శ్రీః
2 . తెళ్ళియీర్
(కోయిల్ తిరుమొழி)
పరకాలనాయకి తల్లి తన కుమార్తె స్థితిని చూచి,తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున వేంచేసియున్న నీలమేఘ పెరుమాళ్ ను ఉద్దేశించి,తన కుమార్తె విషయమన ఆస్వామి యొక్క ప్రవర్తన న్యాయసమ్మతముగ లేదని వాపోవుటను,తిరుమంగై ఆళ్వార్ విసదీకరించుచున్నారు.
** తెళ్ళియీర్ దేవర్కుమ్, దేవర్ తిరుత్తక్కీర్,
వెళ్ళియీర్, వెయ్యవిழுనిదివణ్ణర్, ఓ
తుళ్ళునీర్, కణ్ణపురమ్ తొழுదాళివళ్,
కళ్వియో, కైవళై కొళ్ వదు తక్కదే ll 1658
తెళ్ళియీర్ = నిర్మలమైన ఙ్ఞానము గల స్వామీ!; దేవర్కుమ్ దేవరే = దేవాదిదేవుడా!; తిరు త్తక్కీర్ = శ్రీ మహాలక్ష్మికి తగినవాడా!; వెళ్ళియీర్ = పరిశుద్దస్వభావుడా!; వెయ్య విழு నిది వణ్ణర్ = పుటము పెట్టిన బంగారమువలె మెరయువాడా!; ఓ ! = ఇదేమి అన్యాయము! స్వామీ!; తుళ్ళుమ్ నీర్ = గట్లపై ఎగిరిపడుచున్న నీరు కలిగిన; కణ్ణపురమ్ = తిరుకణ్ణపురమును;తొழுదాళ్=చేతులెత్తి సేవించిన; ఇవళ్ = నాయొక్క కుమార్తె పరకాలనాయకి; కళ్వియో = చోరిణియా? (ఆత్మాపహారము చేయని కారణముగ చోరిణికాదు);ఇది అటులుండగ; కై వళై కొళ్ వదు తక్కదే = ( నా కుమార్తె యొక్క ) చేతి కంకణములు శ్రీ వారు హరించుట తగునో?.
నిర్మలమైన ఙ్ఞానము గల స్వామీ!,దేవాదిదేవుడా !,శ్రీ మహాలక్ష్మికి తగినవాడా!, పరిశుద్దస్వభావుడా!,పుటము పెట్టిన బంగారమువలె మెరయువాడా!, ఇదేమి అన్యాయము! స్వామీ!,గట్లపై ఎగిరిపడుచున్న నీరు కలిగిన తిరుకణ్ణపురమును చేతులెత్తి సేవించిన నాయొక్క కుమార్తె పరకాలనాయకి చోరిణియా? (ఆత్మాపహారము చేయని కారణముగ చోరిణికాదు),ఇది అటులుండగ, నా కుమార్తె యొక్క చేతి కంకణములు శ్రీ వారు హరించుట తగునో?.
** నీణిలాముర్ట్రత్తు, నిన్ఱివళ్ నోక్కినాళ్,
కాణుమో, కణ్ణపురమెన్ఱు కాట్టినాళ్,
పాణనార్ తిణ్ణ మిరుక్క, ఇనియివళ్
నాణుమో, నన్ఱు నన్ఱు నఱైయూరర్కే ll 1659
ఇవళ్ = ఈ నా కుమార్తె; నీళ్ నిలా ముర్ట్రత్తు నిన్ఱు =(విశ్రాంతి పొందుచున్న) ఉన్నత స్థానముననున్న వెన్నెల ప్రాంగణమున నిలిచి;నోక్కినాళ్=చూచినది;(చూచిన వెంటనే) కాణుమ్ ఓ! కణ్ణపురమ్ ఎన్ఱు కాట్టినాళ్ = ” రండి,రండి వచ్చి చూడండి. అదుగో తిరుకణ్ణపురమ్ కోవెల ” అని అందరకి తన వేలితో చూపినది; పాణనార్ తిణ్ణమ్ ఇరుక్క= సర్వేశ్వరునితో చేర్చు ఆచార్యుని యొక్క దృఢమైన కృప ఉండుటచే; ఇని ఇవళ్ నాణుమో = ఇక ఈమె లజ్జ కలిగియుండునా?; నఱైయూరర్కే = ఆమెయొక్క ఆచార్యుడైన తిరునఱైయూర్ నమ్బికి; నన్ఱు నన్ఱు = జయము జయము!.
ఈ నా కుమార్తె (విశ్రాంతి పొందుచున్న) ఉన్నత స్థానముననున్న వెన్నెల ప్రాంగణమున నిలిచి చూచినది (చూచిన వెంటనే),” రండి,రండి వచ్చి చూడండి. అదుగో తిరుకణ్ణపురమ్ కోవెల ” అని అందరకి తన వేలితో చూపినది,సర్వేశ్వరునితో చేర్చు ఆచార్యుని యొక్క దృఢమైన కృప ఉండుటచే,ఇక ఈమె లజ్జ కలిగియుండునా?, ఆమెయొక్క ఆచార్యుడైన తిరునఱైయూర్ నమ్బికి జయము జయము!.
** అరువి శోర్వేఙ్గడమ్, నీర్మలై యెన్ఱువాయ్
వెరువినాళ్, మెయ్యమ్ వినవి యిరుక్కిన్ఱాళ్,
పెరుగుశీర్, కణ్ణపురమెన్ఱు పేశినాళ్
ఉరుగినాళ్, ఉళ్ మెలిన్దాళ్ ఇదువెన్గొలో ll 1660
ఇవళ్ = ఈ పరకాలనాయకి; అరువి శోర్ వేఙ్గడమ్ = వాగులు ప్రవహించుచున్న తిరు వేంకటాచలము; నీర్మలై ఎన్ఱు = తిరు నీర్మలై అని , వాయ్ వెరువినాళ్ = నోటిలో గొణుగుచున్నది; మెయ్యమ్ వినవి = తిరు మెయ్యము గురించి విని; ఇరుక్కిన్ఱాళ్ = మౌనురాలైయుండును; పెరుగు శీర్ = మిక్కిలి గొప్పతనము కలిగిన; కణ్ణపురమ్ ఎన్ఱు పేశినాళ్ = తిరుకణ్ణపురమని చెప్పుచునే; ఉరుగి నాళ్ = పరవశముతో కరిగిపోవును; ఉళ్ మెలిన్దాళ్ = మనస్సు శిధిలావస్థ పొందియుండును; ఇదు ఎన్ కొలో = ఇటువంటి ఈమె స్థితికి ఏమి కారణమైయుండును? (నా పాపమే)
ఈ పరకాలనాయకి వాగులు ప్రవహించుచున్న తిరు వేంకటాచలము, తిరు నీర్మలై అని నోటిలో గొణుగుచున్నది,తిరు మెయ్యము గురించి విని మౌనురాలై యుండును,మిక్కిలి గొప్పతనము కలిగిన తిరుకణ్ణపురమని చెప్పుచునే పరవశముతో కరిగిపోవును,మనస్సు శిధిలావస్థ పొందియుండును. ఇటువంటి ఈమె స్థితికి ఏమి కారణమై యుండును? (నా పాపమే)
ఉణ్ణుమ్ నాళిల్లై, ఉఱక్కమున్దానిల్లై,
పెణ్మైయుమ్ శాల, నిఱైన్దిలళ్ పేదైతాన్,
కణ్ణనూర్ కణ్ణపురమ్ తొழுమ్, కార్ క్కడల్
వణ్ణర్ మేల్, ఎణ్ణమివట్కు ఇదువెన్గొలో ll 1661
ఉణ్ణుమ్ నాళ్ ఇల్లై = ఈ పరకాలనాయకి భుజించిన దినము లేదు; ఉఱక్కముమ్ తాన్ ఇల్లై = తాను నిదురించినదియు లేదు; పెణ్మైయుమ్ శాల నిఱైన్దు ఇలళ్=ఈమెయందు స్త్రీత్వం ఎక్కువగ నిండ లేదు; పేదై తాన్ = ఈమె బాలిక మాత్రమే; (అయినను); కణ్ణన్ ఊర్ = సర్వేశ్వరునియొక్క దివ్యదేశమైన; కణ్ణపురమ్ తొழுమ్ = తిరుకణ్ణపురమునే సేవించుచుండును;ఇవట్కు ఎణ్ణమ్=ఈమె యొక్క ఆలోచనలు,ఆరాటములంతయును; కార్ కడల్ వణ్ణర్ మేల్=నల్లని సముద్రమువంటి వర్ణముగల నీలమేఘ పెరుమాళ్ పైననే ఉన్నది; ఇదు ఎన్ కొలో = ఇది ఏమి ఆశ్చర్యమో!
ఈ పరకాలనాయకి భుజించిన దినము లేదు,తాను నిదురించినదియు లేదు.ఈమెయందు స్త్రీత్వం ఎక్కువగ నిండ లేదు. ఈమె బాలిక మాత్రమే (అయినను) సర్వేశ్వరునియొక్క దివ్యదేశమైన తిరుకణ్ణపురమునే సేవించుచుండును.ఈమె యొక్క ఆలోచనలు,ఆరాటములంతయును నల్లని సముద్రమువంటి వర్ణముగల నీలమేఘ పెరుమాళ్ పైననే ఉన్నది . ఇది ఏమి ఆశ్చర్యమో!
కణ్ణనూర్, కణ్ణపురమ్ తొழுమ్ కారిగై,
పెణ్మైయెన్ తన్నుడై ఉణ్మైయురైక్కిన్ఱాళ్,
వెణ్ణైయుణ్డాప్పుణ్డ, వణ్ణమ్ విళమ్బినాళ్,
వణ్ణముమ్, పొన్నిఱ మావదొழிయుమే ll 1662
కణ్ణన్ ఊర్ = శౌరి పెరుమాళ్ యొక్క దివ్యదేశమైన; కణ్ణపురమ్ = తిరుకణ్ణపురమును; తొழுమ్ కారిగై=సేవించుచున్న ఈ అందమైన అమ్మాయి;తన్నుడై = తనయొక్క;ఉణ్మై= (వ్యామోహముచే) వాస్తవికతను;ఉరైక్కిన్ఱాళ్= నోరు విప్పి బహిరంగముగ చెప్పుచున్నది; పెణ్మై ఎన్ = ఇది ఏమి స్త్రీలక్షణము?; వెణ్ణై ఉణ్డు ఆప్పుణ్డ = వెన్నను దొంగతనమునగ ఆరగించి రోకలికి కట్టబడిన; వణ్ణమ్ = సమాచారమును; విళమ్బినాళ్ = ఎవరైనను చెప్పినయెడల; పొన్ నిఱ మావదు ఒழிయుమే = పాలిపోయిన వర్ణము పోయి నిజ వర్ణముకలిగి ఆనందముగ నుండును!.
శౌరి పెరుమాళ్ యొక్క దివ్యదేశమైన తిరుకణ్ణపురమును సేవించుచున్న ఈ అందమైన అమ్మాయి (వ్యామోహముచే) వాస్తవికతను నోరు విప్పి బహిరంగముగ చెప్పుచున్నది.ఇది ఏమి స్త్రీలక్షణము?. వెన్నను దొంగతనమునగ ఆరగించి రోకలికి కట్టబడిన సమాచారమును ఎవరైనను చెప్పినయెడల పాలిపోయిన వర్ణము పోయి తన నిజ వర్ణముకలిగి ఆనందముగ నుండును!.
వడవరై నిన్ఱుమ్ వన్దు, ఇన్ఱు కణపురమ్,
ఇడవగై కొళ్వదు, యామెన్ఱు పేశినాళ్,
మడవరల్ మాదర్ ఎన్ పేదై, ఇవర్కివళ్
కడవదెన్, కణ్ తుయిలిన్ఱివర్ కొళ్ళుమే ll 1663
వడ వరై నిన్ఱుమ్ వన్దు = ఉత్తర దిక్కునగల తిరుమలనుండి వచ్చి; ఇన్ఱు = ఇపుడు; కణ్ణపురమ్ = తిరుకణ్ణపురమును;ఇడవగై కొళ్వదు యామ్=నివాసస్థానముగ గ్రహించి యుంటిని నేను;ఎన్ఱు పేశినాళ్ = అని(శౌరి పెరుమాళ్ తో) చెప్పినది;ఇవర్=ఈ స్వామి; ఇన్ఱు = ఈ దినమున; కణ్ తుయిల్ = ఈమెయొక్క నిదురను; కొళ్ళుమే = హరించునో?మడవరల్=విధేయురాలైన; మాదర్=మిక్కిలి సుందరమైన;ఎన్ పేదై ఇవళ్ = నాయొక్క ఈ బాలిక; ఇవర్కు కడవదు ఎన్ = ఈ స్వామితో ఏవిధముగ బంధింపబడినదో తెలియకున్నది!.
” ఉత్తర దిక్కునగల తిరుమలనుండి వచ్చి ఇపుడు తిరుకణ్ణపురమును నివాసస్థానముగ గ్రహించి యుంటిని నేను ” అని శౌరి పెరుమాళ్ తో చెప్పినది.ఈ స్వామి ఈ దినమున ఈమెయొక్క నిదురను హరించునో?. విధేయురాలైన,మిక్కిలి సుందరమైన నాయొక్క ఈ బాలిక ఈ స్వామితో ఏవిధముగ బంధింపబడినదో తెలియకున్నది!.
** తరఙ్గనీర్ పేశినుమ్, తణ్ మదికాయినుమ్,
ఇరఙ్గుమో, ఎత్తనైనాళిరున్దు ఎళ్ గినాళ్,
తురఙ్గమ్ వాయ్ కీణ్డుకన్దానదు, తొన్మైయూర్,
అరఙ్గమేయెన్బదు, ఇవళ్ తనక్కాశైయే ll 1664
తరఙ్గమ్ నీర్ = తరంగములుగల సముద్రము; పేశినుమ్ = ఘోషించినను; తణ్ మది = చల్లని చంద్రుడు; కాయినుమ్=వేడిక్కించినను;(ఈమె); ఇరఙ్గుమో = వ్యధ పొందునో?; (ఏలననగ) ఎత్తనై నాళ్ ఇరున్దు ఎళ్ గి నాళ్ = చిరకాలమునుండి ఈ దుఃఖములను అనుభవించుచు వచ్చియున్నది; తురఙ్గమ్ వాయ్ కీణ్డు ఉకన్దానదు = అశ్వరూపములో వచ్చిన కేశియను అసురుని నోటిని చీల్చి సంతోషించిన సర్వేశ్వరునియొక్క;తొన్మై ఊర్=అనాదియైన దివ్యదేశము; అరఙ్గమ్ ఎన్బదే = శ్రీ రంగం అని పలుమార్లు చెప్పుచు గడుపుటయే; ఇవళ్ తనక్కు ఆశై = ఈమెయొక్క కోరిక!
తరంగములుగల సముద్రము ఘోషించినను,చల్లని చంద్రుడు వేడిక్కించినను ఈమె వ్యధ పొందునో? ఏలననగ చిరకాలమునుండి ఈ దుఃఖములను అనుభవించుచు వచ్చియున్నది.అశ్వరూపములో వచ్చిన కేశియను అసురుని నోటిని చీల్చి సంతోషించిన సర్వేశ్వరునియొక్క అనాదియైన దివ్యదేశము శ్రీ రంగం అని పలుమార్లు చెప్పుచు గడుపుటయే ఈమెయొక్క కోరిక!
తొణ్డెల్లామ్ నిన్నడియే, తొழுదుయ్యు మా
కణ్డు, తాన్ కణ పురమ్ తొழప్పోయినాళ్,
వణ్డులామ్ కోదై ఎన్ పేదై, మణినిఱమ్
కొణ్డుతాన్, కో యిన్మై శెయ్ వదు తక్కదే ll 1665
తొణ్డు ఎల్లామ్ = సకల భక్తులును; నిన్ అడియే = శ్రీ వారి దివ్యచరణములే; తొழுదు= సేవించి; ఉయ్యుమ్ ఆ కణ్డు = ఉజ్జీవింపబడినది చూచి; తాన్ = ఈ నా కుమార్తె కూడ; కణ్ణపురమ్ తొழ పోయినాళ్=తిరు కణ్ణపురమ్ దివ్యదేశమునకు సేవించుటకై వెడలినది; వణ్డు ఉలామ్ కోదై = భ్రమరములు సంచరించుచున్న కొప్పుగల; ఎన్ పేదై = నాయొక్క బాలికయొక్క; మణి నిఱమ్ కొణ్డు = సుందరమైన మేని యొక్క వర్ణమును హరించి; తాన్ = స్వామియైన నీవు; కో యిన్మై శెయ్ వదు = అన్యాయము చేయుట; తక్కదే = తగునా?.
సకల భక్తులును శ్రీ వారి దివ్యచరణములే సేవించి ఉజ్జీవింపబడినది చూచి ఈ నా కుమార్తె కూడ తిరు కణ్ణపురమ్ దివ్యదేశమునకు సేవించుటకై వెడలినది. భ్రమరములు సంచరించుచున్న కొప్పుగల నాయొక్క బాలికయొక్క సుందరమైన మేని యొక్క వర్ణమును హరించి స్వామియైన నీవు అన్యాయము చేయుట తగునా?.
ముళ్ళె యిఱు ఎయ్ న్దిల, కూழைముడికొడా,
తెళ్ళియళెన్బదోర్, తేశిలళ్ ఎన్ శెయ్ గేన్,
కళ్ళవిழ் శోలై, కణపురమ్ కై తొழுమ్
పిళ్ళైయై, పిళ్ళైయెన్ఱెణ్ణ ప్పెఱువరే ll 1666
ముళ్ ఎయిఱు ఎయ్ న్దు ఇల = అపుడే వచ్చుచున్న పళ్ళు నోటియందు పూర్తిగా నిండ లేదు; కూழை ముడి కొడా = కేశములు ముడివేయుటకు తగనంత పెరగియుండలేదు; తెళ్ళియళ్ ఎన్బదు ఓర్ తేశు ఇలళ్ = వివేకముకలదని చెప్పుటకు తగినట్లు ఒక విలక్షణమైన తేజస్సు కలదికాదు; ఎన్ శెయ్ గేన్ = నేనేమి చేయగలను?; కళ్ అవిழ் శోలై = మధువులొలుకుచున్న తోటలుగల; కణ్ణపురమ్ = తిరుకణ్ణపురమును; కై తొழுమ్ = చేతులు జోడించి సేవించుచుండు; పిళ్ళైయై = ఈ బాలికను; పిళ్ళై ఎన్ఱు ఎణ్ణ పెఱువరే = బాలికయే యని తలచగలనా? (పరమభక్తి కలిగియన్నదే!)
అపుడే వచ్చుచున్న పళ్ళు నోటియందు పూర్తిగా నిండ లేదు,కేశములు ముడివేయుటకు తగనంత పెరగియుండలేదు,వివేకముకలదని చెప్పుటకు తగినట్లు ఒక విలక్షణమైన తేజస్సు కలదికాదు,నేనేమి చేయగలను ?,మధువులొలుకుచున్న తోటలుగల తిరుకణ్ణపురమును చేతులు జోడించి సేవించుచుండు ఈ బాలికను, బాలికయే యని తలచగలనా? (పరమభక్తి కలిగియన్నదే!)
** కార్ మలి, కణ్ణపుర త్తెమ్మడికళై,
పార్ మలి మఙ్గైయర్కోన్, పరకాలన్ శొల్,
శీర్ మలి పాడల్, ఇవై పత్తుమ్ వల్లవర్,
నీర్ మలి వైయత్తు, నీడు నిఱ్పార్ గళే ll 1667
కార్ మలి = మేఘములతో మిక్కిలి ఆవరించియుండు;కణ్ణపురత్తు=తిరుకణ్ణపురములో వేంచేసియున్న; ఎమ్మడికళై = సర్వేశ్వరుని విషయమై; పార్ మలి మఙ్గైయర్ కోన్ = ఈ భూమియందంతటను కీర్తిగల తిరుమంగై దేశవాసులకు ప్రభువును; పరకాలన్ = శత్రువులకు యముడు వంటివారైన తిరుమంగై ఆళ్వార్; శొల్ = అనుగ్రహించిన; శీర్ మలి పాడల్ = భగవద్గుణములతో నిండియున్న పాశురములు; ఇవై పత్తుమ్ వల్లవర్=ఈ పదియును పఠించువారు; నీర్ మలి వైయత్తు = నీటితో నిండిన సముద్రముచే చుట్టుకొనియున్న ఈ భూమండలమున;నీడు నిఱ్పార్ గళ్ = చిరకాలము సుఖముగ నివసింతురు.
మేఘములతో మిక్కిలి ఆవరించియుండు తిరుకణ్ణపురములో వేంచేసియున్న సర్వేశ్వరుని విషయమై,ఈ భూమియందంతటను కీర్తిగల, తిరుమంగై దేశవాసులకు ప్రభువును,శత్రువులకు యముడు వంటివారైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన భగవద్గుణములతో నిండియున్న పాశురములు ఈ పదియును పఠించువారు నీటితో నిండిన సముద్రముచే చుట్టుకొనియున్న ఈ భూమండలమున చిరకాలము సుఖముగ నివసింతురు.
*******