శ్రీః
4. కణ్ శోర
(కోయిల్ తిరుమొழி)
తిరుచ్చేరై ( సారక్షేత్రము ) దివ్యదేశమునందు నిత్యవాసము చేయుచున్నసారనాథుని యొక్క పాదద్వందములను సేవించుకొను భక్తుల వైభవమును తిరుమంగై ఆళ్వార్ పొగుడుచున్నారు.
** కణ్ శోర వెఙ్గురుది వన్దిழிయ, వెన్దழల్ పోల్ కూన్దలాళై,
మణ్ శేర ములైయుణ్డ మామదలాయ్, వానవర్ తమ్ కోవేయెన్ఱు,
విణ్ శేరుమ్ ఇళన్దిఙ్గళ్ అగడురిఞ్జు, మణిమాడమల్ గు, శెల్వ
త్తణ్ శేఱై యెమ్బెరుమాన్ తాళ్ తొழுవార్ కాణ్మిన్, ఎన్ తలైమేలారే ll 1578
కణ్ శోర = కళ్ళుతిరిగి వ్యధచెందునట్లు;వెమ్ కురుది=తీవ్రముగ రక్తము;వన్దు ఇழிయ = వరదవలె కారుచు;మణ్ శేర =మట్టిలో కలసిపోవునట్లు; వెమ్ తழల్ పోల్ కూన్దలాళై = మండెడి నిప్పువలె ఎర్రని కేశములుగల పూతనయొక్క; ములై ఉణ్డ = (విషము రాసుకొనిన) స్తనములను పీల్చిన; మా మదలాయ్ = చిన్న బాలుడా!; వానవర్ తమ్ కోవే = దేవాదిదేవుడా!; ఎన్ఱు = అని ఈ విధముగ స్తుతించి;విణ్ శేరుమ్ ఇళమ్ తిఙ్గళ్= ఆకాశమునగల బాలచంద్రునియొక్క; అగడు ఉరిఞ్జు=క్రిందబాగము తగులునట్లుండు; మణి మాడమ్ మల్ గు = అందమైన భవంతులతో నిండి; శెల్వమ్ = సిరిసంపదలతో తులతూగుచున్న; తణ్ శేఱై=చల్లని సారక్షేత్రమున వేంచేసియున్న;ఎమ్బెరుమాన్ తాళ్= సారనాథుని దివ్యచరణారవిందములను; తొழுవార్ కాణ్మిన్ = సేవించు మహత్ములే సుమా!, ఎన్ తలైమేలారే = నాయొక్క శిరోభూషణములుగ నుందురు!.
కళ్ళుతిరిగి వ్యధచెందునట్లు, తీవ్రముగ రక్తము వరదవలె కారుచు మట్టిలో కలసిపోవునట్లు,మండెడి నిప్పువలె ఎర్రని కేశములుగల పూతనయొక్క విషము రాసుకొనిన స్తనములను పీల్చిన చిన్న బాలుడా!,దేవాదిదేవుడా!, అని ఈ విధముగ స్తుతించి, ఆకాశమునగల బాలచంద్రునియొక్క క్రిందబాగము తగులునట్లుండు అందమైన భవంతులతో నిండి సిరిసంపదలతో తులతూగుచున్న చల్లని సారక్షేత్రమున వేంచేసియున్న సారనాథుని దివ్య చరణారవిందములను సేవించు మహత్ములే సుమా! నాయొక్క శిరోభూషణములుగ నుందురు!.
అమ్బురువ వరినెడుఙ్గణ్, అలర్ మగళై వరై యగలత్తు అమర్ న్దు,మల్లల్
కొమ్బురువ విలఙ్గనిమేల్, ఇళఙ్గన్ఱు కొణ్డెఱిన్ద కూత్తర్ పోలామ్,
వమ్బలరున్దణ్ శోలై వణ్ శేఱై, వాన్ ఉన్దు కోయిల్ మేయ,
ఎమ్బెరుమాన్ తాళ్ తొழுవార్, ఎప్పొழுదుమెన్మనత్తే యిరుక్కిన్ఱారే ll 1579
అమ్ పురువమ్ = సుందరమైన కనుబొమలు మరియు;అరి నెడు కణ్ = నల్లని చారలతో పెద్ద నేత్రములుగల; అలర్ మగళై = కమలవాసిని శ్రీ దేవిని;వరై అగలత్తు అమర్ న్దు = పర్వతముపోలిన వక్షస్థలమందు ఒనర్చుకొన్నవాడును; మల్లల్ కొమ్బు ఉరువము విళా = ఆకులు,కొమ్మల అసురరూపముగల వెలగచెట్టుపై నున్న;కని మేల్ = పండుపై;ఇళమ్ కన్ఱు కొణ్డు=(వేరొక అసురుని రూపములో వచ్చిన) లేగదూడను ఒక రాయి వలె పట్టుకొని; ఎఱిన్ద = విసిరి ఆయిద్దరు సంహరించిన; కూత్తర్ పోల్ ఆమ్= అందమైన నడత కలవాడును;వమ్బు అలరుమ్ తణ్ శోలై=పరిమళము వెదజల్లు చల్లని తోటలు గల; వణ్ శేఱై = సుందరమైన సారక్షేత్రమున; వాన్ ఉన్దు కోయిల్ మేవ = ఆకాశమును స్పర్శించుచుండు దివ్యసన్నిధిలో అమరియున్న;ఎమ్బెరుమాన్ తాళ్ = సారనాథుని దివ్యచరణారవిందములను; తొழுవార్= సేవించువారు; ఎప్పొழுదుమ్= ఎల్లప్పుడును;ఎన్ మనత్తే ఇరుక్కిన్ఱార్=నాయొక్క హృదయమందు వసించుచుందురు!.
సుందరమైన కనుబొమలు మరియు నల్లని చారలతో పెద్ద నేత్రములుగల కమలవాసిని శ్రీ దేవిని పర్వతముపోలిన వక్షస్థలమందు ఒనర్చుకొన్నవాడును,ఆకులు, కొమ్మల అసురరూపముగల వెలగచెట్టుపై నున్న పండుపై వేరొక అసురుని రూపములో వచ్చిన లేగదూడను ఒక రాయి వలె పట్టుకొని విసిరి ఆయిద్దరు సంహరించిన అందమైన నడత కలవాడును,పరిమళము వెదజల్లు చల్లని తోటలుగల సుందరమైన సారక్షేత్రమున ఆకాశమును స్పర్శించుచుండు దివ్యసన్నిధిలో అమరియున్న సారనాథుని దివ్యచరణారవిందములను సేవించువారు ఎల్లప్పుడును నాయొక్క హృదయమందు వసించుచుందురు!.
మీదోడి వాళెయిఱు మిన్నిలగ, మున్ విలగుమ్ ఉరువినాళై,
కాదోడు కొడిమూక్కు అన్ఱుడనఱుత్త, కైత్తలత్తా ఎన్ఱునిన్ఱు,
తాదోడు వణ్డలమ్బుమ్, తణ్ శేఱై ఎమ్బెరుమాన్ తాళైయేత్తి,
పోదోడు పునల్ తూవుమ్ పుణ్ణియరే, విణ్ణవరిల్ పొలిగిన్ఱారే ll 1580
వాళ్ ఎయిఱు = కత్తివలె వాడియైన కోరలు; మీదు ఓడి=పైకి వంగి ఎదిగి;మిన్ ఇలగ=మెరుపువలె మెరయ;మున్ విలగుమ్ ఉరువినాళై=ముంగిటనే వచ్చి నిలబడిన శరీరము గలదానియొక్క (శూర్పణకయొక్క); కాదోడు కొడిమూక్కు = చెవులును మరియు,సన్నని ముక్కును; అన్ఱు = ఆ సమయమున; ఉడన్ ఆఱుత్త = వెంటనే కోసిన;కై తలత్తా ఎన్ఱు నిన్ఱు = దివ్య హస్తముగలవాడా! అని స్తుతించబడు; వణ్డు = భ్రమరములు; తాదోడు= పుష్పములలో అమరి; అలమ్బుమ్ = ఝంకారము చేయుచుండెడి; తణ్ శేఱై=చల్లని సారక్షేత్రమున వేంచేసియున్న; ఎమ్బెరుమాన్ తాళై = సారనాథుని దివ్యమైన చరణారవిందములను; ఏత్తి = స్తుతించి; పోదోడు = పుష్పములు మరియు; పునల్ తూవుమ్ = తీర్థములను సమర్పించు;పుణ్ణియరే = పుణ్యాత్ములే; విణ్ణవరిల్ = నిత్యశూరులకంటె; పొలిగిన్ఱారే = ఉన్నతస్థానము కలిగియుందురు.
కత్తివలె వాడియైన కోరలు పైకి వంగి ఎదిగి మెరుపువలె మెరయ ముంగిటనే వచ్చి నిలబడిన శరీరము గలదానియొక్క (శూర్పణకయొక్క),చెవులును మరియు , సన్నని ముక్కును, ఆ సమయమున,వెంటనే కోసిన దివ్య హస్తముగలవాడా! అని స్తుతించబడు, భ్రమరములు పుష్పములలో అమరి ఝంకారము చేయుచుండెడి చల్లని సారక్షేత్రమున వేంచేసియున్న సారనాథుని దివ్యమైన చరణారవిందములను స్తుతించి,పుష్పములు మరియు తీర్థములను సమర్పించు పుణ్యాత్ములే నిత్యశూరులకంటె ఉన్నత స్థానము కలిగియుందురు!.
తేరాళుమ్ వాళరక్కన్, తెన్నిలఙ్గై వెఞ్జమత్తు ప్పొన్ఱివీழ,
పోరాళుమ్ శిలైయదనాల్, పొరుకణైగళ్ పోక్కివిత్తాయెన్ఱు, నాళుమ్
తారాళుమ్ వరై మార్బన్, తణ్ శేఱై ఎమ్బెరుమాన్ ఉమ్బరాళుమ్,
పేరాళన్ పేరోదుమ్ పెరియోరై, ఒరుకాలమ్ పిరిగిలేనే ll 1581
తేర్ ఆళుమ్ = రథములను నడపించు సామర్ధ్యముగల; వాళ్ అరక్కన్ = ఖడ్గము ఆయుధముగగల రాక్షసుడు రావణాసురునియొక్క; తెన్ ఇలఙ్గై = అందమైన లంకాపురిని; వెమ్ శమత్తు = తీవ్రమైన యుద్ధమందు;పొన్ఱి వీழ=ఛిన్నభిన్నమగునట్లు; పోర్ ఆళుమ్ శిలై అదనాల్ = పోరు సలుపగల శార్ఙ్గమను విల్లువలన; పొరు కణైగళ్ = తీవ్రమైన బాణములను; పోక్కివిత్తాయ్ = ప్రయోగించినవాడా!; ఎన్ఱు నాళుమ్ = అని స్తుతించి, దినమంతయు; తార్ ఆళుమ్ వరై మార్బన్ = మాలలచే అలంకరింపబడిన పర్వతమువంటి వక్షస్థలముగలవాడును; ఉమ్బర్ ఆళుమ్ = ఊర్ధ్వ లోకములను పాలించువాడును; పేరాళన్ = గొప్పతనము కలిగినవాడును; తణ్ శేఱై = చల్లని సారక్షేత్రమున వేంచేసియున్న; ఎమ్బెరుమాన్ పేర్ ఓదుమ్ = సారనాథుని దివ్యమైన నామములను అనుసంధించు; పెరియోరై = మహాత్ములను; ఒరుకాలమ్ పిరిగిలేనే = ఒకసమయమందును విడిచివుండలేను!.
రథములను నడపించు సామర్ధ్యముగల ఖడ్గము ఆయుధముగగల రాక్షసుడు రావణాసురునియొక్క అందమైన లంకాపురిని తీవ్రమైన యుద్ధమందు, ఛిన్నభిన్నమగునట్లు పోరు సలుపగల శార్ఙ్గమను విల్లువలన తీవ్రమైన బాణములను ప్రయోగించినవాడా! అని స్తుతించి, దినమంతయు, మాలలచే అలంకరింపబడిన పర్వతమువంటి వక్షస్థలముగలవాడును,ఊర్ధ్వ లోకములను పాలించువాడును, గొప్పతనము కలిగినవాడును,చల్లని సారక్షేత్రమున వేంచేసియున్న సారనాథుని దివ్యమైన నామములను అనుసంధించు మహాత్ములను ఒకసమయమందును విడిచివుండలేను!.
వన్దిక్కుమ్ మర్ట్రవర్కుమ్, మాశుడమ్బిల్ వల్ అమణర్ తమక్కుమల్లేన్,
మున్దిచ్చెన్ఱరియురువాయ్, ఇరణియనై మురణ్ అழிత్త ముదల్వఱ్కల్లాల్,
శన్ద ప్పూమలర్ శోలై, త్తణ్ శేఱై ఎమ్బెరుమాన్ తాళై, నాళుమ్
శిన్దప్పార్కు ఎన్నుళ్ళమ్, తేనూఱి యెప్పొழுదుమ్ తిత్తిక్కుమే ll 1582
అరి ఉరువాయ్ = నరసింహరూపమునుదాల్చి; మున్ది శెన్ఱు = ముంగిటనే ప్రత్యక్షమై, ఇరణియనై మురణ్ = హిరణ్యాసురునియొక్క బలమును; అழிత్త = నశింపజేసిన; ముదల్ వఱ్కు అల్లాల్= జగత్కారణభూతుడైన సర్వేశ్వరునికి తప్ప;మాశుఉడమ్బిల్=మలినమైన శరీరముగల; వల్ల అమణర్ తమక్కుమ్ = బాగుగ వాదించు జైనులకును; వన్దిక్కుమ్ మర్ట్రవర్కుమ్ = ” చేతులజోడించి అరుచుకొనుచు పోవు” బౌద్ధులకును,అల్లేన్ = లోనగువాడనుకాను; శన్దమ్ పూ మలర్ శోలై = చందన పుష్పములుతో ఒప్పు తోటలుగల; తణ్ శేఱై = చల్లని సారక్షేత్రమున వేంచేసియున్న; ఎమ్బెరుమాన్ తాళై = సారనాథుని దివ్యమైన చరణారవిందములను; నాళుమ్ శిన్దప్పార్కు=దినమంతయు ధ్యానించు భాగవతుల విషయమున; ఎన్నుళ్ళమ్ = నాయొక్క హృదయమందు; తేనూఱి=తేనె ఊరుచు; ఎప్పొழுదుమ్ తిత్తిక్కుమే=ఎల్లప్పుడు మధురముగనుండును.
నరసింహరూపమునుదాల్చి,ముంగిటనే ప్రత్యక్షమై,హిరణ్యాసురునియొక్క బలమును నశింపజేసిన జగత్కారణభూతుడైన సర్వేశ్వరునికి తప్ప,మలినమైన శరీరముగల,బాగుగ వాదించు జైనులకును, “చేతులజోడించి అరుచుకొనుచు పోవు” బౌద్ధులకును, లోనగువాడనుకాను. చందన పుష్పములుతో ఒప్పు తోటలుగల చల్లని సారక్షేత్రమున వేంచేసియున్న సారనాథుని దివ్యమైన చరణారవిందములను దినమంతయు ధ్యానించు భాగవతుల విషయమున నాయొక్క హృదయమందు తేనె ఊరుచు ఎల్లప్పుడు మధురముగనుండును.
పణ్డేనమాయ్ ఉలగై అన్ఱిడన్ద, పణ్బాళా ఎన్ఱునిన్ఱు,
తొణ్డానేన్ తిరువడియే తుణైయల్లాల్, తుణైయిల్లేన్ శొల్లుగిన్ఱేన్,
వణ్డేన్దు మ్మలర్ పుఱవల్, వణ్ శేఱై ఎమ్బెరుమాన్ అడియార్ తమ్మై,
కణ్డేనుక్కిదు కాణీర్, ఎన్నెఞ్జుమ్ కణ్ణిణైయుమ్ కళిక్కుమాఱే ll 1583
పణ్డు అన్ఱు = పూర్వమొకకాలమున; ఏనమాయ్ = మహావరాహరూపముదాల్చి;ఉలగై ఇడన్ద = ఈ లోకమును తన కోరలచే అణ్డభిత్తిలోనుండి పైకెత్తిన; పణ్బాళా ఎన్ఱు నిన్ఱు=గుణశాలియే! అని స్తుతించుచు; తొణ్డు ఆనేన్ = శ్రీ వారి సేవకుడనైతిని; తిరువడియే తుణై అల్లాల్ = శ్రీ వారి దివ్యచరణములే నాకు రక్ష అదితప్ప;తుణై ఇల్లేన్ శొల్లుగిన్ఱేన్= వేరొక రక్షణములేనివాడనని విన్నవించుకొంటిని; వణ్డు ఏన్దుమ్ = భ్రమరములు ఆస్వాదించు; మలర్ పుఱవల్=పుష్పములతోఒప్పు తోటలుగల;వణ్ శేఱై=అందమైన సారక్షేత్రమున వేంచేసియున్న;ఎమ్బెరుమాన్ = సారనాథుని యొక్క;అడియార్ తమ్మై=భక్తులను; కణ్డేనుక్కు ఎన్నెఞ్జుమ్ = సేవించుకొన్న నాయొక్క మనస్సు మరియు; కణ్ ఇణైయుమ్ = నాయొక్క రెండు కన్నులు; కళిక్కుమ్ ఆఱు = పొందెడి ఆనందమును; ఇదు కాణీర్ = ఇట్టిదని చెప్పలేని స్థితిని చూడుడు!.
పూర్వమొకకాలమున మహావరాహరూపముదాల్చి ఈ లోకమును తన కోరలచే అణ్డభిత్తిలోనుండి పైకెత్తిన గుణశాలియే! అని స్తుతించుచు శ్రీ వారి సేవకుడనైతిని. శ్రీ వారి దివ్యచరణములే నాకు రక్ష, అదితప్ప వేరొక రక్షణము లేనివాడనని విన్నవించుకొంటిని. భ్రమరములు ఆస్వాదించు పుష్పములతో ఒప్పు తోటలుగల అందమైన సారక్షేత్రమున వేంచేసియున్న సారనాథుని యొక్క భక్తులను సేవించుకొన్న నాయొక్క మనస్సు మరియు నాయొక్క రెండు కన్నులు పొందెడి ఆనందమును,ఇట్టిదని చెప్పలేని స్థితిని చూడుడు!.
పైవిరియుమ్ వరియరవిల్, పడుకడలుళ్ తుయిలమర్ న్ద పణ్బా ఎన్ఱుమ్,
మైవిరియుమ్ మణివరైపోల్, మాయవనే యెన్ఱెన్ఱుమ్ వణ్డార్ నీలమ్,
శెయ్ విరియుమ్ తణ్ శేఱై ఎమ్బెరుమాన్, తిరువడియే చ్చిన్దిత్తేఱ్కు, ఎన్
ఐయఱివుఙ్గొణ్డానుక్కు అళానార్కాళామ్, ఎన్నన్బుదానే ll 1584
పడు కడలుళ్=అగాధమైన పాలసముద్రమున;పై విరియుమ్ వరి అరవిల్ = విశాలమైన పడగలతోను మరియు చిహ్నములతోను ప్రకాశించు ఆదిశేషునితల్పముపై; తుయిల్ అమర్ న్ద = యోగనిద్రలో అమరియున్న; పణ్బా ఎన్ఱుమ్ = గుణశాలియే! అనియు; మై విరియుమ్ మణి వరై పోల్ = మిక్కిలి నల్లని వర్ణముగల నీలమణులతోనిండిన కొండ వలెనున్న తిరుమేనిగల; మాయవనే ఎన్ఱు ఎన్ఱుమ్ = ఆశ్చర్యభూతుడా! అనియు పలుమార్లు స్తుతించుచు; వణ్డు ఆర్ నీలమ్ = భ్రమరములతో నిండిన నీలోత్పముల; శెయ్ విరియుమ్=పుష్పములతో కూడిన పొలములుగల;తణ్ శేఱై=చల్లని సారక్షేత్రమున వేంచేసియున్న;ఎమ్బెరుమాన్ తిరువడియే=సారనాథుని దివ్య చరణారవిందములనే; శిన్దిత్తేఱ్కు= ధ్యానించుచున్న వారిని;ఎన్ = నాయొక్క;ఐ అఱివుమ్ కొణ్డానుక్కు= పంచేంద్రియములఙ్ఞానము తనయందే నిమగ్నమగునట్లు కృప జేసిన సర్వేశ్వరునికి; అళ్ ఆనార్కు = దాసులైన భాగవతులకు;ఎన్ అన్బుదాన్ = నాయొక్క ప్రీతి; ఆళ్ ఆమ్ = చెందినదగును!.
అగాధమైన పాలసముద్రమున విశాలమైన పడగలతోను మరియు చిహ్నములతోను ప్రకాశించు ఆదిశేషుని తల్పముపై యోగనిద్రలో అమరియున్న గుణశాలియే!అనియు,మిక్కిలి నల్లని వర్ణముగల నీలమణులతోనిండిన కొండవలెనున్న తిరుమేనిగల ఆశ్చర్యభూతుడా! అనియు పలుమార్లు స్తుతించుచు, భ్రమరములతో నిండిన నీలోత్పముల పుష్పములతో కూడిన పొలములుగల చల్లని సారక్షేత్రమున వేంచేసియున్న సారనాథుని దివ్య చరణారవిందములనే ధ్యానించుచున్న వారిని, నాయొక్క పంచేంద్రియములఙ్ఞానము తనయందే నిమగ్నమగునట్లు కృప జేసిన సర్వేశ్వరునికి దాసులైన భాగవతులకు నాయొక్క ప్రీతి చెందినదగును!.
ఉణ్ణాదు వెఙ్గూర్ట్రమ్, ఓవాద పావఙ్గళ్ శేరా, మేలై
విణ్ణోరుమ్ మణ్ణోరుమ్ వన్దిఱైఞ్జుమ్, మెల్ తళిర్ పోల్ అడియినానై,
పణ్ణార వణ్డియమ్బుమ్, పైమ్బొழிల్ శూழ் తణ్ శేఱై యమ్మాన్దన్నై,
కణ్ణారక్కణ్డురుకి, క్కైయార త్తొழுవారై క్కరుదుఙ్గాలే ll 1585
మేలై విణ్ణోరుమ్ = ఊర్ధ్వలోకమునగల నిత్యశూరులు; మణ్ణోరుమ్=ఈ భూలోకమందలి జనులును; వన్దు ఇఱైఞ్జుమ్ = వచ్చి సేవించుకొనుచుండెడి; మెల్ తళిర్ పోల్ అడియనానై = మృదువైన (సుకుమారమైన) చిగురువంటి దివ్యమైన పాదద్వందములు కలవాడును;పణ్ ఆర వణ్డు ఇయమ్బుమ్ పై పొழிల్ శూழ்=రాగభరితముగ తుమ్మెదలు ఝంకారము చేయుచుండెడి తోటలతో చుట్టుకొనియున్న; తణ్ శేఱై = చల్లని సారక్షేత్రమున వేంచేసియున్న; అమ్మాన్ తన్నై = సారనాథుని;కణ్ణార కణ్డు= కనులార సేవించి; ఉరుకి = మనస్సు ద్రవించి; కై ఆర తొழுవారై=చేతులార పూజించు భక్తులను; కరుదుఙ్గాలే = తలచినంత మాత్రములోనే; వెమ్ కూర్ట్రమ్ = క్రూరమైన యమదేవత; ఉణ్ణాదు = హింసింపజాలదు; ఓవాద పావఙ్గళ్ శేరా = ఎడతెగని పాపములు చేరదు!.
ఊర్ధ్వలోకమునగల నిత్యశూరులు,ఈ భూలోకమందలి జనులును వచ్చి సేవించుకొనుచుండెడి సుకుమారమైన చిగురువంటి దివ్యమైన పాదద్వందములుగల, రాగభరితముగ తుమ్మెదలు ఝంకారము చేయుచుండెడి తోటలతో చుట్టుకొనియున్న చల్లని సారక్షేత్రమున వేంచేసియున్న సారనాథుని, కనులార సేవించి,మనస్సు ద్రవించి, చేతులార పూజించు భక్తులను తలచినంత మాత్రములోనే క్రూరమైన యమదేవత హింసింపజాలదు.ఎడతెగని పాపములు చేరదు!.
కళ్ళతేన్ పొయ్యగత్తేన్ ఆదలాల్, పోదరుకాల్ కవలైయెన్నుమ్,
వెళ్ళాత్తేఱ్కెన్గొలో, విళైవయలుళ్ కరునీలమ్ కళైఞర్ తాళాల్
తళ్ళ, తేన్ మణనాఱుమ్, తణ్ శేఱై ఎమ్బెరుమాన్ తాళై, నాళుమ్
ఉళ్ళత్తే వైప్పారుక్కిదు కాణీర్, ఎన్నుళ్ళమురుగుమాఱే ll 1586
విళై వయలుళ్ = పంటలుపండెడి పొలములందు మొలకెత్తు; కరు నీలమ్ = నల్లని కలువలను; కళైఞర్ = కలపుతీసెడి వారు ;తాళాల్ = కాళ్ళచే;తళ్ళ = తొక్కి నెట్టగ; తేన్ మణ నాఱుమ్ = వాటినుండి కారెడు తేనెలచే సువాసన వెదజల్లబడు;తణ్ శేఱై = చల్లని సారక్షేత్రమున వేంచేసియున్న; ఎమ్బెరుమాన్ తాళై = సారనాథుని దివ్యమైన చరణారవిందములను;నాళుమ్ ఉళ్ళత్తే=ఎల్లప్పుడు తమ హృదయమున;వైప్పారుక్కు= స్మరించు భాగవతుల విషయమున; ఎన్నుళ్ళమ్ ఉరుగుమ్ ఆఱు = నాయొక్క మనస్సు ద్రవించి శిధిలమగు విధమును; ఇదు కాణీర్ = ఇట్టిదని చెప్పలేని స్థితిని చూడుడు!కళ్ళతేన్ పొయ్యగత్తేన్ ఆదలాల్ = ఆత్మాపహారి మరియు వంచన హ్రుదయుడను అయిన కారణముచే; పోదరుకాల్ = ఒక క్షణకాలమైనను ఎడతెగక; కవలైయెన్నుమ్ వెళ్ళాత్తేఱ్కు=దుఃఖమను పెద్ద సముద్రమున మునిగియున్న నాకు; ఇదు ఎన్ కొల్ = ఇటువంటి మహాభాగ్యము ఏ విధముగ కలిగినదో! (ఇది సర్వేశ్వరుని నిర్హేతుక కృపయే యని ఆళ్వార్ మనోభావము)
పంటలుపండెడి పొలములందు మొలకెత్తు నల్లని కలువలను కలపుతీసెడివారు, కాళ్ళచే తొక్కి నెట్టగ,వాటినుండి కారెడు తేనెలచే సువాసన వెదజల్లబడు చల్లని సారక్షేత్రమున వేంచేసియున్న సారనాథుని దివ్యమైన చరణారవిందములను ఎల్లప్పుడు తమ హృదయమున స్మరించు భాగవతుల విషయమున నాయొక్క మనస్సు ద్రవించి శిధిలమగు విధమును ఇట్టిదని చెప్పలేని స్థితిని చూడుడు!ఆత్మాపహారి మరియు వంచన హ్రుదయుడను అయిన కారణముచే ఒక క్షణకాలమైనను ఎడతెగక దుఃఖమను పెద్ద సముద్రమున మునిగియున్న నాకు ఇటువంటి మహాభాగ్యము ఏ విధముగ కలిగినదో! (ఇది సర్వేశ్వరుని నిర్హేతుక కృపయే యని ఆళ్వార్ మనోభావము)
** పూమాణ్ శేర్ కరుఙ్గుழలార్ పోల్ నడన్దు, వయల్ నిన్ఱ పెడైయోడు, అన్నమ్
తేమావిన్ ఇన్నిழలిల్ కణ్ తుయిలుమ్, తణ్ శేఱై యమ్మాన్ దన్నై,
వామాన్ తేర్ పరకాలన్, కలికన్ఱి ఒలిమాలై కొణ్డు తొణ్డీర్ ,
తూమాణ్ శేర్ పొన్నడిమేల్ శూట్టుమిన్,నుమ్ తుణైక్కైయాల్ త్తొழுదునిన్ఱే ll 1587
అన్నమ్ = హంసలు; వయల్ నిన్ఱ = పొలములందు సంచరించుచున్న; పెడైయోడు = తమ ఆడ హంసలతో కూడి;పూ మాణ్ శేర్ కరు కుழలార్ పోల్ నడన్దు=పుష్పములతో అలంకరించుకొనిన నల్లని కేశములుగల యౌవన యువతులవలె నడుచుచు;తేమావిన్= తేనెలొలుకు మామిడి చెట్లయొక్క; ఇన్ నిழలిల్ = ఆనందదాయకమగు నీడలయందు; కణ్ తుయిలుమ్ = నిదురించుచుండెడి;తణ్ శేఱై=చల్లని సారక్షేత్రమున వేంచేసియున్న; అమ్మాన్ తన్నై = సారనాథుని విషయమై; వామ్ మాన్ తేర్ పరకాలన్ = అశ్వములతో కట్టబడిన రధముపై సంచరించు శత్రువులకు యముడువంటివారైన; కలికన్ఱి=తిరుమంగై ఆళ్వార్; ఒలి మాలై కొణ్డు = అనుగ్రహించిన ఈ సూక్తులమాలను గ్రహించి;తొణ్డీర్ = భక్తులారా! తూ మాణ్ శేర్ = పరిశుద్దమైన మహిమాన్వితమగు; పొన్ అడిమేల్ = స్వామియొక్క సుందరమైన చరణారవిందములందు; నుమ్ తుణై కైయాల్ తొழுదు నిన్ఱు = మీరు అంజలి బద్ధులై సేవించుచు; శూట్టుమిన్ = అలంకరింపజేయుడు!
హంసలు పొలములందు సంచరించుచున్న తమ ఆడ హంసలతో కూడి పుష్పములతో అలంకరించుకొనిన నల్లని కేశములుగల యౌవన యువతులవలె నడుచుచు తేనెలొలుకు మామిడి చెట్లయొక్క ఆనందదాయకమగు నీడలయందు నిదురించుచుండెడి చల్లని సారక్షేత్రమున వేంచేసియున్న సారనాథుని విషయమై అశ్వములతో కట్టబడిన రధముపై సంచరించు శత్రువులకు యముడువంటివారైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన ఈ సూక్తులమాలను గ్రహించి భక్తులారా!,పరిశుద్దమైన మహిమాన్వితమగు స్వామియొక్క సుందరమైన చరణారవిందములందు మీరు అంజలి బద్ధులై సేవించుచు అలంకరింపజేయుడు!.
******