువంటి ప్రీతికి కారకుడైన నీయందు తప్ప వేరొకరియెడల; నళ్ళేన్ = నేను ప్రీతికలిగియుండలేను.

ఓ! తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ! హంసరూపమును దాల్చి, వరాహరూపముదాల్చియు ( లోకమును కరుణతో ఉద్దరించుటయేగాక, దాసుడైన) నాయొక్క హృదయమందు ప్రవేశించి నాయొక్క మనస్సును హరించిన వంచకుడా! అని చెప్పినవెంటనే నాయొక్క నేత్రములు కన్నీటి దారలు వర్షించు చున్నది. ( ఆహా! ఏమి శ్రీవారి కృప! ఇట్లు)  నాయొక్క మనస్సు సర్వేశ్వరుడైన నిన్ను అనుసంధింప మొదలిడిన (నీ కల్యాణగుణములు) హృదయమందే స్థిరమై ద్రవింపజేయుటచే, ఇటువంటి ప్రీతికి కారకుడైన నీయందు తప్ప వేరొకరియెడల నేను ప్రీతికలిగియుండలేను.

ఓడా వాళరియిన్, ఉరువాయ్ మరువి, ఎన్ దన్

మాడే వన్దు, అడియేన్ మనఙ్గొళ్ళవల్ల మైన్దా,

పాడేన్ తొణ్డర్ తమ్మై, క్కవితై ప్పనువల్ కొణ్డు, 

నాడేన్ ఉన్నై యల్లాల్, నఱైయూర్ నిన్ఱ నమ్బియో  ll 1559

ఓడా = లోకమున ఎక్కడను సంచరించని;ఆళ్ అరియిన్ ఉరు ఆయ్=నరసింహ రూపము దాల్చి; ఎన్ దన్ మాడే వన్దు మరువి = నాయొక్క సమీపమందే ఏతెంచి ఆశతో; అడియేన్ = దాసుడైన నాయొక్క; మనమ్ = మనస్సును; కొళ్ళ వల్ల మైన్దా = హరించి చేకొనగల బలవంతుడా!;ఓ నఱైయూర్ నిన్ఱ నమ్బీ=ఓ! తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!; పనువల్ కవితై కొణ్డు = శ్రేష్ఠమైన కవితలచే;తొణ్డర్ తమ్మై = నీచులైన వారిని; పాడేన్ = స్తుతించను; ఉన్నై అల్లాల్ = శ్రీ వారిని విడిచిపెట్టి వేరెవ్వరిని; నాడేన్ = స్తుతించుటకు ప్రయత్నించను.

లోకమున ఎక్కడను సంచరించని నరసింహ రూపము దాల్చి,(ప్రహ్లాదుని రక్షించినట్టి స్వామి) నాయొక్క సమీపమందే ఏతెంచి ఆశతో దాసుడైన నాయొక్క మనస్సును హరించి చేకొనగల బలవంతుడా!, ఓ! తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!,శ్రేష్ఠమైన కవితలచే  నీచులైనవారిని స్తుతించను. శ్రీ వారిని విడిచిపెట్టి వేరెవ్వరిని స్తుతించుటకు ప్రయత్నించను.

ఎమ్మానుమ్ ఎమ్మనైయుమ్, ఎన్నై పెర్ట్రొழிన్ద దఱ్పిన్,

అమ్మానుమ్ అమ్మనైయుమ్, అడియేనుక్కు ఆగినిన్ఱ,

నన్మాన ఒణ్ శుడరే, నఱైయూర్ నిన్ఱ నమ్బీ, ఉన్

మైమ్మాన వణ్ణమల్లాల్, మగిழ் న్దేత్తమాట్టేనే ll 1560

ఎమ్మానుమ్=నాయొక్క తండ్రి; ఎమ్ అనైయుమ్=నాయొక్క తల్లి; ఎన్నై పెర్ట్రు ఒழிన్ద దన్ పిన్ = నాకు జన్మమిచ్చి విడిచినపిదప; అడియేనుక్కు = ఈ దాసునికి; అమ్మానుమ్ అమ్మనైయుమ్ = తండ్రియు,తల్లియు; ఆగి నిన్ఱ = తానే అయిన; నల్ = విలక్షణమైన; మానమ్ = గొప్పతనము కలిగిన; ఒణ్ = అందమైన; శుడరే = తేజస్సుగల;నఱైయూర్ నిన్ఱ నమ్బీ = తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!; ఉన్ మై మానమ్ వణ్ణమ్ అల్లాల్ = శ్రీవారి యొక్క కాటుకవంటి గొప్ప నల్లని తిరుమేని వర్ణమును విడిచి;(వేరెవ్వరిని); మగిழ் న్దు ఏత్తమాట్టేనే=మనసున ఆనందము పొంది స్తుతించను.స్తుతించలేను.

నాయొక్క తండ్రి,నాయొక్క తల్లి,నాకు జన్మమిచ్చి విడిచినపిదప ఈ దాసునికి తండ్రియు, తల్లియు తానే అయిన, విలక్షణమైన, గొప్పతనము కలిగిన,అందమైన తేజస్సుగల  తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!, శ్రీవారి యొక్క కాటుకవంటి గొప్ప నల్లని తిరుమేని వర్ణమును విడిచి (వేరెవ్వరిని) మనసున ఆనందము పొంది స్తుతించను. స్తుతించలేను.

శిఱియాయోర్ పిళ్ళైయుమాయ్, ఉలగుణ్డు ఓరాలిలైమేల్

ఉఱైవాయ్, ఎన్నెఞ్జినుళ్ళే ఉఱైవాయ్, ఉఱైన్దదుతాన్,

అఱియాదిరున్దఱియేన్, అడియేన్ అణివణ్డు కిణ్డుమ్,

నఱైవారుమ్ పొழிల్ శూழ், నఱైయూర్ నిన్ఱ నమ్బియో  ll 1561

అణి వణ్డు = అందమైన భ్రమరములు;కిణ్డుమ్= తొలుచు చుండెడి;నఱై వారుమ్ పొழிల్ శూழ்=తేనెలు కారుచుండెడి తోటలతో చుట్టుకొనియున్న; ఓ నఱైయూర్ నిన్ఱ నమ్బీ=ఓ! తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!; శిఱియాయోర్ పిళ్ళైయుమ్ ఆయ్ = మిక్కిలి చిన్నబాలుడై; ఉలగు ఉణ్డు = సర్వలోకములను ఆరగించి; ఓర్ ఆల్ ఇలై మేల్ = ఒక వటదళముపై; ఉఱైవాయ్ = పవళించినవాడా!; ఎన్ నెఞ్జిన్ ఉళ్ళే ఉఱైవాయ్ = నాయొక్క హృదయాంతరాళమున వసించుచున్నవాడా!; ఉఱైన్దదు తాన్ = (శ్రీవారు ఈవిధముగ నా హృదయమందు) వసించి కృపజేసినది; అడియేన్=దాసుడైన నేను;అఱియాదిరున్దఱియేన్=తెలుసుకొనక ఉండినవాడనుకాను.

      అందమైన భ్రమరములు తొలుచుచుండెడి, తేనెలు కారుచుండెడి తోటలతో చుట్టుకొనియున్న,ఓ! తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!,మిక్కిలి చిన్నబాలుడై సర్వలోకములను ఆరగించి ఒక వటదళముపై పవళించినవాడా!, నాయొక్క హృదయాంతరాళమున వసించు చున్నవాడా!,శ్రీవారు ఈవిధముగ నా హృదయమందు వసించికృపజేసినది దాసుడైన నేను తెలుసుకొనక ఉండినవాడనుకాను.

నీణ్డాయై వానవర్ గళ్, నినైన్దేత్తి కాణ్బరిదాల్,

ఆణ్డాయ్ ఎన్ఱాదరిక్క ప్పడువాయ్ క్కు, నాన్అడిమై

పూణ్డేన్, ఎన్నెఞ్జినుళ్ళే, పుగున్దాయై ప్పోగలొట్టేన్, 

నాణ్డాన్ ఉనక్కొழிన్దేన్, నఱైయూర్ నిన్ఱ నమ్బియో  ll 1562

ఓ నఱైయూర్ నిన్ఱ నమ్బీ = ఓ! తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!; నీణ్డాయై= స్వరూప,రూప,గుణ,విభూతులయందు ఎల్లలులేని సర్వేశ్వరుడైన నిన్ను; వానవర్ గళ్=బ్రహ్మ మొదలగు దేవతలు;నినైన్దు=ధ్యానించి; ఏత్తి = స్తుతించి; కాణ్బు అరిదు = తెలుసుకొనెడిది అసాధ్యమైన విషయము; ఆణ్డాయ్ ఎన్ఱు ఆదరిక్క పడు వాయ్ క్కు= “సర్వేశ్వరా!” అని మాత్రమే పలికి దేవతలు ఆదరించుచు స్తుతింపబడు నీయొక్క విషయమై; నాన్ అడిమై పూణ్డేన్ = నేను కైంకర్యసేవను చేయ పూనుకొంటిని; ( నిర్హేతుకకృపచే ) ఎన్నెఞ్జిన్ ఉళ్ళే పుగున్దాయై = నాయొక్క హృదయాంతరాళమున ప్రపేశించియున్న నిన్ను; పోగల్ ఒట్టేన్ = ఇక వేరొకస్థలమునకు పోవుటకు సమ్మతింపను; (శేషభూతుడైన నేను శ్రీవారిని నిర్భంధము చేసి) ఉనక్కు= శ్రీవారివిషయమున;నాన్ దాన్ ఒழிన్దేన్ = నేను లజ్జలేనివాడనై ప్రవర్తించుచున్నాను.

ఓ! తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!;  స్వరూప,రూప,గుణ, విభూతులయందు ఎల్లలులేని సర్వేశ్వరుడైన నిన్ను బ్రహ్మ మొదలగు దేవతలు ధ్యానించి, స్తుతించి తెలుసుకొనెడిది అసాధ్యమైన విషయము, “సర్వేశ్వరా!” అని మాత్రమే దేవతలు పలికి, ఆదరించుచు స్తుతింపబడు నీయొక్క విషయమై నేను కైంకర్యసేవను చేయ పూనుకొంటిని.నిర్హేతుకకృపచే నాయొక్క హృదయాంతరాళమున ప్రపేశించియున్న నిన్ను ఇక వేరొకస్థలమునకు పోవుటకు సమ్మతింపను.(శేషభూతుడైన నేను శ్రీవారిని నిర్భంధము చేసి) శ్రీవారివిషయమున నేను లజ్జలేనివాడనై ప్రవర్తించుచున్నాను.

ఎన్ తాదై తాదై అప్పాల్, ఎழுవర్ పழ అడిమై,

వన్దార్, ఎన్నెఞ్జినుళ్ళే,  వన్దాయై పోగలొట్టేన్,

అన్దో ఎన్నారుయిరే, అరశే అరుళెనక్కు, 

నన్దామల్ తన్ద ఎన్దాయ్, నఱైయూర్ నిన్ఱ నమ్బియో  ll 1563

ఎన్ ఆర్ ఉయిరే = నాకు మిక్కిలి ప్రియమైన ప్రాణభూతుడా!; అరశే = నన్ను పాలించు స్వామీ!; అరుళ్ = కృపను; నన్దామల్ = ఎటువంటి కొరతలేక; తన్ద = ఒసగిన;ఎన్దాయ్= నాయొక్క స్వామీ!; ఓ నఱైయూర్ నిన్ఱ నమ్బీ = ఓ! తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!;ఎమ్ తాదై  తాదై= నేను,నాయొక్క తండ్రి నాతండ్రికి తండ్రి; అప్పాల్ ఎழுవర్ = వారిపై ఏడుతరములవారందరు; పழఅడిమై వన్దార్ = స్వభావసిద్దముగ శ్రీవారి కైంకర్యసేవను చేయచు వచ్చుచున్నారు; ఎన్ నెఞ్జిన్ ఉళ్ళే = నాయొక్క హృదయాంతరాళమున; వన్దాయై=ఏతెంచి సేవనొసగిన నిన్ను;పోగలొట్టేన్=ఇక వేరొకస్థలమునకు పోవుటకు సమ్మతింపను.

    నాకు మిక్కిలి ప్రియమైన ప్రాణభూతుడా!,నన్ను పాలించు స్వామీ! తమ కృపను ఎటువంటి కొరతలేక ఒసగిన నాయొక్క స్వామీ!,ఓ! తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!,నేను,నాయొక్క తండ్రి, నాతండ్రికి తండ్రి,వారిపై ఏడుతరములవారందరు స్వభావసిద్దముగ శ్రీవారి కైంకర్యసేవను చేయచు వచ్చుచున్నారు. నాయొక్క హృదయాంతరాళమున ఏతెంచి సేవనొసగిన నిన్ను ఇక వేరొక స్థలమునకు పోవుటకు సమ్మతింపను.

మన్నఞ్జ ఆయిరన్దోళ్, మழுవిల్ తుణిత్తమైన్దా,

ఎన్నెఞ్జిత్తుళ్ళిరున్దు, ఇఙ్గిని ప్పోయ్ ప్పిఱరొరువర్,

వన్నెఞ్జ మ్పుక్కిరుక్కవొట్టేన్, వళైత్తువైత్తేన్,

నన్నెఞ్జ అన్నమన్నుమ్, నఱైయూర్ నిన్ఱ నమ్బియో  ll 1564

నల్ నెఞ్జమ్=మంచి కరుణతోకూడిన హృదయముగల; అన్నమ్=హంసగమనముగల శ్రీ మహాలక్ష్మి; మన్నుమ్ = వక్షస్థలమున నివసించుచున్న; ఓ నఱైయూర్ నిన్ఱ నమ్బీ = ఓ! తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!;మన్ అఞ్జ = క్షత్రీయరాజులందరు భయపడునట్లు; ఆయిరమ్ తోళ్ =( కార్త్యవీర్యార్జునునియొక్క) సహస్ర భుజములను; మழுవిల్ = గండ్రగొడ్డలిచే; తుణిత్త = ఖండించిన;మైన్దా=మిక్కిలి బలశాలియైన స్వామీ!; ఎన్ నెఞ్జిత్తుళ్ ఇరున్దు = నాయొక్క హృదయమునందుండి (కైంకర్యసేవ స్వీకరించు శ్రీవారిని)ఇని = ఇకపై; ఇఙ్గు పోయ్ = ఇచటనుండి వేరొక స్థలమునకు పోయి; పిఱర్ ఒరువర్ =వేరొకరియొక్క; వల్ నెఞ్జమ్ = కఠినమైన మనస్సులో; పుక్కు ఇరుక్క వొట్టేన్ = ప్రవేశించి యుండుటకు సమ్మతింపను; వళైత్తు వైత్తేన్ = శ్రీవారిని అడ్డగించుచున్నాను.

        మంచి కరుణతోకూడిన హృదయముగల,హంసగమనముగల శ్రీ మహాలక్ష్మి   వక్షస్థలమున నివసించుచున్న,ఓ! తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!, క్షత్రీయ రాజులందరు భయపడునట్లు కార్త్యవీర్యార్జునునియొక్క సహస్ర భుజములను ఖండించిన మిక్కిలి బలశాలియైన స్వామీ!, నాయొక్క హృదయమునందుండి కైంకర్యసేవ స్వీకరించు మిమ్ము ఇకపై ఇచటనుండి వేరొక స్థలమునకు పోయి వేరొకరియొక్క కఠినమైన మనస్సులో ప్రవేశించి యుండుటకు సమ్మతింపను. శ్రీవారిని అడ్డగించుచున్నాను.

ఎప్పోదుమ్ పొన్మలరిట్టు, ఇమైయోర్ తొழுదు, తఙ్గళ్

కైప్పోదుకొణ్డు ఇఱైఞ్జి, క్కழల్ మేల్ వణఙ్గ నిన్ఱాయ్,

ఇప్పోదెన్నెఞ్జినుళ్ళే, పుగున్దాయై ప్పోగలొట్టేన్, 

నఱ్పోదు వణ్డు కిణ్డుమ్, నఱైయూర్ నిన్ఱ నమ్బియో  ll 1565

నల్ పోదు వణ్డు కిణ్డుమ్ = మంచి పుష్పములను భ్రమరములు తొలుచుచుండెడి; ఓ నఱైయూర్ నిన్ఱ నమ్బీ = తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న ఓ! స్వామీ!; ఇమైయోర్= నిత్యశూరులు; ఎప్పోదుమ్=అన్ని వేళలయందు; పొన్ మలరిట్టు= మంచి పరిమళభరితమైన పుష్పములను సమర్పించి; తొழுదు=సేవించి; తఙ్గళ్ కై పోదు కొణ్డు ఇఱైఞ్జి = తమయొక్క పుష్పముల వంటి చేతులను జోడించి అంజలిచేసి;కழల్ మేల్ వణఙ్గ నిన్ఱాయ్=శ్రీవారి దివ్య చరణములందు ఆశ్రయించునట్లు నిలిచియున్న స్వామీ!; ఇప్పోదు = ఇపుడు; ఎన్ నెఞ్జినుళ్ళే పుగున్దాయై = నాయొక్క హృదయాంతరాళమున ప్రపేశించియున్న శ్రీవారిని; పోగల్ ఒట్టేన్ = ఇక వేరొక స్థలమునకు పోవుటకు సమ్మతింపను;

మంచి పుష్పములను భ్రమరములు తొలుచుచుండెడి,తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న ఓ! స్వామీ!,నిత్యశూరులు అన్ని వేళలయందు మంచి పరిమళభరితమైన పుష్పములను సమర్పించి,సేవించి,తమయొక్క పుష్పములవంటి చేతులను జోడించి అంజలిచేసి శ్రీ వారి దివ్య చరణములందు ఆశ్రయించునట్లు నిలిచియున్న స్వామీ!, (తమ నిర్హేతుకకృపచే) ఇపుడు నాయొక్క హృదయాంతరాళమున ప్రపేశించియున్న శ్రీవారిని ఇక వేరొకస్థలమునకు పోవుటకు సమ్మతింపను.

ఊనేరాక్కైతన్నై, ఉழన్దు ఓమ్బివైత్తమైయాల్,

యానాయ్ ఎన్దనక్కాయ్, అడియేన్ మనమ్ పుగున్ద 

తేనే, తీఙ్కరుమ్బిన్ తెళివే, ఎన్ శిన్దైతన్నాల్,

నానే యెయ్ ద ప్పెర్ట్రేన్, నఱైయూర్ నిన్ఱ నమ్బియో  ll 1566

యాన్ ఆయ్ = నాకు అంతరాత్మగనుండి; ఎన్ తనక్కు ఆయ్ = నాకు విధేయుడువై; అడియేన్ మనమ్ పుగున్ద = దాసుని యొక్క హృదయమందు ప్రవేశించిన; తేనే = తేనెవలె పరమభోగ్యుడా!; తీమ్ కరుమ్బిన్ తెళివే = తియ్యని చెరకురసమువలె భోగ్యమైనవాడా!; ఓ నఱైయూర్ నిన్ఱ నమ్బీ = తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న ఓ! స్వామీ!;ఊన్ ఏర్ ఆక్కై తన్నై=మాంసమయమయిన ఈ శరీరమందు; ఉழన్దు = (అనేక విధములుగ) శ్రమించి; ఓమ్బి వైత్తమైయాల్ = దీనిని సవ్యముగ నిలబడునట్లు పోషించినకారణముచే;ఎన్ శిన్దై తన్నాల్=నాయొక్క మనస్సు వలన; నానే ఎయ్ ద ప్పెర్ట్రేన్= (ఇపుడు శ్రీ వారి) దివ్యచరణములను నేను పొందగలిగితిని. 

నాకు అంతరాత్మగనుండి,నాకు విధేయుడువై,దాసుని యొక్క హృదయమందు ప్రవేశించిన తేనెవలె పరమభోగ్యుడా!,తియ్యని చెరకురసమువలె భోగ్యమైనవాడా!, తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న ఓ! స్వామీ!, మాంసమయమయిన ఈ శరీరమందు అనేక విధములుగ శ్రమించి,దీనిని సవ్యముగ నిలబడునట్లు పోషించినకారణముచే(నాకు కలిగిన మహాభాగ్యము ఏమనగ) నాయొక్క మనస్సు వలన ఇపుడు శ్రీ వారి దివ్యచరణములను నేను పొందగలిగితిని. 

** నన్నీర్ వయల్ పుడై శూழ், నఱైయూర్ నిన్ఱ నమ్బియై,

కల్ నీర మాల్వరైత్తోళ్, కలికన్ఱి మంగైయర్ కోన్, 

శొల్ నీర శొన్మాలై, శొల్లువార్ గళ్ శూழ் విశుమ్బిల్, 

నన్నీర్మైయాల్  మగిழ் న్దు, నెడుఙ్గాలమ్ వాழ் వారే  ll 1567

నల్ నీర్ = మంచి నీటివసతులుగల; వయల్ = పొలములతో, పుడై శూழ் = నాలుగు వైపుల చుట్టుకొనియున్న; నఱైయూర్ నిన్ఱ నమ్బియై = తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామి విషయమై; కల్ నీర మాల్ వరై తోళ్ = శబ్దించుచున్నవాగులయొక్క నీరుగల పెద్ద పర్వతమువంటి భుజములు గలవారును;మంగైయర్ కోన్= తిరుమంగై దేశవాసులకు ప్రభువును; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్; (అనుగ్రహించిన) శొల్ నీర=కొనియాడెడి స్వభావముగల;శొల్ మాలై=ఈసూక్తుల మాలను;శొల్లువార్ గళ్= పఠించువారు; శూழ் విశుమ్బిల్ = పెద్ద పరమపదమందు; నల్ నీర్మైయాల్ మగిழ் న్దు = నిత్యకైంకర్యముచేయు శ్లాఘ్యమైన స్వభావముతో కూడి సంతోషముతో; నెడు కాలమ్ వాழ் వారే = చిరకాలము సుఖముగ నివసింతురు. 

                మంచి నీటివసతులుగల పొలములతో నాలుగు వైపుల చుట్టుకొనియున్న తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామి విషయమై శబ్దించుచున్న వాగులయొక్క నీరుగల పెద్ద పర్వతమువంటి భుజములు గలవారును, తిరుమంగై దేశవాసులకు ప్రభువును,తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన కొనియాడెడి స్వభావముగల ఈ సూక్తుల మాలను పఠించువారు పరమపదమందు నిత్యకైంకర్యము చేయు శ్లాఘ్యమైన స్వభావముతో కూడి సంతోషముతో చిరకాలము సుఖముగ నివసింతురు.

*********

వ్యాఖ్యానించండి