శ్రీః
8. శెఙ్గమలమ్
తిరుఅழுన్దూరు దివ్యదేశమున వేంచేసియున్న ఆమరువియప్పన్ పెరుమాళ్ ను సేవించిన తిరుమంగై ఆళ్వార్,భక్తులను ఆ సర్వేశరునిదివ్యచరణములను సేవించుటకై ప్రోత్సహించుచున్నారు.
** శెఙ్గమల త్తిరుమగళుమ్ పువియుమ్, శెమ్బొన్
తిరువడియినిణై వరుడ మునివరేత్త,
వఙ్గమలితడఙ్గడలుళ్ అనన్దనెన్నుమ్,
వరిఅరవిణైత్తుయిన్ఱ మాయోన్ కాణ్బిన్,
ఎఙ్గుమలినిఱైపుగழ் నాల్ వేదమ్, ఐన్దు
వేళ్విగళుమ్ కేళ్విగళుమ్ ఇయన్ఱతన్మై,
అఙ్గమలత్తయననైయార్ పయిలమ్ శెల్వత్తు,
అణి యழுన్దూర్ నిన్ఱుగన్ద అమరర్ కోవే ll 1618
ఎఙ్గుమ్ మలి నిఱై పుగழ்నాల్ వేదమ్=లోకమంతట మిక్కిలి కీర్తికలిగియున్న నాలుగు వేదములు; ఐన్దు వేళ్విగళుమ్ = పంచ మహాయజ్ఞములు మరియు; కేళ్విగళుమ్= శాస్త్రములు; ఇయన్ఱ = ఘోషించుచున్న విషయములను బాగుగ తెలిసిన; తన్మై = స్వభావముగల; అమ్ కమలత్తు అయన్ అనైయార్ = సర్వేశ్వరుని యొక్క అందమైన నాభి కమలమందు జన్మించిన చతుర్ముఖ బ్రహ్మవంటి వారని పొగడబడు బ్రాహ్మణులు; పయిలమ్ = నిత్యవాసము చేయుచున్న; శెల్వత్తు = సిరిసంపదలతో తులతూగు; అణి అழுన్దూర్ నిన్ఱు ఉగన్ద= అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తిపొందియున్న; అమరర్ కోవే = బ్రహ్మాదిదేవతల యొక్క ప్రభువైన సర్వేశ్వరుడు; (ఎవరనగ) శెమ్ కమల తిరుమగళుమ్=ఎర్ర తామరపుష్పమందు వసించు శ్రీదేవియు; పువియుమ్= శ్రీ భూదేవియు;శెమ్ పొన్ తిరు అడియిన్ ఇణై వరుడ = ఎర్రని సుందరమైన పాదద్వందములను మెల్లగ ఒత్తుచుండునదియు; మునివర్ ఏత్త = మహాఋషులు స్తుతించుచుండునదియు; వఙ్గ మలి తడ కడలుళ్ = అలలతో నిండిన పెద్ద పాలసముద్రమున;అనన్దన్ ఎన్నుమ్ వరి అరవిన్ అణై=అనంతుడను నామముగల చిహ్నములతో ప్రకాశించు ఆదిశేషుని తల్పముపై; తుయిన్ఱ = యోగనిద్రలో అమరియున్న; మాయోన్=ఆశ్చర్యభూతుడైన స్వామిని;కాణ్బిన్=భక్తులారా!వీక్షించుడు;
లోకమందంతట మిక్కిలి కీర్తికలిగియున్న నాలుగు వేదములు,పంచ మహాయజ్ఞములు మరియు శాస్త్రములు ఘోషించుచున్న విషయములను బాగుగ తెలిసిన స్వభావముగల సర్వేశ్వరుని యొక్క అందమైన నాభి కమలమందు జన్మించిన చతుర్ముఖ బ్రహ్మవంటి వారని పొగడబడు బ్రాహ్మణులు నిత్యవాసము చేయుచున్నసిరిసంపదలతో తులతూగు అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తిపొందియున్న బ్రహ్మాదిదేవతల యొక్క ప్రభువైన సర్వేశ్వరుడు (ఎవరనగ), ఎర్రని తామరపుష్పమందు నివసించు శ్రీదేవియు, శ్రీ భూదేవియు,ఎర్రని అందమైన పాద ద్వందములను మెల్లగ ఒత్తుచుండుగ,మహాఋషులు స్తుతించు చుండుగ, అలలతో నిండిన పెద్ద పాలసముద్రమున అనంతుడను నామముగల, చిహ్నములతో ప్రకాశించు ఆదిశేషుని తల్పముపై యోగనిద్రలో అమరియున్న ఆశ్చర్యభూతుడైన స్వామిని భక్తులారా!వీక్షించుడు!
మున్నివ్వులగేழுమిరుళ్ మణ్డియుణ్ణ,
మునివరొడుదానవర్ గళ్ తిశైప్ప, వన్దు
పన్నుకలై నాల్ వేదపొరుళై ఎల్లామ్,
పరిముగమాయరుళియ ఎమ్ పరమన్ కాణ్బిన్,
శెన్నెల్ మలికదిర్ క్కవరివీశ, శఙ్గ
మవై మురల శెఙ్గమల మలరై ఏఱి,
అన్న మలి పెడైయోడుమ్ అమరుమ్ శెల్వత్తు,
అణి యழுన్దూర్ నిన్ఱుగన్ద అమరర్ కోవే ll 1619
శెన్నెల్ మలికదిర్=ఎర్రధాన్యముల పంటలయొక్క మిక్కుటముగనున్న కంకులు; కవరి వీశ= వింజామరము వలె కదులుచుండునదియు;శఙ్గమ్ అవై మురల = శంఖములు మ్రోగుచుండునదియు; అన్నమ్ = హంసలు; మలి పెడైయోడుమ్ = తమయందు ప్రేమాతిశయము కలిగియున్నఆడ హంసలతోకూడి;శెమ్ కమల మలరై ఏఱి అమరుమ్= ఎర్రని తామరపుష్పముపై ఎక్కియుండెడి; శెల్వత్తు = సిరిసంపదలతో తులతూగుచున్న; అణి అழுన్దూర్ నిన్ఱు ఉగన్ద=అందమైన తిరుఅழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తిపొందియున్న; అమరర్ కోవే =బ్రహ్మాదిదేవతల యొక్క ప్రభువైన సర్వేశ్వరుడు (ఎవరనగ );మున్ = మునుపొకకాలమున; ఇ ఏழ் ఉలగుమ్ = ఈ సప్తలోకములను; ఇరుళ్ మణ్డి ఉణ్ణ =అఙ్ఞానాంధకారము మిక్కిలి కబళించిగ;మునివరొడు దానవర్ గళ్ తిశైప్ప=మునులుతోబాటు అసురులు మిక్కిలి వ్యాకులత పొందియుండగ; (ఆ సమయమున)వన్దు= పాలసముద్రమునుండి ఏతెంచి; పన్ను కలై=అనేక శాస్త్రములు; నాల్ వేద పొరుళై ఎల్లామ్=నాలుగు వేదార్ధములతో సమస్తమును;పరి ముగ మాయ్ = హయగ్రీవుని రూపమున అవతరించి; అరుళియ= దయతో ఒసగిన; ఎమ్= మనయొక్క; పరమన్ = అద్వితీయుడైన స్వామిని; కాణ్బిన్= భక్తులారా!వీక్షించుడు;
ఎర్రధాన్యపు పంటలయొక్క మిక్కుటముగనున్న కంకులు వింజామరము వలె కదులు చుండునదియు,శంఖములు మ్రోగుచుండునదియు,హంసలు తమయందు ప్రేమాతిశయము కలిగియున్న ఆడ హంసలతోకూడి ఎర్రని తామరపుష్పముపై ఎక్కియుండెడి, సిరిసంపదలతో తులతూగు అందమైన తిరుఅழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తిపొందియున్న, బ్రహ్మాదిదేవతల యొక్క ప్రభువైన సర్వేశ్వరుడు (ఎవరనగ) మునుపొకకాలమున ఈ సప్తలోకములను అఙ్ఞానాంధకారము మిక్కిలి కబళించిగ మునులుతోబాటు అసురులు మిక్కిలి వ్యాకులత పొందియుండగ (ఆ సమయమున) పాలసముద్రమునుండి ఏతెంచి అనేక శాస్త్రములు మరియు, నాలుగు వేదార్ధములతో సమస్తమును హయగ్రీవుని రూపమున అవతరించి దయతో ఒసగిన మనయొక్క అద్వితీయుడైన స్వామిని భక్తులారా!వీక్షించుడు!.
కులత్తలైయమద వేழమ్ పొయ్ గైపుక్కు,
క్కోళ్ ముదలై పిడిక్క అదఱ్కనుఙ్గినిన్ఱు,
నిలత్తిగழுమ్ మలర్ చ్చుడరేయ్ శోదీ యెన్న,
నెఞ్జిడర్ తీర్తరుళియ ఎన్నిమలన్ కాణ్బిన్,
మలైత్తిగழ் శన్దగిల్ కనకమణియుమ్ కొణ్డు,
వన్దున్ది వయల్ గళ్ దోఱుమ్మడై గళ్ పాయ,
అలైత్తువరుమ్ పొన్ని వళమ్ పెరుగుఞ్జెల్వత్తు,
అణి యழுన్దూర్ నిన్ఱుగన్ద అమరర్ కోవే ll 1620
మలై = సహయాద్రి పర్వతమున; తిగழ் = వెలుగుచున్న; శన్దు = చందన వృక్షములు; అగిల్=అగిల్ చెట్లయొక్క దుంగలు;కనకమ్ = బంగారము;మణియుమ్=రత్నములను; కొణ్డు వన్దు=సేకరించికొనివచ్చి; ఉన్ది=తోయుచు;వయల్ గళ్ దోఱుమ్= పొలములనుండి; మడై గళ్ = నీరుపోవుచుండు మార్గములలో; పాయ = పారుచు; అలైత్తు వరుమ్=అలలతో ప్రవహించెడి; పొన్ని=కావేరి నది వలన; వళమ్ పెరుగుమ్= శ్లాఘ్యముగ వృద్ధి పొందుచున్న; శెల్వత్తు = సంపదలుగల; అణి అழுన్దూర్ నిన్ఱు ఉగన్ద=అందమైన తిరుఅழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తిపొందియున్న;అమరర్ కోవే = బ్రహ్మాదిదేవతల యొక్క ప్రభువైన సర్వేశ్వరుడు (ఎవరనగ); కులమ్ తలైయ మద వేழమ్=శ్రేష్ఠమైన కులమందు జన్మించిన ఏసుగులసమూహములో తలమానికమైన మదజలము స్రవించు గజేంద్రుడు; పొయ్ గై పుక్కు=తటాకమందు దిగినసమయమున; కోళ్ ముదలై పిడిక్క=బలిష్టమైన మొసలి తన కోరలతో(ఆ గజేంద్రుని కాలును) పట్టుకొని ఈడ్చుచుండుటచే;అదఱ్కు అనుఙ్గి నిన్ఱు=ఆ మొసలికి భయపడి; నిల తిగழுమ్ = ప్రకాశించు వెన్నెలను; మలర్ శుడర్ ఏయ్ = వెదజల్లు చంద్రుని ఒప్పు; శోదీ ఎన్న = చల్లని కాంతులుగల సర్వేశ్వరా! యని ఎలుగెత్తి పిలువగ;నెఞ్జు ఇడర్ తీర్తు అరుళియ=ఆ గజేంద్రుని మనోవ్యధను తీర్చి కరుణించినట్టి ;ఎన్ నిమలన్ = నాయొక్క నిర్మల స్వభావుడైన స్వామిని; కాణ్బిన్ = భక్తులారా ! వీక్షించుడు!.
సహయాద్రి పర్వతమున వెలుగుచున్న చందన వృక్షములు, అగిల్ చెట్లయొక్క దుంగలు,బంగారము,రత్నములను సేకరించికొని వచ్చి తోయుచు పొలములనుండి నీరుపోవుచుండు మార్గములలో పారుచు అలలతో ప్రవహించెడి కావేరి నది వలన శ్లాఘ్యముగ వృద్ధిపొందుచున్న సంపదలుగల తిరుఅழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తిపొందియున్న, బ్రహ్మాదిదేవతల యొక్క ప్రభువైన సర్వేశ్వరుడు (ఎవరనగ) శ్రేష్ఠమైన కులమందు జన్మించిన ఏసుగులసమూహములో తలమానికమైన, మదజలము స్రవించు గజేంద్రుడు తటాకమందు దిగినసమయమున,బలిష్టమైన మొసలి తన కోరలతో ఆ గజేంద్రుని కాలును పట్టుకొని ఈడ్చుచుండుటచే, ఆ మొసలికి భయపడి, ప్రకాశించు వెన్నెలను వెదజల్లు చంద్రుని ఒప్పు చల్లని కాంతులుగల సర్వేశ్వరా! యని ఎలుగెత్తి పిలువగ, ఆ గజేంద్రుని మనోవ్యధను తీర్చి కరుణించినట్టి నాయొక్క నిర్మల స్వభావుడైన స్వామిని భక్తులారా ! వీక్షించుడు!.
శిలమ్బుముదల్ కలనణిన్దోర్ శెఙ్గణ్ కున్ఱమ్,
తిగழ் న్దదెన త్తిరువురువమ్ పన్ఱియాగి,
ఇలఙ్గు పువి మడన్దైతనై యిడన్దు పుల్ గి,
ఎయిర్ట్రిడై వైత్తరుళియ ఎమ్మీశన్ కాణ్బిన్,
పులమ్బు శిఱై వణ్డొలిప్ప ప్పూగమ్ తొక్క,
పొழிల్ గళ్ తొఱుమ్ కుయిల్కూవ మయల్ గళాల,
అలమ్బు తిరైప్పనల్ పుడై శూழ் న్దழకార్ శెల్వత్తు,
అణి యழுన్దూర్ నిన్ఱుగన్ద అమరర్ కోవే ll 1621
ప్పూగమ్ తొక్క = పోకచెట్లచే నిండియున్న; పొழிల్ గళ్ తొఱుమ్ = తోటలలో; శిఱై పులమ్బు వణ్డు ఒలిప్ప = రెక్కలు కలిగినవై, ఝంకారముచేసెడు భ్రమరములు శబ్దించుచున్నదియు; కుయిల్ కూవ=కోకిలలు కూయుచున్నవియు;మయల్ గళ్ ఆల=నెమళ్ళు నృత్యము చేయుచున్నవియు; అలమ్బు తిరై పునల్ పుడై శూழ்న్ద = ఘోషించు అలలతోఒప్పు కావేరినది నలుపక్కల చుట్టి ప్రవహించుచున్న; అழுగు ఆర్ = మిక్కిలి సుందరమైన; శెల్వత్తు = సిరిసంపదలతో తులతూగు; అణి అழுన్దూర్ నిన్ఱు ఉగన్ద= అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తిపొందియున్న; అమరర్ కోవే = బ్రహ్మాదిదేవతల యొక్క ప్రభువైన సర్వేశ్వరుడు; (ఎవరనగ) శెమ్ కణ్ ఓర్ కున్ఱమ్=ఎర్రని నేత్రములు కలిగిన ఒక పర్వతము;శిలమ్బు ముదల్ కలన్ అణిన్దు=కడియములు మొదలగు ఆభరణములు ధరించి; తిగழ் న్దదు ఎన = ప్రకాశించుచున్నది వలె; తిరు ఉరువమ్ పన్ఱి ఆగి = దివ్యమైన మహావరాహరూపముదాల్చి; ఇలఙ్గు పువి మడన్దై తనై = ప్రకాశించుచున్న శ్రీ భూదేవిని;ఇడన్దు =(అండభిత్తినుండి) పైకెత్తి; పుల్ గి= కౌగిలించికొని; ఎయిర్ట్రిడై వైత్తు అరుళియ = తన కోరలపై నుంచుకొని కృపజూపినట్టి; ఎమ్ ఈశన్ = మన స్వామిని; కాణ్బిన్ = భక్తులారా ! వీక్షించుడు!.
పోకచెట్లచే నిండియున్న తోటలలో రెక్కలు కలిగినవై, ఝంకారముచేసెడు భ్రమరములు, శబ్దించుచున్నదియు;కోకిలలు కూయుచున్నవియు,నెమళ్ళు నృత్యము చేయుచున్నవియు, ఘోషించు అలలతోఒప్పు కావేరినది నలుపక్కల చుట్టి ప్రవహించు చున్న మిక్కిలి సుందరమైన సంపదలుగల అందమైన తిరుఅழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తి పొందియున్న, బ్రహ్మాదిదేవతల యొక్క ప్రభువైన సర్వేశ్వరుడు (ఎవరనగ) , ఎర్రని నేత్రములు కలిగిన ఒక పర్వతము, కడియములు మొదలగు ఆభరణములు ధరించి ప్రకాశించుచున్నది వలె, దివ్యమైన మహావరాహ రూపముదాల్చి ప్రకాశించుచున్న శ్రీ భూదేవిని (అండభిత్తినుండి) పైకెత్తి కౌగిలించికొని,తన కోరలపై నుంచుకొని కృపజూపినట్టి మన స్వామిని భక్తులారా ! వీక్షించుడు!.
శినమేవు మడలరియినురువమాగి,
త్తిఱల్ మేవుమిరణియనదాగమ్ కీణ్డు,
మనమేవువఞ్జనైయాల్ వన్ద పేయ్ చ్చి,
మాళ వుయిర్ వౌవియ ఎమ్మాయోన్ కాణ్బిన్,
ఇనమేవు వరివళైకైయేన్దుమ్ కోవై,
ఏయ్ వాయ్ మరదకమ్ పోల్ కిళియినిన్ శొల్,
అనమేవునడై మడవార్ పయిలుమ్ శెల్వత్తు,
అణి యழுన్దూర్ నిన్ఱుగన్ద అమరర్ కోవే ll 1622
ఇనమ్ మేవు వరి వళై కై ఏన్దుమ్ = సమూహములుగ అలంకారములతో, గీతలున్న కంకణములు తమ హస్తములందు ధరించియున్న;కోవై ఏయ్ వాయ్=బాగుగ పండిన దొండపండువంటి అదరములు కలిగియున్న;మరదకమ్ పోల్ కిళియిన్ ఇన్ శొల్ = మరకత మణివంటి పచ్చని వర్ణముగల చిలుకవలె మదురమైన వాక్కులు కలిగియున్న;అనమ్ మేవుమ్ నడై మడవార్ = హంసలవలె అందమైన గమనముగల యువతులు; పయిలుమ్ = నివసించుచున్న; శెల్వత్తు = సంపదలుగల; అణి అழுన్దూర్ నిన్ఱు ఉగన్ద=అందమైన తిరుఅழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తిపొందియున్న; అమరర్ కోవే =బ్రహ్మాదిదేవతల యొక్క ప్రభువైన సర్వేశ్వరుడు; (ఎవరనగ); శిన మేవుమ్ అడల అరియిన్ ఉరువమ్ ఆగి = మిక్కిలి రౌద్రముతో శక్తివంతమైన నరసింహరూపమునుదాల్చి;తిఱల్ మేవుమ్ ఇరణియనదు ఆగమ్ కీణ్డు = మిక్కిలి పరాక్రమము కలిగిన హిరణ్యాసురుని యొక్క వక్షస్థలమును చీల్చి మరియు; మనమ్ మేవు వఞ్జనైయాల్ వన్ద = మనస్సున వంచనభావముతో (తనను చంపుటకై ) వచ్చిన;పేయ్ చ్చి=రక్కసి పూతన;మాళ=మరణించునట్లు;ఉయిర్ వౌవియ=ఆమెయొక్క ప్రాణమును హరించిన; ఎమ్ మాయోన్ = మనయొక్క ఆశ్చర్యభూతుడైన స్వామిని; కాణ్బిన్ = భక్తులారా ! వీక్షించుడు!.
సమూహములుగ అలంకారములతో, గీతలున్న కంకణములు తమ హస్తములందు ధరించియున్న,బాగుగ పండిన దొండపండువంటి అదరములు కలిగియున్న,మరకత మణి వంటి పచ్చని వర్ణముగల చిలుకవలె మదురమైన వాక్కులు కలిగియున్న, హంసల వలె అందమైన గమనము గల యువతులు నివసించుచున్న సంపదలుగల అందమైన తిరుఅழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తి పొందియున్న, బ్రహ్మాదిదేవతల యొక్క ప్రభువైన సర్వేశ్వరుడు (ఎవరనగ) మిక్కిలి రౌద్రముతో శక్తివంతమైన నరసింహరూపమునుదాల్చి,మిక్కిలి పరాక్రమము కలిగిన హిరణ్యాసురుని యొక్క వక్షస్థలమును చీల్చి మరియు మనస్సున వంచనభావముతో తనను చంపుటకై వచ్చిన రక్కసి పూతన మరణించునట్లు ఆమెయొక్క ప్రాణమును హరించిన మనయొక్క ఆశ్చర్యభూతుడైన స్వామిని భక్తులారా ! వీక్షించుడు!.
వానవర్ తమ్ తుయర్ తీరవన్దు తోన్ఱి,
మాణురువాయ్ మూవడిమావలియై వేణ్డి,
తానమర ఏழுలగుమ్ అళన్ద వెన్ఱి,
త్తనిముదల్ శక్కరప్పడై యెన్ తలైవన్ కాణ్బిన్,
తేన్ అమరుమ్ పొழிల్ తழுవుమ్ ఎழிల్ కొళ్ వీది,
చ్చెழு మాడమాళికైకళ్ కూడన్దోఱుమ్,
ఆన తొల్ శీర్ మఱైయాళర్ పయిలుమ్ శెల్వత్తు,
అణి యழுన్దూర్ నిన్ఱుగన్ద అమరర్ కోవే ll 1623
తేన్ అమరుమ్ = తేనెలొలుకు; పొழிల్ తழுవుమ్ = తోటలతో చుట్టబడిన;ఎழிల్ కొళ్ వీది = అందమైన వీధులలో; శెழு మాడమ్ మాళికై గళ్ = శ్లాఘ్యమైన భవనములలోను, గృహములలోను; కూడమ్ తోఱుమ్ = మరియు ఇతర స్థలములలోను; ఆన తొల్ శీర్ మఱైయాళర్ పయిలుమ్ = ఙ్ఞానము, సద్గుణములవలన అనాదియైన కీర్తికలిగిన వేదబ్రాహ్మణోత్తములు నివసించుచున్న; శెల్వత్తు = సంపదలుగల; అణి అழுన్దూర్ నిన్ఱు ఉగన్ద=అందమైన తిరుఅழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తిపొందియున్న; అమరర్ కోవే =బ్రహ్మాదిదేవతల యొక్క ప్రభువైన సర్వేశ్వరుడు; (ఎవరనగ); వానవర్ తమ్ = దేవతలయొక్క; తుయర్ తీర = కష్టములు పోవునట్లు; వన్దు తోన్ఱి = వామనమూర్తిగ వచ్చి అవతరించి; మాణ్ ఉరువాయ్ = బ్రహ్మచారియై; మావలియై మూవడి వేణ్డి = మహాబలినుండి మూడడుగుల భూమిని యాచించి; (దానజలమును స్వీకరించిన పిదప); తాన్ = తానే;అమర = తన దివ్యపాదములక్రింద అమరునట్లు; ఏழுలగుమ్ అళన్ద = సర్వలోకములను కొలిచి స్వాధీనము చేసుకొనిన; వెన్ఱి తని ముదల్ శక్కర పడై = జయశీలమైన సాటిలేని (ఆయుధములలో)ప్రధానమైన సుదర్శనచక్రాయుధము హస్తమునగల; ఎన్ తలైవన్ = నాయొక్క స్వామిని;కాణ్బిన్ = భక్తులారా ! వీక్షించుడు!.
తేనెలొలుకు తోటలతో చుట్టబడిన అందమైన వీధులలో శ్లాఘ్యమైన భవనములలోను, గృహములలోను,మరియు ఇతర స్థలములలోను, ఙ్ఞానము, సద్గుణములవలన అనాదియైన, కీర్తికలిగిన వేదబ్రాహ్మణోత్తములు నివసించుచున్నసంపదలుగల అందమైన తిరుఅழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తి పొందియున్న, బ్రహ్మాదిదేవతల యొక్క ప్రభువైన సర్వేశ్వరుడు (ఎవరనగ), దేవతల యొక్క కష్టములు పోవునట్లు వామనమూర్తిగ వచ్చి అవతరించి, బ్రహ్మచారియై మహాబలినుండి మూడడుగుల భూమిని యాచించి,(దానజలమును స్వీకరించిన పిదప) తానే తన దివ్యపాదములక్రింద అమరునట్లు సర్వలోకములను కొలిచి స్వాధీనము చేసుకొనిన, జయశీలమైన సాటిలేని (ఆయుధములలో) ప్రధానమైన సుదర్శన చక్రాయుధము హస్తమునగల నాయొక్క స్వామిని భక్తులారా ! వీక్షించుడు!.
పన్దణైన్దమెల్ విరలాల్ శీతైక్కాగి,
పగలవన్ మీదు ఇయఙ్గాదఇలఙ్గైవేన్దన్,
అన్తమిల్ తిణ్ కరమ్ శిరఙ్గళ్ పురణ్డు వీழ,
అడుకణైయాల్ ఎయ్ దుగన్ద అమ్మాన్ కాణ్బిన్,
శెన్దమిழுమ్ వడకలైయుమ్ తికழ்న్దనావర్,
తిశైముగనైయనైయవర్ గళ్ శెమ్మైమిక్క,
అన్దణర్ తమ్ ఆకుదియిన్ పుకైయార్ శెల్వత్తు,
అణి యழுన్దూర్ నిన్ఱుగన్ద అమరర్ కోవే ll 1624
శెమ్ తమిழுమ్=శ్లాఘ్యమైన తమిళ భాషలోను; వడ కలైయుమ్=సంస్కృత భాషలోను; తికழ்న్ద = శోభిల్లుచుండెడి; నావర్=నుడువెడి సామర్ధ్యముగలగినవారును; తిశై ముగనై అనైయవర్ గళ్ = చతుర్ముఖ బ్రహ్మ వలె ఒప్పువారు;శెమ్మై మిక్క అన్దణ ర్ తమ్ = మిక్కిలి సద్గుణ సంపన్నులైన బ్రాహ్మణోత్తముల యొక్క; ఆకుదియిన్ పుకై ఆర్ = హోమమునుండి వెలువడు ధూమముతో నిండియున్న; శెల్వత్తు = సిరిసంపదలతో తులతూగు; అణి అழுన్దూర్ నిన్ఱు ఉగన్ద= అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తిపొందియున్న; అమరర్ కోవే = బ్రహ్మాదిదేవతల యొక్క ప్రభువైన సర్వేశ్వరుడు;(ఎవరనగ);పన్దు అణైన్ద మెల్ విరలాల్ శీతైక్కు ఆగి= కందుకము హస్తమున కలిగియుండుటచే మిక్కిలి మనోజ్ఞమైన వేళ్ళుగల సీతాదేవి నిమిత్తమై; పగలవన్ మీదు ఇయఙ్గాద ఇలఙ్గై వేన్దన్ = (భయకంపితుడైన) సూర్యుడు ఆకాశమందు సంచరించని లంకాపురికి ప్రభువైన రావణాసురునియొక్క; అన్తమ్ ఇల్ తిణ్ కరమ్ శిరఙ్గళ్ = క్షతిలేని దృఢమైన భుజములు మరియు శిరములు;పురణ్డు వీழ=తెగి క్రిందపడి దొర్లునట్లు;అడు కణైయాల్ = వధించు స్వభావముగల బాణమును; ఎయ్ దు ఉగన్ద అమ్మాన్ = ప్రయోగించి సంతోషించిన స్వామిని;కాణ్బిన్ = భక్తులారా ! వీక్షించుడు!.
శ్లాఘ్యమైన తమిళ భాషలోను,సంస్కృత భాషలోను,శోభిల్లుచుండెడి నుడువెడి సామర్ధ్యముగలగినవారును,చతుర్ముఖ బ్రహ్మ వలె ఒప్పువారు,మిక్కిలి సద్గుణ సంపన్నులైన బ్రాహ్మణోత్తములయొక్క హోమమునుండి వెలువడు ధూమముతో నిండియున్న,సిరిసంపదలతో తులతూగు అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తిపొందియున్న బ్రహ్మాదిదేవతలయొక్క ప్రభువైన సర్వేశ్వరుడు (ఎవరనగ),కందుకము హస్తమున కలిగియుండుటచే మిక్కిలి మనోజ్ఞమైన వేళ్ళుగల సీతాదేవి నిమిత్తమై,భయకంపితుడైన సూర్యుడు ఆకాశమందు సంచరించని లంకాపురికి ప్రభువైన రావణాసురునియొక్క క్షతిలేని దృఢమైన భుజములు మరియు శిరములు తెగి క్రిందపడి దొర్లునట్లు వధించు స్వభావముగల బాణమును ప్రయోగించి సంతోషించిన స్వామిని భక్తులారా ! వీక్షించుడు!.
కుమ్బమిగుమదవేழுమ్ కులైయ క్కొమ్బు
పఱిత్తు, మழవిడై యడర్తు క్కురవైకోత్తు,
వమ్బవిழுమలర్ కుழలాళాయ్ చ్చివైత్త,
తయిర్వెణ్ణెయ్ ఉణ్డుగన్ద మాయోన్ కాణ్బిన్,
శెమ్బవళమరతకమ్ నన్ ముత్తఙ్గాట్ట,
త్తిగழ் పూకమ్ కదలి పలవళమ్ మిక్కెఙ్గుమ్,
అమ్బొన్మదిళ్ పొழிల్ పుడై శూழ் న్దழగార్శెల్వత్తు,
అణి యழுన్దూర్ నిన్ఱుగన్ద అమరర్ కోవే ll 1625
శెమ్ పవళమ్ మరతకమ్ నన్ ముత్తమ్ కాట్ట తిగழ் పూకమ్ = ఎర్రని వర్ణముగల పగడములును, పచ్చని వర్ణముగల మరకతమును,తెల్లని వర్ణముగల మంచి ముత్యములును, స్పురింపజేయు ప్రకాశించెడి పోకచెట్లతోను; పల కదలి = పలు అరటి చెట్లతోను; వళమ్ మిక్కు= మిక్కిలి వృద్ధికలిగి; ఎఙ్గుమ్= నలుప్రక్కల; అమ్ పొన్ మదిళ్ పొழிల్ పుడై శూழ்న్దు=అందమైన బంగారుమయమయిన ప్రాకారములతోను,తోటలతోను నాలుగు వైపుల చుట్టుకొనియుండి; అழగు ఆర్ = సౌందర్యముతో అలరారుచున్న; శెల్వత్తు = సిరిసంపదలతో తులతూగు; అణి అழுన్దూర్ నిన్ఱు ఉగన్ద= అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తిపొందియున్న; అమరర్ కోవే = బ్రహ్మాదిదేవతల యొక్క ప్రభువైన సర్వేశ్వరుడు;(ఎవరనగ); కుమ్బమ్ మిగు = పెద్ద కుంభస్థలముకలగిన;మద వేழுమ్=మదజలము స్రవించు కువలయాపీడమను ఏనుగు; కులైయ=మరణించునట్లు;కొమ్బు పఱిత్తు=దంతములును పెరికియు;మழ విడై అడర్తు=యౌవనమైన ఏడు వృషభములను వధించియు; కురవై కోత్తు = గోపకాంతలతో చేతులు కలపి రాసక్రీడచేసియు;వమ్బు అవిழுమ్=సువాసన వెదజల్లు;మలర్ కుழలాళ్=పూలతో నిండిన కేశములుగల; ఆయ్ చ్చి = యశోదాదేవి;వైత్త = ఉట్లయందు కుండలలో దాచిన; తయిర్ వెణ్ణెయ్ ఉణ్డు = పెరుగు,వెన్నను ఆరగించి; ఉగన్ద = ఆనందించిన;మాయోన్ = ఆశ్చర్యభూతుడైన స్వామిని; కాణ్బిన్ = భక్తులారా ! వీక్షించుడు!.
ఎర్రని వర్ణముగల పగడములును, పచ్చని వర్ణముగల మరకతమును,తెల్లని వర్ణముగల మంచి ముత్యములును, స్పురింపజేయు ప్రకాశించెడి పోకచెట్లతోను, పలు అరటి చెట్లతోను, మిక్కిలి వృద్ధికలిగి నలుప్రక్కల అందమైన బంగారుమయమయిన ప్రాకారములతోను,తోటలతోను నాలుగు వైపుల చుట్టుకొనియుండి సౌందర్యముతో అలరారుచున్న సిరిసంపదలతో తులతూగు అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తిపొందియున్న బ్రహ్మాదిదేవతల యొక్క ప్రభువైన సర్వేశ్వరుడు (ఎవరనగ) పెద్ద కుంభస్థలము కలగిన మదజలము స్రవించు కువలయాపీడమను ఏనుగు మరణించునట్లు దంతములును పెరికియు ,యౌవనమైన ఏడు వృషభములను వధించియు, గోపకాంతలతో చేతులు కలపి రాసక్రీడచేసియు, సువాసన వెదజల్లు పూలతో నిండిన కేశములుగల యశోదాదేవి ఉట్లయందు కుండలలో దాచిన పెరుగు,వెన్నను ఆరగించి ఆనందించిన ఆశ్చర్యభూతుడైన స్వామిని భక్తులారా ! వీక్షించుడు!.
ఊడేఱుకఞ్జనొడు మల్లుమ్ విల్లుమ్,
ఒణ్ కరియుమ్ ఉరుళ్ శకడముడైయచ్చెర్ట్ర,
నీడేఱుపెరువలి త్తోళుడైయ వెన్ఱి,
నిలవుపుకழ் నేమి అమ్ కై నెడియాన్ కాణ్బిన్,
శేడేఱుపొழிల్ తழுవుమెழிల్ కొళ్వీది,
త్తిరువిழవిల్ మణియణిన్ద తిణ్ణై దోఱుమ్,
ఆడేఱుమలర్ కుழలార్ పయిలుమ్ శెల్వత్తు,
అణి యழுన్దూర్ నిన్ఱుగన్ద అమరర్ కోవే ll 1626
శేడేఱు = ఎదుగుచున్న లేత; పొழிల్ = తోటలవలన; తழுవుమ్ = కలిగిన; ఎழிల్ కొళ్ వీది = అందమైన వీధులలో నడచు; తిరు విழవిల్=దివ్య ఉత్సవములలో; మణి అణిన్ద తిణ్ణై దోఱుమ్ = రత్నములచే పొదగబడిన వరండాలయందతటను; ఆడు ఏఱు మలర్ కుழలార్ పయిలుమ్= నృత్యమందు ప్రావీణులైన పూలతో అలంకరించుకొనిన కేశములు గల అంగనలు గుమిగూడియుండెడి; శెల్వత్తు = సిరిసంపదలతో తులతూగు; అణి అழுన్దూర్ నిన్ఱు ఉగన్ద= అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తిపొందియున్న; అమరర్ కోవే = బ్రహ్మాదిదేవతల యొక్క ప్రభువైన సర్వేశ్వరుడు;(ఎవరనగ); ఊడు ఏఱు కఞ్జనొడు = గ్యాలరీ నడుమ సింహాసనముపై అధిష్ఠించిన కంసునితోబాటు; మల్లుమ్ = చాణూరముష్టికులనబడు మల్లులను; విల్లుమ్ = ధనుర్యాగములో ఏర్పరచిన విల్లును; ఒణ్ కరియుమ్ = శక్తివంతమైన కువలయాపీడమను ఏనుగును; ఉరుళ్ శకడమ్=దొర్లుకొని వచ్చుచున్న శకటమును; ఉడైయ శెర్ట్ర = క్షతి పొందునట్లు నాశనము చేసిన; నీడు ఏఱు పెరు వలి తోళ్ ఉడైయ = మిక్కిలి పొడుగైన పెద్ద బలిష్టమైన భుజములుగలవాడును; వెన్ఱి నిలవు పుక் నేమి అమ్ కై = జయములచే ప్రకాశించు కీర్తిగల సుదర్శనచక్రమును ధరించిన అందమైన హస్తముగలవాడును; నెడియాన్ = పరమపురుషుడైన స్వామిని;కాణ్బిన్ = భక్తులారా ! వీక్షించుడు!.
ఎదుగుచున్న లేత తోటలవలన కలిగిన అందమైన వీధులలో నడచు దివ్య ఉత్సవములలో రత్నములచే పొదగబడిన వరండాలయందతటను నృత్యమందు ప్రావీణులైన పూలతో అలంకరించుకొనిన కేశములు గల అంగనలు గుమిగూడియుండెడి, సిరిసంపదలతో తులతూగు అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున వేంచేసి ఆనందముతో తృప్తిపొందియున్న బ్రహ్మాదిదేవతలయొక్క ప్రభువైన సర్వేశ్వరుడు (ఎవరనగ), గ్యాలరీ నడుమ సింహాసనముపై అధిష్ఠించిన కంసునితోబాటు,చాణూర ముష్టికులనబడు మల్లులను, ధనుర్యాగములో ఏర్పరచిన విల్లును, శక్తివంతమైన కువలయాపీడమను ఏనుగును, దొర్లుకొని వచ్చుచున్న శకటమును, క్షతిపొందునట్లు నాశనము చేసిన మిక్కిలి పొడుగైన పెద్ద బలిష్టమైన భుజములుగలవాడును, జయములచే ప్రకాశించు కీర్తిగల సుదర్శనచక్రమును ధరించిన అందమైన హస్తము గలవాడును, పరమపురుషుడైన స్వామిని భక్తులారా ! వీక్షించుడు!.
** పన్ఱియాయ్ మీనాగి అరియాయ్, ప్పారై
ప్పడైత్తుక్కాత్తుణ్డుమిழ்న్ద పరమన్దన్నై,
అన్ఱమరర్కదిపతియుమయనుమ్ శేయుమ్,
అడిపణియ అణి అழுన్దూర్ నిన్ఱ కోవై,
కన్ఱి నెడువేల్ వలవన్ ఆలినాడన్,
కలికన్ఱి ఒలిశెయ్ ద ఇన్బపాడల్,
ఒన్ఱినొడునాన్గుమ్ ఓరైన్దుమ్ వల్లార్,
ఒలికడల్ శూழ் ఉలగాళుమ్ ఉమ్బర్ తామే ll 1627
అన్ఱు = మునుపొకకాలమున; పన్ఱి ఆయ్ = వరాహరూపముదాల్చియు, మీన్ ఆగి = మత్స్య రూపమును దాల్చియు; అరి ఆయ్ = నరసింహమూర్తిగ అవతరించియు; పారై=ఈ భూలోకమును; పడైత్తు = సృష్ఠించియు, కాత్తు = రక్షించియు; ఉణ్డు = ప్రళయ కాలమున ఆరగించియు; ఉమిழ்న్ద = సృష్టికాలమున వెలిబుచ్చినట్టి; పరమన్ తన్నై= అద్వితీయుడైన స్వామిని; శేయుమ్ = అతని పుత్రుడైన బ్రహ్మ మరియు తదితరులు;అడి పణియ = తన చరణారవిందములను సేవించుకొనునట్లు; అణి అழுన్దూర్ నిన్ఱ కోవై = తిరు అழுన్దూర్ దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో నిత్యవాసము చేయుచున్న దేవాదిదేవుడైన సర్వేశ్వరుని విషయమై; కన్ఱి నెడు వేల్ వలవన్= కోపముతో పొడుగైన శూలాయుధమును ప్రయోగించు సమర్ధతగలవారును; ఆలినాడన్=తిరువాలి దేశమున నివసించు; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్; ఒలి శెయ్ ద = ఇంపైన ధ్వనితో పాడి అనుగ్రహించిన; ఇన్బ పాడల్ = మధురమైన పాశురములు; ఒన్ఱినొడు నాన్గుమ్ ఓరైన్దుమ్ = ఈ పదియును; వల్లార్ = పఠించువారు; ఒలికడల్ శూழ் = ఘోషించుచున్న సముద్రముచే చుట్టుకొనియున్న; ఉలగు ఆళుమ్ ఉమ్బర్ తామ్ = ఈ సమస్తలోకములు పాలించు దేవతలగుదురు.
మునుపొకకాలమున వరాహరూపముదాల్చియు,మత్స్యరూపమునుదాల్చియు, నరసింహమూర్తిగ అవతరించియు, భూలోకమును సృష్ఠించియు, రక్షించియు, ప్రళయ కాలమున ఆరగించియు, సృష్టికాలమున వెలిబుచ్చినట్టి అద్వితీయుడైన స్వామిని అతని పుత్రుడైన బ్రహ్మ మరియు తదితరులు, తన చరణారవిందములను సేవించుకొనునట్లు, తిరు అழுన్దూర్ దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో నిత్యవాసము చేయుచున్న దేవాదిదేవుడైన సర్వేశ్వరుని విషయమై, కోపముతో పొడుగైన శూలాయుధమును ప్రయోగించు సమర్ధతగలవారును,తిరువాలి దేశమున వసించు తిరుమంగై ఆళ్వార్ ఇంపైన ధ్వనితో పాడి అనుగ్రహించిన,మధురమైన పాశురములు ఈ పదియును పఠించువారు ఘోషించుచున్న సముద్రముచే చుట్టుకొనియున్నఈ సమస్తలోకములు పాలించు దేవతలగుదురు.
*******