పెరియతిరుమొழி-7వపత్తు (3)

శ్రీః

3. శినవిల్

     తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న తిరైనఱైయూర్ నమ్బి విషయమై తిరుమంగై ఆళ్వార్ తమయొక్క దర్శనానుభవమును వెలిబుచ్చుచున్నారు. 

** శినవిల్ శెఙ్గణ్ అరక్కర్ ఉయిర్ మాళ, చ్చెర్ట్ర విల్లియెన్ఱు కర్ట్రవర్ తన్దమ్

మనముట్కొణ్డు,ఎన్ఱు మెప్పోదుమ్ నిన్ఱేత్తుమ్ మామునియై, మరమ్ ఏழைదమైన్దనై,

ననవిల్ శెన్ఱాఱ్కుమ్ నణ్ణఱ్కరియానై, నానడియేన్ నఱైయూర్ నిన్ఱ నమ్బియై,

కనవిల్ కణ్డేన్ ఇన్ఱు కణ్డమైయాల్, ఎన్ కణ్ణిణైగళ్ కళిప్ప క్కళిత్తేనే  ll 1568

శినమ్ ఇల్ =  కోపోద్రిక్తులై; శెమ్ కణ్ =ఎర్రని నేత్రములు కలిగిన;అరక్కర్ ఉయిర్ మాళ = రాక్షసుల ప్రాణములు పోవునట్లు; శెర్ట్ర = కోపగించిన;విల్లి ఎన్ఱు =శార్ఙ్గమను విల్లును ధరించినవాడా! యని; కర్ట్రవర్ తమ్ దమ్ = ఙ్ఞానులు వారివారియొక్క; మనమ్ ఉళ్ కొణ్డు= హృదయములందు ధ్యానించి;ఎన్ఱుమ్ ఎప్పోదుమ్=ఎల్లప్పుడు, అన్నివేళలయందు; నిన్ఱు ఏత్తుమ్ = స్థిరముగ స్తుతించు వారియొక్క;మా మునియై = (శ్రేయస్సును) మిక్కుటముగ తలచువానిని; ఏழ் మరమ్ ఎయ్ ద మైన్దనై = సప్త సాలవృక్షములను ఒకే బాణముచే కూలగొట్టిన బలశాలిని; ననవిల్ శెన్ఱాఱ్కుమ్ = స్పష్టతకూడిన మనస్సుగల శ్లాఘ్యమైన ఋషులకుకూడ; నణ్ణఱ్కు అరియానై = సమీపించుటకు దుర్లభుడైన; నఱైయూర్ నిన్ఱ నమ్బియై = తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామిని; కనవిల్= మానసానుభవమందు; ఇన్ఱు కణ్డేన్ = ఇపుడు దర్శించితిని; కణ్డమైయాల్ = ఆ దర్శనభాగ్యముచే; ఎన్ కణ్ ఇణైగళ్ = నాయొక్క రెండు నేత్రములు; కళిప్ప = సంతోషించిగ; క్కళిత్తేనే = నేనును మిక్కిలి ఆనందించితిని.

కోపోద్రిక్తులై ఎర్రని నేత్రములు కలిగిన రాక్షసుల ప్రాణములు పోవునట్లు కోపగించిన,” శార్ఙ్గమను విల్లును ధరించినవాడా! ” యని ఙ్ఞానులు వారివారియొక్క హృదయములందు ధ్యానించి ఎల్లప్పుడు, అన్నివేళలయందు, స్థిరముగ స్తుతించు వారియొక్క శ్రేయస్సును మిక్కుటముగ తలచువానిని,సప్త సాలవృక్షములను ఒకే బాణముచే కూలగొట్టిన బలశాలిని, స్పష్టతకలిగిన మనస్సుగల శ్లాఘ్యమైన ఋషులకుకూడ సమీపించుటకు దుర్లభుడైన తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న స్వామిని, మానసానుభవమందు ఇపుడు దర్శించితిని. ఆ దర్శనభాగ్యముచే నాయొక్క రెండు నేత్రములు సంతోషించిగ నేనును మిక్కిలి ఆనందించితిని.

తాయ్ నినైన్దకన్ఱే యొక్క, ఎన్నైయుమ్ తన్నైయే నినైక్క చ్చెయ్ దు, తానెన

క్కాయ్ నినైన్దరుళ్ శెయ్యుమప్పనై, అన్ఱివ్వైయగముణ్డుమిழ்న్దిట్ట

వాయనై, మకరకుழை క్కాదనై మైన్దనై, మదిళ్ కోవల్ ఇడైకழி

యాయనై, అమరర్కరియేర్ట్రై, ఎన్నన్బనై యన్ఱి, యాదరియేనే  ll 1569

తాయ్ నినైన్ద కన్ఱే ఒక్క= తన తల్లిని తలచు ఆవుదూడ వలె; ఎన్నైయుమ్ తన్నైయే నినైక్క శెయ్ దు = నన్నును శ్రీవారినే తలచునట్లుచేసి; (ఆపైన) తాన్ ఎనక్కు ఆయ్ నినైన్దు = తాను ఈ దాసునికి వలసిన శ్రేయములన్నియు తలచి; అరుళ్ శెయ్యుమ్ అప్పనై = కృపజేయు ఉపకారకుడును; అన్ఱు = మునుపొకకాలమున;ఇ వ్వైయగమ్=ఈ లోకమునంతను; ఉణ్ణు = (ప్రళయకాలమున) ఆరగించి; (పిదప) ఉమిழ்న్దిట్ట = (సృష్టికాలమున) వెలిబుచ్చిన; వాయనై = దివ్యమైన నోరుగలవాడును;మకర కుழை కాదనై = మకర కుండలములుగల చెవులుగలవాడును; మైన్దనై = నిత్యయౌవనుడును; మదిళ్ కోవల్ ఇడై కழி ఆయనై=ప్రాకారములుగల తిరు కోవలూర్ కోవెల దివ్యసన్నిధిలో  వేంచేసియున్న గోపాలుడును; అమరర్కు = దేవతలకు; అరి ఏర్ట్రై = సింహమువలెను, వృషభమువలెను మిక్కిలి శక్తివంతునిగ ఉద్భవించువాడును; ఎన్ అన్బనై అన్ఱి = నాయొక్క విషయమున మిక్కిలి ప్రీతిగల తిరునఱైయూర్ నమ్బిని విడిచి;ఆదరియేన్= వేరెవ్వరిని ఆదరించను.

తన తల్లిని తలచు ఆవుదూడ వలె నన్నును శ్రీవారినే తలచునట్లుచేసి, ఆపైన తాను ఈ దాసునికి వలసిన శ్రేయములన్నియు తలచి కృపజేయు ఉపకారకుడును, మునుపొక కాలమున ఈ లోకమునంతను ప్రళయకాలమున ఆరగించి, పిదప సృష్టికాలమున వెలిబుచ్చిన దివ్యమైన నోరుగలవాడును, మకరకుండలములుగల చెవులుగలవాడును, నిత్యయౌవనుడును,ప్రాకారములుగల తిరు కోవలూర్ కోవెల దివ్యసన్నిధిలో వేంచేసియున్న గోపాలుడును, దేవతలకు సింహము వలెను,వృషభము వలెను మిక్కిలి శక్తివంతునిగ ఉద్భవించువాడును,నాయొక్క విషయమున మిక్కిలి ప్రీతిగల తిరునఱైయూర్ నమ్బిని విడిచి వేరెవ్వరిని ఆదరించను.

వన్దనాళ్ వన్దు ఎన్నెఞ్జిడఙ్గొణ్డాన్, మర్ట్రోర్ నెఞ్జఱియాన్, అడియేనుడై

చ్చిన్దైయాయ్ వన్దు తెన్బులర్కెన్నై చ్చేర్ కొడాన్, ఇదు శిక్కెన పెర్ట్రేన్,

కొన్దు ఉలామ్ పొழிల్ శూழ் కుడందైత్తలై క్కోవినై, కుడమాడియకూత్తనై,

ఎన్దైయై యెన్దైతన్దై తమ్మానై, ఎమ్బిరానై యెత్తాల్ మఱక్కేనే  ll 1570

వన్ద నాళ్ వన్దు=తాను స్వయముగ నన్ను స్వీకరింవలెనని ఇచ్ఛతొ ఆ కాలమున కృపతో వేంచేసి;ఎన్ నెఞ్జు= నాయొక్క హృదయమును; ఇడమ్ కొణ్డాన్ = తన వసించుస్థలముగ ఎంచుకొనెను; మర్ట్రు ఓర్ నెఞ్జు అఱియాన్ = వేరొకరి హృదయమును వాసస్థలముగ తలచక యుండును; అడియేనుడై = ఈ దాసుని యొక్క; శిన్దై ఆయ్ వన్దు = మనోరథములను తాను స్వీకరించినవాడై వచ్చి;తెన్ పులర్కు ఎన్నై శేర్ కొడాన్=యమబటుల చేతులలో నన్ను చేరనీయక కృప జేసెను; ఇదు శిక్కెన పెర్ట్రేన్ = దీనిని దృఢముగ పొందితిని; (ఇట్టి భాగ్యముగల నేను) కొన్దు ఉలామ్ పొழிల్ శూழ் = పూలగుత్తులతో నిండియున్న తోటలతో చుట్టుకొనియున్న; కుడందై తలై = తిరుకుడందై దివ్యదేశమున వేంచేసియున్న; కోవినై = స్వామిని; కుడమ్ ఆడియ కూత్తనై = కుంభనృత్యము చేసిన వానిని; ఎన్దైయై = నాయొక్క తండ్రియు; ఎన్దై తన్దై తమ్మానై = నాయొక్క తాత ముత్తాతలకు స్వామి అయిన; ఎమ్బిరానై=తిరునఱైయూర్ నమ్బిని;ఎత్తాల్ మఱక్కేనే = ఏ కారణముగ మరచిపోగలను?!.

    తాను స్వయముగ నన్ను స్వీకరింవలెనని ఇచ్ఛతొ ఆ కాలమున కృపతో వేంచేసి నాయొక్క హృదయమును తన వసించుస్థలముగ ఎంచుకొనెను.వేరొకరి హృదయమును వాసస్థలముగ తలచక ఉండును. ఈ దాసుని యొక్క మనోరథములను తాను స్వీకరించినవాడై వచ్చి యమబటుల చేతులలో  నన్ను చేరనీయక కృప జేసెను.దీనిని దృఢముగ పొందితిని.ఇట్టి భాగ్యముగల నేను పూలగుత్తులతో నిండియున్న తోటలతో చుట్టుకొనియున్న తిరుకుడందై దివ్యదేశమున వేంచేసియున్న స్వామిని, కుంభనృత్యము చేసిన వానిని, నాయొక్క తండ్రియు నాయొక్క తాత ముత్తాతలకు స్వామి అయిన తిరునఱైయూర్ నమ్బిని ఏ కారణముగ మరచిపోగలను? !

ఉరఙ్గళాల్ ఇయన్ఱ మన్నర్ మాళ, పారదత్తు ఒరు తేరైవర్కాయ్ చ్చెన్ఱు,

ఇరఙ్గి ఊర్ న్దు అవర్కిన్నరుళ్ శెయ్యుమెమ్బిరానై, వమ్బార్ పునల్ కావిరి,

అరఙ్గమాళి యెన్నాళివిణ్ణాళి, ఆழி శూழ் ఇలఙ్గై మలఙ్గ చ్చెన్ఱు,

శరఙ్గళాణ్డ తణ్ తామరైక్కణ్ణనుక్కన్ఱి, ఎన్మనమ్ తాழ் న్దు నిల్లాదే  ll 1571

ఉరఙ్గళాల్ ఇయన్ఱ మన్నర్ మాళ = మిక్కిలి శక్తివంతులైన దుర్యోదనాది మహారాజులు మరణించునట్లు; పారదత్తు = మహాభారతయుద్దమున, ఐవర్కు ఆయ్ శెన్ఱు = పంచ పాండవులకు సహాయభూతునిగ వెడలి;ఇరఙ్గి=మిక్కిలి కరుణతో;ఒరు తేర్ ఊర్ న్దు=ఒక రథమునకు సారథియై నడిపించి; అవర్కు ఇన్ అరుళ్ శెయ్యుమ్ ఎమ్బిరానై =  ఆ పాండవులకు మహోపకారమును కృపజేసిన సర్వేశ్వరుడును; వమ్బుఆర్ పునల్ కావిరి=మిక్కిలి స్వచ్ఛమైన పవిత్రమైన తీర్థములతో ఒప్పు దివ్య కావేరినదిచే చుట్టుకొనియున్న; అరఙ్గమ్ ఆళి = దివ్యమైన శ్రీ రంగం దివ్యదేశమును పాలించువాడును;ఎన్ ఆళి= నన్ను పాలించువాడును; విణ్ ఆళి = పరమపదమును పాలించువాడును;ఆழி శూழ் ఇలఙ్గై మలఙ్గ శెన్ఱు = సముద్రముచే చుట్టుకొనియున్న లంకాపురి కలతచెందునట్లు అచటకే వెడలి; శరఙ్గళ్ ఆణ్డ = బాణములను ప్రయోగించిన; తణ్ తామరై కణ్ణనుక్కు అన్ఱి = చల్లని తామరపుష్పమువంటి నేత్రములు గల తిరునఱైయూర్ నమ్బిని విడిచి; (మరెవ్వరికిని) ఎన్ మనమ్ = నాయొక్క మనస్సు; తాழ் న్దు నిల్లాదు=లొంగి యుండదు.

                  మిక్కిలి శక్తివంతులైన దుర్యోదనాది మహారాజులు మరణించునట్లు మహాభారతయుద్దమున పంచపాండవులకు సహాయభూతునిగ వెడలి మిక్కిలికరుణతో ఒక రథమునకు సారథియై నడిపించి పాండవులకు మహోపకారమును కృపజేసిన సర్వేశ్వరుడును,మిక్కిలి స్వచ్ఛమైన పవిత్రమైన తీర్థములతో ఒప్పు దివ్య కావేరినదిచే చుట్టుకొనియున్న దివ్యమైన శ్రీ రంగం దివ్య దేశమును పాలించువాడును, నన్ను పాలించువాడును,పరమపదమును పాలించువాడును, సముద్రముచే చుట్టుకొనియున్న లంకాపురి కలతచెందునట్లు అచటకే వెడలి బాణములను ప్రయోగించిన చల్లని తామరపుష్పమువంటి నేత్రములుగల తిరునఱైయూర్ నమ్బిని విడిచి మరెవ్వరికిని నాయొక్క మనస్సు లొంగి యుండదు.

ఆఙ్గువెన్నరగత్తుழுన్దు మ్బోదు, అఞ్జేలెన్ఱడియేనై యఙ్గేవన్దు

తాఙ్గు, తామరైయన్న పొన్నారడి యెమ్బిరానై, ఉమ్బర్కణియాయ్ నిన్ఱ,

వేఙ్గడత్తరియై ప్పరికీఱియై, వెణ్ణెయుణ్డు ఉరలినిడై యాప్పుణ్డ

తీఙ్గరుమ్బినై, తేనై నన్పాలినై యన్ఱి, ఎన్మనమ్ శిన్దై శెయ్యాదే  ll 1572

ఆఙ్గు వెమ్ నరగత్తు =  ఆ క్రూరమైన యమలోకమున; అழுన్దుమ్ పోదు=బాధలతో దుఃఖములను అనుభవించు కాలమున; అఙ్గే వన్దు = అచటకే ఏతెంచి; అఞ్జేల్ ఎన్ఱు= భయపడకని; అడియేనై తాఙ్గు = దాసుడైన నన్ను భద్రముగ చూచుకొనెడి;తామరై అన్న పొన్ ఆర్ అడి = తామరపుష్పము వలె మిక్కిలి సుందరమైన దివ్య చరణములుగల; ఎమ్ పిరానై = మనయొక్క  ఉపకారకుడును;ఉమ్బర్కు అణి ఆయ్ నిన్ఱ=పైనున్న సర్వ లోకములకు అలంకారముగ నున్న; వేఙ్గడత్తు అరియై= వేంకటాచలమున వేంచేసియున్న సింహమువంటి వాడును; పరి కీఱియై = అశ్వరూపములో వచ్చిన కేశియను అసురుని నోటిని చీల్చి సంహరించినవాడును; వెణ్ణెయ్ ఉణ్డు=వెన్నను దొంగతనమున ఆరగించి; ఉరలినిడై = రోకలికి; ఆప్పుణ్డ =యశోదాదేవిచే కట్టబడినవాడును; తీమ్ కరుమ్బినై = మధురమైన చెరకురసము వంటివాడును; తేనై = తేనెవంటి భోగ్యమైనవాడును; నల్ పాలినై అన్ఱి=భోగ్యమైన మంచి పాలువంటి తిరునఱైయూర్ నమ్బిని విడిచి;(వేరెవ్వరిని) ఎన్ మనమ్ శిన్దై శెయ్యాదు = నాయొక్క మనస్సు ధ్యానించదు!.

    ఆ క్రూరమైన యమలోకమున బాధలతో దుఃఖములను అనుభవించు కాలమున, అచటకే ఏతెంచి భయపడకని దాసుడైన నన్ను భద్రముగ చూచుకొనెడి తామరపుష్పము వలె మిక్కిలి సుందరమైన దివ్య చరణములుగల మనయొక్క  ఉపకారకుడును, పైనున్న సర్వ లోకములకు అలంకారముగ నున్న, వేంకటాచలమున వేంచేసియున్న సింహమువంటి వాడును, అశ్వరూపములో వచ్చిన కేశియను అసురుని నోటిని చీల్చి సంహరించినవాడును,వెన్నను దొంగతనమున ఆరగించి రోకలికి యశోదాదేవిచే కట్టబడినవాడును,మధురమైన చెరకురసము వంటివాడును, తేనెవంటి భోగ్యమైన వాడును,భోగ్యమైన మంచి పాలువంటి ఆ తిరునఱైయూర్ నమ్బిని విడిచి వేరెవ్వరిని నాయొక్క మనస్సు ధ్యానించదు!.

ఎట్టనైప్పొழுదాగిలుమ్, ఎన్ఱుమ్ ఎన్మనత్తగలాదిరుక్కుమ్పుగழ்,

తట్టలర్త పొన్నేయ్ అలర్ కోఙ్గిన్, తాழ் పొழிల్ తిరుమాలిరుఞ్జోలైయ

ఙ్గట్టియై, కరుమ్బీన్ఱ ఇన్ శార్ట్రై, క్కాదలాల్ మఱై నాన్గుమున్నోదియ

పట్టనై, పరవై త్తుయిలేర్ట్ర, ఎన్ పణ్బనై యన్ఱి పాడల్ శెయ్యేనే  ll 1573

ఎళ్ తనై పొழுదు ఆగిలుమ్ = నువ్వుగింజంతటి  క్షణ కాలమైనను; ఎన్ మనత్తు అగలాదు = నాయొక్క మనస్సును విడువక;ఎన్ఱుమ్=ఎల్లప్పుడును;ఇరుక్కుమ్ పుగழ்=వసించెడి కీర్తిగల; తట్టు అలర్త= పళ్ళెము వలె వికసించిన;పొన్ ఏయ్ అలర్=బంగారపు వర్ణమువంటి పుష్పములుగల; కోఙ్గిన్ = ” కోంగు” వృక్షముల; తాழ் పొழிల్ = పచ్చని ఆకులతోనిండిన తోటలుగల; తిరుమాలిరుఞ్జోలై = తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమున వేంచేసియున్న; అమ్ కట్టియై = మధురమైన పటికబెల్లమువలె భోగ్యమైనవాడును; కరుమ్బు ఈన్ఱ ఇన్ శార్ట్రై = చెరకుగడల నుండి తీసిన తియ్యని చెరకురసమువలె భోగ్యుడును; మున్ = మునుపొకకాలమున; కాదలాల్ = ప్రీతిగ; మఱై నాన్గుమ్ = నాలుగు వేదములు; ఓదియ = సాందీపమహాముని వద్ద అధ్యయనము చేసిన;పట్టనై=పండితుడును; పరవై తుయిల్ ఏర్ట్ర = పాలసముద్రమున యోగనిద్రలో అమరియున్న పరమపురుషుడును; ఎన్ పణ్బనై అన్ఱి = నాకు పరమసులభుడైన ఆ తిరునఱైయూర్ నమ్బిని విడిచి; (మరియొకరిని) ;పాడల్ శెయ్యేన్ = పాశురములతో స్తుతించను!.

నువ్వుగింజంతటి  క్షణ కాలమైనను నాయొక్క మనస్సును విడువక ఎల్లప్పుడును వసించెడి కీర్తిగల, పళ్ళెము వలె బాగుగ వికసించిన బంగారపు వర్ణమువంటి పుష్పములుగల ” కోంగు” వృక్షముల ఆకులతోనిండిన తోటలుగల తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమున వేంచేసియున్న,మధురమైన పటికబెల్లమువలె భోగ్యమైనవాడును, చెరకుగడల నుండి తీసిన తియ్యని చెరకురసమువలె భోగ్యుడును, మునుపొకకాలమున ప్రీతిగ నాలుగు వేదములు సాందీపమహాముని వద్ద అధ్యయనము చేసిన పండితుడును; పాలసముద్రమున యోగనిద్రలో అమరియున్న పరమపురుషుడును, నాకు పరమ సులభుడైన ఆ తిరునఱైయూర్ నమ్బిని విడిచి మరియొకరిని పాశురములతో స్తుతించను!.

పణ్ణనిన్మొழிయాழ் నరమ్బిల్ పెర్ట్ర, పాలైయాగి యిఙ్గేపుగున్దు, ఎన్

కణ్ణుమ్ నెఞ్జుమ్ వాయుమ్ ఇడఙ్గొణ్డాన్, కొణ్డపిన్ మఱై యోర్మనన్దన్నుళ్,

విణ్ణులార్ పెరుమానై యెమ్మానై, వీఙ్గునీర్ మకరన్దిళైక్కుఙ్గడల్

వణ్ణన్, మామణివణ్ణన్ ఎమ్మణ్ణల్, వణ్ణమేయన్ఱి వాయురైయాదే  ll 1574

పణ్ణిన్ = రాగములలో; ఇన్=ఇంపైన;మొழி=స్వరములుగల;యాழ் నరమ్బిల్ పెర్ట్ర= వీణయొక్క తీగలయందు అమరియున్న; పాలై యాగి =” పాలై ” అనబడు శ్రావ్యమైన రాగమువలె మధురముగ; ఇఙ్గే పుగున్దు = నాయొక్క హృదయమందు ప్రవేశించి;ఎన్ కణ్ణుమ్ నెఞ్జుమ్ వాయుమ్ ఇడమ్ కొణ్డాన్ = నాయొక్క అవయవములన్నిటిని తనకు వసించు స్థానముగ ఎంచుకొన్నవాడును;కొణ్డపిన్ = అట్లు వేంచేసియుండి;మఱై యోర్ = వేదోత్తముల యొక్క; మనమ్ =మనస్సును; తన్ ఉళ్ = తనయొక్క వాసస్థానముగ కలవాడును; విణ్ణులార్ పెరుమానై = నిత్యశూరులకు నాధుడును; యెమ్మానై = నాయొక్క స్వామియు;వీఙ్గు నీర్=పుష్కలముగ నీరుకలదియు;మకరమ్= మీనములు; తిళైక్కుమ్ = త్రుళ్ళిత్రుళ్ళి ఆడుచుండు; కడల్ వణ్ణన్ = సముద్రమువంటి వర్ణము కలిగనవాడును;మా మణి వణ్ణన్=శ్లాఘ్యమైన నీలమణివంటి వర్ణము కలవాడును; ఎమ్ అణ్ణల్ = మాకు నాధుడైన తిరునఱైయూర్ నమ్బి యొక్క;వణ్ణమే అన్ఱి = స్వభావమే తప్ప; (వేరొకరి స్వభావమును);వాయ్ ఉరైయాదు=నాయొక్క నోరు పలుకజాలదు!.

    రాగములలో ఇంపైన స్వరములుగల వీణయొక్క తీగలయందు అమరియున్న “పాలై” అనబడు శ్రావ్యమైన రాగమువలె మధురముగ నాయొక్క హృదయమున ప్రవేశించి నాయొక్క అవయవములన్నిటిని తనకు వసించు స్థానముగ ఎంచుకొన్న వాడును;అట్లు వేంచేసియుండి, వేదోత్తముల యొక్క మనస్సును తనయొక్క వాసస్థానముగ కలవాడును,నిత్యశూరులకు నాధుడును, నాయొక్క స్వామియు, పుష్కలముగ నీరుకలదియు,మీనములు త్రుళ్ళిత్రుళ్ళి ఆడుచుండు సముద్రము వంటి వర్ణము కలిగనవాడను, శ్లాఘ్యమైన నీలమణివంటి వర్ణము కలవాడును, మాకు  నాథుడైన తిరునఱైయూర్ నమ్బి యొక్క స్వభావమే తప్ప వేరొకరి స్వభావమును నాయొక్క నోరు పలుకజాలదు!.

ఇనియెప్పావమ్ వన్దెయ్ దుమ్ శొల్లీర్,ఎమక్కిమ్మైయేయరుళ్ పెర్ట్రమైయాల్, అడుమ్

తునియైతీర్తు ఇన్బమే తరుకిన్ఱదోర్, తోర్ట్రత్తొన్నైఱియై, వైయమ్ తొழప్పడుమ్

మునియై వానవరాల్ వణఙ్గ ప్పడుమ్ ముత్తినై, ప్పత్తర్ తామ్ నుగర్ కిన్ఱదోర్

కనియై, కాదల్ శెయ్ దెన్నుళ్ళఙ్గొణ్డ కళ్వనై, ఇన్ఱు కణ్డుకొణ్డేనే  ll 1575

ఇమ్మైయే అరుళ్ పెర్ట్రమైయాల్= ఈ లోకమందే సర్వేశ్వరుని దివ్యమైన కృపను పొందిన కారణముచే; ఇని ఎమక్కు = ఇక మనకు; ఎప్పావమ్=ఏ విధమైన పాపములు;వన్దు ఎయ్ దుమ్ శొల్లీర్=సమీపించి చేరగలవో చెప్పుడు;అడుమ్ = ఆత్మహానిని కలిగించు; తునియై తీర్తు = కర్మములను పోగొట్టి; ఇన్బమే తరుకిన్ఱదు = నిత్యమైన ఆనందమును ఒసగెడి; ఓర్ తోర్ట్రమ్ తొల్ నెఱియై=సాటిలేని విలక్షణమైన, ఆనాదియైన,ఉపాయముగ నుండువాడును; వైయమ్=లోకమందున్నవారిచే; తొழపడుమ్= ఆశ్రయింపబడువాడును; మునియై = ఆశ్రితుల శ్రేయస్సును చింతించువాడును; వానవరాల్ వణఙ్గ పడుమ్ = నిత్యశూరులచే  సేవింపబడువాడును;ముత్తినై = ముత్యమువంటివాడును; పత్తర్ తామ్ = భక్తులచే; నుగర్ కిన్ఱదు = ఆస్వాదింపబడు; ఓర్ కనియై = విశిష్టమైన ఒక పండువంటివాడును; కాదల్ శెయ్ దు = ఆశించి;ఎన్నుళ్ళమ్ కొణ్డ కళ్వనై = నాయొక్క హృదయమును దోచుకున్న సర్వేశ్వరుని; ఇన్ఱు కణ్డుకొణ్డేనే = ఈ తిరునఱైయూర్ దివ్యదేశమందు సేవించుకొంటిని!.

    ఈ లోకమందే సర్వేశ్వరుని దివ్యమైన కృపను పొందిన కారణముచే ఇక మనకు ఏ విధమైన పాపములు సమీపించి చేరగలవో చెప్పుడు. ఆత్మహానిని కలిగించు కర్మములను పోగొట్టి నిత్యమైన ఆనందమును ఒసగెడి సాటిలేని విలక్షణమైన, ఆనాదియైన, ఉపాయముగ నుండువాడును, లోకమందున్నవారిచే ఆశ్రయింపబడు వాడును,ఆశ్రితుల శ్రేయస్సును చింతించువాడును, నిత్యశూరులచే  సేవింపబడు వాడును, ముత్యమువంటివాడును, భక్తులచే ఆస్వాదింపబడు విశిష్టమైన ఒక పండువంటివాడును,ఆశించి నాయొక్క హృదయమును దోచుకున్న సర్వేశ్వరుని ఈ తిరునఱైయూర్ దివ్యదేశమందు సేవించుకొంటిని!.

ఎన్ శెయ్ గేనడియేనురైయీర్, ఇదఱ్కెన్ఱుమ్ ఎన్మనత్తే యిరుక్కుమ్పుగழ்,

తఞ్జైయాళియై పొన్ పెయరోన్, నెఞ్జమన్ఱిడన్దవనైత్తழలేపురై,

మిన్ శెయ్ వాళరక్కన్నగర్ పాழ்పడ, శూழ் కడల్ శిఱైవైత్తి మైయార్ తొழுమ్,

పొన్ శెయ్ మాల్వరైయై మణిక్కున్ఱినై యన్ఱి, ఎన్మనమ్ పోర్ట్రి యెన్నాదే  ll 1576 

అడియేన్=పాపియైన నేను;ఇదఱ్కు ఎన్ శెయ్ గేన్=శ్రీవారు చేసిన మహోపకారమునకు ఎటువంటి ప్రత్యుపకారము చేయగలనో; ఉరైయీర్ = చెప్పుడు; ఎన్ఱుమ్ ఎన్ మనత్తే ఇరుక్కుమ్ పుగழ் = ఎల్లవేళల నాయొక్క హృదయమందు వసించుచున్న కీర్తిగల వాడును; తఞ్జై  ఆళియై = తఞ్జమామణికోయిల్ దివ్యదేశమును పాలించువాడును; అన్ఱు = నరసింహావతారమున; పొన్ పెయరోన్ = హిరణ్యాసురుని యొక్క; నెఞ్జమ్ ఇడన్ద అవనై= వక్షస్థలమును చీల్చి సంహరించినవాడును;తழలే పురై= అగ్నివలె నున్నవాడును మరియు;మిన్ శెయ్ వాళ్ అరక్కన్=కాంతివెదజల్లు ఖడ్గము కలిగిన రాక్షసుడు రావణాసురునియొక్క; నగర్ పాழ்పడ = లంకాపురి నాశనమగునట్లు; శూழ் = ఆ లంకాపురిని అగడ్తవలె చుట్టుకొనియున్న;కడలై=సముద్రమందు,శిఱై వైత్తు=సేతువును కట్టినవాడును; ఇమైయార్ తొழுమ్ = బ్రహ్మాదిదేవతలచే ఆశ్రయింపబడువాడును;పొన్ శెయ్ మాల్ వరైయై = ఆశింపతగిన పెద్ద పర్వతమువంటివాడును; మణి క్కున్ఱినై అన్ఱి=నీలమణులతో నిండిన కొండవలెనున్న తిరునఱైయూర్ నమ్బిని విడిచి; (వేరొకరిని); ఎన్ మనమ్ పోర్ట్రి ఎన్నాదే=నాయొక్క మనస్సు మంగళాశాసనము చేయుటకు తలచదు!.

          పాపియైన నేను శ్రీవారు చేసిన మహోపకారమునకు ఎటువంటి ప్రత్యుపకారము చేయగలనో చెప్పుడు. ఎల్లవేళల నాయొక్క హృదయమందు వసించుచున్న కీర్తిగలిగిన వాడును, తఞ్జమామణికోయిల్ దివ్యదేశమును పాలించువాడును, నరసింహావతారమున హిరణ్యాసురునియొక్క వక్షస్థలమును చీల్చి సంహరించినవాడును, అగ్నివలె నున్న వాడును మరియు కాంతివెదజల్లు ఖడ్గము కలిగిన రాక్షసుడు రావణాసురునియొక్క లంకాపురి నాశనమగునట్లు, ఆలంకాపురిని అగడ్తవలె చుట్టుకొనియున్న సముద్రమందు సేతువును కట్టినవాడును,బ్రహ్మాదిదేవతలచే ఆశ్రయింపబడు వాడును, ఆశింపతగిన పెద్ద పర్వతమువంటివాడును,నీలమణులతో నిండిన కొండవలెనున్న తిరునఱైయూర్ నమ్బిని విడిచి వేరొకరిని నాయొక్క మనస్సు మంగళాశాసనముచేయుటకు తలచదు!.

** తోడు విణ్డలర్ పూమ్బొழிల్ మంగైయర్ తోన్ఱల్, వాట్కలియన్ తిరువాలి

నాడన్, నన్నఱైయూర్ నిన్ఱ నమ్బి తన్, నల్లమామలర్ చ్చేవడి శెన్నియిల్

శూడియుమ్ తొழுదుమ్ ఎழுన్దాడియుమ్, తొణ్డర్ కట్కవన్ శొన్న శొన్మాలై,

పాడల్ పత్తివై పాడుమిన్ తొణ్డీర్, పాడ నుమ్మిడై ప్పావమ్ నిల్లావే  ll 1577

తోడు విణ్డు అలర్ పూమ్ పొழிల్ = దళములతో నిండి వికసించిన పుష్పములుగల తోటలు కలిగియున్న; మంగైయర్ తోన్ఱల్ = తిరుమంగై దేశవాసులకు ప్రభువును; తిరు ఆలి నాడన్ = తిరువాలి దేశమునకు నాయకుడును; వాళ్ కలియన్=ఖడ్గము ధరించిన తిరుమంగై ఆళ్వార్; నల్ నఱైయూర్ నిన్ఱ నమ్బి తన్=శ్లాఘ్యమైన తిరునఱైయూర్ నమ్బి యొక్క;నల్ల మా మలర్ శేవడి=అందమైన, శ్రేష్ఠమైన, దివ్య చరణారవిందములను; శెన్నియిల్ శూడియుమ్= తమయొక్క  శిరస్సుపై ధరించియు;తొழுదుమ్ = సేవించియు; ఎழுన్దు ఆడియుమ్ = ఆనందముతో ఉప్పొంగి నృత్యముచేసి; తొణ్డర్ గట్కు = భాగవతులకు (ఉజ్జీవింపబడుటకై); అవన్ శొన్న శొల్ మాలై=ఆళ్వార్ అనుగ్రహించిన సూక్తులమాలైన; ఇవై పత్తు పాడల్ = ఈ పది పాసురములను; తొణ్డీర్ = భక్తులారా! ;పాడుమిన్ = పాడుడు; పాడ = పాడినచో; నుమ్ ఇడై పావమ్ నిల్లావే = మీ చెంత పాపములు నిలువలేవు!.

దళములతో నిండి వికసించిన పుష్పములుగల తోటలు కలిగియున్న తిరుమంగై దేశవాసులకు ప్రభువును,తిరువాలి దేశమునకు నాయకుడును, ఖడ్గము ధరించిన తిరుమంగై ఆళ్వార్ శ్లాఘ్యమైన తిరునఱైయూర్ నమ్బి యొక్క అందమైన, శ్రేష్ఠమైన,దివ్య చరణారవిందములను, తమయొక్క  శిరస్సుపై ధరించియు,సేవించియు ఆనందముతో ఉప్పొంగి నృత్యముచేసి, భాగవతులకు (ఉజ్జీవింపబడుటకై) ఆళ్వార్ అనుగ్రహించిన సూక్తులమాలైన ఈ పది పాసురములను భక్తులారా ! పాడుడు.పాడినచో మీ చెంత పాపములు నిలువలేవు!

******

వ్యాఖ్యానించండి