శ్రీః
5.తన్దైకాల్
తిరు అழுన్దూర్ దివ్యదేశముయొక్క వైభవమును తిరుమంగైఆళ్వార్ పొగుడుచున్నారు.
** తన్దైకాలిల్ పెరువిలఙ్గు, తాళ్ అవిழ, నల్లిరుట్కణ్
వన్ద ఎన్దైపెరుమానార్, మరువినిన్ఱ వూర్ పోలుమ్,
మున్దివానమ్ మழை పొழிయ, మూవావురువిన్ మఱైయాళర్,
అన్దిమూన్ఱుమ్ అనల్ ఓమ్బుమ్, అణియార్ వీది అழுన్దూరే ll 1588
తన్దై=తండ్రి అయిన వసుదేవునియొక్క; కాలిల్ పెరు విలఙ్గు తాళ్ అవిழ = కాళ్ళయందలి పెద్ద సంకెళ్ళ తాళములు పగిలి క్రిందపడునట్లు;నల్ ఇరుళ్ కణ్=మంచి అర్ధరాత్రియందు; వన్ద =అవతరంచిన; ఎన్దై=నాయొక్కస్వామియైన; పెరుమానార్= సర్వేశ్వరుడు; మరువి నిన్ఱ ఊర్ పోలుమ్ = ఆశించి నిత్యవాసము చేయు దివ్యదేశము ( ఏదనగ );వానమ్ = మేఘములు; మున్ది = (యాగములు చేయక) ముందే;మழை పొழிయ= వర్షములు కురిపించుచుండునదియు; మూవా ఉరువిన్ = ముసలితనము లేని శరీరములుగల; మఱైయాళర్ = బ్రాహ్మణోత్తములచే; అన్ది మూన్ఱుమ్ = మూడు సంధ్యా కాలములందును; అనల్ ఓమ్బుమ్ = అగ్నిహోత్రక్రియలు చేయబడుచున్న; అణి ఆర్ వీది = మిక్కిలి సుందరమైన వీధులుగల; అழுన్దూరే = తిరు అழுన్దూరే సుమా!.
తండ్రి అయిన వసుదేవునియొక్క కాళ్ళయందలి పెద్ద సంకెళ్ళతాళములు పగిలి క్రింద పడునట్లు మంచి అర్ధరాత్రియందు అవతరంచిన నాయొక్క స్వామి యైన సర్వేశ్వరుడు ఆశించి నిత్యవాసము చేయు దివ్యదేశము ( ఏదనగ ), మేఘములు, యాగములు చేయక ముందే వర్షములు కురిపించు చుండునదియు,ముసలి తనములేని శరీరములుగల బ్రాహ్మణోత్తములచే మూడు సంధ్యాకాలములందు అగ్నిహోత్ర క్రియలు చేయబడుచున్న మిక్కిలి సుందరమైన వీధులుగల తిరు అழுన్దూరే సుమా! .
పారిత్తెழுన్ద, పడైమన్నర్ తమ్మై మాళ, పారదత్తు
త్తేరిల్ పాగనాయ్ ఊర్ న్ద, దేవ దేవ నూర్ పోలుమ్,
నీరిల్ పణైత్త నెడువాళైక్కు, అఞ్జిప్పోన కురుగినఙ్గళ్,
ఆరల్ కవుళోడు అరుగణైయుమ్, అణియార్ వయల్ శూழ் అழுన్దూరే ll 1589
పారిత్తు ఎழுన్ద= (జయించవలెనని)మిక్కిలి ఉత్తేజముతో ఏతెంచి వచ్చిన; పడై మన్నర్ తమ్మై మాళ = ఆయుధములతో నున్న రాజులు మరణించునట్లు; తేరిల్ పాగనాయ్ ఊర్ న్ద = అర్జునుని రథమును సారధియై నడిపించిన; దేవ దేవన్ = దేవాదిదేవుడు; ఊర్ పోలుమ్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము(ఏదనగ );నీరిల్ = నీటిలో; పణైత్త = బాగుగ పెరిగిన;నెడు వాళైక్కు= పెద్ద మీనములకు;అఞ్జిపోన కురుగు ఇనఙ్గళ్ = భయపడి పారిపోవు నారపక్షుల సమూహములు; ఆరల్ = ‘ఆరల్ ‘ అను చిన్న చేపలను; కవుళోడు = తమ ముక్కన కరుచుకొని; అరుగు అణైయుమ్ = సమీపమందు చేరుచుండెడి; అణియార్ వయల్ శూழ் = మిక్కిలి అందమైన పొలములచే చుట్టుకొనియున్న; అழுన్దూరే = తిరు అழுన్దూరే సుమా!
(జయించవలెనని) మిక్కిలి ఉత్తేజముతో ఏతెంచి వచ్చిన ఆయుధములతో నున్న రాజులు మరణించునట్లు అర్జునుని రథమును సారధియై నడిపించిన దేవాదిదేవుడు.నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము(ఏదనగ ),నీటిలో బాగుగ పెరిగిన పెద్ద మీనములకు భయపడి పారిపోవు నారపక్షుల సమూహములు, ‘ఆరల్’ అను చిన్న చేపలను తమ ముక్కన కరుచుకొని సమీపమందు చేరుచుండెడి మిక్కిలి అందమైన పొలములచే చుట్టుకొనియున్న తిరు అழுన్దూరే సుమా!.
శెమ్బొన్ మదిళ్ శూழ் తెన్నిలఙ్గైక్కిఱైవన్, శిరఙ్గళ్ ఐయిరణ్డుమ్,
ఉమ్బర్ వాళిక్కిలక్కాగ, ఉదిర్ త్త వురవోనూర్ పోలుమ్
కొమ్బిలార్ న్ద మాదవిమేల్, కోది మేయ్ న్ద వణ్డినఙ్గళ్,
అమ్బరావుమ్ కణ్ మడవార్,ఐమ్బాల్ అణియమ్ అழுన్దూరే ll 1590
శెమ్ పొన్ మదిళ్ శూழ்=మేలిమి బంగారుమయమయిన ప్రాకారములతొ చుట్టబడిన; తెన్ ఇలఙ్గైక్కు ఇఱైవన్ = అందమైన లంకాపురికి ప్రభువైన రావణాసురుని యొక్క; శిరఙ్గళ్ ఐయిరణ్డుమ్ = పదితలలు; ఉమ్బర్ వాళిక్కు= బ్రహ్మాస్త్రమునకు; ఇలక్కు ఆగ = గురియగునట్లుచేసి; ఉదిర్ త్త = ఖండించిన; ఉరవోన్ = మిక్కిలి శక్తివంతుడైన సర్వేశ్వరుడు; ఊర్ పోలుమ్ = వసించెడి దివ్యదేశము ( ఏదనగ ); కొమ్బిల్ ఆర్ న్ద = కొమ్మలతో నిండిన; మాదవి మేల్ =”కురుక్కత్తి” చెట్టుపై;కోది మేయ్ న్ద వణ్డు ఇనఙ్గళ్ = దళములను చీల్చి మధువును పానముచేయు తుమ్మెదల సమూహములు; అమ్బు అరావుమ్ కణ్ మడవార్ = బాణములవలె నేత్రములుగల యవతుల; ఐమ్బాల్ అణియమ్ = (గిరిజములతో, పొడవైన, దట్టముగ, నల్లని, సువాసన వెదజల్లు) కేశములందు చేరుచుండెడి; అழுన్దూరే = తిరు అழுన్దూరే సుమా!.
మేలిమి బంగారు మయమయిన ప్రాకారములతొ చుట్టబడిన అందమైన లంకాపురికి ప్రభువైన రావణాసురునియొక్క పదితలలు బ్రహ్మాస్త్రమునకు గురి యగునట్లుచేసి ఖండించిన మిక్కిలి శక్తివంతుడైన సర్వేశ్వరుడు వసించెడి దివ్యదేశము ( ఏదనగ ), కొమ్మలతో నిండిన “కురుక్కత్తి” చెట్టుపై దళములను చీల్చి మధువును పానముచేయు తుమ్మెదల సమూహములు బాణములవలె నేత్రములుగల యవతుల గిరిజములతో, పొడవైన, దట్టముగ, నల్లని, సువాసన వెదజల్లు ఐదు లక్షణములుగల కేశములందు చేరుచుండెడి తిరుఅழுన్దూరే సుమా!.
వెళ్ళత్తుళ్ ఓరాలిలైమేల్, మేవి అడియేన్ మనమ్ పుగున్దు, ఎన్నై
ఉళ్ళత్తుళ్ళుమ్ కణ్ణుళ్ళుమ్, నిన్ఱార్ నిన్ఱవూర్ పోలుమ్,
పుళ్ళు ప్పిళ్ళైక్కిరైతేడి, పోన కాదల్ పెడైయోడుమ్,
అళ్ళల్ శెఱువిల్ కయల్ నాడుమ్, అణియార్ వయల్ శూழ் అழுన్దూరే ll 1591
వెళ్ళత్తుళ్ = ప్రళయము సంభవించిన కాలమున ఆ మహాసముద్రములో; ఓర్ ఆల్ ఇలై మేల్ మేవి = సాటిలేని ఒక వటదళముపై అమరియుండి; అడియేన్ మనమ్ పుగున్దు = అట్టి స్థితితోనే ఈ దాసుని మనమున ప్రవేశించి;ఎన్నై ఉళ్ళత్తుళ్ళుమ్ కణ్ణుళ్ళుమ్ నిన్ఱార్ = నాయొక్క హృదయమందును, కన్నులయందును నిలిచియున్న సర్వేశ్వరుడు; నిన్ఱ ఊర్ పోలుమ్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము(ఏదనగ ); కాదల్ పెడైయోడుమ్ = తమ ప్రియమైన ఆడపక్షులతోకూడి; పిళ్ళైక్కు ఇరై తేడి పోన =తమ పిల్లలకు ఆహారమునకై వెదుకుచు పోయిన; పుళ్ళు = పక్షులు; అళ్ళల్ శెఱువిల్ కయల్ నాడుమ్ = బురదతో నిండిన పంటభూములలో చేపలను వెదుకుచుండెడి; అణియార్ వయల్ శూழ் = మిక్కిలి అందమైన పొలములచే చుట్టుకొనియున్న; అழுన్దూరే = తిరు అழுన్దూరే సుమా!
ప్రళయము సంభవించిన కాలమున ఆ మహాసముద్రములో సాటిలేని ఒక వటదళముపై అమరియుండి , అట్టి స్థితితోనే ఈ దాసుని మనమున ప్రవేశించి, నాయొక్క హృదయమందును, కన్నుల యందును నిలిచియున్న సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము (ఏదనగ )తమ ప్రియమైన ఆడపక్షులతోకూడి తమ పిల్లలకు ఆహారమునకై వెదుకుచు పోయిన పక్షులు బురదతోనిండిన పంటభూములలో చేపలను వెదుకుచుండెడి మిక్కిలి అందమైన పొలములచే చుట్టుకొనియున్న తిరు అழுన్దూరే సుమా!.
పగలు మిరవుమ్ తానేయాయ్, ప్పారుమ్ విణ్ణుమ్ తానేయాయ్,
నిగరిల్ శుడరాయ్ యిరుళాగి, నిన్ఱార్ నిన్ఱవూర్ పోలుమ్,
తుగిలిన్ కొడియుమ్ తేర్ త్తుగళుమ్, తున్ని మాదర్ కూన్దల్ వాయ్,
అగిలిన్ పుకైయాల్ ముగిలేయ్ క్కుమ్,అణియార్ వీది అழுన్దూరే ll 1592
పగలుమ్ ఇరవుమ్ తానే ఆయ్=పగలు,రాత్రులకు నియామకుడైన;పారుమ్ విణ్ణుమ్ తానే ఆయ్=లీలావిభూతికిని; నిత్యవిభూతికిని నియామకుడైన; నిగరిల్ శుడర్ ఆయ్ = సాటిలేని నక్షత్రాది తేజస్సుపదార్దములకు ఆధారముగాను; ఇరుళ్ ఆగి నిన్ఱార్ = చీకటికి ఆధారభూతుడగను నిలిచియున్న సర్వేశ్వరుడు; నిన్ఱ ఊర్ పోలుమ్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము (ఏదనగ)తుగిలిన్ కొడియుమ్ = వస్త్రములతో నిర్మితమైన ధ్వజములును;తేర్ తుగళుమ్ =రథమును నడిపించునపుడు ఎగిసిన ధూళితోను; తున్ని మాదర్ కూన్దల్ వాయ్ = దట్టమైన యువతులు తమయొక్క కేశములను ఆరబెట్టుకొనుచున్న;అగిలిన్ పుకైయాల్= అగిల్ పొగలచేతను; ముగిల్ ఏయ్ క్కుమ్= వర్షాకాలము వలె ఒప్పుచుండునదియు; అణి ఆర్ వీది = మిక్కిలి సుందరమైన వీధులుగల; అழுన్దూరే=తిరు అழுన్దూరే సుమా! .
పగలు,రాత్రులకు నియామకుడైన,లీలావిభూతికిని,నిత్యవిభూతికిని నియామకుడైన,సాటిలేని నక్షత్రాది తేజస్సుపదార్దములకు ఆధారముగాను,చీకటికి ఆధారభూతుడగను నిలిచియున్న సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము (ఏదనగ ) వస్త్రములతో నిర్మితమైన ధ్వజములును,రథమును నడిపించునపుడు ఎగిసిన ధూళితోను,దట్టమైన యువతులు తమయొక్క కేశములను ఆరబెట్టుకొనుచున్న అగిల్ పొగలచేతను, వర్షాకాలము వలె ఒప్పుచుండునదియు, మిక్కిలి సుందరమైన వీధులుగల తిరు అழுన్దూరే సుమా!.
ఏడిలఙ్గు తామరైపోల్, శెవ్వాయ్ ముఱువల్ శెయ్ దరుళి,
మాడువన్దెన్మనమ్ పుగున్దు, నిన్ఱార్ నిన్ఱవూర్ పోలుమ్,
నీడు మాడత్తని చ్చూలమ్, పోழிక్కొణ్డల్ తుళితూవ,
ఆడల్ అరవత్తు ఆర్ ప్పోవా, అణియార్ వీది అழுన్దూరే ll 1593
ఏడు ఇలఙ్గు తామరై పోల్ = దళములతో సుందరముగ వికసించిన తామరపుష్పము వలె ఒప్పు; శెమ్ వాయ్ ముఱువల్ శెయ్ దు అరుళి =శ్లాఘ్యమైన తన చిరునవ్వును కృపజేసి;మాడు వన్దు=సమీపమునకు వచ్చి;ఎన్ మనమ్ పుగున్దు నిన్ఱార్ = నాయొక్క హృదయమందు ప్రవేశించి నిలిచియున్న సర్వేశ్వరుడు; నిన్ఱ ఊర్ పోలుమ్=నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము (ఏదనగ ); నీడు మాడమ్ = మిక్కిలి ఎత్తైన భవనములపై నాటిన; తని శూలమ్ = సాటిలేని శూలములు; పోழ்గ = (మేఘమండలమును) గుచ్చుకొనగ: తుళితూవ = వర్షమును కురుపించుచున్నదియు; ఆడల్ అరవత్తు ఆర్ ప్పు ఓవా = నృత్యములయొక్క ఘోషల కోలాహలములు ఎడతెగక వినబడుచుండు; అణి ఆర్ వీది = మిక్కిలి సుందరమైన వీధులుగల; అழுన్దూరే=తిరు అழுన్దూరే సుమా! .
దళములతో సుందరముగ వికసించిన తామరపుష్పమువలె ఒప్పు శ్లాఘ్యమైన తన చిరునవ్వును కృపజేసి,సమీపమునకు వచ్చి, నాయొక్క హృదయమందు ప్రవేశించి నిలిచియున్న సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము (ఏదనగ) మిక్కిలి ఎత్తైన భవనములపై నాటిన సాటిలేని శూలములు (మేఘ మండలమును) గుచ్చుకొనగ,మేఘములు వర్షమును కురుపించు చున్నదియు, నృత్యములయొక్క ఘోషల కోలాహలములు ఎడతెగక వినబడుచుండు మిక్కిలి సుందరమైన వీధులుగల తిరు అழுన్దూరే సుమా! .
మాలై ప్పుగున్దు మలరణై మేల్ వైగి, అడియేన్ మనమ్ పుగున్దు,ఎన్
నీలక్కణ్గళ్ పనిమల్ గ; నిన్ఱార్ నిన్ఱవూర్ పోలుమ్,
వేలైక్కడల్ పోల్ నెడువీది, విణ్ తోయ్ శుదై వెణ్ మణిమాడత్తు,
ఆలైప్పుకైయాల్ అழఱ్కదిరైమఱైక్కుమ్, వీది అழுన్దూరే ll 1594
మాలై పుగున్దు = సాయంకాల సమయమున ఏతెంచి; మలర్ అణై మేల్ వైగి = పుష్పముల తల్పముపై పవళించియుండి;అడియేన్ మనమ్ పుగున్దు = ఈ దాసురాలి మనస్సున ప్రవేశించి; ఎన్ నీలమ్ కణ్గళ్ పనిమల్ గ నిన్ఱార్ = నాయొక్క నీలోత్పలముల వంటి నేత్రములనునుండి ఆనందబాష్పములు కారునట్లు నిలిచియున్న సర్వేశ్వరుడు; నిన్ఱ ఊర్ పోలుమ్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము (ఏదనగ ); వేలై కడల్ పోల్ = సముద్రము యొక్క తీరముతో ఒప్పు; నెడు వీది = పొడుగైన వీధులును;విణ్ తోయ్ =ఆకాశమును స్పర్శించుచుండు ఉన్నతమైన; శుదై వెణ్ మణి మాడత్తు = సున్నము రాయబడిన తెల్లని అందమైన భవనములపైన; అழల్ కదిరై = సూర్య కిరణములను; ఆలై పుకైయాల్ = చెరకు మిల్లులనుండి వచ్చెడి పొగలు; మఱైక్కుమ్ = కప్పుచున్నట్టి; వీది అழுన్దూరే = సుందరమైన వీధులుగల తిరు అழுన్దూరే సుమా! .
సాయంకాల సమయమున ఏతెంచి,పుష్పముల తల్పముపై పవళించియుండి,ఈ దాసురాలి మనస్సునప్రవేశించి నాయొక్క నీలోత్పలముల వంటి నేత్రములనునుండి ఆనందబాష్పములు కారునట్లు నిలిచియున్న సర్వేశ్వరుడు, నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము (ఏదనగ), సముద్రము యొక్క తీరముతో ఒప్పు పొడుగైన వీధులును,ఆకాశమును స్పర్శించుచుండు ఉన్నతమైన సున్నము రాయబడిన తెల్లని అందమైన భవనములపైన సూర్య కిరణములను చెరకు మిల్లులనుండి వచ్చెడి పొగలు కప్పుచున్నట్టి సుందరమైన వీధులుగల తిరు అழுన్దూరే సుమా! .
వఞ్జిమరుఙ్గుల్ ఇడైనోవ, మణన్దు నిన్ఱ కనవగత్తు, ఎన్
నెఞ్జు నిఱైయ క్కైకూప్పి, నిన్ఱార్ నిన్ఱవూర్ పోలుమ్,
పఞ్జియన్న మెల్లడి, నల్ పావై మార్ గళ్, ఆడగత్తిన్
అఞ్జిలమ్బిన్ ఆర్ ప్పోవా, అణియార్ వీది అழுన్దూరే ll 1595
వఞ్జి మరుఙ్గుల్ ఇడై నోవ = తీగవంటి సన్నని నడుము నొచ్చునట్లు; మణన్దు నిన్ఱ = నాతో సంశ్లేషించిన ; కన అగత్తు = స్వప్నములో; ఎన్ నెఞ్జు నిఱైయ=నాయొక్క మనస్సు తృప్తిచెందువరకు; కై కూప్పి = నేను అంజలి చేయునట్లు; నిన్ఱార్=నిలిచియున్న సర్వేశ్వరుడు; నిన్ఱ ఊర్ పోలుమ్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము (ఏదనగ);పఞ్జి అన్న మెల్ అడి = దూదివలె మృదువైన పాదములుగల; నల్ పావై మార్ గళ్ = అందమైన యువతులయొక్క; ఆడ గత్తిన్ అమ్ శిలమ్బిన్ = బంగారుమయమయిన అందమైన గజ్జెలయొక్క; ఆర్ ప్పు= సవ్వడి; ఓవా = ఎడతెగక వినిపించుచుండు; అణి ఆర్ వీది = మిక్కిలి సుందరమైన వీధులుగల; అழுన్దూరే=తిరు అழுన్దూరే సుమా!
తీగవంటి సన్నని నడుము నొచ్చునట్లు నాతో సంశ్లేషించిన, స్వప్నములో నాయొక్క మనస్సు తృప్తిచెందువరకు నేను అంజలి చేయునట్లు నిలిచియున్న సర్వేశ్వరుడు, నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము (ఏదనగ),దూదివలె మృదువైన పాదములుగల అందమైన యువతులయొక్క బంగారుమయమయిన అందమైన గజ్జెల యొక్క సవ్వడి ఎడతెగక వినిపించుచుండు మిక్కిలి సుందరమైన వీధులుగల తిరు అழுన్దూరే సుమా!
ఎన్నైమ్బులనుమ్ ఎழிలుమ్ కొణ్డు, ఇఙ్గే నెరునల్ ఎழுన్దరుళి,
పొన్నఙ్గలైగళ్ మెలివెయ్ ద, ప్పోనపునిదనూర్ పోలుమ్,
మన్ను ముదునీర్ అరవిన్ద మలర్ మేల్, వరివణ్డిశై పాడ,
అన్నమ్బెడై యోడుడన్ ఆడుమ్, అణియార్ వయల్ శూழ் అழுన్దూరే ll 1596
నెరునల్ = నిన్నటిదినమున;ఇఙ్గే = నేనున్న చోటుకే;ఎழுన్దు అరుళి= కృపతో వేంచేసి; ఎన్ ఐమ్బులనుమ్ = నాయొక్క పంచేంద్రియములను;ఎழிలుమ్ కొణ్డు= అందమును అనుభవించి; పొన్ అమ్ కలైగళ్ మెలివు ఎయ్ ద= మిక్కిలి సుందరమైన నాయొక్క వస్త్రములు నలిగిపోవునట్లు చేసి; పోన = నన్ను విడిచిపోయిన; పునిదన్ = పరమ పవిత్రుడైన సర్వేశ్వరుడు; ఊర్ పోలుమ్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము ( ఏదనగ ); మన్ను ముదునీర్ = ఒకప్పుడును ఎండిపోని లోతైన జలాశయములలో; అరవిన్ద మలర్ మేల్=తామర పుష్పములపై;వరి వణ్డు ఇశై పాడ=అందమైన గీతలుగల భ్రమరములు రాగభరితముగ ఝంకారము చేయుచుండగ;అన్నమ్ పెడైయోడుడన్ ఆడుమ్=హంసలు తమ ఆడ హంసలతో కూడి నృత్యము చేయుచుండెడి;అణియార్ వయల్ శూழ் = మిక్కిలి అందమైన పొలములచే చుట్టుకొనియున్న; అழுన్దూరే = తిరు అழுన్దూరే సుమా!
నిన్నటిదినమున నేనున్న చోటుకే కృపతో వేంచేసి నాయొక్క పంచేంద్రియములను, అందమును అనుభవించి మిక్కిలి సుందరమైన నాయొక్క వస్త్రములు నలిగిపోవునట్లు చేసి నన్ను విడిచిపోయిన పరమ పవిత్రుడైన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము ( ఏదనగ ), ఒకప్పుడును ఎండిపోని లోతైన జలాశయములలో తామరపుష్పములపై అందమైన గీతలుగల భ్రమరములు రాగ భరితముగ ఝంకారము చేయుచుండగ,హంసలు తమ ఆడ హంసలతో కూడి నృత్యము చేయుచుండెడి మిక్కిలి అందమైన పొలములచే చుట్టుకొనియున్న తిరు అழுన్దూరే సుమా!
** నెల్లిల్ కువళై కణ్ కాట్ట, నీరిల్ కుముదమ్ వాయ్ కాట్ట,
అల్లిక్కమలమ్ ముగఙ్గాట్టుమ్, కழని యழுన్దూర్ నిన్ఱానై,
వల్లి ప్పొతుమ్బిల్ కుయిల్ కూవుమ్, మఙ్గై వేన్దన్ పరకాలన్,
శొల్లిల్ పొలిన్ద తమిழ் మాలై, శొల్ల ప్పావమ్ నిల్లావే ll 1597
నెల్లిల్ కువళై కణ్ కాట్ట = ధాన్యము పండెడి పొలములో మొలకెత్తిన నల్లకలువలు (అచటి యువతుల)నేత్రములును స్పురింప జేయుచున్నదియు; నీరిల్ కుముదమ్ వాయ్ కాట్ట=నీటిలో మొలచిన ఎర్ర కలువలు (అచటి యువతుల) అదరములను స్పురింప జేయుచున్నదియు; అల్లి కమలమ్ ముగమ్ కాట్టుమ్ = వికసించిన తామరపుష్పములు (అచటి యువతుల)ముఖమును స్పురింప జేయునదియుఅయిన; కழని అழுన్దూర్ నిన్ఱానై = పొలములతో చుట్టుకొనియున్న తిరు అழுన్దూరు దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై; వల్లి పొతుమ్బిల్ = పూల తీగల దట్టమైన పొదలలో; కుయిల్ కూవుమ్ = కోకిలలు కూయుచున్న; మఙ్గై వేన్దన్ = తిరుమంగై దేశవాసులకు ప్రభువును; పరకాలన్ = శత్రువులకు యముడు వంటివారైన తిరుమంగై ఆళ్వార్; శొల్లిల్ పొలిన్ద = సూక్తులతో వర్ధిల్లుచున్న; తమిழ் మాలై = తమిళ భాషలోనున్న ఈ పాశురముల మాలను; శొల్ల = పఠించినచో;పావమ్ నిల్లావే = పాపములు మనచెంత నిలువలేవు!.
ధాన్యము పండెడి పొలములో మొలకెత్తిన నల్లకలువలు (అచటి యువతుల) నేత్రములును స్పురింప జేయుచున్నదియు,నీటిలో మొలచిన ఎర్ర కలువలు (అచటి యువతుల) అదరములను స్పురింప జేయుచున్నదియు,వికసించిన తామర పుష్పములు (అచటి యువతుల)ముఖమును స్పురింప జేయునదియు అయిన, పొలములతో చుట్టుకొనియున్న తిరు అழுన్దూరు దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై,పూల తీగల దట్టమైన పొదలలో కోకిలలు కూయుచున్న తిరుమంగై దేశవాసులకు ప్రభువును,శత్రువులకు యముడువంటివారైన తిరుమంగై ఆళ్వార్ సూక్తులతో వర్ధిల్లుచున్న తమిళ భాషలోనున్న ఈ పాశురముల మాలను పఠించినచో పాపములు మనచెంత నిలువలేవు !.
*******