పెరియతిరుమొழி-8వపత్తు (1)

శ్రీః 

శ్రీమతే రామనుజాయనమః

తిరుమంగై ఆళ్వార్ ముఖారవిన్దమునుండి వెలువడిన

_______________

పెరియతిరుమొழி-8వపత్తు

____________

శ్రీః

1 . శిలైయిలఙ్గుపొన్నాழி

      శ్రీమన్నారాయణుని  దివ్యమంగళస్వరూపము,కళ్యాణగుణములు ధ్యానించుచున్న తిరుమంగై ఆళ్వార్ ఒక నాయకి అవస్థపొంది మైమరచి చెప్పెడి మాటలను ఆమె తల్లి విని అచ్చెరవొంది, దీనికి  తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున వేంచేసియున్న నీలమేఘపెరుమాళ్ కారణమని అచట చేరినవారితో వాపోవుటను తిరుమంగై ఆళ్వార్ విసదీకరించుచున్నారు.

**శిలైయిలఙ్గు పొన్నాழி, తిణ్ పడై తణ్డొణ్ శఙ్గమ్ ఎన్గిన్ఱాళాల్,

మలైయిలఙ్గు తోళ్ నాన్గే, మర్ట్రవనుక్కు ఎర్ట్రేకాణ్ ఎన్గిన్ఱాళాల్,

ములైయిలఙ్గు పూమ్బయలై, మున్బోడ అన్బోడి యిరుక్కిన్ఱాళాల్,

కలైయిలఙ్గు మొழிయాళర్, కణ్ణపురత్తమ్మానై క్కణ్డాళ్ కొలో  ll 1648

శిలై=శారంగం విల్లుఅనియు;ఇలఙ్గు పొన్ ఆழி=ప్రకాశించుచున్నదియు,ఆశింపతగినదైన  సుదర్శనచక్రమనియు;తిణ్ పడై = దృఢమైన ఆయుధము కత్తి అనియు; తణ్డు= గధ అనియు; ఒణ్ శఙ్గమ్ = అందమైన శంఖము అనియు; ఎన్గిన్ఱాళ్ = పలుకుచున్నది; ఆల్ = అయ్యో అదేమిటో; మర్ట్రు = ఇంకను; అవనుక్కు = ఆ స్వామికి; మలైయిలఙ్గు తోళ్ నాన్గు = పర్వతముపోలిన నాలుగు భుజములును;ఎర్ట్రేకాణ్ = (స్వామియొక్క) ఆ సౌందర్యమును చూడుడు;ఎన్గిన్ఱాళ్=అని పలుకుచున్నది;ములై ఇలఙ్గు పూమ్ పయలై = స్తనమందున్న అందమైన పచ్చనివర్ణము; మున్బు ఓడ= ముంగిటపోయి దారిచూపగ; అన్బు ఓడి ఇరుక్కిన్ఱాళ్ = (స్వామియందు) ప్రీతి దాని వెనుకనే పోయి యున్నదని చెప్పు చున్నది; కలై ఇలఙ్గు మొழி యాళర్=శాస్త్రఙ్ఞానముతో ప్రకాశించుచున్న ఉపన్యాసకులు నివసించుచున్న; కణ్ణపురత్తు అమ్మానై కణ్డాళ్ కొలో = తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

        శారంగం విల్లుఅనియు, ప్రకాశించుచున్నదియు,ఆశింపతగినదైన సుదర్శన చక్రమనియు, దృఢమైన ఆయుధము నందకకత్తి అనియు, గధ అనియు అందమైన శంఖము అనియు పలుకుచున్నది. అయ్యో అదేమిటో! ఇంకను,ఆ స్వామికి పర్వతము పోలిన నాలుగు భుజములును, స్వామియొక్క ఆ సౌందర్యమును చూడుడని పలుకు చున్నది.స్తనమందున్న అందమైన పచ్చనివర్ణము ముంగిట పోయి దారిచూపగ  (స్వామియందు) ప్రీతి దాని వెనుకనే పోయి యున్నదని చెప్పుచున్నది.శాస్త్రఙ్ఞానముతో ప్రకాశించుచున్న ఉపన్యాసకులు నివసించుచున్న తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

  **    శెరువరై మున్ ఆశఱుత్త, శిలైయన్ఱో కైత్తలత్త తెన్గిన్ఱాళాల్,

పొరువరై మున్ పోర్ తొలైత్త, పొన్నాழி మర్ట్రొరుకై యెన్గిన్ఱాళాల్,

ఒరువరైయుమ్ నిన్నొప్పార్, ఒప్పిల్లా ఎన్నప్పా ఎన్గిన్ఱాళాల్, 

కరువరై పోల్ నిన్ఱానై, క్కణ్ణపురత్తమ్మానై క్కణ్డాళ్ కొలో  ll 1649

మున్ = మొదట;శెరువరై = పోరు సలుపువారిని; ఆశు = శీఘ్రముగా; అఱుత్త =చంపిన; శిలైయన్ఱో = శారంగం విల్లుకాదా?; కై తలత్తదు = హస్తముననున్నది!;ఎన్గిన్ఱాళ్ = అని పలుకుచున్నది; మర్ట్రొరు కై=వేరొక హస్తమున;మున్ = మునుపొకకాలమున;పొరువరై=(రెక్కలుగల) పోరు సలుపు పర్వతములను; పోర్ = యుద్ధమున;తొలైత్త = భంగపరచిన; పొన్ ఆழி = అందమైన చక్రాయుధము; ఎన్గిన్ఱాళ్ = అని పలుకుచున్నది; ఒప్పు = సమానత్వ విషయమున;నిన్ ఒప్పార్ ఒరువరైయుమ్ ఇల్లా=నీతో సమానులు ఏఒక్కరు లేనట్లున్న; ఎన్ అప్పా = నాయొక్క స్వామీ!; ఎన్గిన్ఱాళ్ = అని పలుకుచున్నది; కరువరై పోల్ నిన్ఱానై=అంజన పర్వతమువలె నిలిచియున్న;కణ్ణపురత్తు అమ్మానై కణ్డాళ్ కొలో = తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

          “పోరు సలుపువారిని శీఘ్రముగా చంపిన శారంగం విల్లుకాదా? (స్వామియొక్క) హస్తమున నున్నది!” అని పలుకుచున్నది.”వేరొక హస్తమున మునుపొక కాలమున (రెక్కలుగల) పోరు సలుపు పర్వతములను యుద్ధమున భంగపరచిన అందమైన చక్రాయుధమని” పలుకుచున్నది. “సమానత్వ విషయమున నీతో సమానులు ఏ ఒక్కరు లేనట్లున్న నాయొక్క స్వామీ!” అని పలుకుచున్నది. అంజన పర్వతమువలె నిలిచియున్న తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

తున్నుమామణి ముడిమేల్, తుழா యలఙ్గళ్ తోన్ఱుమాలెన్గిన్ఱాళాల్,

మిన్నుమామణి మకర కుణ్డలఙ్గళ్, విల్ వీశుమెన్గిన్ఱాళాల్,

పొన్నిన్మామణియారమ్, అణియాకత్తిలఙ్గు మాలెన్గిన్ఱాళాల్,

కన్ని మా మదిళ్ పుడై శూழ், కణ్ణపురత్తమ్మానై క్కణ్డాళ్ కొలో  ll 1650

తున్ను = దట్టముగ; మా మణి = శ్లాఘ్యమైన రత్నములచే పొదగబడిన;ముడిమేల్= కిరీటముపై; తుழாయ్ అలఙ్గళ్ = తులసీ మాలలు;తోన్ఱుమ్ ఆల్=ప్రకాశించుచున్నదే (ఆహా!); ఎన్గిన్ఱాళాల్ = అని పలుకుచున్నది;మిన్ను = మెరయుచున్న; మా మణి మకర కుణ్డలఙ్గళ్=శ్లాఘ్యమైన మణులతో పొదిగిన మకరకుండలములు;విల్ వీశుమ్=కాంతిని వెదజల్లుచున్నది; ఎన్గిన్ఱాళాల్ = అని పలుకుచున్నది; పొన్నిన్ మా మణి ఆరమ్ = బంగారముతోచేయబడిన,శ్లాఘ్యమైన రత్నములతో పొదగబడిన హారము;అణి ఆకత్తు ఇలఙ్గుమ్ ఆల్ = అందమైన వక్షస్థలమందు ప్రకాశించుచున్నదే! (ఆహా!);ఎన్గిన్ఱాళాల్ = అని పలుకుచున్నది; కన్ని మా మదిళ్ పుడై శూழ்న్ద = దృఢమైన పెద్ద ప్రాకారములతోనలుపక్కల చుట్టుకొనియున్న; కణ్ణపురత్తు అమ్మానై కణ్డాళ్ కొలో = తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

“దట్టముగ శ్లాఘ్యమైన రత్నములచే పొదగబడిన కిరీటముపై తులసీ మాలలు ప్రకాశించుచున్నదే (ఆహా!)”  అని పలుకుచున్నది. “మెరయుచున్న శ్లాఘ్యమైన మణులతో పొదిగిన మకరకుండలములు కాంతిని వెదజల్లుచున్నది” అని చెప్పుచున్నది.” బంగారముతోచేయబడిన,శ్లాఘ్యమైన రత్నములతో పొదగబడిన హారము అందమైన వక్షస్థలమందు ప్రకాశించుచున్నదే! (ఆహా!)” అని చెప్పుచున్నది. దృఢమైన పెద్ద ప్రాకారములతో నలుపక్కల చుట్టుకొనియున్న తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

తారాయ తణ్ తులబ, వణ్డుழுద వరైమార్బన్ ఎన్గిన్ఱాళాల్, 

పోరానై కొమ్బొశిత్త, పుట్పాగ నెన్నమ్మాన్ ఎన్గిన్ఱాళాల్, 

ఆరానుమ్ కాణ్మిన్గళ్, అమ్ పవళమ్ వాయవనుక్కెన్గిన్ఱాళాల్,

కార్వానమ్ నిన్ఱదిరుమ్, కణ్ణపురత్తమ్మానై క్కణ్డాళ్ కొలో  ll 1651

తార్ ఆయ తణ్ తులబమ్ = మాలయైన చల్లని తులసీదళములలోనున్న; వణ్డు = భ్రమరములు; ఉழுద = తేనెలచే బురదచేసిన; వరైమార్బన్ = పర్వతముపోలిన  వక్షస్థలము కలవాడు; ఎన్గిన్ఱాళాల్ = అని పలుకుచున్నది; పోర్ ఆనై = పోరు సలుపు కువలయాపీడమను ఏనుగుయొక్క;  కొమ్బు ఒశిత్త = దంతములును పెరికి చంపిన; పుళ్ పాగనై = గరుడవాహనుడు; ఎన్ అమ్మాన్ = నాయొక్క స్వామి; ఎన్గిన్ఱాళాల్ = అని పలుకుచున్నది; ఆరానుమ్ కాణ్మిన్గళ్ = ఎవరైనను వచ్చి వీక్షించుడు;అవనుక్కు= ఆ స్వామియొక్క; వాయ్ = అదరములు; అమ్ పవళమ్ = అందమైన పగడమువలె ఎర్రనైనది;ఎన్గిన్ఱాళాల్ = అని పలుకుచున్నది; కార్ వానమ్ నిన్ఱు అదిరుమ్ = నల్లని మేఘములు ఎల్లప్పుడు గర్జించుచుచుండెడి; కణ్ణపురత్తు అమ్మానై కణ్డాళ్ కొలో = తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

“మాలయైన చల్లని తులసీదళములలోనున్న భ్రమరములు, తేనెలచే బురదచేసిన పర్వతముపోలిన వక్షస్థలము కలవాడు” అని చెప్పుచున్నది. ” పోరు సలుపు కువలయాపీడమను ఏనుగుయొక్క దంతములును పెరికి చంపిన  గరుడ వాహనుడు నాయొక్క స్వామి” అని పలుకుచున్నది. ” ఎవరైనను వచ్చి వీక్షించుడు,  ఆ స్వామియొక్క అదరములు అందమైన పగడమువలె ఎర్రనైనది.”అని పలుకుచున్నది.నల్లనిమేఘములు ఎల్లప్పుడు గర్జించుచుచుండెడి తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

అడిత్తలముమ్ తామరైయే, అఙ్గైకళుమ్ పఙ్గయమే యెన్గిన్ఱాళాల్,

ముడిత్తలముమ్ పొఱ్పూణుమ్, ఎన్నెఞ్జత్తుళ్ళగలా దెన్గిన్ఱాళాల్,

వడిత్తడఙ్గణ్ మలరవళో, వరై యాకత్తు ళ్ళిరుప్పాళెన్గిన్ఱాళాల్,

కడిక్కమలమ్ కళ్ ఉగుక్కుమ్, కణ్ణపురత్తమ్మానై క్కణ్డాళ్ కొలో  ll 1652

అడి తలముమ్ తామరైయే=దివ్యచరణములు తామరపుష్పములే!;అమ్ కైగళుమ్= సుందరమైన హస్తములును; పఙ్గయమే = తామర పుష్పములే ఆహా!;ఎన్గిన్ఱాళాల్ = అని పలుకుచున్నది; ముడి తలముమ్ = కిరీటము; పొన్ పూణుమ్ = దానియందు పొదగబడిన అందమైన ఆభరణములు;ఎన్ నెఞ్జత్తుళ్ అగలాదు=నాయొక్క మనస్సును వీడదు; ఎన్గిన్ఱాళాల్= అని పలుకుచున్నది; వడి=వాడియైన;తడమ్ కణ్ మలర్ అవళో= పెద్ద నేత్రములుగల కలిగియున్న కమలవాసినియో; వరై ఆకత్తుళ్ ఇరుప్పాళ్ = పర్వతము వంటి వక్షస్థలమున ఉన్నది;ఎన్గిన్ఱాళాల్ = అని పలుకుచున్నది;కడి కమలమ్ కళ్ ఉగుక్కుమ్ = పరిమళభరితమైన తామర పుష్పములు తేనెలు కురిపించుచుండు; కణ్ణపురత్తు అమ్మానై కణ్డాళ్ కొలో = తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

” దివ్యచరణములు తామరపుష్పములే!,సుందరమైన హస్తములును తామర పుష్పములే ఆహా! ” అని పలుకుచున్నది,” కిరీటము, దానియందు పొదగబడిన అందమైన ఆభరణములు నాయొక్క మనస్సును వీడదు” అని పలుకుచున్నది,” వాడియైన పెద్ద నేత్రములుగల కలిగియున్న కమలవాసినియో పర్వతము వంటి వక్షస్థలమున ఉన్నది.” అని పలుకుచున్నది. పరిమళభరితమైన తామర పుష్పములు తేనెలు కురిపించుచుండు తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

పేరాయిరముడైయ పేరాళన్, పేరాళనెన్గిన్ఱాళాల్,

ఏరార్ కన మకరకుణ్డలత్తన్, ఎణ్ తోళన్ ఎన్గిన్ఱాళాల్, 

నీరార్ మழముగిలే, నీళ్ వరైయే యొక్కుమాల్ ఎన్గిన్ఱాళాల్, 

కారార్ వయలమరుమ్, కణ్ణపురత్తమ్మానై క్కణ్డాళ్ కొలో  ll 1653

ఆయిరమ్ పేర్ ఉడైయ = సహస్రనామములు కలిగిన;పేరాళన్ పేరాళన్ ఎన్గిన్ఱాళాల్=మహానుభావుడని పలుమార్లు పలుకుచున్నది; ఏర్ ఆర్ = మిక్కిలి సుందరమైన;కన= బంగారపు; మకర కుణ్డలత్తన్ = మకర కుండలములుగల చెవులుగలవాడని; ఎణ్ తోళన్ = ఎనిమిది భుజములుగలవాడని; ఎన్గిన్ఱాళాల్ = పలుకుచున్నది; నీర్ ఆర్ మழ ముగిలే = నీటితో నిండిన వర్షాకాలపు మేఘమును; నీళ్ వరైయే = పెద్ద పర్వతమును; ఒక్కుమ్ ఆల్ = ఒప్పు చుండును! ఆహా!; ఎన్గిన్ఱాళాల్ = అని పలుకుచున్నది; కార్ ఆర్ వయల్ అమరుమ్ = మేఘములు ఆవరించుయుండు పొలములతో అమరియున్న;కణ్ణపురత్తు అమ్మానై కణ్డాళ్ కొలో = తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

              “సహస్రనామములు కలిగిన మహానుభావుడని” పలుమార్లు పలుకుచున్నది, “మిక్కిలి సుందరమైన బంగారపు మకర కుండలములుగల చెవులుగలవాడని,ఎనిమిది భుజములుగల వాడని” పలుకుచున్నది, “నీటితో నిండిన వర్షాకాలపు మేఘమును,పెద్ద పర్వతమును ఒప్పు చుండును! ఆహా!” అని పలుకుచున్నది. మేఘములు ఆవరించు యుండు పొలములతో అమరియున్న తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

శెవ్వరత్త వుడై యాడై, అదన్మేలోర్ శివళికైక్కచ్చెన్గిన్ఱాళాల్,

అవ్వరత్త అడియిణైయుమ్, అమ్ కైకళుమ్ పఙ్గయమే ఎన్గిన్ఱాళాల్,

మైవళర్కుమ్ మణియురువమ్,మరదకమో మழைముకిలో ఎన్గిన్ఱాళాల్, 

కైవళర్కుమ్ అழలాళర్, కణ్ణపురత్తమ్మానై క్కణ్డాళ్ కొలో  ll 1654

శెమ్ = ఎర్రని; వరత్త = శ్లాఘ్యమైన; ఉడై = నడుమున కట్టిన; ఆడై = పీతాంబరము; అదన్ మేల్ = దానిపైన; ఓర్ = సాటిలేని; శివళికై కచ్చు=కండువా!ఆహా!ఎన్గిన్ఱాళాల్ = అని పలుకుచున్నది; అ వరత్త అడి ఇణైయుమ్ = ఆ శ్లాఘ్యమైన పాద ద్వందములు;  అమ్ కైకళుమ్ = అందమైన హస్తములును; పఙ్గయమే = తామర పుష్పములే! ఆహా! ఎన్గిన్ఱాళాల్ = అని పలుకుచున్నది; మై వళర్కుమ్ మణి ఉరువమ్ = నీలి వర్ణము ఉత్కృష్టముగ గల నీలమణివంటి రూపమో!; మరతకమో = మరకతమో! మழை ముకిలో = కాలమేఘమో!; ఎన్గిన్ఱాళాల్ = అని పలుకుచున్నది; కై వళర్కుమ్ అழల్ ఆళర్= తమయొక్క హస్తములతో అగ్నిని రగిలించి హోమముచేయు బ్రాహ్మణోత్తములు నివసించుచున్న; కణ్ణపురత్తు అమ్మానై కణ్డాళ్ కొలో = తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

            ” ఎర్రని శ్లాఘ్యమైన నడుమున కట్టిన పీతాంబరము దానిపైన సాటిలేని కండువా!ఆహా! ” అని పలుకుచున్నది, ” ఆ శ్లాఘ్యమైన పాద ద్వందములు, అందమైన హస్తములును తామర పుష్పములే! ఆహా! ” అని పలుకుచున్నది, ” నీలి వర్ణము ఉత్కృష్టముగ గల నీలమణివంటి రూపమో!, మరకతమో!, కాలమేఘమో! ” అని పలుకుచున్నది, తమయొక్క హస్తములతో అగ్నిని రగిలించి హోమము చేయుచుండెడి  బ్రాహ్మణోత్తములు నివసించుచున్న తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

కొర్ట్ర ప్పుళ్ళొన్ఱేఱి, మన్ఱూడే వరుకిన్ఱానెన్గిన్ఱాళాల్ ,

వెర్ట్రి ప్పోరిన్దిరర్కుమ్, ఇన్దిరనే యొక్కు మాలెన్గిన్ఱాళాల్, 

పెర్ట్రక్కాల్ అవనాకమ్, పెణ్ పిఱన్దోమ్ ఉయ్యోమో ఎన్గిన్ఱాళాల్, 

కర్ట్రనూల్ మఱైయాళర్, కణ్ణపురత్తమ్మానై క్కణ్డాళ్ కొలో  ll 1655

కొర్ట్రమ్ పుళ్  ఒన్ఱు ఏఱి=జయశీలమైన సాటిలేని గరుడునిపై అధిష్ఠించి;మన్ఱు ఊడే= మాడవీధులలో; వరుకిన్ఱాన్ = వేంచేయుచున్నాడు;ఎన్గిన్ఱాళాల్ =అని పలుకుచున్నది;  వెర్ట్రి పోర్ = జయశీలమైన యుద్ధమందు; ఇన్దిరర్కుమ్ ఇన్దిరనే ఒక్కుమ్ ఆల్ = మహేంద్రుడై ఒప్పుచుండును! ఆహా!;ఎన్గిన్ఱాళాల్ = అని పలుకుచున్నది;అవన్ ఆకమ్=ఆ స్వామియొక్క దివ్య వక్షస్థలము; పెర్ట్ర కాల్ = పొందినయెడల; పెణ్ పిఱన్దోమ్= స్త్రీలై జన్మించిన మేము; ఉయ్యోమో = ఉజ్జీవింపమా?;ఎన్గిన్ఱాళాల్=అని పలుకుచున్నది;కర్ట్ర నూల్ మఱైయాళర్ = శాస్త్రములను అభ్యసించిన వేద విద్వాంసులు నివసించుచున్న;  కణ్ణపురత్తు అమ్మానై కణ్డాళ్ కొలో = తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

          ” జయశీలమైన సాటిలేని గరుడునిపై అధిష్ఠించి మాడవీధులలో వేంచేయుచున్నాడు. ” అని పలుకుచున్నది, ” జయశీలమైన యుద్ధమందు మహేంద్రుడై ఒప్పుచుండును! ఆహా!” అని పలుకుచున్నది, ” ఆ స్వామియొక్క దివ్య వక్షస్థలము పొందినయెడల స్త్రీలై జన్మించిన మేము ఉజ్జీవింపమా? ” అని పలుకుచున్నది, శాస్త్రములను అభ్యసించిన వేద విద్వాంసులు నివసించుచున్న,తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

వణ్డమరుమ్ వనమాలై, మణిముడిమేల్ మణనాఱుమ్ ఎన్గిన్ఱాళాల్, 

ఉణ్డివర్ పాల్ అన్బెనక్కెన్ఱు, ఒరుకాలుమ్ పిరికిలేన్ ఎన్గిన్ఱాళాల్, 

పణ్డివరై క్కణ్డఱివతు, ఎవ్వూరిల్ యామెన్ఱే పయిల్ కిన్ఱాళాల్,

కణ్డవర్ తమ్ మనమ్ వழఙ్గుమ్, క్కణ్ణపురత్తమ్మానై క్కణ్డాళ్ కొలో  ll 1656

వణ్డు అమరుమ్ = భ్రమరములు అమరియున్న; వనమాలై = తులసీమాల; మణిముడి మేల్=రత్న కిరీటముపై;మణమ్ నాఱుమ్=పరిమళము వెదజల్లుచున్నది;ఎన్గిన్ఱాళాల్ = అని పలుకుచున్నది; ఎనక్కు ఇవర్ పాల్ అన్బు ఉణ్డు ఎన్ఱు = ” నాకు ఈ స్వామి విషయమున ప్రీతి యున్నది ” అని చెప్పి; ఒరు కాలుమ్ పిరికిలేన్ = ఒక క్షణమైనను వారిని విడిచి ఉండలేను;ఎన్గిన్ఱాళాల్ = అని పలుకుచున్నది; ఇవరై = ఈ స్వామిని; పణ్డు = మునుపు; యామ్ కణ్డఱివతు = మేము చూచియుండినది; ఎవ్ ఊరిల్ = ఏ ఊరిలో ?;ఎన్ఱే పయిల్ కిన్ఱాళ్ ఆల్= అనియే పలుమార్లు చెప్పుచున్నది అయ్యో!; కణ్డవర్=సేవించు కొనువారందరు; తమ్ మనమ్=తమయొక్క మనస్సును; వழఙ్గుమ్=సమర్పించు కొనుచుండెడి; కణ్ణపురత్తు అమ్మానై కణ్డాళ్ కొలో = తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

         ” భ్రమరములు అమరియున్న తులసీమాల రత్న కిరీటముపై, పరిమళము వెదజల్లుచున్నది. ” అని పలుకుచున్నది, ” నాకు ఈ స్వామివిషయమున ప్రీతి యున్నది ” అని చెప్పి, “ఒక క్షణమైనను వారిని విడిచి ఉండలేను. ” అని పలుకుచున్నది, ” ఈ స్వామిని మునుపు మేము చూచియుండినది ఏ ఊరిలో ? ” అనియే పలుమార్లు చెప్పుచున్నది అయ్యో!, సేవించు కొనువారందరు తమయొక్క మనస్సును సమర్పించు కొనుచుండెడి తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ ను నా కుమార్తె  సేవించినదేమో?

** మావళరుమెన్ నోక్కి, మాదరాళ్ మాయవనై క్కణ్డాళెన్ఱు,

కావళరుమ్ కడి పొழிల్ శూழ், కణ్ణపురత్తమ్మానై క్కలియన్ శొన్న,

పావళరుమ్ తమిழ் మాలై, పన్నియనూలివై యైన్దుమైన్దుమ్ వల్లార్, 

పూవళరుమ్ కఱ్పకఞ్జేర్, పొన్నులగిల్ మన్నవరాయ్ పుగழ் తక్కోరే  ll 1657

మా వళరుమ్ మెన్ నోక్కి=లేడియొక్క చూపులువలె విశాలమైన మెల్లని కదలికలతో  ఒప్పు చూపులుగల;మాదరాళ్=పరకాలనాయికి; మాయవనై కణ్డాళ్ ఎన్ఱు = ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వరుని సేవించుకొన్నదేమో యని;కావళరుమ్ కడి పొழிల్ శూழ்=పూ తోటలనుండి పెరిగి వచ్చుచున్న పరిమళము భూమియందంతటను వ్యాపింపబడు; కణ్ణపురత్తు అమ్మానై = తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ విషయమై; కలియన్ శొన్న=తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన;పావళరుమ్ తమిழ் మాలై = లయ,రాగములతో నిండిన తమిళ భాషలో పాసురముల మాలగ;పన్నియ నూల్=కొనియాడుబడుచున్న ఈ దివ్యప్రబంధమందున్న, ఇవై ఐన్దుమైన్దుమ్ =ఈ పది పాటలను; వల్లార్=పఠించువారు;పూ వళరుమ్ కఱ్పకమ్ శేర్=పూలతో నిండిన కల్పవృక్షము అమరియున్న; పొన్ ఉలగిల్ = పరమపదమందు; మన్నవర్ ఆయ్ =నిర్వాహకులగను;పుగழ் తక్కోరే=(ఇచట యున్నంతవరకు)కీర్తిని పొందియుండుదురు!.

    లేడియొక్క చూపులువలె విశాలమైన మెల్లని కదలికలతో  ఒప్పు చూపులుగల పరకాలనాయికి ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వరుని సేవించుకొన్నదేమో యని పూ తోటల నుండి పెరిగి వచ్చుచున్న పరిమళము భూమియందంతటను వ్యాపింపబడు తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న నీలమేఘ పెరుమాళ్ విషయమై తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన లయ,రాగములతో నిండిన తమిళ భాషలో పాసురములమాలగ కొనియాడుబడుచున్న ఈ దివ్య ప్రబంధమందున్న ఈ పది పాటలను పఠించువారు పూలతో నిండిన కల్పవృక్షము అమరియున్న పరమపదమందు నిర్వాహకులగను, (ఇచట యున్నంతవరకు)కీర్తిని పొందియుండుదురు!.

********

వ్యాఖ్యానించండి